కల్యాణదుర్గం (అనంతపురం) : అనంతపురం జిల్లా కల్యాణ దుర్గంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన సోంశేఖర్.. కుటుంబంతో కలిసి సొంత పనుల నిమిత్తం వేరే ఊరు వెళ్లాడు. కాగా సోమవారం తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో ఉన్న రూ.3లక్షల విలువైన బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లారు. సోంశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.