
బేతంచెర్లలో నవరత్నాల పథకాల గురించి వివరిస్తున్న పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
కర్నూలు, బేతంచెర్ల: టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నంత వరకు వర్షాలు కురవబోవని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని అంగళ్ల బజారు, గౌరిపేటలో వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీ సభ్యుడు ముర్తుజావలి, మండల కన్వీనర్ సీహెచ్ లక్ష్మీరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు బుగ్గన నాగభూషణంరెడ్డి, ఎంపీపీ గజ్జి కిట్టమ్మ, ఎంపీటీసీ సభ్యులు శివరామిరెడ్డి, సుమతి ఆధ్వర్యంలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి నవరత్నాల పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుగ్గన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అడ్డంగా దోచుకోవడమే టీడీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించిన కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి సిద్ధపడిన చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోవద్దని సూచించారు.
రాజన్న రాజ్యం జగనన్నతోనే సా«ధ్యం అని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టాలన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నవరత్నాల పథకాలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు. ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు రాజేంద్రతో పాటు ఆయా కాలనీల్లో బుగ్గనకు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఆయా కాలనీల్లో సమస్యలు వింటూ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలాంటి కమిటీలతో సంబంధం లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తామని ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నియోజవర్గ బూత్ లెవల్ కో ఆర్డినేషన్ కమిటీ ఇన్‌చార్జి రాజేంద్రనాథ్‌రెడ్డి, నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, బాబుల్‌రెడ్డి, చలం రెడ్డి, దస్తగిరి, మల్దిరెడ్డి, నాగేశ్వరరావు, మురళీ కృష్ణ, రామచంద్రుడు, మహేశ్వర్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, ఆకుల రమణ, భాస్కర్‌రెడ్డి, ఇబ్రహీమ్, సలీమ్, సంథానీ బాషా, ఇలియాజ్, బుగ్గానిపల్లె రాముడు, రమణ, రామనాయుడు, కిరన్, బూషిరెడ్డి, భాస్కర్, నడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment