ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు | yandamuri veerendranath in kalyanadurgam | Sakshi
Sakshi News home page

ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు

Published Fri, Sep 16 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

yandamuri veerendranath in kalyanadurgam

కళ్యాణదుర్గం రూరల్‌ : విద్యార్థులు ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ అన్నారు.  స్థానిక సుబ్రమాణ్ణేశ్వర  కల్యాణ æమండపంలో ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో గురువారం పదో తరగతి పరీక్షలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతి థులుగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్,మాస్టర్‌ మైండ్‌ డైరెక్టర్‌ మెట్టువల్లి మోహన్‌  హాజరయ్యారు.  వారు మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు భయాందోళనకు గురి కాకుండా చదువుపై ఇష్టాన్ని పెంచుకోవాలన్నారు.

ఏకాగ్రతను అలవరచుకొని విద్యపై శ్రద్ధ వహించాలన్నారు. తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్య నేర్చిన వాడు గొప్ప వాడని అభివర్ణించారు. విద్య నేర్చితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సమస్యలను పరిష్కరించుకోవచ్చునన్నారు.  ప్రైవేటు పాఠశాలల హెచ్‌ఎంలు శ్రీశైల, బాబు,నరసింహాచారి  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement