joins ysrcp
-
కూటమి వెన్నులో వణుకు.. వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
సాక్షి, విశాఖపట్నం: బస్సు యాత్రతో సీఎం జగన్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశారు. ఎన్నికల్లో పోటీ ఏకపక్షమేనని.. వైఎస్సార్సీపీ విజయం లాంఛనమేనని స్పష్టం చేస్తున్నారు. మాటపై నిలబడే నాయకుడి సారథ్యంలో పనిచేసేందుకు కూటమి పార్టీల నేతలు ఆరాట పడుతున్నారు. పార్టీ కార్యకర్తల మనోభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆచితూచి జనసేన, టీడీపీ, బీజేపీ నేతలను వైఎస్సార్సీపీలోకి చేర్చుకుంటున్నారు. తాజాగా, ఎండాడ ఎంవీవీ సిటీ నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో బీజేపీ, టీడీపీ, జనసేన నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌లో పలువురు కీలక నేతలు చేరారు.గాజువాక నియోజకవర్గం బీజేపీ నుంచి మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్ ప్రకాష్‌రావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవింద్, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి, సంపత్ కుమార్.. టీడీపీ నుంచి యువజన విభాగం నేత ఏఎన్ఆర్ చేరారు. పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్ధి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. -
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి పితాని బాలకృష్ణ
సాక్షి, కోనసీమ జిల్లా: ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేనలకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నాయకులంతా వరుసగా గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి భారీగా వైఎస్సార్సీపీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో తుగ్గలి వద్ద... సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముమ్మిడివరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పితాని బాలకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సానబోయిన మల్లిఖార్జున్ సహా పలువురు జనసేన పార్టీ కీలక నేతలు చేరారు. జనసేన పార్టీలో కష్టపడినవారికి కాకుండా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ కలసి టికెట్లు అమ్ముకున్నారని పితాని బాలకృష్ణ మండిపడ్డారు. పార్టీ కోసం కోట్లాదిరూపాయల ఆస్తిని అమ్ముకున్న తనకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: టీడీపీ, జనసేనకు వరుస షాక్‌లు! -
నంద్యాల జిల్లాలో పవన్ కళ్యాణ్ కి భారీ షాక్
-
Repalle: టీడీపీకి భారీ షాక్.. వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
సాక్షి, తాడేపల్లి: రేపల్లె నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి, నగరం మండలాల నుంచి వైఎస్సార్సీపీలోకి టీడీపీ శ్రేణులు భారీగా చేశారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమక్షంలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పిన విజయసాయిరెడ్డి.. వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, రేపల్లె వైసీపీ ఇంఛార్జి ఈవూరు గణేష్, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, పేదలకు సీఎం జగన్ ప్రభుత్వంలో మేలు జరిగిందన్నారు. పేదలను ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన అన్నారు. సీఎం ఆలోచన మేరకు గణేష్‌ను రేపల్లె నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించారన్నారు. మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలని అంతా కోరుకుంటున్నారన్నారు. 175కి 175 సాధించడమే లక్ష్యమని మోపిదేవి అన్నారు. ఈవూరు గణేష్‌ను రేపల్లె ప్రజలంతా గెలిపించి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘పార్టీ కోసం మోపిదేవి వెంకటరమణ చేసిన త్యాగం మరువలేనిది. కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడి పార్టీ కోసం కృషి చేశారు. మోపిదేవికి మరొక్కసారి రాజ్యసభ ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. రేపల్లె నుంచి ఈవూరు గణేష్‌ను గెలిపిస్తే అటు అసెంబ్లీలోనూ, ఇటు పార్లమెంట్‌లోనూ మీ సమస్యలు వినిపించే అవకాశం దక్కుతుంది’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ‘‘టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్‌కు మూడో సారి రేపల్లె నుంచి అవకాశం ఇవ్వొద్దని కోరుతున్నా. అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండరు. సత్యప్రసాద్ హైదరాబాద్‌లో కూర్చుని పేకాట ఆడుకుంటాడు. అలాంటి వ్యక్తిని కాకుండా నిత్యం మీతోనే ఉండే ఈవూరు గణేష్‌ను గెలిపించుకోవాలని కోరుతున్నాను’’ అని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ, లోక్‌సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలకు చెందిన వారికి సీఎం జగన్ అధికప్రాధాన్యత ఇచ్చారు. అణగారిన వర్గాలకు సరైన ప్రధాన్యం కల్పించాలనేదే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. రిజర్వేషన్ల శాతానికి మించి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. చంద్రబాబులాగా మనం నటించడం లేదు. వాస్తవాలకు దగ్గరగానే మనం నడుచుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే సామాజిక సమతుల్యత పాటిస్తాం. రాబోయే రెండు, మూడు రోజుల్లో టీడీపీ బీజేపీతో జతకట్టడానికి తహతహలాడుతుంది. వైఎస్సార్సీపీ అలా చేయదు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఒంటరిగానే పోటీ చేశాం. భవిష్యత్తులోనూ ఒంటరిగానే పోటీచేస్తాం. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం కోసమే కొన్ని అంశాల్లో మనం మద్దతిచ్చాం.సీఎం జగన్‌ని బలోపేతం చేసి మరింత గొప్ప విజయాన్ని అందించాలని కోరుతున్నాను’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
విజయవాడ టీడీపీకి మరో బిగ్ షాక్..
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్ తగిలింది. చంద్రబాబు విధానాలు నచ్చకపోవడంతో వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ నేత, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణ వైఎస్సార్సీపీలోకి చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, విజయవాడ ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల సీఎం జగన్ సమక్షంలో వారు వైఎస్సార్సీపీలో చేరారు. తిరువూరుకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ కూడా కేశినేని బాటలోనే సాగారు. తాజాగా విజయవాడకే చెందిన మరో సీనియర్ నేత వెంకట రమణ రావు టీడీపీని వీడి.. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరారు. -
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరిన టీడీపీ, జనసేన కార్యకర్తలు
అత్తిలి(పశ్చిమగోదావరి): వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని, వారు వైఎస్సార్సీపీలో చేరుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో మంగళవారం చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్ర కార్యక్రమంలో మంత్రి సమక్షంలో జనసేన, టీడీపీలకు చెందిన 150 మంది వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి మంత్రి కారుమూరి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయానికి కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్దరాతి భరణీ ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, సర్పంచ్ గంటా విజేత నాగరాజు, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మహ్మద్ అబీబుద్దీన్, వైస్ ఎంపీపీలు సుంకర నాగేశ్వరరావు, దారం శిరీష, అత్తిలి టౌన్ అధ్యక్షుడు పోలినాటి చంద్రరావు, ఉపసర్పంచ్ మద్దాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: జన బలమే గీటురాయి.. -
YSRCPలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు
-
సర్వేపల్లిలో టీడీపీకి షాక్
సాక్షి, నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీని వీడి 50 కుటుంబాలు.. వైఎస్సార్సీపీలోకి చేరాయి. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, సర్వేపల్లి నియోజవర్గంలో టీడీపీ భూ స్థాపితం అయిందన్నారు. సర్వేపల్లి నియోజవర్గంలో టీడీపీ తరపున గట్టి అభ్యర్థిని నిలబెట్టేందుకు చంద్రబాబు, నారా లోకేష్ టార్చిలైట్ వేసుకొని వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి: పవన్.. చంద్రబాబు, లోకేష్ ఆ మాట చెప్పగలరా? -
టీడీపీ కంచుకోటలో జేసీ బ్రదర్స్‌కు గట్టి షాక్
పెద్దపప్పూరు(అనంతపురం జిల్లా): టీడీపీ కంచుకోట నరసాపురంలో జేసీ బ్రదర్స్ (దివాకర్‌రెడ్డి– ప్రభాకర్‌రెడ్డి)కు గట్టి షాక్ తగిలింది. వారి ప్రధాన అనుచరుడైన రామాంజులరెడ్డి, ఆయన వర్గీయులు దాదాపు 160 కుటుంబాల వారు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. యాడికి మండలం రాయలచెరువుకు చెందిన రమణారెడ్డి నేతృత్వంలో వీరంతా మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కండువా కప్పి అందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో పార్టీ మారడం టీడీపీ కంచుకోటకు బీటలు బారినట్లయ్యింది. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు వర్తింపజేస్తూ సీఎం జగన్ పాలన సాగిస్తుండటంతో ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందన్నారు. టీడీపీ కోసం అహర్నిశలు శ్రమించినా గుర్తింపు లభించకపోవడం, వర్గ కక్షలు పెంచి పోషించే జేసీ సోదరుల వైఖరి నచ్చకపోవడంతో 160 కుటుంబాల వారు పార్టీ వీడారన్నారు. వైఎస్సార్సీపీలో చేరిన వారందరికీ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా.. అండగా ఉండి ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ రాష్ట్రకౌన్సిల్ సభ్యుడు వేమనాథరెడ్డి, ఎంపీపీ రామ్మూర్తిరెడ్డి, వైస్ ఎంపీపీ రామిరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు హాజీవలి, మండల యూత్ కన్వీనర్ కమలాకర్‌రెడ్డి, పార్లమెంటు జనరల్ సెక్రటరీ రవిప్రసాద్‌రెడ్డి, సీనియర్ నాయకులు చిక్కేపల్లి రామేశ్వర్‌రెడ్డి, ముచ్చుకోట అమర్నాథరెడ్డి, నరసాపురం రామచంద్ర (కాశీ), ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. చదవండి: చింతకాయల విజయ్‌కు షాకిచ్చిన చంద్రబాబు -
మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. గొల్లపూడిలో టీడీపీ కోట బీటలు వారుతుంది. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. సీఎం పోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం సమక్షంలో వైఎస్సార్సీపీలోకి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి రామ్మోహనరావు చేరారు. టీడీపీ కార్యకర్తలు, మండలస్థాయి నేతలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి సీఎం పోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేరుగ నాగార్జున, ఎంపీ నందిగామ సురేష్‌లు పార్డీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే వైఎస్సార్సీపీలోకి ఆరుగురు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు, జడ్పీటీసీ అభ్యర్థి చేరారు. తాజాగా ఉమా అనుచరుడు, టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కోమటి రామ్మోహనరావు వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వైఎస్సార్సీపీలోకి టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వరుస చేరికలతో గొల్లపూడిలో టీడీపీ జవసత్వాలు కోల్పోతుంది. చదవండి: నమ్మించి నట్టేట ముంచారు.. టీడీపీ ఎమ్మెల్యేపై గుస్సా ఏపీ: బడ్జెట్ ఆర్డినెన్స్‌ను ఆమోదించిన గవర్నర్ -
ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ..
సంతమాగులూరు: మండలంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గత కొన్నేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు అనుచరుడిగా ఉన్న మండలంలోని వెల్లలచెరువు గ్రామానికి చెందిన టీడీపీ నేత, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చింతా రామారావు సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. అతని వర్గానికి చెందిన సుమారు 400 కుటుంబాలతో కలిసి విజయవాడలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య సమక్షంలో వైఎస్సార్ సీపీ కండువా వేయించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు రామారావు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు అన్ని వర్గాల ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకులు సైతం ఆకర్షితులై వైఎస్సార్ సీపీలో చేరడం అభినందనీయమని అన్నారు. అనంతరం చింతా రామారావు తన వర్గీయులతో కలిసి బాచిన కృష్ణచైతన్య, గరటయ్యలను పూలమాలలతో సన్మానించారు. రామారావు వెంట మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బొల్లినేని రామకృష్ణ, ఊట్ల నాగేశ్వరరావు, చింతా శ్రీధర్, సూరే రామ్మోహనరావు, పమిడి కోటేశ్వరరావు, బొడ్డుపల్లి మల్లేశ్వరి, రాష్ట్ర బీసీ నాయకులు బల్లిపల్లి కొండలు, లక్ష్మారెడ్డి కోటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
విశాఖ మన్యంలో టీడీపీ అడ్రస్ గల్లంతు
తప్పు ఒకరిది.. శిక్ష మరొకరిది... ఇప్పుడు విశాఖ మన్యంలో తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్న మాట. ఎన్టీ రామారావు కాలంలో టీడీపీకి కంచుకోట లాంటి విశాఖ మన్యంలో ఇప్పుడు వెతికినా టీడీపీ అడ్రస్ కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఇదంతా ఇప్పుడే అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తప్పుకు శిక్ష గా తెలుగు తమ్ముళ్లు మదనపడుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో పాడేరు అరకు రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కాలంలో మంచి కంచుకోటగా కొనసాగేది. సినీ నటుడిగా ఎన్టీరామారావు అభిమానించిన గిరిజనులు ఆయనకు పట్టం కట్టారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నిత్యం గిరిజన ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడానికి ప్రయత్నించారు. దీంతో మంచి నాయకురాలిగా కొనసాగిన మత్సరాశ మణికుమారీ లాంటి నాయకులు కూడా తిరిగి గెలవలేకపోయారు. ముఖ్య విశాఖ మన్యంలోని బాక్సైట్ తవ్వకాలకు...గిరిజనుల సానుభూతి ఓట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆశించింది. అవన్నీ గమనించిన జనం వైఎస్సార్సీపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ను గెలిపించగా ఆమెను కూడా తమ వైపు లాగి అక్రమాల కొనసాగించడానికి ప్రయత్నించారు. చివరికి ఆమె కూడా రాజకీయ పతనమైంది. (కేసుల నుంచి రక్షణ కోసమే రాష్ట్రపతి వద్దకు..) ఆ తర్వాత అరకు ఎమ్మెల్యే గా కిడారి సర్వేశ్వరరావు పాడేరు ఎమ్మెల్యే గా గిడ్డి ఈశ్వరి గెలుపొందగా, వారిద్దరినీ కూడా టీడీపీ వైపు లాగి బాక్సైట్ తవ్వకాలు జరిపాలని అనుకున్నారు. కానీ జనం ఎదురు తిరగడంతో తోక ముడిచారు. ఆ తర్వాత టీడీపీ వారసులుగా ఎన్నికల బరిలో దిగిన నాయకుల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఇదంతా చంద్రబాబు నాయుడు చేసిన తప్పులకు తమకు శాపంగా మారిందని తెలుగుదేశం నాయకులు మన్యంలో అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే టీడీపీలో ఉంటే ఇంకా మనుగడ లేదని నిర్ణయించుకున్న గిరిజనులు ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినప్పటికీ వైఎస్సార్సీపీలోకి క్యూ కడుతున్నారు. తాజాగా అనంతగిరి మండలంలో చెట్టి ఫాల్గుణ ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన కొన్ని కుటుంబాలు.. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సమక్షంలో కొయ్యూరు ప్రాంతానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి చేరారు. ఇదంతా చంద్రబాబు నాయుడు తప్పిదాలు ఒక ఎత్తయితే ఏడాదికాలంగా సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు టీడీపీ అడ్రస్‌ను గల్లంతు చేశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
విశాఖపట్నంలో టీడీపీకి మరో షాక్
సాక్షి, విశాఖపట్నం: పలు పార్టీల నుంచి వైఎస్సార్సీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన మెచ్చి వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా భారీసంఖ్యలో వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారు. స్థానిక ఎన్నికల ముందు ఈ చేరికలు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తాజాగా విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, మంత్రి కన్నబాబు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సమక్షంలో టీడీపీకి చెందిన పలువురు నేతలు వైఎస్సార్సీపీలోకి చేరారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి, మాజీ కార్పొరేటర్ పిఎల్‌ఎస్‌ఎన్ ప్రసాద్, టీఎస్ఎన్ మూర్తి, రజక సంఘం నార్త్ అధ్యక్షుడు సత్యనారాయణ పార్టీలోకి చేరారు. వారికి ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. (వలసలతో టీడీపీ కుదేలు..) ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌తో ఉత్తరాంధ్ర అభివృద్ధి జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే విజయం అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌తో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని తెలిపారు. విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. విశాఖ నుంచి భోగాపురం వరకు మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పురుషోత్తమపట్నం నుంచి విశాఖకు తాగునీటి కోసం పైప్‌లైన్ వేస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఆదర్శ పాలన చేస్తున్నారు: మంత్రి కన్నబాబు సీఎం వైఎస్ జగన్ ఆదర్శ పాలన అందిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సీఎం జగన్ బీసీలకు వెన్నుముకగా ఉన్నారని తెలిపారు. ఏలూరు డిక్లరేషన్‌ను అమలు చేసి చూపించారని కన్నబాబు పేర్కొన్నారు. -
వలసలతో టీడీపీ కుదేలు..
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. అబ్దుల్ కలాం వంటి వారికి సైతం సలహాలు ఇచ్చానంటూ గొప్పలు.. అంతర్జాతీయ స్థాయి రాజధాని పేరుతో సింగపూర్ గ్రాఫిక్స్.. ఇవేవీ చంద్రబాబును కాపాడలేకపోయాయి. అంతులేని అవినీతితోపాటు ఐదేళ్ల పాటు నరకం చూపించడంతో ప్రజలు అసహ్యించుకున్నారు. 9 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఓటర్లు దూరమైతే.. ఇప్పుడు స్థానిక ఎన్నికల సమయానికి నాయకులు సైతం పార్టీని వీడే దుస్థితి దాపురించింది. పోటీకి నిలబెట్టడానికి ఆపసోపాలు పడే పరిస్థితి నెలకొంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రజావ్యతిరేక విధానాలతో టీడీపీ ఖాళీ అయిపోతోంది. ఆ పార్టీ నేతలు వైఎస్సార్సీపీలోకి వలసపోతున్నారు. ఊహకందని విధంగా వందలాది మంది మాజీలు టీడీపీని విడిచిపెట్టేస్తున్నారు. పూర్వ ఎమ్మెల్యే, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, పీఏసీఎస్ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నీటి సంఘం అధ్యక్షులు... ఇలా ఎందరెందరో వైఎస్సార్సీపీలోకి క్యూ కడుతున్నారు. ఆ పార్టీలో చేరుతున్న వారిని లెక్క కట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో టీడీపీ శ్రేణులు డీలాపడిపోయాయి. ఎన్నికలకు ముందే చేతులెత్తేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు, ఎచ్చెర్ల మాజీ ఎంపీపీ మీసాల లక్ష్మి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు దూబ ధర్మారావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జి.రామారావు, పొందూరు మాజీ జెడ్పీటీసీ లొలుగు శ్రీరాములునాయుడు, సారవకోట మాజీ జెడ్పీటీసీ జగన్నాథం దొర, ఇచ్ఛాపురం మాజీ జెడ్పీటీసీ డక్కత నూకయ్యరెడ్డి, లావేరు మాజీ వైస్ ఎంపీపీ మేరం సోమిబాబు, సంతకవిటి మాజీ వైస్ ఎంపీపీ గండ్రేటి కేసరి, ఎచ్చెర్ల పీఏసీఎస్ అధ్యక్షుడు పి.సాయిరాం, పలాస టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్‌ఖాన్, పలాస నియోజకవర్గ టీడీపీ నేత వంకా నాగేశ్వరరావు, పలాస 12వ వార్డు మాజీ కౌన్సిలర్ బళ్ల రేవతి, పాలకొండ మాజీ కౌన్సిలర్లు బాసూరు కాంతారావు... ఇలా చెప్పుకుంటూపోతే వందల సంఖ్యలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లైతే లెక్క పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా వేలాదిమందితో కలిసి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు కొనసాగుతున్న వలసల ప్రవాహం.. సుదీర్ఘ కాలంగా టీడీపీలో ఉన్న వారు సైతం ఆ పార్టీని విడిచిపెట్టేస్తున్నారు. ఎన్నడూ లేనివిధంగా అధినేత చంద్రబాబు నిర్ణయాలు తీసుకోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు ఛీత్కరించుకున్న తర్వాత ఇంకా కొనసాగడం అనవసరమని భావిస్తున్నారు. ప్రతి రోజూ ప్రతి గ్రామంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి పార్టీ మారుతున్న నాయకుల సందడి కనిపిస్తోంది. ఎన్నికల నాటికి ఆ పారీ్టలో ఎందరు మిగులుతారో చెప్పలేని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అందుకనే నామినేషన్ల ఉపసంహరణ తేదీ చివరి వరకు బరిలో ఉన్న అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వడానికి ఆ పార్టీ అగ్రనేతలు భయపడుతున్నారు. ఈ రోజు దగ్గరకొచ్చిన నాయకుడు రేపు కని్పంచకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్ లేని పారీ్టలో కాలం వెళ్లదీయడం కన్న సంక్షేమ, అభివృద్ధి, చిత్తశుద్ధితో ముందుకెళ్తున్న ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం మంచిదని, ఆ పారీ్టకి మద్దతు పలకడం సరైనదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం కావడమే ఈ పరిణామానికి కారణం. టీడీపీని ప్రభావితం చేస్తున్న అనేక అంశాలు టీడీపీ నేతలను అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్నంతవరకు జన్మభూమి కమిటీ సభ్యుల అరాచకాలు, ఆగడాలు ఇంకా వారి కళ్లల్లో మెదులుతున్నాయి. ప్రజల్లో మొదట వ్యతిరేకత రావడానికి జన్మభూమి కమిటీలే కారణమని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఇక నీరు చెట్టు నిధులు, ఉపాధి హామీ నిధులు, ఇసుక, సీసీ రోడ్ల నిధులు... ఇలా నిధులున్న ప్రతి పథకాన్ని కళ్ల ముందే పార్టీ నేతలు మింగేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని అంతర్మథనం చెందుతున్నారు. ఇక, తిత్లీ తుఫాన్ పరిహారంలో అక్రమాలు, ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారంలో విఫలం చెందడం, పూర్తిగా నిర్లక్ష్యం వహించడం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు సరికదా కాసుల కోసం అంచనాలు పెంచుకుని పోవడం, రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణ సాయం... గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలేవీ అమలుకు నోచుకోకపోవడం వలన ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడిందని.... ఇప్పట్లో ప్రజలు మరిచిపోయేలా లేరనే అభిప్రాయంతో అధిక సంఖ్యలో పార్టీ మారిపోతున్నారు. వాటికి తోడు ప్రస్తుతం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజామోదయోగ్యమైన నిర్ణయాలు, బీసీలకు కలి్పస్తున్న ప్రాధాన్యత, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ ప్రభుత్వం చేస్తున్న మేలు, చేనేత, మత్స్యకారులకు అందిస్తున్న చేయూత ఇలా ప్రతి ఒక్కటీ నేరుగా లబి్ధదారుల వద్దకే రావడం, వలంటీర్ల ద్వారా అందిస్తుండటంతో కరుడు గట్టిన టీడీపీ శ్రేణులు సైతం వైఎస్సార్సీపీకి ఆకర్షితులవుతున్నారు. పోటీకి సైతం వెనుకంజ నేతల ఒత్తిళ్లతో కొంతమంది నామినేషన్లు వేసినప్పటికీ క్షేత్రస్థాయిలో కన్పిస్తున్న ప్రజా వ్యతిరేకతతో ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగులుతుందని భయపడుతున్నారు. అందుకనే కొందరు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని చూస్తున్నారు. శనివారం నాటికి ఉపసంహరణలపై క్లారిటీ రానుంది. దాంతో బరిలో ఉన్నదెవరో? విరమించుకున్నదెవరో తేలిపోనుంది. చెప్పాలంటే ఎన్నికలకు ముందే ఆ పార్టీ శ్రేణులు డీలాపడిపోయి చేతులెత్తేస్తున్న పరిస్థితులు కన్పిస్తున్నాయి. -
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ మంత్రి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన మెచ్చి వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా భారీసంఖ్యలో వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారు. స్థానిక ఎన్నికల ముందు ఈ చేరికలు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తాజాగా విశాఖపట్నం, గుంటూరు, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో మంగళవారం అధిక సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేస్తామని వారు తెలిపారు. సాక్షి, విశాఖపట్నం: రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు సమక్షంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఆయన కుమార్తె డాక్టర్ దర్శిని, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, టీడీపీ నాయకులు గుడ్ల సత్యారెడ్డి, విజయసాయి, వ్యాపారవేత్త చిక్కాల రవి నాయుడు, పి.ఉషశ్రీ, జనసేన సీనియర్ నాయకులు పివి సురేష్, కొణతాల సుధ తదితరులు వైఎస్సార్సీపీలోకి చేరారు. వారికి విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. (వైఎస్సార్సీపీలోకి డొక్కా, రెహమాన్) కర్నూలు జిల్లా: ఉయ్యాలవాడ మండల కేంద్రంలో టీడీపీ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అధర్వంలో 100 కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి చేరాయి. వారికి గంగుల ప్రభాకర్ రెడ్డి, బిజేంద్రారెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కోవెలకుంట్ల మండలం బిజినవేముల మాజీ సర్పంచ్ గడ్డం భక్త ప్రహ్లాదరెడ్డి, గడ్డం శంకర్‌రెడ్డిలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భీంరెడ్డి ప్రతాప్, సుధాకర్‌రెడ్డి, హుస్సేనయ్య పాల్గొన్నారు. పశ్చిమగోదావరి: ఏలూరు మండలంలో నాలుగు కొల్లేరు గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలోకి చేరారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సమక్షంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన 500 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. ఉంగరాల రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాసంలో పార్టీలో చేరారు. వారికి ప్రసాదరాజు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు: టీడీపీ నేత, మాజీ మున్సిపల్ చైర్మన్ భవనాసి యల్లారావు సహా మాజీ కౌన్సిలర్లు, అనుచరులు వైఎస్సార్సీపీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కారణంగా పార్టీలోకి చేరుతున్నామని వారు తెలిపారు. (టీడీపీ నేతల వెన్నులో వణుకు) -
టీడీపీకి షాక్.. వైఎస్సార్సీపీలో చేరికలు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ రోజురోజుకూ బలోపేతమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమపాలన మెచ్చి వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారు. స్థానిక ఎన్నికల ముందు ఈ చేరికలు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా పరవాడ మండల పరిధిలో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలోకి చేరారు. ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో మహిళలు,మత్స్యకారులు పార్టీలోకి చేరారు. వారికి అదీప్‌రాజ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, సిఇసి సభ్యుల శ్రీను, చుక్క రామునాయుడు, రాజు, ఇళ్ల ప్రసాద్, దాడి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. (బీసీలకు సాధికారత) రాజంపేట: వైఎస్సార్ జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. నందలూరు మండలం నల్లతిమ్మాయిపల్లికి చెందిన టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీలోకి చేరారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో 100 కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి చేరాయి. వారికి మేడా వెంకటమల్లికార్జున రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన, కాంగ్రెస్ నుంచి కూడా.. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి వందలాది మంది నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరినీ ఆయన సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. -
వైఎస్సార్సీపీలోకి భారీగా వలసలు
సీతమ్మధార(విశాఖ ఉత్తర): జీవీఎంసీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రతిపక్ష పార్టీల నేతలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీల నుంచి అధిక సంఖ్యలో నాయకులు వైఎస్సార్సీపీలోకి వలస బాట పడుతున్నారు. 38, 39 వార్డులకు చెందిన జనసేన, టీడీపీ నాయకులు అల్లు శంకరరావు, అల్లు సత్యశ్రీ, బాపునాయుడు, చిరికి వెంకటరావు, లెక్కల ప్రకాశమ్మతో పాటు 500 మంది ఆదివారం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్సీపీలో నూతనోత్సాహం నెలకొంది. ముఖ్యఅతిథులుగా హాజరైన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ వారికి పార్టీ కండువా కప్పి ఆహా్వనించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలన వికేంద్రీకరణకు ప్రజలు మద్దతు పలుకుతుంటే, చంద్రబాబు అర్థపర్థంలేని రాద్ధాంతం చేస్తున్నారని మండి పడ్డారు. మూడు రాజధానులతో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరగడం చంద్రబాబుకు ఇష్టం లేక రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేకే రాజు మాట్లాడుతూ ప్రజలను తన మాటల గారడీతో బురిడీ కొట్టించాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. పాలన రాజధానిగా విశాఖను ఎంపిక చేయడంతో ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. వంశీకృష్ణ మాట్లాడుతూ అమరావతి విషయంలో పలు కమిటీలు ఇచ్చిన నివేదికలను బుట్టదాఖలు చేసి గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు అక్షరాలా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమా సెట్టింగ్‌లతో రాష్ట్ర ప్రజలకు భ్రమరావతి చూపించారన్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రజలు గత ఎన్నికలలో టీడీపీని ఘోరంగా ఓడించి బుద్ధి చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చొక్కాకుల వెంకటరావు, నాయకులు కిరణ్‌రాజు, ఆళ్ల శివగణేష్ బొడ్డు ఎర్రునాయుడు, ఎన్.రవికుమార్, పరదేశి నాయుడు, చంద్రమౌళి, చొక్కాకుల రామకృష్ణ, ఆదిరెడ్డి అప్పారావు, బి.నాయుడు, సురేష్ కోటకుల కుమార్, బగాది విజయ్, స్వరూప్, రామారావు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు. (యాంకర్స్‌తో టీడీపీ నేత డాన్స్.. వీడియో వైరల్) -
పిఠాపురంలో జనసేన, టీడీపీలకు ఎదురు దెబ్బ
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జనసేన, టీడీపీలకు ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల విధానాలు నచ్చకపోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి క్యూ కడుతున్నారు. జనసేన పార్టీ నేతలు కురమళ్ల రాంబాబు, సురవరపు సురేష్, టీడీపీ మహిళా నాయకురాలు వర్ధినీడి సుజాత, నాయకులు సింగంపల్లి బాబురావు, తడాల సత్యనారాయణతో పాటు 500 మంది వైఎస్సార్సీపీలోకి చేరారు. వారికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్ ఇప్పటికీ చంద్రబాబు పార్టనరేనని.. ఐటీ దాడులపై పవన్‌కల్యాణ్ నోరు విప్పకపోవడానికి కారణం అదేనని ఆయన విమర్శించారు. చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పవన్‌కల్యాణ్ అమరావతి రైతులను కలిశారని దొరబాబు విమర్శించారు. పవన్ విధి విధానాలు నచ్చకే జనసేన నుంచి ఆ పార్టీ నేతలు వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారని తెలిపారు. ఐటీ దాడులపై ఇంత వరుకు చంద్రబాబు నోరు మెదపక పోవడానికి కారణం ఏమిటని..నోరు విప్పితే ఆయన అవినీతి బండారం బయటపడుతుందని భయమా అని అన్నారు. అవినీతి బాగోతంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ చేస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమన్నారు. చంద్రబాబు,ఆయన కుమారుడు లోకేష్ చేసిన అవినీతిపై లోతుగా సీబీఐ,ఈడీలతో దర్యాప్తు చేయించాలని కేంద్రాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్యే పెండెం దొరబాబు కోరారు. -
వైఎస్సార్సీపీలో చేరికలు
సాక్షి, విశాఖపట్నం/సీతమ్మధార(విశాఖ ఉత్తర): వైఎస్సార్సీపీలో శనివారం పలువురు నాయకులు చేరారు. తూర్పు నియోజకవర్గానికి చెందిన సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మార్కండేయులు చేరారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ తూర్పు సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, విశాఖ పార్లమెంట్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బి.కాంతారావు ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నా రు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్, మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయుకుడు పి.ఎల్.ఎన్.పట్నాయక్ వైఎస్సార్సీపీలో చేరారు. నార్త్ ఎక్స్‌టెన్షన్‌లోని పార్టీ కార్యాలయంలో ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. కార్యక్రమంలో పార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు కొయ్య ప్రసాద్‌రెడ్డి, జాన్‌వెస్లీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ, సీనియర్ నాయకుడు సుధాకర్, కుంభా రవిబాబు, అప్పలరాజు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి భారీ చేరికలు
జిల్లాకు చెందిన ప్రముఖ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో సార్వత్రిక ఎన్నికల తర్వాత కొన ఊపిరితో ఉన్న టీడీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు తనయుడు, కృషి ఆస్పత్రి చైర్మన్, డెయిరీ ట్రస్ట్ సీఈవో ఆడారి ఆనంద్, డెయిరీ డైరెక్టర్, యలమంచిలి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పిళ్లా రమాకుమారి సహా పలువురు నాయకులు అమరావతిలో వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. సాక్షి, అనకాపల్లి: విశాఖ జిల్లాకు చెందిన ప్రముఖ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో సార్వత్రిక ఎన్నికల తర్వాత కొన ఊపిరితో ఉన్న టీడీపీకి ఊహించని షాక్ తగిలినట్లైంది. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు తనయుడు, కృషి ఆస్పత్రి చైర్మన్, డెయిరీ ట్రస్ట్ సీఈవో ఆడారి ఆనంద్, డెయిరీ డైరెక్టర్, యలమంచిలి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పిళ్లా రమాకుమారితో సహా పలువురు నాయకులు అమరావతిలో వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. ఆనంద్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దశాబ్దాల కాలంగా టీడీపీలో కొనసాగిన ఆనంద్ కుటుంబసభ్యులు, డెయిరీ డైరెక్టర్లు వైఎస్సార్సీపీలో చేరారు. వీరితోపాటు విశాఖ డెయిరీ డైరెక్టర్లు మలసాల రమణరావు (కశింకోట మండలం), గేదెల సత్యనారాయణ (బుచ్చెయ్యపేట మండలం), దాడి గంగరాజు (చోడవరం), శీరంరెడ్డి సూర్యనారాయణ (చీడికాడ మండలం), సుందరపు గంగాధర్ (కె.కోటపాడు), శరగడం శంకరరావు (పెందుర్తి), రెడ్డి రామకష్ణ (పాయకరావుపేట), చిటికల రాజకుమారి(నర్సీపట్నం), గౌరీశంకర్ (యలమంచిలి), కోళ్ల కాటమయ్య(ఎస్.కోట), ఆరంగి రమణబాబు (అచ్చెర్ల), శీరంరెడ్డి సూర్యనారాయణ (నర్సీపట్నం) తదితర డైరెక్టర్లు వైఎస్సార్సీపీలో చేరినవారిలో ఉన్నారు. రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, అదీప్‌రాజు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు శరగడం చినఅప్పలనాయుడు, మజ్జి శ్రీనివాస్ (చిన్న శ్రీను), జి.వి.తదితరులు పాల్గొన్నారు. యలమంచిలి నుంచి.. : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన వారిలో యలమంచిలికి చెందిన జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆడారి శ్రీధర్, ఊటకూటి రమేష్, గొంతిన హరీష్, నగిరెడ్డి కాసుబాబు ఉన్నారు. చోడవరం నుంచి..: గోవాడ చక్కెర కర్మాగారం మాజీ చైర్మన్ దొండా కన్నబాబు, మాజీ ఎంపీపీ పినపోలు వెంకటేశ్వరరావు, బుచ్చెయ్యపేట మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దాడి సూర్యనాగేశ్వరరావు, సూరిశెట్టి రామ సత్యనారాయణవైఎస్ఆర్సీపీలో చేరారు. ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ బొడ్డేడ చేరిక.. ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ సొంత గూటికి తిరిగి చేరారు. బొడ్డేడ ప్రసాద్‌తోపాటు వైఎస్సార్సీపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి అప్పారావు కూడా తిరిగి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీకి మరింత బలం: మంత్రి అవంతి విశాఖ డెయిరీ డైరెక్టర్లంతా వైఎస్సార్సీపీలో చేరడంతో జిల్లాలో పార్టీ మరింత బలం పుంజుకుంటుందని పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో విశాఖ డెయిరీ డైరెక్టర్లు వైఎస్సార్సీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డెయిరీ పరిధిలోని రైతులకు అండగా ఉండి న్యాయం చేస్తానని జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసాతో డెయిరీ డైరెక్టర్లంతా వైఎస్సార్సీపీలో చేరారన్నారు. జిల్లాలో పార్టీ మరింత బలోపేతమైందని, రానున్న కాలంలో మరికొంతమంది ముఖ్యనేతలు వైఎస్సార్సీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతు పక్షపాతి జగన్: ఆడారి ఆనంద్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతుల పట్ల చూపిస్తున్న ఆదరణ, ప్రేమ చూసి తాము వైఎస్సార్సీపీలో చేరామని కృషి ఆస్పత్రి చైర్మన్ ఆడారి ఆనంద్ తెలిపారు. జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన అనంతరం ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. విశాఖ డెయిరీ సంక్షేమం కోసం తాము వైఎస్సార్సీపీలో చేరామన్నారు. మొదటి నుంచి ముఖ్యమంత్రి రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయన నాయకత్వంలో రైతులకు న్యాయం జరుగుతుందని భావించి తాము వైఎస్సార్సీపీలో చేరామన్నారు. విశాఖ డెయిరీ పరిధిలోని మూడు జిల్లాలకు చెందిన రెండున్నర లక్షల కుటుంబాలకు జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారని భరోసా ఇచ్చారని ఆనంద్ చెప్పారు. డెయిరీ డైరెక్టర్లందరూ సంపూర్ణంగా వైఎస్సార్సీపీలో చేరడం వెనుక రైతులకు న్యాయం చేయాలనే ధృక్పథం ఉందన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రంలోని రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు. -
అనంతపురం జిల్లాలో టీడీపీకి భారీ షాక్
-
టీడీపీలో ఎస్సీలకు గుర్తింపు లేదు
- మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరిన అధికారపార్టీ శ్రేణులు - ఇది ప్రజావ్యతిరేక ప్రభుత్వమన్న ఎమ్మెల్సీ వెన్నపూస అనంతపురం : ‘పదేళ్లుగా టీడీపీలో పని చేశాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అభివృద్ధికి ఎంతో కష్టపడ్డాం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలను విస్మరించారు. గుర్తింపు లేకుండా చేస్తున్నారు’ అని టీడీపీకి చెందిన పలువురు ఎస్సీలు వాపోయారు. వారంతా అనంతపురం 20వ డివిజన్‌కు చెందిన మల్లెలమీద నరసింహులు సమక్షంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం స్థానిక మిస్సమ్మ కాంపౌండ్‌లో పార్టీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి అధ్యక్షతన సభ ఏర్పాటు చేశారు.} - ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందన్నారు. 600 అపద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు కూడా రోజుకో అపద్దం చెబుతోందన్నారు. అన్ని వర్గాలనూ మోసం చేసిందని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు కార్యకర్తలంతా సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. - మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ సాధారణంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నవారు అధికార పార్టీలో చేరతారని, కానీ అధికారపార్టీ వాళ్లు ప్రతిపక్షంలో చేరుతున్నారంటే ప్రభుత్వ పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో సాగుతున్న దుష్టపాలనను అంతమొందించేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ సీఎం అయితే అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతుందన్నారు. - మల్లెలమీద నరసింహులు మాట్లాడుతూ పదేళ్లుగా టీడీపీలో పని చేసినా ఎలాంటి గుర్తింపూ లేదన్నారు. కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. కార్యకర్తలకు కనీస గౌరవం లేదని, ముఖ్యంగా ఎస్సీలకు తీరని అన్యాయం చేçస్తున్నారని ఆవేదన చెందారు. ఎస్సీలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టిస్తుంటే అడిగేవారే లేరని వాపోయారు. ఇవన్నీ జీర్ణించుకోలేక వైఎస్సార్సీపీలో చేరామన్నారు. - వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సరైన గుర్తింపు ఉంటుందన్నారు. అధికార పార్టీలో అన్యాయానికి గురైన వారు చాలామంది వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారని, తమ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు బి.ఎర్రిస్వామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యోగీశ్వర్‌రెడ్డి, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు షానూర్, రాష్ట్ర కార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, అధికార ప్రతినిధులు మిద్దె కుళ్లాయప్ప, పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి, కార్పొరేటర్లు మల్లికార్జున, బాలాంజనేయులు, పోతులయ్య, మాజీ కౌన్సిలర్ బలరామిరెడ్డి, 20వ డివిజన్ కన్వీనర్ బలరాం, విద్యార్థి విభాగం పరుశురాం, యువజన విభాగం మారుతీనాయుడు, ఎస్సీ సెల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ వెంటే నడుస్తాం
హిందూపురం అర్బన్ : ప్రజాపక్షాన నిలిచి నిరంతరం ప్రజల కోసం తపించి పోరాటాలు సాగిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో నడుస్తామని హిందూపురం మండలం కిరికెర గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు అన్నారు. హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ నాయకత్వంపై నమ్మకంతో ఆదివారం కిరికెర బీసీ కాలనీకి చెందిన టీ అంగడి హనుమంతప్ప, చాలుకూరి నారాయణప్ప, ఈ.నరసింహప్ప, మహేష్, ఆర్.నారాయణప్ప, ఎస్. జగదీష్, డ్రైవర్ మూర్తి, నరేష్‌తో పాటు మరో 10 మంది ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. వారికి నవీన్‌నిశ్చల్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈసందర్భంగా నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడం తథ్యమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నాగభూషణరెడ్డి, మండల కన్వీనర్ బసిరెడ్డి, బీసీ సెల్æరాము, చాంద్‌బాషా, నక్కలపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, పి.రంగప్ప, జి.గోపాల్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.