వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ వర్గీయుల దాడి | TDP leaders attacked on ysrcp leaders | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ వర్గీయుల దాడి

Published Sat, Oct 15 2016 11:44 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

TDP leaders attacked on ysrcp leaders

కుందుర్పి:  మండలంలోని ఎస్‌.మల్లాపురంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. అంతటితో ఆగక గాయపరిచారు. మొహర్రం సందర్భంగా  శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుం ది. బాధితుల కథనం మేరకు...  పీర్లు జలధికి వెళ్లిన తర్వాత టీడీపీ వర్గీయులు హనుమంతరాయుడు, కిష్ట ప్ప, సుధాకర్, మారుతేజ్, నాగేష్, పాతలింగ, మారెప్ప సహా మరో 20 మంది  వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు.
 
ఘటనలో మల్లప్ప, విశాలమ్మ, అంజప్ప, కదరప్ప, నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని పెద్దాస్పత్రికి తరలించినట్లు  పోలీసులు తెలిపారు. అంతకు ముందు బాధితులను వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్, మండల కన్వీనర్‌ సత్యనారాయణశాస్త్రి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజగోపాల్, మాజీ సర్పంచులు గవియప్ప, లింగప్ప, తిప్పేస్వామి తదితరులు కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో పరామర్శించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కుందుర్పి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
అమ్మా..మమ్మల్ని చంపేస్తారు..!
కళ్యాణదుర్గం: ‘అమ్మా...మమ్మల్ని టీడీపీ వారు చంపేస్తారేమో.. మాకు దిక్కు లేకుండా పోయింది. వైఎస్సార్‌సీపీ అభిమానులమనే కక్షకట్టారు. ఇంత అన్యాయం జరుగుతున్నా...అధికారులు పట్టించుకోవడం లేదంటూ’ కుందుర్పి మండలం ఎస్‌.మల్లాపురంలో టీడీపీ వర్గీయుల దాడుల్లో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు.. నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్‌ వద్ద వాపోయారు. కళ్యాణదుర్గం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని శనివారం సమన్వయకర్త ఉషాశ్రీ పరామర్శించారు. తీవ్రంగా గాయపడ్డ నాగరాజు, మల్లప్ప, విశాల, కదిరప్ప, అంజినప్పలకు ఆమె ధైర్యం చెప్పారు.
 
విశాల బోరున విలపించడంతో ఉషాశ్రీచరణŠ  సైతం కంటతడిపెట్టారు. అక్కడే ఉన్న ప్రభుత్వ వైద్యుడు రంగనాథ్‌తో బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉషాశ్రీ చరణ్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదన్నారు. ఎస్‌.మల్లాపురం బాధితులపై దాడిచేసి చంపడానికి ప్రయత్నించిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement