naveen nischal
-
వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదు
అనంతపురం ,హిందూపురం అర్బన్: ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనువుగా పనిచేస్తున్నా. రేపు కూడా చేస్తా. పార్టీ నాకు టిక్కెట్టు ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీ గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా. రెండో ఆలోచనే లేదు. నాకు ఓపిక ఉంది.’ అని ఆ పార్టీ హిందూపురం సమన్వయకర్త నవీన్ నిశ్చల్ తేల్చి చెప్పారు. హిందూపురంలోని తన స్వగృహంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పార్టీలో కొందరు తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారనే విషయంపై పార్టీ నేతలతో మా స్వగృహంలో అంతర్గత సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించుకున్నాం. దీనిపై సోషల్ మీడియా, యూట్యూబ్‌తో పాటు పత్రికల్లో కల్పితాలు జోడించి సత్యదూర ప్రచారం చేశారు. తాను డబ్బు ఇవ్వకపోవడంతో అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వడం లేదనేది పూర్తి అవాస్తవం. జగన్ డబ్బు ప్రస్తావనే నా వద్ద తీసుకురాలేదు. ఎన్నికలకు అవసరమైన డబ్బు మా సోదరుడు నాకు ఇస్తారని కార్యకర్తలతో చెప్పా. దాన్ని వక్రీకరించారు. కేవలం నలుగురు వ్యక్తులు నాపై దుమ్మెత్తి పోసేందుకు ఇలాంటి ప్రచారానికి పూనుకున్నారు. వారికి నవీన్‌ను దెబ్బతీయాలనే ఆలోచన తప్ప, పార్టీ అభివృద్ధికి పాటుపడాలనే ధ్యాసే లేదు. ఎన్నికలకు అవసరమైన డబ్బు నా వద్ద లేదన్నది అవాస్తవం. రాజకీయాల్లో ఆటుపోట్లు సహజం. గెలుపోటములు దైవాధీనం. రాజకీయంగా నాతోపాటు కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కుని జైలుపాలై ఇబ్బందులు పడ్డారు. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది’ అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, ఏ, బి, బ్లాక్ కన్వీనర్లు ఇర్షద్, మల్లికార్జున, మండల కన్వీనర్లు నారాయణస్వామి, లక్ష్మినారాయణ, ఫ్లోర్‌లీడర్ శివ, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ ఓటమి ఖాయం
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్వే పేరుతో వైఎస్సార్సీపీ నేతలకు టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇస్తే భారీ ప్యాకేజీ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. టీడీపీకి మద్ధతుగా సర్వే చేస్తోన్న 15 మందిని పట్టుకుని వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, వైఎస్సార్సీపీ నేతలను ప్రలోభపెడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదని వైఎస్సార్సీపీ నేత నవీన్ నిశ్చల్ ఆరోపించారు. సర్వే పేరుతో వైఎస్సార్సీపీ నేతల కీలక సమాచారాన్ని సేకరించడం దుర్మార్గమన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ ఓడిపోవడం ఖాయమన్నారు. అందుకే టీడీపీ నేతలు భయపడి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. -
హిందూపూర్‌లో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన
-
వైఎస్సార్ జనతా క్యాంటీన్ ప్రారంభం
హిందూపురం అర్బన్: మధ్యతరగతి, పేదల ప్రజలతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చేయూతనందించాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరిట జనతా క్యాంటీన్ ను ప్రారంభించినట్లు హిందూపురం వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ తెలిపారు. గురువారం స్థానిక చిన్న మార్కెట్, ప్రభుత్వాస్పత్రి వద్ద క్యాంటీన్ కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి రోజూ జీవనోపాధికోసం పట్టణానికి వస్తున్న పేదలు రోజంతా కష్టపడి సంపాదించుకున్న డబ్బు టిఫెన్, భోజనాలకే ఖర్చు పెట్టాల్సి వస్తోందని తెలిపారు. దీంతో అతి తక్కువ ధర రూ. 9కే కడుపు నిండా ఆహారం అందివ్వగలిగితే నాలుగు డబ్బులు ఇంటికి తీసుకెళ్లేందుకు అవకాశముంటుందని అన్నారు. క్యాంటీన్ల నిర్వహణకు డాక్టర్ సాయిప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. త్వరలో వీటిని హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండల కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, జిల్లా మైనార్టీ గౌరవధ్యక్షులు ఫజులూ రహమన్, కౌన్సిల్ ప్లోర్ లీడర్ శివ, ఏ బీ బ్లాక్ కన్వీనర్లు ఇర్షాద్, మల్లికార్జున, మండల కన్వీనర్లు నక్కలపల్లి శ్రీరాంరెడ్డి, నారాయణస్వామి, మహిళ కన్వీనర్ నాగమణి, షామింతాజ్, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, రజనీ, బీసీ, ఎస్సీసెల్ నాయకులు రాము, శ్రీన, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నారాయణస్వామి, కొల్లకుంట శివశంకర్‌రెడ్డి, నరసింహరెడ్డి, బాలాజీ, మైనార్టీ నాయకులు సమద్, ఇమ్రాన్, మన్సూర్, ముస్తక్, చాంద్‌బాషా, రియాజ్, రంగారెడ్డి, సురేంద్రరెడ్డి పాల్గొన్నారు. నాయకులకు ఈ ఆలోచన రాలేదు వందల వేల కోట్లు సంపాదించిన నాయకులకు పేదలకు సేవ చేయాలని తపన లేకుండా పోయిది. పేదలకు నామమాత్రపు ధరతో కడుపునిండా టిఫెన్, భోజనం అందించే చర్యలను వైఎస్సార్సీపీ సమన్వయకర్త చేపట్టడం అభినందనీయం. – శివ, కౌన్సిల్ ప్లోర్ లీడర్ రూ.9కే నాలుగు ఇడ్లీలు జనతా క్యాంటీన్ లో తొమ్మిది రూపాయలకు నాలుగు ఇడ్లీలు, సాంబర్, చెట్నీ ఇస్తున్నారు. పొంగల్, ఇతర టిఫెన్ కూడా అందుబాటులో ఉంచారు. మధ్యాహ్నం అన్నం, సాంబర్, పెరుగన్నం ఇస్తున్నారు. మాములుగా అయితే రూ.60 పెడితే టిఫెన్, రూ.100పెడితే గానీ భోజనం రాదు. – గంగాధర్, బేల్దార్, లేపాక్షి -
ఇంటింటికీ ‘నవరత్నాలు’
హిందూపురం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేరుతుందని.. ప్రతి గడపకూ వెళ్లి వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. ‘వైఎస్సార్ గుర్తుగా.. జగనన్నకు తోడుగా.. నవరత్నాలు’ సభ బుధవారం మండల కన్వీనర్ బసిరెడ్డి అధ్యక్షతన సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో పట్టణంలోని పాత టీవీఎస్ షోరూం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో జరిగింది. ఈసందర్భంగా నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ నవ్యాంధ్రకు నవరత్నాల పథకాలు నిజమైన రత్నాలే.. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బూత్ కమిటీలు పటిష్టంగా పనిచేయాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబసభ్యులకు పథకాల గురించి క్షుణ్ణంగా వివరించి వారిని వైఎస్ జగన్మోహన్రెడ్డిని బలపర్చే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ నాయకుడి వెంట వస్తానన్నారు. బూత్‌కమిటీ సభ్యులు పథకాలను వివరించడంతో పాటు ప్రధాన సమస్యలు కూడా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మోసానికి మారుపేరు టీడీపీ మోసానికి మారుపేరు టీడీపీ అని మండిపడ్డారు. ఓట్లు వేయించుకోవడానికి కుదరకపోతే ఆ ఓట్లను గల్లంతు చేసి కుటిల బుద్ధి ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. సీఎం చంద్రబాబు పక్కా మోసకారి. కూతురును ఇచ్చిన మామ (ఎన్టీ రామారావు)నే వెన్నుపోటు పొడిన ఘనుడని విమర్శించారు. ఓట్ల కోసం ఆల్ ఫ్రీ అంటాడు. ఎన్నికల్లో ఇచ్చిన వంద హామీలు నేటికి నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమానికి నాంది - ప్రశాంత్‌గౌడ్, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి నవరత్నాల పథకాలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంక్షేమానికి నాంది పలికారు. బూత్ కమిటీలు ప్రజలకు చేరువ కావాలి. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి. ఇంటింటికీ పథకాలతో జరిగే లాభాలు వివరించాలి. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయబావుటా ఎగుర వేసేవిధంగా కష్టపడాలి. మంచి రోజులు వస్తున్నాయి - శివ, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ అన్న వస్తున్నాడు.. మంచిరోజులు వస్తున్నాయి. టీడీపీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. ప్రజలకు మంచి పాలనతో పాటు సంతోషంగా చూడాలనే తలంపుతో నవరత్నాల పథకాలకు శ్రీకారం చుట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది. కార్యక్రమంలో బీ బ్లాక్ కన్వీనర్ మల్లికార్జున, పార్టీ జిల్లా కార్యదర్శి ఫజులూ రెహమన్, స్టీరింగ్ కమిటీ నాయకులు జగన్మోహన్రెడ్డి, మండల కన్వీనర్లు నారాయణస్వామి, సదాశివరెడ్డి, మహిళ కన్వీనర్లు నాగమణి, షామింతాజ్, బీసీ సెల్ రాము, మైనార్టీ నాయకులు షానూర్‌బాషా, సమ్మద్, అన్నాసుందర్రాజ్, ఆజాం, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, షాజియా, జబీవుల్లా, అసిఫ్వుల్లా, రజనీ, జరీనా, మానస, నాయకులు నక్కలపల్లి శ్రీరాంరెడ్డి, నరసింహారెడ్డి, కొల్లకుంట శివశంకర్‌రెడ్డి, రమేష్, రియాజ్, శ్రీన, నారాయణస్వామి, గోపి, హనుమంతప్ప, మధు, నాగిరెడ్డి, రంగనారెడ్డి, సు«రేంద్రరెడ్డి, గిరి, రవి, కొల్లప్ప, బైలాంజినేయులు, లక్ష్మణ్, గోవిందప్ప, కుమార్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రజలే నా బలం
- ప్లీనరీ సమావేశంలో సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ - సభకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు హిందూపురం అర్బన్ : ప్రజలే నాబలం.. ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎవరూ తుడిచేయలేరని హిందూపురం అసెంబ్లీ నియోజవకర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో బుధవారం స్థానిక సాయిరాం ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో మండల కన్వీనర్ బసిరెడ్డి అ«ధ్యక్షతన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పార్టీ పరిశీలకులు తిప్పేస్వామి హాజరయ్యారు. ఈసందర్భంగా సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ.. ‘హిందూపురంలో ప్రజలు నీళ్ల కోసం ఎక్కిళ్లు పడుతున్నా పట్టించుకునే నాథుడు కరువుయ్యారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటామని బాలకృష్ణ దంపతులు దొంగ గృహప్రవేశం చేసి ప్రజలను మభ్యపెట్టారు. గెలిచాల బాలకృష్ణ షూటింగుల్లో బిజీగా ఉన్నారు. రెండేళ్ల క్రితం రంజాన్ మాసంలో మార్కెట్‌ను నిలువునా కూల్చి ముస్లిం సోదరులకు నిలువు నీడ లేకుండా చేసి రోడ్డున çపడేశారు. నీటికోసం, మార్కెట్ నిర్మాణం కోసం తాను «ప్రజల పక్షాన నిలిచి ధర్నా చేస్తుంటే పోలీసులతో గృహ నిర్భంధం చేయించారు. అక్రమంగా కేసులు బనాయించారు. కేసులకు భయపడేదే లేదు’ అన్నారు. ప్రజల ఆదరణ తనపై ఉన్నంత వరకు టీడీపీ వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. అనంతరం కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ శివ మాట్లాడుతూ చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు నిలువునా మోసం చేశారన్నారు. ఎన్నికల్లో సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను నిలువునా ముంచారని ఎద్దేవా చేశారు. తర్వాత బీ బ్లాక్ కన్వీనర్ మల్లికార్జున మాట్లాడుతూ చంద్రబాబు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మరచి నిరంతరం అమరావతి అంటూ తిరుగుతన్నారని ఎద్దేవా చేశారు. కౌన్సిలర్ నాగభూషణరెడ్డి మాట్లాడుతూ 30 ఏళ్లుగా టీడీపీ నాయకులే ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చినా ప్రజల దాహార్తి తీర్చలేదని విమర్శించారు. మహిళ కన్వీనర్ నాగమణి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజలకు గుక్కెడు నీళ్లు ఇవ్వపోయినా మద్యం ఏరులా పారిస్తోందని విమర్శించారు. రాష్ట్ర యువజన ప్రధానకార్యదర్శి ప్రశాంత్‌గౌడ్ మాట్లాడుతూ పార్టీలో పని చేసే కార్యకర్తలపై పోలీసులతో బెదిరింపులు, అక్రమంగా కేసులు బనాయిస్తే భయపడేది లేదన్నారు. చిలమత్తూరు మండల కన్వీనర్ సదాశివరెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లాను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అన్ని విధాలా ఆదుకుంటానని మాట ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు రవికిశోర్, జిల్లా కార్యదర్శి ఫజులూ రెహమాన్, జిల్లా మైనార్టీ అధ్యక్షులు షానూర్‌బాషా, ముత్తవల్లీ ఎస్ఎం బాషా, కన్వీనర్ నారాయణస్వామి, మహిళ కన్వీనర్ షామింతాజ్, కౌన్సిలర్లు అసీఫ్వుల్లా, జబీవుల్లా, అంజినప్ప, రజనీ, జయమ్మ, షాజియా, షాహతాజ్, జరీనా, బీసీ సెల్ రాము, మండల నాయకులు అన్నా సుందరాజ్, రాజారెడ్డి, జగన్మోహన్రెడ్డి, రామచంద్రప్ప, నారాయణస్వామి, నాగిరెడ్డి, రంగారెడ్డి, రామకృష్ణారెడ్డి, ఆజాం, బాలాజీ, రియాజ్, నరసింహారెడ్డి, శివశంకర్‌రెడ్డి, రవికుమార్, మురళి, అజుబా, చంద్రశేఖర్, సమద్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు హనుమంతరాయప్ప, నాగమ్మ, లక్ష్మీనారాయణరెడ్డి, సరోజమ్మ, లక్ష్మీదేవి, నరసింహప్ప తదితరులు పాల్గొన్నారు. -
అధికార పార్టీకి అభిమానం లేదు
- ‘పురం’లో ఎన్నిసార్లు గెలిచినా తాగునీటి సమస్యను తీర్చలేదు - పోలీసులు అధికారపార్టీకి ఊడిగం చేస్తున్నారు - ‘బాబు’ వెంటే కరువు.. ఆ పాదం అలాంటిది - జగన్ సీఎం కాగానే రాష్ట్రం అన్ని విధాలా చిగురిస్తుంది - ప్లీనరీ సమావేశంలో సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ హిందూపురం అర్బన్ : ఇన్నేళ్లుగా హిందూపురం ప్రజలు టీడీపీ వారినే ఎమ్మెల్యేలుగా గెలిపిస్తున్నా వారికి మాత్రం ఆ అభిమానం లేదని, తాగునీరు లేక ‘నీళ్లో రామచంద్రా..’ అని వాపోతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. హిందూపురంలోని చౌడేశ్వరీ కాలనీలో సాయిరాం ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో బుధవారం పార్టీ ప్లీనరీ సమావేశం మండల కన్వీనర్ బసిరెడ్డి అధ్యక్షతన పెద్ద ఎత్తున నిర్వహించారు. అందులో నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో ఇక్కడి ప్రజల తాగునీటి కష్టాలు చూసి శ్రీరామరెడ్డి మంచినీటి పథకాన్ని తీసుకొస్తే ఇక్కడి పాలకులు రాజకీయ కుళ్లు బుద్ధితో దానిని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పీఏబీఆర్ నుంచి నేరుగా పైప్‌లైన్ వేసి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానన్న బాలకృష్ణ గెలిచాక పత్తా లేకుండా పోయారన్నారు. అధికార పార్టీ నాయకులు హంద్రీనీవా నుంచి సాగు, తాగునీరు ఇస్తామన్నారని, అయితే ఇంతవరకు ఏ నీరూ ఇవ్వలేదని అన్నారు. ‘హిందూపురం నియోజకవర్గం అన్ని రకాలుగా నçష్టపోతోంది. గతంలో పట్టు పరిశ్రమ, చెరుకు తయారీ, వేరుశనగ సాగుకు పెట్టింది పేరుగా ఉండేది. ఇప్పుడు పంటలు లేవు. పరిశ్రమలు కూడా లేకుండా పోతున్నాయి. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో సమృద్ధిగా వర్షాలు.. చెరువులన్నీ నీళ్లతో నిండిపోయాయి. రైతులు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. అలాంటి మహానాయకుడి పులిబిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రం తిరిగి అన్నివిధాలా చిగురిస్తుంది’ అని పేర్కొన్నారు. చంద్రబాబు ఏ రోజు అధికారం చేపట్టినా ఆయన వెంటే కరువు వచ్చేస్తుందని, ఆయన పాదం అలాంటిదని అన్నారు. కొత్త మార్కెట్ ఏదీ? చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ రెండేళ్ల క్రితం రంజాన్ మాసంలో మార్కెట్‌ను కూల్చేయడంతో దానిపై ఆధారపడి జీవనం చేసే ముస్లిం సోదరులు రోడ్డున పడ్డారని నవీన్‌నిశ్చల్ విచారం వెలిబుచ్చారు. మార్కెట్ సమస్యపై ధర్నా చేయడానికి సిద్ధమైతే ఇంటి చుట్టూ పోలీసులను కాపలా పెట్టి అక్రమంగా గృహ నిర్బంధం చేసి అడ్డుకున్నారని, మంచినీళ్లు ఇవ్వండయ్యా.. అంటూ ర్యాలీ చేస్తే పోలీసుల ద్వారా అడ్డుకుని కేసులు పెట్టించారని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు ఊడిగం చేయడానికి సిద్ధమైపోయారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించడంలో వారు చూపుతున్న ఉత్సాహం ప్రజలకు రక్షణ కల్పించడంలో చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ పరిశీలకులు తిప్పేస్వామి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవంటే ఎంత దారుణమైన గ్రహణం పట్టిందో తెలుస్తోందన్నారు. స్థానికంగా 24 గంటలూ అందుబాటులో ఉన్న నవీన్‌నిశ్చల్‌ను ఆదరించాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు నీళ్లు ఇవ్వలేని ఎమ్మెల్యే బాలకృష్ణ చిత్తశుద్ధి ఉంటే తక్షణమే హిందూపురం వదలిపోవాలన్నారు. -
నేడు హిందూపురంలో వైఎస్సార్సీపీ ప్లీనరీ
హిందూపురం అర్బన్ : తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక వి«ధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వైఎస్సార్సీపీ బీ బ్లాక్ కన్వీనర్ మల్లికార్జున, మండల కన్వీనర్ బíసిరెడ్డి, మహిళా కన్వీనర్ నాగమణి అన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో బుధవారం హిందూపురంలో ప్లీనరీ సభ నిర్వహించస్తున్నట్టు వారు తెలిపారు. ఈమేరకు స్థానిక చౌడేశ్వరీ కాలనీలో సాయిరాం ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహిస్తున్న సభకు పార్టీ పరిశీలకులు తిప్పేస్వామితో పాటు పలువురు జిల్లా నాయకులు హాజరవుతారని చెప్పారు. సభకు హాజరయ్యే వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు కుర్చోవడానికి షామియానాలు, కుర్చీలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం మధ్యలో సుమారు వందమంది నాయకులు ఆసీనులు కావడానికి వీలుగా వేదిక సిద్ధం చేశారు. ఈనేపథ్యంలో పట్టణంలోని వైఎస్సార్సీపీ నాయకులు ప్లీనరీ సభ ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. ప్రాంగణం ఎదుటే వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు అస్తవ్యస్త పాలనతో అన్నివర్గాల ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధగా ఉన్నారన్నారు. ప్లీనరీకి నియోజకవర్గం నుంచి మండల కన్వీనర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, కౌన్సిలర్లు ఆసీఫ్‌వుల్లా, నాగభూషణరెడ్డి, నాయకులు సుందరరాజు, రామకృష్ణారెడ్డి, రాము, శివశంకర్‌రెడ్డి, నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాలకృష్ణ ఇలాకాలో ఉద్రిక్తత
హిందూపురం: ప్రముఖ సినీ నటుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురంలో శనివారం ఉద్రిక్తత ఏర్పడింది. బాలకృష్ణ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, హిందూపురంలో కూరగాయల మార్కెట్‌ను నిర్మించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ ధర్నాకు దిగగా, పోలీసులు అడ్డుకున్నారు. హిందూపురం నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ఇంటివద్ద పోలీసులను భారీగా మోహరించారు. ధర్నాలో పాల్గొనేందుకు నవీన్‌ను ఇంటినుంచి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నవీన్ ఇంటి వద్ద వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ధర్నాలో పాల్గొనకుండా నవీన్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు. బాలకృష్ణ హామీలను విస్మరించడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటీవల తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిరసన తెలియజేశారు. అప్పుడు కూడా పోలీసులు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరగకుండా, పోలీసులు ముందస్తుగానే అడ్డుకుంటున్నారు. ఈ నెల 7 నుంచి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బాలకృష్ణ స్థానికులకు అందుబాటులో ఉండటం లేదని, సమస్యలను పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. అంతేగాక సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నవారిని పోలీసులు అడ్డుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బాలకృష్ణ ఇలాకాలో ఉద్రిక్తత
-
జల పోరు.. జన ఉప్పెన
- హిందూపురంలో తాగునీటి సమస్యపై జనాగ్రహం - ఖాళీబిందెలతో రోడ్డెక్కిన మహిళలు - వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రాస్తారోకో - ఎమ్మెల్యే బాలకృష్ణ, మునిసిపల్ చైర్పర్సన్ పేర్లతో దున్నపోతుల ప్రదర్శన - పోలీసుల లాఠీచార్జ్.. ప్రతిఘటించిన ఆందోళనకారులు హిందూపురం అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు, సినీనటుడు నందమూర్తి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో తాగునీటి సమస్య రోజురోజుకూ జఠిలమవుతుండటంతో ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. ముఖ్యంగా మహిళలు భారీసంఖ్యలో తరలివచ్చి ఖాళీబిందెలతో నిరసన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాల్సిçన ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరు నెలలుగా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదని, మునిసిపల్ చైర్పర్సన్ లక్ష్మి కూడా పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. ముందుగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని వార్డుల నుంచి మహిళలు వేలాదిగా ఖాళీ బిందెలతో తరలివచ్చారు. స్థానిక చిన్న మార్కెట్ వద్ద నుంచి ఫ్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని.. ఖాళీ బిందెలను తలపెట్టుకుని.. నీళ్లు ఇవ్వాలంటూ ర్యాలీగా బయలుదేరారు. ప్రజలకు నీళ్లు కూడా ఇవ్వలేని ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ ప్రభుత్వం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ర్యాలీలోకి కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే బాలకృష్ణ, మునిసిపల్ చైర్పర్సన్ రావిళ్ల లక్ష్మి, టీడీపీ ప్రభుత్వం అని రాసివున్న దున్నపోతులను తీసుకొచ్చారు. పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు. అడ్డుకున్న ఆందోళకారులపైనా లాఠీచార్జ్ చేశారు. దీంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు కల్పించుకోవడంతో శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీ కాస్త ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ టీడీపీ నాయకుల డైరెక్షన్లో పోలీసులు జులుం చేయడం సరికాదన్నారు. అనంతరం గాంధీసర్కిల్, అంబేడ్కర్ సర్కిల్ మీదుగా సద్భావన సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ మిట్ట మ««ధ్యాహ్నం మండుటెండలోనే మహిళలు, పట్టణవాసులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. బిందెలు తలపై పెట్టుకుని తాగడానికి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం, ఎమ్మెల్యే గద్దె దిగిపోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు మళ్లీ ఆందోళనకారులను వెనక్కు తోయసాగారు. దీంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వన్‌టౌన్ ఎస్ఐ దిలీప్‌కుమార్‌తో నవీన్‌నిశ్చల్ వాగ్వాదానికి దిగారు. పార్టీ ప్రచార రథాన్ని తీసేయాలని పోలీసులు చుట్టుముట్టగా... తీసేది లేదంటూ ఆందోళనకారులు అడ్డుపడ్డారు. పోలీసులు వారిని పక్కకు లాగేసి రథాన్ని తొలగించారు. ఇంతలో మునిసిపల్ డీఈ వన్నూరప్ప వచ్చి çసర్ది చెప్పడానికి ప్రయత్నించారు. నవీన్‌నిశ్చల్ ఆయనపై మండిపడ్డారు. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని మీరు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపల్ కమిషనర్ రాకుండా దాక్కున్నారా అంటూ నిలదీశారు. తాగునీటి ట్యాంకర్ల పేరిట చైర్పర్సన్, అధికార పార్టీ కౌన్సిలర్లు దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమిటని ప్రశ్నించారు. నీటి కష్టాలు బాలయ్యకు కన్పించలేదా? టీడీపీ పాలనలో ప్రజలకు కూడు, నీరు, నీడ దొరకడం లేదని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా నీళ్లు అందివ్వలేదన్నారు. బాలకృష్ణ ఆరు నెలలకు ఓసారి చుట్టపు చూపుగా వచ్చి బాత్రూంలు, లైటింగ్ ప్రారంభోత్సవాలు చేసి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. వేసవి ఆరంభంలోనే ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నా పట్టించుకునే నాథులే లేరన్నారు. మునిసిపల్ చైర్పర్సన్, అధికార పార్టీ కౌన్సిలర్లు నీటి సరఫరాలోనూ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బినామీ పేర్లతో ట్యాంకర్లు పెట్టి అధిక ట్రిప్పులు పంపినట్లు రాసుకుని జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజల దాహార్తి తీర్చాలని తాము అడుగుతున్నా గుడ్డి, చెవిటి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. అధికార పార్టీ తొత్తులుగా ఉన్న పోలీసులు «ప్రజా ధర్నాను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టును పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు నీరు నింçపి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన నాంది మాత్రమేనని, ఇప్పటికీ స్పందించకుంటే త్వరలోనే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, పట్టణ ఏ బ్లాక్ కన్వీనర్ ఈర్షద్, జిల్లా కార్యదర్శి ఫజులూ రెహమన్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ శివ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ షాజియా, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
పరిశ్రమల పునరుద్ధరణకు కృషి
- ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస హిందూపురం అర్బన్ : రాయలసీమలో మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణ కోసం మండలిలో తన వాణి వినిపిస్తానని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏదైనా పోరాటంతోనే సా«ధ్యమవుతుందన్నారు. తనను గెలిపిస్తే రాయలసీమలో మూతబడ్డ పరిశ్రమల పునరుద్ధరణపై మండలిలో ప్రశ్నిస్తానన్నారు. హిందూపురం సమీపంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ, పెనుకొండ ఆల్వీన్ పరిశ్రమ, కర్నూలులో పేపర్ ఫ్యాక్టరీ, గుంతకల్లులో స్పిన్నింగ్ మిల్లును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తానని చెప్పారు. మూతపడిన పరిశ్రమలు ప్రారంభించలేని చంద్రబాబు కొత్త పరిశ్రమలు ప్రారంభించి ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ గోపాల్‌రెడ్డి ఎన్జీఓ నాయకుడిగా ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు.. రాయలసీమ ప్రాంత పరిస్థితులపై అవగాహన కల్గిన వ్యక్తి అన్నారు. గోపాల్‌రెడ్డి గెలుపుతో అధికార టీడీపీకి తగిన బుద్ధి వస్తుందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ బీబ్లాక్ కన్వీనర్ మల్లికార్జున, జిల్లా కార్యదర్శి ఫజులూ రెహెమన్, కౌన్సిలర్లు ఆసీఫ్‌వుల్లా, జబీవుల్లా తదితరులు పాల్గొన్నారు. -
’కాంప్రమైజ్ నా చరిత్రలో లేదు..’
హిందూపురం అర్బన్ : ‘కాంప్రమైజ్ అనేది నా చరిత్రలో లేదు. వ్యతిరేకులతో కంప్రమైజ్ చేసుకునే మనస్తత్వం అయి ఉంటే ఇప్పటి దాకా జరిగిన ఎన్నికల్లో ఎప్పుడో ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవాణ్ని.’ అని వైఎస్సార్సీపీ హిందూపురం సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ తీవ్రంగా విమర్శించారు. ఆయన శుక్రవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ పెత్తనంకోసం పంపకాల కోసం టీడీపీలో వర్గాలు విడిపోయి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. అది ఆ పార్టీకి సంబంధించిన విషయం అయితే అందులో వైఎస్సార్సీపీని లాగితే సహించేది లేదని హెచ్చరించారు. ఆదాయాన్ని పంచుకోవడంలో మనస్పర్థలు వచ్చి కొట్టుకుంటున్నారన్నారు. మున్సిపాల్టీలో 38వార్డులుంటే వైఎస్సార్సీపీ వార్డులకు ఒక పింఛన్ కూడా ఇవ్వలేదు. దీంతో మాకౌన్సిలర్ అర్ధనగ్నంగా ఆందోళనలు చేయాల్సి వచ్చిందన్నారు. గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమంలో జెండా కట్టలు కడితే పగులగొట్టారని, అభంశుభం ఎరగని మున్సిపల్ కౌన్సిలర్లపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులుపెట్టారన్నారు. ‘హిందూముస్లింల మధ్య జరిగిన గొడవల్లో సయోధ్య చేయడానికి వెళ్లిన మా వార్డు నాయకులు బాషాతో పాటు అప్రాంతంలో లేని కార్యకర్తలపై కేసులు పెట్టి జైళ్లకు పంపారు. నేను రాజి పడి ఉంటే ఇవన్నీ జరిగేవా?’ అని ప్రశ్నించారు. ‘పీఏశేఖర్తో నాకు సంబంధాలున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. అతనేవరో కూడా నాకు తెలియదు. కలిసిన సందర్భం లేదు. ఇది చూసిన పెద్దమనిషి ఎవరో ఉంటే నిరూపిస్తే దేనినైనా సిద్ధంగా ఉన్నా’ అని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులు కాజేస్తున్న టీడీపీ నాయకుల తీరు గమనించి రాబోయే రోజుల్లో మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజనకార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, బీబ్లాక్ కన్వీనర్ మల్లికార్జున, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, ఆసిఫ్వుల్లా, రజనీ,జబీవుల్లా, అంజినప్ప, మండల కన్వీనర్లు బసిరెడ్డి, సదాశివరెడ్డి, మహిళా కన్వీనర్ నాగమణి నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
హోదాతోనే భవిష్యత్తు
- వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ - గృహనిర్బంధం చేసిన పోలీసులు - ఇంటివద్దనే కొవ్వొత్తుల ప్రదర్శన హిందూపురం అర్బన్ : ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర భవిష్యత్తు ఉందని.. హోదా సాధనలో ప్రతిఒక్కరు ఉద్యమించాలని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీసీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. గురువారం సాయంత్రం నవీన్‌నిశ్చల్ ఇంటి వద్ద పోలీసులు మోహరించి గృహనిర్బంధం చేశారు. తాను బయటకు వెళ్లడం లేదని ఇంటివద్దనే నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ప్రకంటించారు. అనంతరం పాండునగర్లోని ఆయన నివాసం వద్దనే పార్టీ నాయకులతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేస్తూ ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ఈసందర్భగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాన్ని గుర్తించి కేంద్రంపై ఒత్తిడి పెంచి ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి దాసోహం కావడం సిగ్గుచేటన్నారు. తన వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కేంద్రంలో తాకట్టు పెడుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రతిపక్షపార్టీతో పాటు అన్నిపార్టీలు, విద్యార్థి సంఘాలు ఒకే నినాదంతో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీçసు బలగంతో ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. ప్యాకేజీలతో పాలకులు లబ్ధి పొందడానికి ప్రజాసంక్షేమాన్ని విస్మరిçస్తున్నామని ఎద్దేవా చేశారు. కొవ్వొత్తుల ర్యాలీలో వైఎస్సార్సీపీ నాయకులు, విద్యార్థిసంఘ నాయకులు పాల్గొన్నారు. -
సంప్రదాయ వంటలతోనే ఆరోగ్యం
- కాలానుగుణంగా ఆహార అలవాట్లు మార్చుకోవాలి - నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ - సంస్కృతి సంప్రదాయాలను చాటే సంక్రాంతి వంటల పోటీలు హిందూపురం అర్బన్ : సంప్రదాయ వంటల్లో ఎంతో ఆరోగ్యం దాగుందని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. కాలానుగుణంగా ఏఏ వంటలు, ఏ ఆహారం తీసుకోవాలో పెద్దలు ఏనాడో నిర్ణయించారన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గురువారం స్థానిక కేహెచ్ ఫంక్షన్ హాలులో సాయిప్రసాద్ మెమోరియల్ ట్రస్టు, వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో మహిళలకు సంప్రదాయ వంటల పోటీలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పోటీలకు సుమారు వంద మంది మహిళలు వివిధ వంటలు పోటీపడి తయారు చేశారు. సుమారు ఒకటిన్నర గంట సమయంలో వంట సిద్ధం చేయడానికి నిర్ణయించారు. జ్యోతి, త్రివేణి, సునంద, కీర్తి, శిల్ప, సంగీత న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. మొదటి బహుమతిగా ఫ్రిజ్‌ను గౌరిబిదనూరుకు చెందిన పునితవంశీ (గుమ్మడికాయ, చెరుకుపాలతో పాయసం) వంటకు ఇచ్చారు. రెండో బహుమతి గ్రైండర్విత్ ఫ్రిజ్‌ను సత్యవాణి (చెక్కిళాలు, సద్దరొట్టె) దక్కించుకున్నారు. మూడో బహుమతి చికెన్ సెట్‌ను సవితభూషన్ (తీపి గుమ్మడికాయ బూందీలు, చిలకడదుంప బొబ్బట్లు)కు అందించారు. అనంతరం పోటీలకు హాజరైన మహిళలందరికీ బహుమతులు ప్రదానం చేశారు. ఈసందర్భంగా నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ కారేషుదాశి, కరనేషుమంత్రి, భోజషు మాత అని చెప్పారు. మహిళలు కరుణమూర్తులు శుద్ధమైన వంటలు చేసి భర్త, పిల్లలను ఆనందపర్చాలన్నారు. పని ఒత్తిడితో ఇంటికి వచ్చిన భర్తలకు భారం కలిగించరాదని సూచించారు. ప్రతి ఏటా ఇలాంటి సంప్రదాయ వంటలు, ముగ్గులు పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ పట్టణ ఏ,బీ బ్లాక్ కన్వీనర్లు ఈర్షద్, మల్లికార్జున, జిల్లా కార్యదర్శి ఫజులూరెహెమాన్, మహిళా కన్వీనర్లు నాగమణి, షామింతాజ్, మండల కన్వీనర్లు నారాయణస్వామి, సదాశివరెడ్డి, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, అంజినప్ప, షాజియా, ఎంపీటీసీ సభ్యురాలు సునిత, నాయకులు సమద్, రంగారెడ్డి, నాగిరెడ్డి, రవి, శివశంకర్‌రెడ్డి, నారాయణస్వామి, శంకర్‌రెడ్డి, రమేష్, నరసింహరెడ్డి, రియాజ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
సంస్కృతిని కాపాడుకోవాలి
– తెలుçగు సంప్రదాయానికి సంక్రాంతి శుభారంభం – వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు – భారీగా తరలివచ్చిన మహిళలు హిందూపురం అర్బన్ : తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు శుభారంభం సంక్రాంతి పండుగ.. నాటి విలువలను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా ఉండాలని హిందూపురం అసెంబ్లీ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. సాయిప్రసాద్ మెమోరియల్ ట్రస్టు, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సంçక్రాంతి పండుగ సందర్భంగా పట్టణంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో మంగళవారం ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలకు నియోజకవర్గం నుంచి మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 380 మంది మహిళలు పోటీ పడ్డారు. ఉదయం 11.10 నుంచి మధ్యాహ్నం 12.40 గంటల వరకు మహిళలు తమ ప్రతిభా పాటవాలు చాటి చెబుతూ రంగురంగుల ముగ్గులు, సంప్రదాయం ఉట్టిపడే రీతిలో ముగ్గులు వేశారు. ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు, నవధాన్యాలు, చెరుకు గడలు, సంక్రాంతి లక్ష్మి కలశాలు కొలువుదీర్చి మరింత శోభను తెచ్చిపెట్టారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సరçస్వతి వెంకటేష్‌తో పాటు మరో ముగ్గురు వ్యవహరించారు. ఈ మేరకు తొలి బహుమతి డబుల్ బెడ్కాట్ మంచాన్ని ఎస్బీఐ కాలనీకి చెందిన లక్ష్మి, ద్వితీయ బహుమతి టీక్ సోఫా సెట్‌ను ముద్దిరెడ్డిపల్లికి చెందిన సత్య, తృతీయ బహుమతి డ్రసింగ్ టేబుల్‌ను కంసాలిపేటకు చెందిన ఆశ్మిత రఘునాథన్ గెలుచుకున్నారు. అదేవిధంగా పాల్గొన్న మహిళలందరికీ బహుమతులుగా చీరలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా సభలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ ఆధునిక యుగంలో సంప్రదాయాలు తరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరు పండుగలు వాటి ప్రాధాన్యం గురించి మరిచిపోతున్నారు. ఇలాంటి తరుణంలో భావితరాలను జాగృతం చేయడానికి తెలుగు పండుగల ఔనత్యాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అందుకే సంక్రాంతి అంటే రంగుల ముగ్గులు, రైతుల ఇంట ధాన్యలక్ష్మి, పతంగులు వంటివి కనిపించాలన్నారు. అనంతరం పోటీలకు హాజరైన మహిళలందరికీ భోజన వసతి కల్పించారు. ఈసందర్భంగా న్యాయనిర్ణేతలు, కవులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ బీ బ్లాక్ కన్వీనర్ మల్లికార్జున, జిల్లా కార్యదర్శి ఫజులూ రెహెమాన్, మహిళా కన్వీనర్లు నాగమణి, షామింతాజ్, మండల కన్వీనర్లు నారాయణస్వామి, సదాశివరెడ్డి, నాయకులు రంగారెడ్డి, నాగిరెడ్డి, రామచంద్రారెడ్డి, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, ఆసీఫ్‌వుల్లా, షాహతాజ్, జయమ్మ, శ్రీరాంరెడ్డి, సమద్, శివశంకర్‌రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అందరూ సంతోషంగా ఉండాలి
హిందూపురం అర్బన్ : నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆయన స్వగృహంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి పుష్పాగుచ్ఛాలు, పండ్లు అందించి శుభకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు బాగుండాలని కోరుకుంటున్నామన్నారు. అలాగే ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరింత పట్టుదలతో కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, జిల్లా కార్యదర్శి ఫజులూ రెహెమాన్, బీ బ్లాక్ కన్వీనర్ మల్లికార్జున, కన్వీనర్ నారాయణస్వామి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే వివిధ కళాశాలల ప్రిన్సిపళ్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పట్టణ ప్రముఖులు తరలివచ్చి నవీన్‌నిశ్చల్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఐక్యంగా ఉంటే అన్నిరంగాల్లో రాణిస్తారు
లేపాక్షి : రాష్ట్రంలో కాపు, బలిజలందరు ఐకమత్యంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తారని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. ఆదివారం ఉదయం లేపాక్షి మండలం పి.సడ్లపల్లిలో గ్రామ సర్పంచ్ అశ్వర్థనారాయణ తోటలో హిందూపురం బలిజసంఘం యూత్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ కార్తీక వనభోజనాలు చేయడంతో కాపు, బలిజల ఐక్యతకు దోహదపడుతుందన్నారు. భవిష్యత్తులో రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ రంగాల్లో రాణించాలంటే ఐక్యత అవసరమన్నారు. ఐక్యతా లోపంతో రాజ్యాధికారం కోల్పోతున్నామని వాపోయారు. కార్యక్రమంలో హిందూపురం బలిజ సంఘం నాయకులు రాయల్ గోపాల్, మారుతీ శ్రీనివాస్, రామచంద్ర, రమణ, విజయానంద్, మల్లెపూల మధు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
‘హోదా’తోనే అభివృద్ధి
హిందూపురం అర్బన్ : ప్రత్యేక హోదా వస్తే అన్ని రకాల రాయితీల లభ్యతతో రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయని వైఎస్సార్సీపీ బలపరచిన ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం హిందూçపురం విచ్చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తే ట్యాక్స్ హాలిడే, పన్నుల రాయితీలు, నిరుద్యోగులకు ఉపాధి, రాజధాని నిర్మాణానికి రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం లభిస్తుందన్నది చంద్రబాబు గ్రహించాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక దోచుకో.. దాచుకో అన్న చందంగా అధికార పార్టీ నేతలు తయారయ్యారని ఎద్దేవా చేశారు. నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. జిల్లా నాయకులు మీసాల రంగన్న, అడ్వకేట్ నాగమల్లేశ్వరరెడ్డి, రాష్ట్ర యువజన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, జిల్లా కార్యదర్శి ఫజులూ రెహెమన్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ శివ, కౌన్సిలర్ ఆసీఫ్‌వుల్లా, రజనీ, నాయకులు రియాజ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘తీవ్రస్థాయిలో బాలకృష్ణ పీఏ అవినీతి’
అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్.. సినీ నటుడు, స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణపై మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవి అంటే సినిమా షూటింగ్ అనుకుంటున్నారని విమర్శించారు. బాలకృష్ణ మూడు నెలల్లో ఒక రోజు మాత్రమే హిందూపురంలో పర్యటిస్తున్నారని నవీన్ నిశ్చల్ అన్నారు. హిందూపురంలో బాలకృష్ణ పీఏ అవినీతి తీవ్రస్థాయికి చేరిందని ఆరోపించారు. బాలకృష్ణకు హిందూపురం ప్రజల కష్టాలు పట్టవని నవీన్ విమర్శించారు. -
జగన్ వెంటే నడుస్తాం
హిందూపురం అర్బన్ : ప్రజాపక్షాన నిలిచి నిరంతరం ప్రజల కోసం తపించి పోరాటాలు సాగిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో నడుస్తామని హిందూపురం మండలం కిరికెర గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు అన్నారు. హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ నాయకత్వంపై నమ్మకంతో ఆదివారం కిరికెర బీసీ కాలనీకి చెందిన టీ అంగడి హనుమంతప్ప, చాలుకూరి నారాయణప్ప, ఈ.నరసింహప్ప, మహేష్, ఆర్.నారాయణప్ప, ఎస్. జగదీష్, డ్రైవర్ మూర్తి, నరేష్‌తో పాటు మరో 10 మంది ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. వారికి నవీన్‌నిశ్చల్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈసందర్భంగా నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడం తథ్యమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నాగభూషణరెడ్డి, మండల కన్వీనర్ బసిరెడ్డి, బీసీ సెల్æరాము, చాంద్‌బాషా, నక్కలపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, పి.రంగప్ప, జి.గోపాల్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. -
కరాటే క్రీడాకారులకు ప్రోత్సాహం
హిందూపురం అర్బన్ : ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్.. డాక్టర్ సాయిప్రసాద్ మెమోరియల్ ట్రస్టు ద్వారా రూ.5 వేలు ఆర్థిక సాయం చేశారు. అనంతరం పోటీలకు ఎంపికైన సుధీర్, అభిలాష్, విశ్వతేజ , సాయిచంద్ర, జయ్‌ప్రకాష్, శివకుమార్, విజయ్ను అభినందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నాగభూషణరెడ్డి, వైఎస్సార్సీపీ మహిళా కన్వీనర్లు నాగమణి, షామింతాజ్, బీసీ సెల్ రాము తదితరులు పాల్గొన్నారు. -
ట్రై సైకిల్ పంపిణీ
లేపాక్షి : మండలంలోని మామిడిమాకులపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణరెడ్డి అనే వికలాంగునికి హిందూపురం నియోజక వర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ట్రై సైకిల్ అందజేశారు. ఇటీవల మండలంలోని మామిడిమాకుపల్లి గ్రామంలో జరిగిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో వికలాంగుడు తటస్థ పడి తనకు ట్రై సైకిల్ అందజేయాలని నవీన్‌నిశ్చల్‌ను కోరారు. ఆయన వెంటనే స్పందించి అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం చిలమత్తూరుకు వెళ్తూ లేపాక్షి ఆర్టీసీ బస్టాండు ఆవరణలో లక్ష్మీనారాయణరెడ్డికి ట్రైసైకిల్ అందజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నారాయణస్వామి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నారాయణస్వామి, కౌన్సిలర్ నాగభూషణరెడ్డి, స్థానికులు ఉన్నారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
హిందూపురం రూరల్ : మండలంలోని కిరికెర గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. శుక్రవారం గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అధికార పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలు, నాయకులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కిరికెర గ్రామస్తులు నారాయణప్ప, ప్రభాకర్, చిన్నప్పయ్య, కొండప్ప, బాబన్న, కిష్టప్ప, చిన్న యల్లప్ప, హనుమయ్య, నారాయణస్వామి, గోవి, బాలు, చిన్న నారాయణప్ప, మరో 8 మంది వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రజా పోరాటాలు చేస్తూ నిత్యం ప్రజల కోసం పని చేస్తున్నారని వారికి మద్దతుగా నిలిచి పార్టీ అభివద్ధికి కషి చేయాలని నవీన్‌నిశ్చల్ పిలుపునిచ్చారు. మండల కన్వీనర్ బసిరెడ్డి, కిరికెర మాజీ సర్పంచ్ సత్యనారాయణ, చాంద్‌బాషా, మహిళా కన్వీనర్లు నాగమణి, షామింతాజ్, బీసీ సెల్ రాము, కొటిపి మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
జగన్ వెంటే నడుస్తాం
హిందూపురం అర్బన్ : జన సంక్షేమం కోసం నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో నడుస్తామని చౌళూరు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన యువత నినదించారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పోచనపల్లిలో పర్యటిస్తున్న హిందూపురం సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ నాయకత్వాన్ని బలపరుస్తూ చౌళూరుకు చెందిన సుబ్బరాయప్ప, నరసింహప్ప, వెంకన్న, యువకులు సాయి నరసింహప్ప, మంజు, ఆశ్వర్థ, బుజ్జి, నవీన్, ప్రవీన్, మరో 30 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి నవీన్‌నిశ్చల్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, బీసీ సెల్ రాము, చౌళూరు రవికుమార్, బీ బ్లాక్ కన్వీనర్ మల్లికార్జున, కౌన్సిలర్ నాగభూషణరెడ్డి, విద్యార్థి నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.