
బాలుడి మృతదేహం వద్ద రోదిస్తోన్న కుటుంబసభ్యులు..అంతర్ చిత్రంలో బాలుడు జశ్వంత్ పాత చిత్రం
మల్యాల(చొప్పదండి): మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన బండారి గంగాదర్ మూడో కుమారుడు బండారి జశ్వంత్(10)మండల కేంద్రంలోని లిటిల్‌ఫ్లవర్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఉగాది పండుగ రోజు మధ్యాహ్నం జశ్వంత్ ఇంటి నుంచి వెళ్లాడు. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తమ బంధువుల ఇళ్లలో, పరిసరాల్లో వెతికారు. స్నేహితులను అడిగినా చెప్పకపోవడంతో రాత్రి వరకు వెతికారు.
గ్రామంలోని పిల్లలు తరచూ ఈతకు వెళ్లే బావి వద్దకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులకు తెలియడంతో సోమవారం తెల్లవారుజామున స్థానికులు బావిలో వెతకగా శవం లభ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రమాదవశాత్తు బావిలో పడినట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నీలం రవి తెలిపారు.