Ravi Shankar
-
సీఐడీ చీఫ్ అయ్యన్నార్ వీరంగం!
సాక్షి, అమరావతి: అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం మరింతగా బరితెగించింది. వలపు వలతో బడా బాబులను బురిడీ కొట్టించే కాదంబరి జత్వానీ కుట్రపూరితంగా ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ బెదిరింపులకు దిగుతోంది. ఇందులో భాగంగా సీఐడీ చీఫ్‌గా ఉన్న అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ రంగంలోకి దిగడం.. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా బెదిరింపులకు పాల్పడటం విభ్రాంతి కలిగిస్తోంది. ఈ కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ పేరుతో తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అయ్యన్నార్పై హైకోర్టుకు ఫిర్యాదు చేసేందుకు కుక్కల విద్యాసాగర్ తరఫు న్యాయవాదులు సిద్ధపడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటంటే..వేరే గదిలోకి తీసుకువెళ్లి బెదిరింపులు..హనీట్రాప్ ట్రాక్ రికార్డ్ ఉన్న కాదంబరి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుతో పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్టుచేసి న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును ఇటీవల సీఐడీకి బదిలీచేసింది. దీంతో ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు విద్యాసాగర్‌ను విచారణ నిమిత్తం న్యాయస్థానం అనుమతితో మూడ్రోజుల కస్టడీకి తీసుకున్నారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన్ని ఆదివారం విచారించారు. విచారణ ప్రక్రియను పూర్తిగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అందుకు సీఐడీ కార్యాలయంలో ఓ గదిలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేస్తూ కొంతసేపు విచారించారు. ఆ తర్వాత ఆయన్ను మరో గదిలోకి తీసుకెళ్లారు. ఆ గదిలో ఆడియో, వీడియో రికార్డింగ్‌కు ఏర్పాట్లుచేయకపోవడం గమనార్హం. మరి ఆయన్ని ఆ గదిలోకి ఎందుకు తీసుకువెళ్లారన్నది అర్థంకాలేదు. కానీ, కొన్ని క్షణాలకే సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అక్కడికి చేరుకోవడంతో అసలు విషయం స్పష్టమైంది. ఆడియో, వీడియో రికార్డింగ్లేని ఆ గదిలో విద్యాసాగర్‌ను రవిశంకర్ అయ్యన్నార్ తీవ్రస్థాయిలో బెదిరించినట్లు సమాచారం. తాము చెప్పినట్లుగా వాంగ్మూలం ఇవ్వాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన పోలీసు శైలిలో హెచ్చరించారు. తాము చెప్పిన కొందరి పేర్లను వాంగ్మూలంలో పేర్కొనాలని.. వారు చెప్పినట్లే తాను చేశానని.. అంతా వారి ప్రమేయంతోనే జరిగిందనే అసత్య వాంగ్మూలాన్ని ఇవ్వాలని బెదిరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా గతంలో తాము ఎవరెవర్ని ఎలా కేసుల్లో ఇరికించింది.. ఎంతగా వేధించిందీ చెబుతూ బెదిరించారు. ఓ సమయంలో ఆయన నిగ్రహం కోల్పోయి మరీ తీవ్రస్థాయిలో విరచుకుపడినట్లు తెలిసింది. దీంతో అసలక్కడ ఏం జరుగుతోందోనని సీఐడీ వర్గాలే కాసేపు ఆందోళన చెందాయి.అయ్యన్నార్ బెదిరింపులపై హైకోర్టుకు నివేదన..న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని నిర్వహిస్తున్న విచారణ సందర్భంలోనే సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నిబంధనలను ఉల్లంఘించడంపట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ఆయన వ్యవహారశైలి న్యాయస్థానం ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా ఉందన్నది స్పష్టమవుతోంది. మరోవైపు.. అయ్యన్నార్ బెదిరింపులను విద్యాసాగర్ తరఫు న్యాయవాదులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు వారు సమాయత్తమవుతున్నారు. కస్టడీలో వేధింపులు, కోర్టు ఆదేశాల ధిక్కరణ తదితర అభియోగాలతో అయ్యన్నార్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. విద్యాసాగర్ కూడా తనను రవిశంకర్ అయ్యన్నార్ ఏ రీతిలో బెదిరించిందీ.. అంతుచూస్తానని హెచ్చరించిందీ న్యాయస్థానానికి విన్నవించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ కేసుకు సంబంధించి తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. -
పుష్ప ప్రోడ్యూసర్స్ అంటుంటే గర్వంగా అనిపిస్తోంది: రవిశంకర్, నవీన్
‘‘మైత్రీ మూవీ మేకర్స్ అంటే ఇక్కడ తెలుసు. కానీ ముంబైలో ‘పుష్ప’ సినిమా ప్రోడ్యూసర్స్ అనగానే ఇంకా ఎక్కువ గౌరవం ఇస్తున్నారు. అది మాకు గర్వంగా అనిపిస్తోంది. ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లోని నటనకుగాను అల్లు అర్జున్‌గారికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ‘పుష్ప: ది రూల్’ సినిమాతోనూ ఆయనకు జాతీయ అవార్డు వస్తుందనుకుంటున్నాం.అల్లు అర్జున్‌గారు అంత కష్టపడుతున్నారు. సుకుమార్ అండ్ టీమ్ కూడా శ్రమిస్తోంది’’ అన్నారు నిర్మాత వై. రవిశంకర్. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్’ చిత్రం రానుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాను డిసెంబరు 6న రిలీజ్ చేయనున్నట్లుగా ఆ మధ్య ప్రకటించారు. కానీ గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ‘పుష్ప: ది రైజ్’ని డిసెంబరు 5న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘పుష్ప: ది రూల్’ను గతంలో చెప్పిన డేట్ కంటే ఒకరోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నాం. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అభి్రపాయాలు, లాంగ్ వీకెండ్ అంశాలను దృష్టిలో పెట్టుకుని తేదీ మార్చాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ముఖ్యంగా జాతర ఎపిసోడ్ హైలైట్‌గా ఉంటుంది. రికార్డు స్థాయిలో ‘పుష్ప: ది రూల్’ సినిమాకు 420 కోట్ల రూపాయల నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో ఎవరు నటిస్తారనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తాం. ‘పుష్ప 3’ కూడా ఉంటుంది’’ అన్నారు వై. రవిశంకర్. ‘పుష్ప: ది రూల్’ సినిమా మలయాళం డిస్ట్రిబ్యూటర్ ముఖేశ్ మెహతా, హిందీ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ, కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీకాంత్ రెడ్డి, తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ మాలి, నైజాం డిస్ట్రిబ్యూటర్ మైత్రీ శశి, వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ఎల్వీఆర్పాల్గొన్నారు.ఈ సినిమాలోని ఓపాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయ నున్నారా? అనే ప్రశ్నకు... ‘‘ఒకపాటకు అనుకున్నాం కానీ ఇప్పుడు ఆయన ఆపాట చేయడంలేదు’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. -
Pushpa 2: ఆ సీన్స్ కోసం బన్నీ చాలా కష్టపడ్డారు.. సినిమాకే హైలెట్!
పుష్ప 2 ప్రమోషన్స్ నేటితో ప్రారంభం అయినట్లే. విడుదల తేదిని ప్రకటిస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు మేకర్స్. ఈ మూవీ డిసెంబర్ 6న కాకుండా ఒక రోజు అంటే డిసెంబర్ 5నే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. గురువారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్‌ని నిర్వహించి ఈ కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నిర్మాతలు. ఈ సినిమా కోసం హీరో అల్లు అర్జున్ చాలా కష్టపడ్డారని చెప్పారు. ఆయన కోసం అయినా ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని కోరారు.(చదవండి: పుష్ప 2 రిలీజ్ డేట్ మారింది.. ముందే వచ్చేస్తున్న ‘పుష్ప’రాజ్)ఇక ఈ సినిమాలో ప్రతీ సీన్ అదిరిపోతుందట. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ అయితే సినిమాకే హైలెట్ అని చెప్పారు. ‘జాతర ఎపిసోడ్ షూటింగ్‌కి 35 రోజుల సమయం పట్టింది. ఆ సీన్స్ కోసం బన్నీ చాలా కష్టపడ్డారు. 20 రోజుల పాటు రిహార్సల్ చేసి షూటింగ్లో పాల్గొన్నారు. బాడీ మొత్తం పెయింటింగ్ వేసుకొని రోజంతా ఆ గెటప్‌లోనే ఉండేవాడు. చెమట వచ్చి పెయింటింగ్ పాడైపోకుండా చిన్న ఫ్యాన్ పెట్టుకునేవాడు. జాతర ఎపిసోడే కాదు సినిమా మొత్తానికి అల్లు అర్జున్ చాలా కష్టపడ్డారు. సుకుమార్ కూడా చాలా జాగ్రత్తగా సినిమాను తీర్చిదిద్దారు. (చదవండి: అభిమాని రిక్వెస్ట్.. వెంటనే స్పందించిన బన్నీ)జాతర ఎపిసోడ్‌కి భారీగా ఖర్చు చేశాం. తెరపై చూస్తే కూడా మేం పెట్టిన ఖర్చు కనిపిస్తుంది. సినిమాలో గూస్బంప్స్ వచ్చే సీన్లు చాలా ఉంటాయి’అని నిర్మాత రవిశంకర్ అన్నారు. అలాగే పార్ట్ 2ని హిట్ చేస్తే కచ్చితంగా పుష్ప 3ని తెరకెక్కిస్తామని చెప్పారు. ఇక మెగాఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న గొడవ గురించి మాట్లాడుతు.. ‘అల్లు అర్జున్‌కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటే. అందరూ సినిమా లవర్సే. ఫ్యాన్స్‌కు , హీరోలకు రాజకీయాలతో ముడిపెట్టొద్దు’ అని రవిశంకర్ కోరారు. -
అందులో వాస్తవం లేదు: నిర్మాత రవిశంకర్
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ‘పుష్ప’ సినిమా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పందించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ‘మత్తు వదలరా 2’ సినిమా సక్సెస్ మీట్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘జానీమాస్టర్ వ్యవహారంలో హీరో అల్లు అర్జున్ , డైరెక్టర్ సుకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. దానిపై మీ స్పందన ఏంటి?’ అనే ప్రశ్నకు రవిశంకర్ బదులిస్తూ... ‘‘ప్రస్తుతం నడుస్తున్న వివాదం పూర్తీగా వాళ్ల (జానీ మాస్టర్, బాధితురాలు) వ్యక్తిగతం. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాకి గణేశ్ ఆచార్య మెయిన్ కొరియోగ్రాఫర్. విజయ్ పోలకి, ఆ అమ్మాయి (బాధితురాలు) అడిషనల్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ‘పుష్ప 2: ది రూల్’ప్రారంభం నుంచే ఆ అమ్మాయిని తీసుకున్నాం. సినిమాలోని అన్ని పాటలకు ఆమె పని చేస్తారు. ఐదారు నెలల క్రితం మేము రిలీజ్ చేసిన ఓ లిరికల్ వీడియోలోనూ ఆమె పేరు ఉంటుంది. ప్రస్తుతం రెండు పాటలు బ్యాలñ న్స్ ఉన్నాయి. అక్టోబర్ 15 తర్వాత ఆ పాటల చిత్రీకరణకు సన్నాహాలు చేశాం. ఈ సినిమాలోని ఓ ప్రత్యేక పాటని జానీ మాస్టర్‌తో చేయించాలనుకున్నాం. ఇంతలోగా ఈ గొడవ తెరపైకి వచ్చింది.ఎవరైనా డ్యాన్స్ మాస్టర్స్, డ్యాన్సర్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ చెబితే స్పందించడం తప్ప హీరోకు (అల్లు అర్జున్) ఏమీ తెలియదు. ఈ విషయంపై బాధ్యత కలిగిన ప్రధాన మీడియా వార్తలు రాయడం లేదు. కానీ, కొత్తగా వచ్చిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సెన్సేషన్ కావడం కోసం ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. జానీ మాస్టర్ని ఆపి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలనే వ్యక్తిత్వం బన్నీగారిది కాదు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇదంతా కొందరి అలజడి మాత్రమే. వారిద్దరి మధ్య గొడవలు ఉన్నా అది వారి వ్యక్తిగతం.. దాని గురించి మనం మాట్లాడటానికి కూడా ఏం లేదు’’ అన్నారు. -
జానీ మాస్టర్ వివాదంలో అల్లు అర్జున్.. క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత
కొరియెగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఆయన అసిస్టెంట్ లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. కోర్ట్ రిమాండ్ విధించడంతో జానీని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే, ఈ విషయంపై తాజాగా 'పుష్ప' నిర్మాతల్లో ఒకరైన మైత్రి మూవీస్ రవిశంకర్ రియాక్ట్ అయ్యారు. జానీమాస్టర్ వ్యవహారంలో అల్లు అర్జున్, సుకుమార్ పేర్లు వినిపిస్తున్నాయని మీడియా వారు ఆయన్ను ప్రశ్నించడంతో క్లారిటీ ఇచ్చారు.జానీ మాస్టర్ వివాదంలో అల్లు అర్జున్, సుకుమార్ ఉన్నారనే వార్తలను నిర్మాత రవిశంకర్ ఖండించారు. 'జానీ మాస్టర్, ఆ యువతి (బాధితురాలు) గొడవలతో అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఈ వివాదం పూర్తిగా జానీ మాస్టర్, ఆమెకు సంబంధించినది మాత్రమే. పుష్ప 2 సినిమా ప్రారంభం నుంచి అన్ని పాటలకు అడిషనల్ కొరియోగ్రఫర్‌గా ఆమె పనిచేశారు. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. అక్టోబర్ 15 తర్వాత ఆ పాటల చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నాం. ఆరు నెలల క్రితం మేము విడుదల చేసిన లిరికల్ సాంగ్‌లో కూడా ఆమె పేరు ఉటుంది. అయితే, జానీ మాస్టర్‌తో రెండురోజుల్లో ఒక స్పెషల్ సాంగ్ చేద్దామనుకునేలోపే ఈ గొడవ తెరపైకి వచ్చింది. షూటింగ్ సెట్లో అంతర్గతంగా జరిగే విషయాలు అల్లు అర్జున్‌కు తెలీదు. ఎవరైనా విషెస్ చెబితే స్పందించడం తప్ప హీరోకు ఏమీ తెలియదు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో విలువలతో కలిగిన వ్యక్తిగా బన్నీకి గుర్తింపు ఉంది. బన్నీ గురించి ప్రధాన మీడియా ఇలాంటి వార్తలు రాయడం లేదు. కానీ, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారు తమ ఉనికి కోసం అల్లు అర్జున్‌పై ఇష్టం వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ' అని తెలిపారు. -
సోషియో ఫ్యాంటసీ చిత్రంగా 'జై శ్రీరామ'
నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి. రవిశంకర్ దర్శ కత్వంలో ఆయన తనయుడు అద్వయ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సుబ్రహ్మణ్య’. ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ చిత్రాన్ని ప్రవీణ కడియాల, రామలక్ష్మిల సమర్పణలో తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మిస్తున్నారు.ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. హీరో ఓ బావిలోకి దూకి అక్కడ ఉన్న ఓ పురాతన పుస్తకాన్ని తీసుకురావడం, ఆ పుస్తకానికి కాపలాగా ఉన్నట్లుగా ఉన్నపాములు అతనిపై దాడి చేయడం, ఓ గుడి అతని బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించడం, జై శ్రీరామ అంటూ వాయిస్ ఓవర్ రావడం వంటివి టీజర్లో కనిపిస్తాయి. ఈ చిత్రం 2025లో తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
సినీ దర్శకుడు ఆత్మహత్య
సినీ దర్శకుడు రవిశంకర్ (63) చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు. భాగ్య పత్రికలో కథారచయితగా జీవితాన్ని ప్రారంభించిన రవిశంకర్ ఆ తరువాత దర్శకుడు కె.భాగ్యరాజ్, దర్శకుడు విక్రమన్‌ల వద్ద సహాయదర్శకుడిగా పనిచేశారు. కాగా శరత్‌కుమార్, దేవయాని జంటగా విక్రమన్ దర్శకత్వంలో రూపొందిన సూర్యవంశం చిత్రానికి రవిశంకర్ సహాయ దర్శకుడిగా పనిచేయడంతోపాటు, అందులోని రోసాపూ అనే సూపర్‌హిట్ పాటను రాశారు. కాగా నటుడు మనోజ్ భారతీరాజా హీరోగా నటించిన వర్షమెల్లామ్ వసంతం చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రంలోని అన్ని పాటలను రవిశంకరే రాశారు. అయితే ఆ తరువాత ఈయనకు మరో అవకాశం రాలేదు. కాగా అవివాహితుడైన రవిశంకర్ స్థానిక కేకే.నగర్‌లోని ఒక చిన్న గదిలో అద్దెకు ఉంటున్నారు. అయితే సినిమా అవకాశాలు లేక, పేదరికంలో జీవిస్తున్న ఈయన మానసిక వేదనతో ఉరి వేసుకుని బలవర్మణానికి పాల్పడినట్లు తెలిసింది. సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి రవిశంకర్ భౌతికకాయాన్ని పోస్ట్‌మార్టానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈయన ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రవిశంకర్ మర ణం కోలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. -
Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
విశాఖ సిటీ: ఉద్యోగాల పేరుతో విదేశాలకు జరుగుతున్న మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. విదేశాల్లో డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగులను చైనా గ్యాంగ్‌కు అమ్మేస్తున్న ముగ్గురు ఏజెంట్లను శనివారం అరెస్టు చేశారు. దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ శనివారం సాయంత్రం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు.అక్కడ పని చేసి చైనా ముఠా చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ సైబర్ హెల్ప్‌లైన్ 1930 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవాని ప్రసాద్ బృందం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ప్రధాన ఏజెంట్ చుక్క రాజేష్‌తో పాటు అదే ప్రాంతానికి చెందిన సబ్ ఏజెంట్లు సబ్బవరపు కొండలరావు (37), మన్నేన జ్ఞానేశ్వరరావు (29)లను అదుపులోకి తీసుకుని విచారించగా అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీపీ రవిశంకర్ మానవ వనరుల అక్రమ రవాణా గురించి వెల్లడించిన వివరాలివి...నిరుద్యోగులకు వల...గాజువాక ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్ చుక్కా రాజేష్ (32) 2013 నుంచి 2019 వరకు గల్ఫ్ దేశాల్లో ఫైర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్ మేనేజర్‌గా పనిచేశాడు. ఆ తరువాత విశాఖలోనే ఉంటూ గల్ఫ్‌దేశాలకు ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలకు మానవవనరులను సరఫరా చేసేవాడు. 2023 మార్చిలో కాంబోడియా నుంచి సంతోష్ అనే వ్యక్తి ఫోన్ చేసి, కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడానికి 30 మందిని పంపాలని రాజేష్‌ను కోరాడు. ఆసక్తి చూపే వారి నుంచి ఫ్లైట్ టికెట్లు, వీసా, ఇతర ఖర్చుల కోసం రూ.1.5 లక్షల వంతున తీసుకోవాలని, అందులో కొంత కమిషన్‌గా ఇస్తామని ఆశ చూపాడు. రాజేష్ అందుకు అంగీకరించి సోషల్ మీడియా ద్వారా విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చాడు. నిజమని నమ్మిన 27 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షల వంతున కట్టారు. రాజేష్ వారిని కాంబోడియా ఏజెంట్ సంతోష్‌కు అప్పగించాడు. ఇలా మూడు దఫాలుగా నిరుద్యోగులకు కాంబోడియాకు పంపించాడు. కొద్ది రోజులకు ఆర్య అనే పేరుతో ఒక మహిళ రాజేష్‌కు ఫోన్ చేసింది. సంతోష్ కంటే ఎక్కువ కమిషన్ ఇస్తానని తమకూ మానవవనరులను సరఫరా చేయాలని కోరింది. ఇలా రాజేష్.. సంతోష్, ఆర్య, ఉమా మహేష్, హబీబ్ అనే ఏజెంట్ల ద్వారా 150 మంది నిరుద్యోగులను కాంబోడియాకు పంపించాడు.చీకటి గదిలో బంధించి..ఒప్పందం అనంతరం వారిని కాంబోడియాలోనే ఈ ముఠా ఒక చీకటి గదిలో బంధించింది. ఫెడెక్స్, టాస్క్‌గేమ్స్, ట్రేడింగ్‌తో పాటు అనేక ఆన్లైన్ స్కాములు చేయాలని నిరుద్యోగులను బలవంతం చేసింది. ఈ స్కామ్స్ ఎలా చేయాలో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. అక్రమాలకు పాల్పడబోమని మొండికేసిన వారికి తిండి పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేసింది. సైబర్ నేరాలు చేసిన వారికి వచ్చిన డబ్బులో ఒక శాతం కమిషన్‌గా ఇస్తూ.. 99 శాతం చైనా గ్యాంగ్ దోచుకునేది. అక్కడ ఉత్సాహంగా పనిచేసేందుకు అదే కాంపౌండ్‌లో పలు రకాల పబ్, క్యాసినో గేమ్స్, మద్యం, జూదంతో పాటు వ్యభిచారం వంటి సదుపాయాలను ఈ ముఠా కల్పించింది. అక్కడ సంపాదించిన డబ్బు అక్కడే ఖర్చు చేసేలా చేసేది. చైనా ముఠా చెరలో 5వేల మంది..చైనా ముఠా చెరలో సుమారు 5 వేల మంది భారతీయులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 150 మంది చైనా గ్యాంగ్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. బాధితులు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, అనంతపురాలతో పాటు తెలంగాణ, కోల్‌కత్తాకు చెందిన వారూ ఉన్నట్లు సీపీ రవిశంకర్ తెలిపారు. ఈ నెట్వర్క్ వెనుక ప్రధాన ముఠాను కనిపెట్టేందుకు లోతైన దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. కాంబోడియాలో భారత ఎంబసీకీ దీనిపై సమాచారం అందిస్తామన్నారు. విశాఖ నుంచి ఎవరైనా కాంబోడియాకు వెళ్లి ఇబ్బందులు పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని సీపీ సూచించారు. భారతదేశం నుంచి కాంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ వంటి దేశాలకు రెండేళ్లుగా మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోందని సీపీ తెలిపారు. ఇలా వెళ్లిన భారతీయుల ద్వారా సైబర్ నేరాల రూపంలో మన దేశీయుల నుంచే సుమారు రూ.100 కోట్ల వరకు దోచుకున్నట్లు తమ విచారణలో వెల్లడైందని ఆయన వివరించారు.అది కుటుంబాల మధ్య తగాదాలో దాడి...కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు కుటుంబాల మధ్య తగాదా కారణంగా మహిళపై దాడి జరిగిందని సీపీ రవిశంకర్ స్పష్టం చేశారు. దీనికి రాజకీయాలకు, పార్టీలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. దాడి ఘటన వీడియోలు ఉన్నాయని, వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచురిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చైనా ముఠాకు భారత యువత విక్రయం...నిరుద్యోగులను ముందు బ్యాంకాక్ పంపించి, అక్కడ రెండో ఏజెంట్‌కు అప్పగించారు. వీరు నిరుద్యోగులను కాంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకువెళ్లి ఒక నెలకు టూరిస్ట్ వీసా తీసుకున్నారు. అలా తీసుకువెళ్లిన నిరుద్యోగులను ఏజెంట్లు వారికున్న నైపుణ్యం ఆధారంగా వారికి రూ.2500 నుంచి రూ.4 వేల అమెరికన్ డాలర్ల రేటు కట్టి చైనా కంపెనీలకు అమ్మేశారు. తమ వద్ద ఏడాది పాటు పనిచేసేలా చైనా ముఠా అగ్రిమెంట్ రాయించుకుంది. సెక్యూరిటీ కింద 400 డాలర్ల పూచీకత్తును కట్టించుకుంది. ఒకవేళ కంపెనీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే ఆ మొత్తం చెల్లించాలని ఒప్పందంలో ఈ ముఠా షరతులు విధించింది. -
స్నిఫర్ డాగ్స్ అడిగారు.. పంపాం
విశాఖ సిటీ: డ్రగ్స్ కంటైనర్ కేసు దర్యాప్తు తమ పరిధిలో లేదని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ.రవిశంకర్ స్పష్టం చేశారు. ఆ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని, ఇందులో జిల్లా అధికారులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ ఎఫ్ఐఆర్ రిపోర్ట్‌లో పొందుపరచిన సాంకేతిక పదజాలాన్ని కొందరు తప్పుగా అన్వయించుకున్నారని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లతో జిల్లా అధికారులు ఆలస్యంగా రావడంతో దర్యాప్తులో జాప్యం జరిగినట్లు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోలీస్ శాఖ ఎన్నికల కమిషన్ పరిధిలో పని చేస్తోందని వివరించారు. ‘బ్రెజిల్ నుంచి రవాణా నౌక ద్వారా డ్రగ్స్ కంటైనర్ విశాఖ పోర్టుకు వస్తున్నట్లు ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు విశాఖ చేరుకున్నారు. ఆ కంటైనర్‌ను విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీటీపీఎల్)లో జేఎం భక్షి అనే ప్రైవేట్ సంస్థ ఆదీనంలో ఉన్న ప్రాంతంలో అన్లోడ్ చేశారు. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో డెలివరీ అయిన కంటైనర్‌లో డ్రగ్స్ ఉన్నట్లు సీబీఐకు సమాచారం అందడంతో ఆనవాళ్లు గుర్తించేందుకు స్నిఫర్ డాగ్స్ కావాలని పోలీస్ శాఖను కోరారు. కొంతసేపటి తరువాత వాటిని వెనక్కు పంపించారు. నేను కూడా అక్కడ నుంచి వెళ్లిపోయా. ఆ తరువాత కస్టమ్స్, సీబీఐ అధికారులు కంటైనర్‌లో ఉన్న వాటిని పరీక్షించారు. ఈ తనిఖీలతో విశాఖ పోలీసులకు, అధికారులకు సంబంధం లేనందున ఎవరూ పాల్గొనలేదు. తప్పుగా అర్థం చేసుకున్నారు.. కంటైనర్‌లో డ్రగ్స్ తెరిచినప్పటి నుంచి ఆనవాళ్ల పరీక్ష పూర్తయ్యే వరకు ప్రతి అంశాన్ని రికార్డ్ చేసేందుకు సీబీఐ అధికారులు ఓ ప్రైవేటు వీడియోగ్రాఫర్‌ను వెంట తెచ్చుకున్నారు. కంటైనర్‌ను తెరిచే సమయంలో వీసీటీపీఎల్తోపాటు ప్రైవేటు సంస్థ సిబ్బంది, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. వీడియో రికార్డింగ్‌కు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నందున వారిని అక్కడి నుంచి పంపించారు. ఇలా వృథా అయిన సమయాన్ని స్థానిక అధికారులు గుమిగూడటం కారణంగా ప్రొసీడింగ్స్‌లో జాప్యం జరిగినట్లు ఎఫ్ఐఆర్లో సీబీఐ అధికారులు పేర్కొన్నారు. వీసీటీపీఎల్, ప్రైవేటు సంస్థ అధికారులు రావడాన్ని సీబీఐ ప్రస్తావిస్తే దాన్ని జిల్లా అధికారులకు ముడిపెట్టడం సరికాదు. ఈ విషయంపై సీబీఐ అధికారులతో మాట్లాడి స్పష్టత తీసుకున్నాం. సీబీఐ అధికారులు వినియోగించిన టెక్నికల్ పదాలను తప్పుగా అర్థం చేసుకొని సంబంధం లేని అధికారులపై ఆరోపణలు చేయడం సరికాదు.’ అని సీపీ చెప్పారు. స్మగ్లింగ్ ముఠాలపై ఉక్కుపాదం ‘గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పోలీసులతో పాటు ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసి రాష్ట్రంలో డ్రగ్స్ నిరోధానికి చర్యలు చేపట్టింది. విశాఖపట్నంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేశాం. ప్రత్యేక బృందాలతో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా శాటిలైట్ చిత్రాలను సేకరించి గంజాయి తోటలను ధ్వంసం చేశాం. ప్రసుత్తం విశాఖపట్నంలో గంజాయి లేదా ఇతర డ్రగ్స్ లేవు. ఒడిశా, మల్కన్‌గిరి, జైపూర్, కోరాపుట్ లాంటి ప్రాంతాల నుంచి రవాణా జరుగుతోంది. విశాఖపట్నంలో అన్ని రకాల రవాణా సదుపాయాలు ఉండడంతో ఇతర రాష్ట్రాల గంజాయి, మాదక ద్రవ్యాల స్మగ్లర్లు జిల్లాను ట్రాన్సిట్ కేంద్రంగా వినియోగించుకుంటున్నారు. వీరిపై గట్టి నిఘా పెట్టి అంతర్రాష్ట గంజాయి ముఠాలను అరెస్టు చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి విశాఖపట్నం మీదుగా మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాలను అరెస్టు చేస్తుంటే నగరం గంజాయికి కేంద్రంగా మారిందని దు్రష్పచారం చేయడం సరికాదు.’ అని పోలీస్ కమిషనర్ రవిశంకర్ వివరించారు. -
నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాస్తున్నారు..
-
సీబీఐ వాళ్లు పిలిస్తేనే పోర్టుకు వెళ్ళాం
-
విశాఖ డ్రగ్స్ కేసు:‘వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయవద్దు’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ రవిశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ విశాఖకు వచ్చిందని చెప్పుకొచ్చారు. సీబీఐ పిలిస్తేనే పోలీసులు అక్కడికి వెళ్లినట్టు తెలిపారు. ఇదే సమయంలో తమపై ఎలాంటి పొలిటికల్ ఒత్తిడిలేదని స్పష్టం చేశారు. కాగా, రవిశంకర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఈ డ్రగ్స్ కేసు అంతా సీబీఐ పర్యవేక్షిస్తోంది. సీబీఐ నుంచి మాకు కాల్ వచ్చింది. వారు డాగ్ స్క్వాడ్ కావాలని మమ్మల్ని అడిగారు. తర్వాత డాగ్ స్క్వాడ్ వద్దని చెప్పారు. కేవలం డాగ్ స్క్వాడ్ కోసమే స్థానిక పోలీసులు వెళ్లారు. సీబీఐ విన్నపం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. విశాఖ పోర్టు మా పరిధిలో ఉండదు. మేము కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పనిచేస్తున్నాం. విధి నిర్వహణలో మమ్మల్ని ఎవరూ ఒత్తిడి చేయలేరు. ఏపీ పోలీసులపై సీబీఐ ఎలాంటి ఆరోపణలు చేయలేదు. మా పరిధిలోలేని ప్రైవేటు పోర్టుకు కస్టమ్స్ అధికారులు పిలిస్తేనే వెళ్లాం. వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం మంచిది కాదు. కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి వదంతులు సృష్టిస్తున్నారువిశాఖ డ్రగ్స్ వ్యవహారాన్ని సీబీఐ చూస్తోంది. విశాఖ చాలా సేఫ్ సిటి. లోకల్ అధికారుల వల్ల లేటు అయ్యిందని చెప్పడం టెక్నికల్ టెర్మినాలజీ మాత్రమే. మేము (NDPS) ఎన్డీపీఎస్ యాక్ట్ సాయంతో డ్రగ్స్ నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నాం. విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేస్తున్నాం. గత ఐదేళ్ల కాలంలో డ్రగ్స్‌ను కట్టడి చేస్తున్నాం. గంజా స్మగ్లింగ్‌ను అడ్డుకున్నాం’ అని కామెంట్స్ చేశారు. -
ఏపీలో పర్మిషన్ లేకుండా మీటింగ్స్ పెట్టరాదు: సీపీ రవి శంకర్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో తప్పకుండా అందరూ రూల్స్ పాటించాలన్నారు సీపీ రవి శంకర్. కొంత మంది పర్మిషన్ లేకుండా పొలిటికల్ మీటింగ్స్ పెడుతున్నారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, విశాఖ సీపీ రవి శంకర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పొలిటికల్ పార్టీలు అన్ని ప్రచారం కోసం సువిధ యాప్ ద్వారా పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ యాప్ పనిచేయకపోతే రిటర్నింగ్ అధిaకారి వద్ద అనుమతి తీసుకోవాలి. ఎన్వోసీ మాత్రం పోలీసులు ఇస్తారు. ర్యాలీలు, మీటింగ్, డోర్ టూ డోర్ ప్రచారానికి పోలీసులు అనుమతి ఇవ్వరు. అదంతా రిటర్నింగ్ అధికారి చూసుకుంటారు. ఫీల్డ్ స్థాయిలో మొత్తం 63 టీమ్స్ పని చేస్తున్నాయి. కొంతమంది పర్మిషన్ లేకుండా పొలిటికల్ మీటింగ్స్ పెడుతున్నారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటాము. ఎస్ఎస్టీ టీమ్ ఇప్పటికే ఐదు టీమ్స్‌గా పనిచేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో కాబట్టి అందరూ రూల్స్ పాటించాల్సిందే. జిల్లాలో మొత్తం 728 మంది వద్ద లైసెన్స్ తుపాకులు ఉన్నాయి. వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఫేక్ ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం. చివరిసారి ఎన్నికల సందర్బంగా 70 శాతం ఫేక్ ఫిర్యాదులు వచ్చాయి’ అని తెలిపారు. -
హరీశ్ శంకర్ సాయం.. నెటిజన్ల నుంచి ప్రశంసలు
టాలీవుడ్లో సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దర్శకుల్లో హరీశ్ శంకర్ ఒకరు. ఇండస్ట్రీలో ఆయన తక్కువ సినిమాలే డైరెక్ట్ చేసినప్పటికీ ప్రేక్షకులను మెప్పించాయి. సినిమాలపైనే కాకుండా పలు సామాజిక అంశాలపైనా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా ఆయన చెప్పడమే కాకుండా ఇతరులకు సాయం చేస్తూ కూడా అప్పుడప్పుడు నెట్టింట వైరల్ అవుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన ఒక మంచి పనికి సోషల్ మీడియా ద్వారా ఆయన్ను అభినందిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో రోడ్డుపై నిలిచిపోయిన ఒక కారు విషయంలో హరీశ్ సాయం అందించారు. నడిరోడ్డుపై ఆగిపోయిన కారును హరీశ్‌తో పాటు మైత్రి మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ కలిసి కొంత దూరం పాటు చేతుల సాయంతో నెట్టుకుంటూ వెళ్లారు. దీనిని గమనించిన కొందరు వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలో కొందరు వీడియో తీసి నెట్టింట వదిలారు. దీంతో హరీశ్, నిర్మాత రవిశంకర్ల సింప్లిసిటికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'మిస్టర్ బచ్చన్' పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించినన 'రైడ్' మూవీకి రీమేక్ అని ప్రచారం జరుగుతుంది. మరోవైపు పవన్ కల్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్‌సింగ్'ను కూడా హరీశ్ రూపొందిస్తున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్‌ల తర్వాత హరీశ్- చిరంజీవితో సినిమా చేయనున్నారని ప్రచారం సాగుతోంది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌కు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ప్రొడ్యూసర్ ఉండనున్నారట. కానీ ఈ విషయంలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. Director #HarishShankar @harish2you sir and @MythriOfficial Ravi gaaru are helping the vehicle which is stopped on road 👏👏👏 Kudos to you sir 🙏🙏 @harish2you it’s a great beginning of my day sir after watching this one 👏👏👏 pic.twitter.com/CbGfCiU7AN — Mahaa Max (@mahaamaxx) March 14, 2024 -
వ్యక్తిగత లావాదేవీలతోనే తహసీల్దార్ హత్య
విశాఖ సిటీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖకు చెందిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసు మిస్టరీ వీడింది. వ్యక్తిగత లావాదేవీలు, భూ వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. హత్య చేసి విశాఖ నుంచి విమానంలో చెన్నై పారిపోయిన రియల్టర్ మురారి సుబ్రహ్మణ్యం గంగారావును సోమవారం అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ తెలిపారు. తహసీల్దార్ సనపల రమణయ్యను గత శుక్రవారం రాత్రి హత్య చేసిన మురారి సుబ్రహ్మణ్యం గంగారావు శనివారం ఉదయం వరకు విశాఖలోనే ఉన్నాడు. తరువాత విశాఖ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. మధ్యాహ్నం 3.30 గంటలకు విమాన సమయం అయినప్పటికీ.. ఉదయం 9.30 గంటలకే విమానాశ్రయం లోపలకు వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఇదిలా ఉంటే గంగారావే తహసీల్దార్‌ను హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు అతని మొబైల్ ఆధారంగా చెన్నైకు టికెట్ బుక్ చేసుకున్నట్లు ముందుగానే గుర్తించారు. దాని ప్రకారం మధ్యాహ్నం ఎయిర్‌పోర్ట్‌లో సుబ్రహ్మణ్యం పేరుతో విచారించారు. ఆ పేరుతో ప్రయాణికులు ఎవరూ లేరని ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పడంతో పోలీసులు వెనక్కు వచ్చేశారు. అప్పటికి విమానాశ్రయం సీసీ కెమెరాలను పరిశీలించలేదు. పెద్ద పేరు ఉండడంతో పోలీసులు గానీ, ఎయిర్పోర్ట్ అధికారులు గానీ పూర్తిస్థాయిలో నిందితుడి పేరును గుర్తించలేకపోయారు. దీంతో హంతకుడు విమానం ఎక్కి బెంగళూరు వెళ్లాడు. అయితే అప్పటికే ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఉండడంతో బెంగళూరులో ఎయిర్‌హోస్టెస్ మురారీ సుబ్రహ్మణ్యం గంగారావు పేరును అనౌన్స్ చేయడంతో.. అనుమానించిన అతడు బెంగళూరు విమానాశ్రయంలోనే దిగిపోయాడు. బస్సులో చెన్నైకు.. బెంగళూరు నుంచి గంగారావు బస్సులో చెన్నైకు బయలు దేరాడు. హంతకుడిని పట్టుకునేందుకు చెన్నైకు వెళ్లిన ప్రత్యేక బృందం మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా చెన్నై పోలీసుల సహకారంతో గంగారావును చెంగల్పుట్టు వద్ద అరెస్ట్ చేసింది. అక్కడి నుంచి ట్రాన్సిట్ ద్వారా విశాఖకు తీసుకొచ్చారు. కాగా, హత్య జరగడానికి గల కారణాలపై డీసీపీ– 1 మణికంఠ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని సీపీ రవిశంకర్ తెలిపారు. కన్వెయన్స్ డీడ్స్ విషయంలో జరిగిన వ్యక్తిగత వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు గంగరావు చెప్పినట్లు తెలిపారు. గంగారావు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, అతడిపై హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లోనూ చీటింగ్ కేసులున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వివరించారు. -
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం ఘటనలో వెలుగులోకి కొత్త అంశాలు
-
విశాఖ నూతన పోలీస్ కమిషనర్‌గా డాక్టర్ రవిశంకర్ అయ్యనార్
దొండపర్తి : విశాఖ నూతన పోలీస్ కమిషనర్‌గా డాక్టర్ రవిశంకర్ అయ్యనార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషినల్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సీపీగా విధులు నిర్వర్తించిన డాక్టర్ సి.ఎం.త్రివిక్రమ్ వర్మ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే డీసీపీ(లా అండ్ ఆర్డర్)గా ఉన్న వి.విద్యాసాగర్‌నాయుడును గ్రేహౌండ్స్ ఎస్పీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం అనంతపురం ఎస్పీగా ఉన్న కంచి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈయన గతంలో విశాఖ డీసీపీగా విధులు నిర్వర్తించారు. సమర్ధవంతమైన అధికారిగా రవిశంకర్ ► 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రవిశంకర్ అయ్యనార్ పనిచేసిన ప్రతి చోటా సమర్ధవంతమైన అధికారిగా పేరు సంపాదించారు. ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ► 1968 అక్టోబర్ 20న ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జన్మించిన రవిశంకర్ పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో పోలీస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ, సింబయాసిస్ యూనివర్సిటీలో హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లమో చేశారు. కొన్నాళ్లు జిప్మర్లో క్యాజువాలిటీ ఎమర్జన్సీ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. ► 1994లో ఐపీఎస్‌గా ఎంపికై న తరువాత 1996 గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా నియమితులయ్యారు. ►1997–98లో బెల్లంపల్లి సబ్ డివిజన్ ఏఎస్పీగా సింగరేణి బెల్ట్‌లో గెరిల్లా ఆపరేషన్స్‌కు నాయకత్వం వహించి మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ►1998–99లో వరంగల్ ఓఎస్డీగా మావోయిస్టు చర్యల నిరోధానికి చట్టపరమైన, సంస్థాగత ప్రణాళికలు రూపొందించారు. ఉత్తర తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు జిల్లాల మీదుగా మావోయిస్టుల రాకపోకలు, తప్పించుకొనే మార్గాలు, ఆశ్రయ స్థలాలు, శిక్షణా శిబిరాలను సెస్నా ఎయిర్‌క్రాఫ్, జీపీఎస్ ద్వారా మ్యాప్ చేశారు. ►1999–2002 వరకు నిజామాబాద్ ఎస్పీగా పాకిస్తాన్‌కు చెందిన రెసిడెంట్ ఏజెంట్ ఆషిక్ అలీపై జీహాదీ కేసు దర్యాప్తును పర్యవేక్షించారు. అలాగే ఇండియన్ మహ్మద్ ముస్లిమిన్ ముజాహిదీన్ మాడ్యూల్‌ను ఛేదిండంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ►2002లో హైదరాబాద్ నార్త్‌జోన్ డీసీపీగాను, 2002–2004 మధ్య గుంటూరు ఎస్పీగాను పనిచేశారు. అదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన ఐఈడీ బ్లాస్ట్ కేసును దర్యాప్తు చేశారు. ►2004–2005లో కొసావోలో యునైటెడ్ నేషన్స్ మిషన్ సీరియస్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఇన్వెస్టిగేటర్‌గా విధులు నిర్వర్తించారు. ఈ సమయంలో కొసావో పోలీస్ ఆఫీసర్ హత్యకేసు, అక్రమ ఆయుధాల కేసు, కొసావో అధ్యక్షుడు హరదినాజ్పై హత్యాయత్నం కేసుతో పాటు మరో రాజకీయ నాయకుడిపై హత్యాయత్నం కేసుల దర్యాప్తు చేపట్టారు. ►2005–2006లో హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ ఏఐజీగాను, 2006–2008 మధ్య స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్, 2008–2009లో ఏసీబీ అడిషినల్ డైరెక్టర్‌గాను, 2009–2010లో కరీంనగర్/వరంగల్ రేంజ్ డీఐజీగా విధులు నిర్వర్తించారు. ►2010–2015 మధ్య నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డీఐజీగా ఇండియన్ ముజాహుద్దీన్(ఐఎం) భారీ పేలుళ్ల కేసు, దిల్సుఖ్నగర్, మక్కా మస్జిద్, మాలేగాన్, బెంగుళూరు చర్చి, అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులను దర్యాప్తు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అలాగే నకిలీ కరెన్సీ కేసులు, టెర్రర్ ఫైనాన్స్ కేసుల్లో జాతీయ, అంతర్జాతీయ లింకులు, మావోయిస్ట్ ల్యాండ్‌మైన్ బ్లాస్ట్ కేసులు, ఇటాలియన్ మైరెన్ కేసు ఇలా అనేక కీలక కేసులను దర్యాప్తు చేశారు. ►2015–2018 మధ్య డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా, 2015–2018లో ఆరోగ్యశ్రీ సీఈఓగా, 2018–2019లో ప్రావిజన్స్ అండ్ లాజిస్టిక్స్‌లో ఐజీగా, 2019లో లా అండ్ ఆర్డర్ అడిషినల్ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తించారు. ►ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషినల్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న రవిశంకర్ విశాఖ సీపీగా నియమితులయ్యారు. కొత్త డీసీపీ స్వస్థలం ఉమ్మడి విశాఖే.. విశాఖ డీసీపీ(లా అండ్ ఆర్డర్)గా రానున్న కంచి శ్రీనివాసరావు విశాఖతో అనుబంధం ఉంది. ఆయన స్వస్థలం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. 2009 గ్రూప్–1 ద్వారా డీఎస్పీ పోస్టు సాధించారు. తొలుత వనపర్తి, కొవ్వూరులో డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఆ తరువాత సీఐడీ డీఎస్పీగా పనిచేశారు. అడిషనల్ ఎస్పీగా ఉద్యోగోన్నతి పొందాక విశాఖపట్నం డీసీపీగా, శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. మరోసారి ఉద్యోగోన్నతి పొంది విజయవాడ ట్రాఫిక్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్నారు. అక్కడి నుంచి విశాఖ డీసీపీగా నియమితులయ్యారు. -
ఆ పాయింట్‌తో ఖుషి తీశామనేది అవాస్తవం
‘‘నిన్ను కోరి, మజిలీ’ వంటి నా గత చిత్రాల్లో విఫలమైన ప్రేమకథలను చూపించాను. కానీ, ఈసారి పూర్తి స్థాయి వినోదం, ఉత్సాహంగా ఉండే ప్రేమకథ తీయాలని ‘ఖుషి’ చేశాను’’ అన్నారు శివ నిర్వాణ. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు శివ నిర్వాణ చెప్పిన విశేషాలు. డైరెక్టర్ మణిరత్నంగారి ఫ్యాన్‌గా ఆయన దగ్గర చేరాలనుకుని చెన్నై వెళ్లాను. కానీ ఆయన్ను కలవడానికి కుదరలేదు. మణిరత్నంగారి సినిమాలను ఇష్టపడతాను కానీ ఆయనలా తీయాలనుకోను. ఆయన తీసిన ‘సఖి’ లాంటిపాయింట్తో ‘ఖుషి’ తీశామనే వార్తలు అవాస్తవం. ప్రస్తుత సమాజంలోని ఒక సమకాలీన అంశాన్ని విజయ్, సమంతలాంటి స్టార్స్ ద్వారా చూపిస్తే బాగుంటుందని నమ్మాను. ప్రేమకథను ఎంత కొత్తగా చెప్పాలనే ఆలోచన నుంచి పుట్టిందే కాశ్మీర్ నేపథ్యం. ఈ చిత్రంలో విజయ్‌పాత్ర అమ్మాయిలకు, కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సమంత వాస్తవ జీవితానికి, ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. నిర్మాతలు నవీన్, రవిశంకర్‌గార్లు డైరెక్టర్స్‌కు స్వేచ్ఛ ఇస్తారు కాబట్టి సంతోషంగా సినిమా చేసుకోవచ్చు. హేషమ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నేను డైరెక్ట్ చేసిన ‘నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్’ సినిమాల్లో కొన్నిపాటలు రాశాను. కానీ, ‘ఖుషి’కి అన్నిపాటలు రాయాల్సి వచ్చింది.. రాశాను. మనంపాన్ ఇండియా సినిమా చేయాలని ముందే అనుకుని, కథ రాసుకోనవసరం లేదనేది నా అభిప్రాయం.‘బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2’ వంటి సినిమాలన్నీ మన నేటివిటీకి నచ్చేలా చేసుకున్నవి. ఇతర భాషల వాళ్లు కూడా వాటిని ఇష్టపడ్డారు కాబట్టిపాన్ ఇండియా సినిమాలు అయ్యాయి. మనకు నచ్చే మన నేటివిటీ సినిమా బాగా చేసుకుంటే అది ఇతరులకు నచ్చిపాన్ ఇండియా మూవీ అవుతుందన్నది నా అభిప్రాయం. -
ఆధ్యాత్మిక గురువు రవి శంకర్‌కు 'అరుదైన గౌరవం'
భారతదేశ ఆధ్యాత్మికతకు అరుదైన గౌరవంగా భావించదగిన చారిత్రాత్మక గౌరవం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మానవతావాది గురుదేవ్ రవిశంకర్‌కి లభించింది. హోవార్డ్ కౌంటీ, మేరీల్యాండ్, టెక్సాస్ రాష్ట్రాలు 'రవిశంకర్ దినోత్సవాన్ని' ప్రకటించడంతో అమెరికా కెనడా దేశాలలో రవిశంకర్ దినోత్సవాన్ని ప్రకటించిన నగరాల సంఖ్య 30కి చేరింది. ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న ఏకైక ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ కావడం విశేషం. రవిశంకర్ దినోత్సవాన్ని ప్రకటించిన హోవార్డ్ కౌంటీ, మేరీల్యాండ్, టెక్సాస్ రాష్ట్రాలు ఒకప్పుడూ యుద్ధ విధ్వంస ప్రాంతాలుగా ఉండేవి. ఆ ప్రాంతాలల్లో గురుదేవ్ చేసిన శాంతి కృషిని ప్రశంసించిన టెక్సాస్ గవర్నర్ ప్రపంచ శాంతికి చేసిన కృషికి గుర్తింపుగా అమెరికా, కెనడాలలోని 30నగరాలలో ఈ గౌరవం పొందిన మొట్టమొదటి, ఏకైక భారతీయ ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ రవిశంకర్. జూలై 30, 2023, బెంగళూరు: భారతీయ ఆధ్యాత్మిక చరిత్రకు గర్వకారణమైన పరిణామం అమెరికాలో చోటుచేసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మానవతావాది, రవిశంకర్‌కు గౌరవసూచకంగా దినోత్సవాలు జరుపుకుంటున్న అమెరికా, కెనడా నగరాలు, రాష్ట్రాల సంఖ్య 30కి చేరింది. ఇప్పటికే 27 నగరాలలో ఈ దినోత్సవాలు ప్రకటించగా తాజాగా హోవార్డ్ కౌంటీ, మేరీల్యాండ్; టెక్సాస్ రాష్ట్రాలు ఈ ఉత్సవాలకు తేదీలను ప్రకటించాయి. ఈ గౌరవం లభించిన మొదటి, ఏకైక ఆధ్యాత్మిక నాయకుడు రవిశంకర్ కావడం గమనార్హం. సేవాదృక్పథంతో, శాంతి, ఆనందాలను వ్యాపింపజేస్తూ వివాదాల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణ, భిన్న దృక్పథాల మధ్య తీవ్రమైన అంతరాలు ఏర్పడుతున్న నేటి సమాజాన్ని ఏకీకృతం చేసే దిశగా గురుదేవ్ మార్గదర్శకత్వంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలకుగాను ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భగా ఇచ్చిన ప్రశంసా పత్రంలో టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్, "తాము నమ్మిన మార్గంపై గల అకుంఠిత విశ్వాసంతో గురుదేవ్ రవిశంకర్, వారి అనుచరగణం ప్రపంచంలోని అనేక యుద్ధ ప్రభావిత ప్రాంతాలలో ధైర్యంగా పర్యటించి..కరుడుగట్టిన ఖైదీలతో సైతం చర్చించి, వారికి మార్గనిర్దేశం చేయగలిగారు. ఏ మాత్రమూ సరిదిద్దలేమని అనుకునే విభేదాలను సైతం పరిష్కరించగలిగారు.” అని ప్రశంసించారు. మేరీల్యాండ్‌లోని హోవార్డ్ కౌంటీ చేసిన కార్యనిర్వాహక ప్రకటనలో, "ప్రపంచ మానవతావాది, ఆధ్యాత్మిక నాయకుడు, శాంతి దూత, ప్రపంచంలో పరివర్తన తేగలిగే వ్యక్తులలో ఒకరుగా గుర్తింపు పొందిన శ్రీశ్రీ... అభిప్రాయ భేదాలతో విభిన్న ధృవాలుగా చీలిపోయి, దూరాలు పెరిగిపోయిన నేటి ప్రపంచ స్థితిలో గురుదేవ్ శ్రీశ్రీ మన సమాజాన్ని, ప్రపంచాన్ని శాంతి, ఐక్యత, ఆశావహ దృక్పథాల ద్వారా వ్యక్తిగత, సామాజిక స్థాయిలలో స్వీయ పునరుద్ధరణ ద్వారా సమైక్యం చేసేందుకు కృషి చేస్తున్నారు..." అని పేర్కొన్నారు. హోవార్డ్ కౌంటీ జూలై 22వ తేదీని శ్రీశ్రీ రవిశంకర్ డే గా ప్రకటించింది. ఆధ్యాత్మికత మరియు సేవా మార్గాల ద్వారా ప్రజల జీవితాలను మార్చడానికి ఈ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అందిస్తున్న అపారమైన సహకారాన్ని గుర్తిస్తూ టెక్సాస్, బర్మింగ్‌హామ్ వరుసగా జూలై 29, జూలై 25వ తేదీలను శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవంగా ప్రకటించాయి. అమెరికాలో శ్రీశ్రీ పర్యటన సందర్భంగా ఆయా నగరాలలో గురుదేవ్ కు ఘనస్వాగతం లభించింది. జాతి, కుల, స్థాయీ, లింగభేదాలకు అతీతంగా ఆయా ప్రాంతాలలో హాజరైన వేలాదిమంది ప్రజలను ఉద్దేశించి శ్రీశ్రీ ప్రసంగించి, తమ మనసులోతులలోనికి తీసు కొనిపోయే శక్తివంతమైన ధ్యానక్రియలను వారిచే చేయించారు. ఈ సందర్భంగా గురుదేవ్ ప్రవచనాలతో కూడిన ‘నోట్స్ ఫర్ ది జర్నీ విదిన్’ (అంతరంగ ప్రయాణానికి సూచనలు) అనే పుస్తకాన్ని ఆయా నగరాలలో విడుదలచేశారు. నిజాయితీగా అన్వేషించే సాధకులకు తమ దైనందిన జీవన సమస్యల నుండి, ఆధ్యాత్మికత వరకూ ఎదురయ్యే సార్వజనీనమైన ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానాలు ఇస్తుంది. శాంతి మరియు సంఘర్షణల పరిష్కారానికి ఒక మానవతావాదిగా శ్రీశ్రీ చేసిన ప్రయత్నాలకుగాను అమెరికాలోని కౌంటీ ఆఫ్ అల్లెఘేనీ గత నెలలో, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్‌ను గౌరవించిన విషయం విదితమే. ఆ సందర్భంగా ఇచ్చిన ప్రశంసా పత్రంలో ‘... స్వచ్ఛంద సేవ, సామాజిక కార్యక్రమాలద్వారా వివిధ వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి, నగరాలలో పెరుగుతున్న హింస, నేరాలను అరికట్టడానికి గురుదేవ్ చేస్తున్న ప్రయత్నాలు, వారు విభిన్న సంస్కృతులు, జాతుల మధ్య సంఘర్షణలను నివారించేందుకు చేస్తున్న ప్రయత్నాలతో మాత్రమే పోల్చదగ్గవి.’ అని పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 1 వరకు వాషింగ్టన్ లోని ప్రఖ్యాత నేషనల్ మాల్ లో ఘనంగా జరుగనున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల కోసం శ్రీశ్రీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతి పెద్ద సమావేశాలలో ఒకటిగా పేర్కొనదగ్గ జనసమూహానికి శ్రీశ్రీ స్వయంగా మార్గదర్శనం చేస్తారు. ఉత్సవాలలోభాగంగా ప్రపంచవ్యాప్త కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. (చదవండి: కెనడాలో ఘనంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు) -
రోజుకు 10 లక్షల డిజిటల్ రూపీ లావాదేవీలు
ముంబై: ఈ ఏడాది చివరికి రోజువారీగా 10 లక్షల సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ/ఈ–రూపాయి) లావాదేవీల లక్ష్యాన్ని చేరుకుంటామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ ప్రకటించారు. ప్రస్తుతం రోజువారీగా 5,000–10,000 ఈ–రూపీ లావాదేవీలు నమోదవుతున్నట్టు చెప్పారు. యూపీఐ వ్యవస్థతో సీబీడీసీ అనుసంధానతను ఈ ఏడాది జూన్‌లో ఆర్బీఐ ఎంపీసీలో భాగంగా ప్రకటించగా, ఈ నెలాఖరుకు ఇది కార్యరూపం దాలుస్తుందని రవిశంకర్ తెలిపారు. కాకపోతే సీబీడీసీ ఎకోసిస్టమ్ కిందకు మరిన్ని బ్యాంక్‌లు చేరాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది నవంబర్‌లో హోల్‌సేల్ లావాదేవీలకు సీబీడీసీని ప్రయోగాత్మకంగా ఆర్బీఐ ప్రారంభించగా, అదే ఏడాది డిసెంబర్ నుంచి రిటైల్ లావాదేవీలకు సైతం దీన్ని విస్తరించింది. తొలుత ఎనిమిది బ్యాంక్‌లను అనుమతించగా, ప్రస్తుతం 13 బ్యాంక్‌లకు సీబీడీసీ విస్తరించింది. ప్రస్తుతం 13 లక్షల మంది యూజర్లు సీబీడీసీని వినియోగిస్తున్నారని, ఇందులో 3 లక్షల మంది వర్తకులు ఉన్నట్టు రవిశంకర్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో రోజుకు 10 లక్షల లావాదేవీల లక్ష్యం కష్టమైనది కాదన్నారు. యూపీఐపై రోజుకు 31 కోట్ల లావాదేవీలు నమోదవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించడంపైనే దృష్టి పెట్టామని, ఏప్రిల్ నాటికి లక్షగా ఉన్న యూజర్ల సంఖ్య అనంతరం రెండు నెలల్లోనే 13 లక్షలకు పెరిగినట్టు వివరించారు. ఇక మీదట రోజువారీ లావాదేవీల పెంపు లక్ష్యంగా పనిచేయనున్నట్టు పేర్కొన్నారు. -
నాటా మహాసభల్లో ప్రసంగించిన శ్రీ రవిశంకర్ గురూజీ
నార్త్ అమెరికన్ తెలుగు అసొసియేషన్ నాటా తెలుగు మహాసభలు డల్లాస్‌లో ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా పెద్ద పీట వేశారు. ఈ మహాసభలకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ గురూజీ హాజరయ్యారు. మహాసభల్లో ఆయన మెడిటేషన్‌పై ప్రసంగించనున్నట్లు నాటా మహాసభల ఆధ్యాత్మిక కమిటీ చైర్ సుధాకర్ పెన్నం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో కాసేపు ముచ్చటించారు. వాషింగ్టన్ డీసీలో జరగుతున్న నాటా తెలుగు మహాసభలకు రావడం మొదటిసారిగా వచ్చారు కదా ఎలా అనిపించింది మీకు అని ప్రశ్నించగా..ఇది మొదటిసారి కాదని, న్యూఢిల్లీ, జర్మనీలో బెర్లిన్ తదితర కార్యక్రమాల్లో హాజయరయ్యానని చెప్పారు. విభిన్న ప్రాంతాల నుంచి వృత్తి రీత్యా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యిన వాళ్లందర్నీ ఒక వేదికపైకి తీసుకొచ్చింది 'నాటా' అన్నారు. ఇది ఒకరకంగా మనమంతా ఒకే కుటుంబం అనే ఒక గొప్ప సందేశం ఇచ్చిందన్నారు. మన నేపథ్య ఏదైనా.. మనమంతా ఎప్పటికీ ఒక్కటే అనే గొప్ప సందేశాన్ని ఎలుగెత్తి చాటారు. మొన్నటివరకు కోవిడ్ భయంతో డిప్రెషన్‌గా బిక్కుబిక్కుమంటూ నాలుగోడలకే పరిమితమైన అనంతరం ఆనందంగా నూతనోత్సహంతో జరుపుకుంటున్న ఒక వేడుక ఇది అని అన్నారు. అలాగే ప్రస్తుత టెక్నాలజీ ఆధ్యాత్మిక జీవనానికి ఉపకరించేదా భంగం కలిగించేదా అని ప్రశ్నించగా..మానవుని కంఫర్ట్ కోసమే కదా టెక్నాలజీ. దాన్ని మన జీవితాన్ని సుఖమయం చేసుకునేలా వాడుకోవడమనేది మన చేతుల్లోనే ఉంది. టెక్నాలజీ మనిషికి మంచే చేస్తుంది. ఉపయోగించే విధానంలోను ఉంది అంతా అని చమత్కారంగా చెప్పారు. మనం కాన్ఫిడెంట్‌గా ఎప్పుడూ ఉండగలం అని ప్రశ్నించగా.. మన మైండ్ క్లియర్‌గా ఉంటేనే అది సాధ్యం అని బదులిచ్చారు. మెడిటేషన్ అని సులభంగా చెప్పినంతా ఈజీ కాదు కదా చేయడం అని అడగగా..అదే కదా నా జాబ్ అని నవ్వుతూ జవాబిచ్చారు గురూజీ రవి శంకర్. మంచి గైడెన్స్‌లో చేయడం నేర్చుకుంటే అది ఈజీగానే చేయొచ్చు అని అన్నారు. మానవత్వానికి అతిపెద ఛాలెంజ్ వివక్ష, స్టీరియో టైప్ థింకింగ్ , ఫాల్స్ మైండ్ తదితరాలని అన్నారు. ఆ దుర్గుణాలని దూరం చేసిమంచి వైపు తీసుకువెళ్లగలిగేది మెడిటేషన్ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాను నక్స్‌లైట్లను కలుసుకున్న సందర్భం గుర్తు చేసుకుంటూ..ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ బోర్డర్ల మధ్య ఉన్న నక్సల్స్ ప్రాంతానికి వెళ్లానని, అక్కడ వారు తమ గురువు కారల్ మార్క్స్ అని చెప్పారన్నారు. అది వారి ఓపెనియన్. అక్కడ వారు తాము ఎంత వివక్షతకు గురయ్యమో వివరించారు. ఆ తర్వాత వారి చెప్పిందంతా ఓపికగా విన్నా. ఆ తర్వాత వారు నా ప్రసంగం విని నచ్చాక ..కాసేపు తనాతో కలిసి మెడిటేషన్ కూడా చేశారన్నారు. ఆ తర్వాత క్రమేణా వారి జీవితాల్లో చాలా మార్పు వచ్చింది. కొందరూ పూర్తి స్థాయిలో మారారు కూడా. మెడిటేషన్‌కి చాలా పవర్ ఉందని, కుల, మత భేదాలతో సంబంధం ఉండదని ఎవ్వరైన చేయొచ్చు. చివరిగా నువ్వేంటీ? అనేది నీ అంతరంగమే నీకు బోధించేలా చేస్తుందని రవిశంకర్ అన్నారు. ఇలా డల్లాస్‌లో జరిగిన నాటా మహాసభలో మెడిటేషన్ , ప్రాణాయామాకి సంబంధించిన విషయాలను గురించి చెప్పారు. (చదవండి: నాటా మహాసభలో..అమెరికా వైస్సార్సీపీ సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్) -
హనుకి గ్రీన్ సిగ్నల్?
ప్రస్తుతం ‘సలార్’, ప్రా జెక్ట్ కె’, ‘రాజా డీలక్స్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఆ సినిమా చిత్రీకరణలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో కొత్త సినిమాల కోసం కథలు వింటున్నారట ప్రభాస్. ఇందులో భాగంగా దర్శకుడు హను రాఘవపూడి చెప్పిన ఓ కథ ప్రభాస్‌కు నచ్చిందని, ఈ కథకు ప్రభాస్ ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దీంతో ఈ స్క్రిప్ట్‌కు హను రాఘవపూడి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. అంతేకాదు.. ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రస్తుతం ‘రాజా డీలక్స్’ షూటింగ్లో పాల్గొంటున్నారు ప్రభాస్. అలాగే ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం జూన్ 16న థియేటర్స్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
గులాబీ ఎమ్మెల్యే ఎందుకు టెన్షన్లో ఉన్నారు?.. అక్కడ ఇదే హాట్ టాపిక్
ఆ గులాబీ ఎమ్మెల్యే ఆత్మరక్షణలో పడ్డారా? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని అనుమానిస్తున్నారా? తనవెనుక ఉన్నవారే తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆందోళన చెందుతున్నారా? అత్యంత ఆత్మీయుల సమ్మేళనాలు నిర్వహిస్తున్నా ఆ ఎమ్మెల్యే మళ్ళీ పుంజుకోగలరా? గులాబీ దళపతి ఆదరణ పొంది టిక్కెట్ సంపాదించగలుగుతారా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్సీ నియోజకవర్గాల్లో ఒకటైన చొప్పదండి ఎమ్మెల్యేగా అధికార బీఆర్ఎస్ నుంచి సుంకె రవిశంకర్ కొనసాగుతున్నారు. ప్రజల్లో, పార్టీలో ఆయనకు ఆదరణ తగ్గిందని.. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు రాదనే చర్చ నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. స్వయంగా ఎమ్మెల్యే రవిశంకర్‌కే తనకు టిక్కెట్ రాదనే అనుమానం గట్టిగా పీడిస్తోందని టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో ఆయన ఎవరినీ కలుపుకొనిపోవడంలేదన్న భావన కొందరిలో కనిపిస్తుండగా.. చొప్పదండి బీఆర్ఎస్ నేతలు మూడు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కేడర్ అభిప్రాయపడుతోంది. సిటింగ్ ఎమ్మెల్యేకు గత ఎన్నికల్లో ఆర్థికంగా, సామాజికపరంగా ఉపయోగపడ్డ కొందరు అగ్రవర్ణాల నేతలు ఈసారి రవిశంకర్‌పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు.. కరీంనగర్ కు చెందిన ఒక కార్పోరేటర్..బోయినపల్లి ఎంపీపీ సహా మరికొందరు నేతలు చొప్పదండి సీటుపై కన్నేసినట్లుగా ప్రచారం సాగుతోంది. గులాబీ పార్టీ అధిష్ఠానం నిర్వహించిన సర్వేల్లోనూ ప్రస్తుత ఎమ్మెల్యే రవిశంకర్ పరిస్థితిపై సానుకూలత కనిపించడంలేదని టాక్. స్థానికంగా పార్టీలో నెలకొన్న తలనొప్పులు.. ప్రస్తుత ఎమ్మెల్యేకు పోటీగా టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న నేతల తీరుతో సిట్టింగ్ తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలతో వచ్చే ఎన్నికలకు సంసిద్ధమవుతుంటే.. చొప్పదండి సిటింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అత్యంత ఆత్మీయ సమ్మేళనాలనూ నిర్వహిస్తున్నారట. సోషల్ మీడియాలో తగ్గేదేలే.. అందులో తనకు టిక్కెట్ వచ్చే అవకాశాలకు ఎక్కడా గండి పడకుండా మనవాళ్లంతా ప్రయత్నించాలని కోరినట్టుగా కూడా ఇప్పుడు ఓ చర్చ ప్రచారంలోకొచ్చింది. పైగా సోషల్ మీడియాలో తగ్గేదేలే అన్నట్టుగా కౌంటర్ అటాక్స్ కు కూడా సిద్ధం కావాలని.. ఎక్కడా గులాబీబాస్ దృష్టిలో తక్కువ కాకుండా ఉండేలా అన్నివిధాలా తమ నడవడిక ఉండాలని కోరినట్టు తెలుస్తోంది. తన వ్యవహారశైలితో అటు అధిష్టానం దృష్టిలో..ఇటు స్థానిక నేతలు, కార్యకర్తల దృష్టిలో నెగెటివ్ మార్కులు తెచ్చుకున్న సుంకె రవిశంకర్ తిరిగి ఒడ్డుకు చేరుకోగలుగుతారా? పార్టీ అధినేతతో టిక్కట్ తనకే ఇస్తామనే పరిస్థితి క్రియేట్ చేసుకోగలుగుతారా? పార్టీలోని ప్రత్యర్థులను దారికి తెచ్చుకోగలరా? ఇప్పుడు చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపైన, ఆయన భవిష్యత్ పైనా హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. చదవండి: ఒక్కలిగల కంచుకోటలో పాగా ఎవరిదో...! -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తగ్గిన ఆదరణ!.. వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమేనా?
ఆ గులాబీ ఎమ్మెల్యే ఆత్మరక్షణలో పడ్డారా? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని అనుమానిస్తున్నారా? తనవెనుక ఉన్నవారే తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆందోళన చెందుతున్నారా? అత్యంత ఆత్మీయుల సమ్మేళనాలు నిర్వహిస్తున్నా ఆ ఎమ్మెల్యే మళ్ళీ పుంజుకోగలరా? గులాబీ దళపతి ఆదరణ పొంది టిక్కెట్ సంపాదించగలుగుతారా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్సీ నియోజకవర్గాల్లో ఒకటైన చొప్పదండి ఎమ్మెల్యేగా అధికార బీఆర్ఎస్ నుంచి సుంకె రవిశంకర్ కొనసాగుతున్నారు. ప్రజల్లో, పార్టీలో ఆయనకు ఆదరణ తగ్గిందని.. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు రాదనే చర్చ నియోజకవర్గంలో హాట్ టాపిక్ మారింది. స్వయంగా ఎమ్మెల్యే రవిశంకర్‌కే టిక్కెట్ రాదనే అనుమానం గట్టిగా పీడిస్తోందని టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో ఆయన ఎవరినీ కలుపుకుపోవడం లేదన్న భావన కొందరిలో కనిపిస్తుండగా.. చొప్పదండి బీఆర్ఎస్ నేతలు మూడు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కేడర్ అభిప్రాయపడుతోంది. సిటింగ్ ఎమ్మెల్యేకు గత ఎన్నికల్లో ఆర్థికంగా, సామాజికపరంగా ఉపయోగపడ్డ కొందరు అగ్రవర్ణాల నేతలు ఈసారి రవిశంకర్‌పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు.. కరీంనగర్‌కు చెందిన ఒక కార్పొరేటర్.. బోయినపల్లి ఎంపీపీ సహా మరికొందరు నేతలు చొప్పదండి సీటుపై కన్నేసినట్లుగా ప్రచారం సాగుతోంది. గులాబీ పార్టీ అధిష్ఠానం నిర్వహించిన సర్వేల్లోనూ ప్రస్తుత ఎమ్మెల్యే రవిశంకర్ పరిస్థితిపై సానుకూలత కనిపించడంలేదని టాక్. స్థానికంగా పార్టీలో నెలకొన్న తలనొప్పులు.. ప్రస్తుత ఎమ్మెల్యేకు పోటీగా టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న నేతల తీరుతో సిట్టింగ్ తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలతో వచ్చే ఎన్నికలకు సంసిద్ధమవుతుంటే.. చొప్పదండి సిటింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అత్యంత ఆత్మీయ సమ్మేళనాలనూ నిర్వహిస్తున్నారట. అందులో తనకు టికెట్ వచ్చే అవకాశాలకు ఎక్కడా గండి పడకుండా మనవాళ్లంతా ప్రయత్నించాలని కోరినట్టుగా కూడా ఇప్పుడు ఓ చర్చ ప్రచారంలోకొచ్చింది. పైగా సోషల్ మీడియాలో తగ్గేదేలే అన్నట్టుగా కౌంటర్ అటాక్స్ కు కూడా సిద్ధం కావాలని.. ఎక్కడా గులాబీ బాస్ దృష్టిలో తక్కువ కాకుండా ఉండేలా అన్నివిధాలా తమ నడవడిక ఉండాలని కోరినట్టు తెలుస్తోంది. తన వ్యవహారశైలితో అటు అధిష్టానం దృష్టిలో.. ఇటు స్థానిక నేతలు, కార్యకర్తల దృష్టిలో నెగెటివ్ మార్కులు తెచ్చుకున్న సుంకె రవిశంకర్ తిరిగి ఒడ్డుకు చేరుకోగలుగుతారా? పార్టీ అధినేతతో టిక్కట్ తనకే ఇస్తామనే పరిస్థితి క్రియేట్ చేసుకోగలుగుతారా? పార్టీలోని ప్రత్యర్థులను దారికి తెచ్చుకోగలరా? ఇప్పుడు చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపైన, ఆయన భవిష్యత్ పైనా హాట్ హాట్ చర్చ జరుగుతోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్ డెస్క్ -
జీవో నంబర్ 1పై దురుద్దేశంతోనే దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: ప్రజల భద్రత కోసం నిబంధనలను అనుసరించి హోం శాఖ జీవో నంబర్ 1 జారీ చేసిందని అదనపు డీజీ (శాంతిభద్రతలు) రవిశంకర్ అయ్యన్నార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాదయాత్రలు, రోడ్‌షోలపై ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. కొందరు దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం సభలు, సమావేశాలపై నిషేధం విధించిందని దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు జీవో నంబర్ 1లో నిషేధం అనే మాటే లేదన్నారు. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారులపైన సభలు, సమావేశాలు పెట్టొద్దని మాత్రమే చెప్పామని వెల్లడించారు. పూర్తిగా ప్రజల ప్రయాణం, సరుకు రవాణా కోసమే రహదారులను ఉపయోగించాలని జీవోలో పేర్కొన్నారని గుర్తుచేశారు. వైద్యం, ఇతర అత్యవసర ప్రయాణాలు చేసేవారికి ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో సభలు నిర్వహించుకోవాలని సూచించామని తెలిపారు. అత్యవసరమైతే షరతులతో అధికారులు అనుమతినిస్తారని కూడా జీవోలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. కరెంటు వైర్లు, కాలువలు, డ్రైనేజీలు దగ్గరలో లేకుండా సభలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సభల నిర్వహణకు తగిన ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో జనసేన సభ కోసం అనుమతి కోరితే అన్నీ పరిశీలించి అనుమతి మంజూరు చేశామని చెప్పారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో టీడీపీ నేతలు సరిగా దరఖాస్తు పూర్తి చేయలేదన్నారు. దరఖాస్తు సరిచేసి ఇవ్వాలని పోలీసులు చెప్పినప్పటికీ నిర్వాహకులు స్పందించలేదన్నారు. ఏ పార్టీ అయినా ఒకే రీతిలో జీవో నంబర్1 ను అమలు చేస్తామని వెల్లడించారు. 1861 పోలీసు చట్టం దేశమంతా అమలులో ఉందన్నారు. ఆ చట్టంలోని సెక్షన్లు 30, 30ఏ, 31లలో పేర్కొన్న అంశాలకు అనుగుణంగానే జీవో నంబర్ 1ను హోం శాఖ జారీ చేసిందన్నారు. కందుకూరు, గుంటూరు జిల్లాల్లో దుర్ఘటనలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఐజీ (శాంతిభద్రతలు) రాజశేఖర్ బాబు పాల్గొన్నారు.