parawada
-
బతికున్నోళ్లనే చంపేశారు.. ఈ ప్రభుత్వానికి ఓ దండం..
-
పరవాడ తంతడి బీచ్‌లో ఇద్దరు యువకుల గల్లంతు
సాక్షి, అనకాపల్లి: పరవాడ తంతడి బీచ్‌లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయినవారు అనకాపల్లికి చెందిన కడలి లీలా ప్రసాద్, లక్ష్మీవర్మగా గుర్తించారు. వీరిలో లీలా ప్రసాద్ మృతదేహాం లభ్యంకాగా, లక్ష్మీవర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చదవండి: (400 కిలోమీటర్లు.. రూ.568 కోట్లు.. మూడు జిల్లాలను కలుపుతూ జాతీయ రహదారి) -
పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం
-
పరవాడ ఫార్మాసిటీ ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని లారస్ ల్యాబ్‌లో సోమవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగాగాయపడిన మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈ ప్రమాదంపై పరవాడ పోలీసులు తెలిపిన మేరకు.. లారస్ పరిశ్రమ యూనిట్–3లో మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాక్–6లో డ్రైమర్ రూమ్‌ను మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో ఖమ్మం జిల్లాకు చెందిన బి.రాంబాబు, గుంటూరు జిల్లాకు చెందిన రాజేష్‌బాబు, అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం చౌడువాడకు చెందిన రాపేటి రామకృష్ణ, చోడవరం మండలం పెన్నవోలు గ్రామానికి చెందిన మజ్జి వెంకటరావు, విజయనగరం జిల్లాకు నెల్లిమర్లకు చెందిన ఎడ్ల సతీష్ శుభ్రం చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఫ్లాష్‌ఫైర్ సంభవించింది. అగ్ని ప్రమాదం జరిగిన గది మొత్తం రబ్బరుతో నిండి ఉంది. నిప్పురవ్వలు పడి రబ్బరు నిల్వలు అంటుకోవడంతో గది అంతా మంటలు, దట్టమైన పొగతో నిండిపోయింది. గదిలో ఉన్న ఐదుగురు కారి్మకులు మంటల్లో చిక్కుకుపోయారు. వెంటనే పరిశ్రమకు చెందిన అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపుచేసి గాయపడినవారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మార్గంమధ్యలోనే బి.రాంబాబు (32), రాజేష్‌బాబు (36), రాపేటి రామకృష్ణ (32), మజ్జి వెంకటరావు (36) మృతిచెందారు. మృతదేహాలను కేజీహెచ్ మార్చురికీ తరలించారు. ఎడ్ల సతీష్ (36) నగరంలోని కిమ్స్ ఐకాన్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అగ్నిప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పరవాడ సీఐ పి.ఈశ్వరరావు, ఎస్ఐ తేజేశ్వరరావు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదస్థలాన్ని అనకాపల్లి ఎస్పీ గౌతమిశాలి సోమవారం రాత్రి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు చేపట్టాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం పరవాడలోని లారస్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమర్నాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను, ఇక్కడి పరిస్థితి ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి తెలియజేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కార్మికుడికి వైద్యసహాయం అందించాలని వైద్యాధికారులను, ప్రమాదానికి కారణాలు తెలుసుకోవాలని కలెక్టర్, ఎస్పీలను మంత్రి ఆదేశించారు. మృతులు వీరే.. బి.రాంబాబు (32) ఖమ్మం జిల్లా, రాజేష్‌బాబు (36) గుంటూరు జిల్లా, రాపేటి రామకృష్ణ (32) అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం చౌడువాడ, మజ్జి వెంకటరావు (36) చోడవరం మండలం పెన్నవోలు. -
విశాఖ గ్యాస్ లీక్ : పెళ్లైన రెండు నెలలకే
పెళ్లై రెండు నెలలైంది. ఇంతలోనే ఆషాఢం రావడంతో భార్యను పుట్టింటికి పంపారు. వారం రోజుల కిందట భార్య వద్దకు వెళ్లిన భర్త వారం రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పి తన విధులకు యథావిధిగా వెళ్లాడు. ఇంతలోనే తను పని చేస్తున్న విశాఖలోని పరవాడలోని సాయినార్ లైఫ్సైన్సెస్లో గ్యాస్‌లీక్‌తో సంభవించిన ప్రమాదంలో తనువు చాలించాడు. దీంతో ఇటు మృతుని కన్నవారింట, అటు అత్తవారింట విషాదం అలుముకొంది. పూసపాటిరేగ : ఆషాఢం కారణంగా కన్నవారి ఇంటి వద్ద ఉన్న భార్యకు వారం రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పి విధులకు వెళ్లిన భర్త గ్యాస్ లీక్ ఘటనలో మృత్యువాతపడ్డాడు. పెళ్లినాటి జ్ఞాపకాలు కూడా మరవక ముందే నవజంటపై దేవుడుకు కన్నుకుట్టిందా..! అంటూ మృతుడు స్వగ్రామం రెల్లివలసలో రోదనలు మిన్నంటాయి. రెండు నెలల క్రితమే వివాహమైన జంటలో భర్త మృతిని తట్టుకోలేని భార్య రోదనలు చూపరులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే... పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన మహంతి గౌరీశంకర్రావు (28) విశాఖ పరవాడలో సాయినార్ లైఫ్సైన్సెస్లో నాలుగేళ్లుగా కెమిస్ట్‌గా పని చేస్తున్నాడు. పరిశ్రమలో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ లీక్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. మృతి చెందిన వారిలో రెల్లివలసకు చెందిన మహంతి గౌరీశంకర్ వున్నారు.(విష వాయువు లీక్.. ఇద్దరు మృతి) రెల్లివలస నుంచి హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లిన వరకు తమ కుమారుడు ప్రమాదంలో మృతి చెందాడనే విషయం తెలియదని మృతుడు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబంలో అన్నయ్య, అక్క తరువాత జన్మించి చిన్నవాడైన గౌరీశంకర్‌పై కుటుంబం ఆధారపడి వుంది. చిన్న కుమారుడు గౌరీశంకర్ మృతిని తట్టుకోలేని తల్లిదండ్రులు రమణ, నాగరత్నం బోరున విలపించారు. కొడుకు ప్రయోజకుడు అయ్యాడని పుట్టెడు సంతోషంతో వున్న కుటుంబాన్ని అనాధ చేసావా.. అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్నారు. రెండు నెలలకే... రెల్లివలసకు చెందిన మహంతి గౌరీశంకర్రావుకు ఈ ఏడాది ఏప్రిల్ 8న శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మితో వివాహమైంది. ఈ నెల 21న ఆషాఢం కారణంగా పుట్టింటికి వెళ్లిన వెంకటలక్ష్మి వద్దకు గత బుధవారం గౌరీశంకర్ వెళ్లాడు. భార్యతో మూడు రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పి విధులకు వెళ్లిన నవ వరుడు గ్యాస్‌లీక్ ఘటనలో మృత్యువాత పడటంతో భార్య గొల్లుమంది. ఘటనతో మృతుడు అత్తవారి గ్రామం సంచాం, స్వగ్రామం రెల్లివలస గ్రామంలోను విషాదం నెలకొంది. గౌరీశంకర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామం తీసుకురావడానికి బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
'ఆయన శవరాజకీయాలు మానుకుంటే మంచిది'
సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరంలోని పరవాడలో సాయినార్ లైఫ్ సెన్సైస్ ఫార్మా కంపెనీలో మంగళవారం తెల్లవారుజామున విష వాయువు లీకైన సంగతి తెలిసిందే. కాగా గ్యాస్ లీకేజీ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ గాజవాక ఆర్ కె ఆసుపత్రికి చేరుకొని ప్రమాద ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.(విశాఖలో విషాదం.. మరో గ్యాస్ లీక్) అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఈ ఘటనపై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోతే నష్టపరిహారంగా 12 లక్షలు ఇచ్చి చేతలు దులుపుకోలేదా అని ప్రశ్నించారు. అప్పట్లో 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని మా వైఎస్సార్సీపీ తరపున డిమాండ్ చేస్తే పట్టించుకోకుండా ఇపుడు కోటి రూపాయిలు డిమాండ్ చేసే అర్హత వారికి ఎక్కడిదన్నారు. మీరు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉండి బాధితులకి నష్టపరిహారం ఎంత ఇప్పించారో గుర్తు లేదా అంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తీరును ప్రశ్నించారు. పెద్ద మనిషినని చెప్పుకునే మీకు మా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులేదన్నారు.ఇప్పటికైనా టీడీపీ నేతలు శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, ప్రభుత్వం కూడా స్పందించినట్లు పేర్కొన్నారు. ప్రమాద ఘటన తెలియగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారన్నారు.(విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం ఆరా) ముఖ్యమంత్రి ఆదేశాలతో ఫ్యాక్టరీని ప్రస్తుతం షట్ డౌన్ చేస్తున్నామని, ఈ ప్రమాదంపై కలెక్టర్ విచారణకి ఆదేశించారన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని, ఒకవేళ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం చేసినట్లు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మాది యాజమాన్యాలకి కొమ్ముకాసే ప్రభుత్వం కాదని...ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యమన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అనిపిస్తున్నట్లు ఎమ్మెల్యే అదీప్ రాజ్ తెలిపారు. -
విశాఖ పరవాడ ఫార్మాసిటీలో రసాయన వాయువు లీక్
-
విశాఖలో విషాదం.. మరో గ్యాస్ లీక్..
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన మరువకముందే విశాఖపట్నంలో మరో విషాదం చోటు చేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ కెమికల్స్ లో రియాక్టర్ నుంచి విష వాయువు లీకవడంతో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. మృతులను షిఫ్ట్ ఇంచార్జ్ నరేంద్ర, గౌరీశంకర్‌గా గుర్తించారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అస్వస్థతకు గురైన ఎల్వీ చంద్రశేఖర్, పి.ఆనంద్ బాబు, డి.జానకీ రామ్, ఎం.సూర్యనారాయణలను గాజువాకలోని ఆర్కే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలెక్టర్ విననయ్‌చంద్, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తుస్తున్నారు. ప్రమాద ఘటనపై కమిటీ.. హైడ్రోజన్ సల్ఫైడ్ అధిక మోతాదులో రియాక్టర్ వద్ద రావడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్.. నలుగురు అధికారులతో కమిటీని నియమించారు. పరవాడ ఫార్మా సిటీ ప్రమాద ఘటనపై కలెక్టర్‌తో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మట్లాడారు. ప్రమాద వివరాలను అడిగి తెలుకున్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. -
టీడీపీకి షాక్.. వైఎస్సార్సీపీలో చేరికలు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ రోజురోజుకూ బలోపేతమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమపాలన మెచ్చి వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారు. స్థానిక ఎన్నికల ముందు ఈ చేరికలు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా పరవాడ మండల పరిధిలో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలోకి చేరారు. ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో మహిళలు,మత్స్యకారులు పార్టీలోకి చేరారు. వారికి అదీప్‌రాజ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, సిఇసి సభ్యుల శ్రీను, చుక్క రామునాయుడు, రాజు, ఇళ్ల ప్రసాద్, దాడి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. (బీసీలకు సాధికారత) రాజంపేట: వైఎస్సార్ జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. నందలూరు మండలం నల్లతిమ్మాయిపల్లికి చెందిన టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీలోకి చేరారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో 100 కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి చేరాయి. వారికి మేడా వెంకటమల్లికార్జున రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన, కాంగ్రెస్ నుంచి కూడా.. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి వందలాది మంది నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరినీ ఆయన సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. -
ఊపిరి తీసిన విష వాయువులు
పరవాడ (పెందుర్తి): విష వాయువులు ఊపిరి తీసేశాయి... అప్పటి వరకూ తోటి వారితో కలిసి పనిచేస్తుండగా సంభవించిన దుర్ఘటనతో ఒకరు ప్రాణాలు కోల్పోగా... మరో ఇద్దరి పరి స్థితి విషమంగా ఉంది. జేఎన్ ఫార్మాసిటీలోని విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో జరిగిన ప్రమాదం ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ దుర్ఘటనకు సంబంధించి పరవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయ్శ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్ – 1లోని రియాక్టరు సమీపంలో కొత్త బ్యాచ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 7 గంటల సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న కారి్మకులు రసాయనాలను కలుపుతుండగా ఒక్కసారిగా విషవాయువులు వెలువడ్డాయి. దీంతో షిఫ్ట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న సబ్బవరం దరి మల్లునాయుడుపాలేనికి చెందిన పి.అప్పారావు (38), ఆపరేటర్లుగా పనిచేస్తున్న శ్రీకాకుళానికి చెందిన బి.చంద్రమోహన్ (34), విశాఖకు చెందిన సీహెచ్.శ్రీధర్ (38)లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరో ఆపరేటర్ బొబ్బిలి దరి చింతాడకు చెందిన సురేష్‌కుమార్ (32), హెల్పర్‌గా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన నవీన్ (32) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రెండు గంటల అనంతరం వారు స్పహ కోల్పోవడంతో విషయం తెలుసుకున్న యాజమాన్యం రాంకీ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారిలో చికిత్స పొందుతూ సీహెచ్.శ్రీధర్ గురువారం మధ్యాహ్నం ఆస్పత్రిలో మృతిచెందాడు. మృతునికి భార్య, తల్లి, చెల్లి ఉన్నారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మిగిలిన వారిని మెరుగైన చికిత్స కోసం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శ్రీధర్ మృతదేహన్ని చూపించకుండా కేజీహెచ్‌కు తరలించడంపై అతని భార్య, బంధువులు గాజువాకలోని ఆస్పత్రి వద్ద కొంతసేపు ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం విషయం తెలుసుకొన్న పరవాడ సీఐ రఘువీర్ విష్ణు, పరవాడ తహసీల్దార్ గంగాధర్ ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడి కారణాలు తెలుసుకున్నారు. భద్రత ప్రమాణాలు పాటించకే... విజయశ్రీ ఆర్గానిక్స్ యాజమాన్యం పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు భద్రత కల్పించకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ఫార్మా సిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. పరిశ్రమ వద్ద విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. బుధవారం రాత్రి ప్రమాదం జరిగితే గురువారం వరకు గోప్యంగా ఉంచడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. భద్రత ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై ఇన్‌స్ఫెక్టరీస్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఫార్మాసిటీ లో విష వాయువులను విడుదల చేస్తున్న పరిశ్రమల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలో పీసీబీ యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. విజయశ్రీ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీధర్ కుటుంబానికి, అస్వస్థతకు గురైన వారికి న్యాయం చేయాలని కోరారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
పరవాడ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం
సాక్షి, పరవాడ: విశాఖ జిల్లా పరవాడ విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. విష వాయువు పీల్చి ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రమాద బారిన పడిన కార్మికులు అప్పారావు, చంద్రమోహన్, శ్రీధర్‌లను గాజువాకలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగడానికి కారణాలపై పోలీసులు పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హిందుజా పవర్ ప్లాంట్ నిర్వాసితులకు YSRCP అండ
-
పరవాడలో వైఎస్ఆర్ సీపీ ధర్నా, ఉద్రిక్తత
విశాఖ: విశాఖ జిల్లాలోని పరవాడ హిందుజా పవర్ ప్లాంట్ వద్ద వైఎస్ఆర్ సీపీ శనివారం వైఎస్ఆర్ సీపీ ధర్నా చేపట్టింది. ఈ నేపధ్యంలో మహా ధర్నాకు వస్తున్న నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్నాలో పాల్గొన్న పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాంను స్టీల్ ప్లాంట్ మెయిన్ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
పరవాడ: విశాఖపట్టణం జిల్లా పరవాడ మండలంలోని గంగిరెడ్ల కాలనీ ప్రభుత్వ పాఠశాలలో గుండెపోటుతో సత్యేంద్ర కుమార్ (37) అనే ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మరణించాడు. తోటి ఉపాధ్యాయులు సత్యేంద్రను సమీప ఆసుపత్రికి తరలిద్దామని ప్రయత్నించినా అప్పటికే ఒంట్లో ప్రాణం పోయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
చెట్టును ఢీకొన్న బైక్, ఒకరి మృతి
విశాఖ : విశాఖ జిల్లా పరవాడ సమీపంలో ఎన్టీపీసీ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరంతా అచ్చుతాపురం నుంచి తిరిగి వస్తుండగా ...నిద్ర మత్తులో బైక్ నడుపుతున్న నాగిరెడ్డి వేగంగా చెట్టును ఢీకొన్నాడు. దాంతో అతను సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిలో పైడప్పనాయుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫార్మా ఫ్యాక్టరీలో పేలుడు: కార్మికులకు తీవ్ర గాయాలు
విశాఖపట్నం శివారులోని పరవాడలో గ్లోకెమ్ ఫార్మా ఫ్యాక్టరీలో శనివారం రసాయన ట్యాంకర్లో పేలుడు సంభవించింది. ఆ ప్రమాదంలో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గాజువాకలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న యాజమాన్యం హుటాహుటిన ఫ్యాక్టరీకి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును కార్మికులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మెనియం రియాక్టర్ పేలిందని ఫ్యాక్టరీ కార్మికులు వెల్లడించారు. ఆ ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై విచారణ పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
స్మైల్ ఎక్స్ ల్యాబ్‌లో పేలుడు: కార్మికులు గాయాలు
పరవాడ పార్మసిటీలోని స్మైల్ ఎక్స్ ల్యాబ్ లోని రియాక్టర్లో గత అర్థరాత్రి పేలుడు సంభవించింది. ఆ ఘటనలోనలుగురు కార్మికులకు తీవ్రంగా గాయపడ్డారు. కంపెనీ భద్రత సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కంపెనీలో పేలుడుపై పోలీసులుకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రియాక్టర్ ప్రమాదవశాత్తు పేలిందా లేక మరి ఇతర ఏదైన కారణం వల్ల పేలిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.