
సాక్షి, పరవాడ: విశాఖ జిల్లా పరవాడ విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. విష వాయువు పీల్చి ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రమాద బారిన పడిన కార్మికులు అప్పారావు, చంద్రమోహన్, శ్రీధర్‌లను గాజువాకలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగడానికి కారణాలపై పోలీసులు పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.