ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ ఇంట్లో మంగళవారం భారీ చోరీ జరిగింది. ఆదిలాబాద్ హౌజింగ్‌బోర్డు కాలనీలో ఎంపీ నగేశ్ నివసిస్తున్నారు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేరు. ఈ క్రమంలో దుండగులు అర్ధరాత్రి ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు అల్మారాలోని వస్తువులు చిందర వందరగా పడేసి, రూ.17 లక్షల విలువ చేసే బంగారం ఆభరణాలు, రూ.70 వేల నగదును ఎత్తుకెళ్లారు. కాగా, దొంగలు ఎంపీ ఇంట్లోని సీసీ కెమెరాలు ధ్వంసం చేసి సీసీ పుటేజ్ హార్డ్‌డిస్క్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులకు సైతం ఎలాంటి ఆధారం లేకుండా పోయింది. బుధవారం విషయం తెలుసుకున్న సీసీఎస్ డీఎస్పీ నర్సింహారెడ్డి, పోలీసులు క్లూస్‌టీంతో కలసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఇది రెండోసారి..: ఎంపీ నగేశ్ ఇంట్లో 2013లో కూడా చోరీ జరిగింది. నాడు దుండగులు ఐదు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. వాటిని ఇప్పటికీ రికవరీ చేయలేదు. నాడు దొంగతనం జరిగిన నేపథ్యంలోనే ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, వాటిని ధ్వంసం చేయడంతో పాటు హార్డ్‌డిస్క్ ఎత్తుకెళ్లారు. ఎంపీ ఇంటికి కనీసం సెక్యురిటీ సిబ్బంది కూడా లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఎంపీ ఢిల్లీలో ఉండడంతో ఆయన సంబం«ధీకులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆదిలాబాద్ ఎంపీ ఇంట్లో భారీ చోరీ
Published Wed, Sep 27 2017 10:07 AM | Last Updated on Thu, Sep 28 2017 2:08 AM
Advertisement