choppadandi
-
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించిన బండి సంజయ్
-
Telangana: కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య.. కారణం ఇదే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లో అల్వాల్‌లోని పంచశీల కాలనీలోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రూపాదేవి గురవారం రాత్రి అల్వాల్‌లోని పంచశీల కాలనీలోని ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక, ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే, రూపాదేవి రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లలేదు. మరోవైపు.. ఎమ్మెల్యే మేడిపల్లి ఉదయమే నియోజకవర్గానికి వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఈ సమయంలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, రూపాదేవి అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆమె గత రెండు సంవత్సరాల నుంచి తీవ్ర కడుపునొప్పి సమస్యతో బాధపడుతున్నట్టు తెలిపారు. ఈ కారణంగానే రెండు రోజులుగా స్కూల్‌కి సెలవు తీసుకొని ఇంట్లోనే ఉంటున్నారు. మరోవైపు.. రూపాదేవి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. ఇక, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్నీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
చొప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య
-
‘ఎమ్మెల్యే టికెట్టు నాదే.. ఆ దుర్మార్గుల్ని నమ్మొద్దు’
సాక్షి, కరీంనగర్: అసంతృప్త నేతలపై బహిరంగంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తరపున మళ్ళీ చొప్పదండి ఎమ్మెల్యే టిక్కెట్ తనదేనని ధీమా వ్యక్తం చేశారాయన. గంగాధర మండలం బూర్గుపల్లిలో బీసీబంధు చెక్కు పంపిణీలో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రవిశంకర్.. అసంతృప్తవాదులు చేస్తున్న ప్రచారంపై స్పందించారు. చొప్పదండి నుంచి మరోసారి ఎమ్మెల్యే టికెట్ నాదే. ఈ విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ పదే పదే చెబుతున్నారు. చాలా స్పష్టంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొందరికి వాళ్ల వాళ్ల స్థానాల నుంచే పోటీ అని చెబుతున్నారు. కానీ, కొందరు దుర్మార్గులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరూ వాటిని నమ్మొద్దంటూ ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో.. మరోసారి తనను ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. గత కొద్దిరోజులుగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు టిక్కెట్ ఇవ్వొద్దంటూ అసమ్మతి నేతలు పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ స్వయంగా ఆయన తిరుగుబాటు నేతలపై మండిపడటం, టికెట్ తనదేనని ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. -
గులాబీ ఎమ్మెల్యే ఎందుకు టెన్షన్లో ఉన్నారు?.. అక్కడ ఇదే హాట్ టాపిక్
ఆ గులాబీ ఎమ్మెల్యే ఆత్మరక్షణలో పడ్డారా? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని అనుమానిస్తున్నారా? తనవెనుక ఉన్నవారే తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆందోళన చెందుతున్నారా? అత్యంత ఆత్మీయుల సమ్మేళనాలు నిర్వహిస్తున్నా ఆ ఎమ్మెల్యే మళ్ళీ పుంజుకోగలరా? గులాబీ దళపతి ఆదరణ పొంది టిక్కెట్ సంపాదించగలుగుతారా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్సీ నియోజకవర్గాల్లో ఒకటైన చొప్పదండి ఎమ్మెల్యేగా అధికార బీఆర్ఎస్ నుంచి సుంకె రవిశంకర్ కొనసాగుతున్నారు. ప్రజల్లో, పార్టీలో ఆయనకు ఆదరణ తగ్గిందని.. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు రాదనే చర్చ నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. స్వయంగా ఎమ్మెల్యే రవిశంకర్‌కే తనకు టిక్కెట్ రాదనే అనుమానం గట్టిగా పీడిస్తోందని టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో ఆయన ఎవరినీ కలుపుకొనిపోవడంలేదన్న భావన కొందరిలో కనిపిస్తుండగా.. చొప్పదండి బీఆర్ఎస్ నేతలు మూడు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కేడర్ అభిప్రాయపడుతోంది. సిటింగ్ ఎమ్మెల్యేకు గత ఎన్నికల్లో ఆర్థికంగా, సామాజికపరంగా ఉపయోగపడ్డ కొందరు అగ్రవర్ణాల నేతలు ఈసారి రవిశంకర్‌పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు.. కరీంనగర్ కు చెందిన ఒక కార్పోరేటర్..బోయినపల్లి ఎంపీపీ సహా మరికొందరు నేతలు చొప్పదండి సీటుపై కన్నేసినట్లుగా ప్రచారం సాగుతోంది. గులాబీ పార్టీ అధిష్ఠానం నిర్వహించిన సర్వేల్లోనూ ప్రస్తుత ఎమ్మెల్యే రవిశంకర్ పరిస్థితిపై సానుకూలత కనిపించడంలేదని టాక్. స్థానికంగా పార్టీలో నెలకొన్న తలనొప్పులు.. ప్రస్తుత ఎమ్మెల్యేకు పోటీగా టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న నేతల తీరుతో సిట్టింగ్ తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలతో వచ్చే ఎన్నికలకు సంసిద్ధమవుతుంటే.. చొప్పదండి సిటింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అత్యంత ఆత్మీయ సమ్మేళనాలనూ నిర్వహిస్తున్నారట. సోషల్ మీడియాలో తగ్గేదేలే.. అందులో తనకు టిక్కెట్ వచ్చే అవకాశాలకు ఎక్కడా గండి పడకుండా మనవాళ్లంతా ప్రయత్నించాలని కోరినట్టుగా కూడా ఇప్పుడు ఓ చర్చ ప్రచారంలోకొచ్చింది. పైగా సోషల్ మీడియాలో తగ్గేదేలే అన్నట్టుగా కౌంటర్ అటాక్స్ కు కూడా సిద్ధం కావాలని.. ఎక్కడా గులాబీబాస్ దృష్టిలో తక్కువ కాకుండా ఉండేలా అన్నివిధాలా తమ నడవడిక ఉండాలని కోరినట్టు తెలుస్తోంది. తన వ్యవహారశైలితో అటు అధిష్టానం దృష్టిలో..ఇటు స్థానిక నేతలు, కార్యకర్తల దృష్టిలో నెగెటివ్ మార్కులు తెచ్చుకున్న సుంకె రవిశంకర్ తిరిగి ఒడ్డుకు చేరుకోగలుగుతారా? పార్టీ అధినేతతో టిక్కట్ తనకే ఇస్తామనే పరిస్థితి క్రియేట్ చేసుకోగలుగుతారా? పార్టీలోని ప్రత్యర్థులను దారికి తెచ్చుకోగలరా? ఇప్పుడు చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపైన, ఆయన భవిష్యత్ పైనా హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. చదవండి: ఒక్కలిగల కంచుకోటలో పాగా ఎవరిదో...! -
‘నా చావుకు ఇంటెలిజెన్స్ సీఐ కారణం.. కుటుంబానికి ప్రాణహాని’
సాక్షి, కరీంనగర్: ఇంటెలిజెన్స్ సీఐ వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. చొప్పదండి మండలంలోని భూపాలపట్నం గ్రామంలో బొడిగె శ్యామ్ అలియాస్ శంభయ్య అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తన చవుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సీఐ గోపాలకృష్ణ కారణమని, తన వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆరోపించాడు. ఈ మేరకు సుసైడ్ నోట్ రాశాడు. ఓ భూమి విషయంలో సీఐ బెదిరించినట్లు లేఖలో పేర్కొన్నాడు. సీఐ గోపాలకృష్ణ 30 లక్షలతో భూమి కొనుగోలు చేసి.. 8 నెలల్లో రెట్టింపు కోసం టార్చర్ పెట్టినట్లు వెల్లడించాడు. అసభ్య పదజాలంతో తిట్టినట్లు వాపోయాడు. గోపాలకృష్ణ వేధింపులు భరించలేక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు. సీఐ నుంచి తన కుటుంబానికి కూడా ప్రాణహాని ఉందని, ఈ లేఖను జిల్లా కలెక్టర్, ఎస్పీకి అందజేయాలని చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి సూసైడ్ నోటును స్వాదీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శంభయ్య మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శంభయ్య సుసైడ్ లేఖ ఆధారంగా పోలేసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శంభయ్య మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: విధి చిన్న చూపు: కూతురు అల్లరి చూసి ఆ తల్లి మురిసిపోయింది.. అంతలోనే -
ఉద్రిక్తతకు దారితీసిన ‘జెండా గద్దె పంచాయితీ’
రామడుగు (చొప్పదండి): కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గోపాల్రావుపేట ప్రధాన చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెతో పాటు వారం క్రితం నిర్మించిన వైఎస్సార్టీపీ జెండా గద్దెను సోమవారం స్థానిక సర్పంచ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న పంచాయతీ సిబ్బందితో తొలగించారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఎస్సై వివేక్, ట్రెయినీ ఎస్సై నరేశ్, సిబ్బంది గోపాల్‌రావుపేటకు చేరుకొని టీఆర్ఎస్ నాయకులతోపాటు సర్పంచ్‌కు నచ్చ జెప్పి పంపించారు. (చదవండి: తెలంగాణ సిగలో మరో అందం.. వెలుగులోకి కొత్త జలపాతం) అనంతరం కూల్చిన స్థలంలోని టీఆర్ఎస్ నాయకులు గద్దె నిర్మించి జెండా ఎగురవేశారు. కాగా ఘటనపై వైఎస్సార్టీపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కో-కన్వీనర్ తడగొండ సత్యరాజ్‌వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై గోపాల్రావుపేట సర్పంచ్‌పై కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేస్తామని జితేందర్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్టీపీ జెండాను కూల్చివేసిన సర్పంచ్‌ను తక్షణం అధికారులు సస్పెండ్ చేయాలని సత్యరాజ్‌వర్మ ప్రకటనలో డిమాండ్ చేశారు. గద్దె కూల్చివేత, సర్పంచ్ అవినీతిపై త్వరలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు గ్రామంలో వైఎస్సార్టీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. చదవండి: కాపురానికి రావడం లేదని సెల్‌టవర్ ఎక్కి భర్త హల్చల్ -
వైద్య విద్యార్థిని అవస్థలు .. శ్మశానంలో ‘డాక్టర్’ చదువు
మల్యాల(చొప్పదండి): ఈ చిత్రంలో కనిపిస్తున్న రేకులగది శ్మశానంలోనిది.. అందులోనే ఆన్లైన్క్లాసులు వింటోంది ఓ వైద్య విద్యార్థి.. ఎందుకంటే.. ఇంట్లో ఉంటే సెల్‌ఫోన్ సిగ్నల్స్ కరువు. మేడ మీదికి వెళ్తే కోతుల బెడద. అందుకే సిగ్నల్స్ సరిపడా ఉన్న శ్మశానవాటికనే ఆన్లైన్ క్లాసులకు వేదికగా చేసుకుంది జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్‌కు చెందిన మిర్యాల కల్పన. ఆమె ఎంసెట్‌లో 698 ర్యాంకు సాధించి 2017లో ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చేరింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటూ ఆన్లైన్ క్లాసులకు హాజరవుతోంది. ‘మా ఊర్లో సెల్‌ఫోన్ సిగ్నల్స్ సమస్య తీవ్రంగా ఉంది. గతేడాది కూడా కుటుంబసభ్యుల సహకారంతో నిత్యం శ్మశానవాటికలోనే ఆన్లైన్ పాఠాలు విన్నాను. నాలాంటి వారికోసం సెల్‌ఫోన్ సిగ్నల్స్ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి’అని కల్పన కోరుతోంది. చదవండి: మీ ఇష్టం.. గణేష్ విగ్రహాల విషయంలో ఆంక్షల్లేవ్ -
రాక్షసుడు: నాడు తండ్రిని, నేడు తల్లిని కడతేర్చాడు
చొప్పదండి: తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే కడతేర్చాడో కొడుకు. అమానుషమైన ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంటలో శనివారం రాత్రి జరిగింది. నాలుగేళ్ల క్రితం తండ్రిని కూడా చంపేశాడు. చాకుంటకు చెం దిన పోలుదాసరి రాయమల్లు–హనుమమ్మ దంపతులకు కొండయ్య ఒక్కడే సంతానం. పెళ్లయి పిల్లలు కలిగినా మద్యానికి బానిసైన కొండయ్యలో మార్పు రాలేదు. డబ్బులు ఇవ్వాలని నిత్యం వృద్ధురాలైన తల్లిని వేధించేవాడు. శనివారం రాత్రి కూడా డబ్బుల కోసం గొడవపడి తల్లిని తీవ్రంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఇంట్లో నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తండ్రిని.. కొండయ్య తీరుతో విసిగిపోయిన భార్య 15 ఏళ్ల క్రితమే అతడిని వదిలేసింది. గ్రామంలోనే వేరేచోట ఉంటోంది. రాయమల్లు–హనుమమ్మ వృద్ధాప్యంలోనూ కూలి చేసి సంపాదించిన డబ్బులో కొంత కోడలు, మనుమరాళ్లకు ఇచ్చేవారు. నిత్యం తాగి ఇంటికి వచ్చి తల్లిదండ్రులతోనూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో 2016లో రాయమల్లును తీవ్రంగా కొట్టి చంపేశాడు. తండ్రి హత్య కేసులో 10 నెలలు జైలుశిక్ష అనుభవించాడు. 2017లో హనుమమ్మ బెయిల్‌పై కొడుకును విడిపించింది. (చదవండి: చేతులు కట్టేసి డిగ్రీ విద్యార్థిని తోటలో పడేసిన దుండగలు) -
కాళేశ్వరంలో మళ్లీ ఎత్తిపోతలు
కాళేశ్వరం/మంథని: కాళేశ్వరం పథకం ద్వారా మళ్లీ నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి లక్ష్మీపంపుహౌస్లో ఆదివారం ఇంజనీరింగ్ అధికారులు రెండు మోటార్లను ఆన్ చేసి ఎత్తిపోతలను ప్రారంభించారు. లక్ష్మీపంపుహౌస్ నుంచి ఇప్పటికే 11 మోటార్లతో 22 పంపుల ద్వారా గడిచిన రెండు సీజన్లలో నీటిని ఎత్తిపోసిన విషయం తెలిసిందే. కాగా, గతేడాది ఆగస్టులో భారీ వర్షా లతో ఇంజనీర్లు మోటార్లను నిలిపివేశారు. అప్పటి నుంచి పంపుహౌస్‌లో ఎత్తిపోతలు జరగలేదు. లక్ష్మీబ్యారేజీకి జలకళ: ఈ నెల 1 నుంచి మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీలోని 85 గేట్లు మూసివేసి నీటిని నిల్వచేస్తున్నారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16 టీఎంసీల వరకు నిల్వ ఉంది. మేడిగడ్డ నుంచి కాళేశ్వరం వరకు బ్యాక్ వాటర్ 20 కిలోమీటర్ల మేరకు పెరగడంతో ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు తాజాగా ఎత్తిపోతలు ప్రారంభించారు. 10.5 టీఎంసీల లక్ష్యం: లక్ష్మీపంపుహౌస్ మోటార్ల ద్వారా డెలివరీ సిస్టర్న్‌లో ఎత్తిపోసే నీరు.. అక్కడి నుంచి గ్రావిటీ కాల్వ ద్వారా 13.5 కిలోమీటర్ల దూరాన ఉన్న అన్నారం సరస్వతీ బ్యారేజీలోకి చేరుతుంది. అక్కడి నుం చి ఎగువన ఉన్న లోయర్ మానేరుకు 8 టీఎంసీలు, ఎల్లం పల్లికి 2.5 టీఎంసీలు.. మొత్తం కలిపి 10.5 టీఎంసీల నీటిని తరలించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఏకకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ, సరస్వతి, పార్వతి, నంది, గాయత్రి పంపుహౌస్‌లలో రెండు చొప్పున మొత్తం పది మోటార్లు రన్ చేస్తున్నారు. వీటి ద్వారా ఒక చోటనుంచి మరో చోటుకు నీటిని ఎత్తిపోస్తున్నారు. 3,150 క్యూసెక్కుల నీటిని మిడ్‌మానేరుకు, అక్కడి నుంచి ఎల్ఎండీకి తరలించనున్నారు. ఎల్ఎండీ ప్రాజెక్టులోకి 8 టీఎంసీల నీరు బోయినపల్లి(చొప్పదండి): కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల ప్రారంభం కావడంతో దానికి అనుగుణంగా శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న కరీంనగర్ ఎల్ఎండీ ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం నీటి ని విడుదల చేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు 12, 13 గేట్లను ఎత్తడంతో ఒక్కో గేటు ద్వారా 1,500 క్యూసెక్కుల చొప్పు న 3 వేల క్యూసెక్కుల నీరు ఎల్ఎండీ ప్రాజెక్టులోకి వెళ్తోంది. గాయత్రి పంప్‌హౌస్ నుంచి వరద కాలువ మీదుగా మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి 3 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 25.57 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. మిడ్‌మానేరు నుంచి ఎల్ఎండీ ప్రాజెక్టులోకి 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. దేవాదుల పంపింగ్ షురూ కన్నాయిగూడెం(ములుగు): దాదాపు ఐదు నెలల తర్వాత దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ మళ్లీ ప్రారంభమైంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న జె.చొక్కారావు దేవాదుల పథకంలోని ఫేజ్–1, ఫేజ్–2లో ఒక్కో మోటారు చొప్పున శనివారం రాత్రి ఇంజనీరింగ్ అధికారులు ఆన్ చేశారు. ‘కాళేశ్వరం’ సందర్శనకు పర్యాటకులకు అనుమతి కాళేశ్వరం: దాదాపు 9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్ వద్ద పర్యాటకుల ప్రవేశానికి అధికారులు అనుమతులు ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో గతేడాది మార్చి 20 నుంచి పర్యాటకులకు అనుమతులు ఇవ్వడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాది జూన్ 8న ఆలయాలకు వెళ్లేందుకు భక్తులకు అనుమతులిచ్చినా.. ఇక్కడి పంప్‌హౌస్, బ్యారేజీల్లోకి మాత్రం బ్యారేజీ ఏజెన్సీ సంస్థలు అనుమతించడం లేదు. తాజాగా ఆదివారం నుంచి పంప్‌హౌస్‌లోకి పర్యాటకులను అనుమతిస్తున్నారు. -
చలించిపోయిన సీఎం కేసీఆర్ సతీమణి
సాక్షి, హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాలో కుటుంబ యజమాని మృతి చెందడంతో రోడ్డున పడ్డ నిరుపేద కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ చేయుతనిచ్చారు. లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి ఆ మొత్తాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు పంపించి బాధిత కుటుంబానికి అందజేసి ఆదుకోవాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యేతోపాటు టీఆర్ఎస్ నాయకులు రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామాన్ని సందర్శించి అనారోగ్యంతో చనిపోయిన నిరుపేద కమటం తిరుపతి కుటుంబాన్ని పరామర్శించారు. కాగా తిరుపతి ఇల్లు ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోవడంతో అతని భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ప్రస్తుతం మున్నూరు కాపు భవన్లో తలదాచుకుంటున్నారు. ఈ వార్త మీడియాలో రావడంతో సీఎం సతీమణి స్పందించి ఆర్థిక సహాయం ప్రకటించారు. అలాగే ఆమె సూచనతో ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి లక్ష రూపాయలు, మిగిలిన దాతలు అందించిన 2 లక్షల రూపాయలతో కలిపి మొత్తం మూడు లక్షలు ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేస్తామని, వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో చదివిస్తామని హామీ ఇచ్చారు. వారి పిల్లలకు చదువు పూర్తయ్యేవరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
భారీ వర్షాలు: దెబ్బతిన్ని పంటను పరిశీలించిన ఎమ్మెల్యే
సాక్షి, కరీంనగర్: వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతన్నకు అపార నష్టం వాటిల్లింది. ప్రాధమిక అంచనా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి పంట వేసిన రైతులకు పెట్టుబడి సైతం రాని పరిస్థితి నెలకొంది. వర్షం వరదలతో చేతికందే దశలో ఉన్న వరి పంట నేలవాలి అక్కరకు రాకుండా పోయింది. ఇప్పటికే కోసి కల్లాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి మొలకెత్తే పరిస్థితి ఏర్పడింది. పంట నష్టాన్ని చూసి రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చొప్పదండి మండలంలో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో పాటు వ్యవసాయ శాఖ అధికారులు గురువారం పర్యటించారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిన ఆయన రైతులను ఓదార్చారు. ఆరుకాలాల పాటు శ్రమించే అన్నదాతకు అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం మొలకెత్తడం చూసి అమ్ముకోవడానికి సిద్ధం చేయాలని, రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదేశం మేరకు పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రైతులకు ఏమైన ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. -
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్యానెల్‌కు చుక్కెదురు
సాక్షి, కరీంనగర్: చొప్పదండి మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ ప్యానెల్‌కు చుక్కెదురైంది. ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా బరిలో నిలిచిన ఎం.డి. అజ్జు, అమరకొండ తిరుపతి, అమీనా సుల్తానా, గండి లలితలు కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే ప్యానెల్ అభ్యర్థులు గొల్లపల్లి ప్రభావతి, ఇంద్రసేనా రెడ్డి, జహీర్, షబానాలు ఓటమి పాలయ్యారు. కౌన్సిల్లో మొత్తం 14 మంది కౌన్సిలర్లు ఉండగా, ఒకరు గైర్హాజరయ్యారు. దండె జమున అనే కౌన్సిలర్ గైర్హాజరు కాగా ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే రవిశంకర్ ఓటు వేశారు.(‘ఒక్క సంఘటన నా కళ్లు తెరిపించింది’) రవిశంకర్ ఓటు వేసిన అభ్యర్థుల్లో అమీనా సుల్తానా మినహా మిగతా ముగ్గురు ఓటమిపాలయ్యారు. తాను బలపరిచిన షబానాకే ఎమ్మెల్యే ఓటు వేయలేదు. మొత్తం నలుగురు కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా ఎమ్మెల్యే రవిశంకర్ సూచించిన నలుగురు సభ్యులను ఎన్నుకునేందుకు మెజార్టీ టీఆర్ఎస్ వర్గ కౌన్సిలర్లు నిరాకరించారు. సొంతంగా కో-ఆప్షన్ బరిలోకి మరో నలుగురిని దింపి కౌన్సిలర్లు పంతం నెగ్గించుకున్నారు. ఎమ్మెల్యే ప్యానెల్ ను ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు సహకరించారు.('చేతకాని దద్దమ్మలు కుట్రలు పన్నుతున్నారు') -
గతంలో అన్న.. ఇప్పుడు తమ్ముడు
సాక్షి, చొప్పదండి: రెండు రోజుల్లో పెళ్లి.. కొత్త జీవితం ప్రారంభించాల్సిన ఓ యువకుడిని విధి విద్యుదాఘాతం రూపంలో బలి తీసుకొని పెళ్లింట తీరని విషాదం నింపింది.. గతంలో వివాహం జరగకుండానే మొదటి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఇప్పుడు పెళ్లికి ముందే రెండో కుమారుడూ అనంతలోకాలకు వెళ్లడం ఓ తాపీ మేస్త్రీ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఎస్సై వంశీకృష్ణ కథనం ప్రకారం.. కమ్మర్‌ఖాన్‌పేటకు చెందిన పులిపాక అంజయ్య తాపీ మేస్త్రీగా పని చేస్తూ భూపాలపట్నం రోడ్డులోని చర్చి ముందు వీధిలో నివాసం ఉంటున్నాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇంటి వద్దే ఉంటుండగా కుమారుడు పులిపాక హరీష్(27) చొప్పదండిలోని డిష్ ఆపరేటర్ వద్ద కేబుల్, రీచార్జి పనులు చేస్తున్నాడు. ఇతనికి బుధవారం వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం భూపాలపట్నం రోడ్డులో అంబేద్కర్ చౌరస్తా సమీపంలో గల ట్రాన్స్ఫార్మర్ వద్ద డిష్ వైరు సరి చేస్తుండగా, మెయిన్ లైన్ మూలంగా విద్యుదా ఘాతం సంభవించి, కుప్పకూలిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు తమ వాహనంలో నగునూరులోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. గతంలో అన్న.. ఇప్పుడు తమ్ముడు అంజయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు కాగా, కూతురుకి పెళ్లి చేశాడు. పెద్ద కుమారుడు నరేష్ గతంలో రోడ్డు ప్రమాదంలో, చిన్న కుమారుడు హరీష్ ఇప్పుడు విద్యుదాఘాతంతో మృతిచెందారు. కుమారులిద్దరూ పెళ్లి కాకుండానే చనిపోవడంతో బాధిత కుటుంబీకులు రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. వీరి తల్లి కూడా గతంలోనే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. రాఖీ కట్టలేకపోయిన సోదరి రాఖీ పండుగ సందర్భంగా తనకు మిగిలిన ఒక్కగానొక్క సోదరుడికి రాఖీ కట్టాలని హరీష్ సోదరి పుట్టింటికి వచ్చింది. కానీ అతను కేబుల్ పనికి వెళ్లి చనిపోవడంతో తాను రాఖీ కూడా కట్టలేక పోయానని ఆమె రోదించింది. -
ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా చొప్పదండి
సాక్షి, చొప్పదండి: చొప్పదండి పోలీస్‌స్టేషన్‌కు జాతీయస్థాయి గుర్తింపు లభించేందుకు మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో టాప్–3లో చోటు లభించింది. దేశవ్యాప్తంగా ఉన్న15,666 పోలీస్ స్టేషన్లలో ఎంపిక చేసిన 70స్టేషన్లలో ఒకటిగా చొప్పదండి పోలీస్ స్టేషన్‌కు ఇప్పటికే ఘనత లభించింది. ఈ డెబ్భైస్టేషన్లలో మూడు ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసి ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీసీటీఎన్ఎస్ కృషి చేస్తోంది. దేశవ్యాప్త పోలీస్స్టేషన్లను ఆన్లైన్ ద్వారా ఒకే గొడుగు కిందకు తెచ్చి ఉత్తమ పోలీస్స్టేషన్లను ఎంపిక చేసేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. పలు అంశాలలో పరిశీలన జాతీయస్థాయిలో ఉత్తమ పోలీస్‌స్టేషన్ ఎంపికకు సీసీటీఎన్ఎస్ సంస్థ పలు మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ఎంపిక చేసిన డెబ్భై పోలీస్స్టేషన్లను దశలవారీగా సందర్శిస్తారు. దివ్యాంగులకు స్టేషన్లోకి రావడానికి ర్యాంపు, ప్లాస్టిక్ బ్యాగ్ డస్ట్‌బిన్, మహిళలకు ప్రత్యేక సహాయ కేంద్రం, వైర్లెస్ సదుపాయానికి ప్రత్యేకస్థలం, కేసులను ఆన్లైన్లో వెంటవెంట అప్డేట్ చేయడం, రిసెప్షన్ కార్యక్రమాలు, స్వచ్ఛభారత్ అమలు, స్టేషన్ ఆవరణను సుందరీకరించడం వంటి అంశాలతో చొప్పదండి ఉత్తమ స్టేషన్ల జాబితాలో చేరింది. ఒక్కో రాష్ట్రం నుంచి మూడు పోలీస్స్టేషన్లు ఈ జాబితాలో ఉండగా, తెలంగాణ నుంచి చొప్పదండి పోలీస్‌స్టేషన్ టాప్‌లో నిలిచింది. ఎంపిక విధానం ఇలా ఒక రాష్ట్రంలో 750కి పైగా పోలీస్స్టేషన్లుంటే మూడుస్టేషన్లను, తక్కువుంటే రెండుస్టేషన్లను, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఒక స్టేషన్‌ను పోటీకి ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా గల 15 వేలకు పైగా పోలీస్స్టేషన్ల నుంచి ఉత్తమ స్టేషన్ల జాబితాలో ఎంపికకు సీసీటీఎన్ఎస్ సంస్థలో స్టేషన్‌కు సంబంధించిన కేసుల వివరాల నమోదును ప్రాతిపాదికగా తీసుకున్నారు. మహిళపై నేరాలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు, ఆస్తుల స్వాధీనం వంటి అంశాలను పరిశీలించారు. స్టేషన్ల వారిగా కేసుల నమోదు, చార్జ్షీట్ల తయారీ, అరువై రోజుల్లో దాఖలు వంటి అంశాలను కూడా పరిశీలంచారు. క్రైం ప్రివెన్షన్, పనితీరు, కేసుల పరిష్కారం, నేరాల అదుపునకు చర్యలు, కమ్యూనిటీ పోలీసింగ్‌పై పరిశీలన జరుగనుంది. సదుపాయాలు, అభివృద్ధి పనుల ద్వారా 80 శాతం, ప్రజల ఫీడ్‌బ్యాకు ద్వారా 20 శాతం మార్కులు రానున్నాయి. తొలిసారిగా సీసీ కెమెరాలు కరీంనగర్ పోలీస్‌కమిషనర్‌గా కమలాసన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక సీసీ కెమెరాలకు ప్రాధాన్యం ఇచ్చారు. చొప్పదండిలో ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశానికి స్పందన రావడంతో జిల్లాలోనే తొలిసారిగా సీసీ కెమెరాలుచొప్పదండిలో ప్రారంభించారు. స్టేషన్ ఆవరణలో పచ్చదనం, రిసెప్షన్ సుందరీకరణ, ఆన్లైన్ విధానం అమలు, నాన్‌బెయిలబుల్ వారెంట్ల పరిష్కారానికి ప్రత్యేక క్రైం బృందం వంటి అంశాలలో చొప్పదండి పోలీసులు ముందున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే ఎంపిక చేసిన 70 పోలీస్ స్టేషన్లలో పరిశీలన అనంతరం ఎంపిక చేసే మూడు పోలీస్ స్టేషన్లలో చొప్పదండి స్టేషన్ నిలువాలని ఆశిద్దాం. ఆన్లైన్ ద్వారా కేసులు పోలీస్ స్టేషన్లో నమోదయ్యే కేసుల వివరాలను ఆన్లైన్ ద్వారా దేశవ్యాప్త పరిశీలనకు భాగస్వాములమయ్యాం. చొప్పదండి స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో సీసీ కెమెరాల బిగింపుతో నేరాలను అదుపు చేస్తున్నాం. కమిషనర్ కమలాసన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నంబర్‌వన్‌గా నిలుస్తామని ఆశిస్తున్నాం. – బి చేరాలు, ఎస్సై, చొప్పదండి -
కొండగట్టు బస్సు ప్రమాదానికి ఏడాది
సాక్షి, చొప్పదండి: ఆ భయానక క్షణం ఇంకా వారిమదిలో మెదులుతోంది. ఆ బస్సు ప్రమాద గాయాలు నిత్యం సలుపుతున్నాయి. కన్నవారిని.. ఉన్నవారిని.. కట్టుకున్నవారిని.. ఆత్మీయులను.. అయినవారిని దూరం చేసుకుని ఏడాది అవుతున్నా.. ఆ కన్నీళ్లు నేటికీ ఆరడం లేదు. వారి కష్టాలు తీరడం లేదు. గుర్తుకొచ్చినప్పుడల్లా.. గుండెలవిసేలా రోదిస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం.. అదో ఘోర కలి. దేశంలోనే అతిపెద్ద ప్రమాదం.. జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డుపై బస్సు ప్రమాదం జరిగి నేటికి ఏడాది.. 65మందిని పొట్టన పెట్టుకున్న ఆ ‘మృత్యుఘాట్’ సంఘటన దృశ్యాలు పలువురి మదిలో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి. వందమందికి పైగా ప్రయాణించిన బస్సులో 24మంది ఘటనాస్థలంలో.. 41మంది చికిత్స పొందుతూ ప్రాణాలు విడవగా.. మరెందరో మంచానికే పరిమితమయ్యారు. బస్సు ప్రమాద బాధితుల్లో ఏడుగురికి పరిహారమే అందలేదు. దీంతో కొడిమ్యాల మండలంలోని నాలుగు గ్రామాల వారిని పలుకరిస్తే.. కన్నీళ్లే మాటలుగా వస్తున్నాయి. కొండగట్టు బస్సుప్రమాదం జరిగి నేటికి ఏడాదవుతున్నప్పటికీ.. నాటి పెనువిషాదం నుంచి కొడిమ్యాల మండలంలోని నాలుగు గ్రామాలు ఇంకా తేరుకోలేదు. చనిపోయినవారి జ్ఞాపకాలతో కుటుంబ సభ్యులు దుఃఖిస్తుండగా, మానని గాయాలతో, చికిత్సకోసం అయ్యే ఆర్థికఇబ్బందులతో క్షతగాత్రులు నరకయాతనను అనుభవిస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలు, గాయపడ్డ బాధితుల ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ. నాటి సంఘటనపై ఎవరిని కదిలించినా కన్నీళ్లు వెల్లువెత్తుతున్నాయి. జీవితకాలపు విషాదాన్ని మిగిల్చిన బస్సుప్రమాదం నుంచి బాధిత కుటుంబాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించడంలేదు. ఆ ప్రమాదంలో 65 మంది మృతిచెందగా, 50 మంది గాయపడ్డారు. ప్రభుత్వం అందించిన పరిహారం బాధితకుటుంబాల వేదనను తీర్చలేదు. నాయకుల పరామర్శలు వారిలో ఆత్మస్థైర్యం నింపలేదు. విధివంచితులు తమ తలరాతలను తల్చుకుని తల్లడిల్లిపోతున్నారు. చీకటి రోజుకు ఏడాది.. కొండగట్టు: చీకటి రోజుకు నేటితో ఏడాది. దేశంలోనే అదో పెద్ద ప్రమాదం. ఆ ఘ టనలో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైనాయి. గతేడాది సెప్టెంబర్ 11న ఆర్టీసీ బస్సు లోయలో పడి 65మంది చనిపోయారు. క్షతగాత్రులు ఇప్పటికీ మంచాల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఘాట్‌రోడ్డు మూసివేత.. ఘటన జరిగిన వెంటనే అధికారులు ఘాట్‌రోడ్‌ను పూర్తిగా మూసివేశారు. ఎలాంటి వాహనాలకు అనుమతులు ఇవ్వలేదు. అనంతరం రోడ్డు సెఫ్టీ అథారిటీ ఐపీఎస్ డీజీపీ కష్ణప్రసాద్, ఢీల్లీకి చెందిన పలు రోడ్డు సెఫ్టీ సంస్థలు, ఇతర అధికారులు ఘటనా స్థలారనికి చేరుకుని ప్రమాదతీరును పరిశీలించారు. నూతన ఘాట్ ఇలా.. ఘటన తర్వాత అధికారులు దాదాపు కోటి రూపాయలతో ప్రమాద స్థలంతో పాటు మరికొన్ని చోట్ల రెయిలింగ్, క్రాష్ బేరియర్స్, బూమ్ బేరియర్స్, కల్వర్ట్స్, రక్షణ గోడలు, దొంగలమర్రి నుంచి నాచుపెల్లి జేఎన్టీయూ మీదుగా సూచికబోర్డులు ఏర్పాటు చేశారు. పాత ఘాట్ రోడ్డు 1.5కి.మీ ఉండగా రోడ్డు సెఫ్టీ, ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షించిన మార్పు చేసి 300మీటర్లు అదనంగా పెంచారు. దొంగలమర్రి నుంచి నాచుపెల్లి, జేఎన్టీయూ, అక్కడనుంచి కొండమీద ఉన్న వై జంక్షన్ సమీపంలోని హరిత హోటల్, ఆలయం ఎదురుగా బీఎస్ఎన్ఎల్ టవర్ దిగువ వరకు, అక్కడి నుంచి ప్రమాదం జరిగిన స్థలం వరకు కొత్త రోడ్డుమ్యాప్ 9.6 కిలో మీటర్లు సిద్ధం చేశారు. రూ.111 కోట్లతో నాలుగు లైన్ల రహదారిని నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. 10కి.మీ. అదనపు రవాణా.. ఘాట్‌రోడ్డు బంద్ కావడంతో దిగువ కొండగట్టు నుంచి దొంగలమర్రి మీదుగా గుట్టమీదకు చేరుకునేందుకు దాదాపు 10కి.మీ. ప్రయాణం పెరిగింది. దీంతో భక్తులకు కావాలసిన వాహనాలు ఆర్టీసీ వారు ఏర్పాటు చేశారు. చిన్నపాటి అవస్థలు పడుకుంటూ భక్తులు కొండకు చేరుకొని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అంతుచిక్కని వైనం.. ఘాట్‌రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికీ అధికారులు అధికారికంగా తెలపడంలేదు. డ్రైవర్ నిర్లక్ష్యమా? బ్రేకులు ఫెయిల్? అధిక లోడ్? బస్సు ఫిట్నెస్ లేకపోవడం?ఇలా అనేక సందేహాలు ఉన్నాయి. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు కొండ మీద నుంచి మరో బస్సును నడిపి పరీశీలించారు. స్థానిక అధికారులు, ఢిల్లీ నిపుణులు కొండకు వచ్చి అనేక విధాలుగా ఆధారాలు సేకరించుకొని వెళ్లారు తప్ప నేటికి ప్రమాదం ఎలా జరిగిందో స్పష్టం చేయలేకపోయారు. బస్సు నేటికి మల్యాల పోలీస్‌స్టేషన్ వద్దే ఉంది. బతికున్నందుకు బాధపడుతున్నా.. శనివారంపేటకు చెందిన గోలి లక్ష్మికి అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రికి వెళ్లేందుకు తోడుకోసం కోనాపూర్‌లో ఉండేకూతురు ఎల్లమ్మను రమ్మంది. బస్సుప్రమాదంలో కూతురు చనిపోయింది. లక్ష్మి రెండుకాల్లు, రెండుచేతులు విరిగాయి. నుజ్జునుజ్జయిన ఎడమకాలును వైద్యులు మోకాలు పైభాగం వరకు తొలగించారు. మిగతా కాలు, రెండు చేతులకు రాడ్లువేశారు. లక్ష్మి తానున్నచోటునుంచి కదలలేదు. కొట్టివేసిన కాలుకు ఇన్ఫెక్షన్ వచ్చి చీముకారుతుంద ని, నొప్పి భరించలేకపోతున్నానని వృద్ధురాలు చేసే రోదనలు చుట్టుపక్కలవారికి కంటనీరు తెప్పిస్తున్నాయి. ప్రతీ పదిహేను రోజులకోసారి జగిత్యాలలోని ఆసుపత్రికి వెళ్లేందుకు అయ్యే ఆర్థికభారాన్ని వారి పేదకుటుంబం భరిం చలేకపోతోంది. లక్ష్మికి కాలు తొలగించినా వికలాంగ పెన్షన్ రావడంలేదు. తనకు జైపూర్కాలును అమర్చాల ని బాధితురాలు కోరుతున్నది. అమ్మమ్మ వెంట తీసుకెళ్లడంతోనే తన తల్లి చనిపోయిందని మనవడు సరిగా మాట్లాడడంలేదు. తానుకూడా అదేరోజు కూతురుతోపాటు చనిపోతే బాగుండేదంటున్న వృద్ధు రాలి వేదన కఠిన హృదయాలను సైతం కరిగించేలా ఉన్నది. నడవలేక నరకయాతన.. హిమ్మత్‌రావుపేటకు చెందిన పెంచాల లక్ష్మి, కూతురు సౌందర్య ప్రమాదంలో గాయపడ్డారు. ఉపాధి కోసం బ్రూనై వెళ్లిన భర్త నర్సయ్య తిరిగివచ్చాడు. లక్ష్మి కాలుచర్మం పూర్తిగా పాడవడంతో శరీరంలోని వేరేప్రదేశంలోని చర్మాన్నితీసి కాలుకువేశారు. కాలుకు, చేయికి రాడ్వేశారు. కొత్తగా వేసిన చర్మానికి ఇన్ఫెక్షన్వచ్చి కాలు వాచింది. మంచం దిగి నడవలేని పరిస్థితిలో వేదనపడుతున్నది. – తల్లితో సౌందర్య -
చొప్పదండి ఎమ్మెల్యేకు చుక్కెదురు.!
సాక్షి, బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని మాన్వాడలోని శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) ప్రాజెక్టు పరిసరాల్లో సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను నీలోజిపల్లి, కుదురుపాక గ్రామానికి చెందిన నిర్వాసితులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మిడ్‌మానేరు ప్రాజెక్టు కట్ట పరిసరాల్లో ఎంపీ సంతోష్‌కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటేందుకు ఎమ్మెల్యే వచ్చారు. మొదట ప్రాజెక్ట్ సమీపంలోని ప్రైవేట్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం తనను నిర్వాసితులు అడ్డుకుంటారనే ముందస్తు సమాచారంతో నిర్వాసితులు ఉన్న ప్రాంతం నుంచి కాకుండా మిడ్‌మానేరు కట్టపై నుంచి గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొనేందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమాచారం అందుకున్న నిర్వాసితులు అక్కడికి వెళ్లి ఎమ్మెల్యే వాహనం ఎదుట బైఠాయించారు. వెంట ఉన్న పోలీసులు నిరసనకారులను అడ్డుతప్పించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే రావాలని నిర్వాసితులు పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే తన వాహనం దిగి నిర్వాసితులు కూర్చున్న స్థలం వద్దకు వచ్చి కూర్చున్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఇళ్ల నిర్మాణాలకు రూ.5.04 లక్షలు పరిహారం ఇస్తామని సీఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని, 18 ఏళ్లు నిండిన యువతులకు రూ.2 లక్షల ప్యాకేజీతోపాటు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ను బతిమిలాడి నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి, ఇప్పుడు మాట ఎందుకు మారుస్తున్నారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో సమస్యలపై మాట్లాడేందుకు రావాలని ఎమ్మెల్యే వారిని కోరినా స్పందించకపోవడంతో బైఠాయించిన నిర్వాసితులను పోలీసులు పక్కకు తొలగించడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పొలం పనుల్లో ఎమ్మెల్యే బిజీ
సాక్షి, గంగాధర(కరీంనగర్) : ప్రజా సమస్యల పరిష్కారం, పలు అభివృద్ధి కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉండే చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన వ్యవసాయ పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. బుధవారం గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామంలోని పొలంలో వరి సాగు పనుల్లో పాల్గొన్నారు. పొద్దున్నే పొలంలోకి ఎడ్లబండిపై నారు జారవేశారు. అనంతరం పొలంలో నారు పంచి వేశారు. ఎమ్మెల్యే పొలం పనులు చేయడాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. -
ఆఫీసర్.. నేను ఎమ్మెల్యేనయ్యా
సాక్షి, కరీంనగర్ : ‘ఆఫీసర్ నేను ఎమ్మెల్యేను.. కార్యక్రమ ఆహ్వానితుడను..’ అంటూ తన ను అడ్డుకున్న పోలీస్ అధికారికి చొప్పదండి ఎమ్మెల్యే చెప్పుకోవాల్సి వచ్చింది. స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులుకు ఆహ్వాన లేఖలు పంపిం చారు. గురువారం వేడుకలకు హాజరయ్యేం దుకు వచ్చిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను వారికి కేటాయించిన ప్రాంతంలోకి రాగా ఓ సీఐ అనుమతించలేదు. దీం తో ఆఫీసర్ నేను చొప్పదండి ఎమ్మెల్యేనంటూ తనను తాను చెప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత సదరు అధికారి లోనికి అనుమతించారు. ప్రధాన గేట్ వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ గార్డ్ కార్యక్రమానికి వస్తున్న పలువురిపై దురుసుగా మాట్లాడుతూ నెట్టివేయడం కనిపించింది. ఈవిషయం అధికారుల దృష్టికి తీసుకపోయినా స్పందన కరువైంది. -
రెండు నెలలు..11 వేల కరెంట్ బిల్లు
సాక్షి, చొప్పదండి(కరీంనగర్) : ప్రతి రెండు నెలలకు ఐదు వందల నుంచి వేయి లోపు రావాల్సిన కరెంట్ బిల్లు ఒకేసారి పదకొండు వేలు రావడంతో వినియోగదారుడు లబోదిబోమంటున్నాడు. మండలంలోని బూర్గుపల్లి గ్రామానికి చెందిన విలాసాగరపు సంతోష్‌కుమార్‌కు సర్వీస్ నంబర్ 722పై విద్యుత్ కనెక్షన్ ఉంది. ప్రతీ రెండునెలలకోసారి బిల్లు ఐదు వందల రూపాయల నుంచి వేయి వచ్చేది. కాగా ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు మీటర్ రీడింగ్ 1285 యూనిట్లు తిరిగినట్లు రూ.11 వేల 2 రూపాయలు చెల్లించాలని బిల్లు తీసి అందించారు. మీటర్ తీసుకున్నప్పటి నుంచి ఏనాడు వేయి దాటని బిల్లు ఇంతపెద్దమొత్తంలో రావడంపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. విద్యుత్ సిబ్బందిని సంప్రదించినా ఫలితం లేదని వాపోయాడు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాడు. -
మంత్రులు ఈటల, కొప్పుల మానవత్వం
కొడిమ్యాల(చొప్పదండి) : అధికారిక కార్యక్రమం కంటే ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడటమే ప్రథమ కర్తవ్యంగా భావించారు మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ముగ్గురు బాధితులను తమ కాన్వాయ్‌లోని వాహనంలో ఆస్పత్రికి పంపించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గోపాల్‌రావుపేటకు చెందిన కోమటి శేఖర్, భార్య నళిని, కుమారుడు చందూతో కలసి శనివారం కరీంనగర్‌లోని కూతురు ఇంటికి బైక్‌పై బయలుదేరారు. ఆరెపేట శివారులో వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు జగిత్యాలలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను ప్రారంభించేందుకు కరీంనగర్ నుంచి వస్తున్నారు. రోడ్డుపక్కన విలపిస్తున్న ప్రమాద బాధితులను చూసి వాహనాలు ఆపి వారి వద్దకు వచ్చారు. క్షతగాత్రులను తమ కాన్వాయ్‌లోని ఓ వాహనంలో కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. మానవత్వంతో స్పందించిన మంత్రులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. -
అన్నదాతల ఆందోళన
సాక్షి, చొప్పదండి: వ్యవసాయానికి సరఫరా చేస్తున్న విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇరువై రోజులుగా మండలంలో అప్రకటిత కోతలు అమలు చేస్తుండటంతో పంటలు సాగు చేసిన రైతులకు సమస్యగా మారింది. విద్యుత్‌శాఖ అధికారులు ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ సరఫరాలో కోత విధిస్తుండటంతో కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు తికమక పడుతున్నారు. వ్యవసాయానికి ఇరువై నాలుగు గంటల కరెంటు సరఫరా చేస్తున్నా, వేసవి సమీపించడంతో అప్రకటిత కోతలు ప్రారంభమయ్యాయి. రబీ సాగుపై ఆశతో బావులపై ఆధారపడి పంటలు వేసిన రైతులకు కరెంటు కోతలు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ కోతలు ఉదయం, పగలు, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా అమలవుతుండటంతో రైతులు కరెంటు కోసం వేచి చూసే పరిస్థితి ఉంది. పొట్టదశలో పొలాలు ప్రస్తుతం రైతులు సాగు చేసిన వరి పంటలు పొట్టదశలో ఉన్నాయి. ఈసమయంలో తగినంత నీరు ఉంటేనే రైతులు ఆశించినట్లుగా పంట చేతికి వస్తంది. ఇక మొక్కజొన్న పంట కంకులు పాలుపోసుకొనే దశలో ఉన్నాయి. బావుల్లో నీటి మట్టం తగ్గుతుండటంతో ఒకవైపు రైతుల్లో ఆందోళన పెరుగుతుండగా, కరెంటు కోతలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యుత్ కోతలతో బావులలోని నీరు కాలువలు పారకానికే సరిపోతుందని, పగటి పూట తప్పని సరిగా విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. కోతల సమయం రైతులకు తెలయక పోవడంతో కరంటు కోసం రైతులు తమ సమయాన్ని వృథా చేసుకొనే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. చీకట్లో పొలాల గట్ల వెంట పురుగు పూసి ఉంటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులను సంప్రదించినా కరంటు కోతలపై స్పష్టమైన సమాచారం అందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వాలి రైతులకు పగటిపూట విద్యుత్ సరఫరా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈసమయంలో ముందస్తు ప్రకటన లేకుండా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. కోతలపై ట్రాన్స్‌కో అధికారులు స్పష్టమైన వైఖరి కలిగి ఉండాలి. ఇబ్బందులకు గురి చేయడం తగదు. కోతలుంటే ముందస్తు ప్రకటనలు చేయాలి. – జి రాజశేఖర్‌రెడ్డి, రైతు, చొప్పదండి కోతలు లేకుండా చూడాలి ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా ట్రాన్స్‌కో అధికారులు కరెంటు సరఫరా చేయాలి. ఇరువై నాలుగు గంటల కరెంటు సరఫరా ప్రకటనలతో పంటలు సాగు చేశాం. పంటలు చేతికి వచ్చే సమయంలో చెప్పా చెయ్యకుండా విద్యుత్ కోతలు విధించడం సరైన పద్ధతి కాదు. అధికారులు పట్టించుకోవాలి. – ఎం రవీందర్‌రెడ్డి, రైతు, చొప్పదండి సమాచారం మేరకు వ్యవహరిస్తాం పవర్ గ్రిడ్ నుంచి వచ్చిన సమాచారం మేరకు నడుచుకుంటాం. అప్రకటిత కోతలు ఎప్పుడు ఉండవు. విద్యుత్ కోతలు అమలులో లేనందున, సమాచారం అందించడం ఏమీ ఉండదు. విద్యుత్ సరఫరాపై వస్తున్న సమాచారంతో వ్యవహరిస్తున్నాం. ఒక్కోరోజు విద్యుత్ సరఫరాలో కోతలు లేకుండా కూడా కరెంట్ సరఫరా చేస్తున్నాం. – రాజు, ఏఈ, ట్రాన్స్‌కో -
పెళ్లి కావడంలేదని యువతి..
బోయినపల్లి(చొప్పదండి) : మండలంలోని స్తంభంపల్లి గ్రామానికి చెందిన తంగళ్లపల్లి అనిత(27) తనకు వివాహం కావడం లేదనే మనస్తాపంతో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి తెలిపారు. అనిత కొంత లావుగా ఉండడంతో వివాహ సంబంధాలు కుదరడం లేదు.. సంబంధాలు వచ్చి వెళ్లడంతో మానసికంగా కుంగిపోయింది. 15 రోజులుగా ఆరోగ్యంగా ఉండడం లేదు. దీంతో తల్లిదండ్రులు మానసిక వైద్యుని వద్ద చికిత్స చేయించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంట్లోనే పురుగుల మందు తాగింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వేములవాడ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అనిత మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వివాహం కావడం లేదనే మానసిక బాధలతో తన కూతురు అనిత ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆ ఊర్లో ఎన్నికలన్నీ ఏకగ్రీవమే..
గత పంచాయతీ ఎన్నికలకు ముందు అది అనుబంధ గ్రామం. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయంటే తమ గ్రామ అభ్యర్థిని ఒక్కరినే నిలబెట్టడం ఆనవాయితీ. పక్కనే గ్రామ పంచాయతీ కార్యాలయం ఉన్న గ్రామంలో వంద ఓట్లు అధికంగా ఉన్నా.. సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో అనుబంధ గ్రామస్తులే గెలుస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో తమ గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో గ్రామంలో ఒకే అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చి సర్పంచ్ స్థానంతో సహా వార్డు పదవులన్నీ ఏకగ్రీవం చేసి మంగళపల్లి గ్రామస్తులు ఆదర్శంగా నిలిచారు. చొప్పదండి: నియోజకవర్గంలోనే తొలిసారి ఏర్పడిన గ్రామ పంచాయతీకి పాలకవర్గం ఏకగ్రీవం చేసుకొని ఇతర గ్రామాలకు మార్గదర్శకంగా మారారు మంగళపల్లి గ్రామ ఓటర్లు. గతంలో 2013 పంచాయతీ ఎన్నికల వరకు చిట్యాలపల్లి గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న మంగళపల్లి 2013 సంవత్సరంలో ప్రత్యేక పంచాయతీ హోదా పొందింది. గ్రామస్తులు ఒకే మాట, ఒకే బాటలో నడవడంతో ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన స్థానాలకు ప్రభుత్వం ఇచ్చే నజరానాలూ పొందింది. రెండున్నర దశాబ్దాల పోరాటం.. మంగళపల్లిని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులు రెండున్నర దశాబ్దాలుగా పోరాడారు. తమ ఆశలు నెరవేరకపోవడంతో గ్రామస్తులంతా ఏకమై సర్పంచ్ స్థానం కోసం గ్రామం నుంచి ఒక్కరినే అభ్యర్థిగా నిలబెడుతూ వచ్చారు. మండల వ్యవస్థ ఏర్పడిన అనంతరం చిట్యాలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా చిట్యాలపల్లి, మంగళపల్లి గ్రామాల మధ్య జరిగిన ‘పంచాయతీ’ పోరులో మంగళపల్లి గ్రామస్తులే గెలుస్తూ వచ్చారు. చిట్యాలపల్లిలో వంద ఓట్ల వరకు అదనంగా ఉన్నా.. సర్పంచ్ ఎన్నికల బరిలో గెలిచేది మంగళపల్లి అభ్యర్థులే కావడం గమనార్హం. 1989లో వెల్మ తిరుపతిరెడ్డి, 1996లో గాండ్ల శ్రీనివాస్, 2001లో పెద్దిళ్ళి బక్కమ్మ, 2006లో వెల్మ శ్రీనివాస్‌రెడ్డి మంగళపల్లి గ్రామం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక 1996లో వెల్మ మల్లారెడ్డి ఈ గ్రామం నుంచి ఎంపీటీసీగా గెలిచి అయిదేళ్లపాటు ఎంపీపీగా పని చేశారు. ప్రభుత్వం 2013లో ఏర్పాటు చేసిన కొత్త గ్రామ పంచాయతీల్లో మంగళపల్లిని చేర్చడంతో గ్రామస్తుల సొంత ‘పంచాయతీ’ కల నెరవేరింది. అదే స్ఫూర్తితో ఏకగ్రీవం గత ఎన్నికలకు ముందు కొత్తగా ఏర్పాటు చేసిన మంగళపల్లి గ్రామ పంచాయతీని ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. ఇరువురు అభ్యర్థులు నామినేషన్ వేయగా, ఇద్దరు బంధువులే కావడంతో ఒకరు ఉపసంహరించుకున్నారు. దీంతో పెద్దెళ్ళి అంజమ్మ ఒక్కరే బరిలో మిగిలడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఇక గ్రామంలో ఎనిమిది వార్డులుండగా.. అన్ని స్థానాల్లోనూ ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు చేశారు. -
ఆ స్థానం అల్లుడు కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలి
-
‘ఆ స్థానం అల్లుడు కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ జిల్లా జన్మను, పునర్జన్మను ఇచ్చిందని ఆపధర్మ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యాంచారు. కేసీఆర్ చొప్పదండి అల్లుడని.. అక్కడ మరోసారి గెలిచి ఆయనకు కానుక ఇవ్వాల్సిన బాధ్యత అక్కడి ప్రజలపై ఉందని ఆయన అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో చొప్పదండి నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన నేతలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రత్యేక పరిస్థితుల్లో చొప్పదండి అభ్యర్థిని మార్చాల్సి వచ్చిందని ఆయన వివరించారు. శోభకు ఓపిక లేక పార్టీ మారారని.. ఎవరెన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ అభ్యర్థి రవిశంకర్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు వచ్చిందని.. ఈ విషయం కాంగ్రెస్ నాయకులు గుర్తించకపోవడం బాధకరమన్నారు. కాంగ్రెస్ నాయకులు కోదండరాంను కరివేపాకులా వాడుకుంటున్నారని పేర్కొన్నారు. మహాకూటమికి ఓటు వేస్తే సొంత రాష్ట్రంలోనే పరాయి వాళ్లం అవుతామని.. పొరపాటున కూడా ఆ పార్టీలకు ఓటు వెయ్యవద్దని కోరారు. సీట్లు కూడా సరిగ్గా ఖరారు చేసుకోలేని వాళ్లు రేపు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని ఆయన ప్రశ్నించారు. -
టీఆర్ఎస్కు బొడిగె శోభ గుడ్ బై?
సాక్షి, కరీంనగర్: టీఆర్ఎస్ టికెట్ తనకే కేటాయిస్తారనే ఆశతో వేచిచూసిన చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఆ పార్టీకి గుడ్ బై చెప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్‌లోనే 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. చొప్పదండితో పాటు మరికొన్ని స్థానాలను పెండింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి చొప్పదండి స్థానాన్ని తనకు కేటాయించకుండా పెండింగ్‌లో ఉంచడంపై .. శోభ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. చొప్పదండి సీటు దక్కించుకోవడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నించినప్పటికి.. టీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఎటువంటి సానుకూల ప్రకటన వెలువడలేదు. నేడో, రేపో కేసీఆర్ చొప్పదండి టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించనుండగా.. శోభకు టికెట్‌పై ఎటువంటి హామీ లభించలేదు. దీంతో చొప్పదండి స్థానం నుంచి ఎలాగైన బరిలోకి దిగాలని భావిస్తున్న శోభ.. పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో ఆమె తన ప్రయత్నాలను వేగవంతం చేశారు. ఇప్పటికే ఆమె బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిన్న తన అనుచరులతో సమావేశమై పార్టీ మారడంపై చర్చించిన ఆమె ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. బుధవారం ఆమె తన భవిష్యత్ కార్యచరణను ప్రకటించే అవకాశం ఉంది. -
ఉద్యోగినిని లోబరుచుకునేందుకు విందు..!
సాక్షి, కరీంనగర్ : చొప్పదండి మున్సిపల్ కమిషనర్ నిత్యానంద్ వింతప్రవర్తన వివాదాస్పదంగా మారింది. మహిళా ఉద్యోగిని లోబరుచుకునేందుకు విందు ఏర్పాటు చేశారని స్థానికంగా విమర్శలున్నాయి. తొలుత ఫోన్లో ఆమెను లోబర్చుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో విందు భోజనం పేరుతో ఉద్యోగులందరినీ ఆయన ఇంటికి పిలిచారని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులను విందుకు ఆహ్వానించారని సమాచారం. ఈ తతంగం నచ్చని ఓ మహిళా ఉద్యోగి మీడియాకు సమాచారం ఇచ్చారు. అక్కడికి మీడియా వెళ్ళడంతో కమిషనర్ పరార్ అయ్యారు. ఇటీవలనే మున్సిపాలిటిగా ఏర్పడిన చొప్పదండికి కమిషనర్‌గా 15రోజుల క్రితం హైదరాబాద్ నుంచి నిత్యానంద్ బదిలీపై వచ్చారు. అప్పటి నుంచే మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ క్రింద పనిచేసే మహిళా ఉద్యోగులపై కన్నేశాడని సమాచారం. ఈ క్రమంలోనే మహిళా ఉద్యోగినిలకు గిఫ్ట్‌లు ఇచ్చేవారని తెలుస్తోంది. ఆ గిఫ్ట్‌లను నిరాకరిస్తే పలు రకాలుగా వేధించేవారని విమర్శలున్నాయి. నిత్యానంద్ మహిళలను టార్గెట్ గా చేసుకొని వింతగా ప్రవర్తిస్తున్నారని విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
వివాదాస్పదంగా చొప్పదండి మునిసిపల్ కమిషన్ తీరు
-
బోయినపల్లి అల్లుళ్లు
బోయినపల్లి (చొప్పదండి): రాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలం ప్రత్యేక గుర్తింపు సంత రించుకుంది. కేవలం 28 వేల పైచిలుకు ఓటర్లు ఉన్న ఈ చిన్న మండలం ఎన్నికల వేళ ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. బోయినపల్లి మండలానికి ప్రముఖ నేతలతో ఉన్న బంధుత్వం, అనుబంధాలే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఈ మండలం అల్లుళ్లు కావడం.. అనేక మంది ప్రముఖుల చుట్టరికం ఉండటంతో ఈ మండలవాసులు తెగ ఫీలవుతుంటారు. ‘ఫలానోడు మా మండలం అల్లుడోయి’అని గర్వంగా చెప్పుకుంటారు. బోయినపల్లి మం డలం కొదురుపాక గ్రామానికి చెందిన జోగినిపల్లి కేశవరావు, లక్ష్మి దంపతుల కూతురు శోభను పరిణయమాడిన సీఎం కేసీఆర్ కొదురుపాకకు అల్లుడయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు మండలంలోని కోరెం గ్రామానికి చెందిన చెన్నాడి సత్యనారాయణరావు, లచ్చమ్మ దంపతుల కూతురు వినోదను వివాహమాడారు. కార్యకర్తలు, విద్యాసాగర్‌రావు ఎంపీగా, ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. కరీంనగర్ ఎంపీగా పార్లమెంట్లో తన గళం వినిపిస్తున్న బోయినపల్లి వినోద్‌కుమార్ సైతం ఇక్కడి అల్లుడే. మండలంలోని కోరెం గ్రామానికి చెందిన చెన్నాడి మార్తాండరావు–రాజ్యలక్ష్మి కూతురు మాధవిని ఆయన వివాహమాడారు. రాజ్యసభ సభ్యుడూ ఈ మండలవాసే కేసీఆర్ తోడల్లుడు మండలంలోని కొదురుపాకకు చెందిన జోగినిపల్లి రవీందర్రావు కుమారుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే దివంగత చెన్నమనేని రాజేశ్వరరావు మండలంలోని మాన్వాడలో జన్మించి ఇక్కడే బాల్యం గడిపారు. ఆయన కూతురును మండలంలోని నర్సింగాపూర్‌కు చెందిన జోగినిపల్లి రాజేశ్వరరావుకు ఇచ్చి వివాహం చేశారు. కరీంనగర్ చల్మెడ ఆసుపత్రి అధినేత లక్ష్మీనరసింహరావుకు కోరెం గ్రామంతో చుట్టరికం ఉంది. రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నాయకులతో బోయినపల్లి మండలానికి అనుబంధం ఉండటం ఎన్నికలప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటారు. -
బొడిగె శోభకు మళ్లీ చుక్కెదురు!?
సాక్షి, చొప్పదండి : టికెట్ విషయంలో అసంతృప్తితో రగిలిపోతున్న చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు మళ్లీ చుక్కెదురైనట్లు సమాచారం. శోభ వ్యవహార శైలితో టీఆర్ఎస్ పార్టీకి పెద్దఎత్తున నష్టం వాటిల్లనుందంటూ నియోజకవర్గంలోని ప్రముఖ నేతలంతా తమ అధినాయకుడు కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అసెంబ్లీ రద్దు అనంతరం కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో శోభకు చోటు కల్పించలేదు. అంతేకాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజక వర్గాల అభ్యర్థులను ప్రకటించి.. చొప్పదండి అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే పెండింగ్‌లో పెట్టడంతో శోభ అనుచరగణంలో ఆందోళన మొదలైంది. కాగా అప్పటి నుంచి ఇంటికే పరిమితమైన శోభ.. సోమవారం కేసీఆర్‌ను కలిసేందుకు విశ్వ ప్రయత్నం చేసినా అపాయింట్మెంట్ దొరకలేదని తెలిసింది. దీంతో ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్‌లను కలిసి టికెట్ కేటాయింపు విషయమై సహకరించాలని కోరినట్లు సమాచారం. కాగా ఆ విషయం కేసీఆర్ చేతిలోనే ఉందని, తామేమీ చేయలేని చెప్పడంతో శోభ వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శోభ వ్యవహార శైలితో టీఆర్ఎస్ పార్టీకి పెద్దఎత్తున నష్టం వాటిల్లనుందంటూ నియోజకవర్గంలోని ప్రముఖ నేతలంతా తమ అధినాయకుడు కేసీఆర్‌కు పిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శోభక్క లేకుండానే...!! టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజక వర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలన్నీ శోభ కనుసన్నల్లోనే జరిగేవి. కాగా మండల కేంద్రంలో సోమవారం జరిగిన టీఆర్ఎస్ పార్టీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించింది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శోభ లేకుంగా పార్టీ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి. దీంతో శోభను పక్కన పెట్టేందుకే పార్టీ ప్రముఖులు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఏఎంసీ సమావేశానికి శోభ వర్గీయుల గైర్హాజరు.. శోభ పట్ల పార్టీ అధినాయకత్వం తీరును నిరసిస్తూ ఆమె వర్గీయులైన.. వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ బుచ్చయ్య, మరొకొంత మంది డైరెక్టర్లు పాలక వర్గ సర్వ సభ్య సమావేశానికి గైర్హారయ్యారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కార్యదర్శి బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. -
సంతానం లేదని .. ప్రాణం తీసుకున్నారు
ఉమ్మడి జిల్లాలో ఇద్దరు యువకుల ఆత్మహత్య సాక్షి, కరీంనగర్ (చొప్పదండి) : ‘నాకు పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పాడు..ఇక నాకు బతకాలని లేదు.. నన్ను క్షమించండి..నా చావుకు ఎవరూ బాధ్యులు కారు’.. అని సూసైడ్ నోటు రాసి, హనుమాన్ దీక్షలో ఉన్న యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్యాల మండలంలోని తక్కళ్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తక్కళ్లపల్లి గ్రామానికి చెం దిన ఎడ్ల మనోజ్(25) ఆరు నెలల క్రితం వివా హం చేసుకున్నాడు. పిల్లలు పుట్టడం లేదంటూ పదిహేను రోజుల క్రితం మనోజ్ ఆస్పత్రికి వెళ్లగా, పలు పరీక్షలు చేసిన అనంతరం వైద్యుడు మనోజ్‌కు పిల్లలు పుట్టరని తేల్చి చెప్పా డు. దీంతో మానసికంగా కుంగిపోయిన మనోజ్ బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలాన్ని ఎస్సై నీలం రవి పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కనగర్తిలో ఒకరు.. ఇల్లందకుంట(హుజూరాబాద్): మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన దరుగుల వెంకటేష్ (32)జీవితంపై విరక్తి చెంది ఇంట్లోఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. వెంకటేశ్‌కు ఏడేళ్లక్రితం నిర్మల అనే మహిళతో వివాహం జరిగింది. అప్పటి నుంచి పిల్లలు పుట్టకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి కుటుంబసభ్యులు గమనించారు. అతడి తండ్రి మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై నరేష్కుమార్ కేసు నమోదు చేశారు. -
ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడి మృతి
మల్యాల(చొప్పదండి): మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన బండారి గంగాదర్ మూడో కుమారుడు బండారి జశ్వంత్(10)మండల కేంద్రంలోని లిటిల్‌ఫ్లవర్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఉగాది పండుగ రోజు మధ్యాహ్నం జశ్వంత్ ఇంటి నుంచి వెళ్లాడు. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తమ బంధువుల ఇళ్లలో, పరిసరాల్లో వెతికారు. స్నేహితులను అడిగినా చెప్పకపోవడంతో రాత్రి వరకు వెతికారు. గ్రామంలోని పిల్లలు తరచూ ఈతకు వెళ్లే బావి వద్దకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులకు తెలియడంతో సోమవారం తెల్లవారుజామున స్థానికులు బావిలో వెతకగా శవం లభ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రమాదవశాత్తు బావిలో పడినట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నీలం రవి తెలిపారు. -
చొప్పదండి ఎమ్మెల్యేపై ఫిర్యాదు
కరీంనగర్‌క్రైం: చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ అకారణంగా తనపై దాడి చేశారని పేర్కొంటూ రామడుగు మండలం తిర్మాలాపూర్‌కు చెందిన తడగొండ నర్సిం బాబు టూటౌన్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ నివాసం వద్ద తాను, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ సుంకే రవిశంకర్‌తో కలిసి ఉండగా.. అదే సమయంలో ఎమ్మెల్యే శోభ వచ్చారని, లిఫ్ట్ వద్ద ‘నన్ను కలువకుండా రవిశంకర్‌తో తిరుగుతావా..’ అంటూ అకారణంగా దుర్భాషలాడుతూ.. కుడిచెవి పట్టుకుని లాగి లిఫ్ట్‌లోకి తోశారని పేర్కొన్నారు. ఆ తర్వాత గన్‌మెన్‌తో కలిసి ఎమ్మెల్యే తీవ్రంగా కొట్టారని తెలిపారు. వారినుంచి తప్పించుకుని లిఫ్ట్ నుంచి బయటకురాగా ‘నీ అంతుచూస్తా..’ అంటూ బెదిరించారని, ఎమ్మెల్యేతో తనకు ప్రాణభయం ఉందని కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని టూటౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్‌గౌడ్ తెలిపారు. -
చిన్నారిని చిదిమేసిన లారీ
గంగాధర (చొప్పదండి) : అప్పటివరకు ఆ చిన్నారి అమ్మ వెంటే ఉంది. అక్కతో కలిసి ఆడుకుంది. శివరాత్రి సందర్భంగా పాఠశాలకు సెలవు రావడంతో ఇంట్లోనే అందరితో ఆనందంగా గడిపింది. మరికొద్దిసేపటికి శివుడిని దర్శించుకునేందుకు ఆలయానికి వెళ్దామని అనుకుంటుండగా.. ఓ లారీ మృత్యురూపంలో వచ్చి ఆ చిన్నారిని చిదిమేసింది. కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన ఈ ఘటన పండుగపూట ఆ ఇంట్లో విషాదం నింపింది. అప్పటివరకూ తనపక్కనే ఆడుకుంటూ ఉన్న కూతురు రెప్పపాటులో విగతజీవిగా మారడంతో ఆ తల్లి రోదన కంటతడి పెట్టించింది. సంఘటనకు సంబంధించిన వివరాలు.. గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి జంగిలి వసంత, తిరుపతి దంపతులకు ఇద్దరు కూతుళ్లు గంగోత్రి, రక్షిత సంతానం. వారిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు. మంగళవారం శివరాత్రి కావడంతో చిన్నకూతురు రక్షిత (9) ఉదయం నుంచే ఇంటి పనుల్లో నిమగ్నమైంది. శివుడిని దర్శించుకుందామని ఉద్దేశంతో ఉదయమే స్నానాలు పూర్తిచేసుకుంది. పండుగ సామగ్రి కోసం తల్లి వసంత గంగాధర చౌరస్తాకు ఆటోలో వెళ్తుండగా.. తానూ వస్తానని మారాం చేసింది. కూతురును కాదనలేక ఆ తల్లి వెంటతీసుకెళ్లి తిరిగి.. ఇంటికి చేరుకుంది. వసంత ఆటోడ్రైవర్‌కు డబ్బులు ఇస్తుండగా.. రక్షిత ఇంటికెళ్లేందుకు రోడ్డుదాటాలని పరుగెత్తింది. ఇంతలో వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది. లారీ వెనుకటైర్లు తలపై నుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జు అయ్యింది. విషయం తెలుసుకున్న ఎస్సై స్వరూప్‌రాజ్ సంఘటనస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఢీ కొట్టిన లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడని ఎస్సై పేర్కొన్నారు. మిన్నంటిన రోదనలు అప్పటివరకు కళ్లముందే ఆడుకున్న తన కూతురు ఇక లేదని తెలిసి ఆ తల్లి రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. కుటుంబసభ్యులు, బంధువులు సంఘటనస్థలానికి చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. ‘శివుడా.. నీ దర్శనం కోసం వస్తామని అనుకుంటే నీ దగ్గరకే తీసుకెళ్లావా..’ అంటూ తల్లి రోదించిన తీరు కలిచివేసింది. -
ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి
మల్యాల(చొప్పదండి): నడుస్తున్న ట్రాక్టర్ పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి బాలుడు మృతిచెందిన ఘటన మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అట్ల అంజవ్వ, నారాయణరెడ్డి దంపతులు కూలీపని చేస్తుంటారు. వీరికి ఒక్కగానొక్క కొడుకు రాజు(15) ఉన్నాడు. ఐదోతరగతి వరకు చదివిన రాజు ట్రాక్టర్‌పై కూలీపనికి వెళ్తుండేవాడు. గురువారం ఉదయం ట్రాక్టర్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించేలోపు మార్గంమధ్యలో మృతిచెందాడు. మానవత్వం చూపిన సైనికుడు.. రాజు గాయపడడం చూసిన స్థానికులు ఆస్పత్రికి తరలించేందుకు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న ఆర్మీసైనికుడు దూడ తిరుపతి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. మల్యాల వ్యవసాయ మార్కెట్ సమీపంలోకి చేరుకోగా, అక్కడి నుంచి 108లోకి తరలించారు. రాజు అప్పటికే మృతిచెందాడని సిబ్బంది నిర్ధారించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లి అంజవ్వ రాజు మృతదేహంపై పడి ఏడ్చిన తీరు అందరినీ కలచివేసింది. తల్లి అంజవ్వ ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదుచేసినట్లు ఎస్సై నీలం రవి తెలిపారు. -
జామకాయలు కోస్తుండగా..
సాక్షి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో విషాద సంఘటన జరిగింది. బంధువుల ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. మానకొండూరు మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన దాసరి గంగ(38) వెదురుగట్ట గ్రామంలో బోనాలు పెట్టుకుంటే చూసిపోదామని బంధువుల ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో భవనం పైకి ఎక్కి జామకాయలు తెంపుతుండగా విద్యుత్ తీగలు తగిలి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బంధువుల, మృతురాలి కుటుంబంలో విషాదం అలుముకుంది. -
కన్నతల్లిపై కుమారుడి హత్యాయత్నం
కరీంనగర్ : చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లినే హతమార్చబోయాడో ఓ కుమారుడు. రాగంపేట గ్రామానికి చెందిన సత్తమ్మ(50)కు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు రాజిరెడ్డి(30) ఉన్నారు. కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి వరకట్నం కింద కొంత భూమిని వారికి ఇచ్చింది. ఆ భూమి విషయంలో కుమారుడు రాజిరెడ్డి, తల్లి సత్తమ్మతో కొంతకాలంగా గొడవపడుతున్నాడు. ఇదే విషయమై శుక్రవారం తల్లితో గొడవపడి కొబ్బరి బోండాల కత్తితో స్వంత మామిడితోటలోనే హత్యాయత్నం చేశాడు. స్థానికులు అడ్డుకోవడంతో సత్తమ్మ ప్రాణాలతో బయటపడింది. ఘటన అనంతరం రాజిరెడ్డి పరారయ్యాడు. సత్తమ్మను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లెదర్ పార్కు కోసం కాంగ్రెస్ రాస్తారోకో
చొప్పదండి(కరీంనగర్ జిల్లా): చొప్పదండి మండల రుక్మాపూర్ గ్రామంలో గల రిజర్వు భూముల్లో లెదర్ పార్కు ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెసు పార్టీ గ్రామ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎల్పీ ఉప నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మృత్యుంజయం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. లెదర్ పార్కు ఏర్పాటుకు ఎమ్మెల్యే బొడిగ శోభ బాధ్యత వహించాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని విమర్శించారు. -
ఈ నెల 10న పెళ్లి జరగాల్సి ఉండగా..
చొప్పదండి(కరీంనగర్ జిల్లా): చొప్పదండి మండల కేంద్రానికి చెందిన సంధ్యారాణి(26) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సంధ్యారాణికి ఇటీవలే నిశ్చితార్ధం జరిగింది. ఈ నెల10న పెళ్లి జరగాల్సి ఉండగా.. సంద్యారాణి నాయనమ్మ మృతిచెందడంతో పెళ్లి వాయిదా పడింది. సంధ్యారాణి ఓ ప్రైవేటు స్కూల్లో హిందీ టీచర్‌గా పనిచేస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చొప్పదండిలో కార్డన్ సెర్చ్
చొప్పదండి: కరీంనగర్జిల్లా చొప్పదండిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 37 ద్విచక్ర వాహనాలను, 25 లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 11 క్వింటాళ్ల బియ్యాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. -
రీజినల్ మీట్ పోటీల సందడి
చొప్పదండి : చొప్పదండిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆటలపోటీలతో సందడి వాతావరణం నెలకొంది. రీజినల్ స్థాయి చెస్, యోగా పోటీలకు నాలుగు రాష్ట్రాల నుంచి హాజరైన రెండువందలకు పైగా విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యేందుకు కుస్తీ పడుతున్నారు. బాలురు, బాలికల విభాగంలో చెస్, యోగా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలు హర్యానాలో జరిగే పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపాల్ మంగతాయారు తెలిపారు. 29న జిల్లా స్థాయి త్రోబాల్ టోర్నమెంట్ ౖయెటింక్లయిన్‌కాలనీ : ౖయెటింక్లయిన్‌కాలనీ సీఈఆర్ క్లబ్లో సోమవారం జిల్లా స్థాయి త్రోబాల్ టోర్నమెంట్, ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు ఐలి శ్రీనివాస్, పాశం ఓదెలు యాదవ్ తెలిపారు. అండర్–14, అండర్–17 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. పోటీలకు హాజరయ్యే విద్యార్థులు ఎస్జీఎఫ్ఐ ఫామ్‌తో రావాలని సూచించారు. టోర్నమెంట్లో పాల్గొనే పాఠశాలల జట్లు ఒకరోజు ముందుగా 9849484631నెంబరులో సమాచారం ఇవ్వాలని కోరారు. -
48 అకౌంట్ల ద్వారా ఉగ్రవాదుల నిధుల సేకరణ
కరీంనగర్ : చొప్పదండి బ్యాంకు దోపిడీ కేసుకు సంబంధించి దర్యాప్తు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. 48 బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఉగ్రవాదులు నిధులు సేకరించినట్లు వారి దర్యాప్తులో వెల్లడైంది. బ్యాంక్ చోరీ సొత్తు ద్వారా భారీ ఆస్తులు కూడగట్టినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ సహా ఉద్యోగులందర్నీ తుపాకీతో ఓ గదిలో బంధించిన దుండగులు లాకర్లో ఉన్న రూ.46 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఈ దోపిడీకి పాల్పడింది అబు ఫైజల్ గ్యాంగ్‌గా విచారణలో తేలింది. చోరీ సొమ్ముతో ఈ గ్యాంగ్ హైదరాబాద్‌తోపాటు తిరుపతిలోనూ కొన్ని స్థలాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలతో పాటు ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం ఈడీ సైతం అప్రమత్తమై దీనిపై విచారణ జరుపుతోంది. -
ఆ చోరీకి పాల్పడింది.. ఉగ్రవాదులే!
-
ఉగ్ర పేలుళ్లకు ‘చొప్పదండి సొమ్ము’
పక్కా కుట్రపన్నిన జమాత్ అల్ ముజాహిదీన్ బ్యాంకు దోపిడీకి పాల్పడింది అబు ఫైజల్ గ్యాంగ్ బుర్ద్వాన్ పేలుడు ఘటనలో దొరికిన నోట్ల కట్టలు ‘ఉగ్ర’ నగదుతో హైదరాబాద్, తిరుపతిలో స్థలాలు ఆర్థిక సహకారంలో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ కీలకం లోతుగా ఆరా తీస్తున్న దర్యాప్తు అధికారులు, ఈడీ సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి ఓ ముష్కరమూక తప్పించుకుంది... కొన్ని నెలలకే కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బ్యాంకు దోపిడీకి పాల్పడింది... ఆ సొమ్మును వినియోగించి హైదరాబాద్‌తోపాటు తిరుపతిలోనూ కొన్ని స్థలాలు కొనుగోలు చేసింది... అదే సొమ్ముతో దీపావళి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పేలుళ్లకు పథక రచన కూడా చేసింది... అయితే బాంబుల తయారీకి యత్నిస్తుండగా జరిగిన పేలుడుతో ఈ కుట్ర మొత్తం బట్టబయలైంది. ఈ నెల మొదటివారంలో పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో జరిగిన ఈ పేలుడు కేసు దర్యాప్తులో పలు కీలక కోణాలు వెలుగులోకి వచ్చాయి. జమాత్ అల్ ముజాహిదీన్ పేరుతో కొత్తగా ఏర్పడిన ఈ మాడ్యూల్‌కు హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలతో పాటు ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం ఈడీ సైతం అప్రమత్తమై దీనిపై లోతుగా ఆరా తీస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలివీ... అబు ఫైజల్ నేతృత్వంలో జైల్ బ్రేక్... ఉత్తరప్రదేశ్‌కు చెందిన అబు ఫైజల్ ముంబైలో ఉన్న జుహూ కేంద్రంగా కార్యకలాపాలు సాగించాడు. నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి) మాడ్యూల్‌కు చెందిన ఇతడు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి గత ఏడాది అక్టోబర్ 1న మరో ఆరుగురితో(మహబూబ్, అంజాద్, అస్లం, ఎజాజ్, జకీర్, అబిద్) కలసి పరారయ్యాడు. ఇది జరిగిన నాలుగు గంటల్లోనే వారిలో ఒకడైన అబిద్ చిక్కగా మిగతా వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనేక ప్రయత్నాల తరవాత డిసెంబర్లో మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో అబు ఫైజల్ చిక్కాడు. పరారీలో ఉన్న మిగిలిన ఐదుగురూ మరికొందరితో కలసి కొత్తగా జమాత్ అల్ ముజాహిదీన్ పేరుతో కొత్త మాడ్యూల్ ఏర్పాటు చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా, బంగ్లాదేశ్‌కు చెందిన హుజీ-బి, దేశవాళీ సంస్థ ఇండియన్ ముజాహిదీన్లలోని ఉగ్రవాదులతో ఇది ఏర్పాటైంది. దీపావళి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన ఈ మాడ్యూల్ అందుకు అవసరమైన సొమ్ము కోసం దోపిడీల బాటపట్టింది. కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు సానుభూతిపరుల సహకారంతో ఆ జిల్లాలో కొంతకాలం బస చేసిన ఉగ్రవాదులు అనేక ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. చివరకు చొప్పదండిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను టార్గెట్‌గా చేసుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 1న పంజా విసిరారు. బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ సహా ఉద్యోగులందర్నీ తుపాకీతో ఓ గదిలో బంధించిన దుండగులు లాకర్లో ఉన్న రూ.46 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. పేలుడుతో బయటపడిన భారీ కుట్ర... పశ్చిమబెంగాల్లోని బుర్ద్వాన్‌లోని ఖాగ్రాఘర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో ఈ నెల 2న భారీ పేలుడు సంభవించింది. స్థానిక టీఎంసీ నేతలకు చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్న కొందరు భారీ ఎత్తున బాంబుల్ని తయారు చేస్తుండగా వాటిలో కొన్ని పేలిపోయాయి. ఈ ఘటనలో బాంబులు తయారు చేస్తూ మరణించిన వ్యక్తిని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న గ్యాంగ్‌లో ఒకడిగా గుర్తించారు. ఘటనా స్థలి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదుపై చొప్పదండి ఎస్బీహెచ్ బ్యాంక్ లేబుళ్లు, ముద్రలు సైతం ఉన్నాయి. అదే ప్రాంతంలో 55 పేలని బాంబుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు అధికారులు.. హఫీజ్ మొల్లా, షేక్ అహ్మద్, హసన్ సాహెబ్‌లతో పాటు మరో ఇద్దరు మహిళలు రజియా బీబీ, అలీమా బీబీలను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్లో సెప్టెంబర్ 12న ఇదే తరహా పేలుడు సంభవించింది. ఈ ఇంటిలో బాంబులు తయారు చేస్తున్నది ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న వారిగా దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. అక్కడ-ఇక్కడ పేలని బాంబులు ఒకే మెకానిజంతో ఉండటంతో ఒకరి పనిగా స్పష్టమైంది. విచారణలో తిరుపతి, హైదరాబాద్ ప్రస్తావన.. బుర్ద్వాన్ పేలుడు కేసులో దర్యాప్తు అధికారులు అరెస్టు చేసిన నిందితుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీపావళికి ఈ మాడ్యూల్ దేశవ్యాప్తంగా ఏకకాలంలో పేలుళ్లకు కుట్రపన్నినట్లు వెల్లడైంది. ఈ ఉగ్రవాద సంస్థకు పరోక్షంగా ఆర్థిక సహకారం అందిస్తున్న వారిలో హైదరాబాద్‌లో స్వచ్ఛంద సంస్థ ముసుగులో నిధుల సమీకరణ చేస్తున్న ఓ మహిళ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ సంస్థ సభ్యులు తలదాచుకోవడంతోపాటు బాంబులు తయారు చేయడానికి వినియోగించే విధంగా స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి హైదరాబాద్‌తో పాటు తిరుపతి పరిసరాల్లోనూ కొన్ని స్థలాల్ని కొనుగోలు చేయడానికి యత్నించి నట్లు వెలుగులోకి వచ్చింది. బుర్ద్వాన్-చొప్పదండి లింకు వెలుగులోకి రావడంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు మూడు రోజుల క్రితం చొప్పదండి వెళ్లారు. స్థానిక పోలీసుల నుంచి ఆ కేసు వివరాలతో పాటు అప్పట్లో సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫుటేజ్‌ను సేకరించి విశ్లేషిస్తున్నారు. ఆందోళనకరంగా మారిన ఈ అంశాలపై కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ, ఈడీ లోతుగా ఆరా తీస్తున్నాయి. చొప్పదండి బ్యాంకు దోపిడీలో హఫీజ్ మొల్లా, షేక్ అహ్మద్, హసన్ సాహెబ్, రజియా బీబీ, అలీ మా బీబీల పాత్రను అనుమానిస్తున్న దర్యాప్తు అధికారులు ఆ కోణంలోనూ విచారిస్తున్నారు. -
చెంబట్క పోవుడే..!
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పడకేసింది. మంజూరైన వాటిలో ఇప్పటి వరకు కనీసం సగం కూడా పూర్తికాలేదు. మొదట్లో నిర్మాణాలను ప్రోత్సహించిన అధికారులు.. ఇప్పుడు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు నిర్మాణం అంచనా వ్యయం పెరగనుందనే ప్రచారం జరుగుతుండడంతో పథకం ముందుకు సాగడంలేదు. చొప్పదండి : జిల్లాలో 2.20 లక్షల మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యూరుు. వీటిలో ఈ నెల రెండో వారం వ రకు కేవలం 72 వేల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యూరుు. మరో 30 వేలు పగతిలో ఉన్నారుు. ఇంకా 1.18 లక్షలు అసలే ప్రారంభం కాలేదు. పూర్తరుున వాటికి డబ్బులు మంజూరు చేసిన సంబంధిత శాఖ అధికారు లు.. పూర్తికాని విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఫలితంగా పథకంలో ఎలాం టి పురోగతి లభించడంలేదనే ఆరోపణలున్నారుు. గత యూపీఏ ప్రభుత్వం ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.10 వేలు కేటారుుంచిం ది. ఇందులో లబ్ధిదారుని వాటా రూ. 900 పోను ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 4,500, నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద లబ్ధిదారుడికి రూ. 4,600 అందించింది. ఎన్నిక ల ముందు ఉపాధి హామీ పథకం మొత్తాన్ని పెంచింది. కుటుంబంలో జాబ్‌కార్డు ఉంటే ఒక్కో లబ్ధిదారుడికి రోజుకు రూ.149 చొప్పున కూలీతో 35 రోజుల పనిదినాలు కల్పించి రూ. 5,275లు చెల్లించింది. పూర్తయిన నిర్మాణాలకు రంగులు అద్దేందుకు.. ఫొటో దిగేందుకు అదనంగా రూ. 125 చొప్పున కేటారుుంచింది. నిలిచిన నిర్మాణాలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో పురోగతి సాధించడం లేదు. లబ్ధిదారులకు ఆసక్తి ఉన్నా.. పెరిగిన ధరలతో ప్రభుత్వ సాయం సరిపోవ డం లేదని పేదలు ముందుకు రావడం లేదు. ఎంత తక్కువ ఖర్చుతో నిర్మించినా రూ. 20 వేలకు పైగా అవుతున్నాయని పలువురు వాపోయారు. మంజూరైన పలువురు లబ్ధిదారులకు ఇంటి ఆవరణలో సరిపడా స్థలం లేక కూడా నిర్మాణాలు ప్రారంభించ లేదు. పలు మండలాలలో పావలావంతు కూడా పూర్తికాలేదు. పెరగనున్న సాయం? గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్యం కోసం ఇంటికి మరుగుదొడ్డి ఉండాలనే సంకల్పంతో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.15 వేల వరకు లబ్ధిదారులకు అందించాలనే ప్రయత్నంలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చారుు. దీంతో లబ్ధిదారుల్లో ఆనందం నెలకొంది. కాగా పెంచే మొత్తంపై ఇప్పటి వరకు ఎలాంటి విధివిధానాలు ఖరాలుకాలేదు. అధికారులూ ఏమి చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే మంజూరై నిర్మాణం పూర్తిచేసుకున్న వారికి బిల్లు మంజూరు చేసిన అధికారులు.. మొన్నటి ఎన్నికల తర్వాత కొత్తగా ఎవరికీ వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరూ చేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టే పథకంపై లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఇచ్చిన అనుమతులు పూర్తి చేసి.. కొత్తగా మంజూరు చేసే వాటికే కొత్త పథకం అమలు చేసే అవకాశాలు ఉన్నాయని ఉపాధి హామీ సిబ్బంది అంటున్నారు. నిర్మల్ భారత్ అభియూన్ అమలుకు, ఉపాధి హామీ పథకంతో సంబందం లేకుండా చేస్తారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం రూపొందించే కొత్త పథకం అమలవుతుందా..? లేదా..? అమలైనా అది ఎప్పటి నుంచి అనే క్లారిటీపై అన్ని సందేహాలే ఉన్నారుు. అప్పటి వరకు ఈ పథకం ముందుకు సాగే అవకాశాలు ఎంత మాత్రం కనిపించడంలేదు. ఎలాంటి ఉత్తర్వులు రాలేదు.. - లక్ష్మి, ఏపీవో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. డబ్బులు సరిపోవడం లేదని చాలామంది నిర్మాణాలు చేపట్టడంలేదు. మరికొందరు స్థలం ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అందుకే పథకం వందశాతం పూర్తికావడం లేదు. మరుగుదొడ్లు అందరూ నిర్మించుకోవాలి. పారిశుధ్య పరిరక్షణకు తోడ్పడాలి. -
ఇప్పుడైనా జమయ్యేనా..
- ఇన్పుట్ సబ్సిడీ కోసం రైతుల ఎదురుచూపులు - వెంటనే జమ చేయాలని కేసీఆర్ ఆదేశం చొప్పదండి : నాలుగేళ్లుగా నీలం తుఫాన్, పై-లీన్ తుఫాను, వర్షాలు, వరదలతో జిల్లాలో రైతులు పంట నష్టపోయారు. వరి, మొక్కజొన్న, మామిడి పంటలు నష్టపోయిన రైతుల వివరాలను ఆయా సందర్భాలలో అధికారులు నమోదు చేసి, ప్రభుత్వానికి నివేదికలు అందించారు. పంట నష్ట పరిహారం కోసం పలు సందర్భాలలో రైతులు ఆందోళనలు సైతం నిర్వహించారు. నివేదికల ఆధారంగా అప్పటి ప్రభుత్వాలు పరిహారం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. కానీ, రైతులకు ఇప్పటివరకు పరిహారం మాత్రం అందలేదు. 2011లో సుమారు రూ.3.41 కోట్లు, 2012లో రూ.4.53 కోట్లు, 2013లో సుమారు రూ.11 కోట్ల వరకు పంట నష్టం జరిగినట్లు తేల్చారు. వీటిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏళ్లుగా ఎదురుచూపులు గత మే నెలలో జిల్లాకు రూ. 50.89 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరైందని అధికారులు ప్రకటించారు. ఇందులో ఉద్యానవన పంటలకు రూ. 15.44 కోట్లు మంజూరు కాగా, ఆహార పంటలకు రూ. 35.41 కోట్లు మంజూరయ్యాయి. 2012లో ఉద్యానవన పంటలపై ప్రృతి కన్నెర్ర చేయడంతో 1,700 హెక్టార్లలో 2,313 మంది రైతులు నష్టపోయారు. వీరికి రూ. 1.52 కోట్ల పరిహారం మంజూరైంది. 2013 ఫిబ్రవరిలో 9,200 హెక్టార్లలో నష్టపోయిన ఉద్యానపంటలకు రూ. 13.89 కోట్ల పరిహారం మంజూరైందని అధికారులు ప్రకటించారు. ఇదే సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో మరో ఇరవై ఎకరాల్లో ఎనభై మంది రైతులకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. గత మే నెలలో నేరుగా రైతుల ఖాతాల్లోకే డబ్బులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల హడావుడి, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ నిధులు ట్రెజరీలోనే మూలుగుతున్నాయి. ఎన్నికలు పూర్తయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఆ నిధుల విడుదలకు చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరుచేయకపోవడంతో రైతులు పెట్టుబడి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటనష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ వస్తే ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుందని భావించారు. కానీ, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో 2009 నుంచి 2014 వరకు ఇన్పుట్ సబ్సిడీని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా తమ ఖాతాల్లో డబ్బు చేరితే పెట్టుబడికి ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంటున్నారు. -
'సత్యం' టిక్కెట్ వెనక పవనిజం
జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ జోక్యంతో చొప్పదండి నియోజకవర్గ టీడీపీలో సమీకరణాలు ఒక్కసారిగా మారా యి. ఆయనకు సన్నిహితుడిగా పేరున్న మేడిపల్లి సత్యానికి టీడీపీ టికెట్ ఖరారు చేయడంలో పవన్‌కల్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇంతకాలం పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్న మ్యాక లక్ష్మణ్‌కు అన్యాయం జరిగిందని ఆయన వర్గీయులు అంటున్నారు. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య కాంగ్రెస్‌లో చేరడంతో ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడ్డ లక్ష్మణ్‌కు చొప్పదండి టికెట్ వస్తుందని భావించారు. లక్ష్మణ్ కూడా తనకే టికెట్ వస్తుందని బుధవారం అట్టహాసంగా నామినేషన్ వేసేందుకు సమాయత్తమయ్యారు. పీఆర్పీలో ఉండి కాంగ్రెస్‌లోకి వచ్చి ఆ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించిన మేడిపల్లి సత్యానికి అనూహ్యంగా టీడీపీ టికెట్ ఖరారైనట్లు తెలియడంతో లక్ష్మణ్ అవాక్కయ్యారు. సత్యంకు టికెట్ ఖరారైన విషయం టీడీపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఎల్.రమణకే తెలియకపోవడం విశేషం. ఊహించని పరిణామంతో పార్టీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. అయితే తన అనుచరుడికి టికెట్ ఇప్పటించడంలో పవన్ మార్క్ పనిచేసిందని సమాచారం. -
గులాబీ దళం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పొత్తుల ఊహాగానాలకు తెరదించుతూ టీఆర్ఎస్ పార్టీ తవు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మిగతా పార్టీల కంటే వుందుగా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 69 మందితో ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు జాబితాను విడుదల చేశారు. అందులో జిల్లాకు సంబంధించి చొప్పదండి మినహా 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించటం గవునార్హం. వీరిలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఒకరికి గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవవుండగా.. మిగిలిన నలుగురు కొత్త అభ్యర్థులు. తెలంగాణలోనే అత్యధికంగా ఏడుగురు పార్టీ ఎమ్మెల్యేలున్న జిల్లాలో... సిట్టింగ్‌లందరికీ టీఆర్ఎస్ తొలి ప్రాధాన్యమిచ్చింది. ఎక్కడివాళ్లకు అక్కడే వురోసారి పోటీ చేసే అవకాశం కల్పించింది. ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్, హుజూరాబాద్ నుంచి ఈటెల రాజేందర్, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్, సిరిసిల్ల నుంచి కె.తారకరామారావు, కోరుట్ల నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, వేములవాడ నుంచి చెన్నవునేని రమేష్‌బాబు, రామగుండం నుంచి సోవూరపు సత్యనారాయుణకు టిక్కెట్లు కేటారుంచింది. సిట్టింగ్‌ల్లో అరుదుగురు ఎమ్మెల్యేలు గడిచిన అరుదేళ్ల వ్యవధిలో వూడోసారి ఎన్నికలు ఎదుర్కోనుండటం విశేషం. 2009లో ఎమ్మె ల్యేలుగా గెలిచిన ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, కల్వకంట్ల విద్యాసాగర్‌రావు, కేటీఆర్, రమేశ్‌బాబు 2010 ఉప ఎన్నికల్లోనూ పోటీ చేశా రు. మరోసారి అక్కడే విజేతలుగా నిలిచారు. కేసీఆర్ తనయుుడు కేటీఆర్‌కు ఈసారి కూడా సిరిసిల్ల నుంచి పోటీకి దిగుతున్నారు. ఆయన ఎంపీగా పోటీ చేస్తారని, ఎమ్మెల్యేగా పోటీ చేసి నా.. వేరే చోటికి వలస వెళ్తాతారని కొంతకాలంగా జరిగిన ప్రచారానికి తెర పడింది. 2009 ఎన్నికల్లో సిరిసిల్ల బరిలో అడుగుపెట్టిన కేటీఆర్ అక్కడే 2010 ఉప ఎన్నికలను ఎదుర్కొన్నారు. వరుసగా వూడోసారి కార్మిక క్షేత్రం నుంచే పోటీకి సిద్ధవువుతున్నారు. గత ఎన్నికల్లో వుహాకూటమిలో టీఆర్ఎస్ వుద్ధతుతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంగుల కవులాకర్, ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సోవూరపు సత్యనారాయుణ ఈసారి గులాబీ గుర్రాలుగా బరిలోకి దిగుతున్నారు. పౌరసత్వానికి సంబంధించిన కేసు వెంటాడుతున్న రమేశ్‌బాబు అభ్యర్థిత్వంపై ఉన్న సందిగ్ధత జాబితా వెల్లడితో తొలగిపోయింది. వూజీ వుంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు తనయుుడు వొడితెల సతీష్బాబును హుస్నాబాద్ నుంచి బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో సీపీఐతో పొత్తు ఒప్పందాన్ని ఉల్లంఘించి లక్ష్మీకాంతారావును పోటీకి దింపిన చోటునుంచే ఈసారి ఆయున తనయుడిని పోటీకి దింపటం గవునార్హం. సతీష్‌బాబు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన పుట్ట మధుకు అంద రూ ఊహించినట్లుగానే మంథని టిక్కెట్టు ఖరా రు చేసింది. గత ఎన్నికల్లో పీఆర్పీ తరఫున పోటీ చేసిన వుధు కొంతకాలం వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్‌గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా టీఆర్ఎస్ జగిత్యాల నుంచి పోటీకి దిగుతుండటం విశేషం. పొత్తులో భాగంగా 2004లో కాంగ్రెస్‌కు, 2009లో టీడీపీకి ఈ సీటును వదిలేసిన టీఆర్ఎస్ ఈసారి ఒంటరిగా పోటీకి దిగుతోంది. ఇటీవలే పార్టీలో చేరిన నేత్ర వైద్యుడు డాక్టర్ ఎం.సంజయ్‌కుమార్‌కు టిక్కెట్టు కేటారుంచింది. కొత్తగా రాజకీయూల్లోకి వచ్చిన సంజయ్ తొలి ప్రయుత్నంలోనే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. రెండు నెలల కిందట టీఆర్ఎస్ నేత హరీష్‌రావు ప్రకటించిన విధంగానే ట్రినిటీ విద్యాసంస్థల నిర్వాహకుడు దాసరి మనోహర్‌రెడ్డికి పెద్దపల్లి నుంచి టిక్కెట్టు కేటారుంచారు. రెండేళ్ల కిందట పార్టీలో చేరిన వునోహర్‌రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయుటం ఇదే తొలిసారి. మెదక్ జిల్లాకు చెందిన తెలంగాణ ధూం ధాం గాయుకుడు రసవురుు బాలకిషన్‌ను వూనకొండూరు అభ్యర్థిగా ప్రకటించారు. గత ఎన్నికల్లోనూ ఇదే సీటును ఆశించిన రసవురుు టిక్కెట్ల రేసులోనే భంగపడ్డారు. అరుదేళ్ల తర్వాత ఆయునకు ఈ అవకాశం దక్కినట్లరుంది. ఇటీవలే ఎంపీ వివేక్ పార్టీ వూరటంతో పెద్దపల్లి ఎంపీ స్థానానికి ఈయున అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు జరిగిన ప్రచారానికి తెరపడింది. గజ్జెకట్టి పాట పాడిన రసవురుు తొలిసారిగా అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. అగ్రవర్ణాలకే అగ్రపీఠం సామాజిక సమీకరణాలను విశ్లేషిస్తే టిక్కెట్ల కేటారుుంపులో జిల్లాలో అగ్రవర్ణాలకే టీఆర్ఎస్ పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. జిల్లాలోని 13 నియోజకవర్గాలకు మూడు ఎస్సీ స్థానాలు మినహాయించగా.. మిగిలిన పది నియోజకవర్గాల్లో ఆరు అగ్రవర్ణాలకు, నాలుగు బీసీలకు కేటాయించారు. స్థానికంగా రాజకీయ ఆధిపత్యం కొనసాగించే వెలమ సామాజిక వర్గానికి సిరిసిల్ల, కోరుట్ల, జగిత్యాల, వేవుులవాడ సీట్లు కేటాయించారు. మున్నూరు కాపు కులస్థులకు మూడు సీట్లు దక్కాయి. కరీంనగర్, రావుగుండం, వుంథని ఈ జాబితాలో ఉన్నాయి. ముదిరాజ్‌కు ఒకటి, కరణంకు ఒకటి, రెడ్డికి ఒక సీటు కేటారుంచారు. చొప్పదండిపై ఉత్కంఠ 12 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ ఎస్సీ రిజర్వ్డ్ అయిన చొప్పదండి సీటును పెండింగ్‌లో పెట్టింది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీ బొడిగె శోభ, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ ఈ సీటుపై పట్టుబడుతున్నందున పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. -
డీఈ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
సుల్తానాబాద్, న్యూస్‌లైన్ : చివరి భూముల్లో వేసిన ఆరుతడి పంటలకు సైతం నీరందడం లేదంటూ స్థానిక ఎస్సారెస్పీ డీఈ కార్యాలయాన్ని శనివారం రైతులు ముట్టడించారు. డీ86 కెనాల్ ఆయకట్టు రైతులు ధర్నాకు దిగారు. రైతుల ధర్నా విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులు వచ్చే వరకు కార్యాలయానికి చేరుకోలేదు. పోలీసులు చేరుకున్నాక వచ్చిన డీఈ రాముతో రైతులు వాగ్వాదానికి దిగారు. నీరందక పంటలు ఎండిపోయేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చొప్పదండిలో 1050 క్యూసెక్కుల నీరు వదిలి అన్ని డీపీలు మూసివేస్తే చివరి భూములకు నీర ందుతుందన్నారు. ఉప కాలువలు మూసివేయకపోవడంతో హుస్సేమియా, మానేరువాగులోకి నీరు వృథాగా పోతుందన్నారు. 72 గంటల పాటు 1050 క్యూసెక్కుల నీరు వదులుతామని డీఈ హామీతో రైతులు ఆందోళన విరమించారు. ఆందోళనలో రైతులు పడాల కుమారస్వామి, ఎం.లింగయ్య, కె.మల్లారెడ్డి, రఘుపతి, సమ్మారావు, రవీందర్‌రెడ్డి, మాదన్న, రాజు, రమేశ్, సది, శంకర్, కొమురయ్య, మొండయ్య, రాయమల్లు, కుమార్, శ్రీను, రవి, ఓదేలు పాల్గొన్నార -
సైకిల్ దిగిన సుద్దాల
జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం నుంచి ప్రాతి నిథ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటిలో చేరారు. గురువారం ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. దీంతో టీడీపీతో ఆయన మూడు దశాబ్దా ల అనుబంధం ముగిసినట్టైంది. చొప్పదండి నియోజకవర్గం లో ఆపార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గత ఐదు రోజులు గా ఢిల్లీలో మకాం వేసిన సుద్దాల కాంగ్రెస్ సీనియర్ నేతలతో చొప్పదండి ఎమ్మెల్యే టికెట్ ఖాయం చేసుకుం టూ పార్టీలో చేరడానికి చర్చలు జరుపుతూ వచ్చారు. జిల్లా స్థాయి నేతల్లో ఎంపీ పొన్నం ప్రభాకర్ మాత్రమే సుద్దాల దేవయ్య కాంగ్రెస్‌లో చేరడానికి సుముఖంగా ఉండగా, మరో కీలక నేత వ్యతిరేకించడంతో పదిహేను రోజులుగా సుద్దాల రాజకీయ జీవితం పై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. పట్టువదలని విక్రమార్కుడిలా దేవయ్య హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను కలిసినా ఫలితం లేకపోవడంతో ఢిల్లీ వెళ్లారు. ఎంపీ పొన్నంతో పాటు ఇతర నాయకులతో కలిసి కాంగ్రె స్ అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపారు. సుదీర్ఘ మం తనాల అనంతరం సుద్దాలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ‘దేశం’ కోటకు బీటలు టీడీపీతో మూడు దశాబ్దాల అనుబంధం ఉన్న ఎమ్మెల్యే సుద్దాల కాంగ్రెస్‌లో చేరికతో చొప్పదండి నియోజకవర్గంలో టీడీపీకి గడ్డుకాలం దాపురించింది. టీడీపీ ఏర్పడిన అనంతరం ఏడు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఆరు సార్లు గెల వడం గమనార్హం. కొద్ది రోజులుగా సుద్దాల కాంగ్రెస్ వైపు దృష్టి సారించి ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్న తరుణంలోనే, నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు, వారి అనుచరులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. టీడీపీలోని అనుచర గణమంతా టీఆర్ఎస్లో చేరగా, మిగిలిన కొద్ది మంది పార్టీని వీడే ప్రసక్తి లేదని ప్రకటించారు. పలు చోట్ల టీడీపీ అభ్యర్థులుగా జెడ్పీటీసీ, ఎం పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. టీడీపీలోని ముఖ్య అనుచరగణమంతా టీఆర్ఎస్ వైపు వెళ్లగా ప్రస్తుతం ఎమ్మెల్యే సుద్దా ల ఒంటరిగానే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో ఆయన వెంట తన కొడుకు గౌతంతో పాటు, మల్యాలకు చెందిన మాజీ ఎంపీపీ రాంలింగారెడ్డి ఒక్కరే ఉండడం గమనార్హం. -
చొప్పదండి బ్యాంకు చోరీకేసులో పురోగతి
-
చొప్పదండి బ్యాంక్ చోరీ కేసులో కీలక ఆధారాలు లభ్యం
కరీంనగర్: జిల్లాలోని చొప్పదండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోరీ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయని కరీంనగర్ ఎస్పీ శివకుమార్ చెప్పారు. సీసీ కెమెరా ఫుటేజ్ మీడియాకు విడుదల చేశారు. ఉత్తర భారతదేశానికి చెందిన ప్రొఫెషనల్ గ్యాంగ్‌గా అనుమానిస్తున్నట్లు తెలిపారు. వారి కోసం ఏడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు. అనుమానితుల వివరాలను తెలియజేయమని ఆయన ప్రజలను కోరారు. తమకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. చొప్పదండి ఎస్బీఐ శాఖలోకి శనివారం ఉదయం కొందరు దుండగులు ప్రవేశించి బ్యాంకు సిబ్బందిని తుపాకీలతో బెదిరించి 40 లక్షల రూపాయలు అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. బ్యాంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన బ్యాంక్‌కు చేరుకున్నారు. బ్యాంక్ మేనేజర్‌తోపాటు సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. బ్యాంకులోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించి, దొంగలను గుర్తించారు. వారికోసం గాలింపు మొదలుపెట్టారు.