Well
-
కాకతీయుల కాలంలోని అద్భుతమైన నిర్మాణం
జూలూరుపాడు: సుమారు ఏడు శతాబ్దాల క్రితం కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక కట్టడం కనుమరుగవుతోంది. కాకతీయుల కాలంలో తాగునీటి అవసరాలు, శత్రు సైన్యాల నుంచి తమను రక్షించుకోవడానికి దట్టమైన అడవి ఉన్న జూలూరుపాడు (Julurpadu) ప్రాంతంలో రాజాబావిని రాతికట్టడంతో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. సువిశాలమైన రాజాబావికి రెండు వైపులా నివాసం కోసం గదులు నిర్మించి ఉంటారని తెలుస్తోంది. ఈ బావి పైభాగాన తూర్పు, పడమరకు ఎదురెదురుగా 10 గదులు నిర్మించారు. బావిలోకి దిగేందుకు 30 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో రాళ్లతో మెట్లు నిర్మించారు. ఈ బావి చుట్టూ 8 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు గల పైకప్పు ఒకేరాయిలా కనిపిస్తోంది. పూడిక మట్టితో నిండిపోవడంతో బావి లోతు ఎంత అనేది తెలియడం లేదు. సున్నం, రాళ్లతో నిర్మించిన ఈ ప్రాచీన కట్టడం నేటికీ చెక్కుచెదరలేదు. అయితే, గుప్తనిధుల కోసం తవ్వకాలు, చెత్తాచెదారం పేరుకుపోవడం, బావిలో పూడిక పెరగడంతో నానాటికీ వైభవం కోల్పోతున్నా సంరక్షణపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దండయాత్రల నుంచి రక్షణకు.. శత్రువులు దండయాత్ర చేసినప్పుడు రక్షణ కోసం కాకతీయ రాజులు (Kakatiya Kings) పలు ప్రాంతాల్లో సొరంగ మార్గాలు ఏర్పాటు చేసుకునేవారని చరిత్ర చెబుతోంది. ఇందులో భాగంగానే వివిధ ప్రాంతాల మీదుగా సొరంగ మార్గాల ద్వారా ఖమ్మం ఖిలాకు వచ్చేవారని, కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు (వరంగల్)కోటకు, పాత ఖమ్మం (Khammam) జిల్లాలోని జూలూరుపాడు రాజుల బావి, భేతాళపాడు గుట్టలపై ఉన్న కోట వరకు వచ్చేవారని తెలుస్తోంది. జూలూరుపాడు నుంచి పాపకొల్లులోని పుట్టకోట, చండ్రుగొండ మండలం బెండాలపాడు గుట్టల్లో వెలిసిన శ్రీవీరభద్రస్వామి, కనగిరి గుట్టల్లోని ఆలయాలు, అప్పట్లో సైనికులు తలదాచుకునేందుకు ఏర్పాటు చేసిన కొన్ని స్థావరాలు నేటికీ కనిపిస్తాయి. అక్కడ ఉన్న సొరంగ మార్గాల ద్వారా శత్రువుల నుంచి రక్షణ పొందటంతోపాటు, శత్రువులపై మెరుపు దాడులు నిర్వహించేందుకు ఈ మార్గాలను ఉపయోగించుకునేవారు.గుప్తనిధుల కోసం తవ్వకాలు.. కాకతీయ రాజులు వజ్ర వైఢూర్యాలు, బంగారు అభరణాలను ఈ బావిలో భద్రపరిచే వారని నమ్ముతుంటారు. బావిలో గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారంతో ఏడేళ్ల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు బావి పైభాగాన ఉన్న గదుల్లో తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించినా అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో చారిత్రక కట్టడం ధ్వంసానికి గురవడంతో బావి ఆనవాళ్లు భావితరాలకు కన్పించకుండా పోయే పరిస్థితి ఏర్పడనుంది. తగ్గని నీటిమట్టం.. బావి నీటిని గతంలో ఈ ప్రాంత వాసులు తాగునీటిగా ఉపయోగించేవారు. బావిలో నీటిమట్టం తరగకపోవడంతో, బావిలో ఏమైనా గుప్త నిధులు ఉన్నాయా అని తెలుసుకునేందుకు కొన్నేళ్ల క్రితం గ్రామస్తులు ఆయిల్ ఇంజిన్లు పెట్టి నీటిని 15 రోజుల పాటు పంటలకు వినియోగించినా నీటిమట్టం ఎంతమాత్రం తగ్గలేదు. దీంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. బావిలోకి దిగుడు మెట్లు, బావి చుట్టూ తిరగటానికి వీలుగా ప్లాట్‌ఫామ్ ఉన్నాయి. ఈ తరం ఇంజనీర్లకు సైతం అంతు చిక్కని అద్భుత సాంకేతిక నైపుణ్యంతో రాతిబావిని నిర్మించడం విశేషం. అలాంటి బావి పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతూ పూడిక మట్టి, ముళ్ల పొదలతో నిండిపోయింది. బావి చుట్టూ ఉన్న స్థలం కూడా ఆక్రమణకు గురికావడంతో ముళ్ల పొదలు, చెట్లతో కళావిహీనంగా మారింది. చారిత్రక సంపద ధ్వంసం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాజాబావి నీళ్లు తాగే వాళ్లం 40 ఏళ్ల క్రితం రాజాబావి నీళ్లు తాగే వాళ్లం. వేసవి కాలంలో కూడా నీళ్లు బాగా ఉండేవి. ఈ నీటిని పంటల సాగుకూ ఉపయోగించేవారు. ప్రస్తుతం పూడికతో నిండిపోవడంతో పాటు ముళ్ల పొదలు, చెట్లు పెరగడంతో అటువైపు ఎవరూ వెళ్లడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మతులు చేయాలి. – చిన్నకేశి వెంకటేశ్వర్లు, జూలూరుపాడు చారిత్రక కట్టడాన్ని కాపాడాలి వందల ఏళ్ల నాటి చారిత్రక కట్టడం కనుమరుగు కాకుండా చూడాలి. రాజాబావి ధ్వంసమవుతుండటంతో భావితరాలకు కన్పించకుండాపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి చారిత్రక సంపదను రక్షించేందుకు ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టాలి. – తాళ్లూరి వెంకటేశ్వర్లు, జూలూరుపాడు బావి అభివృద్ధికి చర్యలు చేపట్టాలి రాజాబావి అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలి. కొన్ని దశాబ్దాలుగా అధికారులు పట్టించుకోకపోవడంతో ముళ్ల పొదలు, చెట్లతో నిండి కళావిహీనంగా మారింది. దీన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – నర్వనేని పుల్లారావు, జూలూరుపాడు చదవండి: వరంగల్ పేరు ఎలా వచ్చిందంటే..పురాతన సంపదను కాపాడతాం కాకతీయుల కాలం నాటి పురాతన కట్టడమైన రాజా బావిని కాపాడుతాం. ఈ సమస్యను ఉన్నతాధికారులు, పర్యాటక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. స్థానిక గ్రామ పంచాయతీ నుంచి ఏమైనా చేయవచ్చేమో పరిశీలిస్తాం. ముళ్ల పొదలు, చెట్లు తొలిగించి, పూర్వవైభవం వచ్చేలా చర్యలు చేపడతాం. – డి.కరుణాకర్‌రెడ్డి, ఎంపీడీఓ జూలూరుపాడు -
సంభాల్ మసీదు బావి వివాదం.. యథాతథ స్థితిని కొనసాగించండి
న్యూఢిల్లీ: సంభాల్‌లోని మొఘలుల నాటి జామా మసీదు సమీపంలోని వివాదాస్పద బావిపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని శుక్రవారం సుప్రీంకోర్టు భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ)తోపాటు ఉత్తరప్రదేశ్ అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి జామా మసీదు నిర్వహణ కమిటీ వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కేంద్రం, ఏఎస్ఐలతోపాటు సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్‌కు, హరి శంకర్ జైన్ తరపున ఉన్న హిందూ కక్షిదారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 21వ తేదీన ఉంటుందని, రెండు వారాల్లోగా అక్కడి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. బావికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్ట రాదని స్పష్టం చేసింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు మసీదులో చేపట్టిన సర్వే నివేదికను సీల్డ్ కవర్లోనే ఉంచాలంది. -
బయటపడిన మృత్యుబావి, మరో మందిరం
సంభాల్: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జరుగుతున్న తవ్వకాల్లో ఈరోజు(గురువారం) మరో అద్భుతం బయటపడింది. జామా మసీదుకు 100 మీటర్ల దూరంలో ఒక బావి కనిపించింది. ఈ బావి హిందువులు అధికంగా ఉంటున్న ప్రాంతంలో ఉంది. దీనిని మృత్యుబావిగా చెబుతున్నారు. ఇక్కడికి సమీపంలోనే ఒక ఆలయం ఉందని, అది మృత్యుంజయ మహాదేవ్ ఆలయం అని స్థానికులు అంటున్నారు. ఈ ఆలయం ప్రస్తుతం మట్టిలో కూరుకుపోయింది. ఇక్కడ తవ్వకాలు జరిపితే ఇక్కడ ఆలయం తప్పకుండా కనిపిస్తుందని అంటున్నారు.సంభాల్ ఒకప్పుడు పుణ్యక్షేత్రంగా ఉండేది. పురాణాల ప్రకారం సంభాల్‌లో 84 ప్రదక్షిణల మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో 68 పుణ్యక్షేత్రాలు ఉన్నాయని చెబుతారు. అలాగే 19 బావులు ఉన్నాయని, వాటిలో ప్రతిదానికీ ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని అంటారు. ఇప్పుడు స్థానికులు ఈ తవ్వకాల పనుల్లో పాల్గొంటూ విలువైన ఆధారాలు సేకరిస్తున్నారు. సంభాల్‌ను మతపరమైన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జిల్లా యంత్రాంగం చెబుతోంది.ఇటీవల సంభాల్‌లో చోటుచేసుకున్న హింసాయుత ఘటనల కారణంగానే ఈ ప్రాంతం వార్తల్లో నిలిచింది. ఈ నేపధ్యంలోనే స్థానిక పరిపాలనాధికారులు ఇక్కడ తవ్వకాలు ప్రారంభించారు. అదిమొదలు ఇక్కడ పలు చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద బయటపడుతోంది. ప్రస్తుతం ఇక్కడి చందౌసిలో కనిపించిన పురాతన మెట్ల బావిని శుభ్రం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మృత్యు బావి బయటపడింది. దీనిలో అందులో స్నానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని స్థానికులు చెబుతారు. ఇక్కడికి కొద్ది దూరంలో యమదగ్ని కుండ్ కూడా ఉందని అంటున్నారు. దీని కోసం పరిశోధనలు ప్రారంభమయ్యాయి.ఇక్కడ మృత్యుంజయ దేవాలయం కూడా ఉండేదని, తమ ముందు తరాలవారు తమకు ఈ విషయం చెప్పారని, పరిశోధిస్తే అది కూడా బయటపడుతుందని స్థానికులు అంటున్నారు. దాని గోడలు కూడా కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం మట్టిలో కూరుకుపోయిన కట్టడాలను పరిశోధించేదిశగా ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం మృత్యుబావిని కనుగొనేందుకు తవ్వకాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో చందౌసిలో పలు పరిశుభ్రతా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: 20 Years of Tsunami: రాకాసి అలలను దాటి.. విషసర్పాల కారడవిలో శిశువుకు జన్మనిచ్చి.. -
ఆలయం బావిలో విగ్రహాలు
సంభాల్: ఉత్తరప్రదేశ్‌లో సంభాల్‌లో దాదాపు 46 ఏళ్ల తర్వాత గత వారం తెరుచుకున్న ఆలయం సమీపంలోని బావిలో దెబ్బతిన్న మూడు దేవతా విగ్రహాలు లభించాయి. నవంబర్‌లో షాహి జామా మసీదులో కోర్టు ఆదేశాల మేరకు సర్వేకు ప్రయతి్నస్తుండగా హింస చెలరేగి నలుగురు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఆ ప్రాంతానికి కిలోమీటర్ దూరంలోని ఖగ్గూ సరాయ్లోనే శ్రీ కార్తీక్ మహదేవ్(భస్మా శంకర్)ఆలయం ఉంది. అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్న సమయంలో అక్కడే 1978 నుంచి మూతబడి ఉన్న ఆలయం విషయం బయటపడింది. ఆలయంలో హనుమాన్ విగ్రహం, శివలింగం ఉండగా, పక్కనే ఉన్న బావి శిథిలావస్థకు చేరుకుంది. ఈ బావిలో సోమవారం అధికారులు పూడిక తీత మొదలుపెట్టారు. సుమారు 15 అడుగుల లోతులో దెబ్బతిన్న స్థితిలో ఉన్న పార్వతి, గణేశ్, లక్ష్మీ దేవతా విగ్రహాలు లభించాయని అధికారులు చెప్పారు. ఆలయం ప్రాచీనతను కాపాడే లక్ష్యంతో పనులు చేపట్టామని చెప్పారు. ఈ విగ్రహాలను ఎవరు, ఎందుకు ధ్వంసం చేసి ఉంటారనే విషయపై వివరాలను సేకరిస్తున్నామని అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్న సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేందర్ పెన్సియా చెప్పారు. ఆలయం చుట్టూ ఆక్రమణల తొలగింపు కూడా జరుగుతోందన్నారు. కార్బన్ డేటింగ్ పరీక్షతో ఆలయంతోపాటు బావి ప్రాచీనతను నిర్థారించాలని కోరుతూ పురావస్తు శాఖకు లేఖ రాసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో జనం వచ్చి పూజలు చేస్తున్నారు. అధికారులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పాడుబడిన బావిలో కరెన్సీ నోట్లు.. ఎగబడిన జనం
పిలిభిత్: ‘నోట్ల వర్షం కురిసింది’ అనే మాటను మనం ఎప్పుడో ఒకప్పుడు వినేవుంటాం. అయితే ఇంతకీ నోట్ల వర్షం కురుస్తుందా? కురిస్తే ఎలా ఉంటుంది? దీనిని తెలుసుకోవాలంటూ యూపీలోని పిలిభిత్‌లో జరిగిన ఒక ఉదంతాన్ని తెలుసుకోవాల్సిందే..యూపీలోని పిలిభిత్‌లో ఒక పాడుబడిన బావిలోంచి నీటితోపాటు నోట్లు రావడం మొదలైంది. ఈ వార్త దావానలంలా వ్యాపించింది. దీంతో ఈ నోట్లను దక్కించుకునేందుకు వేలాది మంది బావి దగ్గరకు చేరుకున్నారు. అయితే ఈ నోట్లను దక్కించుకున్నవారు నిరాశగా వెనుదిరిగారు. దీనికి కారణం ఆ నోట్లన్నీ చినిగిపోయి ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఈ ఘటనపై చర్చ జరుగుతోంది.పిలిభిత్‌లోని బిసల్పూర్ తహసీల్‌కు చెందిన మొహల్లా గ్యాస్పూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి మహాదేవ్ ఆలయానికి వెళ్లిన కొందరికి సమీపంలోని బావిలో 10, 20, 50, 100 రూపాయల నోట్లు కనిపించాయి. ఈ వార్త తెలిసిన వారంతా పరుగు పరుగున ఆ బావి దగ్గరకు చేరుకున్నారు. వివిధ పద్ధతుల్లో ఆ నోట్లను బయటకు తీశారు. అయితే ఆ నోట్లన్నీ చినిగిపోయిన స్థితిలో ఉండటంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు. కాగా ఆ బావిలోకి నోట్లు ఎలా వచ్చాయనేది ఇంకా తేలలేదు. ఈ ఉదంతంపై బిసల్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: దీపావళి.. ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవు? -
పండగపూట విషాదం.. ఇద్దరు పిల్లలను బావిలోకి నెట్టి..
సాక్షి, కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం నందివాడలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలో పడేసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు పిల్లలు, తండ్రి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు, స్థానికులు వివరాలు ప్రకారం శనివారం రాత్రి దుర్గమ్మ నిమజ్జనానికి పిల్లలను తండ్రి శ్రీనివాస్‌రెడ్డి తీసుకెళ్లగా, రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య ఆయనకు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు చేసినా కాల్ లిప్ట్ చేయలేదు. మళ్లీ అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా, ఆదివారం ఉదయం గ్రామశివారులోని ఓ వ్యవసాయ బావిలో పిల్లలు, తండ్రి మృతదేహాలు కనిపించాయి. తండ్రీకొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.ఇదీ చదవండి: వారే లేని.. నేనెందుకని.. -
రీల్స్ పిచ్చి.. బావి అంచున కూర్చొని పిల్లాడితో మహిళ వేషాలు
యువతతోపాటు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో రీల్స్పిచ్చి రోజురోజుకు ఎక్కువైపోతుంది. ఏదో ఒకటి చేసి సోషల్ మీడియాలో పాపులర్ కావాలని వింత చేష్టలతో రెచ్చిపోతున్నారు. అడ్డదిడ్డమైన ప్రయత్నాలు చేసి ప్రాణాలను సైతం ప్రమాదంలో నెట్టేస్తున్నారు. తాజాగా ఓ మహిళ సైతం రీల్స్ కోసం తన ప్రాణాలే కాకుండా తన బిడ్డ ప్రాణాలనే పణంగా పెట్టింది.బావి అంచున ప్రమాదకరంగా కూర్చొన్న మహిళ.. ఒక చేతితో పిల్లాడిని పట్టుకొని రీల్ చేసింది. పాటకు అనుగుణంగా డ్యాన్స్ కదలికల కోసం బాలుడిని నిర్లక్ష్యంగా పలుమార్లు చేతులు మార్చింది. బావిలోకి ప్రమాదకరంగా వేలాడిన ఆ బాలుడు ఆమెను గట్టిగా పట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. అతడి శరీరం బావి పైన గాలిలో వేలాడుతూ ఉంది.ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ.. పిల్లవాడి రిస్క్ గురించి పట్టించుకోని ఆ మహిళ రీల్ పిచ్చిపై నెటిజన్లు మండిపడున్నారు. పిల్లవాడి గురించి పట్టించుకోని ఆమె రీల్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రీల్ వ్యామోహంలో బాలుడి ప్రాణాలను పణంగా పెట్టిందని ఆరోపించారు.Family court in custody case: Only mother can love child more. Even more than father.Le mother:#ParentalAlienation pic.twitter.com/mc1kl5ziFj— Raw and Real Man (@RawAndRealMan) September 18, 2024 -
నాలుగడుగుల లోతుల్లోనే నీరు
సాక్షి, కామారెడ్డి : చుట్టు పక్కల గ్రామాల్లో బిందెడు నీళ్లకు గోస పడుతుంటే ఆ ఊళ్లో మాత్రం చేదబావుల్లో నీరు పుష్కలంగా ఊరుతోంది. నాలుగు అడుగుల లోతులో ఉన్న నీళ్లను తోడుకునేందుకు బొక్కెన వేసి రెండు చేతులతో నీటిని పైకి లాక్కుంటారు. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో ఇళ్లల్లో వందకు పైగా చేదబావులు ఉన్నాయి. తాతల కాలం నుంచి ఆ ఊరి జనం చేదబావులను వాడుతున్నారు. ఎక్కడ కరువొచ్చినా ఉప్పల్వాయిలో మాత్రం నీళ్లకు కరువు అన్న ముచ్చటే తెలియదని గ్రామస్తులు అంటున్నారు. ఇరవై ఏళ్ల నాడు ఒకసారి బావుల్లో నీరు కొంతమేర తగ్గినా, తర్వాతి కాలంలో ఏనాడూ ఊటలు తగ్గలేదని పేర్కొంటున్నారు. ఉప్పల్వాయి గ్రామంలో 438 ఇళ్లు ఉన్నాయి. గ్రామ జనాభా 2,478. గ్రామంలో 145 వరకు చేదబావులు ఉన్నాయి. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా, చాలామంది చేదబావుల నీటిని కూడా వాడుతున్నారు. కొందరు చేదబావుల్లో మోటార్లు ఏర్పాటు చేసుకోగా, మిగతావారు గిరక ద్వారా చేదుకుంటున్నారు. చాలా ఇళ్ల ముందు చేతబావి కనిపిస్తుంది. బయటకు వెళ్లి వచ్చినవారు బొక్కెనతో నీటిని చేదుకొని కాళ్లు, చేతులు కడుక్కుని ఇంట్లోకి అడుగుపెడుతుంటారు. గ్రామంలో పాత ఇళ్ల వద్ద చేదబావులు ఉన్నాయి. కొత్తగా బంగళాలు నిర్మించుకుంటున్న వారు మాత్రం బోర్లు వేయించుకుంటున్నారు. బావులు ఎన్నడూ ఎండిపోలేదు నాకు ఇప్పుడు డెబ్బై ఏళ్లపైనే ఉంటయి. నాకు బుద్ధి తెలిసిన నాటి నుంచి బావులు ఎండిపోయింది ఎన్నడూ ఎరుకలేదు. బిందెలతో ముంచుకున్నం. బొక్కెనలతో రెండు చేతులు వేస్తే చాలు నీళ్లు అందుతాయి. మా తాతల కాలం నుంచి ఊళ్లో నీళ్లకు కరు వు లేదు. బావుల్లో నీరు పుష్కలంగా ఉంటోంది. –ఆల నారాయణ, ఉప్పల్వాయి అవసరం ఉన్నప్పుడల్లా చేదుకుంటం... మా ఇంట్లో రెండు కుటుంబాలున్నాయి. అవసరం ఉన్నప్పుడల్లా బావిలో నుంచి చేదుకుంటాం. రెండుసార్లు చేతులు వేస్తే చాలు బొక్కెన పైకి వచ్చేస్తుంది. నాకు పెళ్లయి ఇక్కడికి వచ్చిన నాటి నుంచి బావుల్లో నీళ్లు ఎండిపోయింది ఎన్నడూ లేదు. నీళ్ల ఇబ్బంది ఎదురు కాలేదు. – సుతారి మహేశ్వరి, ఉప్పల్వాయి మా తాత తవ్వించిన బావి... మా ఇంటి దగ్గర మా తాతలు తవ్వించిన బావి ఎన్నడూ ఎండిపోలేదు. ఇప్పుడు మేం కూడా బావి నీటిని వాడుకుంటున్నం. బావికి మోటార్ బిగించి పైన ట్యాంకుకు కనెక్షన్ ఇచ్చాం. ట్యాంకు ద్వారా నీటిని వాడుకుంటున్నాం. –శంకర్‌గౌడ్, ఉప్పల్వాయి -
పిల్లి కోసం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత
బావిలో పడిన పిల్లిని రక్షించబోయి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బయోగ్యాస్ పిట్లోకి దిగిన ఐదుగురు వ్యక్తులు చనిపోయిన ఘటన కలకలం రేపింది. పిల్లిని రక్షించడానికి కుటుంబం మొత్తం బావిలోకి దిగింది. మొత్తం ఆరుగురు ఒకరి తర్వాత మరొకరు దూకారు. అయితే ఊపిరాడక చనిపోయిన ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ స్వాధీనం చేసుకుందని అహ్మద్‌నగర్‌లోని నెవాసాపోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి ధనంజయ్ జాదవ్ తెలిపారు. బాధితులు ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో బావిలోకి దిగి ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. నడుముకి తాడు కట్టుకుని బావిలోకి ప్రవేశించిన వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడని అతణ్ణి ఆసుపత్రిలో చేర్చినట్టు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని వెల్లడించారు. మృతులను మాణిక్ గోవింద్ కాలే, సందీప్ మాణిక్ కాలే, బబ్లూ అనిల్ కాలే, అనిల్ బాపురావ్ కాలే, బాబాసాహెబ్ గైక్వాడ్‌లుగా గుర్తించారు. చిన్న కుమారుడు విజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బావి లోపలికి దిగిన తరువాత ఊపిరాడటంలేదని ఫిర్యాదు చేయడంతో స్థానికులు వెంటనే పోలీసులకు, నిపుణులకు సమాచారం అందించారు. దీంతో సహాయక బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీమ్‌లు ఆపరేషన్‌ను పూర్తి చేయడానికి 5 గంటలకు పైగా పట్టిందనీ, అందుకే ప్రాణనష్టం జరిగిందని స్థానికులు విమర్శించినట్టు తెలుస్తోంది. #WATCH | Five people died in a bid to save a cat who fell into an abandoned well (used as a biogas pit) in Wadki village of Ahmednagar, Maharashtra, late at night. According to Dhananjay Jadhav, Senior Police Officer of Nevasa Police station, Ahmednagar, "A rescue team… pic.twitter.com/fb4tNY7yzD — ANI (@ANI) April 10, 2024 -
బాయి దాహం
‘ఈ బాయికి దాహం జాస్తి! ఎబ్బుడు తీర్తాదో ఏమో!’ హఠాత్తుగా అంది వెంకటలక్ష్మి. ‘బావికి దాహం ఏందే ఎర్రి ఎంకటమ్మా’ నవ్వేసింది రోజా. ‘అసలు ఈ బావే ఎంతమంది దాహం తీర్చిందో.. ఎన్ని పంటలకు నీళ్లిచ్చిందో కదా!’ బావి చుట్టూ ఉన్న పచ్చటి పంట పొలాలను చూస్తూ అంది. అది చాలా పెద్ద దిగుడు బావి. దాని లోతు ఎన్ని మట్లో ఎవరికీ తెలీదు. పేరే పెద్ద బావి! నిండు వేసవిలో కూడా అందులో నీళ్లు తగ్గవు. వేసిన ప్రతి పంటా సిరుల పంటే! ఒకప్పుడు.. తాతల కాలంలో.. ఏతం తొక్కడం, కపిల బానలతో బావిలో నుండి నీళ్లు తోడి పొలాలకు పారించే వాళ్ళట. ఇప్పుడు తండ్రి హయాంలో మోటర్లు బిగించారు. స్విచ్ వేయడం ఆలస్యం నీళ్లు పైపుల నుండి దూకుతాయి. కరెంటు కోతే తప్ప నీళ్ల కొరత ఎప్పుడూ లేదు. ‘పద్దన అమ్మ నన్ను ‘ఎంకటా’ అని పిలిస్తే నువ్వేమంటివీ?’ నడుం మీద రెండు చేతులు పెట్టుకొని గంభీరంగా చూస్తూ నిలదీసింది వెంకటలక్ష్మి. ‘ఏమన్నానబ్బా?’ గుర్తు తెచ్చుకుంది రోజా. ‘ఎంకటి వుండబట్టిగానీ లేపోతే నేనేం చేసుందును? మీ అప్పను చూసేదానికి వచ్చేవాల్లు .. పోయేవాల్లు.. ఇల్లంతా తిరనాల మాదిరి ఉండె. ఇంట్లో పని.. వంట పని మొత్తమంతా ఆ బిడ్డే సమాళించింది.’ అమ్మ మాటలకు తను చిరాకు పడింది వెంకటలక్ష్మి వేపు మెచ్చుకోలుగా చూస్తూనే! ‘ఎంకటి ఏంది మా సంకటి మాదిరి. దాని పేరు వెంకటలక్ష్మి. మా వెంకటరెడ్డి సారు దానికి ఆ పేరు పెట్టి రిజిస్టర్లో రాసినారు తెల్సా!’ ‘ఆ! ఆ! తెల్సులే! బడిలో చేరిన చానామంది పిల్లోల్లకి ఆ పేరే పెట్టినాడంట కదా ఆ ఎంకట్రెడ్డి సారు? ఆడపిలకాయలకు ఎంకటలక్ష్మి.. మగ పిలకాయలకు ఎంకటేసూ అనీ! ఆ యప్పకు ఆయన పేరు అంటే ఇస్టమో లేపోతే ఆ ఎంకటేస్పర సామంటే భకితో మల్ల!’ అమ్మ నవ్వుతూ అంది. ‘అది నిజమే! అయినా నేను తప్ప దీన్ని ‘వెంకటలక్ష్మి’ అని ఎవరూ పిలవలా! ఆఖరికి పేరు పెట్టిన మా సారు కూడా! అందరూ ఎంకటా.. ఎంకటమ్మా అనేవాళ్ళే!’ కినుకగా అంటున్న తన మాటలకు అందరూ నవ్వేసుకున్నారు. ఇప్పుడు నవ్వొచ్చేసింది ఇద్దరికీ. ‘సారీ బా! అలవాట్లో పొరపాటు. అవునూ.. మన వెంకట రెడ్డి సారు ఎలా ఉన్నారు? బాగున్నారా? తిరగలాడుతారా?’ ఆసక్తిగా అడిగింది రోజా. ‘ఆహా! బొంగరం మాదిరి. మొన్నో దినం మీ అప్పని చూసేదానికి కూడా వొచ్చినారు. పక్క పల్లెలోనే సారు ఉండేది.’ ‘అవునా! ఒకసారి పోయి చూసి వద్దామే సారును! మనకు అక్షరాభ్యాసం చేసిన గురువు కదా!’ ‘ఎబ్బుడొచ్చినా పట్టు పట్టుమని పోడమే గాని నాలుగు దినాలుండినావా ఎబ్బుడన్నా? ఉడుకు నీల్లు కాల్ల మింద పోసుకొని వొచ్చినట్టు వొస్తావు. ఇబ్బుటికో మాపటేలకో మీ ఇంటాయన పోన్ చేస్తే తెల్లారే బస్సెక్కెయ్యవూ?’ నవ్వింది వెంకటలక్ష్మి. ‘లేదులేవే! పద్దినాలు రానని చెప్పొచ్చినాలే! అప్పను చూస్తేనే బాధగా వుందే! పెద్దపులి మాదిరి ఉండేవాడు.. ఇప్పుడు ఇట్లా మంచాన పడి ఉంటే చూడలేకపోతున్నా!’ రోజా కళ్ళు చెమర్చాయి. ‘సావాల్సింది’ వెంకటలక్ష్మి మాట పదునుకు అదిరిపడింది రోజా. ‘ఏమంటివే?’ రోజా గొంతులో కోపం కళ్ళల్లో ఎరుపును నింపింది. ‘ఆ! డాక్టర్ చెప్పిండ్లా! బీపీ తలక్కొడితే సానామంది గుండాగి సత్తారంట కదా! మీ అప్ప అదృస్టం.. కాలు సెయ్యి పడిపోయినా ప్రానంతో వుండాడు కదా మనిసి’ వెంకటలక్ష్మి మాటల్లో అమాయకతకు రోజా లజ్జపడింది తన తొందరపాటు కోపానికి. ‘అవును అమ్మ అయిదోతనమే అప్పను కాపాడిందన్నారు అందరూ! కానీ ఇంటికి, పొలానికి, పట్నానికి తిరుగుతూ ఉండే కాలు.. అడుగు వేయలేని ఇప్పటి పరిస్థితికి.. హూంకరింపులతోనే దడిపించే నోరు.. వంకర పోయి మాట స్పష్టంగా పలకలేని నిస్సహాయతకు అప్ప ఎంత నరకయాతన అనుభవిస్తున్నాడో..’ అనుకుంటుంటే కడుపులో దేవినట్లైంది రోజాకు. ‘వెంకటలక్ష్మి! మా అప్పకు మీ అప్ప చేసే సేవ.. నువ్వు అమ్మకు అన్ని విధాలా సహాయంగా ఉండటం.. నిజంగా మీ ఇద్దరికీ చాలా థాంక్సే! మీ రుణం తీర్చలేనిది’ రోజా మనస్ఫూర్తిగా అంది వెంకటలక్ష్మి చేయి తీసుకుని ఆప్యాయంగా నొక్కుతూ. ‘అయ్యో! అదేంమాట? అమ్మ సేతి కూడు తిని బతికే మాకు తాంక్స్ ఎందుకు? అమ్మ మల్లిపూలు కోసుకు రమ్మనింది. కోద్దాం రా!’ అంటూ వెంకటలక్ష్మి మల్లెచెట్టు వైపు నడిచింది. ‘అమ్మకీ దొంతు మల్లిపూలంటే సానా ఇస్టం!’ పంటల నాట్లు, కోతలప్పుడు, చెరుకు గానుగలాడేనప్పుడు తండ్రి ఎక్కువగా పొలం దగ్గరే ఉండేవాడు. భోజనం చేయడానికి.. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడే ఓ చిన్న గది కట్టించాడు.. ఇదివరకు ఉన్న పాకను పీకేయించి. రోజా మెల్లగా గది తలుపు తీసి లోపలికి వెళ్ళబోయి ఆగిపోయింది. ఆమె చూపులు క్షణం పాటు గదిని పరిశీలనగా చూసి చికిలించుకుపోయాయి. వెంటనే తలుపు మూసేసి మల్లెచెట్టు వైపు నడిచింది. మల్లెపొద కింద కూర్చుని వెంకటలక్ష్మి ఏడుస్తోంది. రోజా గాభరాగా వెళ్లి పక్కన కూర్చుని వెంకటలక్ష్మి భుజం చుట్టూ చెయ్యేసి ‘ఏంటిది వెంకటలక్ష్మి! ఊర్కో!’ అంది. ‘ఈ బాయికి ఎంతమంది ఉసుర్లు తీస్కొన్నా దాహం తీరలే! కడాకు నా రాముడ్ని కూడా..’ వెక్కివెక్కి ఏడుస్తున్న వెంకటలక్ష్మిని ఓదార్చడం రోజా వల్ల కాలేదు. ‘పోయినోళ్లు పుణ్యాత్ములు! ఉన్నోళ్లు పోయినోళ్ళ తీపి గుర్తులు అంటారు. రాముడు ఎక్కడికి పోతాడు? నీ కడుపులో పెరుగుతున్నాడు కదా! బాధపడకు వెంకటలక్ష్మీ! బిడ్డ కోసమన్నా నువ్వు మనసు నిబ్బరం చేసుకోవాలి’ ఓదార్పుగా అంది రోజా. ‘అవును మా! నా బిడ్డ కోసమే బతికుండా. లేపోతే రాముడ్తో పాటే పొయుండనా?’ ఏడుస్తూనే ఉంది వెంకటలక్ష్మి. బావి దగ్గర బురదలో జారి.. బావిలో పడబోతున్న తండ్రిని లాగి పడేసి తను బావిలోకి జారిపోయాడని చెప్పారు. ఆ షాక్‌లో.. హై బీపీతో అప్పకు పక్షవాతం వచ్చింది. వెంకటలక్ష్మి అరుపులకు.. కాస్త దూరంగా పొలాల్లో పనులు చేసుకుంటున్న వాళ్లు వచ్చి అప్పను ఇంటికి తీసుకుపోయే హడావిడిలో పడ్డారు. కానీ నీళ్లలో పడ్డ రామున్ని గుర్తించలేదు. వెంకటలక్ష్మి భయంతో, దుఃఖంతో సొమ్మసిల్లి పడిపోయింది.తనకు తెలివి వచ్చేసరికి రాముడు వాకిట్లో దీపం ముందు పడుకోబెట్టబడి ఉన్నాడు. ఆమె దుఃఖ సముద్రమే అయింది. ఇప్పటికీ విచారం, విషాదం నిండిన దుఃఖపు అలలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. కడుపులో బిడ్డ కోసం గుండెలవిసే దుఃఖానికి కంటి రెప్పల చెలియలికట్ట వేసుకొని భారంగా శరీరాన్ని, మనసును మోస్తోంది. చిన్నప్పుడు తాము ఈ బావి దగ్గర ఎన్ని ఆటలు ఆడుకునే వాళ్ళు? ఎండాకాలం సెలవుల్లో మగ పిల్లలంతా ఈ బావిలోనే ఈత కొట్టేవాళ్ళు. పెద్ద పిల్లలు చిన్న పిల్లలకు బెండు కట్టి ఈత నేర్పేవాళ్లు. పెద్ద పిల్లలకు కూడా ఈత నేర్పేంత ఈతగాడు రాముడు. వాడు బావిలోకి దూకే విధానం, నీళ్లలో వేసే మునకలు వేగంగా ఈత కొట్టడం.. చాలా ముచ్చటగా, థ్రిల్లింగ్ గానూ ఉండేది చూసే తమకు. వెంకటలక్ష్మి మరీ మురిపెంగా చూసేది. రాముడు తనకు మేనమామ కొడుకే. ఎల్లమ్మ జాతరకు వచ్చిన రాముడి తల్లి ప్రమాదవశాత్తు ఇదే బావిలో పడి చనిపోతే రాముడ్ని తమ ఇంట్లోనే పెట్టుకొని పెంచారు వెంకటలక్ష్మి తల్లిదండ్రులు. తర్వాత కొంత కాలానికే అనూహ్యంగా ఇదే బావిలో పడి వెంకటలక్ష్మి తల్లి కూడా చనిపోతే ఇద్దర్నీ వెంకటలక్ష్మి నానమ్మే సాకింది. ‘ఒరేయ్! మాకు కూడా ఈత నేర్పీరా!’ అని తను, వెంకటలక్ష్మి కూడా రాముడ్ని బతిమిలాడే వాళ్ళు. ‘దీనికి నేర్పిస్తా! నీకు మాత్తరం నేర్పీను. అమ్మో! మీ అప్ప పెద్దపులి. నాకు భయమబ్బా’ అనేవాడు రాముడు. వెంకటలక్ష్మికి నేర్పాడు కూడా. ఈత కొడుతూ కేరింతలాడే వాళ్ళని చూస్తూ తను ఉక్రోష పడేది. వాళ్ళిద్దరి చిన్ననాటి నెయ్యం మూడుముళ్ల బంధం అయింది. చూడ చక్కని జంట! చిలుకాగోరింకల్లా అన్యోన్యంగా, ఆనందంగా వున్న ఆ జంటను చూసి విధికే కన్ను కుట్టిందేమో! మృత్యువు .. బావి రూపంలో వచ్చి రాముడ్ని మింగేసింది. ‘వెంకటలక్ష్మీ! రాముడు గజ ఈతగాడు కదా? వాడు నీళ్లలో మునిగి చనిపోవడం ఏమిటి?’ హఠాత్తుగా అడిగింది రోజా. ‘మొక్కే దేముడే యముడై ముంచేస్తే ఏం చేస్తాములే మా!’ నిర్లిప్తంగా అంది వెంకటలక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ. ‘అదేమట్లంటావు? అసలేం జరిగిందా రోజు? నువ్విక్కడే వున్నావుగా?’ రోజా దీర్ఘంగా చూస్తూ అడిగింది. ‘ఏమి జరక్కూడదో అదే జరిగిపోయినంక ఇంగిపుడు ఏంజేస్తాములే మా!’ నిర్వేదంగా అంది వెంకటలక్ష్మి. ‘బాయిలో పడేనబ్బుడు గోడకు తగిలి తల పగిలిందన్నారు’ శుష్కహాసం చేసింది. ‘అయినా గడా ఈ బాయికి ఎంత దాహమో! మాయమ్మ, అత్త, ఊర్లో చానా మంది ఆడవాళ్ల ఉసుర్లు.. కడాకు నా రాముడి ఉసురు గడా పోసుకొనింది. దీనికి వాయి వరసా లేదు’ వెంకటలక్ష్మి మాటలు కోపం, దుఃఖం, బాధ కలగలిపి జీరగా ఉన్నాయి. ‘అది కాదు వెంకటలక్ష్మీ..’ రోజా ఏదో అనబోయేంతలో మధ్యలో కలగజేసుకుంది వెంకటలక్ష్మి.. ‘అంతంత పెద్ద సదువులు సదివినావు కదా! ఏదొక దినం నీకే అర్తమవుతాది లే. పదమా! అమ్మ ఎదురు సూస్తాంటాది’ అంటూ ముందుకు నడిచింది.. కోసిన మల్లెమొగ్గలు కొంగులో మూటకట్టుకొంటూ!‘కుప్పా! రెడ్డప్ప బాయికాడ ఏమి లిబ్బి పెట్టిండాడో! ఎంచేపూ ‘బాయి.. బాయి..’ అని కలవరిస్తానే ఉండాడు. ఏందో నీ పున్యాన.. ఆ ఆయురేద మందులు, నువ్వు చేసే నూనె మర్తన.. పని చేస్తుండబట్టి ఇబ్బుడు నాలుగు అడుగులు ఏస్తా వుండాడో లేదో.. బాయి కాడికి పోవాలని పల్లాయి ఎత్తుకొన్యాడు. పోయీ మెల్లంగా తీస్కపోరా!’ రెడ్డెప్పకు కాలు, చెయ్యి నూనె మసాజ్, స్నానం చేపించి.. బట్టలు తొడిగి.. టిఫిన్ తినిపించి.. టీవీ ముందు వాలు కుర్చీలో కూర్చోబెట్టి వచ్చిన కుప్పడికి చద్దన్నం పెడుతూ అంది సావిత్రమ్మ. కుప్పడు ఇడ్లీలు, దోశలు తినడు. మూడు పూటలా అన్నమే కావాలంటాడు. ఆ రోజు శుక్రవారం. తలారా స్నానం చేసి తన పొడవాటి జుట్టును కింద జారుముడి వేసి ఇంత మల్లెపూల దండ పెట్టుకుంది. పసుపు రాసిన మొహంలో పావలా కాసంత నిండు ఎరుపు కుంకుమ బొట్టుతో లక్ష్మీదేవిలా కళకళ్ళాడుతున్న సావిత్రమ్మను అలా చూస్తూ ఉండిపోయాడు కుప్పడు తినడం కూడా మర్చిపోయి. ‘పర్వాలేదు లేరా బాద, కస్టం, ఏడుపూ.. అన్నీ మర్చిపోతిన్లేరా! అసలుకు అయ్యన్నీ అలవాటైపోయిండ్లా? ఎదిరించడం, ఎదురు మాటాడటం.. తెలీకుండానే మన కాలం గడిచిపోయ కదా! మన బిడ్డలు బాగుంటే సాలనుకుంటిమి. కానీ.. దేముడని నమ్మితే.. నీకు, నీ బిడ్డకు గడా అన్నాయమే చేసినాడా ముండా దేముడు. ఆ పొద్దు నీ పెండ్లాన్ని, చెల్లిని, ఇబ్బుడు నీ అల్లుడ్ని గడా తీస్కపోయి’ గద్గదంగా అంది సావిత్రమ్మ. ఆమె కళ్ళు ఉబ్బి, మంకెన పువ్వుల్లా ఎర్రగా ఉన్నాయి. కుప్పడు మాటా పలుకు లేకుండా చూస్తున్నాడు గానీ గుండెలో అదురు పుట్టింది. సావిత్రమ్మ మాటలు వింటున్న వెంకటలక్ష్మి కూడా బొమ్మలా అయిపోయి అలా చూస్తోంది. ఇద్దరి కళ్ళూ ధారాపాతంగా వర్షించడం మొదలెట్టాయి. అది చూసి ‘ఏంరా కుప్పా? ఏమైందీ’ సావిత్రమ్మ కంగారుగా అడిగింది. ఏమీ లేదన్నట్లు అడ్డంగా తలూపుతూ చేతిలోని పచ్చిమిరపకాయ చూపించాడు కుప్పడు. ‘నువ్వెందుకు ఏడస్తాండావే ఎంకటమ్మా?’ వెంకటలక్ష్మి వేపు తిరిగింది సావిత్రమ్మ. వెంకటలక్ష్మి ఒడిలో ఉన్న చాటలో తను తొక్క తీస్తున్న ఉల్లిపాయలు చూపింది. ‘బాగుండాదిలే మీ కత! నిన్ను మిరపకాయ, దాన్ని ఎర్రగడ్డ ఏడ్పిస్తాండాయా?’ నిట్టూర్చింది సావిత్రమ్మ. ‘అది సరే.. చిన్న బిడ్డ.. ఎర్రగడ్డ గాటు తట్టుకోలేదు. నీకేందిరా కుప్పా? ఇంత జీవితం చూసినంక గడా అంతంత కారం మింగినాక గడా ఇంగా ఏడుస్తాంటే ఎట్లా ? తిను. తిను. తినేసి రెడ్డెప్పను బాయి కాడికి తొడ్కో పో! ఎంకటమ్మను నీ కూడా తీస్కపో! తోడుంటాది. ఇద్దురూ భద్రం! ముందూ ఎనకా చూస్కోండి’ జాగ్రత్తలు చెప్తూనే సావిత్రమ్మ దేవుని గదిలోకి వెళ్ళిపోయింది. ‘అప్పా! నెలలు నిండిపోయినాయంట. రెండు మూడు దినాల్లో పురుడొచ్చేస్తాదని సెప్పింది నర్సమ్మ. పుట్టేది రాముడే. వాడీ భూమ్మీద పడేలోగా..’ పొద్దున గొడ్లచావిట్లో తండ్రిని పట్టుకొని ఏడుస్తున్న వెంకటలక్ష్మి.. సావిత్రమ్మను చూసి మాట మింగేసింది. ఆమె ప్రతి శుక్రవారం గోపూజ చేస్తుంది. పూజా సామగ్రి పళ్ళెంతో వచ్చింది. ‘తొలి కాపు కదమా! బిడ్డ బయపడతాంది’ కుప్పడు సావిత్రమ్మను చూసి తడబడ్డాడు. ‘తల్లి లేని బిడ్డ. తొలి కానుపు భయం ఉంటాదిలే! ఇంట్లో ఆడదిక్కు లేదు. తోడుగా మీ చెల్లిని రమ్మన్నానంటివే! ఇంగా రాలేదా?’ కుప్పడు ఒళ్ళంతా తోమి, కడిగి తయారుగా వుంచిన ఆవు నొసట్న పసుపు కుంకుమ పెడుతూ అడిగింది. ‘చెనిగి చెట్లు పెరకతాండారంటమా! ఈ పొద్దు అయిపోతాది రేపటికంతా వొచ్చేస్తానని చెప్పింది’ చెప్పాడు కుప్పడు. ‘సరే! అయినా గడా ఎంకట్లక్ష్మి పే..ద్ద ధైర్నవంతురాలని రోజమ్మ అంటాంటాంది. నువ్వేమిట్లా ఎర్రిగొడ్డులా ఏడస్తాండావు?’ అంది సావిత్రమ్మ ఆవు చుట్టూ ప్రదక్షణాలు చేస్తూ! ‘మనూరి నర్సమ్మ చెయ్యివాసి మంచిది. నీకేం కాదులేమే! మంచిగా కానుపైతాదిలే! ఆ దేముడు, రాముడు నీకు తోడుంటార్లే!’ ధైర్యం చెప్పింది. సావిత్రమ్మ.. రెడ్డెప్పను బావి దగ్గరకు తీసుకుపొమ్మని చెప్పి లోపలికి వెళ్ళిపోయాక ఒకరి మొహాలొకరు చూసుకున్నారు తండ్రీ కూతుళ్ళు! కూడబలుక్కున్నట్లుగా ఇద్దరూ ఒకేసారి లేచి నిలబడ్డారు కళ్ళు తుడుచుకొంటూ! ‘అప్ప ఆరోగ్యం పూర్తిగా కుదుట పడనేలేదు. కర్రసాయం లేకండా నడవలేడు. ఆయన అడిగితే మాత్రం నువ్వు ఎట్లా పంపించినావు మా బావి దగ్గరకు? అక్కడేమి పుట్టి మునిగిపోతా ఉందని?’ రోజా తల్లిని నిలదీసింది నిష్ఠూరంగా. తండ్రి చనిపోయి దశ దిన కర్మలు ముగిశాక.. బంధువులంతా ఎక్కడి వాళ్ళక్కడ వెళ్లిపోయాక తల్లి కూతుర్లు మిగిలారు ఇంట్లో. బావి దగ్గరికి వెళ్లిన తండ్రి కాలుజారి బావిలో పడిపోయాడు. కాపాడాలని కుప్పడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ‘ఏం చేసేది రోజమ్మా? ఆయనే పొద్దు నా మాట యిన్నాడని? అసలుకు ఏమన్నా ఎదురు చెప్పే ధైర్నమన్నా నాకుండేనా? అయినా.. కిష్ణుడు గీతలో చెప్పినట్టు నా మాట నిమిత్తమాత్తరమే! ఆయన సావు ఆయనే తెచ్చుకొన్యాడు.’ ‘నువ్వే తీసుకుపొమ్మన్నావని చెప్పినాడే కుప్పడు?’ సాలోచనగా చూసింది తల్లి వైపు. ‘అవునుమా! చెప్పినా. వాల్లిద్దరి దుక్కం సూడ్లేకపోయినా. వాల్లు తాతల తరాల నుండి మన ఇంటినే నమ్ముకొని బతికే సేద్దిగాల్లు. వాల్లకు అన్నాయమే జరిగింది. ఎంకటమ్మ నీ ఈడే కదా? అంటే మాక్కూడా బిడ్డ మాదిరే కదా? అమా.. అమా.. అనుకుంటా నా కూడా తిరగతా ఇంట్లో పెరిగిన బిడ్డ కదా! ఇబ్బుడు కడుపుతో వుండాదా? అది సంతోసంగా వుండాల్సిన టయమిది. కానీ దాని ఖర్మానికి.. కడుపులో బిడ్డతోపాటు.. గుండెలో మొగుడు పోయిన దుక్కం గడా మోస్తాంది. ముందు దాని దుక్క బారం తీరాల. అబ్బుడే అది కనే బిడ్డను సంతోసంగా సాకతాది అన్పించె నాకు. కడుపుతో వున్న.. తల్లి లేని బిడ్డ కోరికను తల్లి మాదిరి తీర్చల్ల కదా!’ సావిత్రమ్మ శూన్యంలోకి చూస్తూ నిర్లిప్తంగా, నిర్విచారంగా, నిర్వేదంగా చెబుతుంటే రోజా గుడ్లప్పగించి చూస్తోంది. తానేం అడిగింది.. తల్లి ఏం చెబుతోంది? అర్థంకాని అయోమయం! హఠాత్తుగా ఆమె కళ్ళల్లో తానా రోజు బావి దగ్గర గదిలో చూసిన చిందరవందర సామాను, ఎండిపోయిన మల్లెపూల దండలు, పగిలిన గాజు ముక్కల దృశ్యం కదలాడింది. ‘బాయిలో వున్న ఎంతోమంది ఉసుర్లు సంతోసంగా, ప్రెసాంత బడిన దినాన బాయి దాహం తీర్తాది’ వెంకటలక్ష్మి కసి మాటలు గుర్తొచ్చాయి. ఊర్లో వాళ్ళు, బంధువులు, సేద్యగాళ్ళు, పొలం పనులకు వచ్చే కూలి వాళ్ళు ‘లక్ష్మీదేవి, అన్నపూర్ణమ్మ తల్లి’ అని పొగుడుకొనే అమ్మలో దుష్టశిక్షణ చేసే ఒక కాళికా మాత కనిపించింది రోజా కళ్ళకి. తల్లి దగ్గరగా జరిగి గట్టిగా కౌగిలించుకొని బుగ్గపై ముద్దు పెడుతుంటే ఆమె బుగ్గ తడి తియ్యగా తగిలింది. ‘కుప్పా! రెడ్డప్ప బాయికాడ ఏమి లిబ్బి పెట్టిండాడో! ఎంచేపూ ‘బాయి.. బాయి..’ అని కలవరిస్తానే ఉండాడు. ఏందో నీ పున్యాన.. ఆ ఆయురేద మందులు, నువ్వు చేసే నూనె మర్తన.. పని చేస్తుండబట్టి ఇబ్బుడు నాలుగు అడుగులు ఏస్తా వుండాడో లేదో.. బాయి కాడికి పోవాలని పల్లాయి ఎత్తుకొన్యాడు. పోయీ మెల్లంగా తీస్కపోరా! ‘ఈ బాయికి దాహం జాస్తి! ఎబ్బుడు తీర్తాదో ఏమో!’ హఠాత్తుగా అంది వెంకటలక్ష్మి. ‘బావికి దాహం ఏందే ఎర్రి ఎంకటమ్మా’ నవ్వేసింది రోజా. ‘అసలు ఈ బావే ఎంతమంది దాహం తీర్చిందో.. ఎన్ని పంటలకు నీళ్లిచ్చిందో కదా!’ బావి చుట్టూ ఉన్న పచ్చటి పంట పొలాలను చూస్తూ అంది. అది చాలా పెద్ద దిగుడు బావి. దాని లోతు ఎన్ని మట్లో ఎవరికీ తెలీదు. పేరే పెద్ద బావి! నిండు వేసవిలో కూడా అందులో నీళ్లు తగ్గవు. వేసిన ప్రతి పంటా సిరుల పంటే! ఒకప్పుడు.. తాతల కాలంలో.. ఏతం తొక్కడం, కపిల బానలతో బావిలో నుండి నీళ్లు తోడి పొలాలకు పారించే వాళ్ళట. ఇప్పుడు తండ్రి హయాంలో మోటర్లు బిగించారు. స్విచ్ వేయడం ఆలస్యం నీళ్లు పైపుల నుండి దూకుతాయి. కరెంటు కోతే తప్ప నీళ్ల కొరత ఎప్పుడూ లేదు. ‘పద్దన అమ్మ నన్ను ‘ఎంకటా’ అని పిలిస్తే నువ్వేమంటివీ?’ నడుం మీద రెండు చేతులు పెట్టుకొని గంభీరంగా చూస్తూ నిలదీసింది వెంకటలక్ష్మి.‘ఏమన్నానబ్బా?’ గుర్తు తెచ్చుకుంది రోజా.‘ఎంకటి వుండబట్టిగానీ లేపోతే నేనేం చేసుందును? మీ అప్పను చూసేదానికి వచ్చేవాల్లు .. పోయేవాల్లు.. ఇల్లంతా తిరనాల మాదిరి ఉండె. ఇంట్లో పని.. వంట పని మొత్తమంతా ఆ బిడ్డే సమాళించింది.’అమ్మ మాటలకు తను చిరాకు పడింది వెంకటలక్ష్మి వేపు మెచ్చుకోలుగా చూస్తూనే! ‘ఎంకటి ఏంది మా సంకటి మాదిరి. దాని పేరు వెంకటలక్ష్మి. మా వెంకటరెడ్డి సారు దానికి ఆ పేరు పెట్టి రిజిస్టర్లో రాసినారు తెల్సా!’ ‘ఆ! ఆ! తెల్సులే! బడిలో చేరిన చానామంది పిల్లోల్లకి ఆ పేరే పెట్టినాడంట కదా ఆ ఎంకట్రెడ్డి సారు? ఆడపిలకాయలకు ఎంకటలక్ష్మి.. మగ పిలకాయలకు ఎంకటేసూ అనీ! ఆ యప్పకు ఆయన పేరు అంటే ఇస్టమో లేపోతే ఆ ఎంకటేస్పర సామంటే భకితో మల్ల!’ అమ్మ నవ్వుతూ అంది. ‘అది నిజమే! అయినా నేను తప్ప దీన్ని ‘వెంకటలక్ష్మి’ అని ఎవరూ పిలవలా! ఆఖరికి పేరు పెట్టిన మా సారు కూడా! అందరూ ఎంకటా.. ఎంకటమ్మా అనేవాళ్ళే!’ కినుకగా అంటున్న తన మాటలకు అందరూ నవ్వేసుకున్నారు. ఇప్పుడు నవ్వొచ్చేసింది ఇద్దరికీ. ‘సారీ బా! అలవాట్లో పొరపాటు. అవునూ.. మన వెంకట రెడ్డి సారు ఎలా ఉన్నారు? బాగున్నారా? తిరగలాడుతారా?’ ఆసక్తిగా అడిగింది రోజా. ‘ఆహా! బొంగరం మాదిరి. మొన్నో దినం మీ అప్పని చూసేదానికి కూడా వొచ్చినారు. పక్క పల్లెలోనే సారు ఉండేది.’ ‘అవునా! ఒకసారి పోయి చూసి వద్దామే సారును! మనకు అక్షరాభ్యాసం చేసిన గురువు కదా!’ ‘ఎబ్బుడొచ్చినా పట్టు పట్టుమని పోడమే గాని నాలుగు దినాలుండినావా ఎబ్బుడన్నా? ఉడుకు నీల్లు కాల్ల మింద పోసుకొని వొచ్చినట్టు వొస్తావు. ఇబ్బుటికో మాపటేలకో మీ ఇంటాయన పోన్ చేస్తే తెల్లారే బస్సెక్కెయ్యవూ?’ నవ్వింది వెంకటలక్ష్మి. ‘లేదులేవే! పద్దినాలు రానని చెప్పొచ్చినాలే! అప్పను చూస్తేనే బాధగా వుందే! పెద్దపులి మాదిరి ఉండేవాడు.. ఇప్పుడు ఇట్లా మంచాన పడి ఉంటే చూడలేకపోతున్నా!’ రోజా కళ్ళు చెమర్చాయి. ‘సావాల్సింది’ వెంకటలక్ష్మి మాట పదునుకు అదిరిపడింది రోజా. ‘ఏమంటివే?’ రోజా గొంతులో కోపం కళ్ళల్లో ఎరుపును నింపింది. ‘ఆ! డాక్టర్ చెప్పిండ్లా! బీపీ తలక్కొడితే సానామంది గుండాగి సత్తారంట కదా! మీ అప్ప అదృస్టం.. కాలు సెయ్యి పడిపోయినా ప్రానంతో వుండాడు కదా మనిసి’ వెంకటలక్ష్మి మాటల్లో అమాయకతకు రోజా లజ్జపడింది తన తొందరపాటు కోపానికి. ‘అవును అమ్మ అయిదోతనమే అప్పను కాపాడిందన్నారు అందరూ! కానీ ఇంటికి, పొలానికి, పట్నానికి తిరుగుతూ ఉండే కాలు.. అడుగు వేయలేని ఇప్పటి పరిస్థితికి.. హూంకరింపులతోనే దడిపించే నోరు.. వంకర పోయిమాటస్పష్టంగా పలకలేని నిస్సహాయతకు అప్ప ఎంత నరకయాతన అనుభవిస్తున్నాడో..’ అనుకుంటుంటే కడుపులో దేవినట్లైంది రోజాకు. ‘వెంకటలక్ష్మి! మా అప్పకు మీ అప్ప చేసే సేవ.. నువ్వు అమ్మకు అన్ని విధాలా సహాయంగా ఉండటం.. నిజంగా మీ ఇద్దరికీ చాలా థాంక్సే! మీ రుణం తీర్చలేనిది’ రోజా మనస్ఫూర్తిగా అంది వెంకటలక్ష్మి చేయి తీసుకుని ఆప్యాయంగా నొక్కుతూ. ‘అయ్యో! అదేంమాట? అమ్మ సేతి కూడు తిని బతికే మాకు తాంక్స్ ఎందుకు? అమ్మ మల్లిపూలు కోసుకు రమ్మనింది. కోద్దాం రా!’ అంటూ వెంకటలక్ష్మి మల్లెచెట్టు వైపు నడిచింది. ‘అమ్మకీ దొంతు మల్లిపూలంటే సానా ఇస్టం!’ పంటల నాట్లు, కోతలప్పుడు, చెరుకు గానుగలాడేనప్పుడు తండ్రి ఎక్కువగా పొలం దగ్గరే ఉండేవాడు. భోజనం చేయడానికి.. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడే ఓ చిన్న గది కట్టించాడు.. ఇదివరకు ఉన్న పాకను పీకేయించి. రోజా మెల్లగా గది తలుపు తీసి లోపలికి వెళ్ళబోయి ఆగిపోయింది. ఆమె చూపులు క్షణం పాటు గదిని పరిశీలనగా చూసి చికిలించుకుపోయాయి. వెంటనే తలుపు మూసేసి మల్లెచెట్టు వైపు నడిచింది. మల్లెపొద కింద కూర్చుని వెంకటలక్ష్మి ఏడుస్తోంది. రోజా గాభరాగా వెళ్లి పక్కన కూర్చుని వెంకటలక్ష్మి భుజం చుట్టూ చెయ్యేసి ‘ఏంటిది వెంకటలక్ష్మి! ఊర్కో!’ అంది. ‘ఈ బాయికి ఎంతమంది ఉసుర్లు తీస్కొన్నా దాహం తీరలే! కడాకు నా రాముడ్ని కూడా..’ వెక్కివెక్కి ఏడుస్తున్న వెంకటలక్ష్మిని ఓదార్చడం రోజా వల్ల కాలేదు. ‘పోయినోళ్లు పుణ్యాత్ములు! ఉన్నోళ్లు పోయినోళ్ళ తీపి గుర్తులు అంటారు. రాముడు ఎక్కడికి పోతాడు? నీ కడుపులో పెరుగుతున్నాడు కదా! బాధపడకు వెంకటలక్ష్మీ! బిడ్డ కోసమన్నా నువ్వు మనసు నిబ్బరం చేసుకోవాలి’ ఓదార్పుగా అంది రోజా. ‘అవును మా! నా బిడ్డ కోసమే బతికుండా. లేపోతే రాముడ్తో పాటే పొయుండనా?’ ఏడుస్తూనే ఉంది వెంకటలక్ష్మి. బావి దగ్గర బురదలో జారి.. బావిలో పడబోతున్న తండ్రిని లాగి పడేసి తను బావిలోకి జారిపోయాడని చెప్పారు. ఆ షాక్‌లో.. హై బీపీతో అప్పకు పక్షవాతం వచ్చింది. వెంకటలక్ష్మి అరుపులకు.. కాస్త దూరంగా పొలాల్లో పనులు చేసుకుంటున్న వాళ్లు వచ్చి అప్పను ఇంటికి తీసుకుపోయే హడావిడిలో పడ్డారు. కానీ నీళ్లలో పడ్డ రామున్ని గుర్తించలేదు. వెంకటలక్ష్మి భయంతో, దుఃఖంతో సొమ్మసిల్లి పడిపోయింది.తనకు తెలివి వచ్చేసరికి రాముడు వాకిట్లో దీపం ముందు పడుకోబెట్టబడి ఉన్నాడు. ఆమె దుఃఖ సముద్రమే అయింది. ఇప్పటికీ విచారం, విషాదం నిండిన దుఃఖపు అలలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. కడుపులో బిడ్డ కోసం గుండెలవిసే దుఃఖానికి కంటి రెప్పల చెలియలికట్ట వేసుకొని భారంగా శరీరాన్ని, మనసును మోస్తోంది. చిన్నప్పుడు తాము ఈ బావి దగ్గర ఎన్ని ఆటలు ఆడుకునే వాళ్ళు? ఎండాకాలం సెలవుల్లో మగ పిల్లలంతా ఈ బావిలోనే ఈత కొట్టేవాళ్ళు. పెద్ద పిల్లలు చిన్న పిల్లలకు బెండు కట్టి ఈత నేర్పేవాళ్లు. పెద్ద పిల్లలకు కూడా ఈత నేర్పేంత ఈతగాడు రాముడు. వాడు బావిలోకి దూకే విధానం, నీళ్లలో వేసే మునకలు వేగంగా ఈత కొట్టడం.. చాలా ముచ్చటగా, థ్రిల్లింగ్ గానూ ఉండేది చూసే తమకు. వెంకటలక్ష్మి మరీ మురిపెంగా చూసేది. రాముడు తనకు మేనమామ కొడుకే. ఎల్లమ్మ జాతరకు వచ్చిన రాముడి తల్లి ప్రమాదవశాత్తు ఇదే బావిలో పడి చనిపోతే రాముడ్ని తమ ఇంట్లోనే పెట్టుకొని పెంచారు వెంకటలక్ష్మి తల్లిదండ్రులు. తర్వాత కొంత కాలానికే అనూహ్యంగా ఇదే బావిలో పడి వెంకటలక్ష్మి తల్లి కూడా చనిపోతే ఇద్దర్నీ వెంకటలక్ష్మి నానమ్మే సాకింది. ‘ఒరేయ్! మాకు కూడా ఈత నేర్పీరా!’ అని తను, వెంకటలక్ష్మి కూడా రాముడ్ని బతిమిలాడే వాళ్ళు. ‘దీనికి నేర్పిస్తా! నీకు మాత్తరం నేర్పీను. అమ్మో! మీ అప్ప పెద్దపులి. నాకు భయమబ్బా’ అనేవాడు రాముడు. వెంకటలక్ష్మికి నేర్పాడు కూడా. ఈత కొడుతూ కేరింతలాడే వాళ్ళని చూస్తూ తను ఉక్రోష పడేది. వాళ్ళిద్దరి చిన్ననాటి నెయ్యం మూడుముళ్ల బంధం అయింది. చూడ చక్కని జంట! చిలుకాగోరింకల్లా అన్యోన్యంగా, ఆనందంగా వున్న ఆ జంటను చూసి విధికే కన్ను కుట్టిందేమో! మృత్యువు .. బావి రూపంలో వచ్చి రాముడ్ని మింగేసింది. ‘వెంకటలక్ష్మీ! రాముడు గజ ఈతగాడు కదా? వాడు నీళ్లలో మునిగి చనిపోవడం ఏమిటి?’ హఠాత్తుగా అడిగింది రోజా. ‘మొక్కే దేముడే యముడై ముంచేస్తే ఏం చేస్తాములే మా!’ నిర్లిప్తంగా అంది వెంకటలక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ. ‘అదేమట్లంటావు? అసలేం జరిగిందా రోజు? నువ్విక్కడే వున్నావుగా?’ రోజా దీర్ఘంగా చూస్తూ అడిగింది. ‘ఏమి జరక్కూడదో అదే జరిగిపోయినంక ఇంగిపుడు ఏంజేస్తాములే మా!’ నిర్వేదంగా అంది వెంకటలక్ష్మి. ‘బాయిలో పడేనబ్బుడు గోడకు తగిలి తల పగిలిందన్నారు’ శుష్కహాసం చేసింది. ‘అయినా గడా ఈ బాయికి ఎంత దాహమో! మాయమ్మ, అత్త, ఊర్లో చానా మంది ఆడవాళ్ల ఉసుర్లు.. కడాకు నా రాముడి ఉసురు గడా పోసుకొనింది. దీనికి వాయి వరసా లేదు’ వెంకటలక్ష్మి మాటలు కోపం, దుఃఖం, బాధ కలగలిపి జీరగా ఉన్నాయి. ‘అది కాదు వెంకటలక్ష్మీ..’ రోజా ఏదో అనబోయేంతలో మధ్యలో కలగజేసుకుంది వెంకటలక్ష్మి.. ‘అంతంత పెద్ద సదువులు సదివినావు కదా! ఏదొక దినం నీకే అర్తమవుతాది లే. పదమా! అమ్మ ఎదురు సూస్తాంటాది’ అంటూ ముందుకు నడిచింది.. కోసిన మల్లెమొగ్గలు కొంగులో మూటకట్టుకొంటూ! ‘కుప్పా! రెడ్డప్ప బాయికాడ ఏమి లిబ్బి పెట్టిండాడో! ఎంచేపూ ‘బాయి.. బాయి..’ అని కలవరిస్తానే ఉండాడు. ఏందో నీ పున్యాన.. ఆ ఆయురేద మందులు, నువ్వు చేసే నూనె మర్తన.. పని చేస్తుండబట్టి ఇబ్బుడు నాలుగు అడుగులు ఏస్తా వుండాడో లేదో.. బాయి కాడికి పోవాలని పల్లాయి ఎత్తుకొన్యాడు. పోయీ మెల్లంగా తీస్కపోరా!’ రెడ్డెప్పకు కాలు, చెయ్యి నూనె మసాజ్, స్నానం చేపించి.. బట్టలు తొడిగి.. టిఫిన్ తినిపించి.. టీవీ ముందు వాలు కుర్చీలో కూర్చోబెట్టి వచ్చిన కుప్పడికి చద్దన్నం పెడుతూ అంది సావిత్రమ్మ. కుప్పడు ఇడ్లీలు, దోశలు తినడు. మూడు పూటలా అన్నమే కావాలంటాడు. ఆ రోజు శుక్రవారం. తలారా స్నానం చేసి తన పొడవాటి జుట్టును కింద జారుముడి వేసి ఇంత మల్లెపూల దండ పెట్టుకుంది. పసుపు రాసిన మొహంలో పావలా కాసంత నిండు ఎరుపు కుంకుమ బొట్టుతో లక్ష్మీదేవిలా కళకళ్ళాడుతున్న సావిత్రమ్మను అలా చూస్తూ ఉండిపోయాడు కుప్పడు తినడం కూడా మర్చిపోయి. ‘పర్వాలేదు లేరా బాద, కస్టం, ఏడుపూ.. అన్నీ మర్చిపోతిన్లేరా! అసలుకు అయ్యన్నీ అలవాటైపోయిండ్లా? ఎదిరించడం, ఎదురు మాటాడటం.. తెలీకుండానే మన కాలం గడిచిపోయ కదా! మన బిడ్డలు బాగుంటే సాలనుకుంటిమి. కానీ.. దేముడని నమ్మితే.. నీకు, నీ బిడ్డకు గడా అన్నాయమే చేసినాడా ముండా దేముడు. ఆ పొద్దు నీ పెండ్లాన్ని, చెల్లిని, ఇబ్బుడు నీ అల్లుడ్ని గడా తీస్కపోయి’ గద్గదంగా అంది సావిత్రమ్మ. ఆమె కళ్ళు ఉబ్బి, మంకెన పువ్వుల్లా ఎర్రగా ఉన్నాయి. కుప్పడు మాటా పలుకు లేకుండా చూస్తున్నాడు గానీ గుండెలో అదురు పుట్టింది. సావిత్రమ్మ మాటలు వింటున్న వెంకటలక్ష్మి కూడా బొమ్మలా అయిపోయి అలా చూస్తోంది. ఇద్దరి కళ్ళూ ధారాపాతంగా వర్షించడం మొదలెట్టాయి. అది చూసి ‘ఏంరా కుప్పా? ఏమైందీ’ సావిత్రమ్మ కంగారుగా అడిగింది. ఏమీ లేదన్నట్లు అడ్డంగా తలూపుతూ చేతిలోని పచ్చిమిరపకాయ చూపించాడు కుప్పడు. ‘నువ్వెందుకు ఏడస్తాండావే ఎంకటమ్మా?’ వెంకటలక్ష్మి వేపు తిరిగింది సావిత్రమ్మ. వెంకటలక్ష్మి ఒడిలో ఉన్న చాటలో తను తొక్క తీస్తున్న ఉల్లిపాయలు చూపింది. ‘బాగుండాదిలే మీ కత! నిన్ను మిరపకాయ, దాన్ని ఎర్రగడ్డ ఏడ్పిస్తాండాయా?’ నిట్టూర్చింది సావిత్రమ్మ. ‘అది సరే.. చిన్న బిడ్డ.. ఎర్రగడ్డ గాటు తట్టుకోలేదు. నీకేందిరా కుప్పా? ఇంత జీవితం చూసినంక గడా అంతంత కారం మింగినాక గడా ఇంగా ఏడుస్తాంటే ఎట్లా ? తిను. తిను. తినేసి రెడ్డెప్పను బాయి కాడికి తొడ్కో పో! ఎంకటమ్మను నీ కూడా తీస్కపో! తోడుంటాది. ఇద్దురూ భద్రం! ముందూ ఎనకా చూస్కోండి’ జాగ్రత్తలు చెప్తూనే సావిత్రమ్మ దేవుని గదిలోకి వెళ్ళిపోయింది. ‘అప్పా! నెలలు నిండిపోయినాయంట. రెండు మూడు దినాల్లో పురుడొచ్చేస్తాదని సెప్పింది నర్సమ్మ. పుట్టేది రాముడే. వాడీ భూమ్మీద పడేలోగా..’ పొద్దున గొడ్లచావిట్లో తండ్రిని పట్టుకొని ఏడుస్తున్న వెంకటలక్ష్మి.. సావిత్రమ్మను చూసి మాట మింగేసింది. ఆమె ప్రతి శుక్రవారం గోపూజ చేస్తుంది. పూజా సామగ్రి పళ్ళెంతో వచ్చింది. ‘తొలి కాపు కదమా! బిడ్డ బయపడతాంది’ కుప్పడు సావిత్రమ్మను చూసి తడబడ్డాడు. ‘తల్లి లేని బిడ్డ. తొలి కానుపు భయం ఉంటాదిలే! ఇంట్లో ఆడదిక్కు లేదు. తోడుగా మీ చెల్లిని రమ్మన్నానంటివే! ఇంగా రాలేదా?’ కుప్పడు ఒళ్ళంతా తోమి, కడిగి తయారుగా వుంచిన ఆవు నొసట్న పసుపు కుంకుమ పెడుతూ అడిగింది. ‘చెనిగి చెట్లు పెరకతాండారంటమా! ఈ పొద్దు అయిపోతాది రేపటికంతా వొచ్చేస్తానని చెప్పింది’ చెప్పాడు కుప్పడు. ‘సరే! అయినా గడా ఎంకట్లక్ష్మి పే..ద్ద ధైర్నవంతురాలని రోజమ్మ అంటాంటాంది. నువ్వేమిట్లా ఎర్రిగొడ్డులా ఏడస్తాండావు?’ అంది సావిత్రమ్మ ఆవు చుట్టూ ప్రదక్షణాలు చేస్తూ! ‘మనూరి నర్సమ్మ చెయ్యివాసి మంచిది. నీకేం కాదులేమే! మంచిగా కానుపైతాదిలే! ఆ దేముడు, రాముడు నీకు తోడుంటార్లే!’ ధైర్యం చెప్పింది. సావిత్రమ్మ.. రెడ్డెప్పను బావి దగ్గరకు తీసుకుపొమ్మని చెప్పి లోపలికి వెళ్ళిపోయాక ఒకరి మొహాలొకరు చూసుకున్నారు తండ్రీ కూతుళ్ళు! కూడబలుక్కున్నట్లుగా ఇద్దరూ ఒకేసారి లేచి నిలబడ్డారు కళ్ళు తుడుచుకొంటూ! ‘అప్ప ఆరోగ్యం పూర్తిగా కుదుట పడనేలేదు. కర్రసాయం లేకండా నడవలేడు. ఆయన అడిగితే మాత్రం నువ్వు ఎట్లా పంపించినావు మా బావి దగ్గరకు? అక్కడేమి పుట్టి మునిగిపోతా ఉందని?’ రోజా తల్లిని నిలదీసింది నిష్ఠూరంగా. తండ్రి చనిపోయి దశ దిన కర్మలు ముగిశాక.. బంధువులంతా ఎక్కడి వాళ్ళక్కడ వెళ్లిపోయాక తల్లి కూతుర్లు మిగిలారు ఇంట్లో. బావి దగ్గరికి వెళ్లిన తండ్రి కాలుజారి బావిలో పడిపోయాడు. కాపాడాలని కుప్పడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ‘ఏం చేసేది రోజమ్మా? ఆయనే పొద్దు నా మాట యిన్నాడని? అసలుకు ఏమన్నా ఎదురు చెప్పే ధైర్నమన్నా నాకుండేనా? అయినా.. కిష్ణుడు గీతలో చెప్పినట్టు నా మాట నిమిత్తమాత్తరమే! ఆయన సావు ఆయనే తెచ్చుకొన్యాడు.’ ‘నువ్వే తీసుకుపొమ్మన్నావని చెప్పినాడే కుప్పడు?’ సాలోచనగా చూసింది తల్లి వైపు. ‘అవునుమా! చెప్పినా. వాల్లిద్దరి దుక్కం సూడ్లేకపోయినా. వాల్లు తాతల తరాల నుండి మన ఇంటినే నమ్ముకొని బతికే సేద్దిగాల్లు. వాల్లకు అన్నాయమే జరిగింది. ఎంకటమ్మ నీ ఈడే కదా? అంటే మాక్కూడా బిడ్డ మాదిరే కదా? అమా.. అమా.. అనుకుంటా నా కూడా తిరగతా ఇంట్లో పెరిగిన బిడ్డ కదా! ఇబ్బుడు కడుపుతో వుండాదా? అది సంతోసంగా వుండాల్సిన టయమిది. కానీ దాని ఖర్మానికి.. కడుపులో బిడ్డతోపాటు.. గుండెలో మొగుడు పోయిన దుక్కం గడా మోస్తాంది. ముందు దాని దుక్క బారం తీరాల. అబ్బుడే అది కనే బిడ్డను సంతోసంగా సాకతాది అన్పించె నాకు. కడుపుతో వున్న.. తల్లి లేని బిడ్డ కోరికను తల్లి మాదిరి తీర్చల్ల కదా!’ సావిత్రమ్మ శూన్యంలోకి చూస్తూ నిర్లిప్తంగా, నిర్విచారంగా, నిర్వేదంగా చెబుతుంటే రోజా గుడ్లప్పగించి చూస్తోంది. తానేం అడిగింది.. తల్లి ఏం చెబుతోంది? అర్థంకాని అయోమయం! హఠాత్తుగా ఆమె కళ్ళల్లో తానా రోజు బావి దగ్గర గదిలో చూసిన చిందరవందర సామాను, ఎండిపోయిన మల్లెపూల దండలు, పగిలిన గాజు ముక్కల దృశ్యం కదలాడింది. ‘బాయిలో వున్న ఎంతోమంది ఉసుర్లు సంతోసంగా, ప్రెసాంత బడిన దినాన బాయి దాహం తీర్తాది’ వెంకటలక్ష్మి కసి మాటలు గుర్తొచ్చాయి. ఊర్లో వాళ్ళు, బంధువులు, సేద్యగాళ్ళు, పొలం పనులకు వచ్చే కూలి వాళ్ళు ‘లక్ష్మీదేవి, అన్నపూర్ణమ్మ తల్లి’ అని పొగుడుకొనే అమ్మలో దుష్టశిక్షణ చేసే ఒక కాళికా మాత కనిపించింది రోజా కళ్ళకి. తల్లి దగ్గరగా జరిగి గట్టిగా కౌగిలించుకొని బుగ్గపై ముద్దు పెడుతుంటే ఆమె బుగ్గ తడి తియ్యగా తగిలింది. అవునుమా! చెప్పినా. వాల్లిద్దరి దుక్కం సూడ్లేకపోయినా. వాల్లు తాతల తరాల నుండి మన ఇంటినే నమ్ముకొని బతికే సేద్దిగాల్లు. వాల్లకు అన్నాయమే జరిగింది. ఎంకటమ్మ నీ ఈడే కదా? అంటే మాక్కూడా బిడ్డ మాదిరే కదా? అమా.. అమా.. అనుకుంటా నా కూడా తిరగతా ఇంట్లో పెరిగిన బిడ్డ కదా! ఇబ్బుడు కడుపుతో వుండాదా? అది సంతోసంగా వుండాల్సిన టయమిది. కానీ దాని ఖర్మానికి.. కడుపులో బిడ్డతోపాటు.. గుండెలో మొగుడు పోయిన దుక్కం గడా మోస్తాంది. - యం.ఆర్ అరుణకుమారి -
కెప్టెన్ల ఫోటో షూట్: దీని వెనుక సంచలన స్టోరీ, కనీవినీ ఎరుగని అద్భుతం
వరల్డ్ కప్ ఫైనల్ పోరుకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు (నవంబరు 19, ఆదివారం) జరగనున్న ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోవరల్డ్ కప్ ట్రోఫీతో టీమిండియా సారథి రోహిత్ శర్మ, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ల ఫొటో షూట్ ఆకర్షణీయంగా నిలిచింది. అసలీ ఫోటో షూట్ ఎక్కడ? దీని వెనుక ఉన్న కథ ఏంటి? తెలుసుకుందాం రండి..! అహ్మదాబాద్ లోని చారిత్రక ప్రదేశం 'అదాలజ్ మెట్ల బావి' వద్ద ఇరు జట్ల సారధులు అదాలజ్ వావ్‌ను సందర్శించారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. దిదీనికి సంబంధించిన ఫొటోలను ఐసీసీ, బీసీసీఐ, గుజరాత్ టూరిజం విభాఘం తమ ఎక్స్( ట్విటర్)లో పోస్ట్ చేశాయి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి అహ్మదాబాద్‌కు ఉత్తరాన ఇరవై కిలోమీటర్ల దూరంలో గాంధీనగర్ జిల్లాకి సమీపంలోని అదాలాజ్ అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెట్ల బావి ఉంది. గుజరాత్లో మార్వాడీ భాషలో, స్టెప్‌వెల్‌ను ‘వావ్’ అంటారు. ఇలాంటి ఇక్కడ చాలా కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి అదాలజ్ ని వావ్? Rohit Sharma, the captain of the Indian #Cricket Team, and Pat Cummins, the captain of the Australian Cricket Team, visited #AdalajStepwell. They were mesmerized by the architectural marvel of the stepwell and overwhelmed by the warm hospitality of #Gujarat. VC: @ICC pic.twitter.com/93MncfCIUR — Gujarat Tourism (@GujaratTourism) November 18, 2023 అదాలజ్ ని వావ్ అదాలజ్ ని వావ్ లేదా అదాలజ్ స్టెప్‌వెల్ ను 1499లో తన భర్త జ్ఞాపకార్థం వాఘేలా రాజవంశం అధినేత వీర్ సింగ్ భార్య రాణి రుదాదేవి నిర్మించారు. ఇదొక అద్భుతంగా శిల్పాలతో నిండివున్న ఈ కట్టడం ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్ప అద్భుతానికి గొప్ప నిదర్శనం. గుజరాత్‌లోని అత్యుత్తమ స్మారక కట్టడాలలో ఒకటిగా నిలిచిన ఈ మెట్ల బావి ఐదు అంతస్తుల లోతులో ఉంటుంది. తూర్పు ప్రవేశం నుండి బావి వరకు మొదటి అంతస్తులో ఉన్న పాలరాతి స్లాబ్‌పై అదాలజ్ స్టెప్‌వెల్ చరిత్రను సంస్కృతంలో ఒక శాసనం లిఖించారు. భర్త చివరి కోరిక కోసం, భార్య ప్రాణత్యాగం పురాణాల ప్రకారం, 15వ శతాబ్దంలో,రణవీర్ సింగ్ అప్పట్లో దండై దేశ్ అని పిలిచే ప్రాంతాన్ని పాలించాడు. ఇక్కడ ఎపుడూ విపరీతమైన నీటి ఎద్దడి ఉండేది. కేవలం వర్షాలే ఆధారం. దీంతో అతిపెద్ద, లోతైన బావిని నిర్మించమని ఆదేశించాడు. కానీ అది పూర్తి కాకముందే, పొరుగున ఉన్న ముస్లిం పాలకుడు మహమ్మద్ బేగ్డా దండాయి దేశ్‌పై దండెత్తాత్తుతాడు. ఈ యుద్ధంలో వీర్ సింగ్ అసువులు బాస్తాడు. దీంతో అప్పటి సంప్రదాయం ప్రకారం అతని భార్య రాణి సతీసహగమనం కోసం సిద్ధమవుతుండగా, బేగ్డా ఆమెను వివాహం చేసుకోవాలను కుంటున్నట్లు చెప్తాడు. అయితే ఈ ప్రాంత రక్షణ, భర్త చివరి కోరికను నెరవేర్చాలనే ఆశయంతో ఇక్కడ ముందుగా మెట్ల బావి నిర్మాణాన్ని పూర్తి చేయాలనే షరతుతో అతని ప్రతిపాదనను అంగీకరిస్తుంది. ఫలితంగా రికార్డు సమయంలో స్టెప్‌వెల్ నిర్మాణానికి పూనుకుంటాడు. కానీ రాణి పథకం వేరే ఉంటుంది. ఇది పూర్తికాగానే ప్రార్థనలతో మెట్ల బావికి ప్రదక్షిణలు చేసి, ఆతరువాత బావిలోకి ప్రాణ త్యాగం చేస్తుంది. ఈ సంఘటనలు బావి గోడలపై చిత్రీకరించి ఉన్నాయి. ఈ బావి ప్రత్యేకలు ఏంటంటే సంవత్సరాల తరబడి నీటి ఎద్దడి కారణంగా నీటి మట్టంలో కాలానుగుణ హెచ్చుతగ్గుల స్థాయిలోని భూగర్భ జలాలకోసం ఇంత లోతుగా దీన్ని నిర్మించారు. సోలంకి నిర్మాణ శైలిలో ఇసుకరాయితో నిర్మించబడిన అదాలజ్ మెట్ల బావి పైభాగంలో అష్టభుజాకారంలో 16 స్తంభాలు, 16 ప్లాట్‌ఫారమ్‌లతో ఉంటుంది. మూడు మెట్ల మార్గాలు భూగర్భంలో కలుస్తాయి. 16 మూలల్లో దేవతలతోపాటు, పలు విగ్రహాలు చెక్కారు. దేవతలు ఇక్కడికి నీరు నింపడానికి వస్తుంటారని గ్రామస్తుల నమ్మకం. అలాగే యాత్రికులు, వ్యాపారులకు ఆశ్రయం ఇచ్చింది. బావి అంచున ఉన్న చిన్న చిన్న నవగ్రహాలు లేదా తొమ్మిది గ్రహాలు దుష్టశక్తుల నుండి స్మారక చిహ్నాన్ని కాపాడుతాయని స్థానికులు నమ్ముతారు. అష్టభుజి పైకప్పు తో తక్కువ గాలి లేదా సూర్యకాంతి ల్యాండింగ్లోకి ప్రవేశించి, లోపల ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ బయట కంటే చల్లగా ఉండటానికి కారణమని ఆర్కిటెక్చర్, ఆర్కియాలజీ రంగంలోని నిపుణులు అంచనా. భయంకరమైన ఎండాకాలంలో కూడా ఇక్కడి ఉష్ణోగ్రత బయటకంటే దాదాపు ఐదు డిగ్రీలు తక్కువగా ఉంటుంది. ఇంకా అమీ ఖుంబోర్ (ప్రాణాదార నీటికి ప్రతీకాత్మక కుండ) , కల్పవృక్షం (జీవిత వృక్షం) ఏక శిలా విగ్రహాలు, పై అంతస్తులలో ఏనుగులు (3 అంగుళాలు (76 మిమీ) చెక్కడాలు. మజ్జిగ చిలకడం, స్త్రీల అలంకరణ, రోజువారీ పనుల దృశ్యాలతోపాటు నృత్యకారులు, సంగీత విద్వాంసుల ప్రదర్శన లాంటివి ఇక్కడి గోడల నిండా కనిపిస్తాయి. మేస్త్రీలకు మరణ శిక్ష బావికి సమీపంలో దొరికిన సమాధుల ద్వారా ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ బావిని నిర్మించిన ఆరుగురు మేస్త్రీలవే సమాధులే. వారి నిర్మాణ శైలి, నిర్మాణ నైపుణ్యానికి, ప్రతిభకు ముగ్దుడైన బేగ్డా ఇలాంటిదే మరొక బావిని నిర్మించగలరా అని మేస్త్రీలని అడిగాడట. దానికి సరే అని వారు సమాధానం చెప్పడంతో వారికి మరణశిక్ష విధించాడు. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కట్టడం మరొకటి ఉండకూడదని భావించాడట. -
ఎండిన బావిలో వేడినీటి కుతకుతలు?.. స్నానాల కోసం క్యూ కడుతున్న జనం!
బీహార్‌లోని భాగల్పూర్లోని ఒక బావి చర్చనీయాంశంగా మారింది. ఈ బావిని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి సైతం జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ బావి గత 20 ఏళ్లుగా పూర్తిగా ఎండిపోయివుంది. అయితే ఉన్నట్టుండి ఈ బావిలో నుంచి నీరు ఉబికివస్తోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకర విషయమేమంటే బావిలోని నీరు కుతకుతా ఉడుకుతున్నట్లు కనిపిస్తోంది. దీనిని చూసిన జనం హడలెత్తిపోతున్నారు. ఈ నేపధ్యంలో ఈ బావి గురించి రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. భాగల్పూర్ జిల్లాలోని గోరాడీప్ పరిధిలోని హర్చండీ గ్రామంలోని బదరీ బహరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడున్న ఒక ఎండిన బావిలో ఉన్నట్టుండి నీరు ప్రత్యక్షమై, అది వేడికి ఉడుకున్నట్లు కనిపిస్తోంది. అయితే పరిశీలించి చూస్తే ఆ నీరు చల్లగానే ఉండటం విశేషం. గ్రామానికి చెందిన ఒక యువకుడు మెట్ల ద్వారా బావిలోనికి వెళ్లి చూడగా, నీరు ఒక మట్టం వరకేవచ్చి ఆగిపోయివుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బావి 70 ఏళ్ల క్రితం నిర్మితమయ్యింది. గత కొన్నేళ్లుగా ఈ బావి పూర్తిగా ఎండిపోయింది. గ్రామానికి చెందిన ప్రొఫెసర్ ఈ నీటిని డీటీఎస్ పరీక్షలకు పంపారు. ఈ నీరు తాగేందుకు ఏమాత్రం యోగ్యం కాదని తెలిపారు. అయితే ఈ బావి వద్దకు చేరుకుంటున్న గ్రామస్తులు దానిలోని నీటితో స్నానం చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నీటితో స్నానం చేసిన గ్రామానికి చెందిన సునైనాదేవి అనే మహిళ తనకున్న చర్మ సంబంధిత రోగాలు మాయమయ్యాయని తెలిపింది. ఆమె చెబుతున్న మాటల్లో నిజమెంతో తెలియనప్పటికీ, గ్రామానికి చెందిన పలువురు ఈ బావిలోని నీటితో స్నానం చేస్తున్నారు. ఈ నీటి గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించాలని స్థానికులు కోరుతున్నారు. ఇది కూడా చదవండి: ఫిరోజ్ ఘంఢీ.. ఫిరోజ్ గాంధీగా ఎలా మారారు? ఇందిరతో పెళ్లిపై కమలా నెహ్రూ ఏమన్నారు? -
బావిలోకి తోసి.. భార్య విలవిలలాడుతుంటే వీడియో తీసి..
మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌లో ఒక గృహిణి హింసకు గురైన ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కట్నం కోసం ఒక భర్త తన భార్యకు తాడుకట్టి బావిలోకి వదిలాడు. తరువాత ఆమె బావిలో నుంచి కాపాడమంటూ ఆర్తనాదాలు చేస్తుండగా వీడియో తీసి, దానిని భార్య పుట్టింటివారికి పంపాడు. ఈ ఉదంతం జాదవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిర్‌ఖెడా గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాకేష్ కీర్‌కు మూడేళ్ల క్రితం రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా నివాసి ఉషతో వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి రాకేష్ తన భార్యను కట్నం కోసం వేధిస్తున్నాడు.ఈ మధ్య కాలంలో రాకేష్ భార్య విషయంలో మరింత క్రూరంగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా తన భార్య ఉషకు తాడు కట్టి బావిలోకి వేలాడదీశాడు. నీటితో నిండిన బావిలో మునిగిన ఆమె భయంతో తనను బయటకు తీసుకురావాలంటూ భర్తను వేడుకుంది. అయితే భర్త ఆమె ఆవేదనను పట్టించుకోకుండా, ఈ దృశ్యాన్ని వీడియో తీశాడు. కొద్దిసేపటి తరువాత చుట్టుపక్కలవారు జోక్యం చేసుకుని ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఉదంతం పోలీసుల వరకూ చేరడంతో వారు నిందితుడు రాకేష్‌ను అరెస్టు చేశారు. జాదవ్ పోలీస్ స్టేషన్ అధికారి అస్లం పఠాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఉదంతంలో నిందితుడు రాకేష్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశామన్నారు. అలాగే రాకేష్‌ను అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టామని, అనంతరం జైలుకు తరలించామన్నారు. ఇది కూడా చదవండి: అది ‘ఇత్తడి నగరం’ ఎందుకయ్యింది? నిత్యం శబ్ధాలు ఎందుకు వినిపిస్తాయి? -
హైదరాబాద్‌లో విషాదాంతమైన బాలుడి మిస్సింగ్
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు పాడుబడ్డ బావిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం కిరాణా షాప్‌కు వెళ్లిన బాలుడు బన్నీ..ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఇంటి పరిసర ప్రాంతాల్లో వెదికారు. అయినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెస్క్యూ టీమ్ సాయంతో ఓ పాడుబడ్డ బావిలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నీళ్లు తోడేసి బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీశారు. -
కోతుల వీరంగం.. బావిలోపడ్డ వృద్ధురాలు
సాక్షి, సిరిసిల్ల: ఇటీవల కాలంలో కోతుల దాడులు పెరిగిపోయాయి. జనావాసాల్లోకి చొరబడి గుంపులు, గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కోతులు మూకుమ్మడిగా దాడి చేయడంతో ఓ వృద్ధురాలు బావిలో పడింది. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. రాచర్లబొప్పాపూర్‌కు చెందిన గంభీర్పూర్ రాజవ్వ (68) ఇంటి బయట కూర్చుని ఉండగా.. హఠాత్తుగా కోతుల గుంపు దాడి చేశాయి. కోతుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న బావిలో పడి మధ్యలో ఇరుక్కుపోయింది. కేకలు వేయడంతో సమీప ఇళ్లలోని యువకులు వచ్చి బావిలో వేలాడుతున్న రాజవ్వను తాళ్ల సహాయంతో బయటకు లాగారు. అపస్మారకస్థితిలో ఉన్న రాజవ్వను ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. చదవండి: ప్రగతి కాదు.. సర్పంచ్‌లకు దుర్గతి.. ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి ధ్వజం -
'కాంగ్రెస్‌లో చేరడం కంటే.. బావిలో దూకి చావడం మేలు'
నాగ్‌పూర్:కాంగ్రెస్‌లో చేరడం కంటే.. బావిలో దూకి చనిపోవడమే మేలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కాంగ్రెస్‌లో చేరవలసిందిగా దివంగత కాంగ్రెస్ నేత శ్రీకాంత్ జిచ్కర్ కోరినప్పుడు తాను ఈ మేరకు ఆఫర్‌ను తిరస్కరించినట్లు చెప్పారు. కాంగ్రెస్ 60 ఏళ్లలో చేసిన పనికంటే బీజేపీ 9 ఏళ్లలోనే రెండింతల పని చేసినట్లు చెప్పారు. బీజేపీ 9 ఏళ్ల పాలనపై మహారాష్ట్రలోని బాంధ్రాలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. ఈ క్రమంలో తన రాజకీయ జీవతం తొలినాళ్ల నాటి విషయాలను పంచుకున్నారు. అయితే..గడ్కరీ రాజకీయ జీవితం అంతా ఆర్ఎస్ఎస్తో ముడిపడి ఉంది. ఏబీవీపీ నుంచి విద్యార్థి నాయకునిగా మొదలైన ఆయన ప్రస్థానం ఆర్ఎస్ఎస్ విలువలతో రాజకీయ జీవితం ప్రారంభమైంది. పార్టీ కోసం నిజాయితిగా కష్టపడి పనే చేసే కార్యకర్తగా నితిన్ గడ్కరీ మంచి పేరు సంపాదించుకున్నారు. 'మనదేశ ప్రజాస్వామ్య చరిత్రను మర్చిపోవద్దు. గతం నుంచి మనం నేర్చుకోవాలి. కాంగ్రెస్ గత 60 ఏళ్లలో గరీబి హఠావో అనే నినాదాన్ని ఇచ్చింది. కానీ నెరవేర్చలేకపోయింది. స్వప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసింది.'అని గడ్కరీ అన్నారు. దేశాన్ని అసలైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంలో ప్రధాని మోదీ సఫలుడయ్యాడని కొనియాడారు. ఇదీ చదవండి:ఉద్రిక్తతలకు దారితీసిన దర్గా కూల్చివేత.. పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు.. -
బావిలో భారీ కొండచిలువ
సాక్షి, హన్మకొండ: మంచినీటి బావిలో భారీ కొండచిలువ కనిపించడంతో నీటి కోసం వచ్చిన మహిళలు హడలిపోయారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. రోజు మాదిరిగానే ఉదయం తాగునీటిని తెచ్చుకోవడానికి మంచినీటి బావి వద్దకు వెళ్లి మహిళలకు అందులో అతిపెద్ద కొండచిలువ కనిపించింది. దీంతో మహిళలు భయబ్రాంతులై కేకలు వేయడంతో స్థానిక సర్పంచ్ అబ్బు ప్రకాశ్‌రెడ్డి చేరుకుని అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు మూడున్నర మీటర్ల పొడవున్న కొండచిలువను పట్టుకుని అడవిలో వదిలేశారు. చదవండి: వెనక్కి తగ్గిన బీజేపీ.. కేసీఆర్ వైఫల్యాలపై రివర్స్ అటాక్ కు ‘నో’ -
తల్లి కోసం భగీరథుడిలా.. ఆ 14 ఏళ్ల బాలుడు..
తల్లి కష్టం చూసి చలించిపోయి 14 ఏళ్ల బాలుడు భగీరథుడిలా శ్రమించి.. నీటిని రప్పించాడు. ఆ ప్రాంతం కరువుకు ప్రసిద్ధి. ఎండాకాలం వచ్చేటప్పటికీ నీటి సంక్షోభంతో అల్లాడుతుంటుంది. అలాంటి చోట తన తల్లి పడుతున్న నీటి కష్టాన్ని దూరం చేయాలని ఓ బాలుడు సంకల్పించాడు. అనుకున్నది సాధించి ఆ ప్రాంతంలో సెలబ్రెటీగా మారిపోయాడు. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని కెల్వె గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల ప్రణవ్ అనే బాలుడు తన తల్లి కోసం వయసుకు మించిన సాహసం చేశాడు. అతను చేసిన పనితో ఒక్కసారిగా తన ఊరిలో హీరోగా మారిపోయాడు. ప్రణవ్ తల్లి దర్శన నీటి కోసం రోజు ఎంతో ప్రయాస పడి నది వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఈ కష్టాన్ని ఎలాగైనా తీర్చాలని నిర్ణయిచుకున్నాడు. అనుకున్నదే తడువుగా బావి ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. అందుకోసం భూమిని తవ్వడం ప్రారంభించాడు. రోజుకి కేవలం 15 నిమిషాలు మాత్రమే భోజనానికి బ్రేక్ తీసుకునేవాడని ప్రణవ్ తండ్రి వినాయక్ చెబుతున్నాడు. తాను ఒక్కడినే తన కొడుకు సాయం చేసేవాడినని, ప్రణవ్ తవ్వుతుంటే రాళ్లను తొలగించడం వంటివి చేసేవాడినని చెప్పుకొచ్చాడు. ఎట్టకేలకు ప్రణవ్ ప్రయత్నం చూసి గంగమ్మ రకలేసుకుంటూ భూమి నుంచి ఉబికి వచ్చింది. ఇక ప్రణవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొత్తం ఐదు రోజుల్లో పని పూర్తి చేశాడు ప్రణవ్. ఇక మా అమ్మ రోజు ఉదయం నీళ్ల కోసం బకెట్లు, బిందెలతో అంతదూరం నుంచి నీళ్లు తీసుకురావాల్సిన కష్టం తప్పిందని ప్రణవ్ సంబరంగా చెప్పాడు. తల్లి కోసం ఓ బాలుడు బావిని తవ్వాడన్న విషయం గ్రామమంతా దావానంలా వ్యాపించడంతో.. ఆ ఊరి ప్రజలు, ప్రణవ్ స్నేహితులు ఆ బావిని చూసేందుకు తండోపతండాలు తరలి వచ్చారు. బావిని చూసేందుకు తన టీచర్ స్వయంగా తన ఇల్లుని వెతుక్కుంటూ వచ్చినట్లు ఆనందంగా చెబుతున్నాడు ప్రణవ్. అంతేగాదు ప్రణవ్ పడిన కష్టాన్ని వివరించేలా బావి వద్ద బోర్డుని కూడా ఏర్పాటు చేశారు అతని స్నేహితులు. వాస్తవానికి మహారాష్ట్రాలోని ఓ మారుమూల ప్రాంతమైన కెల్వె గ్రామం సరైన నీటి వసుతులు లేవు. ఆ గ్రామంలోని ప్రజలందరికీ సమీపంలో ఉన్న నదే ఆధారం. మిగతా మహిళల తోపాటు తన తల్లి పడుతున్న కష్టమే ప్రణవ్‌ని ఈ సాహసానికి పురిగొల్పింది. కాగా, అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. #WATCH | Palghar, Maharashtra: Distressed upon seeing his mother walk every day in the sun to fetch water for the house, 14-year-old Pranav Salkar dug a well in his front yard with the help of his father. The family lives in Dhavange Pada near Kelve. Pranav's parents, Darshana… pic.twitter.com/H5WzkbzGIs — ANI (@ANI) May 23, 2023 (చదవండి: 'మా స్టాండ్‌ని వదిలిపెట్టం'! అందుకు మూల్యం చెల్లించేందుకు రెడీ: శరద్ పవార్) -
తండ్రి కొడుకులను మింగిన కొత్త బావి
సాక్షి,సిరికొండ (బోథ్): వ్యవసాయం కోసం చేనులో తవ్వుకున్న బావి తమకే మృత్యుకుహరం అవుతుందని ఊహించలేదు ఆ కుటుంబం. కొత్తగా తవ్వుకున్న బావి పూజ కోసం వెళ్లి అందులో ప్రమాదవశాత్తుపడి తండ్రీ కొడుకులిద్దరూ మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పోచంపల్లి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇంటి పెద్దతో పాటు కుమారుడు సైతం దూరం కావడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాడావి సోనేరావ్ (46) తన చేనులో కొద్ది రోజుల క్రితం బావిని తవ్వించాడు. అందులో నీళ్లు పుష్కలంగా రావడంతో సంతోషపడ్డాడు. శుక్రవారం తన చిన్న కూతురు శైలజతో కలసి పూజ చేద్దామని బావి వద్దకు వెళ్లాడు. నీళ్లు తెచ్చేందుకు ఓ చెంబుతో బావిలోకి దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడ్డాడు. ఇది గమనించిన కూతురు వెంటనే గ్రామంలోని ఇంటి వద్దకు వెళ్లి తన రెండో అన్న సూర్యభాన్ (20)కు ఈ విషయం చెప్పింది. వెంటనే అతడు అక్కడికి వచ్చి తండ్రిని కాపాడేందుకు బావిలోకి దూకాడు. నీళ్లు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ మునిగిపోయారు. గ్రామస్తులు వచ్చి వారిని బయటకు తీసేసరికి అప్పటికే మృతి చెందారు. సోనేరావ్‌కు ముగ్గురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. -
ఓయూలో మెట్ల బావిని బాగు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి
-
రైల్వేలో పురాతన బావుల పునరుద్ధరణపై ప్రధాని ప్రశంస
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: సికింద్రాబాద్ మౌలాలీలోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (జడ్‌ఆర్‌టీఐ)లో ఉన్న 200 ఏళ్ల నాటి వారసత్వ బావిని పునరుద్ధరించడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతోషం వ్యక్తంచేశారు. నీటి సంరక్షణ, నీటి వనరుల పునరుద్ధరణ కోసం దక్షిణ మధ్య రైల్వే చేసిన కృషి అభినందనీయమని ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. ‘హరిత కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ సికింద్రాబాద్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోని 200 ఏళ్లనాటి వారసత్వ బావి పునరుద్ధరించారు. నీటి సంరక్షణ సులభతరం చేయడానికి దాని చుట్టూ రెయిన్వాటర్ హార్వెస్టింగ్ పిట్లను నిర్మించారు’ అన్న రైల్వేశాఖ ట్వీట్‌పై ప్రధాని మోదీ స్పందించారు. దీనివల్ల నీటివనరులను కాపాడుకునేందుకు, సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రూ.6 లక్షలతో దక్షిణ మధ్య రైల్వే ఈ బావి పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టింది. దీనివల్ల రూ.5 లక్షల వరకు ఆదా అవుతుందని అంచనా. సుమారు 50 అడుగుల లోతు ఉన్న ఈ హెరిటేజ్ బావి రోజుకు 1 లక్ష లీటర్ల నీటిని అందజేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ వారసత్వ మెట్ల బావి 200 ఏళ్ల నాటిది. నిజాం కాలంనాటి ఈ బావికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. సర్ మీర్ తురాబ్ అలీఖాన్, సాలార్జంగ్–1 (1829–1883) దీన్ని మామిడి తోటలకు కావాల్సిన నీటికోసం నిర్మించారు. నీటిపారుదల సిబ్బంది నివాసం కోసం బావికి ఉత్తరం వైపు ప్రత్యేకంగా 10 గదులను నిర్మించారు. 1966లో ఈ బావి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చింది. -
బావిలో పడిపోయి.. మృత్యువుతో పోరాడి
మానకొండూర్: మతిస్థిమితం లేక నడుస్తూ అదుపుతప్పి బావిలో పడిపోయిన ఒక వృద్ధురాలిని అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ సంజీవ్‌నగర్ కాలనీలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. మండల కేంద్రానికి చెందిన ఉండింటి మధునమ్మ (80)కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యులతో నివసిస్తున్న ఆమె.. మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో నిద్రలేచింది. అలాగే నడుస్తూ సమీపంలోని చేదబావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. బావిలోని బోర్‌మోటార్ పైపును పట్టుకొని అలాగే ఉండిపోయింది. ఉదయం 4.30 గంటల సమయంలో నిద్ర లేచిన ఓ మహిళకు బావిలోంచి వృద్ధురాలి అరుపులు వినిపించడంతో ఆమె సమీపంలోని వారికి చెప్పింది. వెంటనే స్థానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. మధునమ్మ కుమారుడు రవి అందించిన సమాచారంతో మానకొండూర్ అగ్నిమాపక శాఖాధికారి భూదయ్య, లీడింగ్ ఫైర్‌మన్ ధర్మ్, ఫైర్‌మన్ పి.సంతోష్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. లీడింగ్ ఫైర్‌మన్ ధర్మ్ చేదబావిలోకి దిగి వృద్ధురాలిని ఉదయం 6.30 గంటల సమయంలో క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. సుమారు మూడు గంటలపాటు చేదబావిలో ఉన్న వృద్ధురాలు ప్రాణాలతో బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
నాసిక్: బావిలో పడిపోయిన రెండు చిరుతలు
-
నాలుగు వందల ఏళ్ల బావితో పెనవేసుకున్న బంధం ఇది!
సందుకో వాటర్ ప్లాంట్.. కూల్‌డ్రింక్ దుకాణాల్లోనూ వాటర్ ప్యాకెట్లు.. బ్రాండెడ్ కంపెనీ బాటిల్ కొని నీళ్లు తాగనిదే కొందరికి గొంతు తడారదు. ఎక్కడికెళ్లినా వాటర్ క్యాన్లను వెంట పెట్టుకుని వెళ్తున్న జనం కోకొల్లలు. ‘స్వచ్ఛత’ ముసుగులో నీటి వ్యాపారం ‘కోట్లు’ దాటుతోంది. ఇలాంటి ఈ రోజుల్లోనూ ఆ ఊరి జనానికి ఓ బావి నీరు అమృతంతో సమానం. ఊళ్లో వాటర్ ప్లాంట్లు ఉన్నా, ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించినా.. ఆ నీటితోనే గొంతు తడుపుకోవడం చూస్తే ఆ గ్రామానికి బావితో ఉన్న అనుబంధం ఇట్టే అర్థమవుతుంది. ఆలూరు రూరల్(కర్నూలు జిల్లా): పట్టణాల సంగతి పక్కనపెడితే.. వాటర్‌ప్లాంట్ కనిపించని గ్రామం ఉండదంటే అతిశయోక్తి కాదు. పక్కనే వాగులు, వంకలు పారుతున్నా.. సెలయేళ్లు ఉరుకుతున్నా.. బావులు అందుబాటులో ఉన్నా.. ఇప్పుడు అందరి అడుగులు వాటర్‌ప్లాంట్ వద్దే ఆగుతున్నాయి. ఐఎస్ఐ మార్కు లేకపోయినా, మినరల్స్ ఏస్థాయిలో ఉంటున్నాయో తెలియకపోయినా.. ప్లాంట్ ముందు ఏర్పాటు చేసిన కుళాయి ముందు బిందెలు బారులు తీరుతున్నాయి. ఐదు, పది రూపాయలు.. మరికొన్ని చోట్ల 20 రూపాయలు వెచ్చించి కూడా కొనుగోలు చేస్తున్నారు. ప్రకృతి సహజసిద్ధంగా లభ్యమవుతున్న నీటిని కాదని.. కోరి మరీ రోగాలను కొంటున్నారు. అయితే మండలంలోని మొలగవల్లి గ్రామం ఇప్పటికీ బావి నీటితోనే దాహం తీర్చుకుంటోంది. మినరల్ వాటర్ ప్లాంట్లు ఈ గ్రామంలోకి అడుగుపెట్టినా.. తాగునీరు మాత్రం ప్రతి ఇంటికీ ఈ బావి నీరు ఉండాల్సిందే. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు శతాబ్దాలుగా ఈ బావి ప్రతి ఇంటికి అమృతం అందిస్తోంది. ఆ బావి నీళ్లే మినరల్ వాటర్ గ్రామంలో రెండు రోజులకు ఒకసారి తాగునీటి సరఫరా ఉంది. నాలుగు ఓహెచ్‌ఆర్ ట్యాంకులు నిర్మించారు. 7వేల వరకు ఇంటింటి కొళాయి కనెక్షన్లు ఉన్నాయి. మినరల్ వాటర్ ప్లాంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ గ్రామస్తులు తాగునీటికి మాత్రం ఆ బావి నీళ్లనే వినియోగిస్తున్నారు. రోజు ఈ నీటిని తాగుతున్న స్థానికులు ఏదైనా పని మీద ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడి నీరు తాగితే ఒళ్లు నొప్పులు, అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతారు. ఇక ప్రధానంగా అన్నం, పప్పు వండటానికి ఈ నీళ్లు అయితే బాగా ఉడుకుతాయని, ఇతర ఏ నీళ్లు అయినా సరిగా ఉడకవని, తిన్నట్లుగా కూడా ఉండదంటారు. పెద్దబావిలోనే.. చేదుడు బావి.. నాలుగు వందల ఏళ్ల క్రితం మొలగవల్లి గ్రామంలోని చెరువు పక్కన గ్రామస్తుల తాగునీటి అవసరాలకు ఓ పెద్ద బావి నిర్మించారు. దాదాపు రెండు వందల ఏళ్ల తర్వాత బావిలో నీరు ఇంకిపోవడంతో అప్పట్లో గ్రామస్తులు చిప్పలతో నీళ్లను తోడుకునే వారని వయసు మళ్లిన వాళ్లు చెబుతుంటారు. తాగునీటి ఇబ్బందుల దృష్ట్యా వందేళ్ల క్రితం పెద్ద బావిలోనే స్థానికులు మరో చేదుడు బావిని తవ్వుకున్నారు. చిన్న బావి నిర్మించుకున్న తర్వాత ఎనిమిదేళ్ల క్రితం నీటిని బయటికి తోడి పెద్దబావిలో పూడిక తొలగించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వారానికి ఒకసారి తాగునీటి బావిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుతుంటారు. శుభకార్యాల వేళ గ్రామస్తులు పెద్దబావి వద్దకు వెళ్లి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పెద్దబాయి నీళ్లు అమృతంతో సమానం నా వయసు 76ఏళ్లు. మా అవ్వతాతల కాలం నుంచి మాకు ఈ బాయి నీళ్లు అమృతంతో సమానం. బయటి నీళ్లు తాగితే కాళ్ల నొప్పులు, దగ్గు, పడిశం వస్తుంది. ఇంక వంట చేయనీక ఈ నీళ్లు అయితేనే బ్యాళ్లు, బియ్యం బాగా ఉడుకుతాయి. మా ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా గంగమ్మకు పూజలు చేయాల్సిందే. – గౌరమ్మ, వృద్ధురాలు, మొలగవల్లి బయటి నీళ్లు తాగితే అనారోగ్యం గ్రామంలో వాటర్ప్లాంట్లు పెట్టినా, కుళాయిలు ఉన్నా మాకు ఈ బావి నీళ్లు తాగితేనే గొంతు తడారుతుంది. మినరల్ వాటర్ కన్నా ఈ నీళ్లు ఎంతో రుచిగా ఉంటాయి. బయటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి నీళ్లు తాగితే ఒంట్లో ఏదో ఒక సమస్య వస్తుంది. గ్రామానికి సరఫరా అవుతున్న నీటిని ఇంటి అవసరాలకు వినియోగిస్తాం. – శ్రీరాములు, మొలగవల్లి బావితో మాకు ఎంతో అనుబంధం మా తాతల కాలం నుంచి ఈ బావితో మాకు అనుబంధం ఉంది. బయటి ప్రాంతాల్లో చిన్న వయస్సుకే మోకాళ్ల నొప్పులు, ఆ రోగం, ఈ రోగం అంటుంటారు. మాకు మాత్రం ఈ నీళ్లు తాగితే ఏ నొప్పులు ఉండవు. వ్యాపారం కోసం మినరల్ వాటర్ప్లాంట్లు ఏర్పాటు చేసినా మేము మాత్రం బావి దగ్గరకు పోయి నీళ్లు తెచ్చుకునేందుకే ఇష్టపడతాం. – రామాంజినేయులు, మొలగవల్లి -
షాకింగ్ వీడియో: ఆడుకుంటూ బావిలో పడ్డ బాలుడు.. మూడు నిమిషాల్లోనే!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలుడు అదుపుతప్పి బావిలో పడిపోయాడు. స్నేహితుడు బావిలో పడటాన్ని గమనించిన తోటి బాలుడు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన ఓ వ్యక్తి బావిలోకి దిగి మూడు నిమిషాల్లోనే పిల్లాడిని కాపాడాడు. పెద్ద ప్రమాదం నుంచి చిన్నారి తృటిలో బయటపడ్డాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. వివరాలు.. దామో జిల్లాలో పవన్ జైన్ అనే పదేళ్ల బాలుడు సోమవారం సాయత్రం స్నేహితులతో కలిసి ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. అలా ఆడుతూ బావిపై కప్పి ఉంచిన గేటు అంచు మీద నడిచాడు. దీంతో ప్రమాదవశాత్తు 40 అడుగులో లోతైన బావిలో పడిపోయాడు. స్నేహితుడు బావిలో పడటాన్ని పక్కనే సైకిల్ తొక్కుతున్న మరో బాలుడు గమనించాడు. వెంటనే బావి వద్దకు పరుగెత్తుకెళ్లి తొంగి చూసి సాయం కోసం గట్టిగా కేకలు వేశాడు. పిల్లల రోదనలు విన్న కుటుంబ సభ్యులతో సహా పలువురు ఇంట్లో నుంచి బావి వద్దకు పరుగులు తీశారు. వేగంగా స్పందించిన ఇంటి యాజమాని.. తాడు సాయంతో బావిలోకి దిగి బాలుడిని రక్షించే ప్రయత్నం చేశాడు. బావిలో పడిన చిన్నారిని కేవలం నిమిషాల వ్యవధిలోనే క్షేమంగా బయటకు తీశారు. బాలుడు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నాడని, అతనికి ఎటువంటి గాయాలు కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: 'కరోనా రూల్స్ పాటించాలి.. లేదా భారత్ జోడో యాత్రను ఆపాలి..' घर के आंगन में अगर कुआं या टंकी बनी हुई है तो इस वीडियो को जरूर देखें।#damoh #MadhyaPradesh pic.twitter.com/ntVMBiWgqE — Makarand Kale (@makarandkale) December 21, 2022 -
కరీంనగర్ : స్కూల్ లోని బావిలో పడి విద్యార్ధి మృతి
-
దట్టమైన అడవిలో 350 ఏళ్లనాటి దిగుడు బావి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే
సాక్షి, తెనాలి(గుంటూరు జిల్లా): అది బావి మాత్రమే కాదు.. ఓ ఇంజనీరింగ్ అద్భుతం.. మన వాళ్ల ప్రతిభకు తార్కాణం.. ప్రకాశం జిల్లాలోని మైలచర్ల అటవీ ప్రాంతంలో ఉన్న ఆ దిగుడు బావిని చూస్తే.. ఎవరైనా ఔరా అనాల్సిందే. అంత అత్యద్భుతంగా ఉంటుంది దాని నిర్మాణ కౌశలం. లేత గోధుమ రంగు గ్రానైట్ రాళ్లను అందంగా చెక్కి ఆ బావిని నిర్మించారు. తెనాలికి చెందిన ఔత్సాహిక పురావస్తు పరిశోధక బృందం చిట్టడవిలో ప్రయాణించి మరీ ఈ అందమైన దిగుడు బావిని వెలుగులోకి తెచ్చింది. ఆ విశేషాలను ‘సాక్షి’కి వెల్లడించింది. ఆ బావి మెట్లు.. కనికట్టు! ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి 109 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైలచర్ల అటవీగ్రామం వెలుపల ఉందీ దిగుడు బావి. తెనాలికి చెందిన ఔత్సాహిక పురావస్తు పరిశోధకులైన మొవ్వ మల్లికార్జునరావు, చిట్టినేని సాంబశివరావు, బోడపాటి రాఘవయ్య, ముత్తేవి రవీంద్రనాథ్‌లు ఈ బావి గురించి సూచాయిగా విన్నారు. దీంతో ఆ బావిని సందర్శించాలన్న కోరిక వారికి కలిగింది. గత నెలాఖరులో అక్కడకు ప్రయాణం కట్టారు. చంద్రశేఖరపురం మండలంలోని వేట్ల బయలు(వి.బైలు) అనే గ్రామ పంచాయతీ శివారు గ్రామమైన మైలచర్లకు చేరుకున్నారు. అక్కడి నుంచి చిట్టడవిలో కొంత దూరం ప్రయాణించాక వెలుగుచూసింది.. ఆ అద్భుతమైన బావి. ఆ మెట్ల బావి డిజైన్, అనితర సాధ్యమైన నైపుణ్యంతో రూపొందించిన తీరు అద్భుతమని రవీంద్రనాథ్ బృందం చెప్పింది. ఊటబావి చుట్టూ పటిష్టంగా నిర్మించిన రాతి కూర్పు కారణంగా గట్టు నుంచి మట్టి పెళ్లలు విరిగిపడి నీరు కలుషితమయ్యే అవకాశమే లేదు. పటిష్టంగా నిర్మించిన రాతి మెట్ల కారణంగా చివరివరకు కిందికి దిగి శుభ్రమైన మంచినీటిని తీసుకెళ్లే వీలు గ్రామీణులకు లభించింది. ప్రస్తుతం నీరు కొద్దిగా మురికిగా ఉన్నా.. తీయదనాన్ని కోల్పోకపోవడం విశేషం. ఇప్పుడు పరిస్థితి కొంతమేర ఆశాజనకంగానే ఉన్నా.. గతంలో తరచూ దుర్భిక్షం తాండవించే ప్రాంతం అది. బిందెడు మంచినీటి కోసం సుదూర గ్రామాల ప్రజలు మైలచర్ల అటవీ ప్రాంతంలోని సహజసిద్ధమైన మంచినీటి ఊట దగ్గరకు వచ్చేవారట. ‘గండి సోదరుల’ అద్భుత సృష్టి భైరవకోన గుహాలయాల్లో క్రీ.శ 1675 ప్రాంతంలో నివసించిన ఒక సాధువు.. ఆ ప్రాంత ప్రజల తాగునీటి ఇక్కట్లను గమనించి పరిష్కారాన్ని ఆలోచించారు. మైలచర్ల నీటి ఊట దగ్గర ఒక సౌకర్యవంతమైన దిగుడు బావిని నిర్మించాలని తన శిష్యులైన ‘గండి సోదరులు’గా ప్రసిద్ధులైన పశువుల పెంపకందార్లను ఆదేశించడంతో ఈ బావిని వారు నిర్మించినట్టు స్థానికులు చెబుతున్నారు. చదవండి: కుప్పం టీడీపీ కోట కూలడానికి కారణం ఇదేనా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు? -
5న కోనేరు బావి ప్రారంభోత్సవం
బన్సీలాల్‌పేట్: బన్సీలాల్‌పేట్‌లోని చరిత్రాత్మక కోనేరు(మెట్ల)బావిని ఈ నెల 5న ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం ఆయన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, స్ధానిక కార్పొరేటర్ కె.హేమలత, తలసాని సాయికిరణ్ యాదవ్, పవన్‌కుమార్ గౌడ్‌లతోపాటు వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో కలిసి కోనేరు బావిని సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ ఈ నెల 5న సోమవారం సాయంత్రం మంత్రి కేటీఆర్ కోనేరు బావిని ప్రారంభిస్తారని తెలిపారు. చారిత్రక కట్టడాలను పరిరక్షించి భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగానే కేటీఆర్ ప్రత్యేక చొరవతో హెచ్ఎండీఏ అధ్వర్యంలో బన్సీలాల్‌పేట్ కోనేరు బావి రూపురేఖలు మార్చి వెలుగులోకి తెచ్చినట్లు చెప్పారు. కోనేరు బావిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో పరిసరాలను అందంగా తీర్చిదిద్దామన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కల్పన, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ అనిల్‌రాజ్, ఈఈ సుదర్శన్, జలమండలి జీఎం రమణారెడ్డి, విద్యుత్ శాఖ డీఈ శ్రీధర్, రాఘవేంద్ర, డీఈ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణం తీసిన ‘ట్రెజర్ హంట్’.. బావిలో పడేసిన వస్తువును..
ధారూరు: ‘ట్రెజర్ హంట్’ఓ పర్యాటకుని ప్రాణం తీసింది. బావిలో పడేసిన వస్తువును బయటకు తీయడమే ఈ ఆట ఉద్దేశం. 35 ఏళ్ల వివాహితుడు ఈ సాహసానికి ఒడిగట్టి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధారూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం జరిగింది. సీఐ తిరుపతిరాజు కథనం ప్రకారం.. హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్ మూన్లైట్ క్యాంపింగ్ గోదంగూడలో ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సికింద్రాబాద్ వాసి సీఎల్పీ సాయికుమార్(35) నలుగురు మిత్రులతో కలిసి శనివారం ఈ మూన్లైట్ క్యాంపింగ్‌కు వచ్చాడు. మిత్రులంతా కలిసి సాహసోపేతమైన గేమ్ ఆడాలనుకున్నారు. నిర్వాహకుల అనుమతి తీసుకుని.. 30 అడుగుల లోతున్న వ్యవసాయ బావిలో ‘ట్రెజర్ హంట్’ఆడాలని నిర్ణయించారు. బావిలోకి ఓ వస్తువును వదిలిపెట్టి, దాన్ని తీసుకొచ్చే టాస్క్ పెట్టారు. ఆ వస్తువును తీయడానికి సాయికుమార్ బావిలోకి దూకాడు. ఈ దృశ్యాన్ని మిత్రులు వీడియో తీస్తున్నారు. నీటిలో ఊపిరి ఆడక ఓ సారి పైకి వచ్చిన సాయికుమార్ రెండోసారి ప్రయత్నించి బయటికి రాలేదు. మిత్రులు అతనిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు బావిలో గాలించి సాయికుమార్‌ను బయటికి తీశారు. 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సాయికుమార్ మృతి చెందినట్లు నిర్ధారించారు. బంధువు వింధ్య ఫిర్యాదు మేరకు హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్ నిర్వాహకుడు కార్తీక్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తిరుపతిరాజు తెలిపారు. సాయికుమార్‌కు భార్య వినీత, రెండేళ్ల కూతురు ఉంది. -
కన్నతల్లీ కర్కోటకురాలు
మండ్య: మానవత్వం లేని మహిళ అప్పుడే పుట్టిన నవజాత శిశువు (మగ)ను 30 అడుగుల లోతులో ఉన్న పాడుబడిన బావిలో పారవేసిన దారుణ ఘటన జిల్లాలోని పాండవపుర తాలూకా చంద్రె గ్రామంలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని శిశువును సంరక్షించారు. అనంతరం పాండవపుర పట్టణ ఆస్పత్రికి తరలించగా అక్కడ ఉన్న ఓ మహిళ చనుబాలు ఇచ్చి అమ్మతనం చాటుకుంది. శిశువును చీమలు కరవడంతో మెరుగైన చికిత్స కోసం మండ్య మిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఇన్చార్జ్ మంత్రి గోపాలయ్య మిమ్స్ ఆస్పత్రికి చేరుకుని శిశువును పరిశీలించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ఉత్తమ వైద్యం అందివ్వాలని జిల్లా అధికారి అశ్వతికి సూచించారు. (చదవండి: ఆడపిల్లను కన్నావు... అదనపు కట్నం తెస్తేనే సంసారం) -
అవమాన భారంతో ఉపాధ్యాయుని ఆత్మహత్య
తాంసి (బోథ్): అవమాన భారం భరించలేక ఒక ఉపాధ్యాయుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం గోట్కూరి గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తాటి విలాస్ (45) మావల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధు లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన నూతన పాఠ్యపుస్తకాలకు కవర్లు వేయని విద్యార్థులను ఆయన నిలదీయగా వారు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపా రు. దీంతో వారు మర్నాడు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయు డిని ప్రశ్నించగా.. అడగడం నిజమేనని ఆయన అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో ఈనెల 18న గ్రామానికి చెందిన నిజనపురి శ్రీకాంత్ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడు తాటి విలాస్‌పై ఇదే విషయమై భౌతికంగా దాడి చేశాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఉపాధ్యాయుడు గురువారం ఇంటికి వచ్చి అర్ధరాత్రి సమయంలో గ్రామ సమీపంలోని వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ కేశవస్వామి తెలిపారు. -
70 ఏళ్లుగా ఉండేది.. బావి కనపడుట లేదని పోలీసులకు ఫిర్యాదు
సాక్క్షి, చెన్నై: ఓ సినిమాలో నటుడు వడివేలు తమ ప్రాంతంలో బావి కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. పోలీసులు కేసు నమోదు చేసి వెతికి పెడతామంటారు. సరిగ్గా అలాంటి సన్నివేశాన్ని తలపించే ఘటన మధుర వాయిల్ మార్కెట్ వెనక ఉన్న భారతీయ వీధిలో జరిగింది. తమ ప్రాంతంలోని బావి కనిపించడం లేదంటూ స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. మధుర వాయిల్ మార్కెట్ వెనక ఉన్న వీధిలో మండలం 144లో సర్వే నంబర్ 113ఏ, 114ఏ/2ఏ లో 70 ఏళ్లుగా బావి ఉండేదని, దానిని ప్రజలు ఉపయోగించుకునేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ బావి కనబడలేదని, అదృశ్యమైందని, ఆ బావిని కనిపెట్టాలని అయ్యప్పకం ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త దేవేంద్రన్, మధుర వాయిల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ప్రాణం పోయింది... పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు!
పెబ్బేరు: ఉన్న ఒక్కగానొక్క కొడుకు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతాడని ఆ తల్లిదండ్రులు ఆశ పడ్డారు. కానీ 16ఏళ్ల ప్రాయంలోనే కొడుకు అర్ధాంతరంగా కన్నుమూశాడు. తాజాగా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడ వ్వడంతో కుటుంబం కంటికి పుట్టెడుగా శోకిస్తోంది. వివరాల్లోకి వెళ్తే... జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని చిన్నతాండ్రపాడుకు చెందిన చంద్రకళ, కుర్వ ఆంజనేయులు దంపతులు బతుకుదెరువు నిమిత్తం 20 ఏళ్లకిందట పెబ్బేరుకు వచ్చి స్థిరపడ్డారు. వీరికి కొడుకు రాకేష్(16), కూతురు నందిని. ఇద్దరు పిల్లలను స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. పక్షవాతానికి గురైన తండ్రి ఆంజనేయులు కొన్ని నెలలుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. రాకేష్ ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాశాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్న అతను.. జూన్ 19న తోటి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి, బావిలోపడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కాగా గురువారం విడుదలైన పదోతరగతి ఫలితాల్లో 8.8 జీపీఏ సాధించాడు. కొడుకు పాసైనట్లుగా తెలుసు కున్న తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అతడిని గుర్తు తెచ్చుకుని కన్నీరు మున్నీరయ్యారు. -
శభాష్... స్నితికా!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: బావిలో పడిపోయి ఆరు గంటలు అల్లాడిన ఓ పిల్లి పిల్లను ఓ బాలిక సమయస్ఫూర్తి, దయాగుణం రక్షించాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఆదివారం సాయంత్రం ఓ ఇంటిలోని బావిలో పిల్లి పడింది. అక్కడే ఆడుకుంటున్న స్థానిక బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి మనోహర్ పిల్లలు స్నితికా, వేద్ త్రిదామ్నా పిల్లిని కాపాడేందుకు రాత్రి 8.30 గంటల వరకు విఫలయత్నం చేశారు. అయితే పిల్లి పిల్లను కాపాడలేకపోయామన్న బాధ స్నితికాను వెంటాడింది. వెంటనే ఆ బాలిక స్మార్ట్‌ఫోన్ అందుకొని గూగుల్‌లో సెర్చ్ చేసి ‘యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ’ నంబర్ సేకరించింది. పిల్లి పిల్ల దయనీయస్థితిని వివరిస్తూ వారికి వీడియో పంపింది. సొసైటీవారి సూచనల మేరకు పిల్లిపిల్లను కాపాడేందుకు మళ్లీ ప్రయత్నించి విఫలమైంది. ఈలోగా రాత్రి 10.30 గంటలు సమయమైంది. మరోసారి సొసైటీవారికి ఆ విషయం చెప్పింది. సొసైటీ ప్రతినిధులు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణకు ఫోన్ చేసి విషయం చెప్పగా ఆయన ఏసీపీ తుల శ్రీనివాస్‌రావును అప్రమత్తం చేశారు. కానిస్టేబుల్ అంజిరెడ్డి బృందం, ఫైర్ సిబ్బంది రాత్రి 11 గంటలకు స్థలానికి చేరుకుని కేవలం 15 నిమిషాల్లో ఆ పిల్లి పిల్లను కాపాడారు. ఎలాగైనా కాపాడాలనుకున్నా స్నితికా, ఇంటర్ ఫస్టియర్, కరీంనగర్ పిల్లి పిల్ల బావిలో పడి తల్లడిల్లుతుంటే నాకు బాధగా అనిపించింది. ఎలాగైనా దాన్ని కాపాడాలనుకున్నా. యానిమల్ రెస్క్యూ బృందం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి పిల్లిని కాపాడటంతో నా మనసు కుదుటపడింది. (క్లిక్: ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయి.. ఇంటికి చేరిన బాలిక) -
డిగ్రీ విద్యార్థినికి వేధింపులు.. ఇంటికొచ్చిమరీ ప్రేమించాలంటూ గొడవ!
భీమదేవరపల్లి: ప్రేమిస్తున్నానని వెంటపడుతూ, తరచూ ఫోన్లో వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన డిగ్రీ విద్యార్థిని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నమిండ్ల చంద్రమౌళి–విజయ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు శ్వేత (18) డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన మీసాల వంశీ అనే యువకుడు కొన్ని నెలలుగా ప్రేమిస్తున్నా నంటూ వెంటపడుతున్నాడు. ఫోన్లో ఇబ్బందు లకు గురిచేస్తున్నాడు. ఈనెల 24న వంశీతోపాటు అతని స్నేహితుడు మాడ్గల జగదీశ్ ఎవరూలేని సమయంలో శ్వేత ఇంటికి వచ్చి ప్రేమించా లంటూ గొడవ పడ్డారు. అదే సమయంలో తండ్రి చంద్రమౌళి ఇంటికి రావడాన్ని గమనించి వారు వెళ్లిపోయారు. దీంతో మానసిక వేదనకు గురైన శ్వేత శనివారం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు లేని విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో చూడగా అందులో మృతదేహం కనపడింది. మృతురాలి తండ్రి చంద్రమౌళి ఫిర్యాదుతో వంశీ, జగదీశ్‌పై కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు ముల్కనూర్ ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
కసాయి తల్లి...తన ఆరుగుపిల్లల్ని బావిలో పడేసి...
"తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష" అనే చిన్నప్పటి పద్యం మనకు జీవితాంతం అడుగడుగున ఉపకరిస్తుంది. జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు, అవమానాలు, సంఘర్షణల సమయయంలో మనం ఎలా వ్యవహరించాలో తెలుపుతుంది ఈ పద్యం. కోపం అనే చిన్న అవలక్షణం కారణంగా పతనమైపోయిన మహానుభావులు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. క్షణికావేశంతో కోపంలో చేసే పనులు కారణంగా తనను తానే కోల్పోవడం లేదా జీవితాంత ఆవేదనతో బతకడమో జరుగుతుంది. ఎంతో మంది యువత కూడా ఈ ఆగ్రహమనే గ్రహానికి బలైపోతున్నారు. అచ్చం అలనే ఇక్కడో మహిళ క్షణికమైన కోపావేశాలకు గురై తన సంతానాన్ని తానే కడతేర్చింది. వివరాల్లోకెళ్తే....మహారాష్ట్రాలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఓ తల్లి తన సంతానాన్ని తానే చంపుకుంది. కుటుంబ కలహాల కారణంగా తన ఆరుగురు పిల్లల్ని బావిలో పడేసి చంపేసింది. చనిపోయిన ఆ ఆరుగురు చిన్నారుల్లో ఐదుమంది బాలికలే ఉన్నారు. ఈ ఘటన ముంబైకి 100కిలోమీటర్ల దూరంలోని మహద్ తాలూకాలోని ఖరవలి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు 30 ఏళ్ల మహిళ తన భర్త కుటుంబ సభ్యులు తనను దారుణంగా కొట్టడంతో ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు తెలిపారు. చనిపోయిన చిన్నారులంతా 18 నెలల నుంచి 10 ఏళ్ల మధ్య వయసు వారేనని అధికారులు తెలిపారు. (చదవండి: గాయత్రి ఇల్లు కబ్జాకు కుటుంబీకుల యత్నం) -
సాక్షి కథనానికి స్పందన.. 300 ఏళ్ల నాటి మెట్ల బావి.. మెరిసింది చూడు...
సాక్షి, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో గోసాయిమఠం వద్ద ఉన్న 300 ఏళ్లనాటి మెట్లబావి చిత్రాలివి. పిచ్చి మొక్కలు, చెట్లు, చెత్తా చెదారంతో నామరూపాల్లేకుండా పోయిన ఈ బావి (మొదటి చిత్రం) దుస్థితిపై ‘గతమెంతో ఘనచరిత్ర’ శీర్షికన ఫిబ్రవరి 14న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ దీనిపై స్పందించి బావి పునరుద్ధరణ పనులు చేయించడంతో ఎంతో సుందరంగా (రెండో చిత్రం) మారింది. మరమ్మతులకు ముందు, తర్వాత తీసిన ఈ బావి ఫొటోలను అరవింద్‌కుమార్ బుధవారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. ప్రత్యేకతలు ఎన్నో.. మూడు వందల ఏళ్ల కింద.. 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 80 అడుగుల లోతుతో పూర్తిగా రాళ్లతో నిర్మించిన ఈ దిగుడు బావి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. దీనికి తూర్పున, ఉత్తరంలో మెట్లను ఏర్పాటు చేశారు. భూమి నుంచి 25 అడుగుల దిగువన ఆర్చీలతో మూడు గదులు నిర్మించారు. ఈ మెట్లబావిని పునరుద్ధరించడంపై మంత్రి కేటీఆర్, ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌లకు పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దీనిని పర్యాటక ప్రాంతంగా మార్చాలని కోరారు. చదవండి: రైళ్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా!.. ఇకపై ఇట్టే దొరికిపోతారు -
బన్సీలాల్‌పేట్ కోనేరు బావిపై మోదీ ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్/బన్సీలాల్‌పేట: సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట్‌లోని పురాతన బావి పునరుద్ధరణపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. నిజాం కాలం నాటి ఈ బావికి పూర్వవైభవాన్ని తెచ్చారని ఆయన కొనియాడారు. నీటిసంరక్షణ, భూగర్భ జలాలను కాపాడుకొనేందుకు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు చేస్తున్న కృషిని ప్రధాని అభినందించారు. ఆదివారం మన్ కీ బాత్‌లో బన్సీలాల్‌పేట్‌లోని బావి గురించి ఆయన ప్రస్తావించారు. చెత్తా చెదారం, మట్టితో నిండిన ఈ బావిని వాననీటి సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయడం సంతోషదాయకమన్నారు. ఇవీ ప్రత్యేకతలు.. ► సుమారు 1830 కాలానికి చెందిన బన్సీలాల్‌పేట్ బావి అద్భుతమైన శిల్పకళా సంపదను కలిగి ఉంది. బావి ప్రవేశ ద్వారం ఆర్చ్‌లాగా ఉంటుంది. చుట్టూ ఏర్పాటు చేసిన రాతి కట్టడం, సింహాలు, పాములు, గుర్రాల బొమ్మలు అలనాటి కళాత్మకతను సమున్నతంగా ఆవిష్కరిస్తాయి. 35 మీటర్ల వెడల్పు 53 అడుగుల లోతు ఉన్న ఈ బావి చాలా కాలం వరకు ఉనికిని చాటుకుంది. ► 40 ఏళ్ల క్రితం దీనిని పూర్తిగా మూసివేశారు. మట్టి, చెత్తా చెదారంతో నిండిపోయింది. వాహనాలకు పార్కింగ్ అడ్డాగా మారింది. వాననీటి సంరక్షణ కోసం ఉద్యమాన్ని చేపట్టిన ‘ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు’ సంస్థ జీహెచ్ఎంసీ సహకారంతో బావి పునరుద్ధరణకు నడుం కట్టింది. చెత్తా చెదారం తొలగించారు. సుమారు 2 వేల టన్నుల మట్టిని సైతం తొలగించి బావికి పూర్వ ఆకృతిని తెచ్చారు. ప్రస్తుతం ఈ బావి నీటితో తళతళలాడుతోంది. ► దీని చుట్టూ ఏర్పాటు చేసిన రాతి కట్టడాలు, కళాకృతులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి ఆగస్టు నాటికి ఈ ప్రాంగణాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు ‘ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు’ వ్యవస్థాపకులు కల్పన రమేష్ లోకనాథన్ తెలిపారు. ఇప్పటి వరకు పూడికతీత కోసం రూ.30 లక్షల వరకు ఖర్చు చేశారు. అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో బావిని కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. (క్లిక్: నల్సార్ సాహసోపేతమైన నిర్ణయం) పాతబావులకు పూర్వవైభవం... ఇప్పటి వరకు నగరంలో గచ్చిబౌలి, కొండాపూర్, నార్సింగి. కోకాపేట్, బన్సీలాల్‌పేట్ బావులను పునరుద్ధరించారు. బాపూఘాట్ బావి పునరుద్ధరణకు ప్రణాళికలను సిద్ధం చేశారు. నిజాం కాలం నాటి సిటీ కాలేజీ చుట్టూ ఒకప్పుడు 87 బావులు ఉండేవని వాటిలో చాలా వరకు శిథిలమయ్యాయని కల్పన తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న రెండు బావులను మాత్రం పునరుద్ధరించేందుకు అవకాశం ఉంది. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ బావికి పూర్వవైభవంపై ప్రధాని అభినందించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. (క్లిక్: హైదరాబాద్‌లో ఈ ఏరియాలో అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్) -
ఈ ఎంటెక్ కుర్రాడు అపరభగీరథుడు.. స్వయంగా బావిని తవ్వి
సాక్షి, బెంగళూరు: ఎంటెక్ చదివిన కుర్రాడికి సేద్యంపై మనసైంది. తానే యంత్రమై బావి తవ్వి అపరభగీరథుడిగా మారి పాతాళ గంగమ్మను పైకి తీసుకొచ్చాడు. బీదర్ జిల్లా ఔరద్ తాలూకాకు చెందిన సూర్యకాంత్ ప్రైవేటు సంస్థలో పనిచేసేవాడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌తో ఇంటిబాటపట్టాడు. పంటల సాగు చేసేందుకు నీటి కోసం ఒక్కడే తన పొలంలో 12 అడుగుల లోతు, 30 అడుగులు వ్యాసార్ధంతో తవ్వగా నీరు పడింది. సూర్యకాంత్ తవ్విన బావిలోని నీటిని గ్రామస్థులు తాగటానికి ఉపయోగిస్తున్నారు. చదవండి: యువతిపై యాసిడ్ దాడి.. ట్రెండింగ్‌లో యాసిడ్ అటాక్ -
హైదరాబాద్ నగరంలో 17 శతాబ్దం నాటి అరుదైన బావి
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర చరిత్రలోనే ప్రఖ్యాతి గాంచింది బన్సీలాల్‌పేటలోని పురాతన కోనేరు బావి. పదిహేడో శతాబ్దంలో తాగునీటి అవసరాల నిమిత్తం నిర్మించారు. కాలగమనంలో శిథిలావస్థకు చేరుకోవడంతో దీని పునరుద్ధరణకు ప్రభుత్వం నడుం కట్టింది. నగరంలోని పురాతన కట్టడాలను పరిరక్షించి వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ( చదవండి: మూడు రోజులు ఇంటి ఎదుటే మృతదేహం.. గల్ఫ్ నుంచి భర్త రాకతో.. ) సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట్ కోనేరు బావి పునరుద్ధరణ పనులను గురువారం ఆయన మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, సహిత స్వచ్ఛంద సంస్ధ ప్రతినిధి కల్పనా రమేష్‌తో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాలకు పూర్వవైభవం తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. బన్సీలాల్‌పేట్‌లో ఈ ప్రాంత ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి 17వ దశాబ్దంలో కోనేరు బావిని నిర్మించారని, చెత్తాచెదారంతో నిండిన ఈ బావిని పునరుద్ధరించడానికి పనులు ప్రారంభించామన్నారు. ఆగస్టు 15 నాటికి కోనేరు బావి పూర్తిస్ధాయిలో అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అరవింద్‌కుమార్ మాట్లాడుతూ.. కోనేరు బావి సమగ్రాభివృద్ధి కోసం ఇప్పటి వరకు 50 లక్షలు ఖర్చు చేశామని, మరో రూ. కోటి ఖర్చు చేసిన ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత, జలమండలి జీఎం రమణారెడ్డి, విద్యుత్తు శాఖ డీఈ శ్రీధర్ పాల్గొన్నారు. -
కొడిగట్టిన నవ‘దీపం’
అనంతపూర్: ప్రమాదవశాత్తు నీటిలో పడిన బాలుడిని కాపాడబోయి ఓ పండుటాకు రాలిపోయింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ‘నవదీపం’ కొడిగట్టకుండా ప్రాణాలకు తెగింన వృద్ధుడి సాహసమూ గంగ పాలైంది. పెన్నమ్మ ఒడిలో రెండు నిండు ప్రాణాలు శాశ్వతంగా నిద్రపోయాయి. చౌళరు శోకసంద్రమైంది. వివరాలు.. హిందూపురం మండలం చౌళరుకు చెందిన తలారి నరసింహప్ప కువరుడు నవదీప్ (10) స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం పాఠశాల నుం ఇంటికి చేరుకున్న బాలుడు.. తోటి స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని పెన్నానదిలో ఆడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటి గుంతలో పడి పోయాడు. ఆ సమయంలో చిన్నారులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడికి దగ్గరలోనే ఉన్న వృద్ధుడు నరసింహమూర్తి (65) అప్రమత్తమై వెంటనే నీటిలో దిగాడు. నీటిలోపల బాలుడి కోసం గాలిస్త ఊపిరి ఆడక అతను విగతజీవిగా మారాడు. అప్పటికే చిన్నారుల నుంచి సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున పెన్నానదికి చేరుకుని నీటిలో గాలింపు చేపట్టారు. కాసేపటికి వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న హిందూపురం రరల్ పోలీసులు, అగ్నివపక సిబ్బంది, గజ ఈతగాళ్లు అక్కడికి చేరుకుని నీటి గుంతలో గాలింపు చేపట్టారు. రాత్రి 7.30 గంటలకు బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు నెలకొన్నాయి. వృద్ధుడి సాహసం వృథా కావడంపై పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. బాలుడి మృతదేహం కనిపించగానే కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. -
సామూహిక ఆత్మహత్యలు! ఐదుగురు కూతుళ్లతో సహా తల్లి బావిలోకి దూకి..
జైపూర్: భర్తతో నిరంతర తగాదాలతో మనస్తాపం చెందిన ఓ ఇల్లాలు ఐదుగురి కూతుళ్లతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఘటనలో ఆరుగురూ మృతి చెందారు. ఆదివారం ఉదయం గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను వెలికితీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా మృతురాలిని శివలాల్ బన్జారా భార్యగా గుర్తించారు. బాదందేవి (40) ఏడుగురు పిల్లల తల్లి. ఘటనలో బాదందేవితోపాటు సావిత్రి (14), అంకాలీ (8), కాజల్ (6), గుంజన్ (4), అర్చన (ఏడాది వయసు) మృతి చెందగా, మిగతా ఇద్దరు కూతుళ్లు గాయత్రి (15), పూనమ్ (7) నిద్రపోవడంవల్ల తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. దుప్పట్లను విక్రయించే పని చేసే శివలాల్‌కు, భర్య బాదందేవికి తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఐతే సంఘటన సమయంలో శివలాల్ ఇంటివద్దలేనని, బంధువు మృతి చెందితే సంతాపం తెల్పడానికి శనివారం రాత్రి పొరుగూరికి వెళ్లినట్లు తెలిపాడు. సంఘటన గురించి తెలియడంతో ఆదివారం ఉదయం తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఐతే భార్య ఎందుకు చనిపోవాలనుకుందో మాత్రం పోలీసులకు తెల్పలేదు. మృతుల ఇంటికి కేవలం వంద మీటర్ల దూరంలోనే బావి ఉంది. మృతదేహాల పోస్టుమార్టం రిపోర్టు రావల్సి ఉంది. ఈ సంఘటనపై సీఆర్పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నామని ఎస్హెచ్ఓ రాజేంద్ర మీనా మీడియాకు తెలిపారు. చదవండి: మహిళ ఎకౌంట్లో పొరపాటున రూ. 7.7 కోట్లు జమ.. దొంగతనం కేసు! -
టైరు పేలి కారు బావిలోకి.. తల్లీతనయుడి సహా మరొకరి మృతి
దుబ్బాక టౌన్: కారులో ఊరికి బయలుదేరిన తల్లీతనయుడిని విధి వక్రించింది. టైరు పేలడంతో కారు వెళ్లి నిండుగా నీళ్లున్న బావిలో పడిపోయి మృతిచెందారు. వాళ్లను ప్రాణాలతో బయటకు తీయడానికి వెళ్లిన ఓ గజ ఈతగాడు కూడా ఆ కారులోనే నీళ్లలో ఇరుక్కుపోయాడు. విగతజీవిగా మిగిలాడు. ఒకే ప్రమాదం రెండు ఇళ్లల్లో తీవ్ర విషాదం నింపింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. కారు పల్టీలు కొడుతూ.. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకు ఆకుల లక్ష్మి (45), ప్రశాంత్ (26) బుధవారం కారులో హుస్నాబాద్ బయల్దేరారు. చిట్టాపూర్ శివారుకు రాగానే మధ్యాహ్నం 1.13కి కారు టైరు పేలి రోడ్డు పక్కన 20 మీటర్ల దూరంలో ఉన్న బావిలో పడిపోయింది. పెద్ద శబ్దం రావడంతో బైక్‌పై అటుగా వెళ్తున్న వాహనదారుడు వెనక్కి చూసేసరికి కారు పల్టీలు కొడుతూ బావిలో పడింది. అతనితో పాటు మరికొందరు వాహనదారులు వెంటనే భూంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం భూంపల్లి పోలీస్ స్టేషన్‌కు కిలోమీటరు దూరంలోని కూడవెల్లి పెద్ద వాగు దాటాక చిట్టాపూర్ శివారులో ఉంది. మధ్యాహ్నం 2 గంటల్లోపే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. నీళ్లు ఎక్కువగా ఉండటంతో..: పోలీసులు ఫైర్, రెవెన్యూ, విద్యుత్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఏసీపీ చల్లా దేవారెడ్డి కూడా అక్కడకు చేరుకున్నారు. అధికారులు, చిట్టాపూర్ సర్పంచ్ పోతనక రాజయ్య, ఎంపీటీసీ సభ్యుడు కనకయ్య, సమీప రైతులతో బావి వివరాలు సేకరించారు. సుమారు 16 గజాల లోతు బావి పూర్తిగా నీటితో నిండి ఉండటంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు ముందు గజ ఈతగాళ్లతో కలిసి పాతాల గరిగెల (హ్యాంగర్స్)తో గాలింపు చేపట్టారు. కానీ ఫలితం లేదు. నీరు ఎక్కువగా ఉండటంతో రెండు పెద్ద జనరేటర్లు పెట్టి ఎత్తిపోయడం మొదలుపెట్టారు. సాయంత్రం 4 గంటల కల్లా 2 గజాల వరకు నీటినే తోడేయగలిగారు. దీంతో చేగుంట, సిద్దిపేటల నుంచి రెండు భారీ క్రేన్లు తెప్పించారు. వాటి సాయంతో గజ ఈతగాళ్లు మళ్లీ గాలింపు మొదలుపెట్టారు. క్రేన్ల కొండి బావి లోపల ఉన్న కారుకు చిక్కుకున్నా నీరు ఎక్కువగా ఉండటంతో పైకి లేస్తున్న క్రమంలో కొండ్లు జారుతూ ఇబ్బందిగా తయారైంది. నీటిని తోడుతూ.. గాలిస్తూ..: మరో 4 మోటార్లు పెట్టి బావిలోని నీటిని తొలగిస్తూ క్రేన్లతో కారు వెలికితీతను అధికారులు కొనసాగించారు. సుమారు 7 గంటలు శ్రమించి రాత్రి 8.20కి కారును పైకి తీశారు. కారు నుంచి రెండు మృతదేహాలను వెలికి తీశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకు ఆకుల లక్ష్మి, ప్రశాంత్‌గా గుర్తించారు. రాములు లారీ డ్రైవర్ కాగా భార్య లక్ష్మి రోజువారీ పనులకు వెళ్లేది. ప్రశాంత్ ఐటీఐ పూర్తి చేసి రామాయంపేట మండలంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కూతురు రేవతి డైట్ సెట్‌కు ప్రిపేర్ అవుతోంది. కారులో ఇరుక్కుపోయిన గజ ఈతగాడు బావిలోంచి కారు తీసే క్రమంలో దుబ్బాక మండలం ఎనగుర్తికి చెందిన గజ ఈతగాడు బండకాడి నర్సింహులు (40) మృతి చెందాడు. బుధవారం సాయంత్రం 3 గంటలకు తోటి గజ ఈతగాళ్లతో కలిసి నర్సింహులు గాలింపు చర్యల్లో పాల్గొన్నాడు. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో చాలాసార్లు క్రేన్ కొండిని తగిలించేందుకు ప్రయత్నించినా కుదరలేదు. మోటార్లతో రాత్రి 8 గంటల వరకు 5 గజాలకు పైగా నీటిని తోడారు. తర్వాత క్రేన్ కొండిని కారుకు తగిలించేందుకు బావి లోపలికి వెళ్లాడు. కారుకు కొండిని తగిలించి అందులోనే ఇరుక్కుపోయా డు. క్రేన్ సాయంతో కారును పైకి తీస్తుండగా కారుకు, తాళ్లకు మధ్య చిక్కుకొని అపస్మారక స్థితిలో కనిపించాడు. తాళ్లను కొంత పైకి లాగాక ఒక్కసారిగా నీటిలో పడిపోయాడు. అతడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పటివరకు సహాయక చర్యలో ఉన్న గజ ఈతగాళ్లు కూడా వెళ్లిపోయారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే: పోలీసులు, ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నర్సింహులు మృతి చెందాడంటూ అతని కుటుంబీకులు, బంధువులు రామాయంపేట–సిద్దిపేట రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులు బావిలో దిగకుండా ప్రైవేట్ వ్యక్తులను బావిలోకి దింపి చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పురాతన పుష్కరిణి బావిని ప్రారంభించిన కేటీఆర్
లంగర్‌హౌస్: బాపూఘాట్లో పురాతన పుష్కరిణి బావిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. లంగర్‌హౌస్ త్రివేణి సంగంలో బాపూజీ అస్థికలు నిమజ్జనం చేసి బాపూ సమాధి, ధ్యానమందిరం నిర్మించారు. ఈ ప్రాంతంలో ఉన్న పురాతన బావిని జీఎంఎస్ స్వచ్ఛంద సంస్థ పునరుద్ధరించింది. గోడలకు మొలిచిన చెట్లను తొలగించి బావికి మరమ్మతులు చేయించి రంగులు వేశారు. కేటీఆర్ సోమవారం ఈ బావిని ప్రారంభించి, ఇందులో గంగా జలాన్ని, తాబేళ్లను వదిలారు. కార్యక్రమంలో ఆయన వెంట మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్‌లు ఉన్నారు. -
శివాలయం బావిలో 4 నెలల నుంచి వేడి నీళ్లు.. దేవుడి మహిమేనా?
సాక్షి, కేసముద్రం(మహబూబాబాద్): పురాతన శివాలయంలోని చేదబావిలో నీళ్లు వేడెక్కడంతో ప్రజలు పూజలు చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో ఆదివారం చోటుచేసుకుంది. కాకతీయుల కాలంలో గ్రామంలో శివాలయం, ఆలయ ఆవరణలో చేదబావిని రాతికట్టడంతో నిర్మించారు. నిత్యం ఆలయాన్ని శుభ్రం చేసేందుకు వెలిశాల సుగుణమ్మ ఈ బావి నీటినే వినియోగిస్తోంది. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఎప్పటిలాగే బావిలో నీటిని తోడగా.. నీళ్లు బాగావేడిగా ఉండటం గమనించింది. వాటిని ఆలయ ఆవరణలోని పోసి చూడగా పొగలు వచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని స్థానికులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి వచ్చిన పూజారికి చెప్పింది. బావిలో నీరు వేడిగా ఉన్నట్లు గుర్తించిన ఆయన గ్రామపెద్దలకు సమాచారవిచ్చారు. ఒకట్రెండు రోజుల క్రితం విషయం గ్రామస్తులకు తెలియడంతో ఇదంతా దేవుడి మహిమంటూ ఆదివారం ఆలయానికి చేరుకుని బావి వద్ద పూజలు చేశారు. చదవండి: రోగికి ఊపిరి పోస్తుండగా... ఆగిన డాక్టర్ గుండె చుట్టుపక్కలున్న బావిలోని నీటిని, ఈ బావి నీటిని పరిశీలించగా తేడా ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. భూగర్భంలోని పొరల్లో మార్పుల కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని, ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి శాస్త్రవేత్తలతో పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. చదవండి: సినిమా చూసి.. శవాన్ని ముక్కలుచేసి.. -
విషాదం: వద్దురా తమ్ముడు అంటే వినలేదు.. కళ్లముందే ఘోరం..
రణస్థలం: బావిలో స్నానం చేస్తున్న అన్నయ్యను చూసి తాను కూడా బావిలో దిగాలని ప్రయత్నించాడు. ప్రమాదమని అన్నయ్య వారించినా వినలేదు. ఈత రాకపోవడంతో చెట్టుకు చీర కట్టి మరీ బావిలోకి దిగాడు. కొద్ది సమయానికే చీర తెగిపోవడంతో అన్నయ్య కళ్లముందే మునిగిపోయి మృత్యువాతపడ్డాడు. ఈ విషాద ఘటన రణస్థలం మండలం జె.ఆర్.పురం పంచాయతీ గొల్లపేటలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గండమాని లోకేష్(13) అన్నయ్య పవన్‌తో కలిసి గ్రామ సమీపంలోని చెరువు పక్కనే ఉన్న బావి వద్దకు వెళ్లారు. పవన్‌కు ఈత రావడంతో బావిలో దిగి స్నానం చేస్తున్నాడు. తమ్ముడు లోకేష్ కూడా స్నానం చేసేందుకు ప్రయత్నించాడు. అన్నయ్య వద్దని చెప్పిన వినకుండా బావి పక్కనే ఉన్న చిన్న చెట్టుకు చీర కట్టి దిగాడు. కొద్దిసేపటికే చీర తెగిపోవడంతో లోకేష్ మునిగిపోయాడు. తమ్ముడు బావిలో మునిగిపోతున్నాడని పవన్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి బయటకు తీసి 108కి ఫోన్ చేశారు. వారు వచ్చేటప్పటికే లోకేష్ మృతిచెందాడు. తల్లిదండ్రులు సత్యవతి, సోములు కూలి పనులు చేసుకుంటూ కుమారులతో పాటు కుమార్తెను చదివిస్తున్నారు. లోకేష్ చనిపోవడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు రాలేదని జె.ఆర్.పురం ఎస్సై జి.రాజేష్ తెలిపారు. (చదవండి: బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి) -
జమ్మికుంటలో విషాదం: పోలీస్ సైరన్ విని.. పరిగెత్తి
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): పోలీస్ సైరన్ ఓ వ్యక్తిని మృత్యుఒడికి చేర్చింది. రాత్రి సమయంలో స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా సైరన్ వినిపించడంతో పరిగెత్తి, ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ప్రకారం.. మోత్కులగూడెంకు చెందిన పొన గంటి వేణు(34) జమ్మికుంట మున్సిపాలిటీ పరిధి లోని దుర్గా కాలనీలో ఉంటున్నాడు. ఇతనికి భార్య స్వాతి, ఆరేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు అద్విక, కృత్రిక ఉన్నారు. వేణు ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ పని చేస్తున్నాడు. దీంతోపాటు తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి తన ముగ్గురు స్నేహితులతో కలిసి, జమ్మికుంట ప్రధాన రహదారికి సమీపంలోని ఓ రెస్టారెంట్ ఎదురుగా మద్యం తాగుతున్నాడు. పెట్రోలింగ్ చే స్తున్న పోలీసులు సైరన్ మోగించడంతో నలుగురు నాలుగు దిక్కులకు పురుగులు పెట్టారు. దీంతో వేణు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయాడు. అక్కడికి దగ్గరలో ఉన్న పలువురికి బావిలో ఏదో పడిన శబ్ధం వినిపించడంతో వెంటనే వెళ్లారు. చదవండి: రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. అనంతరం నీళ్లులేని ట్యాంకులో పడేసి చీకట్లోనే ప్రమాదకరంగా ఉన్న బావిలో ముగ్గురు దూకి, గాలించారు. అయినా అతని ఆచూకీ లభించలేదు. కొక్కేలతో ఉన్న బకెట్‌కు తాగు కట్టి, వెతకగా వేణుకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో చాలాసేపు వెతికి అతన్ని బయటకు తీశారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వేణు (ఫైల్), వేణు కూతుళ్లు డాడీ.. లే డాడీ.. సోమవారం వేణు మృతదేహం ఇంటికి చేరింది. డాడీ.. లే డాడీ.. ఫోన్ చేస్తే వస్తున్న అన్నావు.. మమ్మీ.. డాడీ లేస్తలేడు చెప్పు.. అంటూ వేణు పెద్ద కూతురు తండ్రి మృతదేహంపై పడి, విలపించడం చూసి, స్థానికులు కంటతడి పెట్టారు. తండ్రి చితికి పెద్ద కూతురు అద్విక నిప్పంటించింది. ఇదే మండలంలో గతంలోనూ ఓ ఘటన ఇల్లందకుంట మండలంలోని మల్యాల శివారులో గతంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు మద్యం సేవిస్తుండగా పోలీస్ సైరన్ వినబడటంతో పరిగెత్తి, బావిలో పడి మృతిచెందాడు. కొన్ని సందర్భాల్లో అవసరం లేకున్నా పోలీసులు సైరన్ వేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పలువురు అంటున్నారు. -
రెండు రోజుల తర్వాత పుట్టింటికి .. బావిలో శవాలుగా తేలిన తల్లీ, కూతురు
కెలమంగలం,(బెంగళూరు): అంచెట్టి సమీపంలో 7 నెలల చంటిబిడ్డతో పాటు తల్లి బావిలో శవమై తేలింది. వివరాలు... అంచెట్టి సమీపంలోని మేటుకొటాయ్ గ్రామానికి చెందిన వెంకటేష్ భార్య దీప (23) రెండేళ్ల క్రితం కుటుంబ గొడవలతో పురుగుల మందు తాగింది. చికిత్సానంతరం భార్యాభర్తలు విడిపోయారు. సంవత్సరం తర్వాత భర్త వెంకటేష్ భార్యను తిరిగి కాపురానికి తీసుకువచ్చాడు. ఇటీవల పుట్టింటికి తీసుకెళ్లాలని దీప మొరపెట్టుకొంది. రెండు రోజులు తర్వాత వెళ్దువులే అనడంతో ఏడు నెలల చిన్నారితో సోమవారం రాత్రి సమీపంలోని బావిలో పడి ఆత్మహత్య చేసుకొంది. ఇంట్లో కోడలు కనిపించకపోయే సరికి అత్త చుట్టు పక్కల గాలించింది. ఈ సమయంలో దీప, చిన్నారి బావిలో శవాలై కనిపించారు. అంచెట్టి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాలను స్వాధీనం చేసుకున్నారు. దీప ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి బావిలో పడేశారని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: ప్రేమ పేరుతో యువతికి బెదిరింపులు.. ఇంట్లో ఎవరూ లేని టైంలో -
శవాల గుట్టల కోసం బావిలోకి దిగితే..
-
శవాల గుట్టల కోసం బావిలోకి దిగితే..
Yemen Hell Of Well: అదొక భారీ బావి. దూరం నుంచి చూస్తే చిన్న గుంతలా కనిపిస్తుంది. దగ్గరికెళ్లి చూస్తే.. లోపల చీకట్లు అలుముకుని భయంకరంగా అనిపిస్తుంది. దాని గురించి చుట్టుపక్కల ఉన్న ఊరి వాళ్లు కథలు కథలుగా చెప్తుంటారు. కొందరేమో దుష్టశక్తులు కొలువైన బావిగా చెప్తారు. ఎక్కువ మంది మాత్రం శవాల దిబ్బగా పేర్కొంటారు. ఖైదీలను, శత్రువులను గుంపులుగా అందులో పడేసి ఊచకోత కోసేవాళ్లని ప్రచారం వినిపించేది మొన్నటిదాకా. కానీ.. 112 మీటర్ల లోతున్న ఆ బావి నరక కూపం కాదని, అదొక ప్రకృతి అందంగా తేల్చేశారు. యెమెన్(యెమన్) ఆల్ మహారాలోని బార్హౌట్ బావి.. చాలా ఏళ్ల నుంచి ఒక మిస్టరీగా ఉండిపోయింది. లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ భారీ బావి గురించి ఎన్నో కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వీటన్నింటికి తేల్చేందుకు తాజాగా ఎనిమిది మంది సాహసికులతో ఓ బృందం లోపలికి దిగింది. అందులో శవాల గుట్టలుగానీ, అస్థిపంజరాలుగానీ ఏవీ కనిపించలేవు. కనీసం కంపు వాసన కూడా రాలేదు. లోయ అడుగున ఓ జలపాతం, రంగు రాళ్లు, మేలిమి ముత్యాలు దొరికాయి వాళ్లకి. కాకపోతే కొన్ని పాములు మాత్రం కనిపించాయట. అక్కడ దొరికిన వాటి మీద రీసెర్చ్ చేసి.. ఆ బావి వయసు తేల్చే పనిలో పడ్డారు పరిశోధకులు. గతంలో యెమెన్ అధికారుల బృందం ఒకటి ఈ బావిలో 50-60 మీటర్ల దాకా వెళ్లి భయంతో వెనక్కి వచ్చేసిందట. ప్రస్తుతం ఈ భారీ బావి మిస్టరీని చేధించినప్పటికీ.. ఆ ఊరి ప్రజలు మాత్రం ఆ బావి పక్కకు వెళ్లమనే చెప్తున్నారు. -
తల్లడిల్లిన కన్నపేగు.. ఆశలన్నీ ఆవిరయ్యాయి
భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు...తమ పిల్లలను గొప్పగా చదివించాలనుకున్నారు. ఉన్నదాంట్లోనే సర్దుకుని కష్టమేంటో తెలియకుండా పెంచారు. పిల్లలు కూడా తల్లిదండ్రులు ఆశలకు అనుగుణంగానే చదువుకుంటున్నారు. సాఫీగా సాగుతున్న ఆ కుటుంబాలపై విధి కన్నెర్రజేసింది. నేలబావి రూపంలో ఉసురుతీసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న బంధాన్ని తెంపేసింది. ఈత సరదా ఆకుటుంబాలను కన్నీటి పాల్జేసింది. సాక్షి, పెదగంట్యాడ/అగనంపూడి (గాజువాక): ఆనందపురంలో సాయి గణపతి కళాశాలలో పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న హర్షశ్రీ సంతోష్, సాయి పవన్‌లు తరగతులు ముగిసిన తరువాత నీళ్లకుండీల వద్ద నేలబావిలో ఈత కొట్టేందుకు దిగి మృతి చెందారు. సాయిపవన్‌కు ఈత రాకపోవడం...రక్షించే క్రమంలో హర్షశ్రీ సంతోష్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. నిత్యం నవ్వుతూ కళ్లముందు తిరిగిన వీరిద్దరూ ఇప్పడు లేరన్న వార్తను తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు తట్టుకోలేకపోతున్నారు. పెదగంట్యాడ సమీపంలోని చిననడువూరులోని రామాలయం వీధిలో సంతోషి కుటుంబ ఉంటోంది. నర్సీపట్నానికి చెందిన మలసాల వెంకునాయుడు, అన్నపూర్ణ దంపతులు బతుకుదెరువు కోసం పిల్లలతో సహా చిననడుపూరు వచ్చేశారు. వెంకునాయుడు స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడికి పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. అందులో పెద్ద కుమారుడు హర్షశ్రీ సంతోష్ (17), చిన్నకుమారుడు నిరుపమ్. పెద్ద కుమారుడు పాలిటెక్నిక్, చిన్న కుమారుడు పదో తరగతి చదువుతున్నారు. వెంకునాయుడు కుమారులిద్దరికీ ఉన్నత చదువులు చదివించాలని భావించాడు. ఇంతలోనే ఇంతటి విషాదం చోటుచేసుకోవడంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది. కన్నీరుమున్నీరుగా.. వడ్లపూడి నిర్వాసిత కాలనీ సంతమామిడితోట శివాలయం ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కఠారి వెంకట సాయి పవన్ మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. పవన్ తండ్రి రాంబాబు స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పెద్ద కుమారుడు సాయి పవన్ ఆనందపురంలోని ప్రైవేటు పాలిటెక్నిక్‌లో మొదటి సంవత్సరం డిప్లమో చేస్తున్నాడు. ఎప్పటిలాగే కళాశాలకు వెళ్లిన కుమారుడు తిరిగి వస్తాడని తల్లిదండ్రులు ఎదురు చూశారు. ఇంతలో మృతి చెందాడన్న విషాద వార్త విని ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చదవండి: వివాహేతర సంబంధం: షాపులో పనిచేసే కుర్రాడితో చనువు.. మాట వినకపోవడంతో.. -
50 అడుగుల లోతు బావిలో పడిన మహిళ..వీడియో చూస్తే షాక్
తిరువనంతపురం: ఇంకా భూమి మీద నూకలు రాసిపెట్టి ఉంటే ఎంత ప్రమాదం నుంచి అయినా బయట పడతాం అనే సామెతకు నిలువెత్తు ఉదాహరణననే ఈ సంఘటన. 50 అడుగుల లోతు ఉన్న బావిలో పడిపోయిన ఓ మహిళ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. వివరాలు.. కేరళలోని వయనాడ్ కు చెందిన ఓ మహిళ ప్రమాదవశాత్తు 50 అడుగుల లోతులో పడిపోయింది. అయితే దాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖవారికి సమాచారం అందించారు. హుటహుటిన వారు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాలకు తెగించి ఆమెను రక్షించారు. ప్రస్తుతం దీనికి సంభందించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో బావిలో పడిపోయిన మహిళను పైకి లాగడానికి అగ్నిమాపక సిబ్బంది,స్ధానికులు ఓ నిచ్చెన లాంటి తాడును బావిలోకి దింపి, ఆమెను కాపాడిన దృశ్యాలును చూడవచ్చు. చివరకు ఎలాగోలా ఆమెను బయటకు తీశారు. కానీ ఆమెకు గాయాలేమైనా అయ్యాయా అనే వివరాలు తెలియలేదు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. అయితే మహిళను కాపాడిన అగ్నిమాపక సిబ్బందిపై నెటిజన్లు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. #WATCH | Kerala: Fire Department officials and locals rescued a woman after she fell into a 50-feet deep well in Wayanad (10.08) pic.twitter.com/5tG6Jq0vx3 — ANI (@ANI) August 10, 2021 -
రోడ్డు పక్క బావి.. కారును మింగేసింది..
కరీంనగర్ క్రైం/చిగురు మామిడి: రోడ్డు పక్కనే ఉన్న ఓ వ్యవసాయ బావి మృత్యు బావిగా మారి ఓ కారును మింగేసింది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి మరణించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ శివారులో జరిగింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న కారు గురువారం ఉదయం 11.00 సమయంలో అదుపుతప్పి రోడ్డుకు కుడివైపున ఉన్న బావిలో పడింది. వెనుకాలే కారులో వస్తున్న ఓ వ్యక్తి ఈ విషయం గమనించి కాపాడాలని ప్రయత్నించినా ఎవరూ లేకపోవడంతో కుదరలేదు. దీంతో వెంటనే స్థానికులను పిలుచుకొచ్చాడు. సుమారు 30 నిమిషాల పాటు కారు నీటిపై తేలి ఆ తర్వాత మునిగిపోయింది. క రీంనగర్ రూరల్ ఏసీపీ విజయసారథి, తిమ్మాపూర్ సీఐ శశిధర్‌రెడ్డి, చిగురుమామిడి ఎస్సై మధుకర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్లతో సహాయక చర్య లు చేపట్టగా, కారు ఆచూకీ లభించలేదు. గజ ఈతగాళ్లతో గాలించగా, ఫలితం లేకుండాపోయింది. 8 గంటలు శ్రమించి.. మొదట కారులో ముగ్గురు లేదా నలుగురు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఫైరింజన్, రెండు క్రేన్ల ద్వారా కారును వెలికితీసేందుకు చేపట్టిన చర్యలు మొదట విఫలమయ్యాయి. రెండు, మూడు సార్లు క్రేన్‌కు చిక్కినా జారిపోయింది. రెండు మోటార్ల సాయంతో నీటిని తోడించినా ఫలితం దక్కలేదు. ఆఖరికి రాత్రి 8 గంటలకు పెద్ద క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. మృతుడు రిటైర్డ్ ఎస్సై.. కారును బయటికి తీశాక.. అందులో ఒక్కరి మృతదేహం లభించింది. మృతుడు కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌లో నివాసం ఉండే రిటైర్డ్ ఎస్సై అని పోలీసులు గుర్తించారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ తండాకు చెందిన రిటైర్డ్ ఎస్సై పాపయ్య నాయక్ (62)గా గుర్తించారు. గతంలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఎస్సైగా విధులు నిర్వహించి రిటైర్ అయినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. పాపయ్యనాయక్కు భార్య భారతి, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బుద్ధయ్య నీ కోసమే డ్యూటీ చేసిన్నా అన్నా.. మానకొండూర్ డివిజన్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అందులో పాపయ్య నాయక్ సొంత తమ్ముడు బుద్ధయ్య నాయక్ కూడా ఉన్నాడు. బావిలో పడి చనిపోయింది తన అన్న అని తెలియకుండానే.. 9 గంటల పాటు సాయం అందించాడు. చివరకు మృతుడు తన అన్న తెలియడంతో ‘అన్నా ఇంతసేపు నీకోసమే డ్యూటీ చేసిన్నా.. బాయిల పడ్డది నువ్వేనా’అంటూ కన్నీరు మున్నీరయ్యాడు. -
ఢిల్లీ రోడ్లా..? మజాకా..!
అది దేశ రాజధాని ఢిల్లీ. పైగా నిత్యం లక్షల వాహనాలు తిరిగే రద్దీ రోడ్లు. మరి అక్కడి రోడ్డు ఎలా ఉండాలి? చాలా భద్రంగా, పటిష్టంగా ఉండాలి. కానీ ఓ చినుకు పడితేనే నీళ్లు నిలిచి పోయి, రోడ్లు కుంగిపోతే. రోడ్డు వేసిన కాంట్రాక్టర్, దాని నాణ్యతను గాలికి వదిలేసిన ప్రభుత్వానిదే బాధ్యత. ఇది దేశ రాజధాని పరిస్థితి మాత్రమే కాదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితుల వల్ల వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు. సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో రోడ్లపై నీరు భారీగా చేరింది. అయితే నాణ్యత లేని రోడ్ల వలన వాహనాదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ వాహనం సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ద్వారకాలోని అతుల్యా చౌక్ వద్ద రోడ్డులో కుంగిపోయింది. ఈ ఘటనలో ఎవకూ గాయపడలేదు. కాగా ప్రమాదం జరిగిన కొద్దిసేపటి హైడ్రో క్రేన్ సహాయంతో కారును బయటకు తీసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. అంతేకాకుండా వజీరాబాద్ ప్రాంతంలో వ్యాన్‌పై ట్రక్కు బోల్తా పడిపోవడంతో ఆరుగురు గాయపడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. అయితే ‘‘ఢిల్లీ రోడ్ల పనితనం అంటే.. మజాకా!’’ అంటూ ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక గడిచిన 24 గంటల్లో దేశ రాజధానిలో 70 మి.మీ. వర్ష పాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. 15 మిమీ కంటే తక్కువ వర్షపాతం తేలికపాటి వర్షంగా, 15-64.5 మిమీ ఓ మోస్తరుగా, 65.5-115.5 మిమీ ‘హెవీ’గా, 115.6-204.4 మిమీ భారీ వర్షపాతంగా, 204.4 మిమీ పైన అతిభారీ వర్షపాతంగా పరిగణిస్తారు. -
బాలుడి కోసం, బావిలోకి గ్రామస్తులు, నలుగురు మృత్యువాత
-
బాలుడిని రక్షించబోయి ప్రమాదంలో గ్రామస్తులు, నలుగురు దుర్మరణం
భోపాల్: బావిలో పడిపోయిన బాలుడిని కాపాడటానికి ప్రయత్నించిన గ్రామస్తులు అనూహ్యంగా ప్రమాదంలో పడిపోయిన ఘటన తీవ్ర ఆందోళనకు దారి తీసింది. బాలుడిని రక్షించే ప్రయత్నంలో ఒకేసారి అక్కడికి చేరడంతో అధిక బరువుతో గోడ కూలి బావిలో పడిపోయారు. ఈ ఘటనలో దాదాపు 30 మంది ప్రమాదంలో చిక్కుకోగా, నలుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. మధ్యప్రదేశ్, విదిష పట్టణానికి సమీపంలో గంజ్‌బసోడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్నఎన్‌డీఆర్‌ఆఫ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలును చేపట్టాయి. ఇతర ఉన్నతాధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించిన వ్యక్తుల బరువు కారణంగా బావి పైకప్పు కూలిపోయిందని అధికారులు తెలిపారు. వీరిలో 19 మందిని సిబ్బంది కాపాడారు. ఇంకా బావిలోనే చిక్కుకున్న మిగిలిన వారిని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ మరణించిన వారి కుటుంబాలకు సీఎం ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారంతోపాటు, ఉచిత వైద్య చికిత్స కూడా అందించనున్నామని వెల్లడించారు. అలాగే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మరోవైపు సీఎం ఆదేశాల మేరకు మంత్రి విశ్వాస్ సారంగ్, సహాయ, రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. MP: 4 bodies recovered from the spot so far in Ganjbasoda area of Vidisha. CM SS Chouhan announces an ex-gratia of Rs 5 Lakhs each for the next of the kin of the deceased & compensation of Rs 50,000 each to the injured. The injured will also be provided free medical treatment. pic.twitter.com/PgBs2hzFJB — ANI (@ANI) July 16, 2021 -
విషాదం: బావిలో దిగి ఊపిరాడక నలుగురు మృతి
తిరువనంతపురం: తాము చేయబోయే పనే వాళ్లను మృత్యుఒడిలోకి తీసుకెళ్తుందని గ్రహించలేక నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొల్లాం జిల్లాలోని కోవిల్‌ముక్కు సమీపాన గురువారం ఉదయం బావిలోకి సిల్ట్‌ను తొలగించే పనిలో భాగంగా నలుగురు కార్మికులు అందులోకి దిగారు. బావి లోతుకు వెళ్లడం కారణంగా అందులో సరిగా ఊపిరాడకపోవడంతో పాటు విషవాయువు వెలువడింది. ఈ క్రమంలో ఆ నలుగురికి ఊపిరి పీల్చుకోవడంతో ఇబ్బందులు రావడం, కాసేపటికే వారు గాలి అందక కొట్టుమిట్టాడుతూ మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, రెస్క్యూ టీం ఆ బావిలో ఉన్న నలుగురిని బయటకు వెలికి తీశారు. రెస్క్యూ టీం వారిని వాళ్లను బావిలోంచి బయటకు తీసే సమయంలో అందులోని ఓ సభ్యుడు సైతం సంఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆ వ్యక్తిని అధికారులు ఆస్పత్రిలో చేర్పించారు. మృతులు సోమరాజన్ (54), రాజన్ (35), మనోజ్ (32), శివప్రసాద్ (24)గా గుర్తించారు. మృతదేహాలను బావిలో నుంచి వెలికితీసి కొల్లం జిల్లా ఆసుప్రతికి తరలించారు. కాగా ఈ సంఘటన తర్వాత ఆ బావిని మూసివేయాలని అధికారులు తెలిపారు. -
నా బావి కనిపిస్తలే.. కాస్త వెతికిపెట్టండి సారు
బెంగళూరు (బెలగావి): ప్రభుత్వ అధికారుల చేతివాటం గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సృష్టించగలరు. అలా ఏం చేశారో పాపం ఓ రైతు తన బావి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విచిత్ర ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. అసలు బావి కనిపించకపోవడం ఏంటి అనుకుంటున్నారా! అధికారులు సక్రమంగా పని చేసేంతవరకు ఇలాంటి విచిత్రాలే జరుగుతాయ్ మరి. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లాలోని మావినహొండ గ్రామంలో మల్లప్ప అనే రైతు తన పొలంలోని బావి కనిపించడం లేదని, ఎలాగైనా వెతికి పెట్టాలి సారు అంటూ రాయబాగ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ వింత ఫిర్యాదును చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. బావి కనిపించకపోవడమేంటని రైతుని గట్టిగా నిలదీశారు కూడా. దీంతో ఆ రైతు ఈ ఫిర్యాదు వెనుక దాగున్న అసలు నిజం చెప్పాక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు నిజం ఏమిటంటే.. మల్లప్ప పొలంలో ఎన్ఏఆర్ఈజీఏ పథకం కింద బావిని తవ్వినట్టు పంచాయతీ అధికారులు రికార్డులు సృష్టించారు. అదే క్రమంలో ఇందుకు రుణం రూపంలో రూ.77000 బిల్లును కూడా మంజూరు చేసి ప్రభుత్వ నిధులు కాజేశారు. ఇదిలా ఉండగా, ఇటీవల బావి తవ్వించినందుకు తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలంటూ రైతుకు నోటీసులు కూడా పంపారు. దీనికి కారకులైన మహానుభావులకు సరైన రీతిలో సమాధానం చెప్పాలని రైతు పోలీసులను ఆశ్రయించడంతో అధికారుల బాగోతం బయటపడింది. ప్రస్తుతం దీని పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నేల బావి ప్రమాదం.. ముగ్గురు మైనర్ల మృతి
సాక్షి, తూర్పుగోదావరి: నిన్న బైక్ అదుపు తప్పి పాడు పడిన నేలబావిలో పడి గల్లంతైన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను మంగవారం వెలికితీశారు. తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ మండలం, దోసకాయలపల్లిలో జరిగిన ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. కాగా, దోసకాయలపల్లికి చెందిన లలిత పద్మాకుమారి కొడుకు గుమ్మడి సనీల్ (17), తుమ్మలపల్లి నుంచి సెలవులకు వచ్చిన తన చిన్నమ్మ కస్తూరి అచ్చుతరాణి కుమారుడు కస్తూరి అభిరామ్ (7)తో కలిసి బైక్‌పై గుమ్ములూరులో ఉంటున్న మరో చిన్నమ్మ చిన్నం పాప ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి వారి పిల్లలు చిన్నం వీర్రాజు (17), చిన్నం శిరీష (13)తో కలిసి సోమవారం మధ్యాహ్నం ఒకే బైక్‌పై నలుగురు దోసకాయలపల్లికి బయలు దేరారు. అయితే ఈ మార్గంలోని పుంత రోడ్డు మలుపులో బైకును తిప్పే ప్రయత్నంలో అదుపుతప్పి పక్కనే ఉన్న పాడుపడిన నేలబావిలో పడిపోయారు. ఇదే సమయంలో బైక్‌పై చివరన కూర్చున్న అభిరామ్ దూకేయడంతో సురక్షితంగా బయటపడ్డాడు. అతడిచ్చిన సమాచారం మేరకు.. వెంటనే గజఈతగాళ్లను రప్పించారు. డీఎస్పీ నార్త్ జోన్ కడలి వెంకటేశ్వర్రావు, కోరుకొండ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, సిబ్బందితోపాటు రాజమహేంద్రవరం అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి గల్లంతైన ముగ్గురు మృతదేహాలను వెలికితీశారు. చదవండి: పసిబిడ్డల ఉసురు తీసిన బాబాయి వీడిన తిరుపతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య కేసు -
విషాదం: ముద్దుగా ఉన్నారు బిడ్డా.. ఎంత పనైపోయింది
ఆ బాలికలు స్నేహితులు. ఇద్దరూ కలిసి ఒకే పాఠశాలలో చదువుతున్నారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలకు సెలవులివ్వడంతో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండాలని భావించారు. ఇంటి వద్ద ఉన్న ఆవులను మేత కోసం సమీపంలోని పొలాల్లో తోలారు. దాహం వేయడంతో పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో దిగి నీళ్లు తెచ్చుకునే క్రమంలో కాలు జారి అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఒకే గ్రామంలో ఇద్దరు బాలికలు మృతిచెందడంతో విషాదం అలముకుంది. తొట్టంబేడు: మండలంలోని శివనాథపురానికి చెందిన బాలమురుగన్, కౌసల్య దంపతుల కుమార్తె నివేత(12), మనోహర్, పద్మావతి దంపతుల కుమార్తె ఉమామహేశ్వరి(12) మంచి స్నేహితులు. శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏడు, ఆరు తరగతులు చదువుతున్నారు. శుక్రవారం మేతకోసమని ఆవులను తోలుకుని పొలాల్లోకి వెళ్లారు. దాహం వేయడంతో పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి ఒకరినొకరు చేయిచేయి పట్టుకుని దిగారు. వాటర్ బాటిల్లో నీళ్లు తీసుకుని పైకి ఎక్కే క్రమంలో కాలుజారి ఇద్దరూ బావిలో పడిపోయారు. వారి వెంట ఉన్న మరికొందరు స్నేహితులు కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న చిట్టత్తూరు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ మధు హుటాహుటిన బావివద్దకు చేరుకున్నారు. మొదట నివేద మృతదేహాన్ని బయటకు తీశారు. ఉమామహేశ్వరి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి ఉమామహేశ్వరి మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: క్షుద్ర పూజలు: యువతిని అర్ధనగ్నంగా కూర్చోబెట్టి.. దొంగలుగా మారిన పోలీసులు.. తనిఖీల పేరుతో... -
అర్ధరాత్రి కారు చీకటి.. ఆ ఫోన్ కాల్ కాపాడింది
అమలాపురం టౌన్: ఒక్క ఫోన్ కాల్ ఆమె ప్రాణాలను నిలిపింది.. అర్ధరాత్రి కారు చీకటి.. ఆపై 25 అడుగుల లోతు నూతిలో పడిపోయిన మహిళను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలతో కాపాడారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టడంతోనే ఇది సాధ్యమైంది. ఆపద సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ ద్వారా అందుబాటులోకి తెచ్చిన 112 కాల్ బాధితురాలిని రక్షించింది. సాహసోపేత సేవలు అందించిన సిబ్బందిని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రశంసించారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి, అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి కూడా అభినందించారు. ఆ వివరాల్లోకి వెళితే.. అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మి గ్రామానికి చెందిన బొక్కా భవానీదుర్గ (49) ప్రతికూల పరిస్థితుల వల్ల ఇంటి ఆవరణలోని నూతిలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పడిపోయింది. ఆమె బంధువు తక్షణమే 112కు కాల్ చేసి ప్రమాద వార్తను చేరవేశారు. ఆ కాల్ సెంటరు వారు తక్షణమే 100కి కాల్ చేసి చెప్పారు. అక్కడి నుంచి అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసి అప్రమత్తం చేశారు. ఆ సమయంలో స్టేషన్లో డ్యూటీలో ఉన్న ఏఎస్సై సత్యనారాయణ తక్షణమే అమలాపురం అగ్నిమాక దళానికి సమాచారం అందించారు. నైట్ రౌండ్స్‌లో ఉన్న కానిస్టేబుల్ కుడుపూడి వీరవెంకట సత్యనారాయణ, హోంగార్డు నాగులకు కూడా ఏఎస్సై తెలిపారు. రాత్రి 12.40 గంటలకు కాల్ రిసీవ్ చేసుకున్న ఏఎస్సై 15 నిమిషాల వ్యవధిలోనే కానిస్టేబుల్, హోంగార్డు, అగ్నిమాపక దళంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలగుమ్మికి వేగంగా వారు జీపులో వెళ్లారు. ఆ సమయానికి అగ్నిమాపక శకటం, అగ్నిమాపక దళాధికారి కేవీ మురళీ కొండబాబు ఆధ్వర్యంలో లీడింగ్ ఫైర్‌మెన్ శ్రీరాములు, సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చారు. నూతి లోతు 25 అడుగులకు పైగా ఉంది. అందులో పడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భవానీదుర్గను కాపాడే ప్రయత్నాలు చకాచకా మొదలు పెట్టారు. అగ్నిమాపక దళానికి చెందిన నిచ్చెన, తాడుతో సిబ్బంది నూతిలోకి దిగి బాధిత మహిళను జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. ఆమె నూతిలో నిచ్చెన పట్టుకునే స్థితిలో లేకపోవడంతో తాడు కట్టి అతికష్టం మీద పైకి చేర్చారు. తర్వాత సపర్యలు చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట లోపు 112 కాల్, 100 కాల్లకు సంబంధించిన కేసును క్లోజ్ చేశారు. బాధిత మహిళ కుటుంబంలోని కొందరు కోవిడ్‌తో బాధపడుతున్నారు. కొద్దిరోజుల కిందటే ఆమె కూడా కోవిడ్ నుంచి కోలుకున్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు. అర్ధరాత్రి నూతి వద్దకు వచ్చిన ఆమె ప్రమాదవశాత్తూ జారి పడిపోయిందని అంటున్నారు. అమలాపురం రూరల్ సీఐ జి.సురేష్‌బాబు, తాలూకా ఎస్సై రాజేష్‌లు ఏఎస్సై, కానిస్టేబుల్, హోంగార్డులను అభినందించారు. చదవండి: బాలిక కిడ్నాప్ కేసు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. చదివింది ఎమ్మెస్సీ.. అమ్మేది గంజాయి -
రెండు కుటుంబాల్లో కన్నీళ్లు నింపిన బావి
జయపురం: బావి శుభ్రం చేసే క్రమంలో ఊపిరాడక ఇద్దరు కూలీలు దుర్మరణం చెందగా.. మరో వ్యక్తి అస్వస్థతలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నవరంగపూర్ జిల్లా రాయిఘర్ సమితి హటబరండి పంచాయతీ సోనారపార గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు సోనారపారకు చెందిన రాజు కెవుట తన బావిని శుభ్రం చేసేందుకు గ్రామానికి చెందిన హేమరాజు హలదను పిలిచాడు. హేమారాజ్ నూతిలో దిగి పని ప్రారంభించాడు. కొంత సమయం తర్వాత బావిలో నుంచి ఎటువంటి శబ్ధం రాకపోవడంతో హేమరాజ్‌కు ఏమైందో అని ఆందోళనతో అతన్ని కాపాడేందుకు రాజు కెవుట బావిలో దిగాడు. అతడు కూడా బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. వారిని కాపాడేందుకు అనూప్ కెవుట అనే మరో వ్యక్తి బావిలో దిగాడు. బావిలో శ్వాస ఆడక ముగ్గురూ సృహతప్పి పడిపోయారు. స్థానికులు కుందైయ్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు, రాయిఘర్ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ముగ్గురినీ బయటకు తీశారు. అయితే అప్పటికే హేమరాజ్, అనూప్ మృతి చెందగా, రాజు కెవుట ఆపస్మారక స్థితిలో ఉన్నాడు. అతడిని వెంటనే హటబరండి పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. కుందైయ్ పోలీస్ స్టేషన్ అధికారి ఫకీర్‌మోహన ఖొర కేసు నమోదు చేసి మృతదేహాను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాయిఘర్ అదనపు తహసీల్దార్ జగు పూజారి, కుంధ్ర బీడీఓ దేవేంద్ర ప్రసాద్ ధల్ సంఘటనా ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాజు కెవుట ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. చదవండి: కూతురి ప్రేమపెళ్లి.. పరువు కోసం తల్లిదండ్రులు -
పండ్ల మార్కెట్‌కు వెళ్లిన వ్యక్తి.. బావిలో శవమై..!
సాక్షి, రాజానగరం: చక్రద్వారబంధానికి చెందిన పండ్ల వ్యాపారి శెన్నంశెట్టి శ్రీనివాసరావు (శ్రీను) (45) అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలోని కశింకోట మండలం చింతలపాలెంలో రహదారిని ఆనుకుని ఉన్న నేలబావిలో అతడు శవమై తేలాడు. అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. రాజమహేంద్రవరంలోని మామిడి పండ్ల మార్కెట్‌కు వెళ్లి వస్తానని ఆదివారం తెల్లవారుజామున ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరిన శ్రీను తిరిగి రాలేదు. ఆ రోజంతా అతడి కోసం ఎదురు చూసిన కుటుంబ సభ్యులు సోమవారం చుట్టుపక్కల గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో అతడి కుమారుడు వీరబాబు రాజానగరం పోలీసులను ఆశ్రయించాడు. జాతీయ రహదారిపై సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. శ్రీను విశాఖ వైపు వెళ్లినట్టు గుర్తించారు. ఇంటి నుంచి వచ్చిన అతడు సూర్యారావుపేట జంక్షన్‌లోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద మోటార్ సైకిల్‌ను పార్క్ చేశాడు. తన సెల్‌ఫోన్ కూడా బైక్ కవర్లోనే ఉంచి, తాళాలను మ్యాట్ కింద పెట్టి, విశాఖ వైపు వెళ్లే లారీ ఎక్కినట్టు సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డయింది. ఇదిలా ఉండగా ‘గుర్తు తెలియని వ్యక్తి మృతి’ అంటూ వివిధ పత్రికల విశాఖ జిల్లా ఎడిషన్లలో మంగళవారం వార్తలు వచ్చాయి. అవి చూసిన కుటుంబ సభ్యులు ఒంటిపై ఉన్న దుస్తుల వివరాలను బట్టి అనుమానంతో అక్కడకు వెళ్లారు. ఆ మృతదేహం శ్రీనుదేనని గుర్తించారు. అనకాపల్లి ప్రభుత్వాస్పత్రిలో భద్రపరిచిన శ్రీను మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసును రాజానగరం ఎస్సై శివనాగబాబు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమా? సీజనల్ పండ్లు విక్రయిస్తూ జీవనం సాగించే శ్రీనివాసరావు ఆయా సీజన్లలో పండ్ల కోసం తోటలు కొనుగోలు చేసి, వ్యాపారం చేస్తుంటాడు. మూడేళ్లుగా తోటలపై పెట్టుబడులు అధికం కావడం, వ్యాపారాలు అనుకున్నంతగా లేకపోవడంతో అప్పుల భారం పెరిగిందని గ్రామస్తులు అంటున్నారు. అయితే అతడికి ఉన్న ఆస్తుల దృష్ట్యా ఇటువంటి అఘాయిత్యం చేసుకునే అవసరం కూడా లేదని చెబుతున్నారు. శ్రీనుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చదవండి: భర్త అనుమానం.. ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్య -
శభాష్! క్రేన్ సాయంతో వ్యక్తిని కాపాడిన పోలీసులు
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పట్టణ పరిధిలోని 3వ వార్డు రంగధాంపల్లి గ్రామంలోని పాఠశాల సమీపంలోని ఓ బావిలో ప్రమదవశాత్తు పడిన వ్యక్తిని గ్రామస్తుల సహకారంతో బయటకు తీసినట్టు సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయినట్టు శుక్రవారం ఉదయం గుర్తించిన స్థానికులు బ్లూకోట్ సిబ్బంది శ్రీనివాస్, వినోద్లకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో క్రేన్ ఉపయోగించి బావిలో పడిన వ్యక్తిని బయటకు తీశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అతని వివరాలు ఆరా తీయగా తమది సిద్దిపేట పట్టణంలోని బారాఇమాం చౌరస్తా ప్రాంతానికి చెందిన కొండపాక కనకయ్యగా తెలిపారు. పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారికి అప్పగించారు. -
ఆడపడుచుతో గొడవ: పిల్లలతో బావిలో దూకిన తల్లి
పెద్దపల్లి రూరల్: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం మూడు నిండుప్రాణాలను బలిగొంది. పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లి గ్రామంలో బుధవారం ఈ సంఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని దేవగూడకు చెందిన ఎతిరాజు స్వామి కుటుంబం పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడింది. స్వామికి «జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన మమత (27) తో వివాహం జరిగింది. వీరికి శివకృష్ణ (3), శ్రీకృతి (14 నెలలు) సంతానం. స్వామి తోబుట్టువు పద్మ భర్త చనిపోవడంతో ఆమె వీరి వద్దే ఉంటోంది. ఆడపడుచు పద్మతో స్వామి భార్య మమతకు తరచూ గొడవలు జరిగేవి. మంగళవారం స్వామి కూలిపనికి వెళ్లిన తర్వాత ఏదో విషయమై ఆడపడుచుతో గొడవపడ్డ మమత తన ఇద్దరు పిల్లలతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్వామి ఇంటికి వచ్చిన తర్వాత భార్యాపిల్లలు కనపడక పోవడంతో పద్మను అడగ్గా తనకు తెలియదని చెప్పింది. తర్వాత అత్తింటివారిని, బంధువులను ఫోన్ ద్వారా అడిగి తెలుసుకోగా, తమ వద్దకు రాలేదని చెప్పారు. బుధవారం ఉదయం వారిని వెతికేందుకు బయల్దేరేలోగా మృతదేహాలు సమీపంలోని బావిలో తేలాయని తెలియడంతో హతాశులయ్యారు. ఈ సమాచారం అందడంతో డీసీపీ రవీందర్, ఏసీపీ నితికపంత్, సీఐ ప్రదీప్.. సిబ్బందితో వెళ్లి మృతదేహాలను వెలికి తీయించారు. కాగా, తమ కూతురు అత్తింటివారి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని మమత కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని డీసీపీ తెలిపారు. -
అన్న పెద్దకర్మ రోజే తమ్ముడి మృతి
సాక్షి, చేవెళ్ల: అన్న పెద్ద కర్మరోజున తమ్ముడు వ్యవసాయ బావిలో స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని హస్తేపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన ప్రకారం... హస్తేపూర్ గ్రామానికి చెందిన కుంటనోళ్ల అనంతయ్య అనారోగ్యంతో వారం రోజుల కిందట మృతి చెందాడు. దీంతో శుక్రవారం ఆయన కుటుంబసభ్యులు దశదిన కర్మ కార్యక్రమాలు చేస్తున్నారు. మృతుడి తమ్ముడు కుంటనోళ్ల సాయన్న (52) గుండు చేయించుకుని పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో స్నానం చేసేందుకు వెళ్లాడు. బావిలో దూకిన అతడు ఈత కొడుతూనే మునిగిపోయాడు. గమనించిన గ్రామస్తులు బావిలో వెతికారు బావిలో నీళ్లు ఎక్కువగా ఉండటంతో అతన్ని పైకి తీయలేకపోయారు. సాయంత్రానికి మృతదేహం నీటిపై తేలింది. మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి శనివారం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి సాయన్న భౌతికకాయానికి నివాలులరి్పంచారు. -
బావిలో పడ్డ వ్యాన్.. డ్రైవర్, క్లీనర్ మృతి
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని కోటబోమ్మాళి మండలం పాకీవలస వద్ద రోడ్డు ప్రమాదం మంగళవారం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న నేల బావిలో పడిపోయింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో చిక్కుకుపోయిన డ్రైవర్, క్లీనర్ మృతదేహాలను పోలీసులు బావి నుంచి బయటకు తీశారు. మృతి చెందిన డ్రైవర్, క్లీనర్ ఒడిశాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. చదవండి: కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం -
కూతుళ్లను బావిలోకి తోసేసి ఆపై ఆయన కూడా..
పుణె: ఏం కష్టమొచ్చిందో కానీ ముక్కుపచ్చలారని కూతుళ్లను బావిలోకి తోసేసి ఆపై అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. తినడానికి వంట చేయి అని ఇంట్లోంచి ఇద్దరు పిల్లలతో వెళ్లిన ఆయన శవమై ఇంటికి తిరిగొచ్చాడు. ఒకేసారి ముగ్గురి మృతితో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగింది. అయితే కుటుంబ కలహాలే ఆయన ఇంతటీ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెకు సమీపంలోని తాలేగావ్ ధందేర్‌లో రాజేంద్ర బుజ్బాల్ (42) నివసిస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు దీక్ష (10), రితుజ (8). కూతుళ్లతో కలిసి గురువారం సాయంత్రం రాజేంద్ర బయటకు వెళ్లాడు. భోజనం సమయమైనా ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. ఈ సందర్భంగా పొలం సమీపంలో ఉన్న బావి వద్ద వారికి సంబంధించిన వస్తువులు లభించాయి. వెంటనే బావిలోకి చూడగా ముగ్గురి మృతదేహాలు బావిలో తేలుతున్నాయి. మొదట ఇద్దరు కూతుళ్లను బావిలోకి విసిరేసిన అనంతరం ఆయన బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని శిఖర్పూర్ పోలీసులు భావిస్తున్నారు. అయితే కుటుంబ కలహాలే అతడు ఇంత ఘాతుకానికి ఒడిగట్టాడని తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య మనస్ఫర్థలు ముగ్గురి ప్రాణాలు తీశాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జిత్తుల మారి నక్క.. తెలివితేటలు
సాక్షి, కరీంనగర్ : జిత్తుల మారి నక్క.. నక్కకు ఉన్న తెలివితేటలు ఎవరికీ ఉండవు అంటారు పెద్దలు. వ్యవసాయ బావిలో పడ్డ నక్క తెలివితో బయటపడి బతుకు జీవుడా అంటూ పరిగెత్తింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లిలో నక్క వ్యవసాయ బావిలో పడి ప్రాణాపాయ స్థితికి చేరింది. రైతులతో పాటు స్థానికులు చూసి అయ్యో పాపం అంటూ నక్కను కాపాడే ప్రయత్నం చేశారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఒకరు, పాత మంచం లోపటికి విడిచి బయటికి తీద్దామని మరొకరు ఇలా మాట్లాడుకుంటుండగానే నక్క తెలివిని ప్రదర్శించింది. వ్యవసాయ బావిలో నీళ్లలో ఉన్న కరెంటు మోటార్‌కు సంబంధించిన వైరును నక్క నోటితో కొరికి కట్ చేసింది. ఆ వైరును నోటితో జిత్తుల మారి నక్క గట్టిగా పట్టుకోగ రైతులు మెల్లిగా లాగారు. రైతుల సహాయానికి నక్క సహకరించి ప్రాణాలతో బయట పడింది. బతుకు జీవుడా అంటూ పక్కనే ఉన్న గుట్టల్లోకి పరిగెత్తింది. అపాయంలో ఉపాయం అంటు నక్క తన తెలివిని ప్రదర్శించడాన్ని చూసినవారు నక్క తెలివిని మెచ్చుకుంటూ అక్కడి నుంచి మెల్లిగా ఇంటికి చేరుకున్నారు. -
చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం..
సాక్షి, చిత్తూరు : జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. కుప్పం మండలం ఒంటూరు గ్రామంలో బావిలో పడి నలుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. తొలుత ప్రమాదవశాత్తు ముగ్గురు బావిలో పడిపోగా.. వారికి కాపాడేందుకు వెళ్లి మరో మహిళ మృత్యువాత పడింది. మృతుల్లో చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. కేసు నమోదు చేసిన కుప్పం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒకే గ్రామంలో నలుగురు మృతిచెందడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు అప్పటి వరకు తమ ముందు ఉన్న పిల్లలు విగతజీవులుగా మారడంతో ఒంటూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల వివరాలు.. రుక్మిణి భాయ్ (36), ఆరతి (8), కీర్తి (6), రాజేశ్వరి (26). -
బావి దిగి చూడు.. ఎవరెస్టు ఎక్కినట్లే!
ఆకాశం అంచుల్ని తాకితేనేనా.. శిఖరాగ్రాలను చేరుకుంటేనేనా.. ...ప్రపంచాన్ని జయించిన సంతోషం కలిగేది! ఈ బావిలోకి దిగి చూడండి. ఎవరెస్టును ఎక్కినట్లే ఉంటుంది! విజయ పతాకాన్ని ఎగరేసినట్లే ఉంటుంది. ఇది రాణి గారి బావి. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నగరానికి 130 కి.మీల దూరాన ఉంది. ఇది ఏడు నిలువుల లోతు బావి. పేరు రాణీ కీ వావ్. ఈ బావిలోకి దిగడమే ఓ విచిత్రం. ఏ మెట్టు నుంచి మొదలు పెట్టామో తిరిగి అదే మెట్టు మీదకు చేరతాం. ఏడంతస్థుల రాణి గారి బావిలో విశాలమైన వరండాలుంటాయి. వరండా స్థంభాల మీద అందమైన శిల్పాలున్నాయి. బుద్ధుడు, విష్ణు, దశావతారాలు, కల్కి, రాముడు, మహిసాసురమర్దని, నరసింహుడు, వామన, వరాహవతారాలతోపాటు నాట్య భంగిమలో నాగకన్యల శిల్పాలుంటాయి. ఏడంతస్తుల బావి నిర్మాణంలో సుమారు ఎనిమిది వందల శిల్పాలు ఉండవచ్చని అంచనా. ఇప్పుడు ఐదు అంతస్తులు మాత్రమే సరిగ్గా ఉన్నాయి. 64 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 27 మీటర్ల లోతున్న ఈ బావిలోకి దిగడం సాహసమేనేమో అనిపిస్తుంది. కానీ తీరా బావి అడుగు అంతస్థులోకి చేరిన తర్వాత ప్రపంచాన్ని జయించినంత సంతోషం కలుగుతుంది. ఎవరెస్టును అధిరోహించినంత గర్వంగానూ ఉంటుంది. మంచి గాలి ఈ ప్రదేశాన్ని పదకొండవ శతాబ్దంలో సోలంకి రాజవంశం పాలించింది. ఆ రోజుల్లో మొదటి భీమదేవుని భార్య రాణి ఉదయమతి భర్త జ్ఞాపకార్థం ఈ బావిని నిర్మించింది. ఈ బావి గుజరాత్‌లోని పఠాన్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో సరస్వతి నది తీరాన ఉంది. ఆ నదికి వచ్చిన వరదల్లో బావి మునిగిపోయి కొన్ని శతాబ్దాల పాటు ఇసుకమేటలోనే ఉండిపోయింది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాల్లో 1980లో బయట పడిన ఈ బావిని యునెస్కో 2014లో ‘వరల్డ్ హెరిటేజ్ సైట్’ జాబితాలో చేర్చింది. సాధారణ బావుల్లోకి దిగితే కొంత సేపటికి ఆక్సిజెన్ తగినంత అందక ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ ఆ అసౌకర్యం ఉండదు. విశాలమైన వరండాలు, స్తంభాల మధ్య నుంచి గాలి ధారాళంగా ప్రసరిస్తుంది. నాలుగో అంతస్తు నుంచి మరొక బావి నుంచి ఈ ప్రధాన బావితో అనుసంధానమై ఉంటుంది. దీని ఆకారం పై నుంచి చూస్తే దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. లోతుకు వెళ్తే కొద్దీ వలయాకారంగా ఉంటుంది. నీటి సంరక్షణ కోసం గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇలాంటి దిగుడు బావులు ఎక్కువ. మన తెలంగాణలో కూడా ఇటీవలి తవ్వకాల్లో ఇలాంటి బావులు బయటపడ్డాయి. భూగర్భ జలాలను రక్షించుకోవడానికి క్రీస్తు పూర్వం మూడు వేల ఏళ్ల నుంచి అనుసరిస్తున్న విధానం ఇది. వీటిని సామాజిక ప్రయోజనం కోసమే నిర్మించేవారు. పనిలో పనిగా దీనిని విహారకేంద్రంగా కూడా మలుచుకునేవారు. ఇప్పుడు గోలీవుడ్ (గుజరాత్ సినిమా ఇండస్ట్రీ) పాటల చిత్రీకరణకు మంచి లొకేషన్ అయింది. ఎండాకాలంలో ఇవి చక్కటి వేసవి విడుదులు. ఈ దిగుడు బావుల్లో మే నెలలో కూడా నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ దిగుడు బావుల పరిసరాల నుంచి ఓ పది అడుగుల దూరంలో ఎండ తీవ్రత భరించలేనంత తీక్షణంగా ఉన్నప్పుడు కూడా దిగుడు బావి దగ్గర శీతల పవనాలు వీస్తుంటాయి. అప్పటి ఆర్కిటెక్టులకు నేచురల్ ఎయిర్‌కండిషనింగ్ టెక్నాలజీ ఏదో తెలిసే ఉంటుంది. తవ్వే కొద్దీ బయట పడుతున్న సాంకేతిక చాతుర్యం ఇది. -
బావిలో పడిన జీపు నలుగురి జలసమాధి
సంగెం: ఓ జీపు అదుపు తప్పి బావిలో పడటంతో డ్రైవర్ సహా నలుగురు జల సమాధి అయ్యారు. మరో 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల వద్ద చోటుచేసుకుంది. డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామానికి చెందిన సతీష్.. నిత్యం వరంగల్ నుంచి నెక్కొండ వరకు జీపు నడుపుతుంటాడు. రోజు మాదిరిగా మంగళవారం సాయంత్రం వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద 15 మంది ప్రయాణికులను ఎక్కించుకొని నెక్కొండకు బయలుదేరాడు, మార్గమధ్యలో గవిచర్లలోని మోడల్ స్కూల్ దాటిన తర్వాత డ్రైవర్‌కు ఫిట్స్ రావడం.. ఆ సమయంలో జీపు వేగంగా ఉండటంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది. దీంతో డ్రైవర్ సతీష్ సహా నలుగురు వ్యక్తులు జల సమాధి అయ్యారు. జీపు వెనుక కూర్చున్న బండి కట్టయ్య (నెక్కొండ), బానోత్ రామచంద్రు, ఆయన భార్య విజయ (మడిపెల్లి, కస్నా తండా), గుగులోతు బుజ్జి, గుగులోతు వాగ్యా, ఆయన భార్య మంజుల, భూక్యా పీతాలి (భూక్యా తండా, మదనపురం), భూక్యా శ్రీనివాస్ (జుద్యా తండా), భూక్యా నవీన్ (రెడ్లవాడ), మాలోత్ సుజాత (మూడెత్తుల తండా)లతో పాటు మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. సహాయక చర్యల్లో భాగంగా రాత్రి 9 గంటలకు డ్రైవర్ మృతదేహాన్ని వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. భారీ మోటార్లను తెప్పించి నీటిని తోడేందుకు యత్నిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దేవుడే రక్షించాడు.. గవిచర్ల మోడల్ స్కూల్ దాటగానే డ్రైవర్ సతీష్‌కు ఫిట్స్ రావడంతో జీపును కంట్రోల్ చేయలేకపోయాడని, అదే సమయంలో గతుకుల రోడ్లపై అతి వేగంగా వెళ్తుండటంతో ప్రయాణికులు ఎగిరి టాప్కు తగిలారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొంచెం వేగం తగ్గించాలని చెబుతుండగానే జీపు అదుపు తప్పి బావిలో పడిపోయిందని ప్రాణాలతో బయటపడిన రామచంద్రు తెలిపారు. తాను ఈదుకుంటూ ఒడ్డుకు చేరి తన భార్యను రక్షించానని తెలిపాడు. తర్వాత మరో ఇద్దరు మహిళలను ఒడ్డుకు చేర్చానని పేర్కొన్నాడు. వాగ్యా, శ్రీనివాస్‌లు బయటకు వచ్చి మరో ఇద్దరి బయటకు లాగారని వివరించారు. తమను ఆ దేవుడే రక్షించాడని తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే సంగెం ఎస్సై సురేశ్ ఘటన స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అడిషనల్ డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ శ్యాం సుందర్, పర్వతగిరి ఇన్స్పెక్టర్ కిషన్, అగ్నిమాపక శాఖ సిబ్బంది డీజే లైట్ల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. నీరు ఉండటంతో బయటపడ్డాం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బావిలో నీరు నిండుగా ఉంది. ఇదే తమ ప్రాణాలు కాపాడిందని బాధితులు తెలిపారు. జీపు వెనుక భాగంలో ఉన్న 10 మందితో పాటు ముందు కూర్చున్న ఒకరు నీటిలో తేలగానే.. చెట్టు కొమ్మలను పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నామని చెప్పారు. -
ఇన్స్టాగ్రామ్ స్నేహం.. యువతిని బావిలోకి నెట్టేసి!
బెంగళూరు : సోషల్ మీడియా స్నేహం ఓ యువతి ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. ఆన్లైన్లో పరిచయమైన స్నేహితురాలిని కాటికి పంపేందుకు సాహసించాడు ఓ ప్రబుద్ధుడు. అయితే అదృష్టవశాత్తు యువతి ప్రాణాలతో బయట పడింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటుచేసుకుంది. కోలార్ జిల్లాలో నివసిస్తున్న ఓ యువతికి(22) ఇన్‌స్టాగ్రామ్‌లో ఆదర్శ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అయితే వీరిద్దరూ ఇటీవల తొలిసారిగా కలుసుకునేందకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆదర్శను కలిసేందుకు శనివారం యువతి బెంగుళూరు రూరల్ జిల్లాలోని దేవనహళ్లి ప్రాంతానికి వెళ్లింది. చదవండి: బైక్‌ను ఢీకొట్టిన కారు; చితకబాదిన స్థానికులు అక్కడ కొద్దిసేపు మట్లాడిన అనంతరం ఆమెను దగ్గరలోని పొలంలోకి తీసుకెళ్లి 60 అడుగుల లోతు బావిలోకి నెట్టివేశాడు. బావిలో పడిపోవడంతో యువతి చేయి విరిగిపోయింది. అంతేగాక దాదాపు మూడు రోజులపాటు అలాగే బావిలోనే గడిపింది. చివరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు మంగళవారం యువతిని రక్షించారు. తీవ్ర గాయాలయ్యి నీరసించిపోవడంతో యువతిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఈ చర్యకు పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేయలేదు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు విజయపుర పోలీసులు తెలిపారు. నిందితునిపై హత్యాయత్నం కేసు నమోదైనట్లు వెల్లడించారు. చదవండి: కీసర ఎమ్మార్వో ఆత్మహత్య; ముందు రోజు ఏం జరిగింది? -
రాఖీ పండుగ.. మృత్యుపాశమైన బావి
కొణిజర్ల: అక్కా రాఖీ పండుగకు మా అమ్మ వాళ్లింటికి పోతున్నా, తొందరగా నాటు పూర్తి చేద్దాం, రాఖీ కట్టడానికి మీ ఇంటికి పోతున్నావా వదినా, కరోనా ఉంది జాగ్రత్త అంటూ అప్పటి వరకు ఆనందంగా మాట్లాడుకున్న మహిళా కూలీలు అంతలోనే వ్యవసాయ బావి రూపంలో కానరాని లోకాలకు తరలిపోయారు. వ్యవసాయ బావిలో ప్రమాద వశాత్తు ఇద్దరు మహిళా కూలీలు పడి మృతి చెందిన విషాద సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొణిజర్లకు చెందిన తద్దె నాగేశ్వరరావు అనే కౌలు రైతు పొలంలో నాటు వేసేందుకు 9 మంది మహిళలు వెళ్లారు, మధ్యాహ్నానికి నాటు పూర్తి చేసారు. భోజనం చేసి వేరే రైతుకు చెందిన పొలంలో నాటు వేయాలని నిర్ణయించుకుని పక్కనే ఉన్న షేక్ చిన సైదబాబు అనే రైతు వ్యవసాయ బావి వద్దకు కాళ్లు కడుక్కోవడానికి వెళ్లారు. 9 మంది కూలీలలో బండారు మల్లిక (30), తుప్పతి రమాదేవి (35), చింతల మమత, తద్దె నాగమణి, తద్దె మౌనికలు బావిలో ఉన్న మెట్లపై ఉండి కాళ్లు కడుకొంటున్నారు. ఈ క్రమంలో మెట్టు కూలడంతో ఐదుగురు ఒకేసారి బావిలో పడిపోయారు. వారు పడిపోవడం చూసిన ముఠామేస్త్రి చింతల యల్లమ్మ తన వద్ద ఉన్న చీర విసిరి మమత, నాగమణి, మల్లికలను బయటకు లాగింది. ఈ లోగా మల్లిక, రమాదేవి బావిలో మునిగి చనిపోయారు. మహిళల కేకలు విని సమీప పొలాల్లో పని చేస్తున్న రైతులు పరిగెత్తుకొచ్చారు. బావిలో నీరు నిండుగా ఉండటంతో మోటార్ల సాయంతో నీరు బయటకు వెళ్లదీసి మృతదేహాలను బయటకు తీశారు. అప్పటి వరకు సంతోషంగా నాటు వేసిన తోటి మహిళలు అంతలోనే విగత జీవులుగా మారి పోవడంతో కూలీలు నిశ్చేష్టులయ్యారు. సంఘటనా స్థలంలో స్థానికుల రోదనలు మిన్నంటాయి. మృతి చెందిన రమాదేవికి భర్త నరసింహారావు, కూతురు మౌనిక, కుమారుడు మధు ఉన్నారు. మల్లికకు భర్త భాస్కరరావు, ఇద్దరు చిన్నారి కూతుళ్లు జస్మిత, దివ్య ఉన్నారు. ఎస్ఐ మొగిలి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ‘యల్లమ్మ’ తల్లి కొణిజర్ల: తన కళ్ల ముందే ఐదుగురు తన తోటి మహిళలు బావిలో పడగా ముగ్గురిని కాపాడుకోగలిగాను.. మరో ఇద్దరు బావిలో మునిగి పోయారని ముఠా మేస్త్రి చింతల యల్లమ్మ వాపోయింది. బావిలోపడ్డ మహిళలను ధైర్యంగా తన చీరతో ముగ్గురిని బయటకు లాగిన యల్లమ్మను పలువురు దేవతగా కొనియాడారు. ఆమె మాటల్లోనే.. నాటు పూర్తి చేసుకుని కాళ్లు చేతులు కడుక్కొని అన్నం తినడానికి సిద్ధమయ్యాం.. బండారు మల్లిక, తుప్పతి రమాదేవి, చింతల మమత, తద్దె మౌనిక, తద్దె నాగమణి బావిలోకి దిగి మెట్టుమీద నిలుచుని ముఖం కడుక్కుంటున్నారు. ఒక్కసారిగా మెట్టు కూలి పోవడంతో ఐదుగురు బావిలో పడిపోయారు. వెంటనే నా చేతిలో ఉన్న కండువా విసరడంతో మౌనిక పట్టుకుని బయటకు వచ్చింది. తర్వాత నా చీర తీసి బావిలోకి విసిరాను దాని సాయంతో మమత, నాగమణిని బయటకు లాగ గలిగాను. అప్పటికే రమాదేవి, మల్లిక రెండు సార్లు పైకి తేలి మునిగి పోయారు. నాతో పాటు మరో ఇద్దరి చీరలు కలిపి బాలిలోకి విసిరినా వారు పట్టుకోలేక పోయారు. దీంతో కళ్ల ముందే బావిలో మునిగి పోయారు. మా పక్కనే ఉన్న పొలం యజమాని కుమారుడు బావిలోకి దూకి ప్రయత్నించినా నీళ్లు బాగా ఉండటంతో బయటకు తీయలేక పోయాడు. ముగ్గురిని ధైర్యంగా కాపాడిన యల్లమ్మను పలువురు ప్రశంశిస్తున్నారు.ధైర్యంగా చీరవేసి బయటకు లాగి కాపాడిన యల్లమ్మను పొలీసులు,స్థానికులు అభినందించారు. -
అనుమానం చిన్నారి ప్రాణాన్ని చిదిమేసింది..
డెంకాడ(విజయనగరం జిల్లా): ఆలుమగలు మధ్య తలెత్తిన అనుమానం చిన్నారి ప్రాణాన్ని చిదిమేసింది. తల్లిదండ్రులను హంతుకులుగా మార్చింది. భర్త అనుమానాన్ని భరించలేక చిన్నారిని నేలబావిలో పడేసిన దురదృష్టకర ఘటన మండలంలోని డి.తాళ్లవలస గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి భోగాపురం ఇన్చార్జి సీఐ లక్ష్మణరావు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డి.తాళ్లవలస గ్రామానికి చెందిన బంక శ్రీనుకు, పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామానికి చెందిన మహాలక్ష్మికి తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఆరు, నాలుగు సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహమైన కొంతకాలం తర్వాత భార్యాభర్తల దాంపత్య జీవితంపై అనుమానాలు చోటుచేసుకున్నాయి. పెద్దకుమార్తె పుట్టిన కొన్నాళ్లకు భార్యభర్తలు ఇద్దరికి హెచ్ఐవీ పాజిటివ్ వచ్చింది. ఈ గొడవలు నేపథ్యంలోనే రెండో కుమార్తె రమ్య (4) జన్మించింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మరింత పెరిగాయి. దీంతో కొంతకాలంగా మహాలక్ష్మి తన కన్నవారి ఇంటి వద్దే ఇద్దరు కుమార్తెలతో ఉంటోంది. అయితే, మహాలక్ష్మి తండ్రి ఈ మధ్య కాలంలో మరణించడంతో అత్తవారి ఇంటిలో అడుగుపెట్టేందుకు డి.తాళ్లవలసకు ఇద్దరు కుమార్తెలతో పాటు వచ్చింది. మళ్లీ భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడంతో ఆదివారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో మహాలక్ష్మి తన రెండవ కుమార్తె రమ్యను గ్రామ సమీపంలో ఉన్న నేల బావిలో పడేసింది. అటువైపుగా వెళ్లిన వారు బావిలో తేలుతున్న చిన్నారి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. భర్త తన రెండవ కుమార్తె రమ్యపై ఉన్న అనుమానపు వేధింపులు భరించలేకే బావిలో పడేసినట్టు మహాలక్ష్మి పోలీసులకు వివరణ ఇచ్చింది. చిన్నారి మృతదేహాన్ని స్థానికుల సహాయంతో పోలీసులు బావిలో నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఘటనా ప్రదేశాన్ని విజయనగరం డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి, భోగాపురం ఇన్చార్జి సీఐ లక్ష్మణరావు, డెంకాడ, భోగాపురం ఎస్ఐలు సాగర్ బాబు, మహేష్, ఏఎస్ఐ ఎం.రాంబాబు పరిశీలించారు. నిందితుల నుంచి వివరాలు సేకరించారు. -
‘వెల్’డన్.. కుక్కపిల్లను కాపాడారు!
సాక్షి, హైదరాబాద్: శుక్రవారం రాత్రి 11.30 గంటలకు ఫోన్ మోగింది. అవతలి వ్యక్తి ఏం చెప్పాడో ఏమో! ఐదుగురు యువకులు ఆ అర్ధరాత్రే బయలుదేరారు. 200 కి.మీ. ప్రయాణించి ఓ పాడుబడిన బావికి చేరుకున్నారు. అందులోకి తొంగిచూడగా అంతా అంధకారం. దట్టంగా పెరిగిన చెట్లు దడ పుట్టిస్తున్నాయి. అయినా వెరవక అందులోకి దిగారు. బిక్కుబిక్కుమంటున్న కుక్కపిల్లను అక్కున చేర్చుకున్నారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా పునర్జీవం పోశారు. పురాతన బావిలోకి దిగి... నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామ శివారులో నిజాం జమానాలో రాతితో నిర్మించిన ఓ పురాతన వ్యవసాయబావి ఉంది. అందులో 20 రోజుల క్రితం 4 నెలల వయసున్న ఓ కుక్కపిల్ల పడిపోయింది. బాగా లోతుగా ఉన్న ఆ బావిలో చుక్క నీరులేదు. విపరీతంగా చెట్లు మొలిచాయి. అందులోకి దిగేందుకు ఎవరూ సాహసించడంలేదు. సంతోష్‌యాదవ్ అనే స్థానికుడు ఆ కుక్క పిల్లను గమనించి కొద్దిరోజులుగా పైనుంచి దానికి ఆహారం అందిస్తున్నాడు. భయంతో వణికిపోతున్న ఆ కుక్కపిల్ల చనిపోయే స్థితికి చేరడంతో దానిని రక్షించేవారికి కోసం ఇంటర్నెట్లో వివరాలు వెతికాడు. నగరంలోని ‘యానిమల్ వారియర్ కన్జర్వేషన్ సొసైటీ’వారి ఫోన్ నంబర్ కనుక్కొని సంస్థ ప్రధాన కార్యదర్శి సంజీవ్ వర్మకు శుక్రవారం రాత్రి 11.30కు ఫోన్ చేసి వివరాలు తెలిపాడు. సంజీవ్ వర్మ వెంటనే సంస్థ సభ్యులైన మెస్సీ, రాఘవ్, ప్రభు, అమర్నాథ్లతో కలసి శనివారం ఉదయం సిరికొండకు వచ్చారు. కరోనా భయం వెంటాడుతున్నా 200 కి.మీ. దూరం ప్రయాణించి వచ్చి కుక్కపిల్లను కాపాడిన ఆ యువకులను గ్రామస్తులు అభినందించారు. కొద్దిరోజుల క్రితం వరంగల్‌లో ఓ వ్యవసాయబావిలో పడిన కుక్కను , హైదరాబాద్‌లో ఓ పురాతన దేవాలయంలో ఉన్న బావిలో పడిన పిల్లిని, నగర శివారులో ఓ గుర్రాన్ని కూడా ఇలాగే రక్షించామని సంజీవ్‌వర్మ తెలిపారు. -
దేవుడు ఉన్నాడా.. లేడా ? అనే విషయంపై
వైఎస్ఆర్ జిల్లా,చింతకొమ్మదిన్నె : మద్యం మత్తులో ఓ వ్యక్తి బావిలో గంగమ్మ తల్లిని చూపిస్తానంటూ ప్రయత్నించాడు. బావి గట్టున తన మిత్రునితో కలిసి మద్యం సేవించి మాటకుమాట పెంచుకున్నాడు. దేవతను చూపిస్తానంటూ బావిలోకి దిగుతుండగా.. బండరాయి విరగడంతో కింద పడ్డాడు. తీవ్ర గాయాల పాలయ్యాడు. సీకెదిన్నె పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మద్దిమడుగు సుగాలి బిడికికి చెందిన కిశోర్ నాయక్, రామాంజనేయపురానికి చెందిన అయోధ్యరామయ్య చింతకొమ్మదిన్నె సమీపంలోని బావి గట్టున మద్యం సేవించారు. దేవుడు ఉన్నాడా.. లేడా అనే విషయంపై ఇద్దరు వాదనకు దిగారు. దేవుడు ఉన్నాడని కిశోర్ నాయక్, లేడని అయోధ్య రామయ్య వాదించారు. ఇరువురు చాలెంజ్ చేసుకున్నారు. కిశోర్ నాయక్ తాను బావిలోకి వెళ్లి గంగమ్మ తల్లిని చూపిస్తానని దిగబోయాడు. బావి పాతబడి ఉండటంతో తాపలుగా ఉన్న బండరాయి ఒక్కసారిగా బరువు తట్టుకోలేక విరిగి పోయింది. దీంతో అతను దాదాపు 75 అడుగుల లోతులో ఉన్న బావిలో పడిపోయాడు. అయోధ్య రామయ్య భయభ్రాంతులకు గురై రోడ్డు పైకి పరుగు తీశాడు. బావిలో పడిన వ్యక్తిని కాపాడాలని కేకలు వేశాడు. అక్కడున్న స్థానికులు ఫైర్ పోలీసులకు, సీకె దిన్నె పోలీసులకు సమాచారం అందించారు. బావిలో పడిన వ్యక్తిని మోకులు (తాళ్ల) సాయంతో బయటకు తీశారు. అతను తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు 108 సాయంతో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. -
ఎరక్కపోయి.. ఇరుక్కుపోయాడు
అన్నానగర్: అంబత్తూరులో ప్రియురాలిని చూడటానికి వెళ్లిన ఓ యువకుడు 75 అడుగుల లోతు బావిలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. అంబత్తూరు వెంకటాపురం కన్నిప్ప శెట్టి వీధికి చెందిన జిలాన్ (22) డిప్లొమా పూర్తి చేసి సెల్‌ఫోన్ సర్వీస్ సెంటర్లో పని చేస్తున్నాడు. ఒరగడం రోడ్డులోని ఓ యువతిని ప్రేమించాడు. ఇతను గురువారం రాత్రి స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్గ మధ్యలో ప్రియురాలు జ్ఞాపకం రావడంతో ఆమెను చూసే తీరాలని జిలాన్ ఆమె ఇంటిలోకి రహస్యంగా చొరబడ్డాడు. దీనిని పక్కింటి వారు చూసి కేకలు వేయడంతో.. ప్రియురాలి ఇంటి ఆవరణంకి పరిగెత్తి దాక్కున్నాడు. రాత్రి వేళ అక్కడున్న బావి కనిపించక అందులో పడ్డాడు. కేకలు విన్న ప్రియురాలు, ఆమె తల్లిదండ్రులు, స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చి చూశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తాడు సాయంతో జిలాన్‌ను రక్షించారు. చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. -
ఇంటి కింద 30 అడుగుల గోతిలో పడ్డాడు..
వాషింగ్టన్: సాధారణంగా బావి ఎక్కడ ఉంటుంది. ఇంటి వెనకాలో, ఇంటి ఆవరణలోని ఈశాన్యం మూలలోనో ఉంటుంది. కానీ అమెరికాలో మాత్రం ఏకంగా ఇంట్లోనే బావి ఉంది. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం. క్రిస్టోఫర్ టౌన్ అనే వ్యక్తి ఆదివారం కనెక్టికట్‌లోని తన మిత్రుడు ఇంటికి వెళ్లాడు. అతను కొత్తగా అద్దెకు దిగినందున ఆ ఇంట్లో సామాను సర్దేందుకు సహాయపడుతున్నాడు. ఈ క్రమంలో ఓ గదిలో వస్తువులు అమర్చుతున్న క్రమంలో కింద ఉన్న ఫ్లోర్ ఒక్కసారిగా విరిగిపోయింది. క్షణ కాలంలో అతను బావిలో పడిపోయాడు. అతని కేకలతో ఇంట్లోవాళ్లు పరుగెత్తుకొచ్చి బావిలోకి తొంగి చూడగా క్రిస్టోఫర్ 30 అడుగుల లోతైన బావిలో బిక్కుబిక్కుమంటూ కనిపించాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా వారు ఇంటికి చేరుకున్నారు. (బోరు నుంచి గ్యాస్.. వేమవరంలో కలకలం) అయితే బావి ఇంట్లో ఉందనడంతో వారు కూడా షాక్‌కు లోనయ్యారు. అనంతరం ఇంట్లోకి చేరుకుని అతడిని తాడు సహాయంతో బయటకు తీశారు. కొంత సమయం వరకు బావిలోనే నరకయాతన అనుభవించిన అతను కొద్దిపాటి గాయాలతో ప్రాణాలతో బయట పడ్డాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫొటోలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక ఆ బావి ఇప్పటికీ నీళ్లతో నిండి ఉండటం గమనార్హం. కాగా 1843లో ఆ ఇంటిని నిర్మించారు. అప్పుడు బావి ఇంటి వెలుపలే ఉంది. అయితే 1981లో అదనపు నిర్మాణం చేపట్టిన క్రమంలో బావిపై కూడా గదిని నిర్మించారు. అప్పుడు ఆ బావిని కేవలం చెక్కతోనే కప్పివేశారు. దీంతో అది శిథిలావస్థకు చేరుకోవడంతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. (మాయా పుస్తకం: కాలిస్తేనే చదవగలం) -
కన్నీటి బావి
కలలకు ప్రతిరూపం వాళ్లు.. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు.. తల్లీదండ్రులకు ఆశలు నెరవేర్చే∙సారథులుగా నడుస్తున్నారు.. మంచి చదువు చదివించాలని తాపత్రయం.. కూలీనాలీ చేసుకుని ఉన్నతులుగా చూడాలని ఆశ.. సాఫీగా సాగుతున్న కుటుంబాల్లో ఓ కుదుపు. పిడుగులాంటి వార్త. ఆశల సౌధం కూలిపోయింది.. ఇప్పటి వరకు కబుర్లు చెప్పిన చిన్నారులు కనిపించడం లేదు.. చలనం లేని శరీరాలను చూసి ‘తల్లి’డిల్లిపోయారు.. రెండు కుటుంబాల్లో విషాదం. ఈ ఘటన కలగరలో చోటుచేసుకుంది. విస్సన్నపేట(తిరువూరు): ఇద్దరు చిన్నారులు బావిలో మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని కలగర పంచాయతీ రామచంద్రాపురానికి గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు సమీపంలోని రావికుంట చెరువు వద్దకు చేపల పట్టుకునేందుకు వెళ్లారు. ముగ్గురిలో దుబ్బాకు శాంతకమలాకర్ కుమారుడు కౌశిక్(8), సిరెల్లి జక్రయ్య కుమార్తె శ్రావణి(12), జస్వంత్ ఉన్నారు. ముగ్గురు సరదాగా చెరువులో చేపలు పట్టేందుకు ప్రయత్నించారు. మధ్యలో వీరికి దాహం వేసింది. వెంటనే సమీపంలో ఉన్న వ్యవసాయ పొలంలో ఉన్న చిన్న బావి గుర్తుకు వచ్చింది. వెంటనే ముగ్గురు బయలుదేరి వెళ్లారు. అక్కడకు వెళ్లిన తరువాత ముగ్గురు చేతికి అందె ఎత్తులో ఉన్న నీటిని తాగేందుకు ప్రయత్నించారు. కౌశిక్, శ్రావణి ఒక వైపునే ఉన్నారు. ఈ క్రమంలో బావి అంచు జారిపడిపోయింది. ఇద్దరు బావిలో పడిపోయారు. గమనించిన తోడుగా వచ్చిన జస్వంత్ పెద్దగా కేకలు వేయడంతో సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న వారు వచ్చి బయటికి తీశారు. అప్పటికే చిన్నారులు ఇద్దరు మృతి చెందినట్లు గుర్తించారు. కుటుంబాల్లో విషాదం సిరెల్లి జక్రయ్య, సువార్తకు ఇద్దరు కుమార్తెలు. శ్రావణి ఏడో తరగతి చదువుతోంది. శ్రావణి అక్క పదో తరగతి చదువుతోంది. వీరిద్దరు సమీపంలో గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. జక్రయ్య కొంతకాలం కిందట మృతి చెందగా తల్లి ఇద్దరు పిల్లలను కూలీ పనులు చేసుకుంటూ చదివిస్తోంది. విషాద ఘటన తెలుసుకున్న తల్లి కుప్పకూలిపోయింది. కౌశిక్ తండ్రి దుబ్బాకు శాంతకుమలాకర్ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కౌశిక్‌కు సోదరి ఉంది. కేసు నమోదు.. ప్రమాద ఘటన తెలుసుకున్న వెంటనే ఏఎస్ఐ ఏఎస్ఐ సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులను విచారించారు. ప్రమాదం జరిగిన నేపథ్యంతో పాటు బావి ఉన్న పొలం రైతులతోనూ మాట్లాడారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.