
మార్కండేయులుకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం/సీతమ్మధార(విశాఖ ఉత్తర): వైఎస్సార్‌సీపీలో శనివారం పలువురు నాయకులు చేరారు. తూర్పు నియోజకవర్గానికి చెందిన సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మార్కండేయులు చేరారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ తూర్పు సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, విశాఖ పార్లమెంట్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బి.కాంతారావు ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నా రు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.
కార్యక్రమంలో మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్, మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయుకుడు పి.ఎల్.ఎన్.పట్నాయక్ వైఎస్సార్‌సీపీలో చేరారు. నార్త్ ఎక్స్‌టెన్షన్‌లోని పార్టీ కార్యాలయంలో ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. కార్యక్రమంలో పార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు కొయ్య ప్రసాద్‌రెడ్డి, జాన్‌వెస్లీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ, సీనియర్ నాయకుడు సుధాకర్, కుంభా రవిబాబు, అప్పలరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment