
సాక్షి, రాచర్ల (ప్రకాశం): వైఎస్సార్ సీసీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలపై గ్రామాల్లోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నాలుగు దఫాలుగా రూ.75 వేలు ఇస్తామని జగన్ ప్రకటించడంతో మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తుందని చర్చించుకుంటున్నారు. ఈ పథకం ప్రకటించినందుకు జనగ్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలుపించుకుని, జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని మహిళలు ఆకాంక్షిస్తున్నారు.
ఈ పథకం ద్వారా మహిళలు వ్యాపారాలు చేసుకోవచ్చు...
జగనన్న ప్రవేశ పేట్టిన వైఎస్సార్ చేయూత ద్వారా మహిళలు వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే ఎవరి దగ్గరో అప్పు అడగాల్సిన అవసరం లేదు. జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాము.
- బైర్ల. లలితమ్మ, మాజీ సర్పంచు, యడవల్లి
వైఎస్సార్ చేయూత పథకం పేద మహిళలకు వరం
వైఎస్సార్ చేయూల పథకం నిరుపేదలైన ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఒక వరం లాంటిది. దీని ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది తమ కుటుంబానికి అసరాగా నిలుస్తారు. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ ఇలాంటి పథకాలు ప్రవేశ పెట్టలేదు. జగన్‌మోహన్‌రెడ్డి చేయూత పథకం ద్వారా మహిళలకు రూ.75 వేలు ప్రకటించడంపై చాలా సంతోషంగా భావిస్తున్నాము.
- బందం శకుంతల, మాజీ సర్పంచు, రాచర్ల
టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరగలేదు...
టీడీపీ ప్రభుత్వంలో మహిళలను చిన్నచూపు చూశారు. మహిళలు అంటే గౌరవం లేదు. డ్వాక్రా మహిళల రుణమాఫీ చేస్తామని చంద్రబాబు మహిళలను మోసం చేశారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా మహిళలకు నాలుగు దఫాలుగా రూ.75 వేలు ఇస్తామని జగనన్న ప్రకటించడంతో చాలా సంతోషంగా ఉంది. అందుకే జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటే మహిళలకు న్యాయం జరుగుతుంది.
- సగినాల రాయలమ్మ, రాచర్ల
నవరత్నాలు ఒక వరంగా బావిస్తున్నాం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు రాష్ట్రంలోని ప్రజలకు, మహిళలకు ఒక వరంగా భావిస్తున్నాం. ముఖ్యంగా నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళల అభివృద్ధి కోసం జగనన్న వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రవేశ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో జగనన్న సీఎం కావాలని కోరుకుంటున్నాము.
- సూర.చిన్నమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు, ఆకవీడు
Comments
Please login to add a commentAdd a comment