తల్లిలేని లోటు తీరుస్తున్న కుక్క | Dog Feeding Milk To Lamb | Sakshi
Sakshi News home page

తల్లిలేని లోటు తీరుస్తున్న కుక్క

Published Mon, May 6 2019 10:54 AM | Last Updated on Mon, May 6 2019 10:54 AM

Dog Feeding Milk To Lamb - Sakshi

అనంతపురం :  సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య చిన్నపాటి గొడవ జరిగితేనే అది ఎన్నో మలుపులకు కారణమవుతుంది. అలాంటిది జాతి వైరాన్ని మరచి.. అమ్మతనం చూపుతూ మరో జీవికి పాలు ఇస్తోంది ఓ శునకం. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గం మండల పరిధిలోని తిమ్మసముద్రం గ్రామానికి చెందిన బోయ నరేష్‌.. రెండు ఎద్దులు, మూడు ఆవులు, ఒక కుక్క , ఒక గొర్రెపిల్లను పెంచుకుంటున్నాడు. అయితే గొర్రె పిల్లకు కుక్కనే పాలు ఇస్తూ తల్లిలేని లోటు తీరుస్తోంది. గ్రామస్తులు కూడా ఈ దృశ్యాలను చూస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement