
టీడీపీని మట్టికరిపిద్దాం
- నవరత్నాలను గడప గడపకూ తీసుకెళ్దాం
- వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే అధికారం
– వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త ఉషాశ్రీచరణ్
కళ్యాణదుర్గం: అబద్దాలు చెప్పడం, అన్ని వర్గాలను మోసం చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని 2019 సాధారణ ఎన్నికల్లో ఆయన పాపం పండక తప్పదని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ అన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద మంగళవారం నవరత్నాల సభ నిర్వహించారు. మండల కన్వీనర్ తిరుమల వెంకటేశులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఉషాశ్రీచరణ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో వందల కోట్లు వెదజల్లి, అధికారాన్ని దుర్వినియోగం చేసి గెలిచిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు సిగ్గులేని మాటలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు గెలవడం సర్వసాధారణమని దీనిని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల ప్రయోజనాలను గడప గడపకూ చెప్పాలన్నారు. ఇందులో భాగంగానే బూత్ కమిటీ కన్వీనర్లు, కమిటీ సభ్యులను నియమించడం జరిగిందన్నారు. అందరూ గ్రామాల్లో బాగా పనిచేసి జగనన్నను సీఎం చేయడానికి పాటు పడాలన్నారు. చంద్రబాబు డబ్బు, అధికారంతో లక్ష్య సాధన కోసం పనిచేస్తే.. జగనన్న విలువలతో రాజకీయాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. సెప్టెంబర్ 5, 6న బూత్ కమిటీ సభ్యులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్‌లో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2 నుంచి 22 వరకు విజయశంఖారావం కార్యక్రమం జరుగుతుందని, జిల్లాలో జరిగే కార్యక్రమానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతారన్నారు. అదే నెల 27న ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలు పెడతారని చెప్పారు.
అనంతరం మండలాల కన్వీనర్లు సోమనాథ్‌రెడ్డి, రామాంజినేయులు, సత్యనారాయణ శాస్త్రి, గోపారం శ్రీనివాసులు, మైనార్టీ సెల్ నాయకుడు అతావుల్లా, సింగిల్ విండో అధ్యక్షుడు బాబురెడ్డి, మాజీ సర్పంచు మొగలి సత్యనారాయణరెడ్డి, యూత్ విభాగం నాయకుడు భీమేష్‌లు మాట్లాడారు. నవరత్నాల కార్యక్రమాలపై సభలో తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు హరినాథ్‌రెడ్డి, వెంకటేశులు, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, ప్రచార కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు నాగరాజ స్వామి, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి రామచంద్ర, నాయకులు ప్రసాద్‌రెడ్డి, గాజుల అంజి, ఆనంద్, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక‌్షావలి, నారాయణస్వామి, నరేష్, హనుమంతు, సర్పంచులు హరినాథ్, గంగాధర, నాయకులు మారుతీ, సేవాదల్ అధ్యక్షుడు గుప్తా, నాగన్న, మాజీ సర్పంచు గంగాధర, బీటీ రాము, ఎంఎస్‌ఎఫ్ రాజు, పరమేశ్వరప్ప, కాలిక్ తదితరులు పాల్గొన్నారు.