సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో తప్పకుండా అందరూ రూల్స్ పాటించాలన్నారు సీపీ రవి శంకర్. కొంత మంది పర్మిషన్ లేకుండా పొలిటికల్ మీటింగ్స్ పెడుతున్నారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాగా, విశాఖ సీపీ రవి శంకర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పొలిటికల్ పార్టీలు అన్ని ప్రచారం కోసం సువిధ యాప్ ద్వారా పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ యాప్ పనిచేయకపోతే రిటర్నింగ్ అధిaకారి వద్ద అనుమతి తీసుకోవాలి. ఎన్‌వోసీ మాత్రం పోలీసులు ఇస్తారు. ర్యాలీలు, మీటింగ్, డోర్ టూ డోర్ ప్రచారానికి పోలీసులు అనుమతి ఇవ్వరు. అదంతా రిటర్నింగ్ అధికారి చూసుకుంటారు.
ఫీల్డ్ స్థాయిలో మొత్తం 63 టీమ్స్ పని చేస్తున్నాయి. కొంతమంది పర్మిషన్ లేకుండా పొలిటికల్ మీటింగ్స్ పెడుతున్నారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటాము. ఎస్‌ఎస్‌టీ టీమ్ ఇప్పటికే ఐదు టీమ్స్‌గా పనిచేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో కాబట్టి అందరూ రూల్స్ పాటించాల్సిందే. జిల్లాలో మొత్తం 728 మంది వద్ద లైసెన్స్ తుపాకులు ఉన్నాయి. వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఫేక్ ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం. చివరిసారి ఎన్నికల సందర్బంగా 70 శాతం ఫేక్ ఫిర్యాదులు వచ్చాయి’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment