భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలుడు అదుపుతప్పి బావిలో పడిపోయాడు. స్నేహితుడు బావిలో పడటాన్ని గమనించిన తోటి బాలుడు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన ఓ వ్యక్తి బావిలోకి దిగి మూడు నిమిషాల్లోనే పిల్లాడిని కాపాడాడు. పెద్ద ప్రమాదం నుంచి చిన్నారి తృటిలో బయటపడ్డాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.
వివరాలు.. దామో జిల్లాలో పవన్ జైన్ అనే పదేళ్ల బాలుడు సోమవారం సాయత్రం స్నేహితులతో కలిసి ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. అలా ఆడుతూ బావిపై కప్పి ఉంచిన గేటు అంచు మీద నడిచాడు. దీంతో ప్రమాదవశాత్తు 40 అడుగులో లోతైన బావిలో పడిపోయాడు. స్నేహితుడు బావిలో పడటాన్ని పక్కనే సైకిల్ తొక్కుతున్న మరో బాలుడు గమనించాడు. వెంటనే బావి వద్దకు పరుగెత్తుకెళ్లి తొంగి చూసి సాయం కోసం గట్టిగా కేకలు వేశాడు.
పిల్లల రోదనలు విన్న కుటుంబ సభ్యులతో సహా పలువురు ఇంట్లో నుంచి బావి వద్దకు పరుగులు తీశారు. వేగంగా స్పందించిన ఇంటి యాజమాని.. తాడు సాయంతో బావిలోకి దిగి బాలుడిని రక్షించే ప్రయత్నం చేశాడు. బావిలో పడిన చిన్నారిని కేవలం నిమిషాల వ్యవధిలోనే క్షేమంగా బయటకు తీశారు. బాలుడు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నాడని, అతనికి ఎటువంటి గాయాలు కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
చదవండి: 'కరోనా రూల్స్ పాటించాలి.. లేదా భారత్ జోడో యాత్రను ఆపాలి..'
घर के आंगन में अगर कुआं या टंकी बनी हुई है तो इस वीडियो को जरूर देखें।#damoh #MadhyaPradesh pic.twitter.com/ntVMBiWgqE
— Makarand Kale (@makarandkale) December 21, 2022
Comments
Please login to add a commentAdd a comment