ఇంటింటికీ ‘నవరత్నాలు’
హిందూపురం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేరుతుందని.. ప్రతి గడపకూ వెళ్లి వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. ‘వైఎస్సార్ గుర్తుగా.. జగనన్నకు తోడుగా.. నవరత్నాలు’ సభ బుధవారం మండల కన్వీనర్ బసిరెడ్డి అధ్యక్షతన సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో పట్టణంలోని పాత టీవీఎస్ షోరూం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో జరిగింది.
ఈసందర్భంగా నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ నవ్యాంధ్రకు నవరత్నాల పథకాలు నిజమైన రత్నాలే.. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బూత్ కమిటీలు పటిష్టంగా పనిచేయాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబసభ్యులకు పథకాల గురించి క్షుణ్ణంగా వివరించి వారిని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బలపర్చే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ నాయకుడి వెంట వస్తానన్నారు. బూత్‌కమిటీ సభ్యులు పథకాలను వివరించడంతో పాటు ప్రధాన సమస్యలు కూడా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
మోసానికి మారుపేరు టీడీపీ
మోసానికి మారుపేరు టీడీపీ అని మండిపడ్డారు. ఓట్లు వేయించుకోవడానికి కుదరకపోతే ఆ ఓట్లను గల్లంతు చేసి కుటిల బుద్ధి ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
సీఎం చంద్రబాబు పక్కా మోసకారి. కూతురును ఇచ్చిన మామ (ఎన్టీ రామారావు)నే వెన్నుపోటు పొడిన ఘనుడని విమర్శించారు. ఓట్ల కోసం ఆల్ ఫ్రీ అంటాడు. ఎన్నికల్లో ఇచ్చిన వంద హామీలు నేటికి నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు.
ప్రజా సంక్షేమానికి నాంది - ప్రశాంత్‌గౌడ్, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి
నవరత్నాల పథకాలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంక్షేమానికి నాంది పలికారు. బూత్ కమిటీలు ప్రజలకు చేరువ కావాలి. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి. ఇంటింటికీ పథకాలతో జరిగే లాభాలు వివరించాలి. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయబావుటా ఎగుర వేసేవిధంగా కష్టపడాలి.
మంచి రోజులు వస్తున్నాయి - శివ, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్
అన్న వస్తున్నాడు.. మంచిరోజులు వస్తున్నాయి. టీడీపీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. ప్రజలకు మంచి పాలనతో పాటు సంతోషంగా చూడాలనే తలంపుతో నవరత్నాల పథకాలకు శ్రీకారం చుట్టారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది.
కార్యక్రమంలో బీ బ్లాక్ కన్వీనర్ మల్లికార్జున, పార్టీ జిల్లా కార్యదర్శి ఫజులూ రెహమన్, స్టీరింగ్ కమిటీ నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి, మండల కన్వీనర్లు నారాయణస్వామి, సదాశివరెడ్డి, మహిళ కన్వీనర్లు నాగమణి, షామింతాజ్, బీసీ సెల్ రాము, మైనార్టీ నాయకులు షానూర్‌బాషా, సమ్మద్, అన్నాసుందర్‌రాజ్, ఆజాం, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, షాజియా, జబీవుల్లా, అసిఫ్‌వుల్లా, రజనీ, జరీనా, మానస, నాయకులు నక్కలపల్లి శ్రీరాంరెడ్డి, నరసింహారెడ్డి, కొల్లకుంట శివశంకర్‌రెడ్డి, రమేష్, రియాజ్, శ్రీన, నారాయణస్వామి, గోపి, హనుమంతప్ప, మధు, నాగిరెడ్డి, రంగనారెడ్డి, సు«రేంద్రరెడ్డి, గిరి, రవి, కొల్లప్ప, బైలాంజినేయులు, లక్ష్మణ్, గోవిందప్ప, కుమార్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.