
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్ తగిలింది. చంద్రబాబు విధానాలు నచ్చకపోవడంతో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ నేత, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణ వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, విజయవాడ ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు.
ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల సీఎం జగన్ సమక్షంలో వారు వైఎస్సార్‌సీపీలో చేరారు. తిరువూరుకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ కూడా కేశినేని బాటలోనే సాగారు. తాజాగా విజయవాడకే చెందిన మరో సీనియర్ నేత వెంకట రమణ రావు టీడీపీని వీడి.. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరారు.
Comments
Please login to add a commentAdd a comment