సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ రోజురోజుకూ బలోపేతమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమపాలన మెచ్చి వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారు. స్థానిక ఎన్నికల ముందు ఈ చేరికలు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా పరవాడ మండల పరిధిలో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో మహిళలు,మత్స్యకారులు పార్టీలోకి చేరారు. వారికి అదీప్‌రాజ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, సిఇసి సభ్యుల శ్రీను, చుక్క రామునాయుడు, రాజు, ఇళ్ల ప్రసాద్, దాడి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. (బీసీలకు సాధికారత)
రాజంపేట: వైఎస్సార్ జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. నందలూరు మండలం నల్లతిమ్మాయిపల్లికి చెందిన టీడీపీ వర్గీయులు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో 100 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలోకి చేరాయి. వారికి మేడా వెంకటమల్లికార్జున రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
జనసేన, కాంగ్రెస్ నుంచి కూడా..
కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి వందలాది మంది నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరినీ ఆయన సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment