ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన మెచ్చి వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా భారీసంఖ్యలో వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారు. స్థానిక ఎన్నికల ముందు ఈ చేరికలు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తాజాగా విశాఖపట్నం, గుంటూరు, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో మంగళవారం అధిక సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం కృషి చేస్తామని వారు తెలిపారు.
సాక్షి, విశాఖపట్నం: రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు సమక్షంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఆయన కుమార్తె డాక్టర్ దర్శిని, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, టీడీపీ నాయకులు గుడ్ల సత్యారెడ్డి, విజయసాయి, వ్యాపారవేత్త చిక్కాల రవి నాయుడు, పి.ఉషశ్రీ, జనసేన సీనియర్ నాయకులు పివి సురేష్, కొణతాల సుధ తదితరులు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. వారికి విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. (వైఎస్సార్‌సీపీలోకి డొక్కా, రెహమాన్)
కర్నూలు జిల్లా: ఉయ్యాలవాడ మండల కేంద్రంలో టీడీపీ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అధర్వంలో 100 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలోకి చేరాయి. వారికి గంగుల ప్రభాకర్ రెడ్డి, బిజేంద్రారెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
కోవెలకుంట్ల మండలం బిజినవేముల మాజీ సర్పంచ్ గడ్డం భక్త ప్రహ్లాదరెడ్డి, గడ్డం శంకర్‌రెడ్డిలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భీంరెడ్డి ప్రతాప్, సుధాకర్‌రెడ్డి, హుస్సేనయ్య పాల్గొన్నారు.
పశ్చిమగోదావరి: ఏలూరు మండలంలో నాలుగు కొల్లేరు గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సమక్షంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన 500 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఉంగరాల రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాసంలో పార్టీలో చేరారు. వారికి ప్రసాదరాజు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
గుంటూరు: టీడీపీ నేత, మాజీ మున్సిపల్ చైర్మన్ భవనాసి యల్లారావు సహా మాజీ కౌన్సిలర్లు, అనుచరులు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కారణంగా పార్టీలోకి చేరుతున్నామని వారు తెలిపారు. (టీడీపీ నేతల వెన్నులో వణుకు)
Comments
Please login to add a commentAdd a comment