సాక్షి, విజయనగరం అర్బన్: విద్యాభివృద్ధికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా పేద కుటుంబాలు అక్షరాస్యతకు నోచుకోవడం లేదు. మరోవైపు మధ్యలో చదువులు మానేసిన (డ్రాపౌట్స్) విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. ఇందుకు కారణాలు ఎన్నున్నా పేదరికమే ప్రధానం. చాలీచాలని సంపాదనతో బడిబాట పట్టాల్సిన పిల్లల్ని కూలి పనులకు పంపుతున్నారు. పిల్లలూ పనికి వస్తే నాలుగు డబ్బులు సంపాదించవచ్చని.. వారిని బడికి పంపితే తమ కుటుంబాలు ఎలా గడుస్తాయి.. ఎలా చదివించాలంటూ ప్రశ్నించే తల్లిదండ్రులూ ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో పేద కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారంతా రోజురోజుకూ నిరుపేదలుగా మారుతున్నారు. బిడ్డల భవిష్యత్తును తలచుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పేద విద్యార్థుల తల్లిదండ్రుల దీనస్థితిని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గమనించారు. నవరత్నాల్లో భాగంగా అమ్మ ఒడి పథకాన్ని ప్రకటించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే పేద విద్యార్థులకు మేలు జరిగేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
విప్లవాత్మకమైన మార్పు
పేదల కుటుంబాల్లో కచ్చితంగా ‘అమ్మ ఒడి’ పథకం విప్లవాత్మకమైన మార్పు తెస్తుంది. కార్మిక, కర్షక, బడుగు, బలహీన, పేద, మధ్యతరగతి, అగ్రవర్ణాల్లోని నిరుపేదలు, చిన్న సన్నకారు రైతు బిడ్డలకు ఈ పథకం స్వాంతన చేకూరుస్తుంది. వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టి పేద విద్యార్థుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. వైఎస్ జగన్ ప్రకటించిన ‘అమ్మ ఒడి’ పేదలకు భరోసాగా నిలుస్తుంది. ఈ పథకం అమలైతే అక్షరాస్యతలో మన రాష్ట్రం కేరళ కంటే కూడా ముందుంటుంది.
– సిద్దాబత్తుల జగదీష్, ప్రైవేటు కంపెనీ ఉద్యోగి, విజయనగరం
పిల్లల్లంతా బడిబాట
అమ్మ ఒడి పథకం అమల్లోకి వస్తే తల్లిదండ్రులందరికీ తమ పిల్లలను బడికి పంపాలనే ఆకాంక్ష పెరుగుతుంది. పిల్లల చదువుకు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం పిల్లలను చదివించాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ ఆర్థిక స్తోమత అడ్డొస్తోంది. అమ్మ ఒడితో ఆ భయం ఉండదు.
– జేసీ రాజు, ఉపాధ్యాయుడు, బొబ్బిలి
డ్రాపౌట్స్ పూర్తిగా తగ్గుతాయి
పేదరికం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్స్ తగ్గడం లేదు. కూలినాలి చేసుకునే తల్లిదండ్రులు పిల్లల చదువు ఖర్చు భరించలేక మాన్పిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ దిశగా తమ పార్టీ మేనిఫెస్టోలను తయారు చేస్తే మంచిది. పేద కుటుంబాల పిల్లల చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తే డ్రాపౌట్స్ పూర్తిగా తగ్గిపోయే అవకాశాలున్నాయి.
–బంకపల్లి శివప్రసాద్, ఉపాధ్యాయుడు, గంట్యాడ మండలం
అమ్మ ఒడి పథకం వివరాలు...
ప్రతి విద్యార్థి తల్లి ఖాతాకు ఏటా - రూ.15 వేలు
ప్రతి ఇంటా ఇద్దరు పిల్లలకు
1 నుంచి 5 వరకు విద్యార్థులు రూ.500
ఒక్కొక్కరికి నెలకు ఒకే ఇంట్లో ఇద్దరుంటే.. రూ.1000
5 నుంచి 10 వరకు ఒక్కొక్కరికి.. రూ.750
ఒకే ఇంట్లో ఇద్దరుంటే.. రూ.1500
ఇంటర్ విద్యార్థులు ఒక్కొక్కరికి.. రూ.1000
ఇద్దరుంటే... రూ.2 వేలు
డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌కు.. ఫీజు రీయింబర్స్‌మెంట్
ఉన్నత చదువులకు మెస్ చార్జీలు రూ.20 వేలు
Comments
Please login to add a commentAdd a comment