
గుంతలో ప్రవీణ్ కుమార్ మృతదేహం
జహీరాబాద్ టౌన్: మరగుదొడ్డి నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి యువకుడు మృతి చెందినట్లు జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అల్గోల్ గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ (24) బంధువుల ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. బంధువుల ఇంటిలో పెళ్లి ఉండగా మృతుడు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాడు. బుధవారం రాత్రి మద్యం తాగి పనులు చేస్తున్న సమయంలో ఫోన్ కాల్ వచ్చింది. సౌండ్ సిస్టం ఏర్పాటు చేయడంతో ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటి బయటకు వచ్చాడు.
ఇంటి పరిసర ప్రాంతం చీకటిగా ఉండడంతో మరుగుదొడ్డి కోసం తవ్విన గుంతను గమనించక అందులో పడిపోయాడు. తలకు బలంగా గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. ఇలా ఉండగా ఎమ్మెల్సీ ఫరిదొద్దీన్ విషయం తెలుసుకుని జహీరాబాద్ ఆస్పత్రికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment