సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. చంద్రబాబు పాలనలో ఏయూ వర్సిటీలో మళ్లీ ర్యాగింగ్ రక్కసి పురుడు పోసుకుంది.. అక్కడ దారుణం జరుగుతున్నా ప్రభుత్వం నిద్రపోతుందా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకుల సుపుత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తోందన్నారు.
ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘ఆంధ్ర యూనివర్శిటీలో కొంతకాలంగా లేని ర్యాగింగ్ రక్కసి మళ్లీ పురుడు పోసుకుని విద్యార్ధినిలు నేరుగా మీడియా ముందుకి రావడంతో బట్టబయలు అయ్యింది. హాస్టల్ రూమ్స్‌లో అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్ విద్యార్థినులపై దురుసుగా ప్రవర్తిస్తూ కొంతమంది సీనియర్లు ఇబ్బంది పెట్టి వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెట్టారు.
ఆంధ్రయూనివర్శిటీలో కొంతకాలంగా లేని ర్యాగింగ్ రక్కసి మళ్లీ పురుడు పోసుకుని విద్యార్ధినిలు నేరుగా మీడియా ముందుకి బట్టబయలు అయ్యింది. హాస్టల్ రూమ్స్ లో అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్ విద్యార్థినులపై దురుసుగా ప్రవర్తిస్తూ కొంతమంది సీనియర్లు ఇబ్బంది పెట్టి వీడియోలు తీసి…
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 8, 2024
దీనిపై స్పందించిన కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. మాకు డ్యాన్స్ రాదని చెబితే.. అబ్బాయిల దగ్గరకు వెళ్లి నేర్చుకుని రమ్మని సీనియర్లు ఇబ్బంది పెట్టారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 10 మంది విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్ చేసింది. బాధిత విద్యార్ధినిల తల్లిదండ్రుల మనోవేదన అర్థం చేసుకోండి. టీడీపీ నాయకుల సుపుత్రులు కూడా దీనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. టీడీపీ ప్రభుత్వం నిద్రపోతుందా? అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ సినీ పరిశ్రమ నుండి రాలేదా?: వైఎస్సార్‌సీపీ శ్యామల
Comments
Please login to add a commentAdd a comment