సాక్షి, కరీంనగర్: చొప్పదండి మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ ప్యానెల్‌కు చుక్కెదురైంది. ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా బరిలో నిలిచిన ఎం.డి. అజ్జు, అమరకొండ తిరుపతి, అమీనా సుల్తానా, గండి లలితలు కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే ప్యానెల్ అభ్యర్థులు గొల్లపల్లి ప్రభావతి, ఇంద్రసేనా రెడ్డి, జహీర్, షబానాలు ఓటమి పాలయ్యారు. కౌన్సిల్‌లో మొత్తం 14 మంది కౌన్సిలర్లు ఉండగా, ఒకరు గైర్హాజరయ్యారు. దండె జమున అనే కౌన్సిలర్ గైర్హాజరు కాగా ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే రవిశంకర్ ఓటు వేశారు.(‘ఒక్క సంఘటన నా కళ్లు తెరిపించింది’)
రవిశంకర్ ఓటు వేసిన అభ్యర్థుల్లో అమీనా సుల్తానా మినహా మిగతా ముగ్గురు ఓటమిపాలయ్యారు. తాను బలపరిచిన షబానాకే ఎమ్మెల్యే ఓటు వేయలేదు. మొత్తం నలుగురు కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా ఎమ్మెల్యే రవిశంకర్ సూచించిన నలుగురు సభ్యులను ఎన్నుకునేందుకు మెజార్టీ టీఆర్ఎస్ వర్గ కౌన్సిలర్లు నిరాకరించారు. సొంతంగా కో-ఆప్షన్ బరిలోకి మరో నలుగురిని దింపి కౌన్సిలర్లు పంతం నెగ్గించుకున్నారు. ఎమ్మెల్యే ప్యానెల్ ను ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు సహకరించారు.('చేతకాని దద్దమ్మలు కుట్రలు పన్నుతున్నారు')
Comments
Please login to add a commentAdd a comment