సాక్షి, విశాఖపట్నం: బస్సు యాత్రతో సీఎం జగన్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశారు. ఎన్నికల్లో పోటీ ఏకపక్షమేనని.. వైఎస్సార్‌సీపీ విజయం లాంఛనమేనని స్పష్టం చేస్తున్నారు. మాటపై నిలబడే నాయకుడి సారథ్యంలో పనిచేసేందుకు కూటమి పార్టీల నేతలు ఆరాట పడుతున్నారు. పార్టీ కార్యకర్తల మనోభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆచితూచి జనసేన, టీడీపీ, బీజేపీ నేతలను వైఎస్సార్‌సీపీలోకి చేర్చుకుంటున్నారు.
తాజాగా, ఎండాడ ఎంవీవీ సిటీ నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో బీజేపీ, టీడీపీ, జనసేన నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌లో పలువురు కీలక నేతలు చేరారు.గాజువాక నియోజకవర్గం బీజేపీ నుంచి మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్ ప్రకాష్‌రావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవింద్, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి, సంపత్ కుమార్.. టీడీపీ నుంచి యువజన విభాగం నేత ఏఎన్ఆర్ చేరారు. పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్ధి గుడివాడ అమర్‌నాథ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment