
తాటి విలాస్
తాంసి (బోథ్): అవమాన భారం భరించలేక ఒక ఉపాధ్యాయుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం గోట్కూరి గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తాటి విలాస్ (45) మావల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధు లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన నూతన పాఠ్యపుస్తకాలకు కవర్లు వేయని విద్యార్థులను ఆయన నిలదీయగా వారు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపా రు.
దీంతో వారు మర్నాడు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయు డిని ప్రశ్నించగా.. అడగడం నిజమేనని ఆయన అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో ఈనెల 18న గ్రామానికి చెందిన నిజనపురి శ్రీకాంత్ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడు తాటి విలాస్‌పై ఇదే విషయమై భౌతికంగా దాడి చేశాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఉపాధ్యాయుడు గురువారం ఇంటికి వచ్చి అర్ధరాత్రి సమయంలో గ్రామ సమీపంలోని వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ కేశవస్వామి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment