కళ్యాణదుర్గం రూరల్ : కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని ఒంటిమిద్దికి చెందిన గుడిసె హంపన్న కుమారుడు వెంకటేశులు(28) గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మూడేళ్ల కిందట పెళ్లికకాగా, కొంతకాలం తరువాత భార్య గాయత్రి దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఆమె విడాకుల నోటీసు పంపడంతో మనస్తాపానికి గురైన వెంకటేశులు ఇంట్లోనే దూలానికి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు వివరించారు. మృతుడి జేబులో లభించిన సూసైడ్ నోట్‌లో.. భార్య తనను మోసం చేసి, బాబు అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, దాంతోనే తనకు దూరమైందని అందులో రాసి ఉంది. ఆ లెటర్‌ను మృతుడి తండ్రి హంపన్న విలేకరులకు చూపెట్టారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.