YSRCP Navaratnalu
-
టిడ్కో ఇళ్ల పథకాన్ని బాబు ప్రభుత్వం గాలికొదిలేసింది
-
నవరత్నాలు పథకాల్ని వివరిస్తూ.. డాక్యుమెంటరీ
-
నవరత్నాల అమలుకు రాష్ట్రస్థాయి కమిటీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నవరత్నాల అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చైర్మన్‌గా, మంత్రులు, అధికారులు సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సలహాదారు శామ్యూల్‌ను వైఎస్ చైర్మన్‌గా నియమించారు. డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, పుష్ప శ్రీవాణి, ఆళ్లనాని, నారాయణస్వామి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, శ్రీరంగనాథరాజ్, బొత్స సత్యనారాయణ, విశ్వరూప్, అనిల్‌కుమార్ యాదవ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కమిటీలో సభ్యులుగా ఉంటారు. అలాగే 12 శాఖల ఉన్నతాధికారులను రాష్ట్ర స్థాయిలో సభ్యులుగా నియమించారు. జిల్లా స్థాయిలో ఇంచార్జ్ మంత్రుల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. నవరత్నాలను సమర్థవంతగా అమలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా, సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
నగర ప్రజలకు గృహ యోగం
సాక్షి, నగరంపాలెం(గుంటూరు) : నగర ప్రజల సొంతింటి కల త్వరలో నిజం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల్లో భాగంగా అందరికీ ఇళ్లు పథకం తొలిదశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నగరపాలక సంస్థలో ఒక కొలిక్కి వచ్చింది. నగర ప్రాంతాల్లో స్థలాల లభ్యత తక్కువుగా ఉన్న దృష్ట్యా జీప్లస్ టూలో విశాలమైన గృహాలు నిర్మించి అందించనున్నారు. వార్డు వలంటీర్లను నియమించిన ఆగస్టు 15వ తేదీ నుంచి తొలి పనిగా డోర్ టూ డోర్ గృహాలు లేని నిరుపేదల గురించి సర్వే నిర్వహించారు. నగరంలోని 52 డివిజన్లతో పాటు, 10 విలీన గ్రామాల్లో వార్డు వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి హౌసింగ్ దరఖాస్తులను స్వీకరించారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీటిని క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి ప్రాథమికంగా అర్హుల జాబితాను తయారు చేశారు. నగరంలో 52 డివిజన్లు, 10 విలీన గ్రామాల్లో కలిపి మొత్తం 38,252 మందితో ప్రాథమిక అర్హుల జాబితాను నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ విడుదల చేశారు. ప్రాథమిక అర్హుల జాబితాను నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు, బృందావన్ గార్డెన్స్‌లోని సర్కిల్ కార్యాలయంలో ప్రదర్శించారు. అర్హుల జాబితాపై ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు స్వీకరించి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. డివిజన్ల వారీగా విడుదల చేసిన అర్హుల జాబితాలో ఎక్కువ మంది విలీన గ్రామాలకు సంబంధించి 56వ డివిజన్లో 3,428, 57వ డివిజన్లో 3,097, పశ్చిమ నియోజకవర్గంలోని 28వ డివిజన్లో 2,252 మంది ఉన్నారు. అతి తక్కువ మంది 42వ డివిజన్లో 385 మంది మాత్రమే ఉన్నారు. అర్హుల జాబితాపై అభ్యంతరాలను డివిజన్ల వారీగా నిర్వహించనున్న వార్డు సభల్లో స్వీకరించనున్నారు. ప్రైవేటు స్థలాల కొనుగోలుకు చర్యలు : గృహాల నిర్మాణానికి స్థల సేకరణను రెవెన్యూ అధికారులతో కలసి నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు వేగవంతం చేశారు. నగరంతో పాటు, విలీన గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు లభ్యత లేకపోవటంతో ప్రైవేటు స్థలాలు కొనుగోలుకు ప్రయత్నాలు ప్రారంభించారు. విలీన గ్రామాల్లోను, శివారు కాలనీలోని ఇళ్ల మధ్యలో ఉన్న పొలాలను కొనుగోలు చేయటానికి ఇప్పటికే రెవెన్యూ అధికారుల సహాయంతో యజమానులను గుర్తించి చర్చలు ప్రారంభించారు. సుమారు 40 వేల ఇళ్లకు 60 నుంచి 100 ఎకరాలు అవసరం ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనికి సంబంధించి ప్రాథమికంగా గుర్తించిన స్థలాల ప్రతిపాదనలు జిల్లా అధికారులకు సమర్పించనున్నారు. 15 నుంచి వార్డు సభలు అర్హుల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 15 నుంచి డివిజన్ల వారీగా వార్డు సభలు నిర్వహిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. ప్రాథమిక అర్హుల జాబితాను డివిజన్ల వారీగా అందుబాటులో ఉంచామన్నారు. అందరికీ ఇళ్లు పథకం ద్వారా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలోను, ఆన్లైన్ ద్వారా వెరిఫికేషన్ చేసి ప్రాథమిక అర్హుల జాబితాను రూపొందించామని తెలిపారు. అర్హుల జాబితాపై ఫిర్యాదులు, సలహాలు, సూచనలను వార్డు సభల్లో అందిస్తే విచారణ చేసి, తుది జాబితాను సిద్ధం చేస్తామని వివరించారు. -
100 రోజుల ప్రజాప్రభుత్వం
-
జనరంజక పాలనకు వైఎస్ జగన్ శ్రీకారం
సాక్షి, అమరావతి: ప్రజల కష్టాలు దగ్గరి నుంచి చూశారు.. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.. కులం, మతం, రాజకీయం చూడకుండా సాయం చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే వాయు వేగంతో నిర్ణయాలు.. నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు శ్రీకారం.. విప్లవాత్మక బిల్లులతో పారదర్శక పాలన దిశగా అడుగులు.. సమాజంలో సగం ఉన్న మహిళలకు అన్నింట్లో సగం.. సచివాలయాల ద్వారా ఇంటి ముంగిటకే పాలన.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. వంద రోజుల్లో వందకు పైగా కీలక నిర్ణయాలు.. ఇదో చరిత్ర.. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ నవ చరిత్ర. ప్రజలకిచ్చిన హామీల అమల్లో నాన్చుడు లేదు.. మీన మేషాలు లెక్కించడం అసలే లేదు.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగుతోంది. కనీసం ఆరు నెలలైనా గడవందే పాలనపై ఓ అంచనాకు రావడం కష్టం. అలాంటిది కేవలం వంద రోజుల్లోనే వందకు పైగా కీలక నిర్ణయాలు తీసుకుని ‘ఇది అందరి ప్రభుత్వం’ అని నిరూపించారు. గత పాలకుల తీరుకు భిన్నంగా సీఎం వైఎస్ జగన్ వంద రోజుల పాలన ఐదు కోట్ల ప్రజానీకానికి కళ్లకు కట్టినట్లు కనిపించింది. మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్.. జూన్ 10వ తేదీన నిర్వహించిన తొలి కేబినెట్ భేటీలోనే నవరత్నాల్లో ప్రజలకిచ్చిన హామీల్లో 80 శాతం మేర అమలుకు నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తూ గ్రామ స్వరాజ్యానికి గాంధీ జయంతి రోజు నుంచి నాంది పలుకుతున్నారు. ఈ మేరకు తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే చరిత్రాత్మక చట్టాలు చేశారు. సీఎం వంద రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు ఇలా.. పింఛన్ల పెంపుపై తొలి సంతకం ► అవ్వా తాతలకు వృద్ధాప్య పింఛన్ ఏకంగా రూ. 2,250కు పెంపు. ఏటా రూ.250 చొప్పున పెంచుతూ రూ.3000 వరకు తీసుకెళ్లాలని నిర్ణయం. ► పింఛను పొందడానికి అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గింపు. దీంతో అదనంగా 5 లక్షల మందికి పైగా ప్రయోజనం. ► కిడ్నీ బాధితులకు నెలకు రూ.10 వేల పింఛన్. తలసీమియా, పక్షవాతం, మస్కులర్ డిస్ట్రాఫీ వంటి వ్యాధులకు గురైన బాధితులకు పింఛన్లు ఇచ్చే పథకంపై సమాలోచన. మహిళలకు చేయూత ► డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా.. అధికారంలోకి వచ్చేనాటి వరకు ఉన్న రుణాలకు సమానమైన సొమ్మును నాలుగు విడతల్లో అందజేయాలని నిర్ణయం. ► ఉగాది రోజు 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు. ► అక్రమ మద్యం, నాటుసారాను అరికట్టేందుకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల నియామకం. ► పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి జగనన్న అమ్మ ఒడి ద్వారా ఏటా రూ.15,000. ఇంటర్ వరకూ పథకం వర్తింపు. జనవరి 26 నుంచి అమలు రైతాంగానికి అన్ని విధాలా భరోసా ► ప్రతి రైతు కుటుంబానికి వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా (ఈ ఏడాది అక్టోబర్ నుంచే) రూ.12,500. విడతల వారీగా రూ.50 వేలు చెల్లించేందుకు నిర్ణయం. వచ్చే ఏడాది నుంచి ఖరీఫ్‌లో మాత్రమే ఇస్తారు. ► వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ లేని రుణాలు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రైతులకు ఉచితంగా 200 రిగ్గు బోర్లు. పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా. ► ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలు యూనిట్‌కు రూ.1.50కు తగ్గింపు. ► గిట్టుబాటు ధర కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు. రూ. 2000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ రద్దు. ► ప్రమాదవశాత్తూ చనిపోయిన లేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.7 లక్షల పరిహారం. ► ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డంగులు. అవసరం మేరకు çఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. ► భూ యాజమానుల హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులకు 11 నెలలు పంట మీద మాత్రమే హక్కు ఉండేలా కౌలుదార్ల చట్టం. తద్వారా వైఎస్సార్ రైతు భరోసాతో పాటు పంటల బీమా, పంటల పరిహారం అందించే ఏర్పాటు. ► జలయజ్ఞం ద్వారా సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్ణయం. గోదావరి జలాలను నాగార్జున సాగర్, శ్రీశైలంకు తరలించడం ద్వారా కృష్ణా ఆయకట్టును స్ధిరీకరిస్తూ రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించేలా ప్రణాళిక. ► సీఎం చైర్మన్‌గా వ్యవసాయ మిషన్ ఏర్పాటు. ► రైతు పండించే పంటలకు ప్రభుత్వమే బీమా చేయించి ప్రీమియం చెల్లించేలా వైఎస్సార్ ఉచిత బీమా పథకం. ► 2018 ఖరీఫ్‌లో కరువుకు సంబంధించి రైతులకు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.2,000 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ విడుదల. ► ధాన్యం సేకరణకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.960 కోట్లు చెల్లించడానికి చర్యలు. రూ.360 కోట్లు విడుదల. ► కష్టాల్లో ఉన్న శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున రూ.300 కోట్లు బోనస్‌గా విడుదల. ► ఆయిల్ పామ్ రైతులకు అదనపు మద్దతు ధర కోసం రూ.80 కోట్లు విడుదల. ► నాఫెడ్ ఏర్పాటు చేసిన 5 కొనుగోలు కేంద్రాల ద్వారా కొబ్బరికి కనీస మద్దతు ధర కోసం చర్యలు. ► తొలి ఏడాదే సహకార రంగ పునరుద్ధరణకు చర్యలు. ► గత ప్రభుత్వం విత్తన బకాయిలకు సంబంధించిన రూ.384 కోట్లు ఇచ్చేందుకు చర్యలు. ► వరదలు, భారీ వర్షాలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారానికి అదనంగా 15 శాతం ఇన్పుట్ సబ్సిడీ. ► పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం. ► కొబ్బరి తోటల సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం. సెంట్రల్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం. నాఫెడ్ సహకారంతో తూర్పుగోదావరి జిల్లాలో 5 కొనుగోలు కేంద్రాలు. మార్కెట్ సెస్ రద్దు. ఫలితంగా క్వింటాల్ రూ.8,500కు పెరిగిన కొబ్బరి ధర. కొబ్బరి పంటల బీమా ప్రీమియంలో 75 శాతం కొబ్బరి బోర్డుతో కలిసి ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం. జీతాల పెంపు ► పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.18,000కు పెంపు. ఆశా వర్కర్ల జీతాలు రూ.10 వేలకు పెంపు. ► అంగన్వాడీ వర్కర్ల జీతాలు రూ.10,500 నుంచి రూ.11,500కు పెంపు. ఆయాల జీతం రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పెంపు. ► డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్ పర్సన్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపునకు నిర్ణయం. ► గిరిజన తండాల్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల జీతాలు రూ.400 నుంచి రూ.4,000కు పెంపు ► హోంగార్డుల వేతనాలు పెంచుతూ నిర్ణయం. ఉద్యోగాలు.. ఉపాధి.. విద్య ► గ్రామ స్వరాజ్యం సాధన దిశగా అడుగులు.. గ్రామ, వార్డు సచివాలయాలకు శ్రీకారం. 4 లక్షలకుపైగా ఉద్యోగాలు.. వీటిలో శాశ్వత ప్రాతిపదికన 1లక్షా 27 వేల ఉద్యోగాలు. ► గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వలంటీర్ నియామకం. వీరి ద్వారా ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు, సేవలు అందించేందుకు శ్రీకారం. ► కాపు కార్పొరేషన్‌కు తొలి బడ్జెట్లోనే రూ.2 వేల కోట్ల నిధులు.. 5 ఏళ్లలో రూ. 10 వేల కోట్లు కేటాయింపునకు రంగం సిద్ధం. ► ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం షాపుల నిర్వహణ. మద్యం దుకాణాల్లో 16 వేల ఉద్యోగాలు. ► జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రతి పేదవాడి పెద్ద చదువుకు అయ్యే ఖర్చు కోసం 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్. ► ఇంటర్ అనంతరం ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు. ► రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో.. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు,,.. మొత్తం 25 సెంటర్లు ఏర్పాటు. ► సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం. ► దశలవారీగా ప్రతి ప్రభుత్వ పాఠశాలకూ కాంపౌండ్, టాయ్లెట్లు, మంచినీటి సదుపాయం, ఫర్నిచర్, బ్లాక్‌బోర్డ్, పాఠశాల భవనాలకు మరమ్మతులు, పెయింట్లు వేయించటం వంటి చర్యలతో పాఠశాలలన్నింటి రూపురేఖల్ని మార్చేందుకు బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయింపు ► ఉద్యోగాలకు ఉపయోగపడేలా చదువుల ప్రణాళికను మార్చాలని నిర్ణయం. తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా ప్రతి స్కూల్లో ఇంగ్లిష్ మీడియం. ► పాఠశాలల్లో విద్యార్థుల మానసిక ఉల్లాసానికి శనివారం నో బ్యాగ్ డే ప్రజా సొమ్ము ఆదా ► వివిధ ప్రభుత్వ శాఖల్లో రూ. కోటి దాటిన కొనుగోళ్లన్నింటిలో పారదర్శకత పెంచేలా ఆన్లైన్లోనే టెండర్లు. కొనుగోలు చేయాల్సిన వస్తువుల నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించి, మునుపటి రేట్ల కంటే తక్కువకు సరఫరా చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారికే అవకాశం. ► గత ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్నవారికి, కాంట్రాక్టర్లకు ఏటీఎం మిషన్‌గా మారిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రీటెండరింగ్ ► రూ.100 కోట్లు దాటిన కాంట్రాక్టులన్నింటినీ జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపేలా చట్టం. కీలక బిల్లులు.. చట్టాల సవరణ ► 45 ఏళ్లు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు వచ్చే ఏడాది నుంచి ఆయా కార్పొరేషన్ల ద్వారా నాలుగు విడతల్లో మొత్తంగా రూ.75 వేలు ఆర్థిక సాయం. ► కబ్జాలు, దందాలు, అవకతవకలకు విరుగుడుగా భూమి మీద నిజమైన హక్కు ఉన్న వారికి న్యాయం జరిగేలా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ – 2019 బిల్లు ఆమోదం. అత్యాధునిక విధానంలో సమగ్రంగా భూముల సర్వే. ► రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో భాగంగా వ్యవసాయ మార్కెట్లను పటిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టం సవరణ బిల్లు ఆమోదం. ► మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం. ఇందులో నలుగురు డిప్యూటీ సీఎంలు. ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు. ► శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు. ► ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. ► పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు. ► దశల వారీగా మద్య నిషేధం దిశగా.. మద్య నియంత్రణ చట్ట సవరణ. బెల్టు షాపులు పూర్తిగా ఎత్తివేత. తగ్గిన మద్యం వినియోగం. ► ఆలయ పాలక మండళ్లలో (టీటీడీ మినహా) 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు. ► ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఏర్పాటుకు ఆమోదం. ► పాఠశాల విద్య, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటు బిల్లులు –2019కు ఆమోదం. ► గిట్టుబాటు ధర కల్పించేందుకు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో గౌరవ చైర్మన్లుగా స్థానిక ఎమ్మెల్యేల నియామకం. అందరికీ వైద్యం.. అదే ధ్యేయం ► ప్రపంచంలోనే రోల్ మోడల్‌గా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలు. రూ.1000 బిల్లు దాటినట్టయితే, వార్షిక ఆదాయం రూ.5 లక్షలు లోపు ఉన్న అన్ని వర్గాల వారికి పథకం వర్తింపు. 2031 జబ్బులకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో చికిత్స చేయించుకున్నా వర్తింపు. ► అధునాతన సౌకర్యాలతో 108, 104 అంబులెన్స్‌లు.. కొత్త వాహనాలు కొనుగోలు. ► రెండేళ్లలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు చర్యలు. ► శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, చుట్టుపక్కల గ్రామాల కిడ్నీ బాధితుల కోసం.. 200 పడకలతో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ఉత్తర్వులు (రూ. 50 కోట్లు తక్షణ కేటాయింపు) ► డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు (అక్టోబరు 10 నుంచి అమలు) కార్యక్రమం కింద ఉచితంగా కంటి పరీక్షలు. ► రాష్ట్రంలోని 7 ఐటీడీఏల్లో (గిరిజన ప్రాంతాలు) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు నిర్ణయం. ► విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు, కడపలో క్యాన్సర్ ఆసుపత్రుల ఏర్పాటు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ ఆసుపత్రులు. ► పాడేరు, విజయనగరం, పల్నాడులో మెడికల్ కాలేజీల ఏర్పాటు పారదర్శక పాలన ► అవినీతి, పైరవీలకు తావు లేని ఇసుక విధానం.. ప్రజల సమస్యల పరిష్కారానికి ‘స్పందన’. చిన్న చిన్న సమస్యలకు 72 గంటల్లోనే పరిష్కారం. ► ‘స్పందన’లో వచ్చిన అర్జీలపై ప్రతి మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష.. ► ప్రజా సమస్యలపై సోమ, మంగళవారాల్లో కలెక్టర్లు, ఎస్పీలు తమ పరిధిలోని అధికారులతో భేటీ ► ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి కేబినెట్ ఆమోదం. ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు చర్యలు. ► రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్. సీపీఎస్ రద్దుకు నిర్ణయం. ► అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.1,150 కోట్లు ► వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్‌కు ఈ ఏడాది డిసెంబరు 26న శంకుస్థాపన. ► పారిశ్రామిక పెట్టుబడుల కోసం.. అవినీతికి తావులేని, పారదర్శకమైన ఇండస్ట్రీయల్ పాలసీ. రాష్ట్రంలో కొత్తగా మరో 4 పోర్టులు, ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు చర్యలు. అవినీతి, లంచగొండితనం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా అడుగులు. ► అక్రమ నిర్మాణాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం. ► అమరావతిలో గత ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్‌పై వాస్తవాల వెలికితీతకు చర్యలు ► గత ప్రభుత్వం దోపిడీకి సంబంధించి 30 అంశాల్లో విచారణకు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు. ► గ్రామాల్లో 11,158 సచివాలయాలు, పట్టణాల్లో 3,768 వార్డు సచివాలయాల ఏర్పాటు. ప్రజాభ్యుదయమే లక్ష్యం ► ఉద్దానం కిడ్నీ వ్యాధుల కోసం రూ.600 కోట్లతో మంచినీటి పథకం. ► విశాఖ ఏజెన్సీలో గిరిజనుల హక్కులకు అగ్ర తాంబూలం.. బాక్సైట్ తవ్వకాలకు నో. ► రేషన్ కార్డుల ద్వారా 5, 10, 15 కిలోల బ్యాగుల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ. ► దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా పోలీసులకు వీక్లీ ఆఫ్.. ఫ్రెండ్లీ పోలీసింగ్. ► షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం. ► ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పరిమితి 100 నుంచి 200 యూనిట్లకు పెంపు ► చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేలు ఆర్థిక సాయం. డీజిల్‌పై ఇస్తున్న సబ్సిడీ లీటరుకు రూ.6 నుంచి రూ.9కి పెంపు. ► సొంత ఆటో, ట్యాక్సీ నడిపేవారికి మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ అవసరాల కోసం రూ.10 వేలు ఆర్థిక సాయం ► మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం. ► వైఎస్సార్ కళ్యాణ కానుక కింద.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని యువతులు వివాహాలకు రూ.లక్ష ఆర్థిక సాయం. బీసీ యువతుల వివాహాలకు రూ.50 వేలు. ► ప్రమాదవశాత్తు పెద్ద దిక్కును కోల్పోయిన గిరిజన కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకం కింద రూ.5 లక్షలు ఆర్థిక సాయం. ► క్రీడాకారులకు ప్రోత్సాహకాలు. ► ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు మూడు దశల్లో వాటర్ గ్రిడ్ పథకాలు. ► ముస్లింలు, క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో వెళ్లే హజ్, జెరూసలెం యాత్రలకు ప్రభుత్వం ఇచ్చే సాయం పెంపు. ఇమామ్, మౌజమ్, పాస్టర్లకు గౌరవ వేతనాల పెంపు. ► ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు బడ్జెట్లో నిధుల కేటాయింపు. -
ఆధార్.. బేజార్!
ప్రభుత్వ పథకాలను పొందడానికి, ఉద్యోగాలకు, స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్, విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్టులు.. ఇలా సేవలకు ఆధార్‌కార్డే ఆధారంగా మారింది. జిల్లాలో గతంలో చేసిన ప్రజాసాధికార సర్వేలో ఆధార్ అప్డేట్ చేయకపోవడం వల్ల సమస్యలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం రేషన్‌కార్డు పొందాలన్నా, మార్చుకోవాలన్నా, రేషన్ సరుకులు పొందాలన్నా ఆధార్ అనుసంధానం తప్పనిసరి అయ్యింది. ప్రజలు తమ కుటుంబంలోని సభ్యుల ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవడానికి వారం రోజులుగా ముప్పుతిప్పలు పడుతున్నారు. ఆధార్ అనుమతి ఉన్న మీ–సేవ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండితిప్పలు మాని బారులు తీరుతున్నారు. ఈ సమస్య జిల్లాలో ప్రస్తుతం అధికంగా కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. సాక్షి, చిత్తూరు : ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోంది. నవరత్నాల నినాదంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు సంక్షేమ పథకాలను తెరపైకి తెచ్చారు. ఆ పథకాలు దక్కాలంటే ప్రజాసాధికార సర్వే చేయించుకోవాల్సిందే. గత సర్కారు చేసిన ప్రజాసాధికార సర్వేలో జరిగిన లోపాల వల్ల ప్రస్తుతం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఇంటింటికి వెళ్లి సర్వే చేసిన బృందం నిర్లక్ష్యంగా ప్రజాసాధికార సర్వే చేయడం వల్ల చాలామంది పేర్లు అప్డేట్ కాలేదు. ప్రభుత్వ పథకాలను పొందాలంటే ముఖ్యంగా రేషన్‌కార్డు ఉండి తీరాల్సిందే. ఆ రేషన్‌కార్డు ఆధార్‌తో అనుసంధానం కాకపోతే ప్రభుత్వ పథకాలకు అనర్హలవుతారు. దీంతో జిల్లాలోని ప్రజలు తమ పేర్లను అనుసంధానం చేసుకోవడానికి ఆధార్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. జిల్లా యంత్రాంగం ఫెయిల్ ఆధార్ అనుసంధానం చేసుకోవాలంటే అనుమతి ఉన్న మీ–సేవ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసులకెళ్లి సేవలు పొందవచ్చు. అయి తే జిల్లాలో అలాంటి పరిస్థితులు కనబడడం లేదు. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ప్రజలకు ఆధార్ అనుసంధాన సేవలు అందించకపోవడంతో ప్రజలు మీ–సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నిత్యం ఆధార్ సేవలు అందించాలని నిబంధనలు చెబుతున్నాయి. వారు పట్టించుకోకపోవడం వల్ల జిల్లాలో ఆధార్ అనుసంధాన ప్రక్రియ సమస్య రోజురోజుకు తీవ్రతరమవుతోంది. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టడంలో విఫలమైందని ఆరోపణలున్నాయి. బ్యాంకు, పోస్టాఫీసు, మీ–సేవ, ఆధార్ కేంద్రాల ప్రతినిధులతో జిల్లా ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి ప్రత్యామ్నాయ చర్యలు చేయాల్సి ఉన్నా, అలా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పరికరాలు నిల్ ఆధార్ అనుసంధానం కోసం జిల్లాలోని తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాలకు, రేషన్ షాపులకు ప్రజలు వెళుతున్నారు. అయితే అక్కడ ఆధార్ అనుసంధానానికి తగిన పరికరాలు లేకపోవడంతో ప్రజలను మీ–సేవ కేంద్రాలకు వెళ్లండని పంపేస్తున్నారు. సర్వర్ స్లో, చిన్నపిల్లలకు, వృద్ధులకు వేలిముద్రలు పడకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఆ సమస్యకు ప్రత్యామ్నాయ సేవలు అందించా లంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఐరిష్ యంత్రాలు తప్పనిసరి. జిల్లాలోని తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో ఐరిష్ యంత్రాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. రేషన్‌షాపుల్లో ఐరిష్ యంత్రాలున్నా అవి పనిచేయడం లేదు. అవగాహన లోపంతో అవస్థలు ఆధార్ అనుసంధానం చేసుకోవాలంటే ప్రభుత్వ, మీ–సేవ కేంద్రాలే కాదు.. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కూడా సంప్రదించవచ్చు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో వారు నానా అవస్థలు పడుతున్నారు. తిరుపతి అర్బన్ పరిధిలో తిరుపతి నార్త్ చీఫ్ పోస్ట్‌మాస్టర్, ఎస్వీ యూనివర్శిటీ వద్ద ఉన్న చీఫ్ పోస్టుమాస్టర్, తిరుపతి హెడ్ పోస్టాఫీసు, తిరుపతిలోని ఎన్సీపీ కాలనీలో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ ఈఎస్డీ, ఎస్వీ యూనివర్శిటీ రోడ్డులో డైరెక్టరేట్ ఆఫ్ ఈఎస్డీ, బైరాగ పట్టెడలో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ ఈఎస్డీ, బాలాజీ కాలనీలోని ఆంధ్రాబ్యాంకు, శ్రీదేవి కాంప్లెక్స్ వద్దనున్న ఆంధ్రాబ్యాంకు, ఖాదీ కాలనీలోని ఆంధ్రాబ్యాంకు తదితర చోట్ల ఆధార్ అనుసంధాన సేవలు పొందవచ్చు. -
పేదింటి కల.. సాకారం ఇలా..
గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు.. పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు స్థలం పట్టణాల్లో జీ ప్లస్ 3.. ఎకరంలో 100 యూనిట్లు మహిళల పేరుపై ఉగాది పండుగ రోజు పట్టాల పంపిణీగ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక.. లబ్ధిదారుల ముసాయిదా జాబితా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రచురణ తహసీల్దారు, మున్సిపల్ కమిషనర్ ద్వారా జాబితాకు జిల్లా కలెక్టర్ల ఆమోదం ఇప్పటికే అందుబాటులో 11 లక్షల మందికి ఇళ్ల స్థలాలు సంప్రదింపులు లేదా భూసేకరణ ద్వారా మరో 14 లక్షల మందికి అవసరానికి మించి ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న భూముల వినియోగం గతంలో ఇచ్చిన స్థలాలు ఉపయోగించుకోకపోతే స్వాధీనంమార్గదర్శకాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని నవరత్నాల్లో భాగమైన పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణతో కూడిన మార్గదర్శకాలను ప్రకటించింది. వచ్చే ఉగాది పండుగ రోజు అర్హులైన 25 లక్షల మంది పేదలందరికీ ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అందుకు అనుగుణంగా ఈ పథకాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక, అవసరమైన స్థలాల గుర్తింపు, సేకరణ తదితర అంశాలతో విధాన పరమైన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ జారీ చేశారు. కుల, వర్గ, మతాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందు కోసం ఇప్పటి నుంచే అవసరమైన స్థలాలను గుర్తించడం, సేకరించడం, లబ్ధిదారుల ఎంపిక ప్రాతిపదిక, అర్హతలు, పథకం అమలుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఇల్లు లేని పేదలందరికీ పక్కా గృహాలను దశల వారీగా నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఉగాది రోజు అర్హులైన 25 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 11 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరో 14 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి అవసరమైన భూములను గుర్తించాలని నిర్ణయించారు. ఇళ్ల స్థలాలకు అవసరమైన భూమి గుర్తింపు ఇలా.. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ జిల్లా కలెక్టర్లు గుర్తించాలి ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థలు అవసరానికి మించి భూములు కలిగి ఉంటే గుర్తించి, ఇళ్ల స్థలాలకు అనువుగా ఉంటే నిబంధనల మేరకు స్వాధీనం చేసుకోవాలి. చిన్న చిన్న వివాదాల్లో ఉన్న సీలింగ్ భూములు, ఇనామ్, ఎస్టేట్, ఎల్టీఆర్ భూములను గుర్తించి వివాదాలను పరిష్కరించి కొద్ది నెలల్లోనే స్వాధీనం చేసుకోవాలి. ఇళ్ల స్థలాలకు అనువుగా ఉన్న ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కుల కోసం అభివృద్ధి చేసిన భూములను పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగించాలి. ల్యాండ్ పూలింగ్ స్కీము కింద భూములు అందుబాటులో ఉంటే స్వాధీనం చేసుకోవాలి. గ్రామ కంఠంలో అర్హులైన లబ్ధిదారులకు సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణాలకు అనుమతిస్తూ పొజిషన్ సర్టిఫికెట్ జారీ చేయాలి. గతంలో వివిధ శాఖలు ఇళ్ల స్థలాలను మంజూరు చేసినప్పటికీ నిర్మాణాలు చేయకుండా ఖాళీగా ఉంటే అలాంటి స్థలాలను గుర్తించి నిబంధనల మేరకు స్వాధీనం చేసుకోవాలి. ఇల్లు లేని పేదల కోసం ఎవరైనా భూములను దానం చేసేందుకు ముందుకు వస్తే అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. సంప్రదింపులు లేదా భూ సేకరణ ద్వారా జిల్లా కలెక్టర్లు అవసరమైన భూములను తీసుకోవాలి. ఇతర ప్రత్యామ్నాయాలు లేని పక్షంలోనే అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని నిబంధనల మేరకు పరిహారం చెల్లించాలి. గ్రామ, పట్టణ యూనిట్‌గా తగిన ఇళ్ల స్థలాలను గుర్తించాలి. గుర్తించిన ఇళ్ల స్థలాలను జిల్లా కలెక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ శాఖకు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ శాఖలకు స్వాధీనం చేయాలి. స్వాధీనం చేసుకున్న స్థలాల్లో ఎటువంటి జాప్యం లేకుండా గృహ నిర్మాణ శాఖ, మున్సిపల్ శాఖ నిబంధన మేరకు లేఅవుట్స్‌ను రూపొందించాలి. ల్యాండ్ సర్వే, సబ్ డివిజన్స్ లే అవుట్ అండ్ పెగ్ మార్కింగ్‌లో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ సహకారం అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల స్థలాలను చదును చేసేందుకు ఉపాధి హామీ నిధులను వినియోగించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను చదును చేసేందుకు పట్టణ స్థానిక సంస్థలు, ఏపీటీఐడిసీవో, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలి. భూ సేకరణ పరిహారం చెల్లించేందుకు, లే అవుట్స్ రూపకల్పన, వ్యక్తిగత ప్లాటింగ్, ఇతర కార్యకలాపాలకు అవసరమైన నిధులను బడ్జెట్ నుంచి రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్లకు సమకూరుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అలాంటి వాటిని రద్దు చేసి అర్హులైన ఇతరులకు కేటాయించాలి. పర్యవేక్షణకు మూడు కమిటీలు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం అమలును రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించేందుకు డిప్యూటీ సీఎం (రెవెన్యూ) అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో మున్సిపల్, గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్, మున్సిపల్ పట్టణాభివృద్ది కార్యదర్శి, సీసీఎల్ఏ లేదా ప్రత్యేక సీఎస్, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సభ్యులుగా ఉంటారు. సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయిలో సంబంధిత శాఖల మధ్య సమన్వయం కోసం రెవెన్యూ శాఖ (ల్యాండ్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి సభ్యులుగా సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్ సభ్య కన్వీనర్‌గా కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో కార్యక్రమం అమలు పర్యవేక్షణకు జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కో–చైర్మన్‌గా జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాయింట్ కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈవో, గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, జిల్లా పంచాయతీ ఆఫీసర్, జిల్లా రిజిస్ట్రార్, గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుగా అవసరమైన సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, డేటా సేకరణకు సాంకేతిక సహాయాన్ని ఐటీ శాఖ రియల్ టైమ్ గవర్నెన్స్ అందిస్తాయి. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. సమన్వయ బాధ్యతలను డిప్యూటీ కలెక్టర్‌కు అప్పగిస్తారు. ఈ కార్యక్రమం అమలు తీరుపై జాయింట్ కలెక్టర్ తరచూ సీసీఎల్ఏకు నివేదిక పంపించాలి. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల అర్హతలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు తెల్ల రేషన్ కార్డు ఉండాలి. లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇళ్ల స్థలం ఉండరాదు. కేంద్ర, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల కింద గతంలో లబ్ధిదారులుగా ప్రయోజనం పొంది ఉండరాదు. రెండున్నర ఎకరాలకుపైగా మాగాణి లేదా ఐదు ఎకరాలకు పైగా మెట్ట భూమి ఉండరాదు. లబ్ధిదారుల అనుమతితోనే ఆధార్, ఇతర వివరాలు సేకరించాలి. పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల అర్హతలు లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇళ్ల స్థలం ఉండరాదు. కేంద్ర, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల కింద గతంలో లబ్ధిదారులుగా ప్రయోజనం పొంది ఉండరాదు. రెండున్నర ఎకరాలకు పైగా మాగాణి లేదా ఐదు ఎకరాలకు పైగా మెట్ట భూమి ఉండరాదు. వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయలకు మించ రాదు. లబ్ధిదారుల అనుమతితోనే ఆధార్, ఇతర వివరాలు సేకరించాలి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇలా.. గ్రామ, పట్టణ యూనిట్‌గా గ్రామ, వార్డు స్థాయిలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు. అర్హత నిబంధనల మేరకు దరఖాస్తులను గ్రామ, వార్డు వలంటీర్లు పరిశీలిస్తారు. అర్హత గల లబ్ధిదారుల ముసాయిదా జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రచురిస్తారు. ముసాయిదా జాబితాలో లబ్ధిదారులపై అభ్యంతరాలను, క్లెయిమ్‌లను స్వీకరిస్తారు. అభ్యంతరాలను, క్లెయిమ్‌లను పరిగణనలోకి తీసుకుంటూ గ్రామ, వార్డు సభలను నిర్వహించి తుది జాబితాలను ఖరారు చేస్తారు. తుది జాబితాలను గ్రామీణ ప్రాంతాల్లో తహసీల్దార్ల ద్వారా, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ల ద్వారా జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపుతారు. జిల్లా కలెక్టర్లు ఆమోదించిన లబ్ధిదారుల జాబితాలను తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రచురిస్తారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, క్లెయిమ్‌లు ఉంటే సంబంధిత తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు జిల్లా కలెక్టర్ల అనుమతితో పరిష్కరిస్తారు. మార్గదర్శకాలు ఇవీ.. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు 1.5 సెంట్ల ఇంటి స్థలం ఇస్తారు. వచ్చే ఏడాది ఉగాది పండుగ రోజు మహిళల పేరు మీద పట్టాలను పంపిణీ చేస్తారు. వ్యక్తిగత లబ్ధిదారులు ఆ స్థలాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు గృహ నిర్మాణ శాఖ అందుబాటులో ఉన్న పథకాల కింద దశల వారీగా నిధులు మంజూరు చేస్తుంది. పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్ 3 విధానంలో ఇళ్ల నిర్మాణం చేపడతారు. ఎకరంలో 100 యూనిట్లు నిర్మిస్తారు. ఇందులో భాగంగా పట్టణ లబ్ధిదారులకు ఒక సెంటు చొప్పున కేటాయిస్తూ మహిళల పేరు మీద ఉగాది రోజున పట్టాలు పంపిణీ చేస్తారు. వ్యక్తిగత లబ్ధిదారులందరి ప్లాట్లకు 11 అంకెలతో విశిష్ట భూధార్ నంబర్ ఇస్తారు. -
కొలువుల కొలుపు
జిల్లాలో కొలువుల జాతర మొదలైంది. సర్కార్ ఉద్యోగాల కోసం ఐదేళ్ల పాటు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన నిరుద్యోగుల్లో కొత్త ప్రభుత్వం నూతనోత్తేజాన్ని నింపింది. సర్కార్ చేపట్టే సంక్షేమ ఫలాలను పకడ్బందీగా అమలు చేసేందుకు అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాలను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇందుకు సంబంధించి దేశంలో తొలిసారిగా వేలాది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు రెగ్యులర్ విధానంలో భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేలాది ఉద్యోగాలు తమ కళ్ల ముందు కనిపిస్తుండడంతో నిరుద్యోగులు వీటిని సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రేయింబవళ్లు చదవడమే కాకుండా పోటీ పరీక్షల్లో నెగ్గేందుకు అవసరమైన శిక్షణ కోసం కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి సైతం వచ్చి శిక్షణ పొందుతున్నారు. దీంతో నెల్లూరులోని కోచింగ్ సెంటరులన్నీ నిరుద్యోగులతో కళకళలాతున్నాయి. సాక్షి, నెల్లూరు (టౌన్): ప్రభుత్వ పౌర సేవలు అత్యున్నతంగా అందించడానికి గ్రామ సచివాలయాలు వ్యవస్థను పటిష్టంగా అమలు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో త్వరలో గ్రామ ముఖచిత్రం మారనుంది. స్థానిక సంస్థలకు పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వాలని దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 73, 74 రాజ్యాంగ సవరణల్లో పేర్కొన్నారు. కానీ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయడం లేదు. స్వాతంత్య్ర భారతదేశంలో తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇందుకు నడుం బిగించింది. అందులో భాగంగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పోస్టులు భర్తీకి శ్రీకారం చుట్టారు. ఇవి భర్తీ అయితే ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా పోతుంది. తమ గ్రామాల్లోనే అవసరమైన పనులు చేసుకోవచ్చు. ప్రజల వినతులకు జవాబుదారీతనం ఉంటుంది. జిల్లాలో 7,814 పోస్టులు నవరత్నాల హామీలు అమలులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటికే గ్రామ, వార్డు వలంటీర్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం శాశ్వత ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఒకేసారి రాష్ట్రంలో 1.29 లక్షల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగా జిల్లాలో 7,814 పోస్టులు భర్తీ కానున్నాయి. మూడు కేటగిరీల్లో భర్తీ కానున్న ఈ పోస్టుల కోసం నిరుద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జిల్లాలో పోస్టుల వివరాలు పంచాయతీ సెక్రటరీలు–472, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు–250, మహిళా పోలీసు–925, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్–232, విలేజ్ సర్వేయర్–665, ఇంజినీరింగ్ అసిస్టెంట్–665, వార్డు ఎమినిటీస్–260, విలేజీ అగ్రికల్చరల్ అసిస్టెంట్–537, విలేజీ హార్టికల్చరల్–159, ఏనిమల్స్ హజ్బెండరీ–626, ఏఎన్ఎం–850, విలేజీ ఫిషరీస్–75, డిజిటల్ అసిస్టెంట్–665, విలేజీ సెరీకల్చర్–3, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్–171, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ–260, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ–163, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ–171 పోస్టులు ఉన్నాయి. కోచింగ్ సెంటర్లు కళకళ ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో కోచింగ్ సెంటర్లు కళకళలాడుతున్నాయి. జిల్లాలో 15 కోచింగ్ సెంటర్లకు పైగా ఉన్నాయి. ఉద్యోగాల సాధనకు జిల్లా నుంచే కాకుండా తిరుపతి, శ్రీకాళహస్తి, కందుకూరు తదితర ప్రాంతాల నుంచి కోచింగ్ సెంటర్లకు విద్యార్థులు వస్తున్నారు. ఈ పోస్టులన్నీ 3 కేటగిరీల్లో భర్తీ కానుండడంతో ఎలాగైనా ఉద్యోగం పట్టాలనే కృతనిశ్చయంతో కోచింగ్‌కు సిద్ధమయ్యారు. ఒక్కొక్కరి నుంచి రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. వీరికి నెల పాటు కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ అవకాశం ముందెన్నడూ రాదన్న ఆలోచనతో వేల సంఖ్యలో అభ్యర్థులు ఉద్యోగాలు పొందేందుకు కోచింగ్ సెంటర్లకు క్యూ కట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు హాస్టల్స్‌లో ఉంటూ చదువుకుంటున్న పరిస్థితి ఉంది. 150 మార్కులకు ప్రశ్నపత్రం ఈ ఉద్యోగాల భర్తీకి ఐఐటీ నుంచి డిగ్రీ, బీటెక్ వరకు చదువుకున్న వారు అర్హులు. కేటగిరీ–1లో మొదటి పేపరు 75, రెండో పేపరు 75 కలిపి మొత్తం 150 మార్కులకు జనరల్ స్టడీస్ ఉంటుంది. కేటగిరీ–2, కేటగిరీ–3లో మొదటి పేపరులో జనరల్ స్టడీస్ 50 మార్కులకు, సబ్జెక్ట్‌కు సంబంధించి 100 మార్కులు ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు ఉంటుంది. అయితే ఈ పరీక్ష విధానంలో మైనస్ మార్కులు ఉంటాయి. ప్రతి 4 తప్పులకు ఒక మార్కును తగ్గిస్తారు. ఉద్యోగాలకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సు 42 ఏళ్ల లోపు వారు అర్హులు. ఉద్యోగాల్లో స్థానికతకు ప్రాధాన్యం ఇచ్చారు. మెరిట్ ప్రాతిపదికగా స్థానికులకు 80 శాతం, స్థానికేతరులకు 20 శాతం ఉద్యోగాలు కల్పిస్తారు. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. పోస్టును బట్టి వేతనం రూ.14,600 నుంచి రూ.44,870 వరకు చెల్లించనున్నారు. మహిళలకు సువర్ణావకాశం గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగాలతో మహిళలు పండగ చేసుకుంటున్నారు. చరిత్రలో వారికి ఉద్యోగ కల్పనలో సువర్ణవకాశం లభించింది. ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టుల్లో ఏఎన్ఎం, మహిళా పోలీసు వలంటీర్, సంక్షేమ సహాయకుల పోస్టులను పూర్తిగా కేటాయించారు. వీటితో పాటు మిగిలిని అన్ని ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ ఉంది. దీంతో పాటు ఓపెన్ కేటగిరీల్లోనూ మహిళలు పోటీ పడవచ్చు. చాలా ఆనందంగా ఉంది పెద్ద మొత్తంలో పోస్టులు భర్తీ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు. కొద్దిగా కష్టపడితే ఉద్యోగాన్ని పొందవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. – తిరుపతి రవికుమార్, దగదర్తి మహిళలకు మంచి అవకాశం సచివాలయ ఉద్యోగాల భర్తీలో మహిళలకు మంచి అవకాశాలు కల్పించారు. ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా మహిళలకు ఎన్నో ఉద్యోగావకాశాలు కల్పించారు. మహిళలకు ఇది సువర్ణావకాశం. – జి.లీనా, నెల్లూరు పోస్టుల భర్తీ అభినందనీయం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 1.29 లక్షల ఉద్యోగాలు కల్పించడం అభినందనీ యం. ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. దేశ చరిత్రలో ఇన్ని ఉద్యోగాలు ఎప్పు డూ కల్పించలేదు. – ఎస్.బ్రిజిత, చిల్లకూరు చరిత్రలో సువర్ణాధ్యాయం దేశ చరిత్రలో ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పించడం సువర్ణాధ్యాయం. పోస్టుల భర్తీ వల్ల వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గ్రామ సచివాలయాల వల్ల మండల కార్యాయాలకు వెళ్లకుండా గ్రామ పరిధిలోనే సమస్యలను పరిష్కరించకోవచ్చు. – హరిబాబు, శ్రీహర్ష కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు లక్షలాది నిరుద్యోగులకు లబ్ధి ఉద్యోగాల భర్తీతో లక్షల మంది నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఏ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని చేపట్టలేదు. ఇదో మంచి అవకాశం. ఉద్యోగాలకు ఎంపికైన వారిని రెండేళ్లలో రెగ్యులర్ చేస్తామని చెప్పడం అభినందనీయం. – షణ్ముఖాచారి, శ్రీహర్ష కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు -
పార్టీలకు అతీతంగా నవరత్నాలు : బుగ్గన
సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తామని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. శనివారం కర్నూల్లో జిల్లాలో పర్యటించిన ఆయన.. మీడియా సమావేశంలో మాట్లాడారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మహిళలను పెద్ద ఎత్తున మోసం చేశారని విమర్శించారు. రుణాలు మాఫీ చేయకుండా అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసిం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని బుగ్గన మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో త్వరలోనే మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తామని మంత్రి తెలిపారు. -
అసెంబ్లీలో వీడియో.. బాబు డొల్లతనం బట్టబయలు!
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసి.. తానే అడ్డంగా బుక్ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు సంబంధించి పెన్షన్ ప్రకటనపై ఓ పేపర్ కటింగ్‌ను చూపిస్తూ.. ఆ పార్టీ నేతలు రాద్ధాంతం చేశారు. ఇదే అంశంపై అధికార పక్ష సభ్యులు పదే పదే వివరణ ఇచ్చినా.. స్వయంగా వైఎస్సార్సీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను సభలో చదివి వినిపించినా.. దీనికి సంబంధించిన వీడియోను రెండుసార్లు చేసినా చంద్రబాబు అదే అంశాన్ని లేవనెత్తారు. ఈ విధంగా పూర్తి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఒక పేపర్ కటింగ్‌పై ఇంత రాద్ధాంతం చేయడం సరికాదని సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కూడా సూచించారు. అయినా, చంద్రబాబు తీరు మారకపోవడంతో.. సభా నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించుకొని.. ఈ విషయమై పూర్తి స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్ష నేత చూపిస్తున్న పేపర్ కటింగ్ 18-10-2017నాటిదని, ఈ అంశంపై పూర్తి స్పష్టత ఇస్తూ.. 2018 సెప్టెంబర్ మూడో తేదీన విశాఖపట్నం మాడుగుల నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతుండగా.. వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రకటించిన విషయాన్ని సీఎం సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సభాపతి అనుమతితో సభలో ప్లే చేయించారు. ఈ వీడియోతో చంద్రబాబు డొల్లతనం బట్టబయలు అయింది. వీడియోలో ఏముందంటే.. పాదయాత్రలో భాగంగా మాడుగుల నియోజకవర్గంలో కే.కోటపాడులో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు పెన్షన్ పథకం స్థానంలో వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రకటించారు. ఆయన ఏమన్నారంటే.. ‘మేం అధికారంలోకి వచ్చాక అమలు చేయబోయే నవరత్నాల్లో ఇది. నాన్నగారు కలలు కన్నట్టు ప్రతి అక్కా, ప్రతి చెల్లె లక్షాధికారి కావాలి. వారు సంతోషంగా ఉండాలి. వారు సంతోషంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది. ఇల్లు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే వ్యక్తిని నేను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అక్కలు అనారోగ్యం కారణంగా, మరో కారణంగానో వారం రోజులు పనులకు వెళ్లకపోతే.. వారు ఇంట్లో పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలో ఆ వర్గాల అక్కలకు తోడుగా ఉండాలని 45 ఏళ్లుకు పెన్షన్ ఇవ్వాలని నేను చెబితే.. 45 ఏళ్లకే అక్కలకు పెన్షన్ ఏమిటని కొందరు వెటకారం చేశారు. వెటకారం చేస్తూ వారు చేసిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకొని వైఎస్సార్ చేయూత అనే కొత్త పథకానికి నాందిపలుకుతున్నాం. 45 ఏళ్లు దాటిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కలకు, ప్రతి కుటుంబానికి అక్షరాల 75వేల రూపాయలు ఉచితంగా ఇస్తాం. రెండో ఏడాది నుంచి దశలవారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా పూర్తి పాదర్శకతతో, ఏమాత్రం అవినీతి తావు లేకుండా.. ప్రతి అక్కకు అందేవిధంగాచూస్తాం’ అని వైఎస్ జగన్ వీడియోలో తెలిపారు. ఈ వీడియోలో ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ.. ఇందులో వక్రీకరణకు తావులేనప్పటికీ.. ఈ అంశాన్ని పట్టుకొని విలువైన సభా సమయాన్ని ప్రతిపక్ష సభ్యులు వృధా చేస్తున్నారని వైఎస్ జగన్ సభలో పేర్కొన్నారు. ఈ విషయంలోనూ రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని, ఇటువంటి పెద్ద మనిషి ఈ శాసనసభలో ఉండటం నిజంగా బాధపడాల్సిన విషయమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ అంశానికి ఫుల్స్టాప్ పెట్టి.. కీలక బిల్లులపై చర్చ చేపట్టాలని సభాపతిని కోరారు. చదవండి: ఈర్ష్యా, ఆక్రోషంతోనే బాబు దిగజారుడు ప్రవర్తన! అధ్యక్షా.. ఈ పక్కన సౌండ్ ప్రూఫ్ గోడ కట్టండి! అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ -
ఈర్ష్యా, ఆక్రోషంతోనే బాబు దిగజారుడు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు మేలు చేకూర్చే చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతుండటంతో తమ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ఆక్రోశంతో, ఈర్ష్యతో చంద్రబాబు దిగజారి వ్యవహరిస్తున్నారని సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు చూపిస్తున్న పేపర్ కటింగ్‌ను స్వయంగా పరిశీలించి.. దానిపై సభా నాయకుడు వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష నేత చూపిస్తున్న పేపర్ కటింగ్ 18-10-2017నాటిదని, ఈ అంశం మీద స్పష్టత ఇస్తూ.. 2018 సెప్టెంబర్ మూడో తేదీన విశాఖపట్నం మాడుగుల నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతుండగా.. వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రకటించిన విషయాన్ని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. ఏ నేపథ్యంలో వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రకటించామో కూడా పాదయాత్రలోనే వివరంగా ప్రజలకు తెలిపినట్టు వెల్లడించారు. పాదయాత్ర సందర్భంగా కనీసం ఓ పది సమావేశాల్లో ఈ విషయమై స్పష్టంగా ప్రజలకు చెప్పామన్నారు. రెండు నెలలపాటు జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని స్పష్టం చేశారు. వైఎస్సార్ చేయూత పథకాన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ వివరంగా చేర్చిన విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను చంద్రబాబు అధికకారంలో ఉన్నప్పుడు ఏ రోజు పట్టించుకోలేదని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బడుగు, బలహీనవర్గాల గురించి ఆలోచించామని, మొట్టమొదటి శాసనసభలోనే వారి గురించి చరిత్రాత్మక చట్టాలను తీసుకొస్తున్నామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా నామినేషన్ పనుల్లో, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని పునరుద్ఘాటించారు. అందులోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తూ.. 50శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఉండేలా నిర్ణయం తీసుకున్నామని, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉద్యోగాలు కల్పించేందుకు పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించామని వెల్లడించారు. బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన ఈ బిల్లులతో ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న దుర్బుద్ధితో చంద్రబాబు నిన్నటి నుంచి సభను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. చదవండి : అసెంబ్లీలో వీడియో.. బాబు డొల్లతనం బట్టబయలు! అబద్ధాలు ఆడటం మాకు తెలియదు: సీఎం జగన్ అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ అధ్యక్షా.. ఈ పక్కన సౌండ్ ప్రూఫ్ గోడ కట్టండి! -
ప్రజా సంకల్ప జాతర
సాక్షి, తూర్పు గోదావరి: ఎన్నో ఆశలు.. మరెన్నో సమస్యలు.. ఇంకెన్నో వినతులు.. విన్నారు.. నేనున్నా అన్నారు.. భరోసా ఇచ్చారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇంకేముంది ప్రజలే గెలిపించుకున్నారు. పగ్గాలు చేపట్టిందే తడవుగా నవోదయానికి నాందిగా నవరత్న మాలికలను అందజేసే పనిలో నిమిషం ఖాళీ లేకుండా ముందుకు సాగిపోతున్నారు. మమ్మల్ని వదిలేశారు అనే మాట లేకుండా అన్ని వర్గాలకూ న్యాయం చేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమతౌల్యం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. స్వయంగా భూమిని సాగు చేస్తున్న రైతు ఏ మేరకు లబ్ధి పొందుతున్నాడో.. అదే స్థాయిలో కౌలు రైతుకూ నేనున్నా అంటూ భరోసా ఇచ్చి చేతల్లోనూ రైతు బాంధవుడని అనిపించుకున్నారు. రైతు భరోసా పేరుతో పెట్టుబడి మొదలుకొని ధరల స్థిరీకరణ వరకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. అలాగే ఆశా కార్యకర్తల వేతనాల పెంపుతో ఆయా వర్గాలు ఎంతో హుందాగా బతికేందుకు ఆసరా కల్పించారు. అంగన్వాడీలు, మినీ అంగన్వాడీలు రూ.వెయ్యి పెంచడంతో వారి ఆనందానికి అవధులు లేవు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు మానసిక స్థైర్యం కల్పించారు. ఇక ఆక్వా రంగం అభివృద్ధికి విద్యుత్ చార్జీల తగ్గింపు, ఏజెన్సీ ప్రాంతాల్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ నిర్ణయాల పట్ల ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అలాగే ఆలయ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాతినిధ్యం కల్పించే నిర్ణయం భగవంతుడి ముందు అంతా సమానమని చెప్పకనే చెప్తూ వివక్షకు తావులేని ప్ర భుత్వం తమదని చాటి చెప్పారు. ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేస్తున్న మద్యపానాన్ని దశలవారీగా తగ్గించే విధంగా మొదట బెల్టు దుకాణాల పైనా.. తరువాత మద్యం దుకాణాల తగ్గింపుపైనా చకచకా నిర్ణయాలు తీసుకుని అక్కచెల్లెమ్మల చేత ఇది కదా జగనన్న ప్రభుత్వం అంటే అనిపించేలా సాగిపోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అంగన్వాడీల్లో ఆనందోత్సాహాలు కాకినాడ సిటీ: జిల్లాలోని అంగన్వాడీలకు జీతాల పెంపు ప్రతిపాదన కేబినెట్ ఆమోదం పొందడంతో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లలో ఆనందం వ్యక్తమవుతోంది. చిరుద్యోగులపై సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలను ఆయా వర్గాలు అభినందిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 5,545 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 5,113 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 432 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. 5,113 మంది అంగన్వాడీ హెల్పర్లు (ఆయాలు) ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తకు గతంలో రూ.10,500 వేతనం ఉండగా ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.1000 అదనంగా పెంచడంతో వీరికి వేతనం రూ.11,500 పెరిగింది. ఆయాకు గతంలో రూ.6 వేల వేతనం ఉంటే ఇప్పుడు రూ.1000 పెంచడంతో వేతనం రూ.7 వేలు అయ్యింది. తాజా వేతనాలు జూలై నెల నుంచే అమలులోకి వస్తున్నాయి. ఈ మేరకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాలో సుమారు 11 వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ కార్యకర్తలకు నెలకు రూ.1.1 కోటి వేతనాలు అదనంగా చెల్లించనున్నారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. గ్రామాల్లో కొలువుల జాతరే బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలోను పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజల్లో మమేకమై, రాష్ట్రంలో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, గ్రామాల్లోని సమస్యలు తెలుసుకొన్నారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఒక్కో గ్రామంలో పదిమందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో 1072 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 24,440 మంది గ్రామ వలంటీర్ పోస్టులు, 12,700కు పైగా గ్రామ సచివాలయాల్లో పోస్టులు మంజూరు కానున్నాయి. జగన్మోహన్రెడ్డి అన్నమాట ప్రకారం ఆగస్టు 15 నాటికి వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులను నియమించి అక్టోబర్ రెండు నుంచి గ్రామ సచివాలయాలకు ఊపిరిపోయడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఒక్కో గ్రామానికి పది మందిని ఉద్యోగాల్లో నియమించడం, ప్రతి కుటుంబానికి ఒక వలంటీర్‌ను నియమించడం వల్ల గ్రామ ప్రజల సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాల్ సెంటర్‌కు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా మీ సమస్యని సంబంధిత అధికారులకు తెలియజేస్తాం అనేవారు కానీ సమస్యలు మాత్రం పరిష్కారమయ్యేవి కాదు. ఇప్పడు అలా కాకుండా సీఎం కాల్‌సెంటర్‌కు వచ్చిన కాల్స్ నేరుగా వలంటీర్లకు రావడం, వాటిని 72 గంటల్లో పరిష్కరించే విధానమే ఈ గ్రామ సచివాలయాల లక్ష్యం. తద్వారా పల్లెలు దేశాభివృద్ధికి పట్టుగొమ్మలుగా తయారుకాగలవు. గిరిజనులకు వరం ఉచిత విద్యుత్ రంపచోడవరం: ఆదివాసీలకు నెలకు 200 యూనిట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ ప్రకటించడంపై ఏజెన్సీ గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ బిల్లులు భారంగా మారిన తరుణంలో 200 యూనిట్ల వరకు గిరిజనులు ఉచితంగా విద్యుత్ వినియోగించుకోవచ్చని ప్రభుత్వం శుక్రవారం శాసన సభలో ప్రకటించింది. దీంతో విద్యుత్ బిల్లుల కోసం వినియోగించే డబ్బులు తమ ఇంటి అవసరాలకు ఉపయోగపడతాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 37,119 మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. అలాగే చింతూరు ఐటీడీఏ పరిధిలో మరో 22 వేల మంది లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. పాదయాత్ర ద్వారా గిరిజన పల్లెల్లో సమస్యలు తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టాక గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. గిరిజనుల కష్టాలు తెలుసుకుని.. గ్రామాల్లో గిరిజనుల కష్టాలు తెలుసుకుని ముఖ్యమంత్రి జగన్ గిరిజనులకు విద్యుత్ బిల్లులో 200 యూనిట్ల వరకూ ఉచితం ప్రకటించడం ఆనందంగా ఉంది. అరకొర ఆదాయంతో విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న మాకు ప్రభుత్వ ప్రకటన వరంగా మారింది. –బందం విజయలక్ష్మి , వీఆర్ పురం మద్యం.. పరిమితం మండపేట: దశల వారీ మద్యం నిషేధం అమలులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే బెల్టు షాపులు రద్దు చేయగా, అక్టోబరు నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో షాపుల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న షాపుల్లో 25 శాతం రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో 137 మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. నిబంధనలు పటిష్టంగా అమలు చేయడం ద్వారా విక్రయాలు భారీగా తగ్గనున్నాయి. జిల్లాలో 546 మద్యం షాపులు ఉండగా, 45 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. రోజుకు రూ.6.83 కోట్ల మేర మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా గత ప్రభుత్వం జిల్లాలో మద్యాన్ని ఏరులై పారించింది. 2015 నాటికి జిల్లాలో 54 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 480 ప్రైవేటు దుకాణాలు ఉండగా విక్రయాలు పెంచుకునేందుకు ప్రభుత్వ దుకాణా లను రద్దుచేసి ప్రైవేట్ పరం చేసింది. గుడి, బడి పట్టించుకోకుండా ఎక్కడపడితే అక్కడ దుకాణాలు వెలిశాయి. లిఫ్టింగ్‌ను తెరపైకి తెచ్చి బెల్టుషాపుల ఏర్పాటులో వ్యాపారులకు వెసులుబాటు ఇచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ, రాష్ట్ర హైవేలకు 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను తుంగలోకి తొక్కింది. ఈ హైవేలను మున్సిపల్ డెవలప్మెంట్ రోడ్డు (ఎండీఆర్)ల పరిధిలోకి తీసుకువచ్చి హైవేలలో యథేచ్ఛగా మద్యం విక్రయించుకునే అవకాశం కల్పించింది గత ప్రభుత్వం. దశలవారీ నిషేధం దిశగా అడుగులు సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడు రోజులకే దశలవారీగా మద్య నిషేధం హామీపై తొలి అడుగువేశారు జగన్. బెల్టు షాపు తీయకుంటే మద్యం దుకాణం లైసెన్సు రద్దు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అక్టోబర్ నుంచి ప్రభుత్వ అధీనంలోనే మద్యం దుకాణాలు నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి వరకూ ప్రస్తుత షాపుల లైసెన్సును పొడిగించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మద్యం విక్రయాలపై అధ్యయనం చేసిన ప్రత్యేక బృందాలు ఇచ్చిన నివేదికలపై గురువారం జరిగిన కేబినెట్ భేటీలో చర్చించారు. జాతీయ రహదారులు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు దూరంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపడం వల్ల బెల్టు షాపులు ఉండవు. నిర్ణీత వేళల్లోనే దుకాణం తెరిచి ఉంచడంతో విచ్చలవిడిగా సాగుతున్న విక్రయాలకు బ్రేక్ పడుతుంది. దీంతో మద్యం మత్తులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని పలువురు అంటున్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: జాయింట్ కలెక్టర్
సాక్షి, కాకినాడ సిటీ(తూర్పు గోదావరి) : ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన కర్తవ్యమని జిల్లాకు కొత్త జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డి.లక్ష్మీశ అన్నారు. ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ‘సాక్షి’తో మాట్లాడారు. తన అనుభవాలను, మనోభావాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మాది కర్నాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లాలోని హాళుగుండనహాళీ అనే చిన్న పల్లెటూరు. మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. నా తల్లిదండ్రులు లక్ష్మమ్మ, గంగముత్తయ్య వ్యవసాయం చేస్తుంటారు. ఒక అన్న, ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. నా బాల్యం అంతా కర్నాటకలోనే సాగింది. వ్యవసాయ కుటుంబం కావడంతో బీఎస్సీ అగ్రికల్చర్ చేసి అదే సబ్జెక్టులో పీహెచ్డీ చేశాను. అమ్మ కోరిక మేరకు ఐఏఎస్ చదివేందుకు ఢిల్లీ వెళ్లాను. అక్కడే ఉండి ఐఏఎస్ పరీక్ష కోసం చదివాను. 2010లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికయ్యాను. అదే సమయంలో వ్యవసాయశాఖ కృషి విజ్ఞాన్ కేంద్రంలో సైంటిస్టుగా పోస్టింగ్ వచ్చింది. అప్పట్లో ప్రజలకు సేవ చేయాలన్నా, అమ్మ ఆశయం నెరవేరాలన్నా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసే కరెక్ట్ అని భావించి దానిలో చేరాను. అయితే అమ్మ కోరిక ప్రకారం ఐఏఎస్‌కు ఎంపిక కావాలనే ఆశయంతో మరోమారు ప్రయత్నించాను. ఇలా నాలుగో సారి 2013 బ్యాచ్‌లో ఐఏఎస్‌కు ఎంపికయ్యాను. అనుకున్న లక్ష్యాన్ని సాధించాను. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం సాకారమైంది. జేసీగా తూర్పులోనే తొలి పోస్టింగ్ 2013లో ఐఏఎస్‌గా ఎన్నిక అయిన తరువాత మొట్టమొదటిగా కర్నూలు జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా చేరాను. అనంతరం నూజివీడులో సబ్ కలెక్టర్‌గా పని చేశాను. అక్కడ నుంచి 2016లో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వెళ్లాను. అక్కడ పని చేస్తుండగా బదిలీ చేయడంతో తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా వచ్చాను. నూజివీడులో సబ్ కలెక్టర్‌గా పని చేసిన సమయంలో ఎయిర్‌పోర్టుకు 450 ఎకరాల భూమిని ఫిల్లింగ్ చేశాను. పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసీకి 1,400 ఎకరాలు సేకరించాం. కృష్ణా పుష్కరాల నిర్వహణలో ఇన్చార్జిగా పని చేశాను. జిల్లాను పూర్తి అవగాహన చేసుకుంటాను. మెరుగైన సేవల ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తాను. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న నవరత్న పథకాలను పేద వర్గాల ప్రజలకు నేరుగా చేరేందుకు కృషి చేస్తాను. భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపడతాను. రైతులు నిత్యం ఎదుర్కొనే భూ సమస్యలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, మ్యుటేషన్స్, ఒకరి భూమి మరొకరి పేరిట ఆన్లైన్ చేయడం, భూమి కొలతలు, చుక్కల భూములు తదితర అనేక సమస్యలు ఉన్నాయి. జిల్లాపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకున్న అనంతరం రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ఆయనతో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తాను. సాగునీటి వనరుల అభివృద్ధికి చర్యలు చేపడతాం. పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తా కాకినాడ, పెద్దాపురం, రాజమహేంద్రవరం, తొండంగి తదితర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీ భూములను సేకరించారు. ఆ భూములను పరిశీలించి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాం. అదే విధంగా సివిల్‌సప్లైస్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటాం. రైతులు పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తాం. ప్రభుత్వ లక్ష్యం మేరకు పేదలకు ప్రభుత్వం అందించే బియ్యం, పంచదార, కందిపప్పు తదితర నిత్యావసర సరుకులు నేరుగా పేద ప్రజలకు చేరేందుకు చర్యలు తీసుకుంటాం. వ్యవసాయ ప్రధానమైన జిల్లాలో పని చేయడం అదృష్టం వ్యవసాయ ప్రధానమైన, ధాన్యాగారంగా పేరున్న తూర్పుగోదావరి జిల్లాలో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మాది వ్యవసాయ కుటుంబం కావడంతో వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. అదే ఉద్దేశంతో బీఎస్సీ అగ్రికల్చర్ చదివి పీహెచ్డీ చేశాను. రైతు బాగుంటేనే రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం బాగుంటుందని నేను నమ్మడంతో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేసే పథకాలు నేరుగా పేద రైతుకు చేరేలా ఉన్నతాధికారులతో కలిసి పనిచేస్తాను. సీఎం జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో అవినీతిరహిత పాలన సాగిస్తూ, ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని పేదలకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తాను. అధికారులు కూడా అందుకు అనుగుణంగానే పనిచేయాలి. ఎవరు తప్పు చేసినా కఠినంగా వ్యవహరిస్తా. ప్రజలకు జవాబుదారీగానే పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. రెవెన్యూలో అనేక రకాల భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రజలకు ఇబ్బందులు రాకుండా పని చేస్తాం. అమ్మ చెప్పింది.. అమ్మ నన్ను ఓ ఉన్నతమైన వ్యక్తిగా, పది మందికి సేవ చేసే వాడిగా చూడాలనుకొంది. బాగా చదువుకుంటేనే అది సాధ్యమవుతుందనుకున్నాను. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఆదర్శంగా తీసుకుని, అమ్మ ఆశయం నెరవేర్చాలని భావించాను. పేదరికంలో ఉన్నా నేను ఉన్నతస్థాయికి వెళ్లి పేదలకు సేవలు చేయాలన్న అమ్మ కోరికను నెరవేర్చాలని సంకల్పించుకున్నాను. ఒక్క ఐఏఎస్‌తోనే అది సాధ్యమని భావించాను. సాధించాను. –డి.లక్ష్మీశ -
ప్లీజ్.. నో అడ్మిషన్
భీమవరం(పశ్చిమ గోదావరి) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న ‘అమ్మఒడి’ పథకానికి విశేష ఆదరణ లభిస్తోంది. అధిక సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వచ్చి చేరుతున్నారు. భీమవరం పట్టణం నాచువారి సెంటర్లోని పొట్టిశ్రీరాములు మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఏడాది విద్యార్థుల అడ్మిషన్లు భారీ స్థాయిలో జరిగాయి. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటుచేశారు. మంగళవారం పాఠశాలను సందర్శించిన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆర్వీ రమణ పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య ప్రకారం పాఠశాలలో 750 మంది విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లకు అవకాశం ఉందని, ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 850 మించిపోవడంతో నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటుచేశారు. నూతనంగా భవన నిర్మిస్తే విద్యార్థుల సంఖ్య పెంచుకునేందుకు అవకాశం ఉందని హెచ్ఎం చెప్పారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం కేవీవీ భోగేశ్వరరావు, ఉపాధ్యాయులు వీఎం రాధాకృష్ణ, జె సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల సమస్యలు తీర్చేందుకే ‘స్పందన’
సాక్షి, పులివెందుల(కడప) : ప్రజల సమస్యలు తీర్చేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘స్పందన’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్వగృహం వద్ద ఆయన ప్రజలతో మమేకమయ్యారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను ఆలకించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందుకే ప్రజావేదిక తొలగించడానికి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రజా వేదికే కాకుండా రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను ఎవరూ స్వాధీనం చేసుకున్నా చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ అధికారం చేపట్టి నెల రోజులు కూడా గడవకమునుపే తనదైన శైలిలో పరిపాలన చేస్తున్నారన్నారు. జగన్ పరిపాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు చూసి ప్రజలంతా హర్షిస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు తమ అవినీతి కప్పిపుచ్చుకునేందుకు బీజేపీలో చేరుతున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కచ్చితంగా సాధించి తీరుతామన్నారు. కేంద్రంలోని బీజేపీకి ఎలాంటి మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కృషి చేస్తామన్నారు. నవరత్నాల పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా అండగా ఉండి ముందుకెళతామన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామిలను ఏ ఒక్కటి కూడా మరిచిపోకుండా అమలు చేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లుగా ప్రజలకు పాలకులుగా కాకుండా సేవకులుగా ఉండి సేవలందిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు సువర్ణపాలన అందించడమే తమ లక్ష్యమన్నారు. మంగళవారం ఉదయం పులివెందుల వైఎస్సార్సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డితో కలిసి ఆర్ఎంపీ డాక్టర్లు వైఎస్ అవినాష్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఎంపీతో మొరపెట్టుకున్నారు. 429జీఓను పునరుద్ధరించాలని విన్నవించుకున్నారు. దీనికి సానుకూలంగా స్పందించారు. -
కలెక్టర్ల సదస్సులో సీఎం వైఎస్ జగన్
-
మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ‘మనం పాలకులం కాదు.. సేవకులం’ అని ప్రతి క్షణం గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్ధేశం చేశారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, నవరత్నాలు మేనిఫెస్టో ప్రతి మంత్రి, కలెక్టర్, అధికారి దగ్గర ఉండాలని సూచించారు. మేనిఫెస్టో అన్నది ఓ భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాలన్నారు. సోమవారం ఆయన ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కలెక్టర్లు ఏ విధంగా పని చేయాలో తెలియజేశారు. పై స్థాయిలో తాను నిర్ణయాలు తీసుకుంటే.. కింది స్థాయిలో అమలు చేసేది కలక్టర్లేనని తెలిపారు. అందరం కలిసి పనిచేస్తేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. ఇంకా ఏమన్నారంటే.. చిరునవ్వుతో పలకరించాలి.. ‘మేనిఫెస్టోను గొప్పగా అమలు చేస్తామని నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. నా ద్వారా మీకు అధికారం ఇచ్చారు. ఏపీ చరిత్రలో ఇంత మెజారిటీ ఇంతవరకు ఎవ్వరికీ ఇవ్వలేదు. ప్రజలు మనల్ని నమ్మారు కాబట్టి.. ఈ రోజు మనం అధికారంలో ఉన్నాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేయాలి. రేపటి ఎన్నికల్లో మేనిఫెస్టోను అమలు చేశామని చెప్పుకుని ఓట్లు అడగాలి. దీనికి మీ అందరి సహకారం అవసరం. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలది కీలక పాత్ర. రెండు లక్షల మంది ప్రజలు ఓట్లు వేస్తే వారు ఎమ్మెల్యేలు అయ్యారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోవాలి. ఎమ్మెల్యేలు, ప్రజలు మీదగ్గరికి వచ్చినప్పుడు చిరునవ్వుతో పలకరించాలి. అవినీతి, దోపిడీ వ్యవహారాలు చేస్తే ఈ ప్రభుత్వం సహించదు. ఏ స్థాయిలో ఉన్న సరే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రజాస్వామ్యానికి ఎమ్మెల్యేలు,అధికారులు రెండు కళ్లలాంటి వారు. కలెక్టర్లు ఎమ్మెల్యేలను కలుపుకొని పనిచేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ వర్గాల్లోని ప్రతి అర్హుడిగా సంక్షేమపథకాలు అందించాలి. అందిచకపోతే దేవుడి దృష్టిలో తప్పు చేసిన వాళ్లం అవుతాం. ఈ వ్యవస్థలో వీరి ఆత్మగౌరవం పెరగాలి. వారు ఆర్థికంగా ఎదిగేలా మన ప్రతి అడుగు వారికి దగ్గరుండాలి. ఇందుకోసమే నవరత్నాలు ప్రకటించాం. మావాళ్లు చెప్పినా వినవద్దు.. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు ఇవేవి చూడకుండా ఈ పథకాలు అందజేయాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేరాలి. మా పార్టీ ఎమ్మెల్యేలు ఇవ్వద్దంటే పట్టించుకోవద్దు. మనకు ఓటు వేయనివారికి కూడా మంచి చేయాలి. మనం చేసిన మంచితో వారు మళ్లీ ఓట్లేసేలా చేసుకోవాలి. ఎన్నికలయ్యేవరకే రాజకీయాలు.. ఎన్నికలయ్యాక అందరు మనవాళ్లే. పథకాలు అందరికీ అందించేందుకే గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ఏర్పాటు చేస్తున్నాం. గ్రామ వాలంటీర్ అవినీతికి పాల్పడితే.. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను తీసుకొస్తున్నాం. రెండు వేల మంది నివాసం ఉండే ప్రతిగ్రామంలో గ్రామసచివాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఆ 50 ఇళ్లకు సంబంధించి పూర్తి బాధ్యత ఆ వాలంటీర్ తీసుకుంటారు. ప్రతి సంక్షేమ పథకాన్ని డోర్ డెలివరీ చేస్తారు. ఇది చేసేటప్పుడు గ్రామ వాలంటీర్ అవినీతికి పాల్పడవద్దు. వివక్ష చూపవద్దు. ఇలా చేయవద్దని రూ.5వేల జీతం ఇస్తున్నాం. అవినీతికి పాల్పడితే నేరుగా సీఎం ఆఫీస్‌కు కాల్ చేయవచ్చు. నేరుగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. 50 ఇళ్ల పరిధే కాబట్టి విచారణకు పెద్దగా ఇబ్బంది ఏర్పడదు. తప్పు చేస్తే వెంటనే తొలగిస్తాం. ఇందులో ఏమాత్రం మొహమాటం పడవద్దని చెబుతున్నాను. ప్రభుత్వ యంత్రాగమంతా నిజాయితీగా పనిచేయాలి. గ్రామస్థాయి నుంచి పైస్థాయి వరకు ఎక్కడా కూడా అవినీతి ఉండకూడదు. ప్రతి పనిలో పారదర్శకత కనిపించాలి. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు వ్యవస్థలో మార్పు రావాలి. దేశం మొత్తం మనవైపు చూడాలి. మన రాష్ట్రాన్ని నమూనగా తీసుకోవాలి. చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితి ఉండకూడదు.. ప్రజలు ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితి, పనుల కోసం ప్రజలు లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదు. మన పనితీరు ఆధారంగా ఓట్లు వేస్తారు. మనం మంచి చేస్తే మళ్లీ గెలుస్తాం. ఎంత పెద్దవాళ్లు చెప్పినా అక్రమాలు, ఇసుక రవాణా, పేకాట క్లబ్‌లను ప్రోత్సహించొద్దు. గత ప్రభుత్వంలో బర్త్, డెత్ సర్టిఫికెట్, రేషన్ కావాలన్న లంచం. జీవిత బీమా కోసం కూడా లంచాలు తీసుకున్నారు. చివరకు బాత్రూం మంజూరు కావాలన్నా లంచం అడిగారు. మన ప్రభుత్వంలో ప్రజలకు ఆ లంచాలిచ్చే పరిస్థితి ఉండకూడదు. ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగకూడదు. గ్రామస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే.. పైస్థాయిలో కాంట్రాక్ట్‌లు అంటేనే అవినీతనే స్థితికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితిని మార్చేందుకే రివర్స్ టెండరింగ్‌ను తీసుకొచ్చాం. ఎక్కడెక్కడ తప్పు జరిగిందో గుర్తించి రివర్స్ టెండరింగ్ వేస్తున్నాం. టెండరింగ్ ప్రీ క్వాలిఫికేషన్‌ను మారుస్తాం. చాలా మంది టెండరింగ్‌కు వచ్చేలా చేస్తాం. తక్కువ ఎవరైనా ఇస్తారా అని అడిగి మరి ఇస్తాం. ఏం మిగిలినా కూడా ప్రభుత్వానికి ఆదా చేస్తాం.’ అని సీఎం జగన్ కలెక్టర్లకు సూచించారు. చదవండి: ‘ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం -
నవశకానికి దిశానిర్దేశం
సాక్షి, విజయనగరం : అమరావతిలో రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా జిల్లా కలెక్టర్ల సదస్సు సోమవారం నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సంబంధించి అజెండాను ప్రభుత్వం రెండురోజుల క్రితమే ఖరారు చేసింది. ఈ సదస్సులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నవరత్నాలపై చర్చకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. నవరత్నాల్లో ఉన్న పలు పథకాల అమలు గురించి అజెండాలో చేర్చా రు. వీటితోపాటు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తలెత్తుతున్న సమస్యలపైనా దృష్టిసారించారు. ముఖ్యంగా ఎనిమిది అంశాలపై ఫోకస్ చేశారు. అందులో మొదటిది గ్రామ సచివాలయ వ్యవస్థ. ఆక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ వ్యవస్థతోపాటు ఆగస్టు 15వ తేదీ నుంచి విధుల్లోకి రానున్న గ్రామ వలంటీర్ల గురించి చర్చించాలని నిర్ణయించారు. ఆరో గ్యశ్రీ పథకం అమలు, 108, 104 సేవలు రెండో ప్రాధాన్యత అంశంగా చేర్పించారు. సెప్టెంబర్ నెల నుంచి ఇంటింటికి సరకులు పంపిణీ, సన్నబియ్యం పంపిణీ మూడో అంశంగా చేర్చారు. పాఠశాలల్లో పిల్లల నమో దు, పుస్తకాలు, యూనిఫాం పంపిణీ అంశం తర్వాత చర్చిస్తారు. కరువు, ప్రస్తుతం పంటలు సాగు పరిస్థితి, పశుగ్రాసం, తాగునీరు, విద్యుత్ సరఫరాపై సమీక్షిస్తారు. వైఎస్సార్ భద్రతా రాష్ట్రంలో జనరంజక పాలన మొదలైంది. వివిధ వర్గాలవారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఉన్నతస్థాయిలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాటి అమలుపై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. దానిపై ఇప్పటికే తగిన ప్రణాళికలు రూపొందించారు. ఇక క్షేత్రస్థాయిలో అమలుకు అవసరమైన సూచనలు చేసేందుకు జిల్లా కలెక్టర్ల సదస్సు సోమవారం నిర్వహించనున్నారు. నవరత్నాల అమలుకు సంబంధించి... తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అవసరమైన జిల్లా సమాచారంతో కలెక్టర్ హరిజవహర్‌లాల్ అమరావతికి పయనమయ్యారు. పెన్షన్ల పంపిణీ, ఇళ్ల పట్టాలు పంపిణీ, కౌలు రైతులకు రుణ అర్హత కార్డుల జారీ తదితర అంశాలు కూడా చర్చకు రానున్నాయి. వీటన్నింటిపై అధి కా రుల నుంచి సమాచారం తీసుకోవడమే కాకుండా ముఖ్యమంత్రి వీటిపై మార్గనిర్దేశనం చేస్తారు. పూర్తి సమాచారంతో వెళ్లిన కలెక్టరు ముఖ్యమంత్రి జగన్‌హన్‌రెడ్డి నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ల సదస్సుకు జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ శనివారం సాయంత్రం జిల్లా నుంచి వెళ్లారు. ఆదివారం స్థానికంగా పనులు చూసుకుని సోమవారం సమావేశానికి హాజరవుతారు. కలెక్టర్ల సదస్సు ముఖ్య ఉద్దేశానికి సంబంధించి ముందే ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఆ మేరకు పూర్తి సమాచారంతో కలెక్టర్ పయనమయ్యారు. కొత్త ముఖ్యమంత్రితో తొలి సదస్సు కావడంతో అజెండాలోని అంశాలకు సంబంధించిన సమాచారంతోపాటు... మరింత ఇతర సమాచారాన్ని కూడా కలెక్టర్ తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. జిల్లా పరిస్థితులపై నివేదిక ప్రభుత్వ అజెండాకు అనుగుణంగా జిల్లాలో పరిస్థితులను కలెక్టర్ హరి జవహర్లాల్ ముఖ్యమంత్రికి నివేదించనున్నారు. జిల్లాలో 919 గ్రామపంచాయతీల్లో సచివాలయ ఏర్పాటు, సిబ్బంది నియామకంపై కసరత్తు చేసి తీసుకెళ్లారు. వారితోపాటు 50 కుటుంబాలకు ఒక వలంటీర్ నియామకానికి సంబంధించి నివేదిక తయారు చేశారు. అందులో జిల్లాలో 10,012 మంది వలంటీర్లు అవసరమని పేర్కొన్నారు. ⇔వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఇప్పటికే జిల్లాలో 108 వాహనాలు 27, 104 వాహనాలు 19 ఉన్నట్లు కలెక్టర్ సీఎంకు నివేదించనున్నారు. వీటికి అదనంగా 108 వాహనాలు 9, 104 వాహనాలు 8 కావాలని కోరేందుకు సిద్ధమయ్యారు. ⇔ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ అంశం గురించి కలెక్టర్ సీఎంకు నివేదిస్తారు. జిల్లాలో ప్రస్తుతం 7,13,053 కార్డులు ఉన్నాయని, ఆయా కార్డులకు 1,20,784 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయాల్సి ఉందని, ఇందుకు అవసరమయ్యే వలంటీర్ల గురించి కూడా కలెక్టర్ వివరిస్తారు. ⇔విద్యకు సంబంధించి పిల్లల నమోదు, పుస్తకాల పంపిణీ, యూనిఫాం పంపిణీ గురించి నివేదిస్తారు. జిల్లాలో ఈ ఏడాది 1,44,356 మంది పిల్లలు బడిలో ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి మూడు జతల యూనిఫాం లెక్కన పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 54.90శాతం పంపిణీ చేశారు. పుస్తకాలు పంపిణీ కూడా 80శాతం పూర్తయింది. మిగతా పంపిణీకి సంబంధించి కార్యాచరణ వివరించనున్నారు. అమ్మ ఒడి పథకంలో అమలు చేస్తే లబ్ధిదారుల సంఖ్యపై ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు రాగా ఆ విషయం కలెక్టరు వివరించనున్నారు. ⇔జిల్లాలో గతేడాది ఖరీఫ్, రబీలో ప్రకటించిన కరువు మండలాలకు రావాల్సిన పంటల నష్ట పరి హారం గురించి కలెక్టర్ ప్రస్తావించనున్నారు. ఖరీ ఫ్లో 8,917 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఇందుకు 24,320మంది రైతులకు రూ.13.37 కోట్లు పంటల నష్ట పరిహారం రావాల్సి ఉంది. రబీలో 9388 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 30,893మంది రైతులకు రూ.9.25కోట్లు పరిహా రం రావాలి. సదస్సులో కలెక్టర్ ఈ అంశం ప్రస్తావించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు, వర్షాల ఆలస్యం తదితర అంశాలు వల్ల కలిగే ఇబ్బందులు నివేదించనున్నారు. ⇔జిల్లాలో 1,06,126మంది పెన్షన్లు పొందుతున్నారు. పెన్షన్లు మొత్తం పెంపు తర్వాత నెలకు రూ.71.35కోట్లు అవసరం అవుతుంది. ఈ అంశంతో పాటు 60 ఏళ్లకు తగ్గిస్తే అదనంగా పెరిగే పెన్షనర్ల గురించి కూడా చర్చించనున్నారు. ⇔జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 23,405 మందికి ఇళ్ల పట్టాలు జారీ చేశారు. ఈ ప్రభుత్వం కొంతమందికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని చూస్తోంది. వీటిపై వివరాలు కోరింది. అయితే ప్రస్తుతం దరఖాస్తులు పెండింగ్‌లో ఉండే లబ్ధిదారులు లేరని కలెక్టర్ నివేదికలో పొందుపరిచారు. ⇔ కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు 13,218 జారీ చేశారు. ఈ వివరాలు కోరడంతో కలెక్టర్ సమాచారం సేకరించారు. దీని ఆధారంగా నూతన విధివిధానాలు రూపొందే అవకాశం ఉంది. -
విజయసాయి రెడ్డికి కేబినెట్ హోదా
-
విజయసాయి రెడ్డికి కీలక బాధ్యతలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయసాయి రెడ్డికి కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ భవన్ కార్యాలయంగా విజయసాయి రెడ్డి విధులు నిర్వహించనున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానకర్తగా వ్యవహరించనున్నారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలంగా ఉంటూ సంస్థాగత నిర్మాణంలోనూ ఆయన కీలక భూమిక పోషిస్తున్నారు. ‘నవరత్నాలు’కు ప్రత్యేక అధికారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘నవరత్నాలు’ పథకం అమలుకు ప్రత్యేక అధికారి నియమితులయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.శామ్యూల్ నవరత్నాల మానిటరింగ్ కమిటీ వైస్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నవరత్నాలు అమలు శాఖలను సమీక్షించనున్నారు. అలాగే ముఖ్యమంత్రి సలహాదారుగా కూడా వ్యవహరించనున్న శామ్యూల్‌కు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. -
తుని: నాడు తండ్రి..నేడు తనయుడు..
సాక్షి, తుని రూరల్(తూర్పు గోదావరి): సార్వత్రిక ఎన్నికల ముందు నవరత్నాల పథకాల్లో భాగంగా వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామన్న హామీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. ఆదిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా సోమవారం నియోజకవర్గంలో ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలు వరకు, ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటలు వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు ట్రాన్స్‌కో అధికారులు ట్రయిల్‌రన్ నిర్వహించారు. ట్రయిల్‌రన్ నిర్వహించి ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లలో మార్పులు గమనిస్తున్నట్టు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. ఏ విధమైన ఒత్తిడి ఉందో ఉన్నత అధికారులకు నివేదిక ఇవ్వనున్నట్టు తుని రూరల్ ఏఈ కామేశ్వర శాస్త్రి తెలిపారు. నియోజకవర్గంలో 3,593 వ్యవసాయ విద్యుత్ బోరుబావులు ఉన్నాయి. అమలులో జగన్ వాగ్దానం నవరత్నాల పథకాల్లో అమలు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు ట్రాన్స్‌కో అధికారులు 9గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు ట్రయిల్ రన్ నిర్వహిస్తున్నారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఏడు గంటలు ఉచిత విద్యుత్ అందించి రైతుల గుండెళ్లో నిలిచిపోయారు. దివంగత రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రైతులకు అండగా నిలిచేందుకు పగలే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు రాత్రివేళల్లో సరఫరా అయ్యే ఉచిత విద్యుత్ కోసం పంట పొలాల్లో కష్టపడుతూ, విద్యాద్ఘాతానికి గురై ఎంతో మంది కర్షకులు మృత్యువాత పడ్డారు. అటువంటి సంఘటనలు తన ప్రభుత్వంలో జరగకుడదన్న సంకల్పంతో పగలే రెండు షిఫ్టులుగా ఉచిత విద్యుత్‌ను సరఫరాకు ఆదేశించారు. ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో... తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయాలన్న రైతులు కల నెరవేరనుంది. ఉదయం ఐదు గంటల నుంచి మొదటి షిప్టు, పది గంటల నుంచి రెండో షిప్టు ఉచిత విద్యుత్‌ను తొమ్మిది గంటలు సరఫరా చేయనున్నారు. అనుకున్నట్టు రెండు మూడు రోజులు ట్రయిల్ రన్లు నిర్వహించి అవాంతరాలు సవరించి పట్టపగలే వ్యవసాయ విద్యుత్ సరఫరా చేసి సాగుకు కొత్త కళ తీసుకురానున్నారు. తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సరఫరా సమర్థవంతంగా అమలయితే వేలాది ఎకరాలకు సాగునీరు లభించడంతో మెట్ట భూములు సస్యశ్యామలమవుతాయిన రైతులు పేర్కొన్నారు. నాడు తండ్రి, నేడు తనయుడు రైతులు కష్టాలను కళ్లారా చూసిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2004లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఏడు గంటలు అందిస్తే, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పగలే తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అమలకు చర్యలు చేపట్టడం వ్యవసాయం, రైతులపై తండ్రికొడుకులకు ఉన్న నిబద్ధత తెలియజేస్తుంది. – నాగం దొరబాబు, రైతు, చామవరం కరెంట్ కష్టాలు తీరినట్టే పగలనక రాత్రనక ఉచిత విద్యుత్ ఎప్పుడు సరఫరా అవుతుందాని పంట పొలాల్లో కాపలాకాసే రోజులు పోయాయి. వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అందించడం సహసమే. రైతులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను పాదయాత్రలో చూసిన ముఖ్యమంత్రి జగన్ు రైతులకు కరెంట్ కష్టాలను తీర్చారు. – పరవాడ అప్పారావు, రైతు, కుమ్మరిలోవ వాణిజ్య సాగుకు ఊతం పట్టపగలే వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అందించడం వాణిజ్య పంటల సాగుకు ఊతం ఇచ్చి నట్టయ్యింది. సూక్ష్మ పరికరాలు ఏర్పాటు చేసుకుంటే ఎనిమిది నుంచి పది ఎకరాలకు సాగునీరు అందనుంది. పగలే భూగర్భ జలాలను తోడుకోవడం వల్ల రాత్రులు పొలాల్లో కష్టాలు పడాల్సిన పనిలేదు. – దాట్ల సతీష్ వర్మ, రైతు, తేటగుంట -
అలా చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ : కొడాలి నాని
సాక్షి, అమరావతి : ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటు తన పాలనలో వైవిధ్యం కనబరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మేనిఫెస్టోనే తనకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని తెలిపిన విషయం తెలిసిందే. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేస్తామని ఇప్పటికే వైఎస్ జగన్ పలుమార్లు స్పష్టం చేశారు. శనివారం తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి వచ్చిన ఆయన ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. 27 శాతం ఐఆర్‌ను ప్రకటించడంతో పాటు సీపీఎస్ రద్దుపై ఆదివారం జరిగే మంత్రవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. తన సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలు.. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు పర్చేవిధంగా అడుగులు వేస్తున్నారు. సామాజిక సమతూల్యత పాటిస్తూ బడుగు బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తూ 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించిన నవరత్నాలకు సంబంధించిన వాల్ పెయింట్స్‌ను సీఎం వైఎస్ జగన్ సచివాలయంలో పెట్టించారు. 1.ఆరోగ్యశ్రీ 2. వైఎస్సార్ రైతు భరోసా 3. అమ్మ ఒడి 4. ఫీజు రీయింబర్స్మెంట్ 5. వైఎస్సార్ ఆసరా ఫించన్లు 6. డ్వాక్రా రుణాలు 7. పక్కాఇళ్లు 8. మద్య నిషేధం 9. జలయజ్ఞం వంటి వాల్‌పెయింట్స్‌ను వరుసగా ఏర్పాటు చేయించారు. ఈ విషయాన్ని మంత్రి కొడాలి నాని తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ‘మ్యానిఫెస్టోను తూచ తప్పకుండ అమలు చేస్తానని చెప్తూ ఇలా సచివాలయంలో గోడల మీద వేయించిన ఏకైక సీఎం వైయస్ జగన్’ అని కొనియాడారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇక ఇప్పటికే వైఎస్సార్ ఆసరా ఫించన్లపై తొలి సంతకం చేసిన వైఎస్ జగన్.. వైఎస్సార్ రైతు భరోసా అమలు దిశగా అడుగులు వేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల అధికారులతో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి రైతు కుటుంబం చేతికి నేరుగా రూ. 12,500లు పెట్టుబడి సహాయం అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ రైతు భరోసా కింద రూ. 13,125 కోట్లు రైతులకు ప్రభుత్వం అందించనుంది. సమీక్ష సందర్భంగా రైతులకు ఏమేం చేయాలో అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మ్యానిఫెస్టోను తూచ తపకుండ అమలు చేస్తానని చెప్తూ ఇలా సచివాలయంలో గోడల మీద వేయించిన ఏకైక సీఎం వైయస్ జగన్@ysjagan #APCMYSJagan #YSJagan #ThatIsJagan pic.twitter.com/hxnhwL0WpV — Kodali Nani (@IamKodaliNani) June 8, 2019 -
తొలి హామీ జీవో జారీ చేసిన జగన్ ప్రభుత్వం
సాక్షి, అమరావతి : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల పెంపుదలపై తొలి సంతకం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం వైఎస్సార్ పెన్షన్ కానుక పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా వృద్ధుల పెన్షన్ వయస్సు 65 నుంచి 60 సంవత్సరాలకు కుదించారు. ఈ మేరకు శుక్రవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు తొలి జీవో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అర్హులందరికీ జూలై 1 నుంచి కొత్త పెన్షన్ పథకం అందుతుంది. వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద వృద్ధులకు రూ. 2250, వికలాంగులకు రూ. 3 వేలు, కిడ్నీ బాధితులకు రూ. 10 వేలు చెల్లిస్తారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ప్రసంగించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి సంతకం వృద్ధులకు పింఛను పెంపు ఫైల్‌పై చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతూ ఈ ఏడాది జూన్ 1 వతేదీ నుంచి 2,250 పింఛను ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. దశలవారీగా రెండో ఏడాది మరో రూ.250, మూడో ఏడాది మరో రూ.250, నాల్గో ఏడాదికి పింఛను రూ.3 వేలకు పెంచుతానని వివరించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం జీవో జారీచేసింది. [ పెన్షన్ జీవో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పాదయాత్ర
సాక్షి, దెందులూరు : ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆ పార్టీ దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు ఆయన పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మ తల్లి దేవాలయం నుంచి పాదయాత్రగా ద్వారకా తిరుమల చేరుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంతో పాటు, దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు నా కృతజ్ఞతలు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాలన విజయవంతంగా సాగాలంటూ పాదయాత్ర చేశా. ఈ అయిదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటాను. నియోజకవర్గ ప్రజలకు ‘నవరత్నాలు’ పూర్తి స్థాయిలో అందేలా కృషి చేస్తా.’ అని హామీ ఇచ్చారు. కాగా టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌పై అబ్బయ్య చౌదరి భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. సాఫ్ట్వేర్ రంగంలో సుమారు 17 ఏళ్లు అనుభవం ఉన్న ఆయన...రాజకీయాలపై ఆసక్తితో వైఎస్సార్ సీపీలో చేరారు. దెందులూరు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు.