
సాక్షి, గుంటూరు : జిల్లాలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పొన్నూరు మండలం కొండముదిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. ఈ ఘటనలో నలుగురు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య విజయోత్సవ ర్యాలీకి ఆటంకం కల్పించేందుకు టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం దాడులకు తెగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.