
వేముల : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసంమే నవరత్నాలు అనే పథకాలను ప్రవేశపెట్టారని..వైఎస్ జగన్‌తోనే రాజన్న రాజ్యం సాధ్యమని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గొల్లలగూడూరు గ్రామంలో శనివారం వైఎస్సార్‌సీపీ మండల నాయకుడు నాగెళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ మరక శివకృష్ణారెడ్డితో కలసి రావాలి జగన్–కావా లి జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్వర్ణయుగం, సంక్షేమ పాలన రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమవుతుందన్నారు.
పింఛన్ల పెంపు, వైఎస్‌ఆర్ రైతు బరోసా, వైఎస్సార్ ఆసరా, పేదలందరికి ఇళ్లు, మధ్యపాన నిషేదం, ఫీజు రీఇంబర్స్‌మెంట్, జలయజ్ఞం, అమ్మఒడి పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. ఈ పథకాల ద్వారా కలిగే మేలును, వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే జరిగే అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. వైఎస్‌ఆర్ ఆసరా పథకం కింద వచ్చే ఎన్నికల నాటికి పొదుపు సంఘాల రుణాలు ఎంతైతే ఉంటాయో ఆమొత్తాన్ని పూర్తిగా రద్దుచేయడం జరుగుతుందన్నారు. వడ్డి లేని రుణాలుల ఇవ్వనున్నట్లు చెప్పారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు, కార్పొరేషన్ల ద్వారా అర్హులకు రుణాలు, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రూ.75వేల వరకు రుణం ఇవ్వనున్నట్లు చెప్పారు.
అమ్మఒడి పథకం ద్వారా బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15వేలు ఇస్తామన్నారు. కుటుంబాలను ఆర్థికంగా కుంగదీస్తున్న మద్యపానాన్ని పూర్తిగా నిషేధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు చెప్పారు. జలయజ్ఞం, ఫీజు రీఇంబర్స్‌మెంట్, పేదలందరికి ఇళ్లు, పింఛన్ల పెంపు వంటి పథకాలను అమలుచేయనున్నట్లు చెప్పారు.వచ్చే ఎన్నికల్లో జగనన్నకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి శంకరరెడ్డి, మాజీ ఎంపీపీ జనార్థనరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాజారెడ్డి, ఎంపీటీసీ శ్రీరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు ఇసీ ప్రసాద్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రామాంజనేయరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, సింగారెడ్డి, బయన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.