‘బాబు బండారం బయటపడటంతో ఎదురుదాడి’ | Buggana Rajendranath Reddy Speech In Kurnool Over IT Raids On Srinivas | Sakshi
Sakshi News home page

‘బాబు బండారం బయటపడటంతో ఎదురుదాడి’

Published Sat, Feb 15 2020 3:58 PM | Last Updated on Sat, Feb 15 2020 7:12 PM

Buggana Rajendranath Reddy Speech In Kurnool Over IT Raids On Srinivas - Sakshi

సాక్షి, కర్నూలు: బోగస్ కంపెనీల ద్వారా.. దొంగ బిల్లులతో హవాలా పద్దతిలో భారీగా సొమ్మును విదేశాలకు తరలించినట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఐటీ సోదాల్లో 40 చోట్ల రెండు వేల కోట్ల రూపాయలు బయటపడ్డాయని.. ఈ క్రమంలో ఒక ప్రముఖ నాయకుడి పర్సనల్ సెక్రటరీ వద్ద కీలక ఆధారాలు లభించినట్లు అధికారులు వెల్లడించారన్నారు. శనివారమిక్కడ ఆయన మాట్లాడుతూ.. 1995 నుంచి 2004 వరకు పెండ్యాల శ్రీనివాస్ అనే వ్యక్తి సీఎం కార్యాలయంలో పనిచేశారని బుగ్గన తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబుకు పీఏగా పనిచేశారని ఆయన గుర్తు చేశారు. శ్రీనివాస్‌తో పాటు టీడీపీకి చెందిన కిలారు రాజేష్‌పైన ఇటీవల ఐటీ దాడులు జరిగాయన్నారు. కడప జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ ఆర్కె ఇన్ ఫ్రా కంపెనీల్లో కూడా ఐటీ సోదాలు జరిగాయని బుగ్గన  రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ‘చంద్రబాబు అక్రమాస్తుల’ కేసు 26కు వాయిదా

ఐటీ సోదాల్లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినప్పటికీ... నీతులు చెప్పే టీడీపీ వాళ్లు ఐటీ దాడులకు సంబంధం లేదంటున్నారని బుగ్గన  రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. ఎవరికి సంబందం ఉందో టీడీపీనే చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి టీడీపీ అవినీతి, అక్రమాలు చేస్తోందని బుగ్గన దుయ్యబట్టారు. సిఆర్‌డీఏ పరిధిలో లక్ష కోట్ల పనులు చేస్తామని చెప్పి రోడ్లు కూడా సరిగ్గా వేయలేదని బుగ్గన ధ్వజమెత్తారు. జనం నెత్తిన అప్పులు పెట్టి బాహుబలిలో మాహిష్మతి భవనం మాదిరిగా భవనం కడతామన్నారని బుగ్గన​ ఎద్దేవా చేశారు.'బాబును కాపాడాలనేదే పచ్చపత్రికల తాపత్రయం'

అనంతపురం జిల్లా వాసులు అమరావతిలో ముందుగానే భూములు కొన్నారని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. నాలుగు వేల ఎకరాలు టీడీపీ వాళ్లు అమరావతిలో రాజధాని ఏర్పడక ముందే భూములు కొనుగోళ్లు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇంజనీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలు అంటూ కొత్త కంపెనీలు పెట్టి తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ డబ్బులు డ్రా చేశారని ఆయన విమర్శించారు. రేణిగుంట దగ్గర ఇష్టారాజ్యంగా తక్కువ ధరకే భూములు కేటాయించారని మండిపడ్డారు. ఇళ్ల పేరుతో అదనంగా డబ్బులు చార్జ్ చేశారని ఆయన దుయ్య బాట్టారు. చంద్రబాబు బండారం బయటపడటంతో తమపైనే ఎదురుదాడి చేస్తున్నారని బుగ్గన అన్నారు. అడ్డంగా దొరికి అడ్డగోలు దాడి!

పవన్ కల్యాణ్‌  గెస్టుగా వచ్చిపోతుంటారని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఉడుముల పాడులో నకిలీ మద్యం డంప్ దొరికింది వాస్తవం కాదా అని బుగ్గన సూటిగా  ప్రశ్నించారు. లిక్కర్ సరఫరా హుబ్లీ నుంచి జరిగినట్లు విచారణలో తేలిందని ఆయన గుర్తు చేశారు. నకిలీ మద్యం సిండికేట్ ప్రధాన సూత్రధారి అయన వినోద్ కల్లార్‌.. కేఈ ప్రతాప్ పేరును చెప్పారని బుగ్గున గుర్తు చేశారు. కేఈ ప్రతాప్ ఇంట్లో 23 కెమికల్ డ్రమ్ములు దొరికాయని ఆయన చెప్పారు. నకిలీ మద్యం సిండికేట్‌పై దర్యాప్తు జరుగకూడదని కేఈ సోదరులు చూస్తున్నారని  మం‍త్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement