kalyanadurgam
-
పచ్చమూకల దాష్టీకం.. వైఎస్సార్సీపీ నేత వాహనానికి నిప్పు
సాక్షి, అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు దాష్టీకానికి దిగారు. వైఎస్సార్ సీపీ నేత, 23వ వార్డు కౌన్సిలర్ అర్చన వాహనాన్ని టీడీపీ నేతలు దగ్ధం చేశారు అర్థరాత్రి ఎవరు లేని సమయంలో వాహనానికి నిప్పు పెట్టారు. రెక్కీ నిర్వహించి కారును తగలబెట్టారు. టీడీపీ నేత మహేష్, అతని అనుచరులపై అర్చన ఫిర్యాదు చేశారు. -
కళ్యాణదుర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం
-
TDP ఎమ్మెల్యే సురేంద్ర బాబుపై BJP నేత విశ్వనాథ్ రెడ్డి ఫైర్
-
కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)
-
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం
-
కళ్యాణదుర్గం బహిరంగ సభలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రలోభాలు
-
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత కలకలం
-
విత్తనం మొదలు పంట అమ్మకం వరకు ఆర్బీకేల ద్వారా సాయం అందిస్తున్నాం
-
వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
ఆదర్శ రైతులతో సీఎం వైఎస్ జగన్ ఫోటో
-
Live: కళ్యాణదుర్గంలో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ
-
కల్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళ కొట్లాట
-
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల కొట్లాట
-
అనంత టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. కుర్చీలతో కుమ్మేసుకున్నారు
సాక్షి, అనంతపురం: జిల్లా టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కళ్యాణదుర్గంలో జరిగిన టీడీపీ సమావేశం రసాభాసగా మారింది. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఇందులో ఇరువర్గాలు కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పలువురు సర్దిచెప్పినా కూడా ఏమాత్రం పట్టించుకోని ఇరువర్గాలు నాయకుల ముందే దాడులు చేసుకోవడం గమనార్హం. చదవండి: (మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు) -
ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతిని కారుతో ఢీకొట్టి..
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. భాస్కర్ అనే యువకుడు కొంతకాలంగా మైథిలి అనే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే వరుసకు అన్న కావడంతో భాస్కర్ ప్రేమను యువతి నిరాకరించింది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో స్కూటీపై వెళుతున్న మైథిలిని కారుతో ఢీకొట్టాడు భాస్కర్. కంబదూరు మండలం బోయలపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో యువతి మైథిలికి తీవ్ర గాయాలవ్వగా అసుపత్రికి తరలించారు. నిందితుడు భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఓ వైపు భర్త చావు బతుకుల మధ్య.. మరోవైపు రోడ్డు ప్రమాదంలో భార్య మృతి -
వదినతో గొడవ.. పల్సర్ బైకుకు నిప్పు.. ఆపై పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి..
కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా): వదినపై కోపంతో ఓ యువకుడు తన ద్విచక్ర వాహనానికి తానే నిప్పు పెట్టాడు. ఈ ఘటన కళ్యాణదుర్గంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని కోట వీధిలో నివాసముంటున్న నవీన్ శనివారం తన అన్న భార్యతో గొడవపడ్డాడు. ఆమెపై కోపంతో అర్ధరాత్రి సమయంలో తన పల్సర్ బైకుకు నిప్పు పెట్టాడు. తర్వాత బంధువులు తన బైకును తగులబెట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి విచారణ చేసిన తర్వాత అసలు నిజం ఒప్పుకున్నాడు. చదవండి👉: కాలాంతకురాలు: భర్త హత్యకు ప్రియుడితో కలిసి ప్లాన్.. కానీ.. -
చంద్రబాబు, లోకేశ్‌లపై పోలీసులకు ఫిర్యాదు
కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా): టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌లపై అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ పోలీసులకు ఫిర్యాదు అందింది. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ భాస్కర్‌రెడ్డి ఆదివారం వీరిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 15న రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ మంత్రి హోదాలో కళ్యాణదుర్గానికి మొదటిసారిగా వచ్చారు. చదవండి: హిజ్రాల అందాల పోటీలు.. సందడే సందడి ఓ దళిత బాలిక అనారోగ్యంతో చనిపోగా.. మంత్రి ర్యాలీ సందర్భంగా పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షల వల్లే చనిపోయిందంటూ చంద్రబాబు, లోకేశ్‌లు ట్విటర్లో పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు ద్వేషభావం కలిగించేలా, పోలీసులకు, ప్రజలకు మధ్య విభేదాలు సృష్టించేలా అసత్య ప్రచారాలు చేసినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని భాస్కర్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టును వైరల్ చేశారని, వారిపైనా కేసు నమోదు చేయాలని కోరారు. -
Ushashri Charan: కంచుకోటను బద్దలు కొట్టి.. మంత్రి వర్గంలో..
బీసీల పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అభిమానం చాటుకున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌కు కేబినెట్లో చోటు కల్పించి బీసీల అభ్యున్నతి, స్త్రీ సంక్షేమం పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. బీసీ వర్గానికి చెందిన మహిళ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిథ్యం వహించడం ఇదే తొలిసారి. దీన్ని బట్టి బీసీ వర్గాలకు ముఖ్యమంత్రి ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షి , అనంతపురం: బీసీ కురుబ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ ఉన్నత విద్యావంతురాలిగా పేరుగడించారు. లైఫ్ సైన్సెస్‌లో బీఎస్సీ, ఎన్విరాన్మెంటల్ విభాగంలో ఎమ్మెస్సీ చదివిన ఆమె 2012లో సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2014లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ చేరారు. తర్వాత కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. నియోజకవర్గంలోని ప్రతి గడపకూ మూడు సార్లు తిరిగి ప్రత్యక్షంగా ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఐదేళ్లు పార్టీ అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆమె కృషిని గుర్తించిన అధిష్టానం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దించింది. ప్రచారంలో రెట్టించిన ఉత్సాహంతో కదిలిన ఆమె సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన మాదినేని ఉమా మహేశ్వర నాయుడిని 19,896 ఓట్ల తేడాతో ఓడించారు. అసెంబ్లీలో గళం.. ఎమ్మెల్యేగా గెలిచాక తనదైన శైలిలో దూసుకెళ్తూ ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ కళ్యాణదుర్గం ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఎమ్మెల్యే గెలుపొందిన వెంటనే ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం అన్ని గ్రామాల్లో తిరిగి ప్రజలకు దగ్గరయ్యారు. ఇక.. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో పలు పర్యాయాలు గళమెత్తి పరిష్కారానికి కృషి చేశారు. తొలిసారి ఎమ్మెల్యే అయినా అసెంబ్లీలో తన మాటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించారు. కళ్యాణదుర్గానికి ఆయువుపట్టుగా ఉన్న బీటీ ప్రాజెక్టుకు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి సాగునీరు తీసుకువచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇవన్నీ గుర్తించిన అధిష్టానం ఉషశ్రీచరణ్‌కు మంత్రి పదవి కట్టబెట్టింది. బీసీ మహిళకు సముచిత స్థానం కల్పించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిజీబిజీగా ఉన్నా.. ఉన్నత విద్యపై ఆసక్తి.. ప్రజాప్రతినిధిగా ప్రజల మధ్య తీరిక లేని సమయం గడుపుతున్నా.. ఉన్నత చదువు చదివేందుకు ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ దరఖాస్తు చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కోటాలో పీహెచ్డీ చేరే అవకాశం ఉండడంతో 3 నెలల క్రితం దరఖాస్తు చేశారు. గత నెలలో ఎస్కేయూ పాలకమండలి ఆమె పీహెచ్డీ దరఖాస్తుకు ఆమోదం తెలిపింది. త్వరలో అడ్మిషన్ కల్పించనున్నారు. ఫిజిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్‌గోపాల్ పర్యవేక్షణలో ఉషశ్రీచరణ్ పరిశోధన చేయనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి తొలి బీసీ మహిళ.. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి గతంలో ముగ్గురు మహిళలు మంత్రులుగా ప్రాతినిథ్యం వహించారు. కానీ ఇప్పటివరకూ బీసీ వర్గానికి చెందిన మహిళలు ఎవరూ మంత్రులు కాలేదు. కానీ ఉషశ్రీ చరణ్‌కు ఆ అవకాశం దక్కింది. గతంలో లక్ష్మిదేవమ్మ, శమంతకమణి, పరిటాల సునీత ఈ జిల్లానుంచి మంత్రులుగా వ్యవహరించారు. వారి తర్వాత మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఉషశ్రీ చరణ్ నాల్గవ మహిళ. సోమవారం ఉదయం ఆమె మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక.. ఇప్పటివరకూ ఎవరికి మంత్రి పదవులు వరిస్తాయో అని ఎదురు చూసిన జిల్లా వాసులు.. ఇప్పుడు ఉషశ్రీచరణ్‌కు ఏ శాఖ దక్కుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: (ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి వర్గ జాబితా.. పూర్తి వివరాలు..) వైఎస్సార్ సీపీ శ్రేణుల సంబరాలు.. ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌కు మంత్రి పదవి దక్కడంతో అటు పార్టీ శ్రేణులు, ఇటు కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎమ్మెల్యే మంత్రి కానుండడంతో కళ్యాణదుర్గంలో సంబరాలు మిన్నంటాయి. టపాసులు పేల్చుతూ, స్వీట్లు పంచుకుంటూ నాయకులు, కార్యకర్తలు ఆనందం పంచుకున్నారు. పూర్వజన్మ సుకృతం రాజకీయాల్లోకి రావడం, ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రి కావడం నిజంగా పూర్వ జన్మ సుకృతం. ఇది ముమ్మాటికీ నాకు జగనన్న ఇచ్చిన వరం. ఈ వరం వల్లే నేను ఇంతదాకా వచ్చా. గతంలో చంద్రబాబు బీసీలతో ఓట్లేయించుకుని వారిని ఓటుబ్యాంకుగానే చూశారు. ఏనాడూ బీసీ వర్గాలకు చెందిన మహిళను మంత్రిని చేయాలని చూడలేదు. నాకు ఏ శాఖ కేటాయించినా బాధ్యతగా, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా నిర్వహిస్తా. అందరినీ కలుపుకుని ఈ ప్రభుత్వానికి, జగనన్నకు కీర్తి తెస్తా. – ఉషశ్రీ చరణ్ ఉషశ్రీ చరణ్ బయోడేటా పూర్తి పేరు: కురబ విరుపాక్షప్ప గారి ఉషశ్రీ చరణ్ (కేవీ ఉషశ్రీచరణ్) పుట్టిన తేదీ: 16–07–1976 తల్లిదండ్రులు : కేవీ రత్నమ్మ, డాక్టర్ కురుబ విరుపాక్షప్ప పుట్టిన స్థలం: రాయదుర్గం భర్త పేరు: శ్రీ చరణ్ రెడ్డి పిల్లలు: కుమార్తె జయనా శ్రీచరణ్, కుమారుడు దివిజిత్ శ్రీచరణ్ విద్యార్హత : బీఎస్సీ (లైఫ్ సైన్సెస్), ఎంఎస్సీ (ఎన్విరాన్మెంటల్ సైన్స్). ఎస్కేయూలో అట్మాస్పియరిక్ సైన్స్ అండ్ గ్లోబల్ వార్మింగ్‌పై పీహెచ్డీ చేయనున్నారు. చదవండి: (నూతన మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న అమరనాథ్ ఫ్రొఫైల్ ఇదే..) -
ప్రియుడితో వాగ్వాదం.. యువతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, కళ్యాణదుర్గం: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ అమ్మాయి జిల్లాకు చెందిన ఓ అబ్బాయితో ఫేస్బుక్ ద్వారా ప్రేమలో పడింది. వీరి వ్యవహారాన్ని ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. పట్టణ సీఐ తేజమూర్తి తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన సుజినకు ఏడాది క్రితం కణేకల్లు మండలం పూలచెర్లకు చెందిన నగేష్‌తో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ కొంతకాలం కల్లూరులోని ఓ సెల్ షో రూంలో పనిచేశారు. కొన్ని రోజులకే ఇద్దరూ ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే సుజిన గురువారం ప్రియుడికి ఫోన్ చేసి తాను వస్తున్నట్లు చెప్పింది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో మనస్తాపానికి గురైన ఆమె వెంటనే తన సెల్ ద్వారా రాయదుర్గం పోలీసులకు ఫోన్ చేసి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం ఇచ్చింది. అప్రమత్తమైన వారు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా కళ్యాణదుర్గంలోని ఆంధ్రాబ్యాంకు సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. చదవండి: (ఫేస్బుక్ ప్రేమ.. ఇంటి నుంచి వెళ్లిపోయి..) కళ్యాణదుర్గం పోలీసులను అలర్ట్ చేశారు. పోలీసు సిబ్బంది బాధితురాలు ఉన్న చోటుకు వెళ్లేలోపే అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే వారు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. విషయాన్ని ప్రియుడు నగేష్, అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి అమ్మాయిని వారికి అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
వానర విన్యాసం.. చూసిన వారు ఔరా అనాల్సిందే!
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గంలో సోమవారం ఉదయం ఓ వానర విన్యాసం చూసిన వారు ఔరా! అంటూ ముక్కున వేలేసుకున్నారు. స్థానిక శంకరప్పతోట వీధిలో ఓ ఇంటి ఎదుట పడి ఉన్న మాస్క్ తీసుకుని అటూఇటూ తిప్పి పరిశీలించిన వానరం.. అనంతరం దానిని మూతికి, ముక్కుకు వేసుకునే క్రమంలో తన ముఖం మొత్తం కప్పేసుకుని చకచకా ఇంటిపైకి చేరుకుంది. ఇదంతా గమనించిన చుట్టుపక్కల వారు... కరోనా బారిన పడకుండా ఇకపై తాము కూడా మాస్క్ ధరించాలంటూ చర్చకు తెర తీశారు. -
‘ఒక్కొక్క నా కొ..’ అంటూ టీడీపీలో రచ్చకెక్కిన విబేధాలు
కళ్యాణదుర్గం రూరల్: అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో విబేధాలు మళ్లీ రచ్చకెక్కాయి. ఈసారి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ‘ఉమా’ వైపు కొందరు.. ‘ఉన్నం’ వైపు మరికొందరు చేరడంతో ఆధిపత్యపోరు తారస్థాయికి చేరుకుంది. ఇరువర్గాల వాగ్వాదాలతో స్థానిక టీడీపీ కార్యాలయం మంగళవారం ప్రతిధ్వనించింది. వివరాల్లోకి వెళితే... మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, తన వర్గీయులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం టీడీపీ కార్యాలయానికి వచ్చారు. కాసేపు ఆగి, తిరిగి వెళ్లిపోతూ అప్పటికే అక్కడ కూర్చొని ఉన్న ప్రస్తుత టీడీపీ ఇన్చార్జ్ ఉమామహేశ్వరనాయుడు వర్గానికి చెందిన కొందరిని ఉద్దేశించి ఉన్నం వర్గీయుడైన కొండాపురం ముత్యాలరెడ్డి దుర్భాషలాడారు. ‘ఒక్కొక్క నా కొ... వచ్చి ఇష్టం వచ్చినట్లు కూర్చొన్నారు. పెద్దాయన (ఉన్నం హనుమంతరాయ చౌదరి) వచ్చినారన్న కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదు. ఎక్కడి నా కొ...లో అంతా ఇక్కడ చేరి మర్యాద లేకుండా కూర్చొంటున్నారు’ అంటూ తీవ్రంగా దూషిస్తూ.. అక్కడున్న కుర్చీలను ఎత్తి విసిరేశారు. దీంతో ఉమా వర్గీయులైన మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ, నాయకులు కొల్లప్ప, సత్తి, డిష్ మురళి తదితరులు ఉన్నం వర్గీయులపై వాదనకు దిగారు. ఆ సమయంలో గందరగోళం చోటు చేసుకుంది. అరుపులతో ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యాలయం లోపల ఏదో జరుగుతుందంటూ బయట జనం గుమికూడారు. దీంతో కొందరు సీనియర్ నాయకులు జోక్యం చేసుకుని రెండు వర్గాల వారిని సర్దిచెప్పి పంపించి అప్పటికప్పుడు పరిస్థితిని కాస్త చక్కదిద్దారు. కానీ రెండు వర్గాల నాయకులు మాత్రం ఏదో రోజు తేల్చుకుందామంటూ అక్కడి నుంచి వెళ్లపోవడం గమనార్హం. -
నీటి కుంటలో చిరుత పిల్ల
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా శెట్టూరు మండలం అడవి గొల్లపల్లి సమీపంలోని ఓ నీటికుంటలో శుక్రవారం చిరుత పిల్ల లభ్యమైంది. అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చిన ఆ చిరుత పిల్ల నీటి కుంటలో పడి ఉండటాన్ని గ్రామస్తులు చూసి అటవీ శాఖ అధికారులకు సమాచరమిచ్చారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్‌సింగ్, ఎఫ్ఎస్వో షాన్వాజ్, జగన్నాథ్, సిబ్బందితో వెళ్లి కుంటలో పడిన చిరుత పిల్లను రక్షించి బోనులోకి చేర్చారు. తల్లి జాడ కోసం సుమారు మూడు గంటల పాటు నిరీక్షించారు. అయినా జాడ తెలియలేదు. దీంతో చిరుత పిల్లను కళ్యాణదుర్గంలోని అటవీ శాఖ కార్యాలయానికి తీసుకొచ్చారు. జిల్లా అటవీ శాఖ అధికారి సందీప్, సబ్ డీఎఫ్‌వో శామ్యూల్ కళ్యాణదుర్గం చేరుకుని దాన్ని పరిశీలించారు. పశు వైద్యుడు ప్రసాద్ సమక్షంలో దాని వయసు 45 రోజులుగా నిర్ధారించారు. అనంతరం పాలు పట్టించారు. చాలా చిన్న వయసు కావడంతో అడవిలో వదిలిపెట్టలేమని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరుపతి జంతు ప్రదర్శనశాలకు తరలిస్తున్నామని డీఎఫ్‌వో చెప్పారు. తల్లితో పాటు నీటి కోసం వచ్చి ప్రమాదవశాత్తు కుంటలో పడి ఉంటుందని భావిస్తున్నారు. -
కళ్యాణదుర్గంలో కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
-
కళ్యాణదుర్గం: అనంత టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
-
అనంత టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
సాక్షి, కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా టీడీపీలోని వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వరనాయుడు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే రీతిలో విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉమామహేశ్వరనాయుడుకు సంబంధించిన ఫ్లెక్సీలను ప్రత్యర్ధులు చించి, నిప్పు పెట్టారు. ఈ ఘటన అనంతపురం టీడీపీలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఉమామహేశ్వరనాయుడు అనుచరులు మాజీ ఎమ్మెల్యే ఉన్నం వర్గీయులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలో ఇరు వర్గీయులు పార్టీ సమావేశాల్లో ఘర్షణలకు దిగిన విషయం తెలిసిందే. చదవండి: ఏబీఎన్ రాధాకృష్ణపై మంత్రి కొడాలి నాని ఫైర్ -
తోపుడుబండి వ్యాపారి.. మునిసిపల్ చైర్మన్
కళ్యాణదుర్గం రూరల్: తోపుడు బండిపై బొప్పాయి, మామిడి, కర్బూజ తదితర పండ్లు విక్రయించే ఓ చిరు వ్యాపారిని మునిసిపల్ చైర్మన్ పీఠం వరించింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్‌గా తలారి రాజ్‌కుమార్ ఎన్నికయ్యారు. ఇంటర్ చదివిన రాజ్‌కుమార్‌కు భార్య విజయలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణకు తోపుడుబండిపై పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీపై అభిమానంతో కార్యకర్తగా సేవలందిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో 10వ వార్డు బీసీ జనరల్‌కు రిజర్వు కాగా.. వైఎస్సార్సీపీ టికెట్ రాజ్‌కుమార్‌కు లభించింది. ఎన్నికల్లో పోటీకైతే దిగాడు కానీ కనీస ఖర్చు కూడా పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోయింది. దీంతో ఇంటింటికీ తిరుగుతూ పేదోడిని ఆదరించాలంటూ ఓటర్లను వేడుకున్నారు. సీఎం వైఎస్ జగన్‌పై ప్రజలకున్న అభిమానం రాజ్‌కుమార్‌కు ఓట్ల వర్షం కురిపించి కార్పొరేటర్‌గా గెలిపించింది. ఇప్పుడు ఏకంగా మునిసిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. చదవండి: నాడు కట్టెలు కొట్టిన మహిళ.. నేడు చిత్తూరు మేయర్ మామ అటెండర్‌గా పనిచేసిన చోట..నేడు కోడలు మేయర్ -
టీడీపీ సంబరాల్లో సచివాలయ ఉద్యోగి
సాక్షి, కళ్యాణదుర్గం: టీడీపీ విజయోత్సవ ర్యాలీలో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని పాలవెంకటాపురం సచివాలయ సర్వేయర్ బాలరాజు హల్చల్ చేశారు. ఆ దృశ్యాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. ఇటీవల సర్పంచ్ ఫలితాలు వెలువడటంతో 13వ తేదీ సాయంత్రం టీడీపీ నాయకులు నాగిరెడ్డిపల్లిలో సంబరాలు చేసుకున్నారు. బాల రాజు స్వగ్రామం నాగిరెడ్డిపల్లి. సర్పంచ్‌గా గెలుపొందిన టీడీపీ మద్దతుదారు కురుబ సందీప్‌ను బాలరాజు స్వయంగా సన్మానిం చారు. విజయోత్సవ ర్యాలీలో ఈలలు వేస్తూ హడావుడి చేశారు. ప్రభుత్వ పథకాలను పార్టీల కతీతంగా పేదలకు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్న సమయంలో ఓ ఉద్యోగి ఇలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: (టీడీపీకి ఓటేయలేదని చెల్లెల్ని ఇంట్లోంచి గెంటేసిన అన్న) -
టీడీపీకి ఓటేయలేదని చెల్లెల్ని ఇంట్లోంచి గెంటేసిన అన్న
సాక్షి, కళ్యాణదుర్గం: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయలేదనే అక్కసుతో ఓ అన్న చెల్లెలిపైనే దాడిచేసి ఇంట్లోంచి గెంటివేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని బాలవెంకటాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన కురుబ లక్ష్మీదేవి పుట్టుకతోనే అంధురాలు. ఈమెకు ముగ్గురు అన్నలు. ఆమె మూడో అన్న తిప్పేస్వామి వద్ద ఉంటోంది. ఈ నెల 13న పంచాయతీ ఎన్నికల్లో ఆమె పెద్దన్న ఉలిగన్న సాయంతో ఓటు వేసింది. రాత్రి సమయంలో టీడీపీ కార్యకర్తలైన తిప్పేస్వామి, అతని కుటుంబ సభ్యులు నువ్వు టీడీపీకి ఓటు వేయకుండా వైఎస్సార్సీపీకి వేశావంటూ దుర్భాషలాడుతూ లక్ష్మీదేవిపై దాడిచేసి ఇంట్లోంచి గెంటేశారు. దీంతో ఆత్మహత్య చేసుకుంటానన్న ఆమెను ఉలిగన్న తన ఇంటికి తీసుకెళ్లాడు. బుధవారం ఉదయం కూడా తిప్పేస్వామి కుటుంబ సభ్యులు మరోసారి ఆమెపై దాడికి పాల్పడ్డారు. -
ఊరంతా ఖాళీ అయ్యింది. ఇంటింటికీ తాళం పడింది
ఆ ఊరంతా ఖాళీ అయ్యింది. ఇంటింటికీ తాళం పడింది. జనసమ్మర్ధంతో ఉండే ఊరు నిర్మానుష్యంగా మారింది. ఒక్కసారిగా ఊళ్లో నిశ్శబ్దం. ఇదేదో కరోనా మహమ్మరి బారిన పడి ఇలా చేశారనుకుంటే పొరబడినట్లే. దశాబ్దాలుగా పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ వస్తున్న గ్రామీణులు తమ ఊరు బాగుకోసం గ్రామదేవతలను వేడుకుంటూ గ్రామం వదిలి వనంబాట పట్టారు. గ్రామ శివారులోని పొలాలు, అడవుల్లోకి వెళ్లి చెట్ల కింద గుడారాలు వేసుకుని, అక్కడే వంటావార్పు చేసుకున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం శ్రీమజ్జనపల్లిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సాక్షి, కుందురీప(అనంతపురం) : పూర్వీకుల ఆచారాన్ని పాటించడంలో భాగంగా కుందుర్పి మండలం శ్రీమజ్జనపల్లి గ్రామం సోమవారం పూర్తిగా ఖాళీ అయింది. గ్రామం చుట్టూ ముళ్లకంచె వేసి సోమవారం మధ్యాహ్నం 12 నుంచి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామస్తులు ఊరు వదిలి వెళ్లారు. చదవండి: ప్యాంట్ కోసం రచ్చ.. మీకెలా కనబడుతున్నాం? దేవుడి ప్రతిమలతో పాటు.. ఆచారంలో భాగంగా గ్రామంలోని నాలుగు ప్రధాన ఆలయాల్లోని దేవుడి ప్రతిమలతో పాటు పెంచుకున్న మూగజీవాలు, కుక్కలు, పిల్లులను కూడా శ్రీమజ్జనపల్లి వాసులు తమ వెంట తీసుకుని, గ్రామం వదిలి అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. కర్ణాటక సరిహద్దున ఉన్న ఈ గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన 280 కుటుంబాలు ఉన్నాయి. 1,120 జనాభా ఉన్న శ్రీమజ్జనపల్లిలో నేటికీ 90 శాతం పూర్వపు ఆచారాలనే అనుసరిస్తూ వస్తున్నారు. ఊరు వదిలి వెళ్తున్న గ్రామస్తులు రోగాలు నయమవుతాయని శ్రీమజ్జనపల్లి వాసులు పాటిస్తున్న ఈ ఆచారం వెనుక సుదీర్ఘ కథనమే ఉంది. గ్రామ పెద్దలు తెలిపిన మేరకు ‘వందేళ్ల క్రితం గ్రామంలో అతిసార సోకి పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. ఆ సమయంలో గ్రామ దేవతలు పాలనాయక, పెద్దక్క రాయమ్మ అమ్మవారు అప్పట్లో అర్చకులుగా ఉన్న పుజారి పాలయ్య, ఓబయ్య, హనుమయ్య కలలో కనిపించి 24 గంటల పాటు అందరూ గ్రామాన్ని వదిలి వెళితే ఊరు సుభిక్షంగా ఉంటుందని తెలిపింది. అప్పటి నుంచి గ్రామస్తులు ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. ప్రతి మూడు లేదా ఐదేళ్లకు ఓసారి ఇలా పూరీ్వకుల ఆచారాన్ని పాటించడం ఆనవాయితీగా మారింది’. 24 గంటలు గ్రామంలోకి ‘నో ఎంట్రీ’.. గ్రామం వదిలిన తర్వాత 24 గంటల పాటు ఆ ఊళ్లోకి ఎవరినీ అనుమతించకుండా చుట్టూ ముళ్ల కంచె వేశారు. స్థానికులతో పాటు ఇతర గ్రామాల ప్రజలు సైతం గ్రామంలోకి వెళ్లకుండా ఊరు చుట్టూ 30 మంది యువకులు కాపలా కాశారు. ఈ నిబంధన అతిక్రమించి, పొరబాటున ఎవరైనా గ్రామంలోకి కాలుపెడితే.. కాసిపుల్లతో నాలుకపై కాలుస్తారు. గ్రామాన్ని ఖాళీ చేసే ముందు వింత ఆచారాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామ శాంతి కోసం జంతు బలులు సమర్పించి పది బస్తాల బియ్యాన్ని వండి పసుపు కుంకుమతో కలిపి గ్రామం చుట్టూ చల్లుతారు. అనంతరం ఏకమొత్తంగా రెండు పూటలకు సరిపడు బియ్యం, బేడలు, కాయగూరలు, పాత్రలు తీసుకుని గ్రామం వదిలి వెళ్లిపోతారు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గ్రామాన్ని ఖాళీ చేసిన శ్రీమజ్జనపల్లి వాసులు.. తిరిగి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇళ్లకు చేరుకుంటారు. ఇళ్లను శుద్ధి చేసిన అనంతరం లోపలకు ప్రవేశిస్తారు. గ్రామం చుట్టూ వేసిన ముళ్లకంచె 80 శాతం నిరక్ష్యరాశ్యులే.. శ్రీమజ్జనపల్లి గ్రామంలో 80 శాతం మంది నిరక్ష్యరాశ్యులే ఉన్నారు. మూఢాచారాలను పాటిస్తూ చిన్న పిల్లలకే పెళ్లిళ్లు చేసేస్తుంటారు. ఏటా పది నుంచి 15 బాల్యవివాహాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఈ గ్రామస్తులకు దైవభక్తి ఎక్కువే. గోపూజతో దినచర్య ప్రారంభిస్తారు. కోళ్లను పెంచరు. కోడి మాంసం తినరు. ఏటా జనవరిలో నరసింహస్వామి గ్రామోత్సవం, శివరాత్రి పర్వదినాల్లో పాలనాయకస్వామి జాతర్లు వైభవంగా నిర్వహిస్తుంటారు. రూ. కోటి విరాళాలతో గ్రామంలో పాలనాయక స్వామి ఆలయ నిర్మాణాన్ని ఇటీవల చేపట్టారు. -
సీఎం చొరవతో నిలిచిన ఊపిరి
కళ్యాణదుర్గం: సీఎం వైఎస్ జగన్ చొరవతో ఓ చిన్నారి ప్రాణం నిలిచింది. వివరాలివీ.. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల కేంద్రానికి చెందిన ముక్కన్న, సునీతమ్మ దంపతుల కుమారుడు అమిత్ (4) నవంబర్ 24న వేరుశనగ విత్తనం మింగాడు. ఊపిరాడక ఇబ్బందిపడుతున్న కుమారుడిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్ చేయించగా ఊపిరితిత్తుల్లోకి వేరుశనగ విత్తనం వెళ్లిందని తేలింది. శస్త్రచికిత్సకు రూ.2.50 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక స్థోమత లేని చిన్నారి తల్లిదండ్రులు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ప్రభావతమ్మ, మండల నాయకులను ఆశ్రయించారు. వారు ఇటీవల ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యే ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం వెంటనే వైద్య చికిత్సలు అందించాలని కర్నూలు శ్రీసత్యసాయి ఈఎస్టీ ఆస్పత్రి వైద్యులకు సూచించారు. వైద్యులు శుక్రవారం శస్త్రచికిత్స చేసి చిన్నారి ప్రాణాలు కాపాడారు. చిన్నారి కుటుంబ సభ్యులు సీఎం, ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
సాక్షి, అనంతపురం: జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామం వద్ద కారు- రెండు బైకులు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఆర్డీటీ ఆస్పత్రి డాక్టర్ శివ మాధవి(38) ఉన్నట్లు గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
ఇద్దరు పిల్లలను కొట్టి చంపిన తండ్రి
సాక్షి, అనంతపురం : మతి స్థిమితం కోల్పోయిన తండ్రి రక్తం పంచుకు పుట్టిన బిడ్డలను హతమార్చిన విషాద ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామానికి చెకందిన రవి.. ఇద్దరు చిన్నారులు సుదీప్,(5) సుధీర్ (5)ను హతమార్చాడు. బుధవారం రాత్రి పొద్దుపోయిన అనంతరం తన ఇద్దరు కొడుకులను గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకు వెళ్లి గొంతు నులిమి చంపి అక్కడే పూడ్చి పెట్టాడు. అయితే పిల్లలు కనిపించకపోవడంతో స్థానికులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూడ్చి పెట్టిన ఇద్దరు చిన్నారులను గ్రామస్తులు వెలికితీసి, పోలీసులకు సమాచారం అందించారు. కళ్యాణదుర్గం రూరల్ ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు రవిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
టీడీపీ ఇన్చార్జ్పై కలెక్టర్ సీరియస్
సాక్షి, అనంతపురం : కళ్యాణదుర్గం టీడీపీ ఇన్చార్జ్ ఉమామహేశ్వర నాయుడుపై కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఉమామహేశ్వరనాయుడు తన పొలాలకు అక్రమంగా నీటిని తరలించడంపై సమగ్ర వివరాలతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన కలెక్టర్ గంధం చంద్రుడు.. తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. (జేసీ ప్రధాన అనుచరుడు రషీద్ మృతి) సోమవారం జీడిపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు. రిజర్వాయర్ నుంచి పెద్ద ఎత్తున నీటిని తరలించడం చట్టరీత్యా నేరమని, నీటిని తరలించడానికి ఎవ్వరికీ అనుమతులు లేవన్నారు. అనంతరం హెచ్ఎన్ఎస్ఎస్, రిజర్వాయర్ అధికారులు మాట్లాడుతూ జలచౌర్యంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. (‘చంద్రబాబు కనుసన్నల్లో ఏబీఎన్’) -
ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఇంట్లో మద్యం పట్టివేత
సాక్షి, అనంతపురం : కళ్యాణదుర్గంలో ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శంకర్ నాయక్ ఇంట్లో భారీగా మద్యం బయటపడింది. అతడి ఇంటి నుంచి 368 బాటిళ్ల కర్ణాటక మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రజ్యోతి విలేకరి శంకర్ నాయక్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా లాక్డౌన్ సమయంలోనూ అక్రమంగా మద్యం విక్రయించినట్లు శంకర్ నాయక్‌పై పలు ఆరోపణలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. (ఆంధ్రజ్యోతి వాహనం సీజ్) -
కళ్యాణ దుర్గం టీడీపీలో ‘టిక్కెట్ రగడ’
సాక్షి, కళ్యాణదుర్గం: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా నెగ్గుకురావాలో తెలియక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు తలలు పట్టుకుంటుంటే.. మరో వైపు టిక్కెట్ల వివాదాలతో పార్టీలో అసంతృప్తి రగులుతోంది. తనకు అన్యాయం జరిగిందని అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం టీడీపీ కార్యాలయం ఎదుట కార్యకర్త ఆర్కే రాజు ధర్నాకు దిగారు. టీడీపీలో ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమా మహేశ్వర్ నాయుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నిరసన తెలిపారు. ఆందోళన చేస్తోన్న కార్యకర్త రాజును టీడీపీ నేతలు బలవంతంగా టీడీపీ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. ఆర్కే రాజు కళ్యాణదుర్గం మండలం నారాయణపురం ఎంపీటీసీ టిక్కెట్ ఆశించి భగ్గపడ్డారు. -
అనంత టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి, కళ్యాణదుర్గం: టీడీపీలోని వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. పార్టీ వి స్తృత స్థాయి సమావేశాల సందర్భంగా శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక టీడీపీ కార్యాలయంలో తాజా, మాజీ ఎమ్మెల్యే ఉన్నం వర్గీయులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించగా.. ఇటీవల ఎమ్మెల్యే అభ్యరి్థగా పోటీ చేసిన ఉమా మహేశ్వర నాయుడు తన సొంత కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ పరిశీలకుడుగా బీటీ నాయుడు కార్యక్రమాలకు హాజరయ్యారు. మొదటగా ఉమా మహేశ్వర నాయుడు నిర్వహించిన సమావేశంలో పాల్గొని.. మధ్యాహ్నం 3.30 గంటలకు మాజీ ఎమ్మెల్యే ఉన్నం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. దీంతో ఉన్నం వర్గీయులు ఆర్కే రాజు, ఆర్కే అలెగ్జాండర్, మాజీ సర్పంచ్ శ్రీరాములు, షామీర్, నారాయణ, మాజీ జడ్పీటీసీ మల్లికార్జున తెలుగు యువత నాయకుడు కిశోర్, వెంకటేశులు తదితరులు సమావేశానికి హాజరైన బీటీ నాయుడును చుట్టుముట్టి నిలదీశారు. ఒక్కసారిగా అందరూ గళం విప్పడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పార్టీ అధిష్టానం ఇన్చార్జ్ వ్యవస్థను నియమించకపోయినా ఇన్చార్జ్గా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఉన్నం వర్గీయులను పార్టీకి దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం ఎమ్మెల్యే అభ్య రి్థగా ఉమా మహేశ్వర నాయుడిని పంపితే అందరూ కష్టపడి పనిచేశామని, రాష్ట్రంలో ప్రతిపక్ష పారీ్టకి అనుకూలంగా గాలి ఉండటంతో 151 చోట్ల ఓడిపోయామన్నారు. ఆ విషయాన్ని మర్చిపోయి ఓడించారని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉన్నం హనుమంతరాయ చౌదరికి టికెట్ రానప్పుడు తామంతా అధినేత చంద్రబాబు, నారా లోకే‹Ùను సంప్రదిస్తే జిల్లా అధ్యక్ష పదవి కట్టబెడుతానని, ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఉన్నం హనుమంతరాయ చౌదరికి సముచిత స్థానం ఇవ్వకపోతే ఒప్పుకునేది లేదని స్పష్టంచేశారు. ఉన్నంతో పాటు ఆయన వర్గీయులను పార్టీకి దూరం చేసే దుష్ప్రచారాలు జరుగుతున్నాయని వాపోయారు. కంబదూరు మాజీ సర్పంచ్ శ్రీరాములు స్పందిస్తూ పార్టీలోకి చంద్రబాబు కన్నా తామే ముందు వచ్చామని, మా తర్వాతే చంద్రబాబు టీడీపీలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. తాజా మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి స్పందిస్తూ పార్టీ కోసం పనిచేస్తే కొందరు ఉన్నం హనుమంతరాయ చౌదరికి టికెట్ రాకుండా అడ్డుకున్నామని.. పార్టీ అభ్యర్థి గెలిచినా, ఓడినా తమకేమీ సంబంధం లేదని మాట్లాడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం బీటీ నాయుడు స్పందించి పారీ్టలో అందరికీ సముచిత స్థానం ఉంటుందని, సమస్య పరిష్కారానికి అధినేత దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. -
పిల్లల ఆకలి చూడలేక తల్లి ఆత్మహత్య
సాక్షి, కళ్యాణదుర్గం రూరల్(అనంతపురం) : పిల్లల పోషణ భారమై వివాహిత అర్ధంతరంగా తనువు చాలించింది. ఈ ఘటన కళ్యాణదుర్గంలో జరిగింది. మృతురాలి భర్త, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కళ్యాణదుర్గం పట్టణం చౌడేశ్వరివీధిలో నివాసముంటున్న నాగరాజు, నాగమణి దంపతుల కుమార్తె బోయ రేణుక (26)కు కుందుర్పి మండలం గురువేపల్లికి చెందిన మూర్తితో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు హర్షిత(8), ధరణి(3), మరో 4 నెలల పాప ఉన్నారు. మూర్తి మూడు ఎకరాల పొలంలో టమాట సాగు చేశాడు. పంట చేతికందకపోవడంతో నష్టం వచ్చింది. అప్పటి నుంచి కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో కొన్ని నెలలు పుట్టింటిలో ఉండాల్సిందిగా భార్య, పిల్లలను కళ్యాణదుర్గం పంపించాడు. అక్కడ కుమార్తెలను పోషించుకునే దారి తెలియక మదనపడేది. బతుకుదెరువు కనిపించకపోవడంతో పిల్లలను పస్తులుండటం చూడలేక మనస్తాపం చెందిన రేణుక సోమవారం ఉదయం ఇంట్లోనే దూలానికి చీరతో ఉరివేసుకుంది. కొద్దిసేపటి తర్వాత బంధువులు, స్థానికులు గమనించి ఆమెను కిందకు దించి హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే రేణుక ప్రాణం విడిచినట్టు డాక్టర్లు నిర్ధారించారు. భర్త మూర్తి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులను శిశు గృహానికి పంపించడానికి చర్యలు తల్లిని కోల్పోయిన ముగ్గురు పిల్లల బాగుగోలు చూసుకునేందుకు అనంతపురంలోని శిశుగృహకు పంపించడానికి చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ సీడీపీఓ గీతాంజలి, సూపర్వైజర్ పద్మజ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వాస్పత్రికి చేరుకుని చిన్నారుల వివరాలను సేకరించారు. త్వరలోనే చిన్నారులను శిశుగృహకు అప్పగిస్తామని సీడీపీఓ చెప్పారు. -
ఉన్నం వర్సెస్ ఉమా
అనంతపురం,కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పార్టీ ఇన్చార్జ్ ఉమామహేశ్వరనాయుడుల మధ్య శుక్రవారం ఘర్షణ జరిగింది. ఇరువురి మధ్య ఘర్షణతో రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో పార్టీ కార్యాలయంలో ఉద్రిక్తతకు దారి తీసింది.ఎన్నికల అనంతరం తాజా మాజీ ఎమ్మెల్యే ఉన్నం టీడీపీ కార్యాలయానికి అడపాదడపా వచ్చి వెళ్లేవారు. పార్టీ కార్యాలయ మరమ్మతులు జరుగుతుండటంతో ఇటీవల కార్యాలయానికి రాలేదు. దసరా పండుగ రోజు కార్యాలయానికి వచ్చి వెళ్లారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉన్నం టీడీపీ కార్యాలయానికి వచ్చారు. కొద్దిసేపు నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించి వివాహ కార్యక్రమానికి బయల్దేరారు. వాహనంలో బయలుదేరి వెళ్తుండగా టీడీపీ ఇన్చార్జ్ ఉమామహేశ్వరనాయుడు వాహనంలో కార్యాలయానికి వచ్చి లోపలికి వెళ్తూ వైఎస్సార్సీపీకి ఓట్లేసిన వారు పార్టీ కార్యాలయానికి వచ్చే అర్హత ఏముంటుందంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఉమా వ్యాఖ్యలను అనుచరులు ఉన్నం దృష్టికి తీసుకొచ్చారు. ‘రావొద్దనడానికి కార్యాలయం వారి అబ్బ సొమ్మా.. పెద్దాయనా.. వాహనం దిగు.. తిరిగి కార్యాలయంలోకి వెళ్దాం’ అని కార్యకర్తలు పట్టుబట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన ఉన్నం తనపై ఆరోపణలు చేసిన వారు ఎవడంటూ తీవ్ర పదజాలంతో కార్యాలయంలోకి వెళ్లారు. ఈ సందర్భంలో ఇరు వర్గీయుల మధ్య వాగ్వాదం, తోపులాటలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా పార్టీ కార్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అక్కడున్న ద్వితీయ శ్రేణి నాయకులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. అనంతరం ఉన్నం అక్కడి నుంచి నిష్క్రమించగా.. ఉమా మహేశ్వర నాయుడు వర్గీయులు మరికొంతమంది పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. -
బాలికను బలిగొన్న నీటికుంట
సాక్షి, బెళుగుప్ప(అనంతపురం) : తగ్గుపర్తి గ్రామ సమీపంలోని నీటికుంట ఓ బాలికను మింగింది. దప్పిక తీర్చుకునేందుకు వెళ్లిన బాలికను నీటికుంట మింగేసింది. మరొక బాలికను అటుగా వచ్చిన ఓ రైతు గమనించి రక్షించాడు. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తగ్గుపర్తి దళితవాడకు చెందిన అస్మిత (13) స్థానిక ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. దసరా సెలవులు రావడంతో ఇంటివద్దనే ఉంటోంది. మంగళవారం స్నేహితులు చిన్ని, శాలినితో కలిసి నల్లరేగడి భూముల్లోనూ, గట్లపైనా కాచే చిన్న కాకరకాయలను తీయడానికి వెళ్లింది. ఎండ తీవ్రతకు దప్పిక వేయడంతో నీటి కోసం వెదికింది. సమీపంలోనే గాలిమరల కంపెనీల రహదారుల కోసం మట్టిని తవ్వగా ఏర్పడిన గుంతల్లోకి వర్షపునీరు వచ్చి చేరింది. లోతు గమనించని చిన్నారులు నీరు తాగేందుకు వెళ్లారు. నీరు తాగుతున్న సమయంలో అస్మిత కాలుజారి కుంటలోకి పడిపోయింది. కాపాడే ప్రయత్నంలో స్నేహితురాలు చిన్ని సైతం పడిపోయింది. గట్టుపై ఉన్న శాలిని గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో పెట్రోలు అయిపోయి ద్విచక్రవాహనం తోసుకుంటూ వస్తున్న రైతు లక్ష్మినారాయణ అక్కడకు చేరుకుని చిన్నిని ఒడ్డుకు చేర్చాడు. లోతు ఎక్కువ ఉన్న చోట మునగడంతో అస్మిత దొరకలేదు. కొంతసేపటి తర్వాత మరికొందరితో కలిసి నీటికుంటలోకి దిగి అస్మితను బయటకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే అస్మిత ప్రాణం విడిచింది. ‘ఇంతవరకు కళ్ల ముందు ఆడుకుంటూ ఉంటిరే.. అంతలోనే కానరాని లోకాలకు వెళ్తివా బిడ్డా’ అంటూ అస్మిత తల్లిదండ్రులు మారెక్క, వన్నరూప్పలు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
చందాకోసం ఐచర్‌ను ఆపబోతే..
సాక్షి, కళ్యాణదుర్గం (అనంతపురం) : వినాయక చవితి చందాల వసూళ్లు హద్దుమీరుతున్నాయి. యువకులు రోడ్లపైకి వచ్చి తాడు అడ్డు పెట్టి వాహనాలను ఆపి చందాలు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కళ్యాణదుర్గం మండలం యర్రంపల్లి సమీపంలో రోడ్డుపై దాదాపు 20 మంది యువకులు వారం రోజులుగా వినాయక చవితి చందాలు వసూలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కంబదూరు వైపు నుంచి కళ్యాణదుర్గం వెళ్తున్న ఐచర్ వాహనాన్ని ఆపబోయారు. అప్పటికే అడుగడుగునా ఇలాంటి చందాల బ్రేకప్‌లతో విసుగు చెందిన డ్రైవర్ రోడ్డుకు అడ్డంగా ఉన్న యువకులవైపు దూసుకెళ్లాడు. వారిలో ముగ్గురిని ఢీకొట్టి పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో యర్రంపల్లి గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్, విష్ణు, వసంత్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు గుర్తించి గాయపడిన వారిని కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం పంపించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ పేరుతో వేదిస్తున్నందుకే హత్య
సాక్షి, కళ్యాణదుర్గం(అనంతపురం) : కంబదూరు మండల కేంద్రంలో ఎరికల రవి హత్య మిస్టరీ వీడింది. వివాహితను ప్రేమ పేరుతో వేధించినందువల్లే బాధితురాలి సోదరుడు తన స్నేహితులతో కలిసి రవిని అంతమొందించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మల్లికార్జున తన కార్యాలయంలో రూరల్ సీఐ శివశంకర్ నాయక్‌తో కలిసి మీడియాకు వెల్లడించారు. కంబదూరుకు చెందిన ఎరికల రవి తండ్రి ఎరికల ముత్యాలప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఎరికల రవి ఆటో నడుపుకుంటూ కళ్యాణదుర్గం మండలం దాసంపల్లికి చెందిన వివాహితను ప్రేమ పేరుతో వేధించేవాడు. సదరు వివాహిత తనకు ఎదురవుతున్న వేధింపులను సోదరుడు బోయ సీతారాములకు చెప్పుకుని విలపించింది. ఈ విషయంలో సోదరునితో పాటు సోదరుని స్నేహితులు కలిసి ఎరికల రవిని పలుమార్లు హెచ్చరించి ప్రేమపేరుతో వేధించడం మానుకోవాలని హెచ్చరించారు. అయినా రవి ప్రవర్తనలో మార్పు రాలేదు. తన సోదరికి ఎదురవుతున్న వేధింపుల గురించి సీతారాములు స్నేహితులైన దాసంపల్లి మొగలి రామాంజినేయులు, మాదిగ సురేష్‌ల వద్ద చెప్పుకుని బాధపడ్డాడు. పథకం ప్రకారం ముగ్గురు ఈ నెల 19న కంబదూరుకు వెళ్లి ఎరికల రవి బర్త్‌డే సందర్భంగా డిన్నర్ ఇవ్వాలని కోరారు. సదరు ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంలో ఎరికుల రవిని ఎక్కించుకుని కంబదూరులోని వైఎన్‌హెచ్ కోట రోడ్డులో ఉన్న ఈడిగ గౌరమ్మ కల్లు దుకాణం వద్దకు వెళ్లి ఫూటుగా మద్యం తాగారు. రాత్రి 10.30 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఎరికల రవితో గొడవకు దిగారు. పథకం ప్రకారం తెచ్చుకున్న మచ్చు కొడవళ్లతో అక్కడే హతమార్చారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు సీతారాములు, మొగలి రామాంజనేయులు, మాదిగ సురేష్లను డీఎస్పీ ఆదేశాల మేరకు కంబదూరు మండలం నూతిమడుగు బస్టాండ్ వద్ద అరెస్టు చేశారు. వీరివద్ద ఉన్న రెండు మచ్చుకొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. -
తల్లిలేని లోటు తీరుస్తున్న కుక్క
అనంతపురం : సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య చిన్నపాటి గొడవ జరిగితేనే అది ఎన్నో మలుపులకు కారణమవుతుంది. అలాంటిది జాతి వైరాన్ని మరచి.. అమ్మతనం చూపుతూ మరో జీవికి పాలు ఇస్తోంది ఓ శునకం. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గం మండల పరిధిలోని తిమ్మసముద్రం గ్రామానికి చెందిన బోయ నరేష్.. రెండు ఎద్దులు, మూడు ఆవులు, ఒక కుక్క , ఒక గొర్రెపిల్లను పెంచుకుంటున్నాడు. అయితే గొర్రె పిల్లకు కుక్కనే పాలు ఇస్తూ తల్లిలేని లోటు తీరుస్తోంది. గ్రామస్తులు కూడా ఈ దృశ్యాలను చూస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కళ్యాణదుర్గం బహిరంగ సభలో వైఎస్ జగన్
-
తెలంగాణలో కంటే ఎక్కువ జీతాలిస్తాం : వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం : ‘జీతాలు పెంచండని గళమెత్తిన హోంగార్డులు, అంగన్వాడీ, ఆశావర్కర్లను టీడీపీ సర్కార్ అరెస్టులు చేయించింది. ఎన్నికలకు 6 నెలల ముందు నామమాత్రంగా జీతాలు పెంచి మరోసారి మోసం చేయాలని చూస్తోంది. కనీసం పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఇచ్చే జీతాలన్న ఇవ్వడం లేదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ మెరుగైన జీతాలిస్తాం.. తెలంగాణలో కంటే వెయ్యి రూపాయలు ఎక్కువే అందిస్తాం. ఆర్టీసీలో పనిచేస్తున్న 65 వేలమంది కార్మిక సోదరులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం’అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామినిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ జిల్లాలోని కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మంత్రిగారికి పట్టదు.. జీడిపల్లి రిజర్వాయర్ నిర్మించి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు అనంతపురానికి తీసుకొచ్చిన ఘనత దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖరరెడ్డిది. కానీ, టీడీపీ అయిదేళ్ల పాలనలో కళ్యాణదుర్గం నిజయోజకవర్గ పరిధిలో గల 114 చెరువులను నింపేందుకు ఉద్దేశించిన భైరవాని దిబ్బ ప్రాజెక్టుకు నీటిని తీసుకెళ్లే కాలువ పనులు నత్తనడక సాగుతున్నాయి. 61 కి.మీ పొడవైన కాలువ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాలువ నిర్మాణం కోసం సేకరించిన భూములకు ఇప్పటికీ రైతుకుల పరిహారం ఇవ్వలేదు. రైతుల పట్ల బాబుకు ఎంత ప్రేముందో చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అవసరం లేదు. పిల్లకాలువలన్నీ పూర్తి చేసి హంద్రీనీవా ద్వారా అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేసే అవకాశమున్నా వైఎస్సార్ చనిపోయిన తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. ఈ నియోజకవర్గంలో టమోటా సాగు ఎక్కువగా ఉంది. కనీసం కిలోకు రూ. 10 రానిదే పెట్టుబడి ఖర్చులకు కూడా సరిపోవు. అలాంటిది కేజీ టమోటా ధర రూ.3కి పడిపోయాయి. ఇక సీజన్లో అయితే కేజీ టమోటా రూపాయికి పడిపోవడంతో.. పంటను రోడ్డుపైనే పడేసిన పరిస్థితులు నెలకొన్నాయి. అరటి పంట రైతుల పరిస్థితి కూడా అలాగే ఉంది. కేజీ అరటికి రూ. 10 నుంచి 12 రానిదే గిట్టుబాటు కాదు. కానీ రూ.7 మాత్రమే వస్తోంది. ఖరీఫ్‌లో వేరుశనగ పంటలేస్తాం. కనీస మద్దతు ధర రూ.4890. అయితే, దళారులు.. ప్రభుత్వ సాయం కరువవడంతో.. రూ. 3 వేలకు కూడా కొనుక్కునేవారు రారు. 10 బస్తాలు పండాల్సిన చోట రెండు మూడు బస్తాలు కూడా పండకపోవడం.. గిట్టుబాటు ధర లేకపోవడంతో.. రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దారుణమైన పరిస్థితులు చూశాం. ఇదే నియోజకవర్గంలో 20 రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతే... టీడీపీ ప్రభుత్వం 11 మందే అని అబద్ధాలు చెప్తుంది. ఆ 11 మందిలో నాలుగు కుటుంబాలకే నష్టపరిహారం అందించింది. అదికూడా పూర్తిగా చెల్లించకుండా టీడీపీ నేతలు ఇబ్బందులకు గురిచేశారు. రైతులకు, పేదలకు మంచి చేయాలన్ని ఆలోచన సీఎం చంద్రబాబుకు, మంత్రి కాలువ శ్రీనివాస్‌కు లేనేలేదు. వారి ధ్యాసంతా వేదవతి నది నుంచి ఇసుక దోపిడీ ఎలా చేయాలని మాత్రమే ఉంటుంది. కళ్యాణదుర్గంలో రోడ్డు విస్తరణ పేరిట దుకాణాలు, భవనాలు కూల్చేశారు. కనీసం నష్టపరిహారం ఇవ్వాలన్న ఆలోచన లేదు. వీళ్లసలు మనుషులేనా.! టీడీపీ అరాచక పాలనలోనే నా పాదయాత్ర సాగింది. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో మీ బాధలు, కష్టాలు చెప్పారు. మీ ఆవేదన అర్థం చేసుకున్నాను. ఈ సభలో మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. మీ అందరికీ నేనున్నాను అని మాటిస్తున్నాను. కల్యాణదుర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేవీ ఉషశ్రీపై, అనంతపురం ఎంపీ అభ్యర్థి తలారి రంగయ్యపై మీ దీవెనలు, చల్లని ఆశీస్సులు ఉంచండి. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెలంగాణలో కంటే ఎక్కువ జీతాలిస్తాం : వైఎస్ జగన్
-
ఇక్కడ టీడీపీ డమ్మీ..!
సాక్షి, కల్యాణదుర్గం : కల్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటయ్యాక ఇప్పటివరకూ 13 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, టీడీపీ ఐదుసార్లు, స్వతంత్రులు రెండుసార్లు, సీపీఐ, జేఎన్పీ ఒక్కోసారి విజయం సాధించాయి. ఈ దఫా కల్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దీనికి కారణం పీసీపీ చీఫ్ రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉండటమే. ఇక్కడ వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగారు. దీంతో ఇక్కడ చతుర్ముఖ పోటీ నెలకొంది. చీకటి ఒప్పందంతో బరిలోకి ‘డమ్మీ’ ఏపీలో కాంగ్రెస్ ఎక్కడా గెలిచే పరిస్థితి లేదు. దీంతో కనీసం పీసీసీ చీఫ్‌ను గెలిపించాలని చంద్రబాబుకు రాహుల్ గాంధీ ఫోన్ చేసి చెప్పారు. ఇక్కడ ఆయనను గెలిపిస్తే.. మిగిలిన చోట్ల తాము సహకరిస్తామన్నారు. దీంతో ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన పెద్దగా ఎవరికీ తెలియని తృతీయ శ్రేణి నేత ఉమామహేశ్వర్‌కు టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ ‘ఫ్యాన్’ హోరుతో కాంగ్రెస్ అభ్యర్థి ఏటికి ఎదురీదుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ సాగిస్తున్న కుమ్మక్కు రాజకీయాలు తేటతెల్లం కావడంతో ఈ రెండు పార్టీలను ప్రజలు దూరంపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో బలంగా ఉన్న వైఎస్సార్ సీపీకి ఈ పరిణామాలు మరింత కలిసొచ్చే అంశం. ఆరోపణలు, విభేదాలతో టీడీపీ సతమతం కల్యాణదుర్గం నుంచి చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో 22,318 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి గెలుపునకు ఈ మెజార్టీ దోహదపడింది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో గత ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక మెజార్టీ వచ్చిన స్థానం ఇదే. ఈ ఎన్నికల్లో చౌదరికి టిక్కెట్ రాకుండా జేసీ దివాకర్‌రెడ్డి అడ్డుపడ్డారు. దీనికితోడు చౌదరి కుటుంబం అవినీతి విషయంలో రెచ్చిపోయింది. విండ్ పవర్ భూముల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్‌కు పాల్పడింది. రైతుల నుంచి ఎకరా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకే భూములు కొనుగోలు చేసి.. అవే భూములను విండ్ పవర్ సంస్థకు రూ.14 లక్షల నుంచి రూ.17 లక్షలకు విక్రయించారు. నియోజకవర్గంలో వేల ఎకరాల భూములను విండ్ పవర్ కోసం కంపెనీలు కొనుగోలు చేశాయి. రైల్వే కాంట్రాక్టుల్లో కూడా ఆయన కుటుంబం భారీగా లబ్ధి పొందింది. నియోజకవర్గంలో జరిగిన పనులు, ఇతర కాంట్రాక్టుల్లో ఆ కుటుంబ సభ్యులు చేతులు పెట్టారు. ఈ పరిణామాలతో టీడీపీ ప్రతిష్ట బాగా దెబ్బతింది. దీనికి తోడు స్థానిక నేతలైన రామ్మోహన్ చౌదరి, నారాయణ, రమేశ్, మల్లికార్జున వంటి నాయకులు చౌదరికి టిక్కెట్ రాకుండా అడ్డుకున్నారు. స్థానికులకే సీటివ్వాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో ఎస్ఆర్ కనస్ట్రక్షన్ అధినేత అమిలినేని సురేంద్రబాబుకు చంద్రబాబు టిక్కెట్ ఖరారు చేశారు. ఎన్నికల ప్రచారం చేసుకోమని ఫోన్లో సూచించారు. ఆ రెండు పార్టీలకూ ముప్పే రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గం మడకశిర. పునర్విభజనలో భాగంగా 2009లో మడకశిర ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఆయన కల్యాణదుర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో పెనుకొండ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లోనూ తిరిగి కల్యాణ దుర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. టీడీపీ సహకారం లభిస్తుందని ఆశించినా.. మూడు దశాబ్దాల పాటు సైకిల్ గుర్తుకు ఓటేసిన ప్రజలు ఒక్కసారి హస్తానికి వేయాలంటే కుదరని పని. దీంతో టీడీపీ ఓట్లు రఘువీరా, ఉమామహేశ్వరావు చీల్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే చౌదరి కూడా టీడీపీ ఓట్లు చీల్చే అవకాశం ఉంది. టీడీపీలో విభేదాలు.. వైఎస్సార్సీపీలో ఐక్యతా రాగం టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే చౌదరిని వ్యతిరేకించిన వారంతా ఉమామహేశ్వరరావుకు కూడా సహకారం అందించడం లేదు. స్థానికులకు సీటివ్వాలని తాము కోరితే స్థానికేతరులకు ఇచ్చారన్న అక్కసుతో పార్టీ శ్రేణులు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్ సీపీ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి పార్టీ గెలుపునకు కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిమి పాలైన తిప్పేస్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రఘునాథరెడ్డి, ఎల్ఎం మోహన్‌రెడ్డితోపాటు నేతలంతా ఉషాశ్రీ గెలుపు కోసం పనిచేస్తున్నారు. ఇది వైఎస్సార్ సీపీకి లాభించే అంశం. మరోవైపు రాష్ట్రంలో ఒక్క స్థానంలోనైనా గెలవాలనే తాపత్రయంతో బరిలో ఉన్న పీసీపీ చీఫ్‌కు వాతావరణం అనుకూలంగా లేదు. ఓటర్ల వివరాలు మొత్తం : 2,10,622 పురుషులు : 1,06,341 మహిళలు : 1,04,275 ఇతరులు: 06 – మొగిలి రవివర్మ, సాక్షి ప్రతినిధి, అనంతపురం -
కళ్యాణదుర్గంలో దంపతుల ఆత్మహత్య
సాక్షి, కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. ప్రసన్నకుమార్, భారతి దంపతులు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల వల్లే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టీడీపీని మట్టికరిపిద్దాం
- నవరత్నాలను గడప గడపకూ తీసుకెళ్దాం - వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే అధికారం – వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ కళ్యాణదుర్గం: అబద్దాలు చెప్పడం, అన్ని వర్గాలను మోసం చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని 2019 సాధారణ ఎన్నికల్లో ఆయన పాపం పండక తప్పదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ అన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద మంగళవారం నవరత్నాల సభ నిర్వహించారు. మండల కన్వీనర్ తిరుమల వెంకటేశులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఉషాశ్రీచరణ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో వందల కోట్లు వెదజల్లి, అధికారాన్ని దుర్వినియోగం చేసి గెలిచిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు సిగ్గులేని మాటలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు గెలవడం సర్వసాధారణమని దీనిని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల ప్రయోజనాలను గడప గడపకూ చెప్పాలన్నారు. ఇందులో భాగంగానే బూత్ కమిటీ కన్వీనర్లు, కమిటీ సభ్యులను నియమించడం జరిగిందన్నారు. అందరూ గ్రామాల్లో బాగా పనిచేసి జగనన్నను సీఎం చేయడానికి పాటు పడాలన్నారు. చంద్రబాబు డబ్బు, అధికారంతో లక్ష్య సాధన కోసం పనిచేస్తే.. జగనన్న విలువలతో రాజకీయాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. సెప్టెంబర్ 5, 6న బూత్ కమిటీ సభ్యులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్‌లో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2 నుంచి 22 వరకు విజయశంఖారావం కార్యక్రమం జరుగుతుందని, జిల్లాలో జరిగే కార్యక్రమానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతారన్నారు. అదే నెల 27న ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలు పెడతారని చెప్పారు. అనంతరం మండలాల కన్వీనర్లు సోమనాథ్‌రెడ్డి, రామాంజినేయులు, సత్యనారాయణ శాస్త్రి, గోపారం శ్రీనివాసులు, మైనార్టీ సెల్ నాయకుడు అతావుల్లా, సింగిల్ విండో అధ్యక్షుడు బాబురెడ్డి, మాజీ సర్పంచు మొగలి సత్యనారాయణరెడ్డి, యూత్ విభాగం నాయకుడు భీమేష్‌లు మాట్లాడారు. నవరత్నాల కార్యక్రమాలపై సభలో తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు హరినాథ్‌రెడ్డి, వెంకటేశులు, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, ప్రచార కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు నాగరాజ స్వామి, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి రామచంద్ర, నాయకులు ప్రసాద్‌రెడ్డి, గాజుల అంజి, ఆనంద్, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్షావలి, నారాయణస్వామి, నరేష్, హనుమంతు, సర్పంచులు హరినాథ్, గంగాధర, నాయకులు మారుతీ, సేవాదల్ అధ్యక్షుడు గుప్తా, నాగన్న, మాజీ సర్పంచు గంగాధర, బీటీ రాము, ఎంఎస్ఎఫ్ రాజు, పరమేశ్వరప్ప, కాలిక్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షానికి దెబ్బతిన్న రైల్వే పనులు
కళ్యాణదుర్గం: పట్టణ సమీపంలోని రైల్వేస్టేషన్ వద్ద చేపట్టిన సీసీరోడ్డు, మట్టిరోడ్డు పనులు శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి దెబ్బతిన్నాయి. రెండేళ్లుగా కళ్యాణదుర్గం ప్రాంతంలో రైల్వే రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు. భారీ వర్షానికి సీసీ రోడ్డుకిరువైపులా ఉన్న మట్టి కోతకు గురైంది. రింగ్‌రోడ్డు నుంచి రైల్వే స్టేషన్ వరకు సీసీ రోడ్డు వేశారు. ఇరువైపులా గరుసు మట్టి ఏర్పాటు చేశారు. సుమారు రూ.కోటితో రైల్వే స్టేషన్ భవనం, సీసీరోడ్డు, మట్టి రోడ్డు పనులు ఏడాది క్రితమే పూర్తి చేశారు. కళ్యాణదుర్గం నుంచి కంబదూరు వరకు జరుగుతున్న రైల్వే పనుల్లోనూ నాణ్యత లోపించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై సంబంధిత ఇంజనీరు సాయిని వివరణ కోరగా భారీ వర్షంతో కోతకు గురైన పనులను పరిశీలిస్తామని తెలిపారు. -
న్యాయవాది వద్ద లొంగిపోవాలని యత్నిస్తుండగా అరెస్టు
కళ్యాణదుర్గం : మండలం కామక్కపల్లి అటవీ ప్రాంతం వద్ద నిందితులు న్యాయవాది ద్వారా లొంగిపోవాలని ప్రయత్నిస్తుండగా సమాచారం అందడంతో సోమవారం డీఎస్పీ టీఎస్ వెంకటరమణ, సీఐ శివప్రసాద్‌ల సూచనలతో 15 మంది నిందితులను అరెస్టు చేసి, 9 ద్విచక్రవాహనాలు, 1 ఆటో, ప్లాస్టిక్ గంపలు, గడ్డపారలు, చెలికిపారలు, టార్చ్లైట్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐలు వివరించారు. రామకృష్ణతో పాటు పెనుకొండ మండలం నగరూరు గ్రామానికి చెందిన వినోద్‌కుమార్, రొద్దం మండలం ఎం.కొత్తపల్లికి చెందిన శివారెడ్డి, నల్లమాడ మండలం కోలంవాండ్లపల్లికి చెందిన రమణారెడ్డి, కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లికి చెందిన చంద్రశేఖర్, పరిగి మండలం సంగమేశనిపల్లికి చెందిన సతీష్‌కుమార్, పరిగి మండలం శాసనకోట గ్రామానికి చెందిన రామాంజినేయులు, అనంతపురానికి చెందిన దూదేకుల ఖలందర్, బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లికి చెందిన బోయ బసవరాజు, కంబదూరు మండలం మర్రిమాకులపల్లికి చెందిన పూజారి రామచంద్ర, భజంత్రీ సత్యనారాయణ, నల్లమాడ మండలం రెడ్డిపల్లికి చెందిన నరసింహమూర్తి, బ్రహ్మసముద్రం మండలం మామడూరుకు చెందిన పూజారి గోవిందులను అరెస్టు చేశామని వివరించారు. కళ్యాణదుర్గం మండలం తూర్పు కోడిపల్లికి చెందిన తిప్పేస్వామి అలియాస్ భవాని, అనంతపురం పట్టణానికి చెందిన రఘ, వడ్డే వెంకటేశ్, అనంతపురం రూరల్ మండలం ఆలమూరుకు చెందిన సుబ్బరాయుడు పరారీలో ఉన్నారన్నారు. ఇదిలా ఉండగా గుప్తనిధుల ముఠా సభ్యుల నుంచి పట్టుబడ్డ ద్విచక్రవాహనాలపై పోలీసు స్టిక్కర్లు ఉన్నాయని, అయితే ఇందులో పోలీసుల పాత్ర ఏమీ లేదని విచారణలో తేలినట్లు చెప్పారు. -
గుప్తనిధుల ముఠా సభ్యుల అరెస్టు
ద్విచక్రవాహనాలు, ఆటో, సామాగ్రి స్వాధీనం కళ్యాణదుర్గం: గోళ్ల – ముద్దినాయనపల్లి అటవీ ప్రాంతంలోని ఉప్పంపల్లి ఆంజనేయస్వామి విగ్రహం వద్ద గుప్తనిధుల తవ్వకాలకు ప్రయత్నించిన ముఠా సభ్యులలో 15 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐలు నబీరసూల్, శంకర్‌రెడ్డి తెలిపారు. అరెస్టు వివరాలను సోమవారం కళ్యాణదుర్గం రూరల్ పోలీసుస్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. గుప్తనిధులు తవ్వడానికి 19 మంది ముఠా సభ్యులు తొమ్మిది ద్విచక్రవాహనాలు, ఒక ఆటోలు వెళ్లినట్లు తెలిపారు. ఇందులో అనంతపురం నీరుగంటివీధికి చెందిన ఉమ్మిడిశెట్టి రామకృష్ణ అలియాస్ రాము ప్రధాన కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఇతను గుప్తనిధుల ముఠా సభ్యులతో మంచి పరిచయాలు పెంచుకుని అవగాహన పొందాడన్నారు. గతంలో ఆత్మకూరు వద్ద జరిగిన జంట హత్యలు గుప్త నిధుల విషయంలోనే చోటు చేసుకోగా.. హత్యకు గురైన వారితో రామకృష్ణకు పరిచయాలు ఉన్నాయని పేర్కొన్నారు. అప్పట్లో ఉప్పంపల్లి ఆంజనేయస్వామి విగ్రహం వద్ద గుప్త నిధుల కోసం పరిశీలించారన్నారు. ఇందులో భాగంగానే నలుగురు పరిచయం ఉన్న వ్యక్తులతో మరికొంతమందిని సమీకరించుకుని పది రోజుల క్రితం గుప్తనిధుల తవ్వకానికి వచ్చి సాధ్యం కాక వెనుదిరిగారన్నారు. జూన్ 27వతేదీ పగడ్భందిగా 19 మంది సభ్యులతో సామాగ్రితో పాటు వచ్చి తవ్వకాలకు పూనుకుని గ్రామస్థులు అప్రమత్తం కావడంతో పరారయ్యారన్నారు. -
ఇంటి దొంగ దొరికాడు!
కళ్యాణదుర్గం రూరల్ : పని చేసే షాపుకే కన్నం వేసి చోరీకి పాల్పడ్డ ఇంటి దొంగను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. కళ్యాణదుర్గంలోని వాసవీ గార్మెంట్‌లో ఈ నెల 9న చోరీ జరిగింది. ఈ సంఘటనపై గార్మెంట్ షాపు యజమాని వెంకటేశ్ ఈ నెల 14న ఫిర్యాదు చేయగా.. పోలీసులు రంగంలోకి దిగారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు చోరీ చేసింది ఇంటి దొంగేనని గుర్తించారు. గార్మెంట్ షాపులో పని చేసే కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని ముదిగల్లుకు చెందిన మనోహరే చోరీకి పాల్పడినట్లు డీఎస్పీ వెంకటరమణ, సీఐ శివప్రసాద్ శనివారం తెలిపారు. నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచారు. నమ్మి చేరదీసిన పాపానికి నామాలు పెట్టాడన్నారు. అతని నుంచి రూ.13 లక్షలు విలువ చేసే 549.65 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు
కళ్యాణదుర్గం రూరల్ : మండలంలోని గోళ్ల గ్రామంలో ఎలుగుబంటి దాడిలో కుంట్లో శ్రీనివాసులు అనే రైతు గాయపడ్డారు. తన పొలంలో వేరుశనగ పంట సాగు చేయగా, శుక్రవారం రాత్రి కాపలాగా వెళ్లిన ఆయన శనివారం ఉదయమే ఇంటికి తిరిగొస్తుండగా ఎలుగుబండి దాడి చేసి గాయపరిచింది. -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
కళ్యాణదుర్గం : భార్యను చంపిన కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవల బయటకు వచ్చిన యుగంధర్(35) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం అర్ధరాత్రి ఐదుకల్లు రోడ్డులో చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ–2 దామోదర్ తెలిపిన సమాచారం మేరకు యుగంధర్ ఐదేళ్ల క్రితం భార్య అంజినమ్మను చంపిన కేసులో శిక్ష పడటంతో జైలు జీవితం అనుభవించి ఇటీవల బయటకు వచ్చాడు. జైలు శిక్ష పడకముందే కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లికి చెందిన మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. యుగంధర్‌కు శిక్ష పడటంతో ఆమె కుర్లపల్లిలోనే స్థిరపడింది. ఇటీవల బయటకు వచ్చిన యుగంధర్ సంప్రదింపులు జరిపి రెండో భార్యను కళ్యాణదుర్గం పట్టణంలోని తన ఇంటికి తీసుకువచ్చాడు. భర్త ప్రవర్తన నచ్చక ఆమె తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. మొదటి భార్య హత్య కేసులో శిక్ష అనుభవించడం, రెండో భార్య కాపురం విషయంలో సమస్య రావడంతో తాను బతకడం వృథా అని తల్లి రత్నమ్మతో పలుమార్లు వాపోయాడు. మనస్తాపంతో సొంత పొలంలో వేపచెట్టుకు పంచెతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళ్యాణదుర్గం పోలీసులు మృతదేహానికి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నారాయణరెడ్డి హత్యకేసులో నిందితులను అరెస్ట్ చేయాలి
టీడీపీ హత్యా రాజకీయాలపై ఆగ్రహం టీ సర్కిల్లో వైఎస్సార్సీపీ ధర్నా కళ్యాణదుర్గం : టీడీపీ హత్యా రాజకీయాలపై స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నారాయణరెడ్డి హత్యకేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం టీ సర్కిల్లో ధర్నా చేశారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ తిరుమల వెంకటేశులు, పట్టణ కన్వీనర్ గోపారం శ్రీనివాసులు, ప్రచార కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశులు, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాదాఖలందర్, బీసీ సెల్ పట్టణ కన్వీనర్ నాగరాజస్వామి, కాలిక్, ముదిగల్లు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. వైఎస్సార్సీపీలో బలమైన నేతలను అడ్డు తొలగించుకునేందుకు అధికారపార్టీ నాయకులు హత్యలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. నారాయణరెడ్డి హత్య ముమ్మాటికీ ప్రభుత్వమే చేయించిందన్నారు. పత్తికొండలో రోజురోజుకూ వైఎస్సార్సీపీకి బలం పెరుగుతుండటంతో ఓర్వలేని టీడీపీ పెద్దలు పథకం ప్రకారం ఈ హత్య చేయించారన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టిన సీఎం చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి హత్యలు చేస్తూ ఎంతోకాలం పాలన సాగించలేరని, భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, సీఎం డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. -
పెళ్లి వాహనాల అడ్డగింత
∙నూతన వధూవరులతో కలసి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా ∙పోలీసుల తీరును తప్పుబట్టిన వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఉషా, ఎల్ఎం కళ్యాణదుర్గం : రోడ్డు భద్రతా నియమాల పేరుతో పెళ్లి వాహనాలను పోలీసులు అడ్డగించడం వివాదాస్పదమైంది. పెళ్లి బందం ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి, వేధించడంతో నూతన వధూవరులతో సహా బంధువులు కలసి కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్ ముందు శనివారం రాత్రి బైఠాయించారు. వారికి వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి మద్దతు తెలిపా రు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు స్టేషన్ ముందు ధర్నా కొనసాగింది. గరుడాపురానికి చెందిన రామకష్ణ అనే యువకుడి పెళ్లి అనంతరం పెళ్లి బందం ట్రాక్టర్లో బోరంపల్లికి బయలుదేరింది. కంబదూరు మండలం కురాకులపల్లికి చెందిన రామ్మోహన్ పెళ్లికి హాజరైన బంధువులు కూడా మరో వాహనంలో బెళుగుప్ప మండలం బూదవర్తికి బయలుదేరారు. సీఐ శివప్రసాద్, ఎస్ఐ శంకర్‌రెడ్డి తమ సిబ్బందితో కలసి రెండు పెళ్లి వాహనాలను పట్టుకుని, స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు ఉషా, ఎల్ఎం పోలీసుల తీరును తప్పుపట్టారు. పెళ్లి వాహనాలు వదిలే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించారు. సీఐ, ఎస్ఐ పలుమార్లు చర్చలు జరిపినా వారు వినలేదు. తమకు ఎస్పీ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు ఉచిత సలహా ఇచ్చారు. చంటి బిడ్డల తల్లులు, చిన్నారులు ఆకలి, దాహంతో అలమటించారు. పోలీసుల తీరు పట్ల శాపనార్ధాలు పెట్టారు. కాగా ఇంత తతంగం జరుగుతుండగానే టీడీపీకి చెందిన వారి పెళ్లి లారీలు తమ కళ్లెదుటే వెళ్తున్నా పోలీసులు పట్టించుకోకవడం కొసమెరుపు. -
నేడు కదిరిదేవరపల్లికి ట్రయల్ రైలు రన్
కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం నుంచి కదిరిదేవరపల్లి వరకు మంగళవారం రైలు ట్రయల్ రన్ చేపట్టనున్నట్లు చీఫ్ ఇంజినీర్ రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ నెలలో కళ్యాణదుర్గం వరకు ట్రయల్ రన్ నిర్వహించి, ఇక్కడి నుంచి రాయదుర్గం, బళ్లారి మీదుగా తిరుపతికి రైలు రాకపోకలు సాగిస్తోందన్నారు. ప్రస్తుతం కళ్యాణదుర్గం నుంచి కదిరిదేవరపల్లి వరకు 23 కిలో మీటర్ల మేర రైల్వే లైన్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయన్నారు. దీంతో ఇక్కడ రైలు ట్రయల్ రన్ చేపడుతున్నామని కార్యక్రమానికి కమిషనర్ ఆఫ్ రైల్వే సేప్టీ(సీఆర్ఎస్) ఉన్నతాధికారి కేఏ మనోహరన్ రానున్నట్లు సీఈ తెలిపారు. సంబంధిత అధికారి పనులను పరిశీలిస్తారన్నారు. ట్రయల్ రన్ అనంతరం వారం రోజుల తర్వాత రైలు రాకపోకలను కదిరిదేవరపల్లి వరకు పొడిగిస్తామన్నారు. -
అధికార లాంఛనాలతో హంపన్న అంత్యక్రియలు
కళ్యాణదుర్గం : పట్టణంలోని శంకరప్పతోట కాలనీకి చెందిన స్పెషల్‌పార్టీ పోలీసుకానిస్టేబుల్ హంపన్న అంత్యక్రియలు అధికార లాంఛనాలతో మంగళవారం నిర్వహించారు. సీఎం బందోబస్తు విధుల్లో తుపాకీ పేలి హంపన్న చనిపోయిన విషయం విదితమే. భౌతికకాయాన్ని పోలీసు అధికారులు కళ్యాణదుర్గం తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న స్నేహితులు వందలాది ద్విచక్ర వాహనాల్లో అనంతపురం రహదారికి ఎదురేగి పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ‘హంపన్న అమర్ రహే’ అంటూ నినాదాలు చేశారు. బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు భారీ సంఖ్యలో హంపన్న ఇంటి వద్దకు తరలివచ్చారు. భౌతికకాయాన్ని సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిదండ్రులు మారెక్క, నారాయణప్ప, సోదరుడు లక్ష్మణమూర్తి, ఇతర బంధువుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, మున్సిపల్ చైర్మన్ వై.పి.రమేష్‌లు హంపన్నకు నివాళులర్పించారు. అనంతరం పట్టణ సమీపంలోని సొంత వ్యవసాయ తోటలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సీఐ చలపతి రావు, ఎస్ఐ నబీరసూల్, పోలీసు సిబ్బంది అధికార వందనం స్వీకరించారు. అనంతరం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. -
కాసులకు కటకట
38 రోజులైనా తీరని కరెన్సీ కష్టాలు బ్యాంకుల వద్ద 'నోక్యాష్' బోర్డులు.. ఏటీఎంల మూత మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి! ధర్మవరంలో ఎస్బీఐ ఖాతాదారుల ఆందోళన కళ్యాణదుర్గంలో ఏటీఎంకు పిండ ప్రదానం అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్లు రద్దు చేసి శుక్రవారం నాటికి 38 రోజులైనా ప్రజల కష్టాలు మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. కనీస అవసరాలకు డబ్బు కోసం అన్ని వర్గాల ప్రజలు అవస్థ పడుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి జిల్లాకు సరిపడా నగదు సరఫరా కాకపోవడంతో బ్యాంకుల వద్ద 'నో క్యాష్' 'క్యాష్‌నిల్' బోర్డులు పెట్టారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా దాదాపు 90 శాఖల్లో నగదు లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయినట్లు సమాచారం. అనంతపురం, హిందూపురం, గుంతకల్లు, కదిరి, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ధర్మవరం, యాడికి, కనగానపల్లి, బత్తలపల్లి, బుక్కపట్నం, కణేకల్లు, గుత్తి తదితర ప్రాంతాల్లో డబ్బు కోసం జనం అనేక అవస్థలు పడుతున్నారు. పేదలు, రైతులు, మహిళలు, సామాన్యులు, చిరు వ్యాపారులకు సంబంధించి ఎక్కువ ఖాతాలు కలిగిన ఎస్బీఐ, ఆంధ్రా, సిండికేట్, ఏపీజీబీ, కెనరా, కార్పొరేషన్ లాంటి ప్రధాన బ్యాంకుల్లోనే నగదు కొరత వేధిస్తోంది. దీంతో విత్‌డ్రాలు రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పరిమితం చేశారు. బ్యాంకుల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు వృద్ధులు, వికలాంగులు, మహిళలు, పెన్షనర్లు, ఉద్యోగులు పడిగాపులు కాస్తున్నారు. పనులన్నీ వదిలేసి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు. ఎనీ టైం మూత! రోజులు గడుస్తున్నా ఏటీఎంల పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. జిల్లా వ్యాప్తంగా 556 ఏటీఎంలు ఉన్నాయి. శుక్రవారం 40 నుంచి 60 ఏటీఎంలు పాక్షికంగా పనిచేశాయి. వాటిలోనూ రూ.2 వేల నోట్లు మాత్రమే వచ్చాయి. కొన్నిచోట్ల ఏటీఎంలను రాత్రిపూట తీస్తున్నారు. అర్ధరాత్రి సమయంలోనూ జనం బారులు తీరుతున్నారు. శుక్రవారం జిల్లా అంతటా 34 ప్రిన్సిపల్ బ్యాంకులు, వాటి పరిధిలోని 445 శాఖల ద్వారా కేవలం రూ.15 కోట్ల నగదు లావాదేవీలు జరిగినట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఎంత సర్దుబాటు చేస్తున్నా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బ్యాంకు అధికారులు వాపోతున్నారు. నగదు నిల్వలు పూర్తిగా అడుగంటిపోవడంతో శనివారం మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. సోమవారం నాటికి కాని కొంత నగదు సరఫరా అయ్యే పరిస్థితి కన్పించడం లేదు. అదే పక్కనున్న చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాలకు మాత్రం పెద్దమొత్తంలో నగదు సరఫరా అవుతోంది. 'అనంత'కు మాత్రం ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడంలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. నగదు ఎక్కువ వచ్చేలా జిల్లా మంత్రులు, అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటే తప్ప ఇప్పట్లో సమస్యకు పరిష్కారం దొరకదు. రోడ్డెక్కుతున్న ఖాతాదారులు నగదు కష్టాలు రెట్టింపు అవుతుండడంతో ఖాతాదారులు సహనం కోల్పోతున్నారు. రోడ్డెక్కి తమ నిరసన తెలియజేస్తున్నారు. శుక్రవారం ధర్మవరం పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్లో ఎస్బీఐ ఖాతాదారులు కొద్దిసేపు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఉదయం 11 గంటలైనా బ్యాంకు గానీ, ఏటీఎంలు గానీ తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న ‘దండగమారి ఏటీఎం’కు వైఎస్సార్సీపీ నాయకులు పిండ ప్రదానం చేశారు. -
విడాకుల నోటీసు చూసి ఆత్మహత్య
కళ్యాణదుర్గం రూరల్ : కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని ఒంటిమిద్దికి చెందిన గుడిసె హంపన్న కుమారుడు వెంకటేశులు(28) గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మూడేళ్ల కిందట పెళ్లికకాగా, కొంతకాలం తరువాత భార్య గాయత్రి దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఆమె విడాకుల నోటీసు పంపడంతో మనస్తాపానికి గురైన వెంకటేశులు ఇంట్లోనే దూలానికి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు వివరించారు. మృతుడి జేబులో లభించిన సూసైడ్ నోట్లో.. భార్య తనను మోసం చేసి, బాబు అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, దాంతోనే తనకు దూరమైందని అందులో రాసి ఉంది. ఆ లెటర్‌ను మృతుడి తండ్రి హంపన్న విలేకరులకు చూపెట్టారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
కళ్యాణదుర్గం కేవీకేకు రాష్ట్ర ఉత్తమ అవార్డు
కళ్యాణదుర్గం రూరల్ : కళ్యాణదుర్గం పట్టణ సమీపంలో ఉన్న లక్ష్మిదేవమ్మ కృషి విజ్ఞాన కేంద్రానికి రాష్ట్ర ఉత్తమ అవార్డు వచ్చింది. ఈనెల 5న నంద్యాలలో జరిగిన పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశంలో రాష్ట్ర ఉత్తమ కేవీకేగా అవార్డును కో ఆర్డినేటర్ జాన్సుధీర్కు వ్యవసాయశాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి, ఎన్జీరంగా విశ్వవిద్యాలయ సంచాలకుల చేతులమీదుగా అవార్డును ప్రదానం చేశారు. రైతులకు అందుబాటులో ఉంటూ కరువు జిల్లా అయినా అనంతలో 70 శాతం మంది రైతులు వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారని, ఇందులో రైతులకు చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయల పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తూ మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలిపి మంచి ఫలితాలు సాధించారు. దీంతో వ్యవసాయ శాఖ గుర్తించి రాష్ట్ర ఉత్తమ కేవీకేగా అవార్డును అందజేసింది. ఈ అవార్డు జాన్‌సుధీర్ అందుకున్నారు. -
18 మంది జూదరుల అరెస్ట్
రూ.85 వేలు నగదు, 11 ద్విచక్రవాహనాలు సెల్ఫోన్లు స్వాధీనం కళ్యాణదుర్గం: మండల పరిధిలోని కుర్లపల్లి సమీపంలోని పేకాట స్థావరంపై ఆదివారం దాడులు చేసి 18 మంది జూదరులను అరెస్టు చేసి వారి నుంచి నగదు, ద్విచక్రవాహనాలు, సెల్పోన్లు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. పక్కా సమాచారంతో పోలీసు సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై మూకుమ్మడిగా దాడి చేసి జూదరులతోపాటు వారి నుంచి రూ.85 వేల నగదు, 11 ద్విచక్రవాహనాలు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు చెప్పారు. -
వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ వర్గీయుల దాడి
కుందుర్పి: మండలంలోని ఎస్.మల్లాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. అంతటితో ఆగక గాయపరిచారు. మొహర్రం సందర్భంగా శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుం ది. బాధితుల కథనం మేరకు... పీర్లు జలధికి వెళ్లిన తర్వాత టీడీపీ వర్గీయులు హనుమంతరాయుడు, కిష్ట ప్ప, సుధాకర్, మారుతేజ్, నాగేష్, పాతలింగ, మారెప్ప సహా మరో 20 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఘటనలో మల్లప్ప, విశాలమ్మ, అంజప్ప, కదరప్ప, నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని పెద్దాస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అంతకు ముందు బాధితులను వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్, మండల కన్వీనర్ సత్యనారాయణశాస్త్రి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజగోపాల్, మాజీ సర్పంచులు గవియప్ప, లింగప్ప, తిప్పేస్వామి తదితరులు కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో పరామర్శించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కుందుర్పి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మా..మమ్మల్ని చంపేస్తారు..! కళ్యాణదుర్గం: ‘అమ్మా...మమ్మల్ని టీడీపీ వారు చంపేస్తారేమో.. మాకు దిక్కు లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ అభిమానులమనే కక్షకట్టారు. ఇంత అన్యాయం జరుగుతున్నా...అధికారులు పట్టించుకోవడం లేదంటూ’ కుందుర్పి మండలం ఎస్.మల్లాపురంలో టీడీపీ వర్గీయుల దాడుల్లో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ వద్ద వాపోయారు. కళ్యాణదుర్గం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని శనివారం సమన్వయకర్త ఉషాశ్రీ పరామర్శించారు. తీవ్రంగా గాయపడ్డ నాగరాజు, మల్లప్ప, విశాల, కదిరప్ప, అంజినప్పలకు ఆమె ధైర్యం చెప్పారు. విశాల బోరున విలపించడంతో ఉషాశ్రీచరణŠ సైతం కంటతడిపెట్టారు. అక్కడే ఉన్న ప్రభుత్వ వైద్యుడు రంగనాథ్‌తో బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదన్నారు. ఎస్.మల్లాపురం బాధితులపై దాడిచేసి చంపడానికి ప్రయత్నించిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. -
‘దుర్గం’ మునిసిపాలిటీకి జరిమానా
కళ్యాణదుర్గం : సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగినా ఇవ్వనందుకు సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయబాబు కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి జరిమానా విధిం చినట్లు ఫిర్యాదుదారుడు గోపారం గోవిందరాజులు తెలి పారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని గాంధీచౌక్‌లో సుబ్రమణ్యేశ్వర స్వామి కాంప్లెక్స్‌లో కట్టడాల విషయంలో మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన అనుమతులు, ఇతర వివరాలపై సమాచారం కోరినా కమిషనర్, మున్సిపల్ అధికారులు ఇవ్వలేదన్నారు. దీనిపై ఉన్నతాధికారులను సంప్రదించగా మున్సిపాలిటీ అధికారులు సమాచారం ఇవ్వలేదని సమాచార హక్కు చట్టం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశా రు. దీనికి స్పందించిన ఆయన సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించారన్న నెపంతో రూ.50 వేలు తక్షణం చెల్లించాలని, మిగిలిన రూ.25 వేలు సంబంధిత అధికారుల జీతంలో కోత వేయాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు
కళ్యాణదుర్గం రూరల్ : విద్యార్థులు ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. స్థానిక సుబ్రమాణ్ణేశ్వర కల్యాణ æమండపంలో ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో గురువారం పదో తరగతి పరీక్షలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతి థులుగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్,మాస్టర్ మైండ్ డైరెక్టర్ మెట్టువల్లి మోహన్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు భయాందోళనకు గురి కాకుండా చదువుపై ఇష్టాన్ని పెంచుకోవాలన్నారు. ఏకాగ్రతను అలవరచుకొని విద్యపై శ్రద్ధ వహించాలన్నారు. తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్య నేర్చిన వాడు గొప్ప వాడని అభివర్ణించారు. విద్య నేర్చితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సమస్యలను పరిష్కరించుకోవచ్చునన్నారు. ప్రైవేటు పాఠశాలల హెచ్ఎంలు శ్రీశైల, బాబు,నరసింహాచారి పాల్గొన్నారు. -
పెట్రోలు ధర పెంపునకు నిరసనగా ఆందోళన
కల్యాణదుర్గం (అనంతపురం జిల్లా) : పెట్రోలు ధరల పెంపునకు నిరసనగా కల్యాణదుర్గంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు తమ బైక్‌లను తోసుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. కల్యాణదుర్గం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ తిరుమల వెంకటేశ్వర్లు, పట్టణ కన్వీనర్ గోపారం శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం ఈ ఆందోళనలు జరిగాయి. -
ఇంటర్ ఫెయిల్ అయ్యాడని..
కళ్యాణదుర్గం (అనంతపురం) : పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గొల్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజు(16) స్థానిక మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం వచ్చిన ఫలితాలలో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
టెండర్ల కోసం తమ్ముళ్ల పోటాపోటీ
జేసీ, ఉన్నం అనుచరులకు దక్కని టెండర్లు కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇసుక రీచ్ టెండర్ల వ్యవహారం టీడీపీలో కలకలాన్ని రేపింది. అజ్జయదొడ్డి ఇసుక రీచ్ దక్కించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ అనుచరున్ని ఎంపీ జేసీ వర్గీయులు కిడ్నాప్ చేశారని దుమారం చెలరేగింది. అజ్జయదొడ్డి ఇసుక రీచ్‌కు జేసీ అనుచరుడు తక్కువ ధరకు టెండర్ వేసి భంగపడడంతో కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఎలాగైనా సరే ఇసుక రీచ్ టెండర్లను దక్కించుకోవాలని భావించిన ఎమ్మెల్యే ఉన్నం అనుచరుల వ్యూహం కూడా ఫలించలేదు. వివరాల్లోకెళితే... నియోజకవర్గంలో ఉన్న అజ్జయదొడ్డి, కన్నేపల్లి, చెన్నంపల్లి ఇసుక రీచుల కోసం ప్రభుత్వం టెండర్‌కు పిలిచింది. ఎమ్మెల్సీ కేశవ్ అనుచరులు కన్నేపల్లి ఇసుక రీచ్‌ను క్యూబిక్ మీటర్ రూ.110 కే టెండర్ దక్కించుకున్నారు. అజ్జయదొడ్డి ఇసుక రీచ్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు అనుచరుడు దక్కించుకున్నాడు. ఈ రీచ్‌కు జేసీ వర్గానికి చెందిన ఓ వ్యక్తి క్యూబిక్ మీటర్ కు రూ.110 టెండర్ దాఖలు చేశాడు. కాలవ అనుచరుడు రూ.315 ప్ర కారం వేసి దక్కించుకున్నాడు. చెన్నం పల్లి ఇసుక రీచ్ టెండర్ దాఖలు చేసిన ఎమ్మెల్యే ఉన్నం వర్గీయులకు మొండిచేయి దక్కింది. రీచ్‌కు ఐదుగురు టెండర్లు దాఖలు చేయాల్సిన నిబంధనతో ఎమ్మెల్యే వర్గీయుల ఆశలు ఆవిరయ్యాయి. ఇదిలా ఉంటే కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇసుక రీచ్ టెండర్లలో ఎంపీ జేసీ, ఎమ్మెల్సీ కేశవ్ అనుచరులు తలదూర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంపీ వర్గీయులు అదే పార్టీకి చెందిన చీఫ్‌విప్ అనుచరుడి కిడ్నాప్ చేశారన్న వార్తలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఏదిఏమైనా అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు, అక్రమాలు ఇసుక టెండర్ల ద్వారా మరోసారి బయటపడ్డాయనే చెప్పవచ్చు. -
మూడు వాహనాలు ఢీ.. 10 మందికి గాయాలు
వేగాంగా వస్తున్న రెండు ద్విచక్ర వాహానాలు ఆటోను ఢీకొట్టిన ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గొట్టువానపల్లి సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. గొట్టువానపల్లి గ్రామం నుంచి కళ్యాణదుర్గం వెళ్త్ను ప్రయాణికుల ఆటోను ఎదరుగు వస్తున్న రెండు బైక్‌లు ఢీకొట్టాయి. దీంతో ఆటోలో ఉన్న పది మందికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అందులో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
కళ్యాణదుర్గం (అనంతపురం) : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం హెల్లికల్లు వద్ద సోమవారం చోటుచేసుకుంది. రాయదుర్గంకు చెందిన ఉదయ్ కుమార్ స్నేహితులతో కలిసి టాటా ఏస్‌లో అనంతపురం వెళ్తున్న సమయంలో హెల్లికల్లు వద్ద ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో టాటాఏస్‌లో ఉన్న ఉదయ్‌కుమార్(35) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ నడపడం నేర్చుకుంటూ..
కళ్యాణదుర్గం (అనంతపురం) : బైక్ నడపడం నేర్చుకుంటున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న బండరాళ్లను ఢీకొని మృతిచెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మండ్లాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన హన్మంత్ రాయుడు(22) కొత్తగా ద్విచక్రవాహనం నడపడం నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో గ్రామ శివారులో బైక్ నడుపుతుండగా.. రోడ్డు పక్కన ఉన్న బండరాళ్లకు ఢీకొన్నాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైన హన్మంత్ రాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. -
టీచర్.. అయ్యాడు 'మట్కా' చీటర్
- అనంతపురం జిల్లాలో మట్కా నిర్వహిస్తూ పట్టుపడ్డ ఉపాధ్యాయుడు అనంతపురం: పవిత్రమైన వృత్తిగా భావించే ఉపాధ్యాయుడు ఆయన. పిల్లలకు విద్యాబుధ్దులు నేర్పాల్సిన ఆయనే.. ప్రజలను పెడదోవ పట్టించే అక్రమ మట్కా దందా నిర్వహిస్తున్నాడు. చివరికి అదే మట్కా నిర్వహిస్తూ శనివారం పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అనంతపురం జిల్లా కళ్యానదుర్గంలో ఒక టీచర్ నిర్వకం ఇది. పేద, మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని జిల్లాలో విస్తరించిన మట్కా జూదంపై ఇటీవలే దాడులు ప్రారంభించిన పోలీసులు.. కళ్యానదుర్గంలో అరస్టయిన ఉపాధ్యాయుడి నుంచి దాదాపు 16 లక్షల విలువైన మట్కా జాబితాను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ప్రస్తుతం కటకటాల్లో ఉన్న మట్కా టీచర్ ను విడిపించేందుకు తెలుగుదేశం నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో విచ్చలవిడిగా సాగుతోన్న మట్కా దందా వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉన్నదని పెద్ద ఎత్తున ఆరోపణలున్న సంగతి తెలిసిందే. -
వేధింపులతో దంపతుల ఆత్మహత్యాయత్నం
కల్యాణదుర్గం (అనంతపురం) : పొరుగువారు వేధిస్తున్నారంటూ అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పట్టణంలో దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. పట్టణంలోని దేవీరమ్మ కాలనీకి చెందిన సిద్ధప్ప, దాసరి వెంకటేశు ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. వారి మధ్య గత మూడేళ్లుగా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించి వెంకటేశు పోలీస్‌స్టేషన్‌లో సిద్ధప్పపై ఫిర్యాదు చేశాడు. మూడు రోజుల క్రితం వెంకటేశు సిద్ధప్ప భార్య చిత్తమ్మతో అసభ్యంగా మాట్లాడాడు. వీటన్నిటితో మనస్తాపం చెందిన సిద్ధప్ప, చిత్తమ్మ మంగళవారం మధ్యాహ్నం ఇంట్లోనే పురుగు మందు తాగారు. కొద్దిసేపటి తర్వాత కుటుంబసభ్యులు గమనించి కల్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. -
నీటికుంటలో పడి చిన్నారి మృతి
అనంతపురం (కల్యాణదుర్గం) : కల్యాణదుర్గం మండలం కొత్తూరులోని చెరువుకుంటలో పడి దీపిక అనే ఆరేళ్ల బాలిక మృతిచెందింది. శుక్రవారం చెరువు సమీపంలోని కుంటలలో స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ జారి అందులో పడిపోయింది. ఈ ఘటనను గమనించిన మరో ఇద్దరు చిన్నారులు విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా.. వారు సంఘటనాస్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు. -
కల్యాణదుర్గంలో వీఆర్ఏల ధర్నా
కళ్యాణదుర్గం: సమస్యల పరిష్కారం కోసం వీఆర్ఏ లు ధర్నాకు దిగారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఆర్డీవో కార్యలయం ఎదుట పలువురు వీఆర్ఏలు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం ఉదాసీనతతో వ్యవహరించటం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. -
ఊరు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
కల్యాణదుర్గం (అనంతపురం) : అనంతపురం జిల్లా కల్యాణ దుర్గంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన సోంశేఖర్.. కుటుంబంతో కలిసి సొంత పనుల నిమిత్తం వేరే ఊరు వెళ్లాడు. కాగా సోమవారం తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో ఉన్న రూ.3లక్షల విలువైన బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లారు. సోంశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ, బొలేరో ఢీ : ఒకరు మృతి
కల్యాణదుర్గం (అనంతపురం) : లారీ, బొలేరో వాహనం ఢీకొట్టుకున్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని ఎర్రవల్లి వద్ద లారీ, బొలేరో వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలేరో డ్రైవర్ రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. -
కళ్యాణదుర్గం డీఈని నిర్బంధించిన బాధితులు
కళ్యాణదుర్గం (అనంతపురం) : ఇంటి బిల్లులు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్న డీఈ, ఏఈలను స్థానికులు నిర్బంధించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం హౌసింగ్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. డీఈ శివశంకర్ నాయక్, ఏఈ రంగనాయక్‌లు బిల్లులు ఇవ్వకుండా ప్రజలను తిప్పించుకుంటున్నారని.. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ ఎమ్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బాధితులు హౌసింగ్ కార్యాలయానికి చేరుకొని డీఈని, ఏఈని నిర్బంధించారు. -
ఆటో బోల్తా : 14 మందికి గాయాలు
కళ్యాణదుర్గం (అనంతపురం) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో 14 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గరుడాపురం చెరువుకట్టపై శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కళ్యాణదుర్గం నుంచి కుర్లపల్లికి వెళ్తున్న ప్యాసింజర్ ఆటో గరుడాపురం చెరువుకట్ట సమీపంలోకి చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 14 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. -
'శ్రీమంతుడు' అభిమానుల ఆందోళన
కల్యాణదుర్గం : శ్రీమంతుడు మూవీ రిలీజైన రోజునే చూడాలనుకున్న ఇక్కడి అభిమానులకు నిరాశే ఎదురైంది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో శ్రీమంతుడు సినిమా టికెట్ల ధరలు పెంచడంతో అభిమానులు ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా టికెట్టు అన్ని కేటగిరీలకు ధరలను రూ. 100గా నిర్ణయిస్తూ కల్యాణదుర్గంలోని నూర్ ముబారక్ థియేటర్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో అభిమానులు ధర్నాకు దిగి థియేటర్ ఎదుట బైఠాయించారు. థియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా శ్రీమంతుడు అభిమానులు నినాదాలు చేశారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని చిన్నారికి తీవ్ర గాయాలు
కల్యాణదుర్గం రూరల్ : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం గరుడాపురం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలు కాగా, వారిలో మూడేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. శెట్టూరు మండలం చిన్నపల్లికి చెందిన వీరభద్రం, రామాంజనేయులు, జీవన్(3) ద్విచక్రవాహనంపై గరుడాపురంలో కోళ్లను కొనుగోలు చేసి తిరిగి వెళుతున్నారు. కాగా అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కల్యాణదుర్గం ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురూ గాయపడ్డారు. జీవన్ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దరికి కల్యాణదుర్గం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
నారాయణప్ప కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్జగన్
-
ఏసీబీ వలలో వీఆర్ఓ
అనంతపురం: అనినీతికి పాల్పడిన వీఆర్వోను ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. లంచం ఇవ్వాలని ఓ రైతును వేధిస్తున్నారనే సమాచారంతో ఏసీబీ అధికారులు వీఆర్వో ఇంటిపై దాడి చేశారు. వివరాలు... అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం కాపిరి గ్రామ వీఆర్వో నాగిరెడ్డి ఓ రైతు పట్టాదారు పాసు పుస్తకంలో మార్పులు చేయడానికి లంచం అడిగాడు. కాగా బుధవారం మధ్యాహ్నం రైతు పొన్నుస్వామి నుంచి రూ.3 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన కల్యాణదుర్గంలోని జయనగర్ కాలనీలోని నాగిరెడ్డి నివాసంలో జరిగింది. అనంతరం వీఆర్వో నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతపురం ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి, సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. (కల్యాణదుర్గం) -
సర్వం సిద్ధం
సాక్షి, అనంతపురం/కళ్యాణదుర్గం : ఒక రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం సోమవారం కళ్యాణదుర్గం రానున్నారు. కళ్యాణదుర్గం మండలం గరుడాపురం గ్రామంలో నిర్వహించే ‘జన్మభూమి- మాఊరు’లో పాల్గొంటారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గంలో వ్యవసాయ మిషన్‌ను ప్రారంభిస్తారు. కళ్యాణదుర్గం లక్ష్మిదేవమ్మ కృషి విజ్ఞానకేంద్రం ఎదురుగా ఉండే ఎర్రంపల్లి మైదానంలో బహిరంగ సభా వేదిక, ఖాళీ స్థలంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. కాగా ఆదివారం మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, కలెక్టర్ సొలమన్ఆరోగ్యరాజ్, జేసీ సత్యనారాయణ, డీఆర్డీఏ పీడీ నీలకంఠారెడ్డి, సమాచారశాఖ ఏడీ వెంకటేశ్వర్లు వేదిక, హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. భారమంతా అధికారులదే : కళ్యాణదుర్గంలో సోమవారం నాటి సీఎం పర్యటన భారమంతా అధికారులపైనే పడింది. జిల్లాకు చెందిన మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించి ఒక్కో శాఖకు, ఒక్కో బాధ్యతను అప్పగించారు. అవసరమైన వాహనాల ఖర్చు, జనాల తరలింపు బాధ్యత కూడా అధికారులకే అప్పగించారు. ఇందు కోసం వ్యవసాయ శాఖ, డీఆర్డీఏ ఐకేపీ, డ్వామా శాఖలకు 300 వాహనాలు కేటాయించారు. వీటికి సంబంధించిన డీజిల్, ప్రజల భోజన ఖర్చు డ్వామా అధికారులు భరించేలా నిర్ణయించారు. రైతు రుణమాఫీ, మహిళా రుణమాఫీ, ఇలా ఎన్నెన్నో హామీలను అమలు చేయని ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్న జనాన్ని మెప్పించి కార్యక్రమానికి తీసుకువచ్చేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. మరికొన్ని కార్యక్రమాలు ఖర్చులు, లారీల ఖర్చు భారాన్ని వివిధ కాంట్రాక్టర్లు, టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులకు కూడా బాధ్యత అప్పగించారు. 60 వేల మంది జనాన్ని సమీకరించాలని అధికారులకు నేతలు చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు ఎలాంటి నిరసనలు వ్యక్తం చేయకుండా భారీ పోలీస్ బందోబస్తుకు ఏర్పాట్లు చేశారు. సభ ప్రాంగణం వద్ద మొత్తం పెద్ద స్థాయిలో ఉన్న ఇనుప రాడ్లతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆధ్వర్యంలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు , 10 మంది డీఎస్పీలు, 38 మంది సీఐలు , 82 మంది ఎస్ఐలు, 229 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 565 మంది కానిస్టేబుళ్లు, 50 మహిళా కానిస్టేబుళ్లు, 250 మంది హోంగార్డులు, ఆరు సెక్షన్ల సాయుధ దళాలు, 14 స్పెషల్ పార్టీ పోలీసులు మొత్తం 1500 మంది దాకా పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేశారంటే ముందస్తు జాగ్రత్తలు ఏ స్థాయిలో తీసుకున్నారో ఇట్టే అర్థమవుతోంది. అంతేకాదు రెండు రోజులుగా పట్టణంలో ప్రతి వాహనంతో పాటు ద్విచక్రవాహనాలు సైతం తనిఖీ చేస్తూ, సీఎం సభ ప్రాంగణానికి ముందు భారీ భద్రత కేటాయించారు. మొత్తం మీద సీఎం పర్యటన బాధ్యతను అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నేత లు, పూర్తి స్థాయిలో అధికారులకే అప్పగించి తూతూమంత్రంగా పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ‘అనంత’లో బస్సుల హల్చల్ ముఖ్యమంత్రి, మాజీ రాష్ర్టపతి పర్యటనను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా జనాన్ని సమీకరించడంపై దృష్టి సారించారు. ఈ మేరకు రవాణాశాఖ సహకారంతో 500 బస్సులను సమకూర్చుకున్నారు. ఈ బస్సులకు డీజిల్ వేయించేందుకు ఆదివారం అనంతపురం తెప్పించుకున్నారు. ఒక్కసారిగా వందల సంఖ్యలో బస్సులు అనంతపురం చేరుకుని టవర్‌క్లాక్ కూడలి నుంచి బారులు తీరి వెళ్తుండడంతో ఆ మార్గంలో దాదాపు గంటపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. సీఎం, కలాం పర్యటన ఇలా: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సోమవారం ఉదయం ఢిల్లీనుంచి హెలికాప్టర్లో బయల్దేరి 11.15గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ చంద్రబాబునాయుడుతో కలసి అనంతపురం జిల్లా పర్యటనకు బయల్దేరి వస్తారు. సోమవారం ఉదయం 11.15 గంటలకు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి 11.25 గంటలకు బేగంఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 11.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి అబ్దుల్‌కలాంతో కలసి ప్రత్యేక విమానంలో బయల్దేరి 12.30 గంటలకు అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1గంటకు పుట్టపర్తి ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరి 1.30 గంటలకు కళ్యాణదుర్గంలోని లక్ష్మిదేవమ్మ ృషి విజ్ఞానకేంద్రం (ఎల్కేవీకే) సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 1.30 నుంచి 2గంటల వరకు ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించడంతో పాటు శాస్త్రవేత్తలు, ప్రగతి సాధించిన రైతులతో ముఖాముఖి అవుతారు. 2గంటల నుంచి 4గంటల వరకు కళ్యాణదుర్గంలో జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రైతుల కోసం వ్యవసాయ మిషన్‌ను ప్రారంభిస్తారు. 4.15 గంటలకు కళ్యాణదుర్గం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరి 4.45 గంటలకు పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5గంటలకు పుట్టపర్తి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరి వెళ్తారు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
కళ్యాణదుర్గం రూరల్ : అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ ఎస్.వి.రాజశేఖర్‌బాబు తెలిపారు. కళ్యాణదుర్గం పోలీస్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ‘పోలీస్ ప్రజాబాట’ నిర్వహించారు. సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 73 మంది ఎస్పీకి అర్జీలు సమర్పించారు. ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, ఆర్డీఓ మలోల హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘పోలీస్ ప్రజాబాట’, విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ కర్ణాటక కేంద్రంగా చేసుకుని అసాంఘిక శక్తులు, అంతర్రాష్ర్ట ముఠాలు ‘అనంత’లో అనేక సంఘటనలకు పాల్పడుతున్నాయన్నారు. ఈ ముఠాలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామన్నారు. త్వరలోనే వీటి ఆట కట్టించి.. జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొల్పుతామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక మాఫియాను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెంచామన్నారు. గ్రామ పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తామని చెప్పారు. గ్రామానికి ఒక కానిస్టేబుల్‌ను నియమించామని, ఆ గ్రామంలో చోటు చేసుకునే సంఘటనలకు ఆ కానిస్టేబులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం చేస్తే పోలీసు అధికారులపై చర్యలు తప్పవన్నారు. జిల్లాలో 101 సమస్యాత్మక గ్రామాలను గుర్తించామన్నారు. డీఎస్పీ నెలకోసారి, సీఐ 15 రోజులకోసారి, ఎస్ఐ వారానికోసారి గ్రామాలను సందర్శించి అక్కడ చోటు చేసుకుంటున్న సంఘటనలను సభల ద్వారా సమీక్షించాల న్నారు. పది రోజులకొకసారి గ్రామాల్లో పోలీస్ ప్రజాబా ట నిర్వహించాలని ఎస్ఐలకు సూచించారు. భూ వి వాదాలు, అసాంఘిక కార్యాకలాపాలు, ఫ్యాక్షన్, దోపిడీలు, దొంగతనాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ జోక్యాన్ని అరికట్టండి ప్రభుత్వ కార్యకలాపాల్లో రాజకీయ పార్టీ నేతల జోక్యాన్ని అరికట్టాలని వైఎస్సార్సీపీ సమన్వయకర్త తిప్పేస్వామి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు, చౌకడిపో డీలర్లను అక్రమ తొలగింపజేయిస్తూ కక్షలు రేపుతున్నారని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారని, కౌంటర్ కేసులూ బనాయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఆత్మవిశ్వాసమే ఆయుధంగా..
ఆమెకు కంటిచూపు లేదు. అయినా బాధపడలేదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంది. ఎవరిపై ఆధారపడకుండా జీవితంలో స్థిరపడాలనుకుంది. పట్టుదలతో ముందుకు సాగింది. కుటుంబపోషణలో నేను సైతం అంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. పులివెందుల ఎస్బీఐ కాలనీలో నివాసముంటున్న వెంకటమహేశ్వరి సొంతగ్రామం వేముల మండలం కె.కె.కొట్టాల. ఈమె తల్లిదండ్రులు ఈశ్వరయ్య, లక్ష్మిదేవి. ఈమె పుట్టుకతోనే అంధురాలు. చూపు లేకపోవడంతో ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఆమె ఏమాత్రం ఎదురుచూడలేదు. చదువుకుని ఉన్నత స్థితికి చే రాలని నిర్ణయించుకుంది. అనంతపురం జిల్లాలో అంధుల పాఠశాలలో చేరింది. బ్రెయిలీ లిపిలో విద్య నేర్చుకుంది. ఆ తర్వాత కళ్యాణదుర్గంలో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసింది. టీచర్ ఉద్యోగం వచ్చే వరకు మిన్నకుండకుండా బ్యాక్లాగ్ కోటాలో పులివెందుల మున్సిపాలిటీలో పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా ఉద్యోగం సాధించింది. రూ. 15 వేలు వేతనం తీసుకుంటూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. ఆమెను న్యూస్‌లైన్ పలకరిస్తే.. ఆత్మవిశ్వాసం.. స్థైర్యంతో భవిష్యత్తులో ఉపాధ్యాయురాలిని కావాలన్నదే తన లక్ష్యమంది. తనలాగా కళ్లులేని వారి గురించి తెలిస్తే వారికి తనవంతు సహాయం.. సహకారం అందిస్తాన ంటోంది. -
కర్ణాటక నుంచి తెచ్చుకుందాం..
కళ్యాణదుర్గం, న్యూస్‌లైన్ : ఖరీఫ్ సాగుకు సమయం ఆసన్నమైంది. ఇటీవల ఓ మోస్తరు వర్షాలు కూడా కురిశాయి. మంచి పదునులో విత్తనాలు వేసేందుకు రైతులు ఆత్రుత పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు అవసరమైన టీఎంవీ-2 రకం వేరుశనగ విత్తనకాయలను సబ్సిడీతో ఇచ్చే పరిస్థితి కన్పించడం లేదు. కే-6 రకం విత్తనకాయలను పూర్తి ధర (కింటాల్ రూ.4,600)తో అంటగట్టేందుకు సిద్ధమైంది. తర్వాత రైతుల ఖాతాల్లో కింటాల్కు రూ.1,500 చొప్పున సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తామని చెబుతోంది. ఎప్పటి నుంచి పంపిణీ చేస్తుందో స్పష్టత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని వేలాది మంది రైతులు విత్తన వేరుశనగ కోసం కర్ణాటక బాట పడుతున్నారు. అక్కడి ప్రభుత్వం 30 కిలోల టీఎంవీ-2 రకం విత్తనకాయలను రూ.960కే పంపిణీ చేస్తోంది. దీంతో మన రైతులు రాష్ట్ర సరిహద్దున ఉన్న చెళ్లికెర, పావగడ, వైఎన్‌ఎస్ కోట, లింగనపల్లి, తిప్పరెడ్డిపల్లి, ఉల్లార్తి, పరుశురాంపురం, తదితర ప్రాంతాలలో బంధువులు, స్నేహితుల ద్వారా విత్తనకాయలను తెప్పించుకుంటున్నారు. ఇప్పటికే సుమారు వెయ్యి మంది రైతులు దాదాపు ఐదు వే ల బస్తాలు తెచ్చుకున్నారు. 40,500 కింటాళ్ల కే-6 విత్తనం కోసం ప్రతిపాదనలు కళ్యాణదుర్గం వ్యవసాయ డివిజన్లోని ఆరు మండలాల్లో 1.10 లక్షల హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణానికి అనుగుణంగా 40,500 కింటాళ్ల కే-6 రకం విత్తనకాయలు అవసరమని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఇందులో ఇప్పటి వరకు ఒక బస్తా కూడా సరఫరా కాలేదు. మొదటి విడత కింద 5,900 కింటాళ్లు పంపిణీ చేస్తామని, మిగిలిన విత్తనకాయలను విడతల వారీగా ఇస్తామని ఏడీఏ గురుమూర్తి తెలిపారు. త్వరలోనే రైతులకు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. కర్ణాటక నుంచి తెచ్చుకున్నా ఇక్కడ సబ్సిడీ వేరుశనగ ఇవ్వకపోవడంతో కర్ణాటక నుంచి తెచ్చుకున్నా. అక్కడి ప్రభుత్వం క్వింటాల్ రూ.3,200లతో టీఎంవీ-2 రకం విత్తనకాయలను ఇస్తోంది. నేను రవాణా ఖర్చుతో పాటు రూ.400 అదనంగా చెల్లించి ఇక్కడి తెచ్చుకున్నా. - పాతన్న, శెట్టూరు మన ప్రభుత్వంపై నమ్మకం లేకనే వర్షాలు కురుస్తున్నాయి. విత్తన సాగు సమయం ఆసన్నమైంది. మన ప్రభుత్వం రైతులకు అవసరమైన వేరుశనగ విత్తన రకాలను సబ్సిడీతో పంపిణీ చేస్తుందనే నమ్మకం లేదు. అందుకేకర్ణాటక నుంచి కొనుగోలు చేశా. - వన్నూర్‌స్వామి, శెట్టూరు -
'నేనంటే ఏమనుకుంటున్నారో...'
రాయదుర్గం : నేనంటే ఏమనుకుంటున్నారో... మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తా అంటూ టీడీపీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి దీపక్ రెడ్డి ఎన్నికల అధికారులు, పోలీసులపై నిన్న వీరంగం వేశారు. వివరాల్లోకి వెళితే దీపక్ రెడ్డికి ఎన్నికల ఏజెంట్‌గా ఇచ్చిన అనుమతిని ఆర్వో రద్దు చేశారు. ఈ సమాచారం పోలీసులకు అందచేసి ఆయనను హౌస్ అరెస్ట్ చేయాలని సూచించారు. ఈ మేరకు పోలీసులు ఉదయం 7 గంటలకు దీపక్ రెడ్డిని కలిసి హౌస్ అరెస్టు చేస్తున్నామని, ఇంటి నుంచి బయటకు వెళ్లరాదని తెలిపారు. దీనిపై ఆయన ఫైర్ అయ్యారు. 'నేను టీడీపీ ఎమ్పీ అభ్యర్థి ఎన్నికల చీఫ్ ఏజెంట్‌ను, నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారా, అభ్యర్థులను అడ్డగించినా, నన్ను అడ్డగించే అధికారం మీకులేదు' అంటూ రభస చేశారు. పోలీసులు ఆయనకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా దీపక్ రెడ్డి మొండిపట్టు వీడలేదు. తన ఏజెంట్ అనుమతిని రద్దుచేస్తే నియోజకవర్గంలోని అన్ని బూత్‌ల ఎన్నికలను నిలపాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ సీపీకి అమ్ముడుపోయారని పోలీసులపై ఆరోపణలు చేశారు. 'కల్యాణదుర్గంలో మీపై పాత కేసులున్నాయి, ఈ కారణంగా అరెస్ట్ చేసి కల్యాణదుర్గానికి తీసుకెళ్తాం' అని సీఐ భాస్కర్ రెడ్డి, డీఎస్పీ రమాకాంత్ రావు ...దీపక్ రెడ్డిని హెచ్చరించారు. దీంతో మెత్తబడిన దీపక్ రెడ్డి పోలీసుల ఆదేశాల మేరకు తన ఇంట్లోకి వెళ్లిపోవడంతో సమస్య సద్దుమణిగింది. -
వలస పక్షి రఘువీరా
* మూడు నియోజకవర్గాలు మార్చిన వైనం * 2009లో కళ్యాణదుర్గం, ఈసారి పెనుకొండ నుంచి ఎన్నికల్లో గెలుపొందేందుకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వలస పక్షిగా మారారు. 25 ఏళ్ల ఆయన రాజకీయ అనుభవంలో మూడుసార్లు నియోజకవర్గాలు మార్చడమే ఇందుకు నిదర్శనం. 2009లో కళ్యాణదుర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ఆయన ఈసారి 2014లో పెనుగొండ నియోజకవర్గానికి మకాం మార్చారు. మడకశిరలో మినహా మిగిలిన నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ లేకపోవడం కారణంగానే ఆయన ప్రతిసారి ఇతర నియోజకవర్గాలను వెతుక్కోవలసి వస్తోందని రాజకీయ విమర్శకులు అంటున్నారు. రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించే రఘువీరారెడ్డి ఒకే నియోజకవర్గంలో స్థిరంగా గెలుపొందే బలాన్ని పెంచుకోలేక పోతున్నారన్న విమర్శ లేకపోలేదు. బీజేపీలో అతితక్కుత కాలం పనిచేసిన రఘువీరారెడ్డి 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మడకశిర నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారిగా గెలుపొందారు. 1994లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1999, 2004 ఎన్నికలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తిరిగి గెలుపొందారు. 2004లో గెలుపొందిన అనంతరం మహానేత వైఎస్ఆర్ క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పదవిని అలంకరించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో మడకశిర ఎస్సీ రిజర్వేషన్‌గా మారింది. అంత వరకు ఎస్సీ రిజర్వేషన్‌గా ఉన్న కళ్యాణదుర్గం జనరల్‌గా మారింది. మహానేత వైఎస్ఆర్ చలువతో 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి పదవిని చేపట్టారు. కళ్యాణదుర్గంలో ఎదురుగాలి వీచడంతో ఆయన ఈసారి 2014 ఎన్నికల్లో పెనుకొండ నుంచి పోటీ చేస్తున్నారు. -
చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు
ఆయనో అబద్ధాల వీరుడు నమ్మి గెలిపిస్తే రాష్ర్టం మరింత సంక్షోభం కరెంటు బిల్లులు చెల్లించలేదని రైతులపై కేసులు పెట్టించారు రోడ్‌షోలో అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజం కళ్యాణదుర్గం రూరల్, న్యూస్‌లైన్ : తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. ‘జన పథం’ పేరిట వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం కళ్యాణదుర్గంలోని టీ సర్కిల్లో నిర్వహించిన రోడ్‌షోలో ఎంపీ మాట్లాడారు. రాష్ర్ట విభజనకు టీడీపీ అధినేత పూర్తిగా సహకరించారని విరుచుకుపడ్డారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ అనేక పోరాటాలు చేసిందన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న రైతులపై కేసులు బనాయించారన్నారు. చివరికి మహిళలు మంగళసూత్రాలను తాకట్టుపెట్టి బకాయిలు చెల్లించాల్సి వచ్చిందన్నారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం నష్ట పరిహారం కూడా ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు అడుగడుగునా ప్రజలను మోసం చేశారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తానని ప్రకటిస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ఎద్దేవా చేశారన్నాన్నారు. అయితే 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైలుపై చేసి.. ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారని కొనియాడారు. టీడీపీ పాలనలో శాశ్వత అభివృద్ధి పనులు ఎక్కడా జరగలేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు నాలుగు సార్లు భూమి పూజ చేసి గాలికి వదిలేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. వైఎస్ అధికారంలోకి రాగానే రాష్ర్టంలో ఊహించలేని అభివృద్ధి జరిగిందన్నారు. చంద్రబాబు అబద్ధాల వీరుడు, అధికారం కోసం ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఆయన మాటలను నమ్మి అధికారం కనుక కట్టబెడితే రాష్ర్టం మరింత సంక్షోభంలో కూరుకుపోతుందని హెచ్చరించారు. రాజకీయ నేతలకు అధికారం ముఖ్యం కాదు... ప్రజల సంక్షేమానికి పాటు పడాలని సూచించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతున్న వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రాబోవు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ై వెఎస్సార్సీపీ అధికారంలోకి రావాడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సీఈసీ సభ్యుడు ఎల్ఎం మోహన్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీని నమ్మితే ప్రజల భవిష్యత్తు అంధకారమేనన్నారు. వైఎస్ ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్తా సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ-కాంగ్రెస్‌ను తిప్పి కొట్టి వైఎస్సార్సీపీని గెలిపించాలన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త బి.తిప్పేస్వామి మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిచి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహుమానంగా ఇద్దామన్నారు. కళ్యాణదుర్గం ప్రాంతానికి వైఎస్ విజయమ్మ రావడం మహా అదృష్టమన్నారు. రోడ్‌షోలో సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ రఘునాథరెడ్డి పాల్గొన్నారు. -
రుణమాఫీ ఘనత వైఎస్ఆర్దే
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏనాడూ ధరల పెరుగుదల లేదని, అంతేకాక.. కేంద్రంతో మాట్లాడి మరీ రైతులకు రుణమాఫీ చేయించిన ఘనత కూడా ఆయనదేనని వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆమె 'వైఎస్ జనభేరి'లో మాట్లాడారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా జలయజ్ఞాన్ని వైఎస్సే ప్రారంభించారని, ఏం చేసినా ప్రజల మనసులోనుంచి వైఎస్ఆర్ను ఎవరూ తొలగించలేరని ఆమె స్పష్టం చేశారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ కలిపించిన ఘనత వైఎస్‌దని, రాష్ట్రగతిని మార్చిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందని విజయమ్మ అన్నారు. చంద్రబాబు హయాంలో పశువులకు నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని, హైటెక్ సిటీని చూపించి బాబు 55 వేల కోట్ల అప్పులు మోపారని, రైతుల రుణమాఫీ చేస్తానని బాబు మళ్లీ మోసంగించే ప్రయత్నం చేస్తున్నారని విజయమ్మ మండిపడ్డారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల వ్యవస్థ ఏర్పాటుచేసిందే చంద్రబాబని, అలాంటిది ఇప్పుడు ఇంటింటికీ ఉద్యోగం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జీతాలు పెంచాలని అడిగితే గుర్రాలతో తొక్కించిన ఘనత బాబుదని మండిపడ్డారు. ప్రధానమంత్రిని సైతం తానే చేశానంటున్న చంద్రబాబు వందకోట్ల విలువైన ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చారా అని విజయమ్మ ప్రశ్నించారు. -
అధికారంలోకి రాకపోతే ఎలా? కాంగ్రెస్ కార్యకర్తల నిర్వేదం
కళ్యాణదుర్గం, న్యూస్‌లైన్: ఇప్పుడే అధికారులు మాట వినడంలేదు... ఇక పార్టీ అధికారం కోల్పోతే తమ పరిస్థితి ఏమిటని పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరాశనిస్పృహలను వ్యక్తం చేశారు. స్థానిక కళ్యాణదుర్గం భవన్లో గురువారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జయరాం పూజారి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి రఘువీరా, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డిలకు వారు తమ ఇబ్బందులు తెలుపుతూ పార్టీ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. కనుకూరు మల్లప్ప, ఏ-బ్లాక్ అధ్యక్షుడు గంగాధర, మాజీ ఎంపీటీసీ దొణస్వామి, మాజీ ఎంపీపీ రామన్న, కంబదూరు రాధమ్మ, తదితరులు మాట్లాడారు. విద్యుత్, ఐకేపీ, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కార్యకర్తల సమావేశమంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారని నిలదీయాలి కానీ స్వప్రయోజనాల కోసం కాదని మంత్రి వారిని మందలించారు. అంతకుముందు మంత్రి మాట్లాడుతూ అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లును చిత్తుగా ఓడిస్తామన్నారు. ఓట్లు, సీట్ల కోసం టీడీపీ, వైఎస్ఆర్సీపీ కక్కుర్తి పడ్డాయని విమర్శించారు. సీమాంధ్రలో రాజధానికి రూ.5లక్షల కోట్లు ప్యాకేజీ ఇవ్వాలని కోరిన చంద్రబాబు సమన్యాయం పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని విభజించడానికి మద్దతు ఇస్తున్న బీజేపీతో జతకట్టేందుకు ఆయన యత్నిస్తూ కమలాన్ని సైకిల్‌పై ఊరూర ఊరేగిస్తున్నారని ఎద్దేవా చేశారు. జీడీపల్లికి నీరు తీసుకురావడంతో 50 సంవత్సరాల కల నెరవేరిందన్నారు. కాంగ్రెస్‌కు గెలుపు, ఓటములు సహజమేనని, ఎవరూ బయటకు వెళ్లిన బయపడేది లేదన్నారు. గతంలో మాదిరి ఈసారి కార్యకర్తల సమావేశంలో ఉత్సాహం కనిపించలేదు. కాంగ్రెస్ నాయకులు బాల నరేంద్రబాబు, తలారి వెంకటేశులు, లాయర్ దేవేంద్ర, కరణం తిప్పేస్వామి, ఎర్రనాగరాజు, రామాంజినేయులు, గోవిందరెడ్డి, మంజునాథ్‌రెడ్డి, మంజునాథచౌదరి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి, కొడుకు,కూతురు మృతి
అనంతపురం: కళ్యాణదుర్గం వడ్డే కాలనీలో నిన్న ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. తల్లి తనపైన, తన కొడుకు, కూతురుపైన కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. ఈ సంఘటనలో కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి, కూతురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. కుటుంబ కలహాల కారణంగానే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
ఇద్దరు పిల్లల సహా తల్లి ఆత్మహత్యాయత్నం
అనంతపురం : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వడ్డే కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలు సహా తల్లి వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఈ సంఘటనలో కొడుకు మృతి చెందగా, తల్లి, కూతురి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
సెట్టుకిందే..సదువుకోండి..
విద్యాలయాలు దేవాలయాలతో సమానమని పెద్దలు చెబుతుంటారు. ఇందుకు భిన్నంగా దేవాలయమే విద్యాలయంగా మారిన వైనమిది. సాక్షాత్తు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బోరంపల్లి గ్రామంలో తరగతి గదులు లేక ఆలయంలోని చెట్టు కింద చదువుకుంటున్న విద్యార్థుల దుస్థితిది. కళ్యాణదుర్గం, న్యూస్‌లైన్ : కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బోరంపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో తరగతి గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ 123 మంది విద్యార్థులున్నారు. ఒకటి నుంచి 8 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో ఉన్న మూడు భవనాలలో రెండు కూలి పోగా, ప్రస్తుతం ఒకే గది ఉంది. ఈ ఒక్క గదిలో ఎనిమిది తరగతులు నిర్వహించడం అసాధ్యం. గత జూన్ 28న భవన పైకప్పు కూలి పలువురు విద్యార్థులు సైతం గాయపడిన సంగతి తెలిసిందే. ఆ రోజు రాజీవ్ విద్యా మిషన్ పీఓ రామారావు, తహశీల్దార్ మహబూబ్‌బాషా, ఎంపీడీఓ కృష్ణమూర్తి, ఎంఈఓ కుల్లాయప్ప, ప్రజాప్రతినిధులు సంఘటన స్థలాన్ని పరిశీలించి అదనపు భవనాలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. మళ్లీ ఇటు తిరిగి చూడలేదు. దీంతో గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలోని చెట్ల కింద, పక్కనే ఉన్న కల్యాణ మంటపంలో తరగతులు నిర్వహిస్తున్నారు. వర్షం వస్తే పాఠశాలకు సెలవే. త్వరలో నాలుగు గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామని ఎంఈఓ కుల్లాయప్ప చెప్పారు. రాష్ట్రంలో అత్యంత కీలక మైన రెవిన్యూ మంత్రిగా ఉన్న స్థానిక శాసనసభ్యుడు రఘువీరారెడ్డి సైతం ఈ పాఠశాల గురించి పట్టించుకోక పోవడం అన్యాయమని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. -
మంత్రి రఘువీర నివాసాన్ని ముట్టడించిన సమైక్యవాదులు
రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డికి సమైక్య సెగ తగిలింది. కళ్యాణదుర్గంలోని మంత్రి రఘువీరారెడ్డి నివాసాన్ని సమైక్యవాదులు ఆదివారం ముట్టడించారు. మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని సమైక్యవాదులు రఘువీరారెడ్డిని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో మంత్రి రఘువీరా ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వెంటనే పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొన్నాలని వారు డిమాండ్ చేశారు. రఘువీరా ఇంటిని సమైక్యవాదులు ముట్టడించడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సమైక్యవాదులను కట్టడి చేసేందుకు యత్నిస్తున్నారు. -
మృత్యు వేగం..
ఆదివారం జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. వాహనాల వేగం వల్లే ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లిలో రెండో తరగతి చదువుతున్న కృష్ణవేణి (8) ఆటో దిగి రోడ్డు దాటుతుండగా అనంతపురం నుంచి హిందూపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. అనంతపురం కళ్యాణదుర్గం రోడ్డులోని పాపంపేట కాలనీకి చెందిన రోహిణి (7) సమీప బంధువుతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. ఐషర్ వాహనం ఢీకొనడంతో వెనుక టైరు కింద పడి మృతిచెందింది. బళ్లారికి సమీపంలోని సంగనకల్లుకు చెందిన కుటుంబం పెనుకొండకు వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న టాటా సుమో బోల్తా పడి లతీఫ్ (13) అనే బాలిక చనిపోయింది. వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. కొద్ది క్షణాల వరకూ నవ్వుతూ, తుళ్లుతూ ఉల్లాసంగా తల్లిదండ్రులతో కనిపించిన ఆ పిల్లలను అంతలోనే మృత్యువు వాహనాల రూపంలో బలి తీసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది. ఈ సంఘటల్లో మృతి చెందిన వారంతా 7 నుంచి 13 ఏళ్లలోపు బాలికలే.. ఐషర్ ఢీకొని... అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: కళ్యాణదుర్గం రోడ్డులోని పాపంపేట కాలనీలో టూరిస్టు ఏజెంటుగా పని చేసే శివశంకర్, లలిత దంపతులు నివాసముంటున్నారు. వీరి కూతురు రోహిణి (7) ఆదివారం సెలవు కావడంతో తమ సమీప బంధువుతో కలసి ద్విచక్ర వాహనంపై ప్రధాన రహదారి వైపు వెళుతుండగా, కళ్యాణదుర్గం నుంచి నగరంలోకి వస్తున్న ఐషర్ వాహనం వెనుకవైపు నుంచి వచ్చి ఢీకొంది. ఈ సంఘటనతో ద్విచక్రవాహనం ముందువైపు కూర్చున్న రోహిణి జారి కిందపడింది, ఆమె కడుపు పైనుంచి ఐషర్ వాహనం వెనుక టైరు వె ళ్లడంతో తీవ్రంగా గాయపడింది. విషయం గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.దాంతో ఆగ్రహించిన స్థానికులు వాహన డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. క్షణకాలం వరకూ తమతో గడిపిన కూతురు మృతి చెందినట్లు తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. సుమో బోల్తా పడడంతో... కూడేరు, న్యూస్‌లైన్: కర్ణాటకలోని బళ్లారికి సమీపంలోని సంగనకల్కు చెందిన వన్నూర్‌సాబ్ కుటుంబ సభ్యులు ఆదివారం టాటా సుమోలో పెనుకొండలోని బాబయ్య స్వామి దర్గాకు బయలుదేరారు. కూడేరుకు రెండు కిలోమీటర్ల దూరంలో వెనుక చక్రం హఠాత్తుగా పంక్చర్ కావడంతో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో అందులో ఉన్న లతీఫ్ (13) అనే బాలిక తీవ్రంగా గాయపడి మృతి చెందింది. వన్నూర్సాబ్తోపాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి వరకూ ఉల్లాసంగా కబుర్లు చెబుతూ ఉండిన చిన్నారి క్షణాల వ్యవధిలో మృతి చెందడడంతో ఆ కుటుంబ సభ్యులు రోదించిన తీరు కలచివేసింది. స్థానికులు 108 సాయంతో క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూడేరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని... దామాజిపల్లి(చెన్నేకొత్తపల్లి)న్యూస్‌లైన్: దామాజిపల్లికి చెందిన నాగేంద్రమ్మ, ఆదినారాయణ దంపతుల రెండో కూతురు కృష్ణవేణి (8) స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఆదివారం ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ కాలనీలోని పిల్లలతో కలసి మండల కేంద్రానికి వచ్చింది. కార్యక్రమం అనంతరం అందరూ ఆటోలో గ్రామానికి చేరుకున్నారు. ఆటో దిగి రోడ్డు దాటుతుండగా అనంతపురం నుంచి హిందూపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు చిన్నారిని ఢీకొంది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న బాలిక అవ్వ, తాత, తల్లిదండ్రులు భోరున విలపించారు. ఎస్ఐ దస్తగిరి సంఘటన స్థలాన్ని సందర్శించారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ ప్రభాకర్, ప్రధానోపాధ్యాయురాలు హేమలత, ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. -
పయ్యావుల కేశవ్‌ను అడ్డుకున్న సమైక్యవాదులు
అనంతపురం: టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను కల్యాణదుర్గంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. విభజనకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే కారణమని ఉద్యోగులు పయ్యావులతో వాగ్వాదానికి దిగారు. పయ్యావుల గో బ్యాక్ అంటూ సమైక్యవాదులు నినాదాలు చేశారు. దాంతో కల్యాణదుర్గంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాన్ని విడగొట్టాలని కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడని సీమాంధ్రవాసులు భావిస్తున్నారు. చంద్రబాబు మద్దతుతోనే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దాంతో అందరూ టిడిపిపైన, చంద్రబాబుపైన ఆగ్రహంతో ఉన్నారు.