వ్యవసాయ బావి వద్ద ఉన్న చెట్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారీ ఒక వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు.
మాల్యాల(కరీంనగర్ జిల్లా): వ్యవసాయ బావి వద్ద ఉన్న చెట్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారీ ఒక వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం కరీంనగర్ జిల్లా మాల్యాల మండలం మద్దుట్లలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన నగేష్(35) గల్ఫ్ దేశాల్లో కూలీగా పని చేసేవాడు. కాగా, కొద్ది రోజుల క్రితమే స్వదేశానికి వచ్చాడు. మంగళవారం వ్యవసాయ బావి వద్ద ఉన్న చెట్లను కొట్టేందుకు వెళ్లాడు. ఈ సమయంలో కాలు జారి బావిలో ఉన్న రాళ్లపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడు మరో 15 రోజుల్లో తిరిగి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సి ఉండగా ఈ సంఘటన జరగడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నట్లు సమాచారం.