సంక్షోభంలో ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు నేరుగా ఆర్థిక సాయం అందజేసే పథకాలు తెరపైకి రావడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందజేయడానికి వారి ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేస్తూ.. రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టగా.. తాజాగా కేంద్రంలోని మోదీ సర్కారు కూడా ఇదే పథకాన్ని ప్రకటించింది. రైతులకు ఏడాదికి నేరుగా రూ. ఆరువేల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది.