జగన్‌ వెంటే నడుస్తాం | tdp activists joins ysrcp | Sakshi
Sakshi News home page

జగన్‌ వెంటే నడుస్తాం

Published Sun, Oct 2 2016 11:46 PM | Last Updated on Fri, Aug 10 2018 8:35 PM

జగన్‌ వెంటే నడుస్తాం - Sakshi

జగన్‌ వెంటే నడుస్తాం

హిందూపురం అర్బన్‌ : ప్రజాపక్షాన నిలిచి నిరంతరం ప్రజల కోసం తపించి పోరాటాలు సాగిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తామని హిందూపురం మండలం కిరికెర గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు అన్నారు. హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ నాయకత్వంపై నమ్మకంతో ఆదివారం కిరికెర బీసీ కాలనీకి చెందిన టీ అంగడి హనుమంతప్ప, చాలుకూరి నారాయణప్ప, ఈ.నరసింహప్ప, మహేష్, ఆర్‌.నారాయణప్ప, ఎస్‌. జగదీష్, డ్రైవర్‌ మూర్తి, నరేష్‌తో పాటు మరో 10 మంది ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు.

వారికి నవీన్‌నిశ్చల్‌ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈసందర్భంగా నవీన్‌నిశ్చల్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయడం తథ్యమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ నాగభూషణరెడ్డి, మండల కన్వీనర్‌ బసిరెడ్డి, బీసీ సెల్‌æరాము, చాంద్‌బాషా, నక్కలపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్‌ సత్యనారాయణ, పి.రంగప్ప, జి.గోపాల్, తిరుమలేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement