
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
మల్యాల(చొప్పదండి): వ్యవసాయబావిలో పూడిక తీసేందుకు అమర్చిన జిలెటిన్ స్టిక్స్ పేలి ఇద్దరు గాయపడ్డారు. మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన బోడకుంట గంగారెడ్డి తన వ్యవసాయబావిలో పూడిక తీయిస్తున్నాడు. ఈక్రమంలో బావిలోని బండరాళ్లను తొలగించేందుకు జిలెటిన్‌స్టిక్స్ ఏర్పాటు చేశారు. ప్రమాదవశాత్తు గడ్డపార జిలెటిన్‌స్టిక్స్‌పై పడడంతో పేలగా.. బావి యజమాని బోడకుంట గంగారెడ్డి, కూలీ గొలుసుల అయోధ్య గాయపడ్డారు. వీరిని జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనుమతి లేకుండా జిలెటిన్‌స్టిక్స్ వినియోగించడంపై కేసు నమోదు చేసినట్లు మల్యాల ఎస్సై నీలం రవి తెలిపారు.