Yandamuri veerendranath
-
ఈ తెలుగాయన ఆఫ్రికాని జయించాడు!
విజయం ఏ ఒక్కరి సొత్తు కాదు. సమాజంలోని ప్రతి ఒక్కరూ దాన్ని అందుకోవాలి అనే అనుకుంటారు. కాకపోతే ఇక్కడ అనుకోవటం వేరు.. విజయాన్ని అందుకోవడం వేరు!. ఆటంకాలకు అవకాశాలుగా మార్చుకుని.. పట్టుదలతో శ్రమిస్తే విజయం సొంతం అవుతుందని నిరూపించిన గాథల్లో మోటపర్తి శివరామ వర ప్రసాద్(MSRV Prasad) సక్సెస్‌కు చోటు ఉంటుంది. ఆయన ఎదుగుదలా క్రమమే ‘అమీబా’గా ఇప్పుడు పాఠకుల ముందుకు వచ్చింది.చీకటి ఖండంగా పేరున్న ఆఫ్రికాలో.. అదీ అననుకూల పరిస్థితుల నడుమ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న ఓ తెలుగోడి ఆత్మకథే అమీబా. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ (Yandamuri Veerendranath) దీనిని రచించడం ఇక్కడ ఒక విశేషం కాగా.. తెలుగులో ఇది తొలిక్రైసిస్ మేనేజ్మెంట్ బుక్ కావడం మరో ప్రత్యేకత. నవ సాహితి బుక్ హౌజ్ పబ్లికేషన్స్ అచ్చేసిన ఈ బయోగ్రఫీ బుక్.. ఈ మధ్యే జయప్రకాశ్ నారాయణ లాంటి మేధావులు పాల్గొన్న ఓ ఈవెంట్లో లాంఛ్ అయ్యింది.పశ్చిమ గోదావరిలో కొవ్వలి అనే కుగ్రామంలో ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి మోరపాటి జన్మించారు. ఆటంకాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ సాగిన ఆయన ప్రయాణం.. ప్రస్తుతం సంపద విలువను రూ. 12 వేల కోట్లకు చేర్చింది. Warangal NIT లో మెటలర్జి చదివారు. గుజరాత్ లో పని చేసి, హైదరాబాద్‌లో ఫౌండ్రి పెట్టారు. తర్వాత ఆ వ్యాపారాన్ని ఘనాలో విస్తరించాడు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ స్టీల్, సిమెంట్, కెమికల్స్, ఆటోమొబైల్స్, రియల్ ఎస్టేట్, గార్మెంట్స్ పరిశ్రమలను స్థాపించారాయన. వాటి ద్వారా 20 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు. శ్రమ, ముందు చూపు, జ్ఞానం.. తన విజయానికి కారణాలని చెప్తున్నారు. అన్నట్లు.. సారధి స్టూడియోకు ప్రస్తుతం చైర్మన్ ఈయనే. మోటపర్తి శివరామ వర ప్రసాద్ విజయ ప్రయాణం.. దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం, చాతుర్యం వంటి వాటికి నిదర్శనం. ఉద్యోగి సంక్షేమం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది.:::డాక్టర్ జయప్రకాష్ నారాయణAMOEBA.. అడ్డంకులను అవకాశాలుగా మార్చుకుని.. నిర్దేశించని ప్రాంతాలను జయించిన వ్యక్తికి సంబంధించిన స్ఫూర్తిదాయకమైన కథనం. గొప్ప విజయాల్ని అందుకోవాలనుకునేవాళ్లెందరికో ఆయన జీవితం ఓ ఆశాజ్యోతి. :::రచయిత యండమూరి వీరేంద్రనాథ్రూ.400 జీతగాడిగా(మెటాలర్జిస్ట్గా) మొదలైన ఓ తెలుగు ఎంట్రప్రెన్యూర్ ప్రయాణం.. ఇప్పుడు సాధన సంపత్తి, అపారమైన సంపద, ఓ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించడం ఎంతైనా స్ఫూర్తిదాయకం కాదంటారా?. -
యండమూరి చేతుల్లో మెగాస్టార్ జీవిత చరిత్ర
-
మెగాఫ్యాన్స్‌ను చల్లబర్చిన యండమూరి.. అప్పుడలా, ఇప్పుడిలా..
స్వయంకృషితో ఎదిగిన హీరో.. అనగానే మొదట గుర్తొచ్చే పేరు చిరంజీవి. ఎన్నో కష్టాలు, కఠోర శ్రమ ఫలితంగా మెగాస్టార్ అన్న బిరుదు వచ్చింది. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న అతడు ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొంది తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే చిరంజీవికి ఎంతో సన్నిహితంగా మెదిలే స్టార్ రచయిత యండమూర వీరేంద్రనాథ్ గతంలో రామ్‌చరణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత యండమూరి వారి కోపాన్ని చల్లార్చాడు. అదెలాగంటే.. నెం.1 స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టం ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్నార్ శత జయంతి సందర్భంగా విశాఖపట్నంలో అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి.. లోక్‌నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారాన్ని యండమూరి వీరేంద్రనాథ్‌కు అందజేశాడు. ఈ సందర్భంగా యండమూరి మాట్లాడుతూ.. 'నాకు, చిరంజీవికి విడదీయరాని అనుబంధం ఉంది. నేను రాసిన మూడో పుస్తకం ఆనందోబ్రహ్మ చిరంజీవికి అంకితం ఇచ్చాను. సినీ రంగంలో నెంబర్ వన్ అవడం కాదు నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. చిరంజీవి కష్టపడి నెం.1 స్థానాన్ని నిలబెట్టుకున్నారు. నాకు ఇచ్చే ఈ అవార్డు నగదును రెండు స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తాను' అని చెప్పుకొచ్చాడు. అప్పట్లో చరణ్‌ను అవమానించిన యండమూరి తాజాగా చిరును పొగడంతో ఫ్యాన్స్ కూల్ అవుతున్నారు. చరణ్‌కు దవడ సరిగా లేదు మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే ఇతడు 80, 90 దశకాల్లో చిరు హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రాలకు రచయితగా పని చేశాడు. కానీ ఓ సందర్భంలో చిరు తనయుడిని కించపరిచేలా మాట్లాడాడు. 2016లో ఓ ఇంజనీరింగ్ కాలేజీ ఫంక్షన్లో యండమూరి మాట్లాడుతూ.. చరణ్‌ను హీరో చేయడం అతడి తల్లి సురేఖ చాలా కష్టపడింది. డ్యాన్సులు నేర్పించింది. అప్పట్లో ఆ అబ్బాయి దవడ సరిగా ఉండేది కాదు, తర్వాత దాన్ని సరి చేయించారు. అదే సమయంలో మరో ఎనిమిదేళ్ల కుర్రాడు ఎంతో ప్రతిభ కనబర్చాడు. చరణ్ పేరు చెప్తే చప్పట్లు కొట్టలేదు అబ్బనీ తియ్యనీ దెబ్బ పాట విని ఇది శివరంజనీ రాగం అని గుర్తుపట్టాడు. దీంతో ఇళయరాజా ఆ కుర్రాడిని మెచ్చుకున్నాడు. అతడే దేవిశ్రీప్రసాద్..' అని చెప్పుకుంటూ పోయాడు. అక్కడితో ఆగకుండా 'రామ్‌చరణ్ పేరు చెప్పినప్పుడు మీరు చప్పట్లు కొట్టలేదు. కానీ దేవిశ్రీప్రసాద్ పేరు చెప్పినప్పుడు మాత్రం చప్పట్లు కొట్టారు. ఎందుకంటే డీఎస్పీ స్వశక్తితో పైకొచ్చాడు. నువ్వు ఏంటనేది ముఖ్యం అంతే తప్ప మీ నాన్న ఎవరన్నది కాదు' అని వ్యాఖ్యానించాడు. ఓసారి పవన్ కల్యాణ్‌పైనా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మెగా ఫ్యాన్స్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేను ఇన్స్పిరేషన్ తో రాసిన నొవెల్స్ అవి.. కాపీ కొట్టి కాదు
-
రాజకీయాలకు నేను చాలా దూరం: యండమూరి వీరేంద్రనాథ్
-
నేను 200 కోట్లకు అధిపతి..ఒక్క బ్లాక్ మార్క్ లేదు..!
-
మనిషి సంతోషంగా ఉండాలంటే ఎలాంటి అలవాట్లు పాటించాలి..?
-
లిరిక్స్ వివాదం.. యండమూరికి చంద్రబోస్ గట్టి కౌంటర్
ప్రముఖ నవలా రచయిత, మోటివేషనల్ స్పీకర్ యండమూరి వీరేంద్రనాథ్‌కు సినీ గేయ రచయిత చంద్రబోస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో చంద్రబోస్ రాసిన టైటిల్ సాంగ్‌పై ఫేస్బుక్ వేదికగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ పాటలో సాహిత్యం అర్థం లేకుండా ఉందని, పాటలోని కొన్ని పంక్తులపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘తుఫాన్ అంచున తపస్సు చేసే వశిష్టుడే వీడే..తిమిరనేత్రమై ఆవరించిన త్రినేత్రుడే’ అనే పంక్తిని ఉద్దేశిస్తూ ‘తిమిరము’ అంటే అర్థం తెలుసా? శివదూషణ కాదా ఇది? ఎవరు రాశారో కానీ ఏమిటీ పిచ్చి రాతలు? అంటూ యండమూరి వీరేంద్రనాథ్ పోస్ట్ చేశారు. చదవండి: నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం, తండ్రి మృతి.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ ఆయన కామెంట్స్‌కి చంద్రబోస్ గట్టిగా బదులిచ్చారు. తాను రాసిన పాటలోని లైన్లు విరోధాబాసాలంకారం కిందకు వస్తాయని, పరస్పర విరుద్ధమైన రెండు పదాలు కలయికను లోతుగా పరికిస్తే విరోధం తొలగిపోయి ఆ పదబంధం లోతు తెలుస్తుందన్నారు. ఇది రచయితలు అందరికీ తెలుసని, తనకు తెలిసే ఈ ప్రయోగం చేశానని వివరణ ఇచ్చారు. అసలు తిమిరంలోని నిగూడార్థం తెలియని వారే అసలైన తిమిరమంటూ చంద్రబోస్ రీకౌంటర్ ఇచ్చారు. అంతేకాదు ప్రముఖ రచయిత సత్యానంద్ ఫోన్ చేసి సాహిత్యపరంగా అధ్యయనం చేయాల్సిన గీతమిదని ప్రశంసించారన్నారు. చదవండి: సందీప్ రెడ్డి వంగ, రణ్‌బీర్ కపూర్ యానిమల్ నుంచి క్రేజీ అప్డేట్ -
"మూడు చేపల కథ" ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్
"సమంత" చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, తొలి చిత్రంతోనే దర్శకుడిగా తన ప్రతిభను ప్రకటించుకున్న యువ ప్రతిభాశాలి ముఖేష్ కుమార్ తెరకెక్కించిన ద్వితీయ చిత్రం "మూడు చేపల కథ". షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ విడుదల చేశారు. రియలిస్టిక్ డాక్యుమెంటరీ క్రైమ్ థ్రిల్లర్ గా ముఖేష్ కుమార్ రూపొందిస్తున్న "మూడు చేపల కథ" మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. యండమూరి నవలలు చదువుతూ పెరిగి ఆయన ఇచ్చిన ప్రేరణతో రచయిత అయి దర్శకుడిగా మారిన తను దర్శకత్వం వహించిన "మూడు చేపల కథ" ఫస్ట్ లుక్ యండమూరి ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని ముఖేష్ కుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా, కదిరిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తన రెండవ చిత్రం "మూడు చేపల కథ" తెరకెక్కించానని ముఖేష్ తెలిపారు. ప్రముఖ ఆర్జే లక్ష్మీ పెండ్యాల (లక్కీ), సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ, ఈ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న "గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ" స్టూడెంట్స్ డా: కల్యాణ్, సుభాష్ గయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా.. అధిక భాగం షూటింగ్ అనంతపురంలో జరుపుకున్న ఈ చిత్రం పోస్టర్‌ను ప్రముఖ యాంకర్ రమేష్ అనంతపురంలోనూ రిలీజ్ చేశారు. -
‘అతడు ఆమె ప్రియుడు’ రివ్యూ
టైటిల్ : అతడు ఆమె ప్రియుడు నటీనటులు: సునీల్, బెనర్జీ, కౌషల్, భూషణ్, మహేశ్వరి, దియా, జెన్నీ తదితరులు... సంగీతం : ప్రద్యోతన్ కెమెరా-ఎడిటర్ : మీర్ నిర్మాణ సారథ్యం: అమర్, నిర్మాతలు: రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాథ్ విడుదల తేది: ఫిబ్రవరి4, 2022 ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ నవలలు ఎంతలా ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన రాసిన చాలా నవలలు సినిమాలుగా కూడా వచ్చాయి. ఓ వైపు మాటల రచయితగా మరోవైపు వ్యక్తిత్వ వికాస రచనలు చేస్తూ అనేక నవలలతో పాటు నాటికలు రాసారాయన. అగ్నిప్రవేశం, స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ లాంటి సినిమాల ద్వారా డైరెక్టర్ గానూ తనను తాను ప్రూవ్ చేసుకున్న యండమూరి తాజాగా తన నవల “అతడు ఆమె ప్రియుడు” ద్వారా మళ్లీ దర్శకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. యండమూరి రచనా శైలి, దర్శకత్వంతో పాటు ఆకట్టుకునే టైటిల్ కావడంతో భారీ అంచనాల మధ్య సినిమా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘అతడు ఆమె ప్రియుడు’కథేంటంటే..? బెనర్జీ, సునీల్, కౌషల్ పాత్రల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. ప్రకృతిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుని ప్రళయం రాబోతున్నట్లు వార్తలు వస్తాయి. ఉరుములు మెరుపులతో భయంకరమైన గాలి వాన మొదలౌతుంది. ఆ సమయంలో కౌషల్, సునీల్ బెనర్జీ ఇంట్లో ఆశ్రయం పొందుతారు. మరికొన్ని గంటల్లో యుగాంతం కాబోతోందని ఆ ఇంట్లో ఉన్న తమ ముగ్గురికే బతికే అవకాశం ఉందని చెబుతాడు. అయితే తమలో ఒకరు ప్రాణ త్యాగం చేసి వారి స్ధానంలో ఒక స్త్రీకి అవకాశం ఇస్తే భవిష్యత్తులో మానవజాతి అంతం కాకుండా ఉంటుందని బెనర్జీ చెబుతాడు. దాంతో కౌషల్, సునీల్ ఆలోచనలో పడతారు. అసలు ప్రకృతి విపత్తు రావడానికి కారణం ఏంటి? బెనర్జీకి మాత్రమే తెలిసిన ఆ రహస్యం ఏంటి? సునీల్, కౌశల్ లో ఎవరు ప్రాణ త్యాగం చేస్తారు? ఆ ఇంట్లో అడుగుపెట్టిన స్త్రీ ఎవరు? బెనర్జీ చెప్పినట్లు యుగాంతం అవుతుందా?అన్నదే సినిమా కథ. ఎవరెలా చేశారంటే? ప్రొఫెసర్ పాత్రలో బెనర్జీ నటన ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రవర పాత్రలో సునీల్ నవ్వులు పూయించారు. ఓ వైపు ప్రళయం వస్తోందని తెలిసి భయపడుతూనే మరోవైపు కామెడీని పండించారు. స్త్రీమూర్తి ఔన్నత్యం గురించి కౌషల్ ఏకధాటిగా చెప్పిన డైలాగ్ సినిమాలో హైలైట్ అని చెప్పాలి. ధారాళంగా ఆయన చెప్పిన డైలాగ్ కి ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. కౌషల్ ప్రతీకారం తీర్చుకునే పాత్రలో నటించిన భూషణ్ (ప్రముఖ నటుడు నాగభూషణం మనవడు) ద్విపాత్రాభినయంతో అలరించాడు. ఎలా ఉందంటే..? సినిమాలోని సంభాషణలు కొన్నిచోట్ల ఆలోపించే చేసేలా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మనసుని హత్తుకుంది. కథని రక్తి కట్టించేలా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయినప్పటికీ సీన్ బై సీన్ ప్రేక్షకుల్లో మరికొంత ఉత్కంఠ కలిగించేలా చూపించి ఉంటే బాగుండేది. ఏది ఏమైనా ప్రేమంటే సెక్స్, స్నేహమనే భావనలో ఉంటున్న యూత్ కి ఈ సినిమా ద్వారా రచయిత మంచి మెసేజ్ ఇచ్చాడని చెప్పవచ్చు. -
సింగిల్ టేక్‌లో రెండు పేజీల డైలాగ్ చెప్పి ఆశ్చర్యపరిచిన బిగ్‌బాస్ కౌశల్
సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’.సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై కూనం కృష్ణకుమారి సమర్పణలో... రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కౌశల్ ఈ సినిమాలో చెప్పిన సింగిల్ టేక్ డైలాగ్ టీజర్‌ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది. చదవండి: వరుణ్ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే.. కౌశల్ చెప్పిన అద్భుతమైన సింగిల్ టేక్ డైలాగు టీజర్‌ను ఈ రోజు మధ్యహ్నం చిత్ర దర్శకులు యండమూరి వీరేంద్రనాధ్ విడుదల చేశారు. స్త్రీ ఔన్నత్యం గురించి యండమూరి అత్యద్భుతంగా రాసిన రెండు పేజీల డైలాగ్‌ను కౌశల్ అంతే అద్భుతంగా సింగిల్ టేక్‌లో చెప్పి ఆశ్చర్యపరిచారు. అందుకే... ఈ డైలాగ్ ట్రైలర్‌ను చిత్ర రచయిత-దర్శకుడు యండమూరి ప్రత్యేకంగా విడుదల చేశారు. నటుడిగా కౌశల్‌కు ఉజ్వల భవిష్యత్ ఉందని ఈసందర్భంగా యండమూరి పేర్కొన్నారు. -
‘అతడు ఆమె ప్రియుడు’కు విజయం తధ్యం
సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’.సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై కూనం కృష్ణకుమారి సమర్పణలో... రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం ఈ చిత్ర ప్రిరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది చిత్ర యూనిట్. నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్, దర్శకులు దశరథ్, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ వేడుకలో... చిత్ర దర్శకుడు యండమూరి, నిర్మాతలు రవి కనగాల,-రామ్ తుమ్మలపల్లి, హీరో భూషణ్, హీరోయిన్ మహేశ్వరి వడ్డి, ఈ చిత్రానికి ఛాయాగ్రహణంతోపాటు ఎడిటింగ్ చేసిన మీర్ పాలుపంచుకున్నారు. రచయితగా ఎన్నో సంచలనాలు సృష్టించిన యండమూరి.... దర్శకుడిగాను "అతడు ఆమె ప్రియుడు" చిత్రంతో సంచలనాలకు శ్రీకారం చుట్టాలని అతిధులు ఆకాంక్షించారు. ‘అతడు ఆమె ప్రియుడు’చిత్రం కోసం యండమూరి ఎంతో శ్రమించారని, సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దారని నిర్మాతలు రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి పేర్కొన్నారు. యండమూరితో మరికొన్ని చిత్రాలు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. "అతడు ఆమె ప్రియుడు" చిత్రాన్ని ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేస్తున్నామని అన్నారు. -
చాటింగ్.. డేటింగ్.. మీటింగ్!
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి ‘అతడు.. ఆమె.. ప్రియుడు’ టైటిల్ ఖరారైంది. ప్రముఖ నటుడు సునీల్, ‘బిగ్ బాస్’ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో మహేశ్వరి, ప్రియాంక, సుపూర్ణ హీరోయిన్లు. రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం ప్రారంభమైంది. నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకులు కోదండ రామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మొన్న చాటింగ్.. నిన్న డేటింగ్.. ఈ రోజు మీటింగ్.. రేపు..’ అని హీరోయిన్ చెప్పిన డైలాగ్‌తో మొదలైన తొలి సీన్‌కి దర్శకుడు అజయ్ కుమార్ క్లాప్ ఇచ్చారు. ‘‘యండమూరిగారి దర్శకత్వంలో ‘నల్లంచు తెల్లచీర’ సినిమా తర్వాత వెంటనే ఆయన డైరెక్షన్లోనే ‘అతడు.. ఆమె.. ప్రియుడు’ సినిమాను నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కూనం కృష్ణకుమారి, కూనం ఝాన్సీ సహ నిర్మాతలు. -
బుర్రలు బద్దలు కొట్టుకోవద్దు...
‘ప్రస్తుత పరిస్థితుల పట్ల అనవసర భయాలు, ఆందోళనలు వద్దు. ఇప్పుడు మనం ఎదుర్కొంటోంది కొత్త సమస్య. ఇప్పటివరకు ఎవరూ చూడలేదు. పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. ప్రస్తుతమున్న సమస్యలు ప్రపంచమంతా ఉన్నాయి. అందరిలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే భవిష్యత్‌లో ఏదో పెద్ద నష్టం జరుగుతుందని ముందే ఊహించుకుని ఆందోళనలకు, మానసిక కుంగుబాటుకు లోనుకాకుండా వాస్తవాన్ని గ్రహించి ఏమి జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలి. ప్రస్తుత లాక్డౌన్ పీరియడ్‌ను అనుకూలంగా మార్చుకుని, ఫలితాలు సాధించాలి‘ అని మానసిక శాస్త్ర నిపుణులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, విశ్లేషకులు సూచిస్తున్నారు. కరోనా మహమ్మారి, లాక్డౌన్ పొడిగింపు వంటి పరిణామాల నేపథ్యంలో వివిధ రంగాల ప్రముఖులు యండమూరి వీరేంద్రనాథ్, డా.బీవీ పట్టాభిరాం, ప్రొ.వీరేందర్, డా.నిశాంత్ వేమనలతో ’సాక్షి‘ప్రత్యేక ఇంటర్వ్యూలు నిర్వహించింది. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే.. –సాక్షి, హైదరాబాద్ మళ్లీ ఇలాంటి దశ రాదు ‘‘నీతో పాటు నువ్వు ఏకాంతంగా ఓ 15 రోజులు ఉండలేవా? ఒంటరితనం వేరు. ఏకాంతం వేరు. మనకు ఎవరూ లేరు అనుకోవటం ఒంటరితనం. ప్రకృతి, వెన్నెల, ప్రత్యూషం అన్నిటినీ ప్రేమిస్తూ ’నాకు నేనున్నా’అనుకోవటం ఏకాంతం.. ఎన్నో పనులు చేయొచ్చు. గూగుల్‌లో ’కోరా’ఓపెన్ చేస్తే బోలెడంత జ్ఞానం, టైంపాస్ టీవీకి కరెంటు లేదని, స్నానానికి వేడి నీరు, నిద్రకు ఫ్యాను, మూడు పూటలా చిరుతిండి లేవని సణుగుతున్న పిల్లలకు.. దివిసీమ ఉప్పెన, కేరళ సునామీ, జపాన్ అగ్నిపర్వతం గురించి చెప్పు. ’కరోనా’కాకుండా భూకంపం వచ్చి ఉంటే ఎలా ఉండేదో, యుద్ధం అంటే ఏంటో పెద్ద గీత పక్కన ఇంకా పెద్ద గీసి చూపించు. ఇరాన్, ఇరాక్, సిరియా, ఇథియోపియా వీడియోలు (మరీ చిన్న పిల్లలకి కాదు) శిథిలమైన ఇళ్లు, రక్తసిక్తమైన శరీరాలు, సగం చచ్చి బ్రతుకుతున్న పిల్లలు, అస్థిపంజరమైన బాల్యం.. ఇవన్నీ చూపిస్తూ మనం ఎంత అదృష్టవంతులమో వివరించు. ధైర్యం చెప్పు. వెండి స్పూన్‌తో భోజనం పెట్టు. కానీ అసలు భోజనం లేనివాళ్లు కూడా ఉన్నారని తెలియజెయ్యి. ఈ పాతిక రోజుల సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకో. వ్యాయామం, కొత్త పుస్తకాలు, పజిల్స్, బుక్స్ చదివి పిల్లలతో చర్చించటం.. మొదలైన పనులు చేపడితే పాతిక రోజులు పాతిక క్షణాల్లా గడిచిపోతాయి. ఆలోచించు. మళ్లీ నీ జీవితంలో ఇలాంటి దశ రాదు. పాజిటివ్‌గా ఉండు. (సినికల్ ఫీలింగ్ నుంచి బయటపడటానికి మాత్రమే)’’. – ప్రముఖ రచయిత, వ్యక్తిత్వవికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ ‘అమ్మ’పై భారం పెంచకండి ‘‘కరోనా వ్యాప్తి నేపథ్యంలో మునుపెన్నడూ లేని పరిస్థితులను వివి ధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ జనాభా అంతా కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. ఆందోళనలు, భయాలతో భవిష్యత్ గురించి అనవసరంగా ఎక్కువగా ఆలోచించొద్దు. లాక్డౌన్ మొదటి వారం రోజులు ఎక్సైట్మెంట్, 15 రోజులు ఎంటర్టైన్మెంట్, 20 రోజులకు బోరడమ్.. ఇది స్థితిమంతులు, ఎగువ మధ్యతరగతికి చెందిన అత్యధికుల ఫీలింగ్. అదే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఇతర వర్గాల్లో వారం నుంచే ఆందోళన, ఆ తర్వాత డబ్బులు, జీవితం, అప్పులు, ఉద్యోగం ఎలా అనే భయాలు ఏర్పడ్డాయి. ఇదంతా సహజమే. పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలో తెలియక పేరెంట్స్‌కు పెద్ద సవాలుగా ఈ పీరియడ్ మారింది. ఎక్కువగా మొబైల్స్, ఇతర సాధనాల్లో మునిగి తేలుతున్నందున లాక్డౌన్ తర్వాత పిల్లల్లో పూర్తిగా భిన్నమైన దృక్పథాలు ఏర్పడే అవకాశాలున్నాయి. భార్యాభర్తల మధ్య కోపతా పాలు పెరిగేందుకు అవకాశం ఏర్పడింది. అందరూ ఇళ్లలోనే ఉండటంతో ఇంట్లో అన్ని బాధ్యతలు చూసే అమ్మపై మరిన్ని భారాలు పెరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ప్ర స్తుతం ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనువైన చర్యలు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. పిల్లల ఫీజులు, అప్పులు, ఇళ్ల అద్దెలు తదితర అంశాల్లో ఆర్థిక వెసులుబాటు కలిగించే విషయం పై ఆలోచిస్తున్నాయి. అందువల్ల అనవసర ఆందోళనలు పెట్టుకోకుండా, ఆశావహ దృక్పథంతో వ్యవహరిస్తే ఎలాంటి సమస్యలుండవు’’ – జేఎన్టీయూ–హెచ్ కన్సల్టెంట్ సైకాలజిస్ట్ డా.సి.వీరేందర్ దీనిని సవాల్‌గా తీసుకోవాలి ‘‘కరోనా పరిణామాలపై అందరిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది నిజమైన మానసిక కుంగుబాటు కాదు. సముద్రంలో సుడిగుండం ఏర్పడటం డిప్రెషన్. ఉద్యోగం పోవడం డిప్రెషన్. ప్రస్తుతం మనందరం కూడా ఇబ్బందుల్లో ఉన్నామనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలి. దీన్ని ఒక సవాలుగా స్వీకరించాలి. ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి. ప్రపంచమంతా ఇవే పరిస్థితులను ఎదుర్కొంటోందన్న నిశ్చితాభిప్రాయానికి రావాలి. సీయూఆర్ఈ(క్యూర్)–కాన్ఫిడెన్స్, అండర్స్టాండింగ్, రిలాక్సేషన్. ఎఫెక్టివ్ సెల్ఫ్ టాక్ ఇప్పుడు ఉపయోగపడతాయి. ఇంట్లో వాళ్లందరితో స్నేహంగా.. ఆత్మీయంగా ఇంత సుదీర్ఘకాలం గడిపే అవకాశం మళ్లీ రాదనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలి. ఇంటిపెద్దలు పెద్దరికం ప్రదర్శించడానికి బదులు ప్రేమ, వాత్సల్యం చూపడంతో పాటు ఇతర కుటుంబసభ్యులతో స్నేహ భావంతో మెలగాలి. రోజంతా చురుకుగా ఉంటూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏదో ఒక అభిరుచిని అలవాటు చేసుకోవాలి. పదేపదే టీవీలో కరోనా వార్తలు చూసి ఆందోళనకు గురికాకుండా పొద్దున దినపత్రిక ఒకసారి, రాత్రి టీవీ ఒకసారి చూసి దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకుని అంతవరకే పరిమితమైతే సరిపోతుంది. రోజుకు కనీసం ముగ్గురు పాత స్నేహితులను ఫోన్లో పలకరించి పాత సంగతులను నెమరువేసుకోండి. మంచి విషయాలపై దృష్టి సారించండి. ప్రస్తుత సమయాన్ని ఆందోళన లేకుండా ఉండేందుకు 5 ‘టీ’లు– టైం, టాక్, టీచ్, ట్రస్ట్, ట్రీట్ పాటించండి ’’. – ప్రముఖ సైకాలజిస్ట్, మెజీషియన్ డా.బీవీ పట్టాభిరాం బుర్రలు బద్దలు కొట్టుకోవద్దు ‘‘మన ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లి వస్తే వారికి వైరస్ సోకి ఉంటే మనకూ అది వ్యాపిస్తుందా అన్న భయాలు కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితులే ఇంకా ఎంత కాలం కొనసాగుతాయో వాటి ప్రభావం మన జీతాల మీద, జీవితం మీద ఏ మేరకు పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే మన పరిధిలో పరిష్కరించగలిగే అంశాల గురించే మనం ఆలోచిస్తే మంచిది. ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలు మొత్తం ప్రపంచమంతా ఉన్నందున అనవసరంగా ఆందోళన చెందొద్దు. ఇలాంటి విపత్కర పరిస్ధితులను మన తాతలు, తండ్రులు చూడలేదు, ఎవరికీ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు కాబట్టి ఏం జరగబోతోందని అతిగా ఆలోచించి బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్ గురించి, సమస్యల పరిష్కారానికి ఏమి చేయాలన్న దానిపై ప్రధానమంత్రి, రాష్ట్రాల సీఎంలు ఆలోచిస్తున్నారు. ఇంట్లో ఉన్నాం కదా అని రోజువారీ ప్రణాళిక తప్పకూడదు. యువత, పిల్లలు నెట్ అడిక్షన్‌కు గురికాకుండా కొంత సమయం కేటాయించి పరిమితంగా మాత్రమే సెల్‌ఫోన్, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి వాటిని ఉపయోగించాలి. కొత్త విషయాలను తెలుసుకునేందుకు, కొత్త అభిరుచులను పెంచుకునేందుకు ప్రయత్నించాలి’’. – కన్సల్టెంట్ సైక్రియాట్రిస్ట్ డా.నిషాంత్ వేమన -
లక్ష్యసాధనకు ఏకాగ్రతే ముఖ్యం
శ్రీకాకుళం, రేగిడి: లక్ష్య సాధనలో ఏకాగ్రతే ముఖ్యమని, దీనివల్ల ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణులు యండమూరి వీరేంద్రనాథ్ తెలిపారు. కొన్ని అంశాలను విద్యార్థులు నిరంతరం సాధన చేయాలని సూచించారు. జ్ఞాపకశక్తి పెంచుకునేలా చదవాలి తప్ప బట్టీ విధానం మానుకోవాలని హితబోధ చేశారు. మండల పరిధిలోని వావిలవలసలో ఏఎంఆర్ గ్రూపు చైర్మన్ ముయిద ఆనందరావు పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థులకు బుధవారం వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ.. ప్రతి విషయం నేర్చుకోవడం, దానిని పదే పదే మననం చేసుకొని తద్వారా మేధాశక్తికి మరింత పదునుపెట్టడం వంటి అంశాలను విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలని సూచించారు. ఏదైనా ఒక అంశాన్ని అనర్గళంగా నేర్చుకున్నప్పుడే ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. అనవసరమైన విషయాలపై శ్రద్ధ పెట్టకుండా పాఠశాలలో పూర్తిసమయాన్ని చదువుపై కేంద్రీకరించాలని, అప్పుడే లక్ష్యం సాధించగలుగుతారని స్పష్టం చేశారు. విద్యార్థులు సెల్ఫోన్లపైనే ఎక్కువగా దృష్టిపెడుతుండటంతో చదువులో వెనుకబడుతున్నారని, విద్యార్థి దశలోనే ఉన్నతమైన లక్షణాలను అలవర్చుకుంటే భవిష్యత్ బంగారుమయమవుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పాఠ్యాంశాలకు సంబంధించి ప్రశ్నలు వేశారు. సమాధానం చెప్పిన వారికి బహుమతులు అందజేశారు. రేగిడి, రాజాం, సంతకవిటి మండలాల్లో ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నవారంతా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. పుట్టినరోజున ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటుచేసిన ఆనందరావును యండమూరితో పాటు ఉపాధ్యాయులు, హెచ్ఎంలు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజాంకు చెందిన వ్యక్తిత్వ వికాస నిపుణులు వారాడ వంశీకృష్ణ, మజ్జి మదన్మోహన్, ఎస్.సత్యనారాయణ, కొత్తా సాయి ప్రశాంత్ కుమార్, ముయిద శ్రీనివాసరావు, ముళ్లపూడి విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. -
ఒంటరితనమే డ్రగ్స్‌కు కారణం
► కొమ్మినేని శ్రీనివాసరావుతో యండమూరి వీరేంద్రనాథ్ సినీరంగం సునాయాసంగా డ్రగ్స్‌కు లోనవుతోందంటే చేతినిండా డబ్బులు, ఒంట రితనం, వెసులుబాటే కారణమని ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్ పేర్కొన్నారు. నలభై రోజులు కుటుంబాలకు దూరమై ఒంటరితనంతో గడిపే వాతావరణంలోనే అందరూ కలిసి కూర్చుని తినడం, తాగడం షూటింగు లొకేషన్లలో సహజమని ఆ అలవాటే వ్యసనంగా మారుతుందని చెప్పారు. ఒక చోట సాన్నిహిత్యంతో గడపవలసి వచ్చే చోట ఏ ఒక్కడికి వైరస్ ఉన్నా పక్కవారికి వెంటనే పాకిపోతుందని, ఒకసారి తాగండి, తీసుకోండి అన్నప్పుడు ఊ అన్నారంటే అదే అలవాటైపోతుందన్నారు. రాజకీయ వ్యవస్థ పునాదే సరైంది కాదు కాబట్టే మన దేశంలో అవినీతి పెరుగుతూంటుందన్న యండమూరి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... నవలారంగంలో ట్రెండ్ సృష్టించిన మీరు నవలా రచనలోకి ఎలా వచ్చారు? ప్రతి 20 ఏళ్లకీ ట్రెండ్ మారుతుంది. తెలుగు నవల పాపులర్ అవుతున్న తొలి రోజుల్లో కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్ వంటివారు రెండో ప్రపంచ యుద్ధం, సామాన్యుడు, కమ్యూనిస్టు ప్రభుత్వం, అసమర్థుని జీవయాత్ర వంటి సంఘర్షణల నేపథ్యంలో ఒక ట్రెండ్ సృష్టించారు. అమ్మా యిలు చదువుకోవడం, ఇంటర్మీడియెట్ పాస్ కావడం, ఆ తర్వాత పెళ్లి చేసుకునే దశ వచ్చిన సమయంలో కోడూరి కౌసల్యాదేవి, యద్దనపూడి సులోచనా రాణి వంటివారు ఇంకో ట్రెండ్ సృష్టించారు. ఒక స్త్రీ తన కలల రాజకుమారుడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండటం.. అదొక పాతికేళ్లు నడిచింది. ఆ తర్వాత ఇంకో విధమైన ట్రెండ్.. ఆర్థర్ హెయిలీ, ఇర్వింగ్ వాలెస్ టైప్‌లో సబ్జెక్ట్ తీసుకుంటే ఒక పరిశోధన చేసి దానిపై ఏదైనా రాయడం మొదలైంది. ఇప్పుడు నవలలు రాస్తే చదివేవారు ఎవరూ లేరు. దాదాపు 15 ఏళ్లనుంచి నవలా రచన అనే ట్రెండే లేదు. నవలారంగంలోకి రావడానికి ప్రేరణ ఎవరు? అమ్మా, నాన్న రెండు కుటుంబాల్లోనుంచి సాహిత్యపరమైన పునాది ఉంది. నేను జీన్స్ థియరీని నమ్మను కానీ ఆ ఇంటి వాతావర ణంలో నేను కూడా రాయడం మొదలెట్టాను. ఎందుకు రాశానంటే నాన్నే కారణం. నాకు కొన్ని ఆత్మన్యూనతా లక్షణాలు ఉండేవి. ఈ కాంప్లెక్సులనుంచి బయటపడాలంటే నీ లోపల మనిషితో మాట్లాడరా అని నాన్న చెప్పాడు. ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటుంది. నీలోనూ కళ ఉంటుంది దాన్ని గుర్తించు అని నాన్న అనేసరికి నాలో నాకు రచయిత కనిపించాడు. అలా కథలు రాసే క్రమంలో నాలోని న్యూనతా లక్షణాలు తగ్గిపోయాయి. క్షుద్ర శక్తుల్ని మీరు నమ్ముతారా? నేను మొత్తం 70 నవలలు రాశాను. వాటిలో క్షుద్రశక్తిమీద రాసింది మూడే. జనాలకు అలాంటివి ఇంట్రెస్టు కాబట్టి చాలా పాపులర్ అయ్యాయి. ఏ నవల రాసినా ఆ నవలలో ఒక ప్రత్యేక సబ్జెక్టు తీసుకునేవాడిని. ఇక తులసీ దళం రాసినప్పుడు బాణామతిపై రాయాలనిపించింది. అందుకు ప్రేరణ నా ఆదర్శ దైవం విశ్వనాథ సత్యనారాయణ. ఆయన బాణామతి అనే నవల రాశారు. అది అంత పాపులర్ కాలేదు. ఆ పుస్తకానికి సెంటిమెంట్ జోడించి కమర్షియల్ ఎలిమెంటుతో బాగా రాయవచ్చేమో అనిపించింది. ఆంధ్రభూమి పత్రికలో ఎనిమిది వారాల తర్వాత ఆ సీరియల్‌ని నిలిపివేయాలనుకున్నాం. మొదట్లో అది సక్సెస్ కాలేదు. ఆ పాపకు చేతబడి మొదలైనప్పట్నుంచే హిట్టయింది. తర్వాత సంపాదకుడు, నేను కొనసాగించాం. వాస్తవానికి 26 వారాలు అనుకున్నది 104 వారాల పాటు రాశాను. టాలీవుడ్లో డ్రగ్స్ సంక్షోభం, గొడవ గురించి మీరేమంటారు? సినీరంగంలో వెసులుబాటు ఎక్కువ ఉంటుంది. డబ్బులు ఎక్కువగా ఉంటాయి. పైగా సినిమా వాళ్లకు ఒంటరితనం ఎక్కువ. షూటింగు కోసం ఊటీ వంటి ప్రాంతాలకు వెళితే దాదాపు 40 రోజులు ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. పెళ్లాం బిడ్డలు ఉండరు. ఆడా, మగా కలిసి కూర్చుని వెళ్లడం, వరండాల్లో కూర్చుని కలిసి డ్రింక్ తాగడం.. షూటింగ్ లొకేషన్లలో అలవాటు. అందులో ఏ ఒక్కడికి వైరస్ ఉన్నా.. పక్కవారికి వెంటనే పాకిపోతుంది. ఒకసారే కదా తాగండి అంటారు. అదే అలవాటైపోతుంది. రాజకీయ నేతల సైకాలజీని స్టడీ చేస్తుంటారా? ఇండియాకు క్రికెట్ ప్లేయర్ కావడం సులభమేమో కానీ రాజకీయ నాయకుడిగా కావడం చాలా కష్టం. రాజకీయ నాయకుడు అవాలంటే మొట్టమొదట లౌక్యం ఉండాలి. జ్ఞాపక శక్తి, ధారణ శక్తి ఉండాలి. మొహం మీద చిరునవ్వు ఉండాలి. తనకన్నా పైవాళ్లను మంచి చేసుకునే నేర్పు ఉండాలి. అన్నింట్లో వెసులుబాటు చేసుకుంటూ పైకి ఎగబాకే తత్వం కూడా ఉండాలి. పైవాణ్ణి నొక్కేసి తాను పైకి వెళ్లి తర్వాత తన కిందివాళ్లను పైకి తీసుకొచ్చే తెలివి కూడా ఉండాలి. మీ సరస్వతీ విద్యాకేంద్రం గురించి చెబుతారా? నా ఆస్తి మొత్తం సరస్వతీ కేంద్రానికి రాసి ఇచ్చేశాను. కారణం చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న కూడా అడుక్కుతినేవాడు. వాళ్ల నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో ఈయన వారాలు చేసుకుని బతికాడు. నాన్న పుట్టింది అమలాపురం దగ్గరయితే ఉద్యోగాలు చేసింది రాయలసీమలో. చదువుకోసం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాను. బీదతనం నుంచే వచ్చాను కాబట్టి సంపాదించిన తర్వాత తిరిగి ఇచ్చేయాలనే ఉద్దేశంతో సరస్వతీ విద్యా పీఠం పెట్టి గిరిజన విద్యార్థులకు ఉచి తంగా విద్య, డొనేషన్లు ఇస్తున్నాను కాబట్టి మా ఇంట్లో మినీ సినిమా ధియేటర్లు, బెంజ్ కార్లు వంటివి లేవు. బాల్యం ఆ అనుభూతుల గురించి చెబుతారా? నేను చాలా పూర్ స్టూడెంటుని. బాగా చదివేవాడిని కాదు. ఆరో క్లాసు, ఏడో క్లాసు అన్నీ ఫెయిలవుతూ వచ్చాను. అమ్మ వాళ్ల నాన్న డిప్యూటీ తహసీల్దార్. నేను ఆయన దగ్గరే పెరిగాను. ఈయనేమో చాలా గారాబం చేసేవాడు. ఇది యువతకు పనికివస్తుందేమో అని చెబుతున్నాను. ఏడో తరగతి ఫెయిలయ్యాక నాన్న వద్దకు వెళ్లాను. అక్కడికెళ్లాకే మొత్తంగా మారిపోయాను. వందల పద్యాలు బట్టీయం వేయించాడు. 23వ లెక్క రివర్స్‌లో చదివించేవాడు. కుటుంబంలో తండ్రి తల్చుకుంటే మనిషి ఎంత మారగలడో చెప్పడానికి నేనే ఉదాహరణ. తాతయ్య వద్ద ఉన్నప్పుడు వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చిన నేను నాన్న వద్దకు వచ్చాక చార్టర్డ్ అకౌటెంట్ అయాను. ఆయన వల్లే నాలుగేళ్ల సీఏ కోర్సును మూడేళ్లలో పూర్తి చేశాను. పేదరికం అనేది గొప్పతనానికి అడ్డుకాదు. సెలూన్‌కి కూడా వెళ్లను. ఇప్పటికీ నా హెయిర్‌కట్ నేనే చేసుకుంటాను. దాన్నీ మా నాన్నే నేర్పాడు. భవబంధాలు తెంచుకుని గడిపే పరిస్థితి సాధ్యమా? ఇప్పుడు నేను చేస్తోంది అదే కదా. అందరూ నా పిల్లలే అన్నట్లు ఉంటున్నా. సరస్వతీ విద్యాపీఠం లక్ష్యమే అది. బీద విద్యార్థుల పట్ల, ప్రపంచం పట్ల ప్రేమ ఉండాలి. భవబంధాలు తెంచుకోవాలి. నా అన్నది మానేసి మన అన్నదాంట్లోకి రావాలి. డబ్బులు అనేక మార్గాల నుంచి వస్తుంటాయి వాటిని ఇచ్చేస్తుంటాను. అందుకే నావద్ద ఇప్పుడు డబ్బు అనేదే లేదు. సినిమా ఫీల్డులో అరుదుగానే పనిచేస్తున్నాను. అలా వచ్చే డబ్బులు కూడా ఉండవు. ఎంతో సౌకర్యంగా ఉన్నాను. ఇంకేమి కావాలి నాకు. ఇలాంటి ఆలోచన వస్తే భవబంధాలు పోతాయి. కాపీనం–పీనాసితనం–పోతుంది. (యండమూరితో ఇంటర్వ్యూ పూర్తి కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రామ్ చరణ్‌పై యండమూరి చేసిన వ్యాఖ్యలు
-
ఇంటర్వ్యూలో తొందరపడితే కష్టమే..
వ్యక్తిత్వవికాస నిపుణుడు యండమూరి విజయవాడ : ఇంటర్వ్యూల్లో తొందరపడితే నష్టమేనని, ఆలోచించి సరైన సమాధానాన్ని స్పష్టంగా చెప్పాలని నవలా రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ సూచించారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ యువజనోత్సవాల్లో భాగంగా ఇంఫాక్ట్ పేరుతో మొగల్రాజపురం పి.బి.సిద్ధార్థ ఆడిటోరియంలో శనివారం వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇంటర్వ్యూలకు సన్నద్ధం కావడం ఎలా అనే అంశంపై వారికి అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి సమాజంలో జరుగుతున్న ప్రతి అంశంపైన కనీస జ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ మనిషిలోని భయం అనే శత్రువును పారదోలాలని, అప్పుడే జీవితంలో ఏదైనా సాధించగలమనే ధైర్యం వస్తోందన్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు, టీవీ సీరియల్ నటుడు ప్రదీప్ మాట్లాడుతూ మనం కన్న కలలను నిజం చేసుకోవాలంటే పొలంలో విత్తనాలు చల్లి సాగు చేసిన విధంగా కష్టపడాలని సూచించారు. మానసిక వైద్య నిపుణడు గంపా నాగేశ్వరరావు, వ్యక్తిత్వ వికాస నిపుణులు జయసింహ, వేణుగోపాల్, విశ్వనాథం, రత్నాకర్ మాట్లాడారు. డెరైక్టర్ పార్థసారథి, శివశంకర్ పాల్గొన్నారు. -
ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు
కళ్యాణదుర్గం రూరల్ : విద్యార్థులు ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. స్థానిక సుబ్రమాణ్ణేశ్వర కల్యాణ æమండపంలో ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో గురువారం పదో తరగతి పరీక్షలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతి థులుగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్,మాస్టర్ మైండ్ డైరెక్టర్ మెట్టువల్లి మోహన్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు భయాందోళనకు గురి కాకుండా చదువుపై ఇష్టాన్ని పెంచుకోవాలన్నారు. ఏకాగ్రతను అలవరచుకొని విద్యపై శ్రద్ధ వహించాలన్నారు. తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్య నేర్చిన వాడు గొప్ప వాడని అభివర్ణించారు. విద్య నేర్చితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సమస్యలను పరిష్కరించుకోవచ్చునన్నారు. ప్రైవేటు పాఠశాలల హెచ్ఎంలు శ్రీశైల, బాబు,నరసింహాచారి పాల్గొన్నారు. -
‘ఇష్టపడి చదివితేనే ఉన్నతి’
కామారెడ్డి : కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే ఉన్నత స్థాయికి చేరుకుంటారని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్(ట్రస్మా) ఆ«ద్వర్యంలో కామారెడ్డిలో పదో తరగతి విద్యార్థులకు విద్యపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరేందుకు ప్రయత్నించాలన్నారు. విజయాన్ని అందిపుచ్చుకోవడానికి ఇష్టంతో చదవాలని సూచించారు. పదోతరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం, పదో తరగతి తర్వాత చదవాల్సిన కోర్సుల ఎంపిక తదితర అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో బల్రాం, ట్రస్మా పట్టణ అధ్యక్షుడు టి.ఆనంద్‌రావ్, ప్రధాన కార్యదర్శి పి.రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారి కృష్ణమూర్తి, మాస్టర్ మైండ్స్ అధినేత మోహన్, ఆయా పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సాంకేతికను అందిపుచ్చుకోవాలి
రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. సిద్దిపేట రూరల్:మారుతున్న కాలానుగుణంగా ప్రతి ఒక్కరు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. శుక్రవారం మండలంలోని పొన్నాల శివారులోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలోని బీటెక్, డిప్లామా మొదటి సంవత్సరం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు గ్రూపులపై దిశానిర్ధేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరేంద్రనాథ్ మాట్లాడుతూ రోజురోజుకు సాంకేతిక విద్యకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు . విద్యార్థి దశ నుంచే కంప్యూటర్, ల్యాబ్ తదితర అంశాలపై నైపుణ్యత సాధిస్తున్నారన్నారు. ఈ క్రమంలో ప్రతి విద్యార్థి ప్రణాళికబద్ధంగా చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రభూజీ బెన్‌కాఫ్ మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ల్యాబ్ సౌకర్యం, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నదన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు రవీందర్రావు, భూపతిరావు, హెచ్ఓడీలు ఆశ్వనికుమార్ మిశ్రా, ఉదయ్‌కుమార్, కుమార్‌స్వామి, అశోక్‌కుమార్, సరస్వతి, పీఆర్వో బి. రఘు, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
చావాలనిపిస్తుంది...
జీవన గమనం నేను ఒక ఫైనాన్షియల్ కంపెనీలో ఉద్యోగానికి చేరాను. ఆ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తున్నాయి. ఆ జాబ్‌లో చేరకముందు నేను చాలా సంతోషంగా ఉండేవాణ్ని. ఇప్పుడు నేను ఏదో పోగొట్టుకున్న వాడిలా మారాను. ఈ పరిస్థితి భరించలేక రిజైన్ చేసేశాను. నేను జాబ్‌కి రిజైన్ చేయడం మా ఇంట్లో వాళ్లకు నచ్చడం లేదు. మా నాన్న రోడ్డుపక్కన బండి మీద పండ్లు అమ్ముతుంటారు. మా వాళ్లు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఈ పరిస్థితిలో నాకు లేనిపోని ఆలోచనలతో నిద్రపట్టడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వండి. - అభిరామ్, ఊరు పేరు లేదు ఆఫీసు వాతావరణం నచ్చకపోయినా, చేయవలసిన పని చేతకాకపోయినా, పైఅధికారులు శాడిస్టులైనా చచ్చిపోవాలని అనిపించడం సహజం. ఒక కుర్రవాడికి ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. అది తనకి నచ్చడం లేదని, మానేస్తాననీ అన్నప్పుడు అందరూ ముక్కున వేలేసుకున్నారు. నేను మాత్రం ‘‘నువ్వు చేపవైతే. ఈదుతున్న చెరువులో నీరు నచ్చకపోతే బయటకు వచ్చి చచ్చిపో. అంతే తప్ప జీవితాంతం దుఖిస్తూ ఆ మురికిలోనే బతక్కు’’ అని సలహా ఇచ్చాను. అయితే బతుకు కొనసాగించటం కోసం తాత్కాలికంగానైనా కొన్నిసార్లు మనకి నచ్చని పనులు చెయ్యక తప్పదు. మీ నాన్నగారు ఎండలో, వర్షంలో నిలబడి పండ్లు అమ్ముతూ ఉంటారు. వీలైనంత త్వరగా ఆయన్ని ఆ శ్రమ నుంచి తప్పించటం మీ బాధ్యత కాదా? నచ్చని పని మానేశారు సరే. ప్రస్తుతం ఏం చేస్తున్నారు? పని లేకుండా కూర్చోవటం కన్నా, ఆలోచనలతో నిద్రలేని రాత్రులు గడపటం కన్నా నికృష్టం ఇంకొకటి ఉండదు. మీరేం చెయ్యగలరో ఆలోచించండి. ఏదో ఒకటి మాత్రం చెయ్యటం మానకండి. కొంతకాలం అయ్యాక మీకు ఇష్టమైన వృత్తిలోకి మారండి. కొంతకాలం పని చేసి, ఆ తర్వాత తమకు ఇష్టమైన వృత్తిలో ప్రవేశించిన నటులు, క్రీడాకారులు, రచయితలు ఈ సూత్రమే అమలు జరిపారు. నాకు బీటెక్ అంటే ఇష్టం లేదు. కానీ మా డాడీ నన్ను బలవంతంగా జాయిన్ చేశారు. నాలుగేళ్లు కంప్లీట్ చేశాను కానీ ఇప్పుడు అయిదు సబ్జెక్ట్స్ బ్యాక్‌లాగ్‌లో ఉన్నాయి. చదవాలనే ఉన్నా, ఇంటరెస్ట్ రావడం లేదు. చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. డిప్రెషన్లో ఉండటం వల్ల సైకియాట్రిస్ట్‌ను కలిశాను. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కావడంలేదు. దయ చేసి సలహా ఇవ్వగలరు. - లత, పాలకొల్లు సైకియాట్రిస్ట్‌ను కలిసేటంత డిప్రెషన్‌కి గురైనవారు మిగిలిపోయిన సబ్జెక్ట్స్‌ను పూర్తి చేయగలరా? ఆలోచించుకోండి. పిల్లల కెపాసిటీ, అభిరుచి తెలియకుండా కోర్సులు చదివించే పెద్దలకు మీ ఉత్తరమే సమాధానం. అయితే, జీవితాన్ని తిరిగి పునర్నిర్మించుకోండి. మీకు స్ఫూర్తిగా ఉండటం కోసం ఒక వాస్తవగాథ చెబుతాను. అరవయ్యేళ్ల కల్నల్ సాండర్స్ రిటైరైన రోజు, ఒక చెట్టు కింద కూర్చొని తను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు వివరిస్తూ ఒక ఉత్తరం రాశాడు. అతడి అయిదో ఏట తండ్రి చనిపోయాడు. పదహారవ ఏట స్కూలు మానేశాడు. పదేళ్లలో పదిహేను ఉద్యోగాలు మారాడు. అందులో అయిదు పని చెయ్యటం చేతకాదని వెళ్లగొట్టినవే. ఇరవయ్యో ఏట భార్య వదిలేసింది. ఒక హోటల్లో వంటింట్లో అంట్లు తోమే పనిలో చేరాడు. అరవై అయిదో ఏట రిటైర్ అయినప్పుడు 105 డాలర్ల చెక్కు వచ్చింది. జీవితంలో చివరి వరకు మిగిలింది ఇదేనా అన్న డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవాలని ఉత్తరం రాస్తూ ఉండగా... ఇంకేదైనా చెయ్యమని చేతిలో ఉన్న చెక్కు చెప్పింది. తెలిసింది వంట చెయ్యటం మాత్రమే. అప్పుడు నాలుగు కోళ్లు కొని రోడ్డు పక్కనే వేపుడుముక్కలు అమ్మాడు. రెండో ప్రపంచ యుద్ధకాలంలోని సంఘటన ఇది. అంత రుచికరమైన కోడిని ఎన్నడూ తినలేదని బ్రిటిషర్లు, అమెరికన్లు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఇరవయ్యేళ్ల తర్వాత.. అంటే 85వ ఏట, సాండర్స్ తన కంపెనీని మూడు కోట్ల రూపాయలకు అమ్మాడు. అదే కేఎఫ్‌సీ. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక అంతర్గత కళ ఉంటుంది. దాన్ని గుర్తించటమే గెలుపు. వీలైతే ‘అవేకెన్ ది జైంట్ వితిన్’ అన్న పుస్తకాన్ని చదవండి. డిప్రెషన్ తగ్గుతుంది. గమ్యం తెలుస్తుంది. - యండమూరి వీరేంద్రనాథ్ -
ఈ వయసులో... అవసరమా?
జీవన గమనం నేను ఇంటర్ చదువుతున్నాను. నాతో పాటే కాలేజీలో చేరిన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమె నన్ను ప్రేమిస్తుందో లేదో తెలియదు. అయితే, ఆమె నన్ను ప్రేమిస్తోందని నా క్లాస్మేట్స్ చెబుతున్నారు. అలాగని ఆమెకు ప్రపోజ్ చేయాలంటే భయంగా ఉంది. దీనివల్ల చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. సలహా చెప్పండి. - ఫయాజ్, ఈ-మెయిల్ ముందు మీ స్నేహితుల ద్వారా మీ ప్రేమని వ్యక్తపరచండి. ఆ అమ్మాయి ఒప్పుకున్నట్లయితే మీరు వెళ్లి కలవండి. ఒక వేళ నిరాకరించినట్టుగా మాట్లాడితే... నాకేమీ సంబంధం లేదు, మా స్నేహితులే ఆటపట్టించటానికి అలా అన్నారని తప్పించుకోండి. అయితే మరో విషయం. ఇప్పుడు మీరు ఇంటర్లో ఉన్నారు. జీవితం ఎటు వెళ్లాలో నిర్ధారించుకోవలసిన ఈ వయసులో, ఈ ప్రేమలు అవసరమా? ఒకసారి ఆలోచించుకోండి. నేను పీహెచ్డీ స్కాలర్ని. ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆమె బీఎస్సీ చేసింది. ఆమె ఒప్పుకుంటే తన ఇంట్లోవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. తనకు ఈ విషయం చెబితే ముందు తనకు ఇష్టం లేదని చెప్పింది. దాంతో నేను నిరాశలో పడ్డాను. తను నిరాకరించినా నేను నా ప్రయత్నం మానుకోలేదు. ఒకరోజు నేనంటే తనకు ఇష్టమేనని చెప్పింది. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అయితే, మా కులాలు వేరు. తను వాళ్ల ఇంట్లో ఇంకా విషయం చెప్పలేదు. చెప్పినా వాళ్లు ఒప్పుకుంటారా అనేది అనుమానమే. అలాగని ఇద్దరం ఒకరిని విడిచి ఇంకొకరం ఉండలేం. ఈ పరిస్థితిలో ఏం చేయాలి? - శివ, మదనపల్లె భయం సమస్య కాదు. బలహీనత. భయం వల్ల వచ్చేది సమస్య..! పిల్లలు తమ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించకుండా దాచటానికి కారణం భయం. చాలా విషయాల్లో మనం కూడా అలాగే ప్రవర్తిస్తుంటాం. ఇది నేటి సమస్యని రేపటికి వాయిదా వేసేలా చేస్తుందే తప్ప సమస్యకు పరిష్కారం చెప్పదు. మీరు కూడా వెళ్లి అడిగి చూడండి. వాళ్లు కాదంటే ఏమి చెయ్యాలో అప్పుడు ఆలోచిద్దాం. నేను ఇంజినీరింగ్ చదువుతున్నాను. చిన్నప్పట్నుంచీ ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాను. కానీ ఆ విషయం ఎప్పుడూ తనకు చెప్పలేదు. ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. తను కూడా నాతో చాలా బాగా మాట్లాడుతుంది. కానీ నేను తనని ప్రేమించినట్టుగా తను నన్ను ప్రేమిస్తుందో లేదో మాత్రం నాకు తెలీదు. పోనీ నేనే ప్రపోజ్ చేద్దామంటే ఎలా రియాక్ట్ అవుతుందోనని భయమేస్తోంది. ఎటూ తేల్చుకోలేక మిమ్మల్ని సలహా అడుగుతున్నాను. - జ్యోతిప్రకాశ్, మెయిల్ అజ్ఞాతవాసం ముగించి ధర్మరాజు తిరిగి తన రాజ్యానికి వెళ్లబోతున్న సమయంలో, ముందు రోజు, ఒక బిచ్చగాడు బిక్షం అడిగాడట. రేపు రా! అన్నాడట ధర్మజుడు. అది విని భీముడు ఒక డప్పు తీసుకొని కొండపై కెక్కి నాలుగు దిక్కులు వినపడేలా ‘సత్యవంతుడు నా అన్నయ్య తొలిసారి అబద్ధం చెప్పాడు’ అని గట్టిగా అరిచాడట. అతడి చాటింపు అర్థం కాని ధర్మరాజు వివరణ అడిగితే భీముడు ఇలా అన్నాడట. ‘‘అన్నా! రేపటి వరకూ ఆ బిచ్చగాడు బతికుంటాడో లేదో నీకు తెలియదు. నీవు ఉంటావో లేదో అతడికి తెలియదు. మనం వెళ్లాక రాజ్యం దక్కుతుందో లేదో మనకు తెలియదు. రాజ్యం వచ్చాక కూడా నీ మనసు ఇటువంటి దయాగుణంతో ఉంటుందో లేదో ఎవరికీ నమ్మకం లేదు. అయినా నువ్వు ఈ వాగ్దానం చేశావంటే, అది అనృతం కాక మరేమిటి?’’ ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే.. మీరు లైఫ్‌లో సెటిలయ్యే సరికి మీ మనసులో ఆ అమ్మాయి పట్ల ఇంకా అంత ప్రేమ ఉంటుందో లేదో మీకు తెలియదు. మీరు పూలదండ పట్టుకు వెళ్లేసరికి అప్పటికింకా ఆ అమ్మాయి అవివాహితగానే ఉంటుందో లేదో ఆమెకు తెలియదు. ఇంకో కుర్రాడి ప్రేమలో పడకుండా ఉంటుందో లేదో మనకు నమ్మకం లేదు. కాబట్టి, మీరు మీ ప్రేమ భావాన్ని వెంటనే వెళ్లి ఆ అమ్మాయికి చెప్పండి. అయితే దానికి ముందు మీరు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేసుకోండి: మీ పెద్దలు, ఆమె పెద్దలు మీ వివాహానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోక పోయినా మీరు వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నారా? అలా చేసుకుంటే ఇంజినీరింగ్ చదివే మీకు, సంసారం నిలబెట్టేటంత ఆర్థిక స్తోమత ఉందా? లేక మీ కాళ్ల మీద నిలబడే వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడి తిని, ప్రేమ విషయం రహస్యంగా ఉంచి, ఆ తర్వాత వాళ్లు కాదంటే, ఎదిరించి వెళ్లి పోదామని అనుకుంటున్నారా? అది అన్నింటికన్నా నీచమైనది. - యండమూరి వీరేంద్రనాథ్ -
ఆమెను మర్చిపోలేక పోతున్నాను...
జీవన గమనం మూడేళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏడాది కిందట ప్రపోజ్ చేస్తే తను అప్పటికే వేరే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు చెప్పింది. అయితే, ఆమెను మర్చిపోలేక పోతున్నాను. తను లేకపోతే జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తోంది. ఆమెను కన్విన్స్ చేయాలా? మర్చిపోవాలా? అర్థం కావట్ల్లేదు. పరిష్కారం చెప్పండి. - ప్రసాద్, హైదరాబాద్ ప్రేమ గుడ్డిదా? కాదు. నిజమైన ప్రేమ నాలుగు వైపులా చూస్తుంది. ఆకర్షణ మాత్రమే గుడ్డిది. కేవలం గుడ్డిదే కాదు. మూగది, చెవిటిది, పిచ్చిది కూడా..! ఆకర్షణ బలమైనది. ఎక్కడలేని శక్తీ ఇస్తుంది. ఒకరి మీద ఆకర్షణ ఎందుకు కలుగుతుందో ఏ సైకాలజిస్ట్ వివరించలేరు. మరెవరినో ప్రేమించిన అమ్మాయిని ప్రేమించారు. మీది ప్రేమే అయితే నిశబ్దంగా ప్రేమిస్తూ ఉండండి. ఆకర్షణ అయితే అంతకన్నా బలమైన మరో ఆకర్షణలో పడండి. కౌన్సెలింగ్‌కి వెళ్లేముందు.. 1. నా సమస్యకు పరిష్కారం ఉందా, 2. ఆ పరిష్కారం నాకు తెలుసా లేక ఇంకొకరి సలహా కావాలా, 3. వారిచ్చిన సలహా నేను అమలు జరపగలనా... అన్న మూడు విషయాలు ఆలోచించుకోవాలి. నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. మా ఎండీకి నేనంటే అసలు పడదు. మా కొలీగ్స్ నా మీద చెప్పే చాడీలు నమ్మి నిజానిజాలు తెలుసుకోకుండానే నన్ను అనవసరంగా వేధిస్తుంటాడు. నాకు ఒక పాప ఉంది. జాబ్ మానేసే పరిస్థితుల్లో లేను. దయచేసి మంచి సలహా చెప్పగలరు. - అరుణ్‌కుమార్, హైదరాబాద్ వింధ్యారణ్య ప్రాంతంలో పులులు గుంపులుగా వచ్చి ఆవుల్నీ, గేదెల్నీ పొట్టన పెట్టుకుంటున్నప్పుడు, గిరిజనులు వెళ్లి ద్రోణాచార్యుణ్ని శరణు వేడారు. ముందుగా ఆయన ధర్మరాజును పంపాడు. అతడు వెళ్లి కొన్నిటిని చంపి, మిగతా వాటిని పారద్రోలాడు. గిరిజనులు సంతోషించారు కానీ వారి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. నెల తిరిగేసరికి ఆ క్రూర మృగాలు మరింత పెద్ద గుంపుగా వచ్చి గ్రామం మీద పడ్డాయి. ఈ సారి ద్రోణుడు భీముణ్ని పంపాడు. అతడి ఆయుధం ప్రపంచంలోకెల్లా గొప్ప ఆయుధాల్లో ఒకటైన గద..! అయితే అది చురుకైన పులుల మీద ఏ ప్రభావమూ చూపించలేక పోయింది. అప్పుడు అర్జునుణ్ని పంపగా, అతను వెళ్లి తన విలువిద్యా నైపుణ్యంతో అన్ని పులుల్నీ చంపి వచ్చాడు. అయితే ఏడాది తిరిగేసరికి యవ్వనంతో బలసిన తరువాతి తరం పులులు గ్రామం మీద భయంకరంగా దాడి చేశాయి. ద్రోణుడు ఈసారి ఆఖరి ఇద్దర్నీ పంపించాడు. నకులసహదేవులు వెంటనే రంగంలోకి దిగలేదు. ముందు గ్రామ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. గ్రామం చుట్టూ కందకాలు తవ్వించే పని నకులుడు చేపడితే, సహదేవుడు పులులతో ఎలా యుద్ధం చేయాలో గ్రామస్థులకు నేర్పి సంసిద్ధం చేశాడు. ఈసారి పులులు దండెత్తినప్పుడు గ్రామస్థులే ధైర్యంగా ఎదుర్కొని ఏ మాత్రం ప్రాణ నష్టం లేకుండా వాటిని తరిమికొట్టారు. తిరిగివచ్చిన నకులసహదేవుల్ని ‘‘ఇది నిశ్చయంగా మీ విజయం’’ అంటూ ద్రోణుడు పొగిడాడు. ఈ కథ రెండు సూత్రాల్ని చెబుతుంది. 1. ఒక సమస్య తాలూకు కొమ్మల్ని కత్తిరిస్తే, తాత్కాలిక విజయం దొరుకుతుందేమో తప్ప పరిష్కారం దొరకదు. మీలో మీరు ఎంతకాలం ఇలా కుమిలిపోయినా పరిష్కారం దొరకదు. సమస్య మీలో ఉందా? చెప్పుడు మాటలు వినే అలవాటు ఉన్న మీ బాస్‌లో ఉందా అన్నది ముందు శోధించండి. మీ బాస్‌లో ఉంటే సమయం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవటానికి ప్రయత్నం చెయ్యండి. మీలో ఉంటే మీ వీక్ పాయింట్లను సరిదిద్దుకోండి. 2. సమస్యని ఎదుర్కోవడానికి ముందు దాన్ని నిశితంగా పరిశీలించి, ఏ ఆయుధం వాడాలో తెలుసుకుంటే మీ సమస్య సగం తీరినట్టే. మన ఆయుధం ఎంత గొప్పదైనా, అది సమస్యను పరిష్కరించేదిగా ఉండాలే తప్ప కేవలం గొప్పదిగా ఉన్నంత మాత్రాన లాభం లేదు. కాస్త లౌక్యం నేర్చుకుని, మీ యజమానికి దగ్గరవటానికి ప్రయత్నం చెయ్యండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
నవలా శకం ముగిసినట్టే: యండమూరి
రాజమహేంద్రవరం: ‘నవలలు చదివే పాఠకులు తగ్గిపోతున్నారు. ఇక నవలా శకం ముగిసినట్టే’నని ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. సోమవారం సంహిత కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ప్రస్తుత సాహిత్యం తీరుతెన్నులపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... కల్చరల్ నా ‘తులసిదళం, కాష్మోరా’, వడ్డెర చండీదాస్ ‘హిమజ్వాల,అనుక్షణికం’, అంతకు ముందు యద్దనపూడి సులోచనారాణి ‘సెక్రటరీ’, ముప్పాళ రంగనాయకమ్మ ‘బలిపీఠం’ మొదలైన నవలలు పాఠకులను విపరీతంగా ఆకట్టుకున్నది నిజమే. అయితే ప్రస్తుతం పాఠకులకు కొరత వచ్చింది. చదివే వాళ్ళు తక్కువయిపోతున్నారు. ఇప్పటి వరకూ సుమారు70 రచనలు చేశాను. చేస్తూనే ఉన్నాను. సామాజిక స్పృహ కాదు.. అలరించే గుణమే ముఖ్యం.. నా నవలల్లో సామాజిక స్పృహ లేదన్న విమర్శలను పట్టించుకోవలసిన అవసరం లేదు. చందమామ కథల్లో ఏమంత సామాజిక స్పృహ ఉంది? నవరసాల్లో భయానక రసం ఒకటి. నా రచనలలో ఆ రసం లేకపోలేదు. ప్రాథమికంగా రచనలకు పాఠకులను అలరించే గుణం ఉండాలి. అభిమాన రచయితలు చాలామంది ఉన్నారు. యద్దనపూడి సులోచనారాణి, మల్లాది కృష్ణమూర్తి, కొమ్మూరి వేణుగోపాలరావు, కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్ వగైరా.. సినిమాకు వినోదమే ప్రధానం సినిమాలు కూడా వినోదప్రధానంగా ఉండాలని నేను భావిస్తాను. ఇతర సినిమాలతో పాటు చిరంజీవి నటించిన సినిమాలకు కొన్నింటికి రచనలు చేశాను. రాజకీయాలపై ఆసక్తి లేదు. కాకినాడలో సరస్వతీ విద్యాపీఠం స్ధాపించి,యువతలో మానసిక వికాసానికి కృషి చేస్తున్నాను. మానసిక వికాసంపై పుస్తకాలు రాశాను. విద్యాసంస్థల ఆహ్వానం మేరకు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొదించడానికి ప్రసంగాలు చేస్తున్నాను. -
నన్నే... ఎందుకు?
జీవన గమనం నేను ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాను. కాలేజీలో మా మేడమ్‌తో సమస్యగా ఉంది. ఆమె కోర్ సబ్జెక్ట్ చెబుతారు. క్లాస్‌లో ఆమె పాఠం చెప్పేటప్పుడు మిగిలిన క్లాస్మేట్స్ అందరిలాగే నేనూ నువ్వుతూ ఉంటాను. ఇతరులు నవ్వినప్పుడు ఏమీ అనని మేడమ్ నేను నవ్వినప్పుడు మాత్రమే తిడుతూ ఉంటారు. దాంతో క్లాస్‌లో నవ్వడమే మానేశాను. క్లాస్‌లో నేను నవ్వకపోయినా, వేరే వాళ్లెవరో నవ్వినా ఆమె నన్నే తిడుతున్నారు. ఆమె తరచూ నన్నే తిడుతుండటంతో చదువు మీద శ్రద్ధ చూపలేకపోతున్నాను. ఇదే పరిస్థితి కొనసాగితే నా చదువు ఏమైపోతుందోనని బెంగగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వగలరు - గంగాధర్, ఏలూరు ఆమె మనస్థితి, గృహపరిస్థితి తెలీదు కాబట్టి తరచూ పిల్లల్ని ఎందుకు తిడుతోందో, తిట్టడానికి ఎప్పుడూ మిమ్మల్నే ఎందుకు ఎన్నుకుంటుందో వదిలేద్దాం. మీ నవ్వు ఎలా ఉందో పరిశీలించుకోండి. వెటకారంగా ఉందా? ఆమె లెక్చరర్ని పరిహసిస్తున్నట్టు ఉందా? అలా ఉంటే ఎవరికైనా ఒళ్లు మండుతుంది కదా. రెండో విషయం ఏమిటంటే, నవ్వుతూ ఉండటం వేరు. ఆహ్లాదంగా ఉండటం వేరు. మేము తరచూ క్లాసుల్లో విద్యార్థులకు ’సీరియస్‌గా ఉండొద్దనీ, పాఠాలను ఆహ్లాదంగా వినండి’ అని చెబుతూ ఉంటాం. చాలామంది టీచర్లు క్లాసులో పిల్లల్ని ‘నవ్వకు, శ్రద్ధగా విను’ అని తిడుతూ ఉంటారు. శ్రద్ధగా వినటం అంటే సీరియస్‌గా వినటం కాదు. ప్రశాంతంగా వినటం. అదే విధంగా పెద్దలు కూడా పిల్లల్ని ‘హార్డ్‌వర్క్ చెయ్యి, పైకి వస్తావు’ అంటారు. హార్డ్‌వర్క్ అంటే కష్టపడి పని చెయ్యటం...! మనసుకు గానీ, శరీరానికి గానీ ఒక పని సాధ్యం కానప్పుడు అది హార్డ్‌వర్క్ అవుతుంది... హార్డ్‌వర్క్ చేస్తూ టీవీ చూడు. హార్డ్ వర్క్ చేసి క్రికెట్ ఆడు అని మాత్రం అనరు. చదువుకే ఈ పనిని ఆపాదిస్తారు. ఇంకో రకంగా చెప్పాలంటే... పెద్దలే పిల్లలకు చిన్నతనం నుంచి చదువంటే ఒక రకమైన విరక్తిభావం కలుగ చేస్తున్నారన్న మాట. ఈ సమాధానం ఆమె చదివేలా చెయ్యండి. మీ సమస్య తొలగిపోతుంది. నేను ఇటీవలే ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయ్యాను. మా పేరెంట్స్ ఇద్దరూ డాక్టర్లే. మా పేరెంట్స్ కోరుకుంటున్నట్లుగా నాకు ఎంబీబీఎస్‌లో చేరాలని లేదు. ఎంబీబీఎస్‌లో చేరే బదులు క్రియేటివ్‌గా ఏదైనా చేయాలని ఉంది. ఏదైనా ప్రాక్టికల్‌గా నేర్చుకోవడమే నాకు ఇష్టం. ఎంబీబీఎస్ నాకు తగిన కోర్సు కాదని బలంగా అనిపిస్తోంది. అలాగని, ఏ కోర్సులో చేరితే రాణించగలనో అనే దానిపై ఎంతగా ఆలోచించినా ఇంకా ఒక స్పష్టతకు రాలేకపోతున్నాను. దయచేసి సలహా ఇవ్వండి. - అమూల్య, ఊరు రాయలేదు ’ప్రాక్టికల్‌గా నేర్చుకోవటం’ అంటూ వ్రాసిన మీ ఉత్తరం అస్పష్టంగా ఉంది. మెడిసిన్‌లో ప్రాక్టికాలిటీ గానీ, మెడికల్ రీసెర్చ్‌లో క్రియేటివిటీ గానీ లేవని ఎలా అనుకుంటున్నారు? మీకు మరో రకమైన రీసెర్చ్ కావాలనుకుంటే ఫార్మసీలో గానీ, అగ్రికల్చర్ రంగంలో గానీ చేరండి. నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం. పాలిటిక్స్‌లో చేరితే ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. అయితే, పాలిటిక్స్‌లో రాణించగలనా? లేదా? అనే మీమాంసలో పడి ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. పాలిటిక్స్‌లో రాణించడానికి ఏం చేయాలో నాకు తెలియదు. అయితే, ఎలాగైనా పాలిటిక్స్‌లోకి రావాలని ఉంది. దానికి నేను ఏం చేయాలి? - పేరు రాయలేదు 1. ‘ఒక నాయకుడి కింద ఎంత కాలం నిజాయతీగా ఉండాలి? ఎప్పుడు అతణ్ని అధిగమించాలి’ అన్న విచక్షణాజ్ఞానం. 2. ఎప్పుడు వినాలి? ఎప్పుడు మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అన్న సంయమనం. 3. అనుచరుల్నీ, హితుల్నీ ఊరు పేరుతో సహా గుర్తుపెట్టుకోగలిగే జ్ఞాపక శక్తి. 4. తర్వాత వచ్చే ఎన్నికలకు డబ్బు సంపాదించగలిగే ఆర్థిక ప్రణాళిక. 5. కార్యకర్తలను ఆకట్టుకునే నైపుణ్యం, నిరంతరం అధిష్టానం కనుసన్నల్లో మెలిగే చాతుర్యం... ఈ అయిదూ రాజకీయ విజయానికి అయిదు మెట్లు. ఈ అర్హతలు మీకెంత వరకు ఉన్నాయో... ఎంతవరకు పెంచుకోగలరో అలోచించుకోండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
నా కన్నా రెండు నెలలు పెద్దది...
జీవన గమనం నేను బీటెక్ ఫైనలియర్ చదువున్నాను. నా జూనియర్ మీద నాకు చాలా ఇష్టం పెరిగింది. తనని ప్రేమిస్తున్నానేమో అనిపిస్తోంది. కానీ తనకి చెప్పలేదు. ఎందుకంటే చదువులో జూనియర్ అయినా ఆమె నాకంటే రెండు నెలలు పెద్దది. పైగా వేరే క్యాస్ట్. అయితే మా రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల నాకు వాళ్ల ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది. నా ప్రేమ విషయం తెలిస్తే ఆ అనుబంధం పాడవుతుందేమోనని భయంగా ఉంది. నిజానికి నాకు లవ్ అన్నా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్నా పెద్దగా ఇష్టం లేదు. వాటి వల్ల పెద్దల్ని బాధపెట్టినట్టు అవుతుందని భయం. కానీ అనుకోకుండా తనపైన ప్రేమ పెరిగింది. ఇప్పుడు నేనేం చేయాలి? తనతో నా ప్రేమని చెప్పాలా? లేదంటే మా కుటుంబాల స్నేహం కోసం మనసు మార్చుకోవాలా? సలహా ఇవ్వండి. - సందీప్, ఊరు రాయలేదు రెండు కుటుంబాలు విడిపోకుండా ఉండటం కోసం మీ త్యాగం... ఒక మంచి బాక్సాఫీస్ చిత్రానికి సరిపోయేలా ఉంది. ‘అక్కడ లేని నల్ల పిల్లిని చీకట్లో వెతకటం’ అన్న సామెత బహుశా ఇక్కడి నుంచే పుట్టి ఉంటుంది. అంచెలంచెలుగా మీ సమస్యను విశ్లేషించుకుంటూ వెళ్దాం. ఒకవైపు ప్రేమ అంటే ఇష్టం లేదని అంటూనే, మరోైవైపు ’ప్రేమిస్తున్నానేమో అ..ని..పి..స్తుం..ది’ అన్నారు. ముందు మీది ప్రేమా? ఆకర్షణా? అన్న విషయం తేల్చుకోండి. వ్యక్తిని ప్రేమించటం ప్రేమ. ప్రేమ భావాన్ని ప్రేమించటం ఆకర్షణ. ప్రేమలో ఆలోచన, అవగాహన, స్పష్టత, భద్రతభావం ఉంటాయి. ఆకర్షణలో ఆవేశం, ఉద్వేగం, అస్పష్టత, అయోమయం ఉంటాయి. ప్రేమ అనుభూతి కోసం, ఆకర్షణ అనుభవం కోసం..! భవిష్యత్ తెలియటం ప్రేమ. కాలం తెలియకపోవటం ఆకర్షణ. ప్రేమలో రోజు రోజుకి ఎదుటి వారి గురించి ఆలోచన, నమ్మకం పెరుగుతుంది. ఆకర్షణలో రోజురోజుకీ అనుమానం పెరుగుతుంది. మిమ్మల్ని మీరు ఈ విధంగా విశ్లేషించుకున్న తర్వాత, ఆ అమ్మాయిని తన అభిప్రాయం అడగండి. ఆమె, ‘‘అసలు నాకా భావమే లేదు. నువ్వు నా కన్నా చిన్నవాడివి’’ అంటే అసలు గొడవే లేదు. మీకు కూడా వర్ణాంతర వివాహాలు ఇష్టం లేవు కదా. ఒకవేళ ఆ అమ్మాయి యస్సంటే, ఇరువైపుల పెద్దల్ని సంప్రదించండి. వారు కూడా యస్ అంటే సమస్యే లేదు. కాదంటే, పెద్దవారిని ఎదిరించి వెళ్లిపోయి వివాహం చేసుకునేటంత తీవ్రమైనదా, పెద్దల్ని బాధ పెట్టి చేసుకోవడం అవసరమా (ఈ విషయం కూడా మీరే రాశారు) అనేది ఆలోచించుకోండి. మనసులోని అస్పష్టతతో బాధ పడటం కంటే, ఏదో ఒకటి తేల్చేసుకోవటమే మంచిది కదా. పరీక్షలు దగ్గర్లోనే ఉన్నాయి కాబట్టి ముందు చదువు మీద ఏకాగ్రత నిలపండి. పరీక్షలు ఫెయిలయ్యే కుర్రాళ్లని, కాస్త ముందు చూపున్న ఏ అమ్మాయీ ప్రేమించదు. నా వయసు 21. ఎంసీఏ చేస్తున్నాను. నిజానికి నాకు మీడియా రంగంలోకి వెళ్లాలని ఉంది. కానీ కుటుంబ సమస్యల కారణంగా, త్వరగా సెటిలైతే మంచిదని అందరూ బలవంతపెట్టడంతో ఎంసీఏలో చేరాను. కానీ చదువు ఎక్కడం లేదు. ఆసక్తి కలగడం లేదు. మానేయాలని ఉంది. కానీ మరో మంచి రంగంలో సెటిలైతేనే.. ఇది మానేసినా మావాళ్లు ఏమీ అనరు. పీజీ చేస్తే మీడియాలో సెటిలయ్యే మార్గం ఉంటే చెప్పండి. - రాజేశ్, విజయనగరం ఇష్టం లేని చదువుకన్నా నరకం ఇంకొకటి ఉండదు. కానీ మీ వాళ్లు చెప్పింది కూడా నిజమే కదా. మీడియా రంగంలో ఒక స్థాయి వచ్చేవరకూ ఆర్థికంగా నిలదొక్కుకోవటం కష్టం. అన్నిటికన్నా ముందు కొన్ని విషయాల్లో ఒక కచ్చితమైన నిర్ధారణకు రండి. 1. మీరు ఏ మీడియాలో స్థిరపడాలనుకుంటున్నారు? పత్రికా రంగమా? టీవీ ఛానెల్సా? 2. పత్రికా రంగం అయితే తెలుగా? ఇంగ్లీషా? 3. ఆ రచనా రంగంలో మీకు భాషాప్రవేశం ఉందా? లేక కేవలం ఉత్సాహమేనా? 4. టీవీ ఛానెల్స్‌లో అయితే, కెమెరా ముందు ఉండాలనుకుంటున్నారా? రిపోర్టింగ్ సైడా? మీ అభిరుచి కెమెరా ముందైతే... ఉచ్చారణ, అందం అవసరం. మీ కోరిక రిపోర్టింగ్ అయితే... భాష, అవగాహన అవసరం. ఏ వృత్తిలో రాణించాలన్న, కేవలం ఇష్టమే కాదు. అర్హత, కృషి, నైపుణ్యమూ కావాలి. మొదట అభిరుచిగా ప్రారంభించి వృత్తిగా మార్చుకోండి. తమ వృత్తి చేసుకుంటూ సైడుగా పత్రికా రిపోర్టింగ్ చేస్తున్న ఎల్ఐసీ ఏజెంట్లు, ఉపాధ్యాయులు కోకొల్లలు. ఆ విధంగా ముందు ఆర్థికంగా నిలదొక్కుకోండి. మీడియాలో పని చేస్తూనే ప్రైవేటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యవచ్చు కదా. లేదా జర్నలిజం కోర్సులో జాయినవ్వండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
నేనది తట్టుకోలేక పోతున్నాను...
జీవన గమనం నేను పీజీ చేస్తున్నాను. నాకొక వివాహితతో పరిచయం అయ్యింది. తనకి మూడేళ్ల బాబు ఉన్నాడు. బాబు పుట్టగానే భర్త చనిపోయాడట. వాళ్ల పుట్టింట్లో ఉంటోంది. అనుకోకుండా నాకు దగ్గరైంది. వాళ్ల ఇంట్లోవాళ్లు తనకి వేరే సంబంధం చూస్తున్నారు. కానీ ఆమె చేసుకోనంటోంది. అలా అని నేను తనని చేసుకోలేను. మా ఇంట్లోవాళ్లు ఒప్పుకోరు. ఆ విషయం చెబితే పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదు, నీ కోసం బతుకుతాను అంటోంది. వేరే అమ్మాయిని చేసుకో, తనతో కాపురం చెయ్యి, కానీ నాతో మాట్లాడుతూ ఉంటే చాలు అంటోంది. తనకి నేనంటే చాలా ఇష్టం. నాక్కూడా తనంటే చాలా ఇష్టం. ఆమె నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టదని నాకు నమ్మకం ఉంది. అయినా ఏదో భయం. నేనేం చేయాలి? - వివరాలు రాయలేదు మొదటిరాత్రి మీ భార్య తన జీవితానికి సంబంధించిన ఇదే సంఘటన మీతో చెప్పి, ఆయన చాలా మంచివారు. భార్య పోయింది. అనుకోకుండా నాకు దగ్గరయ్యారు. మనల్ని ఇబ్బంది పెట్టరు. నువ్వు వేరే అబ్బాయిని చేసుకో, తనతో కాపురం చెయ్యి అని ప్రోత్సహించారు. నేను కేవలం ఆయనతో మాట్లాడుతూ ఉంటే చాలట... అని చెప్తే, మీకు ఎలా ఉంటుందో అలోచించండి. మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నేను డిగ్రీ చదివాను. పోలీస్ అవ్వాలన్నది నా లక్ష్యం. కానిస్టేబుల్ పరీక్ష రాసి సెలెక్ట్ అయ్యాను. ట్రెయినింగ్‌కు కూడా వెళ్లాను. నెల రోజుల తర్వాత మెడికల్ టెస్ట్ జరిగినప్పుడు నాకు కిడ్నీ సమస్య ఉందని తేలింది. దాంతో రిజెక్ట్ చేశారు. చాలా బాధేసింది. ట్రీట్మెంట్ తీసుకున్నాను. కానీ ఎక్కువ కష్టపడకూడదని డాక్టర్స్ అంటున్నారు. దాంతో ఇక పోలీస్ అవ్వలేనని అర్థమైంది. నా లక్ష్యం దెబ్బ తినేసింది. నేనది తట్టుకోలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏడేళ్లుగా ఇదే పరిస్థితి. ఏ చేయమంటారు? - నందు, కాకినాడ ఈ ఏడు సంవత్సరాలూ డిప్రెషన్ లోనే ఉన్నారా? బాధపడుతూ కూర్చుంటే వయసు పైబడిపోతుంది కదా. అద్భుతంగా ఆపరేషన్లు చేసే డాక్టరుకి అకస్మాత్తుగా నరాలు వణికే వ్యాధి వస్తే ఏం చేస్తాడు? ఒక గమ్యం చేరటం అసాధ్యమని తెలిసినప్పుడు, గమ్యాన్ని మార్చుకోవటం తప్ప మరో మార్గం ఏమున్నది? పోలీసు ఉద్యోగంలో మీకు ఏ ఆకర్షణ కనపడిందో, అవే లక్షణాలున్న మరో వృత్తి ఎన్నుకోండి. ఒకరు తన స్నేహితుణ్ని డిన్నర్‌కి పిలిచి, తిరిగి వెళ్తూండగా టార్చిలైట్ ఇచ్చాడట. ‘‘ఇదెందుకు? నాకు రాత్రిళ్లు కళ్లు కనపడవు కదా’’ అంటూ ఆ స్నేహితుడు బాధపడ్డాడు. ‘‘ఇది నీకోసం కాదు మిత్రమా! ఎదుటి వ్యక్తి నిన్ను గుర్తించటానికి...’’ అన్నాడు హోస్టు. అతిథి ఆ టార్చి తీసుకుని వీధిలో వెళ్తూ వుండగా ఒక సైకిలిస్టు ఎదురుగా వచ్చి ఢీకొన్నాడు. ‘‘నా చేతిలో టార్చి కనపడటం లేదా? నేను గుడ్డివాడిని’’ అని అతడు కోపంగా అరిచాడు. ఆ మాటలకి కన్ఫ్యూజ్ అయిన సైకిలిస్టు ‘‘అయ్యో! క్షమించండి. కానీ... మీరు టార్చి ఆన్ చెయ్యలేదు’’ అన్నాడట. ప్రతీ మనిషిలోనూ ఒక టార్చి వుంటుంది. తనలోని టార్చిలైటుని వెలిగించి, ఆ వెలుగులో తన గమ్యాన్ని గుర్తించటమే ఆత్మపరిశీలన. నా వయసు 25. మావాళ్లు మాకు తెలిసిన కుటుంబంలోని అబ్బాయితో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అతను యూఎస్‌లో ఉంటాడు. చాలా మంచివాడు. అతణ్ని చేసుకోవడం నాకూ ఇష్టమే. కానీ నేను యూఎస్‌లో ఉండగలనా లేదా అన్నదే నాకు భయం. అందుకే చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. కానీ తెలిసినవాళ్ల అబ్బాయి, మంచివాడు, తనని వదిలేసుకుంటే అలాంటి మంచి సంబంధం మళ్లీ దొరకదు అని ఇంట్లోవాళ్లు అంటున్నారు. నాకూ నిజమే అనిపిస్తోంది. కానీ భయంగా ఉంది. ఏం చేయమంటారు? - ఓ సోదరి కేవలం భయంతో మాత్రం వదులుకోవద్దు. కొన్ని భయాలు నిర్హేతుకాలు. నా మిత్రుడు చాలా పెద్ద మ్యూజిక్ డెరైక్టర్. విమానం ఎక్కడమంటే భయం. లండన్‌లో రికార్డింగ్‌కి భయపడి అసిస్టెంట్‌ని పంపాడు. కారణం లేని భయాల వల్ల అవకాశాలని పోగొట్టుకోకూడదు కదా. కొంతమంది అమెరికా సంబంధం అంటే కారూ ఇల్లూ ఉంటుందనీ, అత్తగారూ ఆడపడుచుల తాకిడి ఉండదని, ఎగిరి గంతేస్తారు. మరి కొందరికి దగ్గర వాళ్లనీ, పుట్టిన ప్రాంతాన్నీ వదిలి దూర దేశాల్లో స్థిరపడటం; తమ సంతానాన్ని తమ తల్లిదండ్రులకి స్కైప్ లో పరిచయం చేయడం ఇష్టం ఉండదు. ఆర్థిక ఉన్నతి కోసం, తరువాతి తరాల భవిష్యత్ కోసం ఆ మాత్రం త్యాగం తప్పదని వాదిస్తారు మరి కొందరు. ఎవరి అభిప్రాయాలు వారివి. మీరు ఎటువైపు మొగ్గుతారో లోతుగా అలోచించుకోండి. కేవలం కొత్త వాతావరణంలో ఇమడలేను అన్న భయం వల్ల వివాహం మానుకోవద్దు. - యండమూరి వీరేంద్రనాథ్ -
అందరూ తిడుతున్నారు
జీవన గమనం నేను అబౌ యావరేజ్ స్టూడెంట్‌ని. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాను. నిజానికి ఫైనలియర్ లో ఉండాలి. కానీ మొదటి సంవత్సరం ప్రిపరేషన్ హాలీడేస్‌లో యాక్సిడెంట్ అవడం వల్ల ఆ సెమిస్టర్ సరిగ్గా రాయలేదు. దాంతో బ్యాక్‌లాగ్స్ ఉండటం వల్ల నన్ను ఫైనలియర్‌కు ప్రమోట్ చేయలేదు. మాది జాయింట్ ఫ్యామిలీ అవ్వడం వల్ల ఇంట్లో చిన్నవాళ్లందరితోనూ పోల్చి నన్ను తిడుతున్నారు. ఎమ్ఎన్సీ లో జాబ్ చేయాలన్నది నా గోల్. కానీ అది సాధించగలనన్న కాన్ఫిడెన్స్ నాకిప్పుడు లేదు. నేను నా గోల్ సాధించాలంటే ఏం చేయాలి? - శిక్ష, మెయిల్ సుదూరంలో ఎక్కడో పెద్ద గోల్స్ పెట్టుకుని, వాటిని సాధించటానికి ప్రయత్నించటం కన్నా, దగ్గర్లో చిన్న గోల్స్ పెట్టుకుని, వాటిని పూర్తి చేసుకుంటూ గమ్యం చేరటం ఉత్తమమైనది. ఎమ్ఎన్సీ లో ఉద్యోగంలాంటి గొప్ప గమ్యం ఉండటం మంచిదే కానీ, బ్యాక్‌లాగ్స్ ఉన్న వారికి పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు రావటం కష్టం. సరే ఆ విషయం పక్కన పెడదాం. మీ యాక్సిడెంటు ఎంత ప్రమాదకరమైంది? రెండేళ్లుగా దాన్నించి బయటపడలేకపోయేటంత తీవ్రమైనదా? లేక మీరు వరుసగా పరీక్షలు ఫెయిల్ అవటానికి దాన్ని ఓ సాకుగా తీసుకుంటున్నారా? లేకపోతే మీ యాక్సిడెంటు గురించి తెలిసీ, మీ పెద్దలు మిమ్మల్ని ఎందుకు తిడతారు? తన అపజయాలకు కారణాలు వెతుక్కోవటం మనిషి ఓటమికి మొదటి మెట్టు. మనిషి జీవితం ఒక పుస్తకమైతే, దాని ముఖ్య కథాంశం (స్టోరీలైన్) ఆనందం. అప్పుడప్పుడు కొన్ని ట్విస్టులూ, విషాదాలూ ఉంటాయి. అవి లేకపోతే కథలో ఇంటరెస్టే ఉండదు. అయితే అక్కడే ఏడుస్తూనో, భయపడుతూనో ఆగిపోకూడదు. ఏడుపూ, భయమూ ఉన్న పేజీల దగ్గర పుస్తకం చదవటం ఆపెయ్యము కదా. అలా అన్న మాట. ముందు ఏకాగ్రత పెంచుకుని చదువు పూర్తి చేసి, తర్వాత గోల్ గురించి ఆలోచించండి. నేనొక అమ్మాయిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాను. తను సింగర్. మా ఇద్దరి పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ అంతలో ఏమైందో ఏమో నన్ను చేసుకోనని చెప్పేసింది. తన పేరెంట్స్‌తో మాట్లాడి ఓ మ్యూజిక్ డెరైక్టర్‌తో పెళ్లి కుదుర్చుకుంది. నేను తనని టార్చర్ చేస్తున్నందుకే అలా చేశానని అంటోంది. అది నిజం కాదు. అతణ్ని చేసుకోవడానికే తను అలా చెబుతోందని అర్థమైంది. మా విషయాన్ని ఆ మ్యూజిక్ డెరైక్టర్‌తో కూడా చెప్పాను. కానీ అతను తనకవన్నీ అనవసరమన్నాడు. నేనా అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను. తను మళ్లీ నన్ను ప్రేమించాలంటే ఏం చేయాలి? - శశి, మెయిల్ ప్రేమించినవారి చేత విదిలించుకోబడ్డామన్న అవమానంకన్నా ఘోరమైన నరకం మరొకటి లేదు..! కానీ బాధపడకండి. మంచి స్నేహితులు మిమ్మల్ని ఎప్పుడూ వదిలెయ్యరు. అలా వదిలేసినవారు మంచి స్నేహితులు కారు. అలాంటివారు మిమ్మల్ని వదిలేసినందుకు అదృష్టవంతులని అనుకోండి. ఒక కుర్రవాడు కౌన్సెలర్ దగ్గరకు వెళ్లాడట. ‘‘ఒక అమ్మాయి నాతో కొంతకాలం స్నేహం చేసి మానేసింది, కలిసినప్పుడు మొహం తిప్పుకుంటుంది. ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడదు. నేను చదువు మీద ఏకాగ్రత నిలపలేకపోతున్నాను. కనీసం స్నేహంగానైనా బై చెప్పి విడిపోవచ్చుగా..’’ అంటూ తన బాధను చెప్పుకున్నాడు. ‘‘బై చెప్పినప్పుడు, మీలాంటి వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో ఎదుటివారికి తెలియదు. కొందరు లైట్‌గా తీసుకుని ’సర్లే’ అనొచ్చు. మరి కొందరు వివాహ సమయంలో వెళ్లి గొడవ చెయ్యవచ్చు. వివాహం అయ్యాక పాత మెసేజీలు చూపించి బ్లాక్ మెయిల్ చెయ్యవచ్చు. ఇంకా దుర్మార్గులైతే యాసిడ్ పోయొచ్చు’’. అబ్బాయి ఏదో అడగబోయే లోపే, వారి సంగతి వదిలిపెట్టు. నీ విషయం ఆలోచించు. నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్నెందుకు వదిలేసింది? నువ్వు నచ్చకో, నీ కన్నా తల్లిదండ్రులు ముఖ్యమనో అనుకోవటం వల్లే కదా మరెవరినో పెళ్లాడింది. నీ ప్రేమ నిజమైనదైతే ఆమె తృప్తిగా ఉండటం కన్నా నీకేమి కావాలి? బాధ దేనికి? ‘‘నేను అమ్మాయినై, నా బాయ్‌ఫ్రెండ్ నన్ను వాడుకుని వదిలేసినా ఇలాగే తృప్తిగా ఉండమని సలహా ఇస్తారా?’’ ఉక్రోషంగా అడిగాడు కుర్రాడు. ‘‘చెప్పను. అమ్మాయిలకైతే మరోలా చెప్తాను. ఇష్టం తగ్గిపోయో, ఎక్కువ కట్నం వస్తుందనో, తల్లి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించటం వల్లనో నిన్ను వదిలేశాడనుకుందాం. అలా ప్రేమలో లాభనష్టాలు బేరీజు వేసుకునేవాడు దూరమైనందుకు సంతోషించాలని చెప్తాను’’ అని నవ్వి, ‘‘మరీ వితండ వాదనలా ఉందా?’’ అని అడిగాడు. ‘‘లేదు. మీరు చెప్పేది అర్థమైంది’’ అన్నాడు కుర్రవాడు. ‘ప్రేమ ఒక కళ’ అన్న పుస్తకంలో వ్రాసిన పై ఉదాహరణ మీ విషయంలో సరిగ్గా సరిపోతుంది. తన మంచి భవిష్యత్ కోసం మిమ్మల్ని వదిలేసి, మరో మార్గం చూసుకుంది. అది స్వార్థమే అయ్యుండొచ్చు. కానీ పెళ్లయ్యాక వదిలెయ్యలేదు కదా. ఇక్కడ అమ్మాయిని సపోర్ట్ చెయ్యటం కాదు. మిమ్మల్ని ఛీ కొట్టి వెళ్లిపోయిన అమ్మాయిని మళ్లీ మీ జీవితంలోకి అహ్వానించాలని ఎలా అనుకుంటున్నారు? ’స్వాభిమానం’ లేదా మీకు? పైగా మీ ప్రేమ విషయం కాబోయే పెళ్లికొడుక్కి చెప్పి ఆ వివాహం చెడగొట్టాలని చూస్తారా? ఇది శాడిజం కాదా? ఇటువంటి మనస్తత్వం ఉంది కాబట్టే మిమ్మల్ని బహుశా ’టార్చరర్ ’ అని ఉంటుంది. ఇక మీ విషయానికొస్తే, జరిగింది మర్చిపోయి, కెరీర్ మీద దృష్టి పెట్టండి. టీ-20 లో ఒక బంతి మిస్ అయితే ఆటగాడు బాధపడుతూ కూర్చోడు. తరువాతి బంతితో ఎలా సిక్సర్ కొట్టాలా అని ఆలోచిస్తాడు. ఈ సూత్రాన్నే జీవితానికీ అన్వయించుకోవాలి. - యండమూరి వీరేంద్రనాథ్ -
లవ్వా... లక్ష్యమా... తేల్చుకునేదెలా?!
జీవన గమనం నేను ఎంబీబీఎస్‌కి లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాను. రెండేళ్ల క్రితం ఫేస్బుక్లో ఓ అమ్మాయితో పరిచయం అయింది. అప్పటి నుంచీ తనతో మాట్లాడుతూనే ఉన్నాను. నాకు తెలియ కుండానే తన మీద ఇష్టం పెరిగిపోయింది. ఒక్కరోజు కూడా తనతో మాట్లాడకుండా ఉండలేక పోతున్నాను. దాంతో చదువు మీద శ్రద్ధ తగ్గింది. ఇలా అయితే నా లక్ష్యం దెబ్బ తింటుందేమోనని భయంగా ఉంది. తనతో మాట్లాడకుండా బాగా చదువుకోవాలంటే ఏం చేయాలి? - రాజేశ్, మెయిల్ ఇంటర్మీడియెట్ అంటే ల్యాటిన్ భాషలో ‘ఇన్-ది-మిడిల్’ అని అర్థం. విద్యార్థి జీవితం ఒక రైలు ప్రయాణం అనుకుంటే, ఇంటర్ ‘విజయవాడ ప్లాట్‌ఫామ్’ లాంటిది. అక్కడికి చాలా రైళ్లు (ఆకర్షణలు, అలవాట్లు) వస్తాయి. ‘సెల్లు, టీవీ’ నుంచి ‘ప్రేమ, మందు’ వరకూ రకరకాల ఆకర్షణలున్న రంగురంగుల బండి ఎక్కితే, అది మిమ్మల్ని జెసైల్మీరు ఎడారికి తీసుకెళ్లి దింపుతుంది. పదివేల రూపాయల జీతానికి స్థిరపడి అక్కడితో సంతృప్తిపడాలి. మంచి స్నేహితులు, పుస్తకాలూ ఉన్న బండి కాశ్మీరు ఉద్యానవనానికి తీసుకెళ్తుంది. ఏ రైలు ఎక్కుతారు? ముక్కు, ముఖం తెలియని అమ్మాయితో ప్రేమలో పడటం... మీరన్నట్టు అది ప్రేమ కాదు, ఇష్టం. మరో భాషలో చెప్పాలంటే ఆకర్షణ. అందుకే సిరివెన్నెల సీతారామశాస్త్రి ‘‘ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావో అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను’’ అని పాట కూడా రాశారు. మీ లక్ష్యం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమా? చదువుకోవడమా? ఒకవేళ పెళ్లి చేసుకోవడమే అయితే ఇప్పుడేనా? అయిదేళ్లు పోయాకా? అప్పటివరకు ఆ అమ్మాయి మీకోసం ఆగుతుందా! వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? అసలిన్ని గొడవలు కావాలా! నేనేదో ప్రశ్న అడిగితే చాట భారతం రాస్తున్నాడేంటి అనుకోకండి. మీ ప్రశ్న ఆఖరి వాక్యంలోనే సమాధానం ఉంది. చదువుకోండి. నేను మొదట్నుంచీ బాగా చదివేదాన్ని. జీవితంలో బాగా స్థిరపడి అమ్మానాన్నలకు పేరు తేవాలి అనుకునేదాన్ని. ఇంత వరకూ అన్నీ అను కున్నట్టుగానే జరిగాయి. కానీ తర్వాత నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా సీఏలో చేర్పించారు. అయినా ఎలాగో కష్టపడేదాన్ని. నాన్న కోసమైనా బాగా చదవాలని ప్రయత్నించేదాన్ని. కానీ నా వల్ల కాలేదు. ఫెయిలైపోయాను. దాంతో తిరిగి డిగ్రీలో చేరాను. కానీ నా జూనియర్స్తో కలిసి డిగ్రీ చదవాలంటే బాధగా ఉంది. డిప్రెస్ అయిపోయాను. అంతలో పెళ్లి సంబంధాలు చూశారు. నన్ను అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి నా ఫ్రెండ్. తనకు దూరం అవ్వడం ఇష్టం లేక పెళ్లి వద్దన్నాను. దాంతో అన్నిటికీ ఆ అమ్మాయే కారణం అంటూ అమ్మ నా ఫ్రెండ్‌ను తిట్టింది. అది తట్టుకోలేక పెళ్లికి ఒప్పేసుకున్నాను. కానీ ఎందుకో మనసంతా అలజడిగా ఉంది. నాకిష్టం లేనివే ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. ఈ బాధను నేను ఎలా అధిగమించాలి? - హరిత, ఊరు రాయలేదు ఇష్టం లేనివి జరుగుతున్నప్పుడు, జరుగుతున్నవాటిని ఇష్టంగా చేసుకోవటాన్ని ‘పాజిటివ్ థింకింగ్’ అంటారు. నేను చదువుకునే రోజుల్లో, నాకూ ఇదే సమస్య ఎదురైంది. నాకు లెక్కలు చాలా ఇంట్రెస్ట్. జువాలజీ అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇంట్లో వాళ్ల బలవంతం మీద సైన్స్‌లో చేరాను. కానీ ఎంత బాగా చదివినా, మెడిసిన్‌లో సీట్ సంపా దించలేకపోయాను. అదృష్టవశాత్తూ కామర్సుతో డిగ్రీ చదివి, ఆ తర్వాత నాలుగేళ్ల సీఏ కోర్సును కేవలం మూడేళ్లలోనే పూర్తి చేశాను. మన అభిరుచి పెద్దలు అర్థం చేసుకోలేక పోతే వచ్చే సమస్య 90 శాతం కుటుంబాల్లో ఉన్నదే! ఇక పోతే మీ జూనియర్స్తో కలిసి చదవాలనే బాధ మీకు ఎక్కువగా ఉంటే, ప్రైవేటుగా చదివే వెసులుబాటు ఉన్నదేమో ఆలోచించండి. ఇక తర్వాతి సమస్య... మీ వివాహం. భవిష్యత్తులో మీరు వివాహం చేసుకుంటారా లేదా అనేది వేరే విషయం కానీ, కేవలం స్నేహితురాలికి దూరమవుతానన్న భయంతో వివాహం వద్దనుకుంటున్న మీ ఆలోచన మాత్రం అంత ఆరోగ్యమైనది కాదు. కొంత కాలానికి మీ ఫ్రెండ్ కూడా పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది కదా! కేవలం స్నేహితురాలి గురించి వివాహం మానుకోకండి. కొన్ని వాస్తవాల్ని భరించక తప్పదు. మీకు వివాహం చేసుకోవాలనే కోరిక ఉండి, అబ్బాయి నచ్చితే చేసుకోండి. లేదూ ఇంకా చదువుకోవా లనుంటే ప్రైవేట్‌గా మీ చదువును కొనసా గించండి. అదీ కాకపోతే, వివాహం చేసుకుని ఆ తర్వాత చదువును కొనసాగించండి. ఎందు కంటే... చదువుకు, వయసుకు సంబంధం లేదు. - యండమూరి వీరేంద్రనాథ్ -
నేను చేస్తోంది తప్పేమో?
జీవన గమనం నేను బీటెక్ చేశాను. తర్వాత రెండేళ్లు కాంట్రాక్ట్ బేసిస్ మీద జాబ్ చేశాను. ఎంటెక్ చేయడానికి ఆ జాబ్ మానేశాను. మరో మంచి ఉద్యోగం రావడంతో మధ్యలోనే ఎంటెక్ ఆపేశాను. ఆ జాబ్‌లో జాయిన్ అయిన నెల రోజులకు ఎక్కడో గ్రూప్స్ గురించి చూశాను. వెంటనే ఉద్యోగం మానేసి గ్రూప్స్ కోచింగ్‌లో చేరాను. కానీ నాకిప్పుడు అనిపిస్తోంది... నేను చేస్తోంది తప్పేమో అని. దేని మీదా దృష్టి పెట్టలేకపోతున్నాను. ఒకదాని నుంచి ఒకదానికి మారుతూనే ఉన్నాను. ఇలా అయితే నేను ఏం సాధించగలను? ఇలా మాటిమాటికీ మనసు మారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? - కె.రమణ, ఊరు రాయలేదు ‘రోలింగ్ స్టోన్స్‌కు ద్రవ్యరాశి (మాస్) సమకూరదు’ అని ఒక సామెతుంది. అదెంత నిజమో, మరోవైపు దానికి వ్యతిరేకంగా.. ‘మురికి నీటికి సుగంధం ఉండదు’ అన్నది కూడా అంతే నిజం. ఎవరి పరిస్థితిని బట్టి వారు మెలగాలి. మనస్తత్వాన్ని బట్టి కెరీర్‌ని నిర్ణయించుకోవాలి. నేను పదిహేను సంవత్సరాలు ఒకే సంస్థలో మారకుండా పని చేశాను. మా అబ్బాయి పదేళ్లలో పదిహేను సంస్థలు మారి ఒక స్థాయికి వచ్చాడు. కాబట్టి ఏది కరెక్ట్ అనేది ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇక మీ విషయానికి వస్తే... మంచి ఉద్యోగం రావడంతో మీరు ఎంటెక్ ఆపేశారు. తర్వాత మళ్లీ గ్రూప్స్ కోసం ఎంటెక్ మానేశారు. ఇందులో తప్పేముంది? అయితే మీరు చేస్తున్న ఉద్యోగం, గ్రూప్స్ పాస్ అవ్వడం వల్ల వచ్చే ఉద్యోగం కన్నా మంచిదా కాదా అన్న విషయం మీరు నిర్ణయించుకోవాలి. కొన్ని లక్షలమంది గ్రూప్స్‌కి చదువుతున్నారు. పాసయ్యేది చాలా తక్కువ శాతం. మీకా సామర్థ్యం ఉన్నదా అన్న విషయం ముందు నిర్ణయించుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ వయసెంత, మీ కుటుంబ ఆర్థిక స్తోమత ఎంత, మీ మీద ఎవరైనా ఆధారపడి ఉన్నారా, మీకు వయసు మీరిపోతుందా... ఇవన్నీ ఆలోచించి, ఉద్యోగం (జీవితం)లో స్థిరపడాలా, రిస్క్ తీసుకోవాలా అనే నిర్ణయం తీసుకోండి. నేను ఎమ్మెస్సీ చేశాను. ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ముప్ఫై వేల పైనే వస్తోంది. నా ఎమ్మెస్సీ క్లాస్మేట్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మొదట్లో చాలా సంతోషంగా ఉండేవాళ్లం. కానీ తనకి నాకు వచ్చినట్టుగా వెంటనే ఉద్యోగం రాలేదు. దాంతో ఏదో ఒక చిన్న కంపెనీలో చేరాడు. జీతం కూడా నా కంటే తక్కువే. దానికి నేనేం బాధపడటం లేదు. కానీ తను మాత్రం కుమిలిపోతున్నాడని అనిపిస్తోంది. తనకంటే నాది మంచి ఉద్యోగం అని, ఎక్కువ జీతం అని చాలాసార్లు అనేస్తుంటాడు. అది మామూలుగా అనడం లేదేమో అని నాకు అనిపిస్తోంది. ఇది మా ఇద్దరి మధ్య గ్యాప్‌ను పెంచుతుందేమో అని కూడా భయంగా ఉంది. తన మనసులో నుంచి ఆ ఫీలింగ్‌ను ఎలా తీసేయాలి? - సౌజన్య, హైదరాబాద్ మీ భర్త మనస్తత్వం ఎటువంటిది? సెన్సిటివా? లేక ప్రాక్టికలా? అతడు ఎలాంటి వాడైనా, ముందు అతని కాంప్లెక్స్‌ను పోగొట్టాలి. అంతకన్నా ముఖ్యంగా ముందు మీరు మీ బాధనీ, భయాన్నీ తనకి స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అతడు ప్రాక్టికల్ అయితే, ‘‘నాకన్నా నీకు జీతం తక్కువని నువ్వు బాధపడుతున్నావ్! నేనేం చేయాలో నువ్వే చెప్పు. ఉద్యోగం మానేయనా?’’ అనండి. కంగారుపడి వద్దు వద్దంటాడు. అతడు బాగా సెన్సిటివ్ అయితే, ఒక వారం రోజుల పాటు ఇద్దరూ ఎక్కడికైనా వెళ్లండి. నెమ్మది నెమ్మదిగా మీ భావాల్ని ఎక్స్‌ప్రెస్ చేయండి. ‘తన కన్నా మీ జీతం ఎక్కువన్న కారణం వల్ల మీరు కూడా బాధపడుతున్నారు’ అన్న సంగతిని అతనికి తెలిసేలా చేయండి. పనిలో పనిగా... (ప్రేమ వివాహం అంటున్నారు కాబట్టి) డబ్బు లేకపోవటం వల్ల వచ్చే కష్టనష్టాల గురించి కూడా అతడికి తెలియచెప్పండి. అతడు మీ బాధను, మీలో జరిగే సంఘర్ణణనీ తప్పకుండా అర్థం చేసుకుంటాడు. ఖాళీగా ఉండి అనవసరపు ఆలోచనలతో సతమతమవ్వకుండా, తీరిక వేళల్లో ఏదైనా హాబీ పెంపొందించుకునేలా ప్రోత్సహించండి. చిత్రలేఖనం నుంచి పత్రికలకు వ్యాసాలు రాయటం వరకు ఏదైనా కావొచ్చు. ఏ మంచి హాబీ లేనివాళ్లకు నిరాశాపూరితమైన ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఏమో ఎవరు చెప్పొచ్చారు... అతడి హాబీనే అతన్ని ఆర్థికంగా ఉన్నత శిఖరాల మీద నిలబెట్టవచ్చేమో! - యండమూరి వీరేంద్రనాథ్ -
నా కూతురి మనసు మార్చేదెలా?
జీవన గమనం నేను ఓ స్కూల్లో రిసెప్షనిస్టుగా పని చేస్తున్నాను. మా స్కూల్లో పనిచేసే ఓ మాస్టారు నన్ను పెళ్లి చేసు కోవాలనుందని అన్నారు. ఈ విషయం నేను నాతో స్నేహంగా ఉండే మరో టీచర్‌తో చెబితే... అతనికి ఆల్రెడీ పెళ్లైపోయిందని ఆవిడ చెప్పారు. కోపం వచ్చి అడిగేశాను. పెళ్లయ్యింది కానీ భార్య మంచిది కాదని, తనని వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటానని చెబు తున్నారు. మాది పేద కుటుంబం. నా సంపాదనే మా కుటుంబానికి ఆధారం. నాకు పెళ్లి చేసే స్తోమత కూడా అమ్మా నాన్నలకు లేదు. కాబట్టి అతను చెప్పేది నిజమైతే నేనతణ్ని పెళ్లి చేసుకోవచ్చా? తన మాటలు నమ్మొచ్చా? - ఓ సోదరి, గుంటూరు ఇందులో నమ్మకాలు, అపనమ్మకాల ప్రసక్తి ఏముంది? చీకట్లో ఉన్నప్పుడు అక్కడే ఉండి పోవడం కన్నా కనబడుతున్న వైపునకు మళ్లడం అభిలషణీయం కాదా? కానీ అది వెలుగా మిణుగురు పురుగా అనేది ముందు తెలుసు కోవాలి. వెళ్తున్న దారిలో ముళ్లపొదలు, సుడి గుండాలు ఉన్నాయేమో గమనించి జాగ్రత్త పడాలి. వివాహం గురించి అతడు ప్రపోజల్ పెట్టినప్పుడు తన మొదటి భార్య సంగతి ఎందుకు చెప్పలేదో ముందు మీరు కన్విన్స్ అవ్వండి. అతడు చెప్పిన కారణం నిజమనిపిస్తే, మీ తండ్రిగారిని వెళ్లి ఆ మాస్టారితో మాట్లాడమని చెప్పండి. మొదటి భార్యతో విడాకులు ఎంతవరకూ వచ్చాయో కనుక్కోండి. ఆమెతో ఆయనకు సంతానం ఉందో లేదో, విడాకులిస్తున్న సమయంలో కోర్టు ఏ రకమైన ఆంక్షలు పెడుతుందో, ఆయన ఆస్తిలో ఎవరికి ఎంత వాటా చెందుతుందో మొదలైన వివరాలన్నీ సేకరించిన తర్వాతే ఓ నిర్ణయానికి రండి. ముఖ్యంగా... మీ వివాహం జరిగిన తర్వాత కూడా మీరు ఉద్యోగం చేస్తానని, ఆ జీతం మీ బీద తల్లిదండ్రులకే చెందుతుందనీ ఆయన్ని ఒప్పించండి. మగాళ్లు మొగుళ్లయ్యాక పెళ్లికి ముందున్నంత దయాగుణంతో ఉండరు. ఆ విషయం గుర్తు పెట్టుకుని, పక్కాగా పెద్దల సమక్షంలో ఏర్పాట్లు చేసుకోండి. మేం బ్రాహ్మణులం. మాకంటూ ఓ గుర్తింపు, గౌరవం ఉన్నాయి. కానీ నా కూతురు ఒక తక్కువ కులం కుర్రాడిని ప్రేమించింది. తననే పెళ్లి చేసు కుంటాను అంటోంది. అబ్బాయి మంచివాడు, బాగా చూసుకుంటాడు అని కచ్చితంగా చెప్పేస్తోంది. కానీ ఈ పెళ్లి వల్ల మా బంధువులు, స్నేహితుల మధ్య మా గౌరవం పోతుంది. అలాగే ఆ అబ్బాయి కుటుంబం, మా కుటుంబం ఎప్పటికీ కలవలేవు. రకరకాల స్పర్థలు వస్తాయి. తారతమ్యాలు కనిపిస్తాయి. కాబట్టి జీవితాంతం ఇబ్బందే. అందుకే వద్దంటున్నాను. కానీ నా కూతురు వినడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను అనుకున్నదే చేయాలా లేక తన జీవితం తన ఇష్టం అని పెళ్లికి ఒప్పుకోవాలా? - శర్మ మీ ప్రశ్న తాలుకు చివరి వాక్యాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ‘‘ నేను చేసుకోవద్దంటు న్నాను. కానీ నా కూతురు వినటం లేదు. నేననుకున్నదే చేయాలా? లేక పెళ్లికి ఒప్పు కోవాలా?’’ అని రాశారు. మీరు ఏమనుకుంటు న్నారు? ‘పెళ్లి జరగడానికి వీల్లేదు’ అనుకుంటు న్నారు. అవునా? కానీ మీ కూతురు వినటం లేదు. మరేం చేస్తుంది? ఇంట్లోంచి వెళ్లిపోయి ఆ అబ్బాయిని వివాహం చేసుకుంటుందా? ఎలాగూ మీ మాట విననన్నప్పుడు ఇక మీకు వేరే పరిష్కార మార్గం ఏముంది? లేదూ, మీరు ఎమోషనల్‌గా బలవంతం చేస్తే, మీ అమ్మాయి ఆ కుర్రవాడిని మరచిపోయి మీరు చెప్పిన వివాహం చేసుకుంటుందనుకుందాం! ఆ అమ్మాయి మనస్తత్వం ఎలాంటిది? గతం గత: అనుకుని భర్తతో సుఖంగా కాపురం చేయగలు గుతుందా, లేక డిప్రెషన్‌కు గురై ఒక కుర్రవాడి (భర్త) జీవితం నాశనం చేసే మనస్తత్వమా? తండ్రిగా మీరే దాన్ని బాగా గుర్తించగలరు. మీరు ప్రశ్నలో మరికొన్ని వివరాలు ఇవ్వలేదు. అతడు ఉద్యోగం చేస్తున్నాడా? ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఈ పెళ్లికి సుముఖంగా ఉన్నారా? లేదా పెద్దల నుంచి దూరంగా వెళ్లిపోయి విడిగా సంసారం పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడా? మీ అమ్మాయి ఆ అబ్బాయి గురించి, ‘‘ చాలా మంచివాడు. బాగా చూసుకుంటాడు అంటోంది’’ అన్నారు. ప్రేమించిన కొత్తలో ప్రతివాళ్లూ అలాగే అనుకుంటారు. కౌన్సిలింగ్‌కి వచ్చే కేసుల్లో సగం పైగా ప్రేమ వివాహాలే! ఇవన్నీ మీ అమ్మాయికి చెప్పి చూడండి. దానికన్నా ముందు ఆ అబ్బాయిని కలుసుకుని మాట్లాడండి. అతడి ఆర్థిక స్థాయి గురించిన వివరాలు సేకరించండి. అన్నీ మీ అమ్మాయికి చెప్పి, తర్వాత నిర్ణయం ఆమెకే వదిలిపెట్టండి. మీ కుటుంబం, ఆ అబ్బాయి కుటుంబం ఎప్పటికీ కలవక పోవచ్చు. వాళ్లిద్దరూ పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ అయి సామరస్యంగా సంసారం చేసుకునే మనస్తత్వం ఉన్నవాళ్లేనా? నిజంగా వాళ్లకు అలా సంసారం చేసుకునే స్థైర్యం, నిబద్ధత, సామర్థ్యం ఉంటే, మీరు మీ కుటుంబ గౌరవం గురించి గానీ, మీ స్నేహితుల గురించి గానీ, ఏ మాత్రం బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో కులాంతర వివాహాల గురించి ఎవరూ ఎక్కువ పట్టించుకోవడం లేదు. అలా కాకుండా, మీ కుటుంబంలో మిగతా వారి వివాహాలకు మీ అమ్మాయి తీసుకున్న నిర్ణయం అడ్డొస్తుంది అనుకుంటే... మీ నుంచి విడిపోవలసి వస్తుంది అని అమ్మాయిని హెచ్చరించండి. చివరగా ఒక మాట! మీ కులం కాని వారందరిదీ ‘తక్కువ కులం’ అనే అభిప్రాయం మార్చుకోండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
కాబోయే భార్యకి... చెప్పాలా? వద్దా?
జీవన గమనం నా వయసు 26. మూడేళ్ల క్రితం నాకు ప్రభుత్వోద్యోగం వచ్చింది. పబ్లిక్ రిలేటెడ్ జాబ్. అయితే నేను మొదట్నుంచీ సెలైంట్ కావడం వల్ల ఎవరితోనూ ఎక్కువ మాట్లాడలేకపోతు న్నాను. దాంతో కొందరు నన్ను ఆ జాబ్‌కి అన్‌ఫిట్ అంటున్నారు. అది బాధ కలిగిస్తోంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోతోంది. ఈ బలహీనతను ఎలా అధిగమించాలో చెప్పండి. - బి.ప్రియదర్శిని, మెయిల్ ఇంట్రావర్ట్‌గా ఉండటం వేరు, రిజర్వ్డ్గా ఉండటం వేరు. అవసరమైన ప్పుడు మాట్లాడటాన్ని రిజర్వ్‌డ్‌నెస్ అంటారు. అవసరమున్నా మాట్లాడకపోవడాన్ని ఇంట్రా వర్షన్ అంటారు. ఉద్యోగ రీత్యా పదిమందితో మాట్లా డాల్సి వచ్చినప్పుడు తప్పని సరిగా మాట్లాడాలి. ఈ కళను పెంపొందించుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఈ మూడే ళ్లలో మీరు ఇందులో ఎంతవరకూ సఫలీకృత మయ్యారో చెప్పలేదు. కమ్యునికేషన్ అనేది చదవడం, రాయడం, మాట్లాడటం, వినడం, హావభావాలు, సంజ్ఞల మీద ఆధారపడి ఉంటుంది. సంభాషణల్ని రెండు రకాలుగా విడగొట్టవచ్చు. ప్రైవేట్ స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్. ప్రైవేట్ కమ్యుని కేషన్లో నాలుగు అంశాలు దృష్టిలో పెట్టు కోవాలి. 1.మన మూడ్ మాట్లాడటానికి తగిన విధంగా ఉందా? 2. అవతలివారి మూడ్ వినడానికి సరైన స్థితిలో ఉందా? 3.అవతలివారి మూడ్‌ని మన మాటలతో మార్చగలిగే పరిస్థితి ఉందా? 4.అవతలి వారి పరిస్థితిని బట్టి మన మూడ్ మార్చు కునే అవకాశం ఉందా? అదే విధంగా ఎవరితో మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడు తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనే మరో నాలుగు విషయాలూ గుర్తుంచు కోవాలి. సరిగ్గా మాట్లాడలేక పోవడం వల్ల వచ్చే నష్టాలు మీకీపాటికే అవగతమై ఉంటాయి. ముందు దగ్గరి వారితో మాట్లా డటం ప్రారంభించండి. స్నేహితులతో గ్రూప్‌గా ఏర్పడి, ఆసక్తికరమైన చర్చల్లో పాల్గొంటే మెదడు చురుగ్గా పని చేస్తుంది. తెలివితో పాటు వాగ్ధాటి పెరుగుతుంది. ఆ తరువాత ఆ విద్యని మీ వృత్తిలో అమలు జరపండి. ఫలితాలు మీకే విస్మయం కలిగించేటంతగా ఉంటాయి. నాకు పదమూడేళ్లుగా నిద్రలో నడిచే అలవాటు ఉంది. బాగా కలవరిస్తాను కూడా. ఇంతవరకూ దానివల్ల ఏ ఇబ్బందీ కలగలేదు. కానీ నాకు ఇటీవలే పెళ్లి కుదిరింది. ఆ అమ్మాయితో నా సమస్య నేను చెప్పలేదు. చెప్పకుండా మోసగించడమూ ఇష్టం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? - కె.శ్రీనివాస్ గౌడ్, మెయిల్ స్లీప్ వాకింగ్ శారీరక సమస్యా మానసిక సమస్యా అన్నది తేల్చి చెప్పడం కష్టం. దీన్ని సోమ్నాబ్లిజం అంటారు. ఇది వంశపారంపర్యంగా వస్తుంది. కానీ మొదటి పన్నెండేళ్లూ మీకు ఈ సమస్య రాలేదంటున్నారు. విపరీతమైన మానసిక సమస్యలుంటే.. ఆ ఒత్తిడి వల్ల కూడా కొన్నిసార్లు ఈ సమస్య రావొచ్చు. ఏ విషయమూ మీకు డాక్టరే చెబుతారు. అయితే మీరు దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు ఆయనకు తెలపాలి. మీరు నిద్రలో ఎంతసేపు నడుస్తూంటారో తెలపలేదు. నిద్రలో నడవడం అనేది కేవలం నిమిషంపాటే జరుగుతుంది. కొన్ని కేసుల్లో అరగంట వరకూ కూడా ఉండొచ్చు కానీ అది చాలా అరుదు. నవలల్లోనూ సినిమాల్లోనే ఈ ప్రక్రియని అరగంట వరకూ ఉపయోగించడం జరుగుతుంది. అయితే నిజానికీ సమస్య వయసుతో పాటు తగ్గిపోతుంది. కానీ పాతికేళ్లు వచ్చినా మీకింకా తగ్గలేదంటే మీరు సైకాలజిస్ట్/ సైకియాట్రిస్ట్‌ను కలుసుకోవడం మంచిది. దాని కంటే ముందు మీ అంతట మీరు కొన్ని ప్రయత్నాలు చేయండి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసు కోండి. పడుకోబోయే ముందు మనసును కలచివేసే భయంకరమైన న్యూస్ చూడ వద్దు. శుభ్రమైన బెడ్రూమ్, ఆహ్లాదకర మైన మ్యూజిక్, గాలిలో రవంత పరిమళం మెదడు మీద మంచి ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా గది నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి. గాఢంగా గాలి పీలుస్తూ, నెమ్మదిగా వదులుతూ, కండ రాల్ని కూడా అదే విధంగా బిగించి లూజ్ చేస్తే, సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకోడానికి ప్రయత్నించండి. ఇవన్నీ ఫలించని పక్షంలో సైకాలజిస్ట్/సైకియాట్రిస్ట్‌ను కలవడం మంచిది. అలాగే కలవరించే అలవాటుందని రాశారు. కొందరికి ఇది అస్సలు నచ్చదు. కాబట్టి మీ భార్యకి ముందే చెప్పండి. ఆమెకు దీనిపట్ల ఏహ్య భావం ఉంటే తర్వాత ఇబ్బంది కదా! చివరిగా ఒక విషయం. స్లీప్ వాకింగ్ అనేది సినిమాల్లోనో కథల్లోనో చెప్పేటంత భయంకర మైనది కాదు. ట్రీట్మెంట్ ద్వారా తగ్గిపోయే అవకాశం ఉంది. దీనికి డాక్టర్లు కొన్ని మందులు (డీజపీన్స్) ఇస్తున్నారు. సమస్య మరీ ఎక్కువగా ఉంటే వారిని సంప్రదించండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
మదిలో మెదిలే మాట... బయటకు రాదే!
నేను ఎమ్మెస్సీ పూర్తి చేశాను. బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ప్రిపేరవుతున్నాను. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ మన ఆర్థికశాఖా మంత్రి ఎవరు అని అడిగారు. సమాధానం నాకు తెలుసు. చాలాసార్లు చదివాను. మదిలో మెదులుతూనే ఉంది. కానీ ఎంతకీ గుర్తు రాలేదు. దాంతో మాజీ మంత్రి పేరు చెప్పేశాను. ఇంటర్వ్యూ చేసే ఆయన నవ్వేశారు. ప్రతిసారీ ఇంటర్వ్యూలో ఇదే పరిస్థితి. అన్నీ తెలుసు. కానీ సమయానికి ఒక్కటీ గుర్తు రాదు. ఈ సమస్య తీరేదెలా? - కళ్యాణ్, వైజాగ్ దీన్ని సోషల్ యాంగ్జయిటీ అంటారు. కాలేజీలో చదివే రోజుల్లో ఒక్కసారి కూడా స్టేజి ఎక్కని వారికి, తమపట్ల తమకి అపనమ్మకం ఎక్కువగా ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఉన్నట్టుండి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. పొద్దున్నే లేవగానే అద్దంలో మీ ముఖాన్ని చూసుకుంటూ ఐదు సెకన్లు సన్నగా నవ్వండి. నవ్వినప్పుడు మెదడులో ‘సెరొటొనిన్’ అన్న రసాయనం విడుదలవుతుంది. అది మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. టెన్షన్ వల్ల విడుదలయ్యే ‘కార్టిజాల్’కి వ్యతిరేకంగా పనిచేసే మందు ‘సెరొటొనిన్’. అందుకే పరీక్ష రాసే టప్పుడు, ఇంటర్వ్యూ సమయాల్లోనూ చిరునవ్వుతో ఉండాలి. మనిషి కంగారుగా ఉన్నప్పుడు మెడ దగ్గర చెమట్లు పట్టడం, చేతివేళ్లు వణకటం, గొంతు తడారిపోవడం మొదలైన పరిణామాలు సంభవిస్తాయి. దీనికి కారణం కొన్ని ఎండార్ఫిన్స్. కొంతమందిపై వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ స్నేహితుణ్ని తొందరగా సమాధానం చెప్పమని చెప్పి... ‘నువ్వు బ్యాచిలరా ఆన్మ్యారీడా’ అని అడిగి చూడండి. అతను కంగార్లో బ్యాచిలర్ అంటాడు. నిజానికి రెండూ అని చెప్పాలి. కానీ అలా చెప్పడు. కరాటే ఆటగాడు పోటీలో ప్రవేశించబోయే ముందు ఏ విధంగా గాలిలోకి పంచ్‌లు ఇస్తూ, బలంగా ఊపిరి తీస్తూ మూడ్‌లోకి ప్రవేశిస్తాడో... అదే విధంగా ఇంటర్వ్యూ ప్రారంభానికి ముందు నిమిషం పాటు కళ్లు మూసుకుని బలంగా ఊపిరి పీలుస్తూ ఉండండి. నేను నిర్వహించే వ్యక్తిత్వ వికాస క్లాసుల్లో... సినిమాలు బాగా చూసే విద్యార్థుల్ని స్టేజి మీదికి పిలిచి, ఒక్క నిమిషం టైమ్‌లో పదిహేనుమంది తెలుగు సినిమా హీరోయిన్ల పేర్లు చెప్పమంటే వారికి కూడా మీలాంటి స్థితే సంభవిస్తుంది. పేర్లు తెలియక కాదు. మానసిక వత్తిడి ఎక్కువయ్యేకొద్దీ న్యూరో ట్రాన్స్మీటర్స్ని మెదడు శూన్యంగా చేసేస్తుంది. ఇలాంటి స్థితి నుంచి కొన్ని టెక్నిక్స్ ద్వారా సులువుగా బయట పడవచ్చు. ఇంటర్వ్యూలో ఇలాంటి పరిణామాలు సంభవించకుండా ఉండటానికి ఏం చేయాలో నా వెబ్సైట్ (yandamoori.com)లో వంద టిప్స్ అనే అధ్యాయంలో రాశాను. స్థలాభావం వల్ల అవన్నీ ఇక్కడ రాయలేను కాబట్టి అక్కడ చదివే ప్రయత్నం చేయండి. నేను ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాను. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. బాగా పాడతాను కూడా. అందుకే మ్యూజిక్‌లో డిగ్రీ చేయాలని ఉంది. కానీ మా నాన్నగారికి కళలపై పెద్ద ఇష్టం లేదు. అలాంటివేమీ అక్కర్లేదు, ఎంసెట్ రాసి మెడిసిన్ చేయమంటున్నారు. నాకు ఆసక్తి లేదు. మెడిసిన్ చేయాలంటే చాలా డెడికేషన్ ఉండాలంటారు. అసలు ఇష్టమే లేనప్పుడు నేనెలా మంచి డాక్టర్ని అవ్వగలుగుతాను? ఈ విషయం అమ్మతో చెప్పించినా నాన్న వినడం లేదు. ఆయనకు నా బాధ అర్థమయ్యేలా మంచి సమాధానం ఇవ్వండి. అది చూపిస్తాను. మీలాంటివారు చెబితేనైనా ఒప్పుకుంటారని నా ఆశ. - బిందు, నిజామాబాద్ మీ సమస్య అర్థవంతమయ్యింది. నాకు అర్థమయ్యింది. పిల్లల స్టాండర్డ్ తెలుసుకోలేక పెద్ద పెద్ద ఆశలతో వాళ్లని శాసించి, అన్ని విధాలా నష్టపరిచే తల్లిదండ్రులు కోకొల్లలు. మీ నాన్నగారు కూడా అటువంటి జాబితాలో చేరడం దురదృష్టకరం. నా సమాధానం చూసి మీ నాన్నగారు మనసు మార్చుకుంటారని నేను అనుకోను. మీ బాధను అర్థం చేసుకోగలిగే పెద్దవారు మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే... వారితో నాన్నకు చెప్పించండి. అప్పటికీ వినకపోతే ఎంసెట్ రాయండి. సీట్ ఎలాగూ రాదు కాబట్టి ఆయనే మీ దారికి వస్తారని ఆశిద్దాం. అయితే ఆయన తరఫు నుంచి కూడా ఒక నిమిషం ఆలోచించాలి మీరు. కేవలం మ్యూజిక్‌లో డిగ్రీ సంపాదించడం వల్ల కచేరీలు చేసి ఆర్థికంగా బాగా నిలదొక్కుకోగలరా? లేదా వివాహం చేసుకుని గృహిణిగా స్థిరపడదామను కుంటున్నారా? ఓసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. లేదంటే ప్రైవేటుగా గ్రాడ్యుయేషన్ చేస్తూ మ్యూజిక్‌లో డిగ్రీ చేయండి. ఒకవైపు చదువు, మరొకవైపు అభిరుచి. మంచి కాంబినేషన్! - యండమూరి వీరేంద్రనాథ్ -
నచ్చనిది చేయలేను... నచ్చినట్టు బతకలేను... ఎలా?
జీవన గమనం నా వయసు 24. మంచి ఆడిటర్‌ని కావాలని సీఏని ఓ పవిత్రమైన వృత్తిగా భావించి ఎంచు కున్నాను. కానీ ఆర్టికల్‌షిప్ చేస్తున్న సమయంలో ఆ వృత్తిమీద అసహ్యం ఏర్పడింది. 2013లో నేను మా గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యాను. అందులో మద్యం, డబ్బు కూడా భాగమయ్యాయి. మా నాన్న నేను వద్దన్నా వాటిని పంచారు. నిజాయతీగా బతకాలని, వచ్చింది రూపాయి అయినా దాన్ని నీతిగానే సంపాదించాలనేది నా అభిలాష. కానీ చుట్టూ అవినీతే. సేంద్రియ వ్యవసాయం, ఆధ్యాత్మిక అంశాలంటే నాకు చిన్నప్పట్నుంచీ పిచ్చి. కానీ అమ్మానాన్నలకు ఇష్టం లేదు. దర్జాగా బతక మని పోరుతుంటారు. దాంతో నచ్చినట్టు చేయలేకపోతున్నాన్న బాధ నన్ను నలిపే స్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - ఓ సోదరుడు ప్రతి మనిషికీ గమ్యం (ఉ॥బాగా చదవడం), కోరిక (ఉ॥సినిమాలు చూడటం) అని రెండు ఉంటాయి. ఆ రెంటికీ తేడా ఎక్కువయ్యే కొద్దీ మనిషి కలత పడతాడు. విజయం అంటే ‘బతుకుతున్న జీవిత విధానం పట్ల పూర్తి సంతృప్తితో ఉండటం’. ఇంతకన్నా గొప్ప నిర్వచనం నాకింతవరకూ దొరకలేదు. మీరు ఆర్టికల్‌షిప్ చేస్తున్నప్పుడు మీ యజమాని అవలం బించే విధానాలు చూసి సీఏ వృత్తిమీద అసహ్యం ఏర్పడి ఉండ వచ్చు. లేదంటే అంత కష్టమైన కోర్సు చదవలేని మీ అశక్తతకి అసహ్యం అని పేరు పెట్టుకుని ఉండ వచ్చు. ఏది నిజమో మీరే మీ మనస్సాక్షిని అడగండి. కేవలం మీకు నచ్చలేదు కాబట్టి సీఏ అనేదే ఒక అపవిత్రమైన వృత్తి అనడం తగదు. నేనూ చార్టెడ్ అకౌం టెంట్నే. లంచాలు సంపాదించడానికి ఎన్నో అవకాశాలున్న ప్రభుత్వ ఆర్థిక సంస్థల్లో పదిహేను సంవత్సరాలు పని చేసి, ఇప్పుడు ప్రైవేటు ప్రాక్టీసు చేస్తు న్నాను. ఇంతకాలం లంచాలకు దూరం గానే ఉంటూ వచ్చాను. ఎన్ని అవకాశాలు వచ్చినా నయాపైసా స్వీకరించలేదు. కాబట్టి సీఏ అంటే తప్పకుండా లంచంతో కూడిన వృత్తి అనే అభిప్రాయాన్ని మార్చు కోండి. నిజాయతీగా బతకాలి, నీతిగా సంపాదించాలి అన్నదే మీ అభిలాష అయితే కాదన్నది ఎవరు? మీ చుట్టూ అవినీతి కనిపిస్తూ ఉండొచ్చు. కానీ మీరు నిజాయతీగా బతకవచ్చు కదా! ఇక మీ అభిరుచుల గురించి. సేంద్రియ వ్యవసాయం, ఆధ్యాత్మిక విష యాలంటే మీకు అభిరుచి అని రాశారు. మీరు మీ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నంతకాలం వారు తమ అభిప్రాయా లకు అనుగుణంగా బతకమనే మిమ్మల్ని ఒత్తిడి చేస్తుంటారు. ‘చెరువులో నీళ్లు నచ్చకపోతే బయటకు వచ్చి చచ్చిపో. కానీ జీవితాంతం ఆ నీళ్లలోనే ఈదొద్దు’ అని చేప పిల్లకి సలహా ఇచ్చినట్టు నేను మీకు సలహా ఇవ్వలేను కానీ... వీలైనంత వరకూ వ్యక్తిత్వాన్ని పెంచుకోడానికి ప్రయత్నించండి. ఎవరి ట్యూన్కో నాట్యం చేస్తున్నంతకాలం జీవితం మన చేతుల్లో ఉండదు. జీవి తంలో అన్నిటికన్నా దౌర్భాగ్య కరమైన విషయం తనకు నచ్చినట్టు బతకలేకపోవడం. ముందు ఆర్థిక స్వాతంత్య్రం సంపాదించండి. పరస్పర విరుద్ధమైన అభిరుచులు, కోరికలు పెట్టుకోకుండా ఒకే గమ్యం వైపు సాగండి. నేనొక అమ్మాయిని ప్రేమించాను. నా ప్రేమను తనకు చెప్పినప్పుడు తన గతం చెప్పింది. ఓ అబ్బాయిని ప్రేమించానని, అతనికి అన్ని రకాలుగానూ దగ్గరయ్యానని, ఇద్దరూ విడిపోయారని చెప్పింది. తన నిజాయతీ కారణంగా నేను తనని యాక్సెప్ట్ చేశాను. కానీ తను ఈ మధ్య సడెన్‌గా మారిపోయింది. నాకు ప్రేమ మీద నమ్మకం పోయింది, నువ్వు నాకు మంచి స్నేహితుడిగానే ఉండు అంటోంది. కారణం అర్థం కాక ఆరా తీస్తే... తన పాత లవర్‌కి మళ్లీ దగ్గరయ్యిందని తెలిసింది. నేనేం చేయాలి? తను కోరుకున్నట్టు స్నేహితుడిగా ఉండాలా లేక తనతో అన్ని సంబంధాలూ తెంచేసుకుని నా పని నేను చేసుకోవాలా? - కె.కె.రెడ్డి, మెయిల్ మీరు చెప్పినట్టు మీకు రెండే ఆప్షన్లు. తనతో స్నేహంగా ఉండటం... తనతో సంబంధాలన్నీ తెంచేసుకోవడం. స్నేహితుడిగా ఉండటం వల్ల మీకొచ్చే లాభనష్టాలు బేరీజు వేసుకోండి. ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నారా? లేక కేవలం స్నేహితుడిగానే ఉందామను కుంటున్నారా? సంబంధాలన్నీ తెంచేసు కుంటే మీరు మరింత మనఃస్థిమితంగా ఉంటారేమో ఆలోచించండి. స్నేహితు రాలు ఎవరితో ఉంటోంది, ఎక్కడికి వెళ్తోంది లాంటి ఆరాలు తీయడం, డిటెక్టివ్‌లను పెట్టడం వంటి పత్తేదారు పనులు ఎప్పుడూ మనసులను కలచి వేస్తూ ఉంటాయి. ఆమెను మీరు వివాహం చేసుకునే ఉద్దేశం లేనప్పుడు ఆమె జీవితం ఆమెది, మీ జీవితం మీది. లేదూ కేవలం ఆమెను స్నేహితురాలిగానే చూసే పక్షంలో... ఆమె జీవితంలో మీరు ఒక చిన్న భాగం మాత్రమే. మిగతా భాగంలో ఎవరుంటే మీకు ఎందుకు? ఈ విధంగా ఆలోచిస్తే మనశ్శాంతి దొరుకుతుంది. - యండమూరి వీరేంద్రనాథ్ -
రామ్‌చరణ్‌పై స్టార్ రైటర్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్‌ల అనుబంధం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. 80, 90 దశకాలలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన పలు సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన యండమూరి, కొంతకాలంగా సినీరంగానికి దూరంగా ఉంటున్నారు. అయితే మెగా ఫ్యామిలీతో తన అనుబంధాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. అలాంటి యండమూరి, మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంజనీరింగ్ కాలేజీ ఫంక్షన్‌కు హాజరైన యండమూరి.. చిరుతో కలిసి అభిలాష సినిమాకు పనిచేసే రోజులు గుర్తు చేసుకున్నారు. 'అప్పట్లో చరణ్‌ను హీరోను చేయటం కోసం అతని తల్లి సురేఖ ఎంతో కష్టపడేది. డ్యాన్స్‌లు నేర్పించేది. అప్పట్లో ఆ అబ్బాయి దవడ సరిగా ఉండేది కాదు, తరువాత దాన్ని కూడా సరి చేయించారు. అదే సమయంలో మరో ఎనిమిదేళ్ల కుర్రాడు మాత్రం ఎంతో ప్రతిభ కనబరిచేవాడు. ఇళయరాజా స్వర పరిచిన అబ్బనీ తియ్యనీ దెబ్బ పాట విని, ఇది శివరంజనీ రాగం అని గుర్తుపట్టాడు. దీంతో ఇళయరాజా ఆ అబ్బాయి మెచ్చుకున్నాడు. అతనే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడ'ని యండమూరి తెలిపారు. యండమూరి వివరణ అక్కడితో ఆగిపోలేదు. 'రామ్‌చరణ్ పేరు చెప్పినపుడు మీరు చప్పట్లు కొట్టలేదు. కానీ దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పినపుడు మాత్రం చప్పట్లు కొట్టారు. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ స్వశక్తితో పైకొచ్చాడు. నువ్వు ఏంటీ అన్నది ముఖ్యం. మీ నాన్న ఎవరు అన్నది కాదు' అని వ్యాఖ్యానించారు. గతంలోనూ పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణతి గురించి మాట్లాడి మెగాఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన యండమూరికి ఈసారి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. -
బద్ధకమనే బంధనం... తెంచుకోలేనా?
మన బలహీనతలని మనమే అధిగమించాలి. కృషి, దీక్ష, పట్టుదల ఉంటే తప్ప మీకు ఏ కౌన్సిలరూ సహాయం చేయలేడు. నేను స్వీట్లు మానను అంటే ఎవరేమి సలహా ఇవ్వగలరు? జీవన గమనం నేను డిగ్రీ చదువుతున్నాను. నాకు బద్ధకం చాలా ఎక్కువ. అయితే టీవీ చూడాలని పిస్తుంది లేకపోతే నిద్రపోవాలనిపిస్తుంది. దాంతో చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతు న్నాను. ఈ బలహీనతనెలా అధిగమించాలి? - రసూల్, మెయిల్ బద్ధకం అన్న పదాన్ని మనం సృష్టించుకున్నామే తప్ప దానికి ఒక నిర్దిష్ట మైన అర్థం లేదు. ఒక పని చేయలేక పోవడమన్నది రెండు కారణాల వల్ల జరుగుతుంది. 1. శారీరకంగా బలహీన మైనప్పుడు. 2. మానసికంగా ఆ పని చేయడం ఇష్టం లేనప్పుడు. కొంచెంసేపు చదవగానే ఒక కుర్రవాడు ‘మమ్మీ, అలసిపోయాను’ అంటాడు. ‘కొంచెంసేపు రెస్టు తీసుకోరా’ అని తల్లి అనగానే పుస్తకం విసిరేసి టీవీ ఆన్ చేస్తాడు. అలసి పోయిన కుర్రవాడికి టీవీ చూసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా విశ్లేషించు కుంటే ఈ బద్ధకం అనేది రెండు రకాలుగా కలుగుతుంది. ఒకటి అలసట, రెండు విసుగు. బాగా అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. కాసేపు నిద్రపోవాలనిపిస్తుంది. అలా కాకుండా గంటల తరబడి పక్క మీద నుంచి లేవ కుండా నిద్రపోవడాన్ని ‘హైపర్ సోమ్నియా’ అంటారు. ‘ఇన్సోమ్ని (నిద్రలేమి)’కి ఇది వ్యతిరేక పదం. మీ ఉత్తరం చూస్తుంటే మీకు ఈ వ్యాధి ఉన్నట్టు కనబడటం లేదు. కేవలం టీవీ మీద ఆసక్తి వల్లే చదువుపై శ్రద్ధ తగ్గింది. దానికే మీరు బద్ధకం అని పేరు పెట్టు కున్నారు. మన బలహీనతలని మనమే అధిగమించాలి. కృషి, దీక్ష, పట్టుదల ఉంటే తప్ప మీకు ఏ కౌన్సెలరూ సహాయం చేయలేడు. నేను స్వీట్లు మానను అంటే ఎవరేమి సలహా ఇవ్వ గలరు? టీవీ తీసేయమని మీ తల్లిదండ్రు లకు చెప్పండి. లేదా మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలిగే శక్తిని తెచ్చుకోండి. ఆరోగ్యకరమైన అభిరుచులు అలవాటు చేసుకోండి. అప్పుడు బద్ధకం దానంతట అదే తగ్గిపోతుంది. నేను బీఈడీ పూర్తి చేశాను. ఈమధ్య మావాళ్లు నాకో సంబంధం చూశారు. ఆయనో టీచరు. నాకు చాలా నచ్చారు. కానీ ఆయన నాకంటే పదేళ్లు పెద్దవారని మావాళ్లు ఆ సంబంధం వద్దన్నారు. కానీ నాకు ఆయన్నే చేసుకోవాలనుంది. మంచి వ్యక్తి. చెడలవాట్లు లేవు. కట్నం వద్దన్నారు. మా ఇంటి బాధ్యత కూడా తనే తీసుకుంటానంటున్నారు. అయినా మావాళ్లు అంగీకరించట్లేదు. ఏం చేయాలి? - లక్ష్మీప్రియ, మదనపల్లి భార్యాభర్తల మధ్య పదేళ్ల వయసు తేడా పెద్ద సమస్య కాదు. మీరు ఆయన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు కాబట్టి మీ సమస్య ఆయనతోనే చర్చించండి. ‘మా ఇంటి బాధ్యత తీసుకుంటా నంటున్నారు’ అని రాశారు. అది నాకు అర్థం కాలేదు. మీకు తల్లిదండ్రులు లేరా? మావాళ్లు అంటే ఎవరు? మరింత విపు లంగా రాసివుంటే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం తేలికయ్యేది. రాయలేదు కాబట్టి ఇంతకంటే చెప్పడం కష్టం. నా స్నేహితురాలికి ముప్ఫై అయిదేళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. తనకు పెళ్లి మీద సదభిప్రాయం లేదు. చాలా సంస్థల్లో పని చేసింది కానీ ఎక్కడా ఎక్కువ రోజులు స్థిరంగా లేదు. ఆథ్యా త్మిక గురువుగా మారి జరగబోయేది ముందే ఊహించి చెప్పాలన్నదే తన లక్ష్యమంటోంది. అది సాధ్యం కాదని నాకు తెలుసు. పైగా వాళ్ల కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. తను పెళ్లి చేసుకుని, మంచి వ్యక్తితో సెటిలైతే బాగుం టుందని వాళ్ల ఆశ, నా ఆశ. మనసు గాయ పడకుండా తనని మార్చే మార్గం చెప్పండి. - సురేంద్రకుమార్, బెంగళూరు సురేంద్రగారూ! మీరు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం, వాళ్లు అడక్క పోయినా సలహా ఇవ్వడం, అవతలివారి జీవన విధానం పట్ల అమితంగా శ్రద్ధ తీసుకోవడం, బాధపడటం... ఇవన్నీ ఆరోగ్యకరమైన లక్షణాలు కావు. ఆథ్యాత్మిక గురువుగా మారి, అమాయక ప్రజలకు జరగబోయే భవిష్యత్తును ముందుగా ఊహించి చెప్పి, లక్షలూ కోట్లూ సంపాదించాలన్నది ఆమె ఆలోచన అయితే... అది సాధ్యం కాదని మీరు ఇప్పుడే ఎలా చెప్పగలరు? పెళ్లి చేసుకోవడం చక్కగా ఉంటుందని మీరు ఏ అనుభవంతో చెప్పారో నాకు అర్థం కావడం లేదు. తనను మార్చే ఆలోచన మానుకుని, మీరు మారటమే మంచిదని నా ఉద్దేశం. - యండమూరి వీరేంద్రనాథ్ -
రహస్యంగా పెళ్లాడా... రోజూ బాధపడుతున్నా!
జీవన గమనం బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాను. ఓ అమ్మాయిని ప్రేమించాను. అనుకోని కారణాల వల్ల రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఎవరిళ్లకు వాళ్లం వెళ్లిపోయాం. నాకు బాగా చదివి మంచి స్థాయికి చేరుకోవాలని ఉంది. కానీ అమ్మానాన్నలకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నానన్న బాధ నన్ను తినేస్తోంది. మరోపక్క ఇంట్లోవాళ్లు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. నన్ను తీసుకెళ్లు, లేదంటే నేను బతకలేను, చచ్చిపోతాను అంటూ తను ఏడుస్తోంది. ఈ టెన్షన్లతో చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. ఇవన్నీ ఎలా డీల్ చేయాలో చెప్పండి ప్లీజ్. - ప్రదీప్, ఖమ్మం చదువుకుంటున్నప్పుడే ప్రేమించడం, పైగా రహస్యంగా పెళ్లి చేసుకోవడం, ఆపై ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోవడం... ఇప్పటి వరకూ అన్నీ తప్పులే చేశారు మీరు. ఎలాగూ ఫైనలియర్ కాబట్టి ఇంకో నాలుగైదు నెలల్లో చదువు అయిపోతుంది. అప్పటి వరకూ ఆగమని ఆ అమ్మాయితో చెప్పండి. మీరు చదివిన చదువుకి పెద్ద ఉద్యోగం వస్తుందా అన్నది అనుమానమే. కాబట్టి రిజల్ట్స్ వచ్చేవరకూ ఆగకుండా ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోయి ఆ అమ్మాయిని తెచ్చుకోండి. నిజానికి ఈ సమస్యకు పరిష్కారం చెప్పడం కష్టం. కానీ మీలాగ చదువుకోవాల్సిన సమయంలోనే పెళ్లి చేసుకుని, చదువు మీద ఏకాగ్రత నిలపకుండా, అటు ఆర్థిక స్తోమత లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకునే విద్యార్థుల కోసమే మీ ఉత్తరాన్ని ప్రచురిస్తున్నాం. నా వయసు 52. దాదాపు జీవితం అయిపోవచ్చింది. కానీ ఇంతవరకూ నాకు జీవితాన్ని జీవించినట్టే లేదు. చాలా చిన్న వయసులోనే పెళ్లి చేశారు. కళ్లు మూసి తెరిచేలోగా పిల్లలు పుట్టేశారు. వాళ్లను పెంచడంతోనే ఇప్పటివరకూ సరిపోయింది. ఇన్నేళ్లలో నేను నా భర్తతో కూడా సంతోషంగా గడిపింది లేదు. ఆయన రాత్రీపగలూ కష్టపడి డబ్బు సంపాదించడం, నేను కష్టపడి ఇల్లు చక్కబెట్టడం... ఇదే పని. ఇప్పుడైనా కాస్త ప్రశాంతంగా ఉందామంటే మా పిల్లలు తమ పిల్లల బాధ్యత మాకే అప్పగిస్తున్నారు. నేనిప్పటికే చాలా అలసిపోయాను. ఇక ఏ బరువు బాధ్యతలూ మోసే శక్తి నాకు లేదు. ఆ విషయం చెబితే నన్ను స్వార్థపరురాలు అంటారేమోనని భయం. నేనేం చేయాలి? - వరలక్ష్మి, కోదాడ మనిషి తాలూకు బాధలు రెండు రకాలు... శారీరకం, మానసికం. మానసికమైన బాధలు చాలా రకాలు ఉంటాయి. భయం, దిగులు, ఆందోళన మొదలైనవి. అయితే వీటన్నిటి కన్నా పెద్ద సమస్య మొహమాటం. మనం మొహమాటంగా ఉండేకొద్దీ సొంత పిల్లలు కూడా తమ బాధ్యతలని మనమీద రుద్దేయడానికి ప్రయత్నిస్తారు. మీరు మీవారితో వివరంగా మాట్లాడి, మీ సమస్యను ఆయనకు చెప్పండి. ఎవరో ఏదో అనుకుంటారని బతికేకొద్దీ వారు అనుకుంటూనే ఉంటారు. మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. మీ జీవితం మీది. అందరూ మిమ్మల్ని స్వార్థపరురాలు అనుకోవడం వల్ల మీకొచ్చే నష్టమేమీ లేదు. మనకి ఇష్టం వచ్చినట్టుగా బతికే స్థాయికి ఎదగాలంటే ఆత్మస్థయిర్యం ఉండాలి. వీలైతే ‘తప్పు చేద్దాం రండి’ అన్న పుస్తకం చదవండి. మొహమాటం తగ్గించుకోవడం ఎలాగో అర్థమవుతుంది. నేను స్నేహానికి విలువిస్తాను. కానీ మా ఇంట్లోవాళ్లేమో... నువ్వెప్పుడూ సరిగ్గా చదవని వాళ్లతోనే స్నేహం చేస్తావంటూ తిడుతుంటారు. వాళ్ల ప్రభావంతో నేను చదువులో వెనుకబడిపోతానట. ఇప్పటి వరకూ అలా జరగలేదు. నేనెప్పుడూ బాగానే చదువుతాను. అయితే అవతలివాళ్లు బాగా చదువుతారా అన్నది కాకుండా మంచివాళ్లా కాదా అన్నది మాత్రమే చూసి స్నేహం చేస్తాను. నేనిలా ఆలోచించడం కరెక్టేనా? లేక మావాళ్లు అంటున్నది నిజమా? నేనేం చేయాలి? నా స్నేహితుల్ని వదులుకోవాలా? - పావని, ములుగుర్తి పూర్తిగా మంచి మనస్తత్వమే ఉన్నవారంటూ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. మంచీ చెడుల మేళవింపే మనిషి. ఎవరూ కోరి కోరి చెడ్డవాళ్లతో స్నేహం చేయరు. చివరికి దొంగతనాలు చేసేవాడు కూడా మరో దొంగతోనే ఎందుకు స్నేహం చేస్తాడంటే, దొంగతనం అనేది చెడు కాదని, బతకడానికి అదొక మార్గమని నమ్ముతాడు కాబట్టి. అయితే ఈ కింది వారితో స్నేహం వల్ల మన సమయం వృథా అవుతుంది. మాటల అతిసార వ్యాధితో బాధపడే వాళ్లు (Diarrhea of talking), తమ భావాలు మన మీద రుద్దేవారు, వాదనలతో మనల్ని ఒప్పించేందుకు మన సమయాన్ని వృథా చేసేవారు, పుకార్లను విస్తరింపజేయడం ద్వారా గుర్తింపు పొందాలనుకునేవారు, సూడో తెలివి తేటలతో మనపై అధికారాన్ని చెలాయించాలని అనుకునేవారు. మీ స్నేహితులు బాగా చదువుతారా కాదా అన్నది ముఖ్యం కాదు. వారి ప్రభావం మీమీద ఎంత ఉందన్నదే ముఖ్యం. కాబట్టి పైన చెప్పిన లక్షణాలు మీ ఫ్రెండ్స్‌లో ఉన్నాయోమో ఒకసారి పరిశీలించుకోండి. దాన్నిబట్టి స్నేహాన్ని కంటిన్యూ చేయండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
ఆలోచనల భయం వెంటాడుతుంటే?
జీవన గమనం నాకు కొన్నాళ్లుగా నెగిటివ్ ఆలోచనలు ఎక్కువవుతున్నాయి. అలా జరిగితేనో, ఇలా జరిగితేనో అని ఆలోచించి భయపడుతుంటాను. ఈ మధ్య ఇది మరీ ఎక్కువైపోయింది. నాకు ‘గే’లంటే చాలా భయం. కానీ ఎందుకో ఈ మధ్య నేను కూడా ‘గే’గా మారిపోతానేమో అనిపిస్తోంది. నిజానికి నాలో ఆ లక్షణాలు లేవు. అయినా ఎందుకనిపిస్తోందో! ఈ లక్ష ణాల గురించి నెట్లో వెతికితే దీన్ని యాంగ్జయిటీ డిజార్డరంటారని తెలిసింది. దీన్నుంచి నేనెలా బయటపడాలి? - అశ్విన్ చంద్ర, మెయిల్ భయం రెండు రకాలు. అర్ధరాత్రి పక్క గదిలో చప్పుడు వర్తమాన భయం. వచ్చే నెల పెళ్లికి డబ్బు సమకూరక పోవడం రేపటి భయం. దాన్నే ఆందోళన అని కూడా అంటారు. భయం సమస్య కాదు, బలహీనత. దానివల్ల వచ్చేది సమస్య. పరాయి రాష్ట్రంలో ఉద్యోగం వస్తే కూతుర్ని పంపకపోవడం, వాస్తు బాలేదని బంగారం లాంటి ఇల్లు వదులుకోవడం, భార్య పారిపోతుందన్న భయంతో మాంగల్యానికి నాలుగో ముడి వేయడం లాంటివన్నీ భయం తాలూకు పరిణామాలే. భయానికి అభద్రతాభావం కూడా ఒక కారణం. ఆడిటోరియంలో ముందు సీట్లు ఖాళీగా ఉన్నా వెనుక వరుసల్లో కూర్చునే విద్యార్థులు ఈ కోవలోకి వస్తారు. మనం భయపడే కొద్దీ అవతలివారు మన బలహీనతలతో ఆడుకుంటారు. ‘ఈ ఉత్తరాన్ని వందమందికి పంపకపోతే నీ బతుకు బస్టాండ్ అవుతుంది’ అని రాస్తాడొకడు. ‘ముఖద్వారం మార్చకపోతే నీ వ్యాపారం మటాష్’ అంటాడు ఇంకొకడు. ‘కడుపు మీద ఊచతో ఎర్రగా కాల్చకపోతే నీ కొడుక్కి కడుపు నొప్పి తగ్గదు’ అంటాడు మరొకడు. మీరెప్పుడైనా గమనించారా! చాలా మంది క్రికెటర్ల మణికట్లకి తాళ్లకట్లు, మెడలో దండలు మెండుగా కనబడుతూ ఉంటాయి. బహుశా వారి తల్లిదండ్రులు కట్టించి ఉంటారు. ఆ క్రికెటర్లకి బాగా డబ్బుంది కాబట్టి, ఎక్కడ డబ్బుంటే అక్కడ అభద్రతా భావం, ఎక్కడైతే ఒక అభద్రతా భావం ఉంటుందో ఆ భావాన్ని నిరంతరం పెంచుతూ ఉండటానికి అక్కడ ఒక బాబానో జ్యోతిష్యుడో ఉంటారు. వాళ్లు వీళ్ల తల్లిదండ్రుల్లో భయాన్ని ప్రవేశపెట్టి, తమ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. రంజీ ఆడేవారిక్కూడా తాయెత్తులుంటాయి. కానీ యాభైమంది రంజీ ఆటగాళ్లలో కేవలం ఒకరే దేశానికి సెలెక్ట్ అవుతారు. వారు దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే ఇక్కడ బాగా ఆడాలి. ఆటకి కావలసింది ప్రత్యర్థి ఎత్తుకి పై ఎత్తు. తాయెత్తు కాదు. ఇదంతా ఎందుకు చెప్పానంటే... మీది సమస్యే. కానీ నెట్లో వెతికి ఒక నిర్ణయానికి రాకండి. మంచి కౌన్సెలర్‌ను కలుసుకుని మీ సమస్యను వివరించండి. ప్రతి మనిషిలోనూ కొన్ని నెగిటివ్ ఆలోచనలుంటాయి. ముఖ్యంగా ఓ లక్ష్యమూ పనీ లేనివారికి ఇలాంటి ఆలోచనలు మరింత ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి మీరు ముందు ఓ మంచి వ్యాపకం కల్పించుకోండి. ఊపిరి సలపనంత పనిలో మునిగి, ఆ పనిని ఆస్వాదించడం ప్రారంభించండి. అప్పుడు మీ మనసులో ప్రవేశించడానికి భయానికి అసలు చోటే దొరకదు. నేను పీజీ చేసి ఈ మధ్యనే ఉద్యోగంలో చేరాను. కష్టపడి పనిచేసే తత్వం నాది. కానీ చాలా త్వరగా ఎమోషనల్ అయిపోతాను. ఎవరైనా నా పనికి కాస్త వంక పెట్టినా బెంగ వచ్చేస్తుంది. నన్ను ఇలా అన్నారే అని దాని గురించే చాలాసేపు ఆలోచిస్తుంటాను. అది కరెక్ట్ కాదని తెలిసినా కంట్రోల్ చేసుకోలేను. అర్థం పర్థం లేని ఇలాంటి ఎమోషన్సని కంట్రోల్ చేసుకోవడం ఎలా? - సంజీవ్, విశాఖపట్నం నాలుగైదు వాక్యాల్లో దీనికి సమా ధానం రాయడం కష్టం. భావోద్వేగాల్ని ఎలా నియంత్రించుకోగలమన్న టెక్నిక్స్‌ని వివరంగా చెప్పాల్సి ఉంటుంది. ఎమోషన్ మేనేజ్మెంట్ గురించి చాలా పుస్తకాలు వచ్చాయి. నేనే విజయానికి అయిదు మెట్లు, మైండ్ పవర్, లోయ నుంచి శిఖరానికి మొదలైన పుస్తకాల్లో ఈ విషయం గురించి చాలా చర్చించాను. వీలైతే ఆ పుస్తకాలు చదవండి. కేవలం చదవడం కాదు, ఆచరణలో పెట్టండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
మంచితనాన్ని వాడేసుకుంటే ఎలా?
జీవన గమనం నేనో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిని. నాకు జూన్‌లో నిశ్చితార్థం జరిగింది. తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఆచార వ్యవహారాలన్నీ మా చెల్లెలు, బావగారి చేత చేయించాను. దుర దృష్టవశాత్తూ కొద్ది రోజుల తర్వాత మా బావ గారు ఓ ప్రమాదంలో చనిపోయారు. అందుకు కారణం నా పెళ్లి బాధ్యతలు తీసుకోవడమేనని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎంతమంది చెప్పినా వినిపించుకోకుండా తెగతెంపులు చేసుకోవాలని చూస్తున్నారు. అల్పజ్ఞానులు అనుకుందామంటే అమ్మాయి తండ్రి విద్యుత్ సంస్థలో మంచి స్థాయిలో ఉన్నవారు. ఇప్పుడు నేనేం చేయాలో సలహా ఇవ్వండి. - కృష్ణ, వికారాబాద్ ఉద్యోగంలో మంచి స్థాయిలో ఉన్నాడా, కింద స్థాయిలో ఉన్నాడా అన్నది కాదు చర్చ. మానసిక స్థాయి, హేతుదృష్టి (రేషనలిజం), పరిస్థితిని అర్థం చేసుకునే విధానం మొదలైనవన్నీ ఉద్యోగం మీద ఆధారపడి ఉండవు. ఆ సంగతి పక్కన పెడదాం. మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే... రేపు వాళ్ల ఇంట్లో ఏ అనర్థం జరిగినా, దానికి మిమ్మల్నే కారణ భూతుల్ని చేస్తారు. అంత దేబిరించుకుని వివాహం చేసుకోవలసిన అవసరం మీకుందా? లేదా నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆ అమ్మాయి మీకు బాగా నచ్చి, మరొకరిని వివాహం చేసుకోవడానికి మీ మనసు అంగీకరించపోతుంటే... ఆమెతో డెరైక్ట్‌గా మాట్లాడండి. తల్లిదండ్రుల్ని ఎదిరించి వచ్చి వివాహం చేసుకునే ధైర్యం ఆమెకు ఉంటే, ఆపై ఏం చేయాలా అని మీరు ఆలోచించుకోండి. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు. మీరన్నట్టు వాళ్లు అల్ప జనులే. మూర్ఖుల మనసు రంజింపజాలము అన్నాడో ప్రముఖ కవి. కాబట్టి అలాంటివారికి దూరంగా ఉండటమే మంచిది. నేను ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నాకు చదువు మీద ఏమాత్రం శ్రద్ధ లేదు. మరేదైనా చేయాలని పిస్తోందా అంటే అదీ లేదు. నా లక్ష్యం ఏమిటో, అసలు నాకు దేనిమీద ఆసక్తి ఉందో కూడా అర్థం కావడం లేదు. నా మెదడు ఎందుకిలా తెల్ల కాగితంలా తయారయ్యిందో తెలియడం లేదు. ఇదేమైనా మానసిక సమస్యా? - అంకిత్, చెన్నై మనం చేస్తున్న పని మీద ఉత్సాహం లేనప్పుడు మెదడు తెల్ల కాగితంలానే తయారవు తుంది. చదువు మీద శ్రద్ధ లేకపోవడం తప్పు కాదు కానీ ఏ గమ్యం లేక పోవడం తప్పు. ప్రతి మనిషిలోనూ మరో మనిషి నిద్రిస్తూ ఉంటాడు. అతడిని నిద్ర లేపాలి. అతడికి ఇష్టమైన పనేదో తెలుసు కుని, దాన్ని హాబీగా పెట్టుకుంటే అప్పుడు గమ్యంవైపు ఆనందంగా వెళ్లవచ్చు. మీలో ఏ కళ ఉన్నదో ఒక నిర్ణయానికి రండి. దాని సాధన ప్రారంభించండి. జీవితం బాగుండటానికి అదే మొదటి మెట్టు. నేనో మధ్య తరగతి వ్యక్తిని. బంధాలకు విలువిస్తాను. బాధ్యతలను ఇష్టంగా మోస్తాను. అలా అని నా మంచితనాన్ని అందరూ అడ్వాంటేజ్‌గా తీసుకుంటే తట్టుకోలేకపోతు న్నాను. బంధువులంతా ఎప్పుడూ ఏదో ఒక సహాయం అడుగుతూనే ఉంటారు. పనుల్లో సహాయమైతే ఫర్వాలేదు. కానీ ఆర్థిక సాయం చేయలేని పరిస్థితి. అలా అని చెప్పినా విని పించుకోరు. నువ్వయితే కాదనవనే నీ దగ్గరకు వచ్చాం అంటూ ఇబ్బంది పెట్టేస్తుం టారు. ఈ పరిస్థితి నుంచి ఎలా బయట పడాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వండి. - రంగనాయకులు, నెల్లూరు భయం తర్వాత మనిషికి అత్యంత ప్రమాదకరమైన జబ్బు మొహమాటం. ఒకమ్మాయి క్లాస్మేట్స్ చాలామందికి వేసవి సెలవుల్లో పెళ్లిళ్లయ్యాయి. శుభలేఖ ఇచ్చిన ప్రతి ఫ్రెండ్ పెళ్లికీ ఆమె వెళ్లింది. కొన్ని నిశ్చితార్థాలకి కూడా అటెండ్ అవ డంతో చదువులో వెనకబడింది. గ్రాడ్యు యేషన్లో మంచి మార్కులతో పాసయినా సివిల్స్ ప్రిలిమ్స్‌లో దారుణంగా ఫెయిలైంది. ఇటువంటి సందర్భాల్లో ‘నో’ చెప్ప లేని బలహీనత, ఎవరేమనుకుంటారో అన్న మొహమాటం, ఆత్మ న్యూనత, ఐడెంటిటీ క్రైసిస్ మిళితమై ఉంటాయి. ఇవ్వడం వల్ల వచ్చే ఆనందం కన్నా... కోల్పోయేదాని వల్ల వచ్చే విషాదం ఎక్కువైతే దాన్ని ‘మొహమాటం’ అంటారు. కోల్పోయేదాని వల్ల వచ్చే విషాదం కంటే, ఇచ్చేదాని వల్ల వచ్చే ఆనందం ఎక్కువైతే దాన్ని ‘దాతృత్వం’ అంటారు. అవతలివారు మనతో ఎలావుంటే మనకి బావుంటుందో మనం చెప్పకపోతే వారికి ఎలా తెలుస్తుంది? ఇతరులకి ‘నో’ చెప్పడం మనల్ని వారికి దూరం చేయవచ్చు. కానీ ‘ఎస్’ చెప్పడం మనల్ని మనకి దూరం చేస్తుంది. ఇతరుల కోరికలకీ మన ఇబ్బందులకీ మధ్య సరైన గీత గీసుకోగలిగితే మానవ సంబంధాలు బావుంటాయి. ఈ ప్రశ్న మీ పేరు మీదే పంపించారో, మరో పేరు పెట్టారో తెలియదు. మీ పేరు రంగనాయకులై, మీరు నెల్లూరు నుంచే రాసి ఉంటే కనుక ఈ పత్రిక కాపీని జిరాక్స్ తీయించి మీ బంధువులందరికీ పంపించండి చాలు. - యండమూరి వీరేంద్రనాథ్ -
అనుమాన భూతాన్ని తరిమేదెలా?!
జీవన గమనం నేను ఇంటర్ చదువుతున్నాను. ఈ మధ్య ఇంటర్వ్యూల గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా సాఫ్ట్ స్కిల్స్ అనే మాట వినిపిస్తోంది. అసలు దానికి అర్థం ఏమిటి? వాటిని ఎవరు నేర్పుతారు? - రవివర్మ, ఊరు రాయలేదు ఇంటర్వ్యూల్లో ఎంపిక రెండు అంశాల ఆధారంగా జరుగుతుంది... హార్డ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్. మొదటిది మీ చదువుకు సంబంధించినది. మీ మార్కులు, సబ్జెక్టుల్లో మీకున్న పరిజ్ఞానం మొదలైన విషయాలపై మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. రెండో విభాగం మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించినది. నాయకత్వ లక్షణాలు (గ్రూప్ లీడింగ్), మాట్లాడే విధానం, అర్థం చేసుకునే పద్ధతి, ఒత్తిడిలో సైతం పని చేయగలిగే నైపుణ్యం మొదలైన అంశాలను పరీక్షిస్తారు. వీటినే సాఫ్ట్ స్కిల్స్ అంటారు. వీటిలో అన్నిటికంటే ముఖ్యమైనది కమ్యునికేషన్. మీరు చెప్పేది అవతలివారికి అర్థమవుతోందా? అవతలివారికి అర్థమయ్యే భాషలో, స్థాయిలో మీరు మాట్లాడగలుగు తున్నారా? అలాగే వారు చెప్పేది మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? ఈ విషయాలన్నీ కూడా కమ్యునికేషన్‌లోకి వస్తాయి. ఎక్కువ జీతం ఆశించేవారికి ఈ స్కిల్స్ తప్పనిసరి. అయితే దురదృష్ట వశాత్తూ చాలా కాలేజీలు చదువుకు తప్ప, సాఫ్ట్ స్కిల్స్‌కి ఎక్కువ ప్రాముఖ్యత నివ్వడం లేదు. పరీక్షల్లో పాసవడమే ముఖ్య ఉద్దేశంగా చదువు నేర్పుతున్నారు. విద్యార్థులు కూడా చదువు పూర్తయిన తర్వాతే సాఫ్ట్ స్కిల్స్ ప్రాముఖ్యత తెలుసు కుంటున్నారు. మీకు సబ్జెక్టు తెలుసు అన్న విషయం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి అవగతమవ్వాలంటే... మాట్లాడే కెపాసిటీ మీకుండాలి కదా! దానికితోడు మీపై మీకు నమ్మకం, ధీమా ఉండాలి. వాటినే సాఫ్ట్ స్కిల్స్ అంటారు. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవడం, గ్రూప్ డిస్కషన్స్‌లో పాల్గొనడం, అవకాశం వచ్చినప్పుడు స్టేజి ఎక్కి మాట్లాడటం మొదలైన పద్ధతుల ద్వారా ఈ స్కిల్స్‌ని పెంపొందించుకోవచ్చు. గుడ్డిగా ప్రేమించకూడదు, వెనుకా ముందూ చూసుకుని ప్రేమించాలి అంటూ ఉంటారు. నాది ప్రేమ వివాహం కాదు. అన్నీ పరిశీలించి పెద్దలు చేసిన వివాహం. కానీ పెళ్లయ్యీ అవ్వగానే అతడి నిజస్వరూపం నాకు తెలిసింది. అతడో అనుమాన పిశాచి. పాలవాడి దగ్గర్నుంచి కూరగాయల వాడి వరకూ ప్రతి ఒక్కరి విషయలోనూ సందేహమే. దానికితోడు ఆడది పడివుండాలి అనే తత్వం. అతను ప్రేమగా చూసుకుంటే పడివుండ టానికి నాకే అభ్యంతరం లేదు. కానీ అనుమానించి హింసించేవాడి మీద ప్రేమ ఎలా ఉంటుంది? అతని దగ్గర పడివుండాలని ఎందుకనిపిస్తుంది? ఈ విషయం నేనెంత చెప్పినా సర్దుకుపోవాలి అంటున్నారు మా ఇంట్లోవాళ్లంతా. మీరు చెప్పండి... నేను సర్దుకుపోవాలా? - సరళ, హైదరాబాద్ నా స్నేహితుడి కూతురికి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త విపరీతంగా సిగరెట్లు తాగుతాడు. ఆ అమ్మాయికి ధూమపానం అస్సలు పడదు. మొదట్లో మర్యాదగా చెప్పి చూసింది. వినలేదు. విడాకులిస్తానని బెదిరించింది. అయినా మానలేదు. ఆ సమయంలో ఆమెకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడం మొదలుపెట్టాయి. క్రమక్రమంగా కృంగిపోసాగింది. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేది. ఒక స్టేజిలో సైకాలజిస్టులకి కూడా చూపించారు. దీనికంతటికీ కారణం భర్త నుంచి శారీరకంగా దూరంగా ఉండటమే అని ఒక మానసిక శాస్త్రవేత్త చెప్పాడు. ఆమె భర్తను దగ్గరకు రానివ్వకపోవడానికి కారణం సిగరెట్టు అని బయటపడిన తర్వాత అతడు భార్యను వదులుకోవాలా, సిగరెట్టు మానేయాలా అనే సందిగ్ధంలో పడి... చివరికి ధూమపానాన్నే వదిలేశాడు. మూడు నెలల కాలంలోనే ఇదంతా జరిగింది. అతడు పొగ తాగడం మానేసిన మూడేళ్లకు గానీ ఆమె ఆ విధంగా సామ దాన భేద దండోపాయాలైన నాలుగింటిలో చివరిదాన్ని ఉపయోగించి, తన కోరిక నెరవేర్చుకుందన్న విషయం అతడికి తెలియలేదు. మొత్తమ్మీద ఎలాగైతేనేం... సాధించింది కదా! మగవాడికి భార్య పట్ల అనుమాన ప్రవృత్తి ఏర్పడటానికి చాలా కారణాలు ఉండవచ్చు. పెళ్లికి ముందు అనుభవాలు, ఇంట్లో సభ్యులు లేక దగ్గరి బంధువుల క్యారెక్టర్ పట్ల అనుమానాలు, బాల్యంలో చూసిన దృశ్యాలు, స్నేహితుల ద్వారా విన్న చౌకబారు విషయాలు, వివాహత్పూర్వం తనకున్న స్త్రీల పరిచయాలు... ఇలాంటివెన్నో అనుమాన పిశాచాన్ని సృష్టిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆత్మన్యూనతా భావం. తనమీద తనకి నమ్మకం లేకపోవడం. వ్యక్తిత్వం పెంచుకోవడానికి ఆర్థిక స్వాతంత్య్రం ముఖ్యం. మీకు రెండే మార్గాలు. అతడిని మార్చడం లేదా మీరు మారటం. అతన్ని మార్చాలనుకుంటే ఏం చేయాలో పై ఉదాహరణ చెబుతోంది. రకరకాలుగా ప్రయత్నించి చూడండి. అప్పటికీ అతడు మారకపోతే మళ్లీ రెండు మార్గాలు. అతని నుంచి విడిపోయి ఉండటం లేదా అతడు చెప్పినట్టు పడివుండటం. కలిసి ఉంటే మాత్రం చాలామంది ఆడవాళ్ల లాగే ‘కాలమే అతణ్ని మారు స్తుంది’ అనుకుంటూ, అతడు మారే వరకూ పాము పుట్టల్లో పాలు పోస్తూ భగవంతుడిని ప్రార్థించడం తప్ప చేయగలిగినదేమీ లేదు. - యండమూరి వీరేంద్రనాథ్ -
అలా చేయడం తప్పా?!
జీవన గమనం నేనో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిని. నాకు ఎవరైనా రూల్స్ పాటించకపోతే నచ్చదు. ఆఫీసులో కొలీగ్స్ నుంచి రోడ్డు మీద ఆటోవాడి వరకూ ఎవరు నియమాలు తప్పినా సహించ లేను. అలా చేయడం తప్పు కదా అని నిలదీసి అడిగేస్తాను. అది ఎవరికీ నచ్చదు. నీకు అవసరమా అంటారు. తనే పెద్ద సిన్సియర్ అయినట్టు అని కొందరు ఎగతాళి కూడా చేస్తున్నారు. నేనిలా చేయడం తప్పా? - శంకర్రావు, జీడిమెట్ల సమాజంలో జరుగుతోన్న అక్రమా లను చూసి ఆవేశం రావడం, రక్తం మరగడం సాధారణమే. అయితే ‘పరిస్థితి అలా తయారవడానికి మనం కూడా దోహదపడుతున్నామా’ అనే విషయం ఆలోచించుకోవాలి. దీన్నే ఇంగ్లిష్‌లో ‘సెల్ఫ్ రియలైజేషన్’ అంటారు. ఉదాహరణకి రోడ్డు పక్కన చెత్త చూసి, మీరు ప్రభుత్వం మీద కోపం తెచ్చుకున్నారనుకుందాం. ఇంట్లోని చెత్త మీరెప్పుడైనా రోడ్డుమీద పడేశారా అన్నది ఆలోచించుకోవాలి. సినిమాలో లంచగొండి పోలీసు అధికారి మీద హీరో ఉమ్మేసినప్పుడు ప్రేక్షకులంతా చప్పట్లు కొడతారు. చిత్రమేమిటంటే, వాళ్లలో చాలామంది లంచగొండులు ఉంటారు. ఒక వర్షం కురుస్తున్న రాత్రి ఆటోవాడు రెట్టింపు చార్జీ అడిగితే, కోపం రావడం సహజమే. ఎందుకంటే మీ బల హీనతతో అతడు ఆడుకుంటున్నాడు కాబట్టి. అయితే పాస్‌బుక్ కోసం ఒక రైతు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు లంచం అడిగితే, ఇతరుల బలహీనతలతో ఆడు కునే వారిలో మీరు కూడా ఒకరవుతారు. అప్పుడు మీకు ఆటోడ్రైవర్ మీద కోపం తెచ్చుకునే అధికారం లేదు. ఇలా ఆలో చిస్తే, మనలో కూడా అవే లోపాలుంటే, ఆవేశం తగ్గిపోతుంది. లేదూ మీరు సిన్సియర్‌గా ఉన్నారంటే... ఓ మంచి అభిరుచిని ఏర్పరచుకోండి, ఆవేశం అదే తగ్గుతుంది. సమాజంలో ఏఏ పరిస్థితుల వల్ల ఉద్వేగం కలుగుతోందో వ్యాసాలుగా రాసి పత్రికలకి పంపండి. ఫేస్బుక్లో పోస్టులు, బ్లాగులు పెట్టడం కూడా ఓ పద్ధతి. దీన్నే ‘ఔట్-లెట్’ అంటారు. అంతర్గత ఆవేశానికీ ఉద్విగ్నతకీ కారణ మైన పరిస్థితుల పట్ల ప్రతిస్పందించ డానికి చాలామంది కళాకారులు ఎన్నుకునే పద్ధతి ఇది. మంచి ఫలితం ఉంటుంది. కులమతాలు పట్టించుకోకుండా, కట్న కానుకలు తీసుకోకుండా పెళ్లాడాను. పదేళ్లు కాపురం చేసి, బాబు పుట్టాక ఆమె అక్రమ సంబంధాల వైపు పరుగెత్తింది. నేను వ్యతిరే కించినా విడాకులు సాధించుకుంది. వేరొక రితో సహజీవనం చేస్తోంది. నేను మా కుటుం బీకుల ప్రోత్సాహంతో ఓ డైవర్సీని పెళ్లాడాను. ఆవిడకు ఎదిగిన కూతురుంది. ముగ్గురం అన్యోన్యంగా ఉంటున్నాం. అయితే నా మొదటి భార్య మా బాబుని నాకు దూరం చేసింది. వాడికి నాపై చెడు అభిప్రాయాన్ని పెంచి నా దగ్గరకు రాకుండా చేసింది. అది నేను తట్టుకో లేకపోతున్నాను. ఏం చేయాలి? - ఓ సోదరుడు, బెంగళూరు మీరు అడిగిన ప్రశ్నకి మొదటి ఐదు వాక్యాలూ అవసరమా? ‘నేను చాలా గొప్ప పని చేశాను, నా భార్య నీచమైన మనస్తత్వం కలది’ అన్న అభిప్రాయం మీ ప్రశ్నలో ఎక్కువగా కనిపిస్తోంది. మొదటి భార్యను వదిలేసినప్పుడు ఆమెతో పాటు మానసికంగా మీ బాబును కూడా వది లేయడానికి సిద్ధపడాలి. మీ రెండో భార్య మాజీ భర్త ఆమెనీ, ఆమె కూతుర్నీ కొంత కాలం తన దగ్గరకు పంపించమంటే మీరు ఎలా ఫీలవుతారో, బహుశా మీ మొదటి భార్య కూడా అలాగే ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. మీరిప్పుడు అన్యోన్యంగానే ఉన్నారు కాబట్టి మొదటి భార్యతో బంధం పూర్తిగా తెంచుకోండి. జిలేబి తింటూ డయాబెటిస్ తగ్గాలంటే ఎలా? మోహం ఎక్కువైతే వ్యామోహం అంటారు. వ్యామోహం ఎక్కువైతే తాపత్రయం అంటారు. తాపం అంటే కోరిక. త్రయం అంటే మూడు. ‘నేను బావుండాలి, నన్ను బాగా ఉంచడం కోసం అవతలివారు బాధపడినా నేను బావుండాలి, నేను పోయాక కూడా నావాళ్లు (మాత్రమే) బావుండాలి’ అనే మూడు కోరికలే తాప త్రయం. ఇదే అన్ని విషాదాలకీ మూలం. నేనో సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నప్పుడు ఓ క్యాబ్ డ్రైవర్ నన్ను రెగ్యులర్‌గా డ్రాప్ చేసే వాడు. తను నన్ను ప్రేమించాడు. మొదట కాదన్నా నన్ను దేవతలాగా చూడటం చూసి నేనూ ప్రేమించాను. మావాళ్లు ఒప్పుకున్నారు. కానీ ఉద్యోగాలు, స్తోమత కారణంగా తేడాలు వస్తాయంటూ తన ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేశారు. అప్పుడే నాకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం రావడంతో వెళ్లాల్సి వచ్చింది. తర్వాత కూడా ఇద్దరం టచ్‌లో ఉన్నాం. పెళ్లికి డేట్ ఫిక్స్ చేశారని తను చెబితే ‘వెయిట్ చేస్తే చెయ్యి, లేదంటే తననే చేసుకో’ అన్నాను. కోపం వచ్చి ఫోన్ పెట్టేశాడు. తర్వాత ఎన్నిసార్లు చేసినా దొరక లేదు. చాలా రోజులు ప్రయత్నించి, తన ఫ్రెండ్స్‌ని కాంటాక్ట్ చేస్తే తనకి పెళ్లైపోయిందని చెప్పారు. నంబర్ అడిగితే నాకు ఇవ్వొద్దన్నా డని అన్నారు. నా గుండె పగిలిపోయింది. తను లేకుండా నేను బతకలేను. తనని నేను మర్చిపోలేను. ఇప్పుడు నేనేం చేయాలి? - ప్రియాంక, ఆస్ట్రేలియా అతడిని మర్చిపోవడం తప్ప మీకింకో మార్గం ఏముంది చెప్పండి! రంభ తా వలచి వచ్చిన అనే సామెత గుర్తుందిగా! మీరు దేబిరించేకొద్దీ అతనికి మీమీద ప్రేమ తగ్గడమే కాకుండా అసహ్యం కూడా ఏర్పడుతుంది. కాబట్టి మీరు అతడిని మర్చిపోవడమే మంచిది. గుండెలు పగలటాలూ, మళ్లీ అతుక్కోవడాలూ మామూలే. కాలమే అన్ని గాయాలనూ మానేలా చేస్తుంది. కొంతకాలం ఇతర అభిరుచుల్లో నిమగ్నమైతే మనసు సర్దు కుంటుంది. జీవితాన్ని ఎప్పుడు కావా లంటే అప్పుడు ఫ్రెష్‌గా ప్రారంభించ వచ్చు. ఈ సూత్రాన్ని అర్థం చేసుకుంటే ఆనందంగా ఉండగలరు. - యండమూరి వీరేంద్రనాథ్ -
ప్రేమా గీమా వద్దంటోంది... ఎలా?
జీవన గమనం * నాకు నలుగురు పిల్లలు. వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిపోయారు. నాకు పిల్లలంటే పిచ్చి ప్రేమ. ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నారో కనుక్కుంటూ ఉంటాను. అయితే ఒక్కోసారి వాళ్లు... బాగానే ఉంటాం, ఎందుకంత కంగారు అని విసుక్కుంటున్నారు. వీలయితే మేమే చేస్తాం కదా అంటారు. దాంతో నా మనసు చివుక్కుమంటుంది. మావారు కూడా, అస్తమానం ఫోన్లు ఎందుకు అంటుంటారు. పిల్లల మీద ప్రేమ చూపించడం తప్పా? - లక్ష్మి, నాయుడుపేట జీవితంలో గొప్ప గొప్ప విషాదాలకి కారణం... ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు. అయితే వాటికంటే తీవ్రమైన అసంతృప్తి... ప్రేమించడానికి ఎవరూ లేకపోవడం. దానికన్నా దారుణమైనది... ప్రేమ హద్దులు దాటడం! అందుకే ఆర్థిక, కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నవారి కన్నా ప్రేమ కారణంగా చనిపోయినవారే ఎక్కువ. ఏది ఎంతవరకు కావాలో, ఏది ఎప్పుడు వదులుకోవాలో తెలుసుకోలేకపోవడమే మోహం. అది ఓ అనారోగ్యకరమైన అటాచ్మెంట్. బంధం వల్ల విషాదం వస్తుందని తెలుసుకోవడమే జ్ఞానం. ప్రేమ హద్దులు దాటితే మోహం. మోహం ముదిరితే వ్యామోహం! ప్రేమకూ మోహానికీ తేడా ఏంటని అలెగ్జాండర్ అడిగినప్పుడు, అరిస్టాటిల్ రెండే రెండు వాక్యాల్లో అద్భుతంగా చెప్పాడు... ‘ఇష్టపడిన పువ్వును కోయడం మోహం. ఆ పువ్వునిచ్చిన మొక్కకు నీరు పోయడం ప్రేమ’ అని. దూరంగా ఉన్న సంతానం గురించి బాధపడే తల్లిదండ్రుల కోసం బుద్ధ చరిత్రలో గొప్ప కథ ఉంది. బుద్ధుడి శిష్యుల్లో సారిపుట్ట ప్రథ ముడు. దాదాపు బుద్ధుడంతటి గొప్ప వాడు అనిపించుకున్న అతను, దేవతలకు కూడా నిర్వాణయోగం బోధించేవాడట. అతనికి చిన్న వయసులోనే ప్రాణ సంకట మైన వ్యాధి వచ్చింది. మరణం ఆసన్న మైనదని తెలుసుకుని, బుద్ధుడి దగ్గరకు వెళ్లి... ‘మరణించే ముందు నా తల్లికి క్షమాపణలు చెప్పుకోవాలి, ఆమె అంగీ కారం లేకుండా చిన్న వయసులోనే నేనిక్కడకు వచ్చేశాను’ అని అనుమతి అడిగాడు. బుద్ధుడు అంగీకారం తెలిపాడు. సారిపుట్ట అసలు పేరు సారిపుత్ర (సారి అనే స్త్రీ కొడుకు). వద్దంటున్నా వినకుండా కొడుకు బౌద్ధారామాల్లో చేరిపోయాడని తల్లికి కోపం. కొడుకు మరణం దగ్గర పడిన సంగతి ఆమెకు తెలీదు. మనసు మార్చుకుని వెనక్కి వస్తున్నాడనుకుని ఆశగా వెళ్లి, అతడింకా సన్యాసి దుస్తుల్లోనే ఉండటం చూసి హతా శురాలవుతుంది. మాట్లాడమని కొడుకు బతిమాలినా వినకుండా వెళ్లిపోతుంది. మరణం ఆసన్నమవుతుండగా ఒక చిత్రం జరిగింది. అతడు పడుకున్న గదితో పాటు, నగరమంతా ప్రకాశించసాగింది. ఆ వెలుగు చూసి తల్లి అక్కడికి వచ్చించి. ఆ వెలుగుకు కారణం దేవతలు. తమ గురువు ఆఖరి శుభవచనం వినడానికి ఆ గదిలోకి ప్రవేశిస్తున్నారు. ఆమె చేష్టలుడిగి చూస్తోంది. సాక్షాత్తూ దేవతలు తన కొడుకు ముందు చేతులు జోడించి వరుసలో నిలబడుతున్నారు. అప్పుడే కొడుకు అవసాన దశ గురించి కూడా ఆమెకు అవగతమయ్యింది. తన కోరిక ఎంత స్వార్థమైనదో అర్థమయ్యింది. చేతు లెత్తి నమస్కరించి మంచం పక్కన నేల మీద వాలిపోయిందామె. వారించి పక్కన కూర్చోబెట్టుకున్నాడు కొడుకు. అతడి కోరిక తీరింది. దేవతలంతా వింటూండగా నాలుగు సత్యాలు (వీటినే బౌద్ధంలో ఫోర్ నోబెల్ ట్రూత్స్ అంటారు) చెబుతూ శరీర బంధ విముక్తుడయ్యాడు. ఆత్మీయులు దూరంగా ఉండటం దుఃఖమే. తల్లిదండ్రులతో, తోబుట్టువు లతో కలిసి ఉండాలని పిల్లలకు మాత్రం ఉండదా! పైకి ఎంత హుషారుగా కన బడినా తమ వాళ్లందరినీ వదిలేసి వెళ్తున్నా మన్న బాధ వారికీ లోలోపల ఉంటుంది. కానీ ఆశయం కోసం త్యాగాలు తప్పవు. * నేను ఫార్మా-డి చేస్తున్నాను. నాకో మరదలు ఉంది. తనని నేనెంతో ప్రేమిస్తున్నాను. కానీ తను... ఫ్రెండ్స్‌లా ఉందాం, ప్రేమా గీమా వద్దు అంటోంది. తననెలా ఒప్పించాలి? - శివతేజ, ఊరు రాయలేదు ఆమె ఎందుకు ఒప్పుకోవడం లేదు? మిమ్మల్ని భర్తగా చూడటం ఇష్టం లేకా? తల్లిదండ్రులు ఒప్పుకోరని భయమా? మొదటిదే కారణం అయితే... మిమ్మల్ని ఆ దృష్టితో చూడలేని అమ్మాయిని చేసుకుని మీరేం సుఖపడతారు? ఒకవేళ రెండో కారణం అయితే, ఆమె తండ్రి మీ బంధువే కాబట్టి ఆయనతోనే మాట్లాడి ఒప్పించండి. అన్నిటికన్నా ముందు మీరు మీ చదువు పూర్తి చేయండి. ఉద్యోగస్తుడైతే అడిగే అర్హత కూడా మీకు లభిస్తుంది. ఈలోపు మీ శక్తి, ఏకాగ్రత, నిద్రలేని రాత్రుల ఆలోచనలు... అన్నీ చదువు మీదే ఉపయోగించండి తప్ప ఆమెను ఎలా ఒప్పించాలా అని కాదు. - యండమూరి వీరేంద్రనాథ్ -
చచ్చిపోతానని బెదిరిస్తోంది... ఏం చేయను?
జీవన గమనం డిగ్రీ పూర్తి చేశాను. నాకు పాటలు పాడటం ఇష్టం. సినీ రంగంలో ప్రయత్నించాలని ఉంది. కానీ అమ్మ, నాన్న ఒప్పుకోవడం లేదు. వాళ్లు చెప్పిన రంగంలోనే అడుగిడాలని బలవంతం చేస్తున్నారు. నేను దాన్ని ఎంజాయ్ చేయలేనని ఎంత చెప్పినా వినడం లేదు. ఏం చేయాలో తోచక కుమిలిపోతున్నాను. అమ్మానాన్నలకు నా బాధ అర్థమవ్వాలంటే ఏం చేయాలి? - అక్షర, హైదరాబాద్ ప్రస్తుతం చాలామంది యువతకున్న సమస్య ఇది. మనకు ఒక రంగంలో ఇష్టం ఉంటుంది. తల్లిదండ్రులకేమో మనం ఇంకో పని చేస్తే బాగుంటుందని అని పిస్తుంది. కొంతవరకూ మీ తల్లిదండ్రులు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పాలి. మీ సమస్యకు ఉత్తమమైన పరిష్కారం ముందు మీరు మీ సంపాదనపై నిలబడటం. జీవితపు ప్రారంభ దశలో మనకిష్టమైన వృత్తిని చేపట్టడం కుదరక పోవచ్చు. మన అభిరుచికి వ్యతిరేకంగా, డబ్బు కోసం, ఇష్టం లేని వృత్తిని చేపట్టాల్సి రావొచ్చు. అప్పుడేం చేయాలంటే... ఆర్థికంగా నిలదొక్కు కోవడం కోసం ముందు మీరు ఒక ఉద్యోగంలో చేరండి. తర్వాత మీకిష్టమైన వృత్తిలోకి మారండి. కానీ మీకిష్టమైన ఆ వృత్తి మీకు జీవితాధారం ఇవ్వగలిగేంత ఆర్థిక వనరుల్ని సమకూర్చేదై ఉండాలి. అలా సమకూర్చే వృత్తి కాకపోతే... బతకడం కోసం మొదటి వృత్తిలోనే కొనసాగి, మరోవైపు మీ అభిరుచిని కొనసాగించండి. అప్పుడు జీవితంలో నిరాకస్తత పోతుంది. ఒకవేళ మీ అభిరుచి ఆర్థికంగా నిలదొక్కు కునే వీలున్నదైతే... కొంతకాలానికి అదే మీ వృత్తి అవుతుంది. నేనో ప్రభుత్వ ఉద్యోగిని. జనంలో కలిసిపోయి, జనం కోసం పని చేసే ఉద్యోగం నాది. సమస్యలు చెప్పుకోడానికి, సహాయం కోరడానికి చాలామంది ఫోన్ చేస్తారు. వారిలో ఆడవాళ్లూ ఉంటారు. అది నా భార్యకు నచ్చదు. మహిళల దగ్గర్నుంచి ఫోన్‌వస్తే పెద్ద రాద్ధాంతం చేస్తుంది. మొదట్నుంచీ తనకు అనుమానమే. తన గొడవ పడలేక కాలేజీ ఫ్రెండ్‌కి కూడా దూరమైపోయాను. చివరికి బంధువుల్లో ఆడవాళ్లతో మాట్లాడినా తట్టుకోలేదు. ఏమైనా అంటే చచ్చిపోతానని బెదిరిస్తుంది. పిల్లల కోసమని భరించేకొద్దీ దీనికి అంతం లేకుండా పోతోంది. ఈ నరకం నుంచి నాకు విముక్తి దొరకదా? - పాండురంగ ప్రసాద్, విజయనగరం మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారో స్పష్టంగా చెప్పలేదు. ఉద్యోగరీత్యా ఆడవారికి ఏ రకంగా సహాయపడుతూ ఉంటారు? ఫోన్లు ఆఫీసు టైమ్‌లోనే వస్తాయా లేక అర్ధరాత్రి కూడా వస్తుంటాయా? బంధువుల్లో ఆడవారితో భార్య ఈర్ష్య పడేంతగా మాట్లాడాల్సిన అవసరం నిజంగా ఉందా? ఇలా కూడా ఆలోచించవచ్చు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు చూసుకుంటే... కొందరు ఆడవాళ్లు అలానే ఉంటారు. అభ్రదతా భావం, విపరీతమైన ప్రేమ ఉన్నవాళ్లని నిరంతరం అనుమానం వెంటాడుతూనే ఉంటుంది. ఎంత చెప్పినా వినరు. వాళ్లను బాధపెట్టకుండా సహ జీవనం చేయడం తప్ప వేరే దారి లేదు. వీలయినంత వరకూ ఆఫీసు సమయం లోనే సహాయం చేస్తూ ఉండండి. అదొక్కటే మార్గం. నేను ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాను. నా లక్ష్యం ఉస్మానియాలో ఎంబీబీఎస్ చేయడం. అయితే నాతోపాటు కోచింగ్ తీసుకుంటున్న ఒక అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్నాడు. పదే పదే డిస్టర్బ్ చేయడంతో కాన్సన్ట్రేషన్ తప్పుతోంది. అతణ్ని ఎలా అవాయిడ్ చేయాలో అర్థం కావడం లేదు. నేనెలా అయినా నా లక్ష్యాన్ని సాధించాలి? ఏం చేయాలో సలహా ఇవ్వండి. - తన్మయి, మెయిల్ ఆ అబ్బాయి మిమ్మల్ని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తున్నాడు? నిజంగా మీకు చదువే గమ్యం అయితే ఆ అబ్బాయిని అవాయిడ్ చేయడం అంత కష్టం కాదు. మీ నాన్న గారికి చెప్పండి. లేదంటే మీ ప్రిన్సిపల్‌తో చెప్పండి. అదీ సాధ్యం కాని పక్షంలో మీకు తెలిసిన సర్కిల్లో ఎవరైనా పెద్దవారికి చెప్పండి. ఇంటర్ చదివే కుర్రాడిని భయపెట్టి మీ నుంచి దూరం చేయడం అంత కష్టమైన పనేమీ కాదు. కానీ మీ ఉత్తరం చూస్తుంటే, అతణ్ని అవాయిడ్ చేయడం మీకే ఇష్టం లేదేమో అనిపిస్తోంది. అతను మీ వెంట పడుతూ ఉండాలి, మీరు కాదంటూనే ఉండాలి. ఒకవేళ మీ స్థితి ఇలాంటిదయితే మాత్రం మీరు చదువు మీద అస్సలు దృష్టి నిలపలేరు. - యండమూరి వీరేంద్రనాథ్ -
గురువును పెళ్లాడటం... తప్పు కాదా?!
జీవన గమనం నేనొక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాను. నేను చేస్తోన్న ఉద్యోగం నాకు సుఖాన్నిస్తోంది. కానీ నా నమ్మకాలకు వ్యతి రేకంగా పని చేస్తేనే ఆ ‘సుఖం’ నాకు లభి స్తోంది. ఇలా నమ్మకాలకి, మరింత సుఖపడ టానికి మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు ఎలా సమన్వయపరచుకోవాలి? ఏదో ఒకదాన్ని వదులుకోవాల్సిందేనా? - నన్నపనేని, సామర్లకోట ‘నా నైతిక విలువల్ని వదులుకోవాలా, సుఖాన్ని వదులుకోవాలా’ అన్నది మీ ప్రశ్న. హోటల్లో ఇడ్లీ తింటున్నప్పుడు పక్క వాడి పూరీని చూసి, తప్పు నిర్ణయం తీసు కున్నామేమో అని బాధపడితే ఇడ్లీ ఏ మాత్రం సంతృప్తినివ్వదు. మీ ఉద్యోగం మీకు సుఖాన్నిస్తోంది కానీ సంతృప్తినివ్వ ట్లేదని రాశారు. ఒక పని సంతృప్తినివ్వక పోవడానికి కారణం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి - శారీరకంగా మనం ఆ పని చేయలేకపోయినప్పుడు. ఉదాహరణకి, రోగంతో బలహీనమైన వ్యక్తి రైల్వే కూలీగా పనిచేస్తే చాలా బాధపడవలసి ఉంటుంది. రెండోది - మానసికంగా ఆ పని ఇష్టం లేకపోయినప్పుడు. ఉదాహర ణకి, సృజనాత్మకత ఉన్న ఒక కళాకారిణి బ్యాంక్‌లో రొటీన్ ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు చాలా నిరాసక్తత ఆవహి స్తుంది. మూడోది - చేస్తున్న పనికి, సిద్ధాంతాలకు నిరంతర ఘర్షణ జరుగుతున్నప్పుడు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కూడా లంచాలు, కమీషన్లు ఉంటాయి. మీ సమస్య మూడోదే అనుకుంటున్నాను. నైతిక విలువల పట్ల నమ్మకం ఉన్న వ్యక్తికి, పక్క సీట్లో కూర్చుని లంచాలు తీసుకుం టున్న వ్యక్తి రోజురోజుకీ ధనవంతుడవడం చూసి... ‘తనకున్న నైతిక విలువ గొప్పదా ధనం విలువ గొప్పదా’ అన్న సంఘర్షణ మొదలవుతుంది. మీ సమస్య ఇదే అయితే ముందొక నిర్ణయం తీసుకోండి. సుఖం అనేది రెలిటివ్ టర్మ్. దానికి అంతు లేదు. డబ్బు నిశ్చయంగా సుఖాన్ని స్తుంది. కానీ ఆనందాన్ని ఇస్తుందన్న గ్యారంటీ లేదు. ప్రస్తుతం మీకు బతకటానికి లోటు లేదు కదా! నిరంతరం ‘నేను చాలా మంచివాడిని, అందుకే నాకిన్ని బాధలు’ అని మనసులో సంఘర్షిస్తూ ఉంటే ఆనందం ఎప్పటికీ దొరకదు. నేను నైతిక విలువలు కోల్పో మని మిమ్మల్ని ప్రోత్సహించట్లేదు. ఘర్షణను వదులుకుని జీవించమని చెప్తున్నానంతే. లంచం పొందడానికి వీలున్న కుర్చీలో కూర్చుని కూడా నిజాయితీగా బతికేవాడి మొహంలో ఉండే ప్రశాంతత, విలువలు కోల్పోయిన వ్యక్తి ముఖంలో ఉండదు. కష్టపడి సంపాదించే డబ్బు సంతృప్తినిస్తుంది. ఇది నేను అనుభవంతో చెబుతున్న మాట. నేను డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాను. మా కాలేజీలో ఒక లెక్చెరర్ దగ్గర సాయంత్రం ట్యూషన్ చెప్పించుకుంటున్నాను. ఓ రోజు ఆయన ఒంటరిగా ఉన్న నా దగ్గరకు వచ్చి నేనంటే ఇష్టమని చెప్పారు. నేనేం మాట్లాడ లేదు. గురువును ప్రేమించడం తప్పు అని నా ఉద్దేశం. కానీ ఆయన తనకే దురుద్దేశం లేదని, నేను కూడా సెటిలయ్యాక మా పేరెంట్స్‌తో మాట్లాడి పెళ్లి చేసుకుంటానంటున్నారు. ఆయనను నమ్మాలా? లేక నో చెప్పాలా? - సుజిత, నకిరేకల్ ఇందులో ‘నమ్మటం’ అన్న ప్రసక్తి ఎక్కడుంది? మీ అభ్యంతరం కేవలం ఆయన మీ ‘గురువు’ అన్నదొక్కటే అయితే, మిగతా అన్ని విషయా ల్లోనూ ఆయన కరెక్టుగా ఉంటే.. ఏమాత్రం సంశయించకుండా వివాహం చేసుకోవచ్చు. అయినా గురువును పెళ్లాడటం తప్పు అని ఎక్కడా రాసి లేదు. ఈ రోజుల్లో బీటెక్ పాసయిన కుర్రాళ్లే తర్వాతి సంవత్సరం లెక్చెరర్స్గా మారు తున్నారు. మీ ఉత్తరాన్ని బట్టి అతను మంచివాడిలానే కనిపిస్తున్నాడు. వయ సులో ఎక్కువ తేడా లేకపోతే నిరభ్యంత రంగా పెళ్లి చేసుకోవచ్చు. బెస్టాఫ్ లక్. నేను ఎమ్మెస్సీ చదువుతున్నాను. కానీ నాది ఇంకా చిన్నపిల్లల మనస్తత్వమే అని అందరూ అంటుంటారు. మా నాన్న అయితే ఎక్కడ పడితే అక్కడే తిట్టేస్తుంటారు. నాకు చాలా బాధనిపిస్తోంది. నిజానికి ఏ పని ఎలా చక్క బెట్టాలో నాకు తెలియదు. అందుకే అందరూ అనేది నిజమేనేమో, నాకంత జ్ఞానం లేదేమో అనిపిస్తోంది. హాస్టల్లో ఉండి చదివితే మైండ్ మెచ్యూరవుతుందని విన్నాను. నేనెప్పుడూ హాస్టల్లో లేను. అందుకే నా మైండ్ ఎదగలేదా? - సునీల్, అనంతపురం ఒక తాగుబోతు తండ్రి కన్నా, పిల్లల్ని సరిగ్గా పెంచలేని తండ్రి నికృష్టుడు అని ఎక్కడో చదివాను. ఎదిగిన పిల్లల్ని అందరి ముందూ తిడితే వాళ్ల మనస్తత్వంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రతి తండ్రీ తెలుసుకోవాలి. మీకు జ్ఞానం లేక పోవడానికి (కనీసం మీరు అలా అను కుంటూ ఉండడానికి) కారణం మీ తండ్రి ఒక్కరే కాకపోవచ్చు. ఏదేమైనా, హాస్టల్లో ఉండి చదువుకుంటే మైండ్ మెచ్యూర్ అవుతుందనుకోవడం నూరుపాళ్లూ నిజం కాదు. మీరు ఎలానూ మరికొంత కాలానికి ఉద్యోగంలో ప్రవేశిస్తారు. అప్పుడు సహజంగానే ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది. చదువు ఆఖరి దశలో ఇల్లు వదిలి హాస్టల్లో చేరితే కొత్త సమస్యలు రావచ్చు. కాబట్టి దాని గురించి ఆలోచించకుండా కొంతకాలం ఆగండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
నాకంటే నాలుగేళ్లు పెద్దది... పెళ్లాడవచ్చా?
జీవన గమనం నాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఎనిమిదో తరగతి, అమ్మాయి ఆరో తరగతి. ఈ మధ్య వాళ్లిద్దరూ డిబ్బీల్లోంచి డబ్బులు దొంగిలించి, బయట అవీ ఇవీ కొనుక్కుని తింటున్నారు. దాదాపు ఎనిమిది వందల రూపాయలు అలా ఖర్చు చేశారు. వాళ్లు స్కూలు నుంచి వచ్చేసరికి ఫుడ్ రెడీగా ఉంచుతాం. అయినా వాళ్లు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ అలవాటును మాన్పించి వాళ్లని సరైన మార్గంలో ఎలా పెట్టాలి? - పవన్, మెయిల్ ఎనిమిది వందలు దొంగతనం చేసేటంతగా వాళ్లు ఏం తిన్నారు? బయట తినడం కోసమే వాళ్లు దొంగతనం చేస్తున్నారని మీరెలా నిర్ధారణకి వచ్చారు? నెల రోజుల్లో ఎనిమిది వందలు ఖర్చు పెట్టారంటే, స్నేహితులందరూ కలిసి తింటున్నారా? ముందు ఆ విషయం కనుక్కోండి. ఇది తిండికి సంబంధించిన వ్యవహారంలా అనిపించడం లేదు. ఇకపై డబ్బులు కనబడకుండా దాచేయడమే దీనికి పరిష్కారం. వాళ్ల దొంగతనం మీకు తెలిసిందన్న విషయం వాళ్లకి తెలిసేలా చేయాలి. కొట్టినా, తిట్టినా అది ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. సున్నితంగా వ్యవహరించి తెలుసుకోండి. వాళ్ల దొంగతనం విషయం మీకు తెలిసిందని గ్రహించిన తర్వాత కూడా వాళ్లు అదే పని చేస్తుంటే కనుక, ఎవరైనా మనస్తత్వ శాస్త్ర నిపుణుడి దగ్గరకు తీసుకు వెళ్లండి. నేను ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువు తున్నాను. నాకు మా ఇంగ్లిష్ మేడమ్ అంటే చాలా ఇష్టం. ఆవిడకు కూడా నేనంటే ఇష్టం. తను ఒక అనాథ. నాకంటే నాలుగేళ్లు పెద్ద. అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది మా వాళ్లకి ఇష్టం లేదు. నేను నా ఇష్టానికి ప్రాధాన్యతనివ్వాలా లేక కుటుంబానికా? - గోపీకిషన్, అనంతపురం ఏదైనా సమస్యకి పరిష్కారం ఆలోచించ వలసి వచ్చినప్పుడు... మనకు కలిగే లాభాలు, వచ్చే నష్టాలు రెండూ ఆలోచించుకోవాలి. ఈ లాభనష్టాలనేవి మానసిక, ఆర్థిక అంశాలతో పాటు సెంటిమెంటుకు కూడా సంబంధించినవి. ఒక నిర్ణయం తీసుకున్న ప్పుడు దానివల్ల మనకే కాకుండా ఇత రులకు వచ్చే సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకి మీకు పెళ్లి కావలసిన చెల్లెళ్లు ఎవరైనా ఉండి, మీది చాలా సనాతనమైన ఆచారాల కుటుంబం కనుక అయితే... మీ ఈ చర్య వల్ల మీ తరువాతి వారికి వివాహం జరగకపోయే పరిస్థితులు వస్తాయనుకుంటే, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మీ ప్రశ్నకి సమా ధానం చెప్పాలంటే ఇంకా లోతుగా వివరాలు కావాలి. మీ తల్లిదండ్రుల మన స్తత్వం ఎలాంటిది? మీరు తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్లు కృంగి, కృశించి పోతారా? లేక కొంత కాలానికి మామూ లుగా అయిపోతారా? ఇది బయటివారి కన్నా మీకే బాగా తెలుస్తుంది. అన్నిటి కన్నా ముఖ్యమైనది... మీరు ఇంజినీరింగ్ తప్పకుండా పాసవుతారా? ఒకవేళ మీరు ఇంటి నుంచి బయటికొచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటే, మీకు వెంటనే ఉద్యోగం దొరుకుతుందా? ఒకవేళ దొరక్కపోతే ఆవిడ మిమ్మల్ని పోషించగలరా? మీరు ఆమె కన్నా వయసులో చిన్నవారు అన్నది సమస్య కానే కాదు. మీరిద్దరూ మానసికంగా ఎదిగారా లేదా అన్నదే ఇక్కడ సమస్య. ఒకరిని ప్రేమించాను. సర్వస్వం అర్పించాను. తన కోసమే జీవిస్తున్నాను. కానీ తను నాకు మాత్రమే సొంతం కాలేని పరిస్థితి. అలా అని తన ప్రేమ మీద నాకు అనుమానం లేదు. తనకి నేనంటే ప్రాణం. నాకంటే ముందే తన జీవితంలో ఉన్న భార్యని వదిలెయ్యమని చెప్పలేను. ఎందుకంటే దానివల్ల ఆయనకు సమస్యలు వస్తాయి. కానీ తనకి దూరంగానూ ఉండలేను. తనని బాధపెట్టకుండా ఉండాలంటే నా మనసును రాయి చేసుకోవాలి. తన ప్రేమ ఒక్కటే చాలని అనుకోవాలి. అలా అనుకోవడం చాతకాక నలిగిపోతున్నాను. ఏం చేయమంటారు? - ఓ సోదరి తన భార్యతో ఉంటూ మీ సర్వస్వాన్నీ స్వాహా చేసిన వ్యక్తి పట్ల మీ ‘ప్రేమ’ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ కౌన్సిలర్ల దగ్గరకు నెలకో నాలుగు కేసులు ఇలాంటివే వస్తాయి. భార్యతో సుఖంగా సంసారం చేసుకుంటూ, సమాజంలో గౌరవంగా బ్రతుకుతూ, ఒక పెళ్లి కాని అమ్మాయిని అనుభవించేవాడు... ఇంట్లో కడుపు నిండా భోజనం ఉన్నా, బయట తిండికి ఆశపడే మనస్తత్వం ఉన్నవాడు. మీకు అతడి వల్ల పిల్లలు పుట్టినా... వారికి సమాజంలో గౌరవప్రదమైన స్థానం దొరక్కపోవచ్చు. మీలాగే వాళ్లూ బాధ పడవచ్చు. అయినా ఇప్పుడు సమస్య అతనిది కాదు, మీది. మీరు చిన్నపిల్ల కాబట్టి, తన సంసారానికి ఢోకా లేనంతవరకూ మీతో ఇలా ఉంటున్నాడు. మీకు కొంత వయసు వచ్చిన తర్వాత మీపట్ల మొహం మొత్తినా, అతని పిల్లలు ఎదిగివచ్చి తన సెక్యూరిటీకి భంగం కలుగుతుంది అనుకున్నా... నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని వదిలేస్తాడు. మీకు అతని పట్ల ఉన్నది ప్రేమ కాదు, వ్యామోహం. దాన్ని తగ్గించుకుని, ఒక మంచి అభిరుచిని పెంచుకుని, జీవితాన్ని మరోవైపు మళ్లించుకోండి. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించే (మిమ్మల్నొక్కరినే) వ్యక్తిని ఎన్నుకోండి. బెస్టాఫ్ లక్. - యండమూరి వీరేంద్రనాథ్ -
తనపై ఆసక్తి పోయింది... ఇప్పుడెలా?
జీవన గమనం నా వయసు 40. నాకు ఒక్కతే కూతురు. వయసు పద్దెనిమిదేళ్లు. నా భర్త, నేను విడిగా ఉంటున్నాం. నా కూతురూ నేనే ఉండటం వల్ల తనమీద విపరీతమైన ప్రేమను పెంచుకున్నాను. మొన్నీ మధ్య వరకూ తను ప్రతి విషయం నాతో చెప్పేది. ప్రతి విషయానికీ నామీదే ఆధారపడేది. కానీ ఇప్పుడు తను స్వతంత్రంగా ప్రవర్తిస్తోంది. అది నేను భరించలేకపోతున్నాను. ఏం చేయాలి? - ప్రతిభ, వెంట్రప్రగడ మీ అమ్మాయి తన పనులు తాను చేసుకుంటోంది... అంతే కదా! అలా కాకుండా ప్రతి విషయానికీ మీమీదే ఆధారపడి ఉంటే, ‘పద్దెనిమిదేళ్లు దాటినా నా కూతురు ప్రతి చిన్నదానికీ నామీదే ఆధారపడుతోంది, ఏం చేయాలి’ అంటూ ఇదే శీర్షికకి మీరు ఉత్తరం రాసి ఉండేవారు. చెప్పాలంటే చాలామంది సింగిల్ పేరెంట్స్‌కి వచ్చే సమస్య ఇది. తమ పిల్లలు ఎమోషనల్‌గా, సైకలాజికల్‌గా తమ మీదే ఆధారపడాలని కోరుకుంటారు. నిజానికి యుక్త వయసు వచ్చిన పిల్లలు, తల్లిదండ్రుల పరిధి నుంచి దూరంగా వెళ్లడం ఎంతో సర్వ సాధారణమైన విషయం. కాబట్టి మారాల్సింది మీరే. ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపయినా మీ అమ్మాయి మిమ్మల్ని విడిచి వెళ్లిపోవలసిందే కదా! మొదట్లో కొంత శూన్యత ఉంటుంది. తర్వాత అలవాటు అవుతుంది. అందుకే మీరు ఇప్పట్నుంచీ ఏదైనా మంచి అభిరుచిని పెంచుకోండి. బంధంలో ఇరుక్కోకుండా మనల్ని ‘మంచి అభిరుచి’ కాపాడుతుంది. అలాగే మీకు నచ్చిన మతగ్రంథం చదవండి. పాజిటివ్‌గా ఆలోచించి ప్రశాంతంగా ఉండండి. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తను కూడా నన్ను ప్రేమించింది. మేము ప్రేమించుకోవడం మొదలుపెట్టి ఒక సంవత్సరం అయ్యింది. కానీ అప్పుడే నాకు తనమీద నిరాసక్తత వచ్చేసింది. కొత్తదనం లేనట్లు అనిపిస్తోంది. పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఇలా ఒకే వ్యక్తితో ఉండాలా అని ఓ రకమైన కాంప్లెక్స్‌కి లోనవుతున్నాను. నిజానికి నేను ఉద్యోగం కూడా ఎక్కడా సంవత్సరానికి మించి చేయను. ప్రతిసారీ కొత్తదనాన్ని కోరుకుంటాను. ఈ కాంప్లెక్స్ నుంచి బయటపడే మార్గం చెప్పండి. - రఘువర, రాజమండ్రి ప్రతిసారీ కొత్తదనాన్ని కోరుకుంటాను అని రాశారు. అంటే భోజనం, దుస్తులు... అన్నీ సంవత్సరం అయ్యేసరికి మారుస్తున్నారా? లేక ఉద్యోగాన్ని, ప్రియురాలిని మాత్రమేనా? ఎంత కొత్తదనాన్ని ఆశించేవాడైనా సంవత్సరానికో పెళ్లి చేసుకోడు కదా! మీకు నిరాసక్తత వచ్చింది మీ స్వభావం వల్ల కాదు. ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించకపోవడం వల్ల. ఈ కోణంలో ఓసారి ఆలోచించి చూడండి తెలుస్తుంది. ప్రేమ వేరు. బంధం వేరు. మీకు సంతానం కలిగి, ఒక పొదరిల్లు నెమ్మదిగా అల్లుకోవడం మొదలుపెడితే రోజూ కొత్తగానే ఫీలవుతారు. పిల్లలతో తప్పటడుగులు వేయించడం నుంచి అక్షరాలు దిద్దించడం వరకు ప్రతి విషయాన్నీ ఆస్వాదిస్తారు. వివాహబంధం లేకుండా ప్రేమించుకోవడమే చేశారు కాబట్టి బహుశా మీకది బోరు కొట్టింది. దాన్ని మీ మనస్తత్వానికి అన్వయించుకుని అదేదో కాంప్లెక్స్‌లాగా బాధపడుతున్నారు. మనం చాలా విషయాల్ని రొటీన్‌గానే కొనసాగిస్తుంటాం. ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. ఒక నెల భోజనం, మరొక నెల పులిహోర, ఆపై బిర్యానీ, తర్వాత చపాతీలు అంటూ వెరైటీగా తినం కదా! దుస్తులు, ఇల్లు అనే ఉదాహరణ ఇచ్చింది అందుకే! నేను ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్నాను. ఇక్కడ మా బాస్ తన ఆఫీస్ పనులన్నీ మాతోనే చేయిస్తాడు. దాంతో వర్క్‌లోడ్ ఎక్కువై ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. మెమోలు ఇచ్చేది బాసే కదా! అందుకే మొహమాటంతో ఆయన ఎంత పని చెప్పినా ‘నో’ అనలేకపోతున్నాను. ఈ సమస్య నుంచి బయటపడేదెలా? - రామోజీ, నల్లమర్ల మీరు మొహమాటంతో ‘నో’ చెప్పలేకపోతున్నారా లేక మీ ఉద్యోగం బాసు మీద ఆధారపడి ఉంది కాబట్టి నో చెప్పలేకపోతున్నారా? మీ ఉద్యోగాన్ని తీసేసే అధికారం మీ బాసుకి ఉన్నట్లయితే మీకు రెండే దార్లు. ఆయన చెప్పిన పనంతా చేయడం లేదా ఉద్యోగాన్ని వదిలేయడం. కానీ మీరు మొహమాటం అన్న పదం వాడారు. ఒకవేళ మీరు నో చెప్పినా కూడా మీ బాస్ మిమ్మల్ని ఏమీ చేయలేడు అనుకున్నా, మీ ప్రమోషన్‌కి అడ్డుపడే అధికారం ఆయనకి ఏమాత్రం లేకపోయినా... ‘ఆ పని నేను చేయ(లే)ను’ అని నిర్మొహమాటంగా చెప్పేయండి. అలా చెప్పడానికి కూడా మొహమాటం అయితే... ఆఫీసులో ఎన్ని గంటలు పని చేసినా తరగని పని ఒత్తిడి, మీరు నిర్వహిస్తోన్న బాధ్యతల గురించి వివరంగా ఉత్తరం రాసి ఆయన టేబుల్ మీద పెట్టండి. ఏం చేయాలన్నా ముందు మీ బాస్‌కి ఉన్న అధికారాల గురించి నిర్దిష్టమైన అవగాహనకు వచ్చి, ఆ తర్వాత చేయండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
బాయ్‌ఫ్రెండ్‌ని కలవడం తప్పా?!
జీవన గమనం నేను బీటెక్ పూర్తిచేశాను. సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేయాలని ఉంది. కానీ ఇంటర్వ్యూలకు వెళ్లాలంటే భయంగా ఉంది. ఎందుకంటే నాకు నత్తి. సరిగ్గా మాట్లాడలేను. సైకియాట్రిస్టులు నత్తిని పోగొడతారని విన్నాను. నిజమేనా? - లక్ష్మి, బెంగళూరు నత్తికీ ఉద్యోగానికీ సంబంధం లేదు. కొన్ని ఇంటర్వ్యూ కమిటీలలో నేను మెంబర్ని. మీకు సదరు సాఫ్ట్‌వేర్‌లో ప్రవేశం ఉందన్న నమ్మకం ఇంటర్వ్యూ కమిటీకి కలిగిస్తే, (మీరు అప్లై చేసిన ఉద్యోగానికీ, నత్తికీ సంబంధం లేకపోతే) ఎవరూ మీ వైకల్యం గురించి పట్టించుకోరు. ఇహ మీ నిజ జీవితంలో సమస్య గురించి: నత్తి రెండు రకాలు. శారీరకంగా వచ్చినది, మానసికంగా వచ్చినది. శారీ రకమైన నత్తిని పోగొట్టడానికి నాకు తెలిసి, మందులేమీ లేవు. మానసికమైన నత్తిని సైకాలజిస్టులు పోగొట్టే వీలుంది. మీరు సైకియాట్రిస్టులు అనే పదం వాడారు. మానసిక రోగాల్ని ‘మందుల ద్వారా’ తగ్గించేవారు సైకియాట్రిస్టులు. మానసిక ఇబ్బందులని ‘మాటల ద్వారా’ తొలగించే వారు సైకాలజిస్టులు. మీ అవసరం సైకా లజిస్టులతో ఉన్నది. నెమ్మదిగా, సున్ని తంగా, ఆవేశపడకుండా మాట్లాడే టెక్నిక్స్ నేర్పి, ధైర్యం కలిగించి, మాట్లాడటాన్ని ఒక పద్ధతిలో పెట్టటం ద్వారా వారు నత్తిని పోగొడతారు. ప్రయత్నించండి. నేను ఓ స్కూల్లో టీచర్ని. ఓరోజు మార్కెట్‌కి వెళ్లినప్పుడు తొమ్మిదో తరగతి విద్యార్థిని అక్కడ తారస పడింది. తను నాకు చాలా నచ్చింది. తనని అలానే చూస్తూ ఉండి పోయాను. తనూ అంతే. మెల్లగా నాకు తనంటే ఇష్టం ఏర్పడింది. వాళ్ల నాన్న మొబైల్ నంబర్‌కి మెసేజ్ చేస్తే, రిప్లై ఇచ్చింది. రెండు నెలల తర్వాత నేను ఉద్యోగానికి రాజీనామా చేసి కాంపిటీటివ్ పరీక్షలకు కోచింగ్ తీసుకోవడం మొదలు పెట్టాను. ఓరోజు ఆ అమ్మాయి ఫ్రెండ్ కనబడితే నాకు ఆ అమ్మాయంటే ఇష్టమని తనతో చెప్పాను. తను వెళ్లి ఏం చెప్పిందో కానీ ఆ రోజు నుంచీ ఆ అమ్మాయి నాతో మాట్లాడటం మానేసింది. మెసేజ్ ఇస్తే రిప్లై ఇవ్వదు. ఎందుకలా మారిపోయిందో అర్థం కావడం లేదు. నేను చదువు మీద మనసు పెట్టలేకపోతున్నాను. ఓ విద్యార్థిని పట్ల ఇలాంటి భావాలు కలిగివుండటం తప్పే. కానీ తనంటే నాకు ఇష్టం. ఏం చేయను? - ఓ సోదరుడు తొమ్మిదో తరగతి అమ్మాయంటే సాధారణంగా మైనరయ్యుంటుంది. అటువంటివారితో సంబంధం మిమ్మల్ని కటకటాల వెనక్కి పంపించే ప్రమాదం ఉంది. వాళ్ల నాన్నగారి ఫోనుకి మీరు మెసేజులు పంపుతున్నారు. అది మరీ ప్రమాదం. ఎన్నో సందర్భాల్లో గ్రామస్థులు టీచర్లకి దేహశుద్ధి చేయటం మీరు చదివే ఉంటారు. ఆ అమ్మాయి మీకు మెసేజ్ రిప్లై ఇవ్వటంలో కేవలం స్నేహభావమో లేక మీరు పెద్దవారనే గురుభావమో ఉండి ఉండొచ్చు. ఎప్పుడైతే మీరు ప్రేమను ప్రకటించారో ఆ చిన్న అమ్మాయి తన గూడులోకి వెళ్లిపోయింది. పదిహేనేళ్ల అమ్మాయి ఆ విధంగా ప్రవర్తించటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇక తనంటే మీకు చాలా ఇష్టం అన్నారు. మొదటి ప్రేమలో ఇటువంటి ఆకర్షణలు చాలా బలంగా ఉంటాయి. ప్రేమలో పడితే చదువు ఎక్కక పోవటం సహజమే. కాబట్టి కొంతకాలం ఆ ఆలోచనల్ని పక్కన పెట్టండి. దీనికి మీకు నిర్వాణ యోగ ప్రక్రియ ఉపయోగ పడుతుంది. దాని గురించి వివరంగా నా ‘విజయ రహస్యాలు’ అనే పుస్తకంలో ఇచ్చాను. ప్రాక్టీసు చేయండి. ముందే చెప్పినట్టు కొంత కాలం కేవలం చదువు మీదే ఏకాగ్రత నిలిపితే మీ భవిష్యత్తుకి మంచిది. ప్రేమ ముఖ్యమే. కానీ భవిష్యత్తు దానికన్నా ముఖ్యం కదా! నా స్నేహితురాలికి ఇటీవలే పెళ్లయ్యింది. ఆమెకి ఓ చిన్ననాటి స్నేహితుడున్నాడు. ఇద్దరిదీ మంచి స్నేహం. దానికి నేనే సాక్షిని. కానీ తన భర్త ఈ స్నేహాన్ని ఒప్పుకోవడం లేదు. అతణ్ని కలుసుకోవద్దని ఆంక్ష పెట్టాడు. తను బాధ పడుతోంది. ఏం చేయమంటారు? - శ్రీ సత్య, నంద్యాల ప్రతి సమస్యకీ కొన్ని పరిష్కారాలు ఉంటాయి. వాటిలో ఏది మంచిదో మనమే నిర్ణయించుకోవాలి. ఈ పరిస్థితిలో మీ స్నేహితురాలు - అయితే భర్తని లెక్క చేయకుండా స్నేహితుణ్ని కలుసుకోవచ్చు. నొప్పింపక తానొవ్వక రీతిలో భర్త పరో క్షంలో అతణ్ని కలుసుకోవచ్చు. గతంలో పిక్నిక్కి వెళ్లినప్పుడు, ఇద్దరూ ఒకే గదిలో రాత్రంతా ఉన్నప్పుడు స్నేహితుడి ప్రవర్తన, అతడి పవిత్ర వ్యక్తిత్వం గురించి భర్తకి వివరించవచ్చు (కానీ ఇది విడా కులకి దారితీసే ప్రమాదం ఉంది). అతడి భార్యని తన భర్తకి చెల్లిగా పరిచయం చేస్తూ ఆమెను నోరారా వదినా అని పిలుస్తూ, మొత్తం ఫ్యామిలీని ఫ్రెండ్స్‌గా చేసుకోవచ్చు. పడక సత్యాగ్రహం లాంటి పద్ధతుల ద్వారా భర్తని దారిలోకి తెచ్చుకో వచ్చు. భర్త కోసం ఇష్టం లేకపోయినానో లేక మనస్ఫూర్తిగానో పాత స్నేహానికి బై చెప్పవచ్చు. నిరంతరం నిరాశతో బాధ పడటం కంటే పై వాటిలో ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకోవడం మేలు. -
జీవితంలో పైకి రావాలంటే..?!
జీవన గమనం నాకు స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ. ఉద్యోగ రీత్యా ‘స్వయం సంఘాల్లో’ మాట్లాడాల్సి ఉంటుంది. కానీ మాట్లాడలేకపోతున్నాను. ఈ భయాన్ని పోగొట్టుకోవడం ఎలా? - జె.రామ్, మెయిల్ మెదడులో ఉత్పన్నమయ్యే నెగెటివ్ కార్టిజాల్ వల్ల స్టేజ్ ఫియర్ కలుగుతుంది. ఇది మొదట్లో నాకూ ఉండేది. చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా దీన్ని అధిగమించవచ్చు. 1. మీరు మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏమిటో క్షుణ్నంగా ఆలోచించి పెట్టు కోండి. చెప్పదలుచుకున్నది (కొన్నాళ్లు) పాయింట్లుగా రాసుకుని మనసులో పెట్టుకోండి. ‘మీమీద మీకున్న నమ్మకం’ కార్టిజాల్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. 2. కొంతమంది ఇచ్చిన సమయానికి చాలా రెట్లు ఎక్కువ మాట్లాడతారు. వినే వాళ్ల సహనాన్ని పరీక్షించవద్దు. మీరు చెప్ప దలుచుకున్నది అవతలివారికి అర్థమ య్యేలా ఎంతసేపు మాట్లాడితే చెప్పగల రన్న విషయాన్ని అంతేసేపు మాట్లాడండి. 3. బాడీ లాంగ్వేజ్ సరిగ్గా ఉండేలా చూసుకోండి. ఎదురుగా ఉన్నవాళ్లందరినీ చూస్తూ మాట్లాడండి. ఒకరిమీదే దృష్టి నిలపవద్దు. 4. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింటు హితం, ప్రియం..! చెప్ప దలుచుకున్నదాన్ని సీరియస్‌గా చెప్పాలా, కామెడీగా చెప్పాలా అనేది వినే ప్రేక్షకులపై ఆధారపడి ఉంటుంది. ఈరకంగా నాలుగైదుసార్లు మాట్లా డిన తర్వాత మీమీద మీకు నమ్మకం పెరుగుతుంది. మరింత ఉత్సాహం వస్తుంది. భమిడిపాటి రాధాకృష్ణగారి నాటకం ‘కీర్తిశేషులు’లో ‘అవిగో వినరా చప్పట్లు. అవే గదరా ఆకలిగొన్న కళా జీవికి పంచభక్ష్య పరమాన్నాలు’ అని ఒక డైలాగ్ ఉంది. ఆ విధంగా కాలక్రమేణా మీరు మంచి వక్త అవుతారు. బెస్టాఫ్ లక్. జీవితంలో పైకి రావాలంటే ఏమి చెయ్యాలో సింపుల్‌గా చెప్పండి సార్. - రంగారావు, అనంతపూర్ భగవద్గీతని చదివి ఆచరించాలి. ఇంత కన్నా సింపుల్‌గా చెప్పటం కష్టం. పిల్లి అంటే మార్జాలం అన్నట్టు ఉన్నదా? కాస్త వివరంగా చర్చిద్దాం. అసలు జీవితంలో పైకి రావటం అంటే ఏమిటి? ఆరోగ్యం బాగా చూసుకుంటూ, డబ్బు సంపాదన, కీర్తి సంపాదన, ఆర్థికపరమైన సుఖానికి లోటు లేకుండా, వీలైనన్ని తక్కువ సమస్యలతో; దానం, దయ, గాఢమైన ఆత్మీయ సంబంధాలతో, జీవితపు ఆఖరి రోజువరకూ ఉత్సాహం కోల్పోకుండా, జ్ఞానం పెంచుకుంటూ గడపటం. అంతేగా..! బాల్యంలో తల్లిదండ్రుల ప్రేమ ఆశిం చటం నుంచీ, వృద్ధాప్యంలో వారిని బాగా చూసుకోవటం వరకూ చేసే జీవన పయనం కూడా విజయమే. మరోలా చెప్పాలంటే, ‘అజ్ఞానం’ నుంచి ‘ప్రజ్ఞానం’ వరకూ పయనించటమే విజయం. ఈ ప్రయాణాన్ని ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తాను. ఒక కుర్రవాడు ఆడుతూ పాడుతూ బాల్యం గడిపేస్తాడు (అమాయకత్వం). విద్యార్థి దశలో ‘ఇంగ్లిష్ ఆవశ్యకత’ని గుర్తించడు (అజ్ఞానం). డిగ్రీ పూర్తయ్యేసరికి ఏదోలా మ్యానేజ్ చేయగల ననుకుంటాడు (విశ్వాసం). నాలుగైదు ఇంటర్వ్యూల తరువాత దాని ప్రాముఖ్యత తెలుస్తుంది (జ్ఞానం). కోచింగ్ సెంటర్లో చేరి భాషా సామర్ధ్యాన్ని పెంచుకుని ఉద్యోగం సంపాదిస్తాడు (పరిజ్ఞానం). అద్భుతంగా మాట్లాడలేకపోయినా, మ్యానేజ్ చేయగలుగుతాడు (అభ్యాసం). బయట కూడా ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతూ దానికి అలవాటుపడిపోతాడు (విజ్ఞానం). ఆ విధంగా ఆంగ్లంలో అద్భుతమైన ప్రావీణ్యత సాధిస్తాడు (ప్రజ్ఞానం). నేను ఒక కంపెనీలో ప్రొడక్షన్ ఇన్చార్జిని. ఎంత శ్రద్ధగా పని చేసినా పై వారి నుంచి మెచ్చుకోలు లేదు. పని శ్రద్ధగా చేయాలన్నది నా విశ్వాసం. దాన్ని వాళ్లు ఆలస్యం అంటారు. ఏం చేయాలో తెలియట్లేదు. - శేఖర్, నల్లకుంట మీరు తయారుచేసే ప్రొడక్ట్ ఏమిటో చెప్పలేదు. ఒక పనిని ఫలవంతంగా చేయటం వేరు, సమర్థవంతంగా చేయటం వేరు. కిలో మైదాపిండితో ఒక గంటలో వంద కేకులు తయారుచేయడం ఫల వంతం (ఎఫీషియెన్సీ). ఒక రోజుపాటు శ్రమపడి ఎవరూ చేయలేనంత అద్భు తంగా ఒక కేకు తయారు చేయడం సమర్థ వంతం (ఎఫెక్టివ్‌నెస్). ఏ పని సమర్థ వంతంగా చేయాలి, దేన్ని ఫలవంతంగా చేయాలి అన్నది తెలుసు కోవడమే వృత్తిలోను, వ్యాపారంలోను విజయం. దురదృష్టవశాత్తూ మనం ఫలవంతంగా చేయవలసిన పనిని సమర్థవంతంగాను, సమర్థవంతంగా చేయవలసిన చోట ఫలవంతంగానూ చేసి పేరు పోగొట్టు కుంటూ ఉంటాం. ఈ ఇబ్బంది నాకు కూడా ఉంది. కర్త, కర్మ, క్రియల్ని మాటిమాటికీ అటూ ఇటూ మార్చడం, రాసినదాన్నే మళ్లీ మళ్లీ చెక్కడం వగైరా! అవసరం లేకపోయినా ఈ విధంగా మెరుగులు దిద్దేవారిని ‘పెరఫెక్షనిస్టులు’ అంటారు. కొన్ని వృత్తులకి ఇది పనికి రాదు. మీరు మీ పై అధికారుల చెప్పుల్లో కాళ్లు పెట్టి ఆలోచిస్తే, మీ పొరపాటు ఎక్కడుందో తెలుస్తుంది. - యండమూరి వీరేంద్రనాథ్ -
తనకు చేరువ అయ్యేదెలా?
జీవన గమనం నా ఫ్రెండ్ నాతో రెండేళ్లు స్నేహం చేసి, ప్రేమించి సడన్‌గా మాయమైపోవడం జరి గింది. తన నంబర్ పని చేయట్లేదు. అడ్రస్ తెలీదు. చాలా బాధగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. - పేరు లేదు, హైదరాబాద్ మీరు అబ్బాయో అమ్మాయో చెప్ప లేదు. ఒకవేళ మీరు అబ్బాయి అయితే ఆ అమ్మాయి ‘నాకు పెళ్లి నిశ్చయమైంది. నీతో స్నేహం ఆపుచేయదలుచుకున్నాను’ అని చెప్తే ఏం చేస్తారు? ‘పెళ్లయిన తర్వాత కూడా మనం స్నేహితులుగా ఉండొచ్చు కదా’ అని కన్విన్స్ చేస్తారు. బహుశా ఆమెకది ఇష్టం లేకపోయి ఉండొచ్చు. కొందరు శాడిస్ట్లు పెళ్లయిన తర్వాత బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఇన్ని గొడవలెం దుకని ఆమె నంబరు కూడా మార్చేసి ఉండొచ్చు. పాజిటివ్‌గా ఆలోచించండి. ‘మీకన్నా తన తల్లిదండ్రులు ఎక్కువని అనుకోవడం వలనో, మిమ్మల్ని వదిలేసి ఇంకొకర్ని చేసుకుంటే తన జీవితం ఇంకా బాగుంటుందనో’ మీ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలేసింది. మీ ప్రియురాలు తృప్తిగా ఉండటం కన్నా మీకేమి కావాలి? లేదా మీరు అమ్మాయి అనుకుందాం. తన తల్లి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం వలనో లేదా ఇంకా ఎక్కువ కట్నం వస్తుందనో మిమ్మల్ని ఆ అబ్బాయి వదిలేశాడు. అడ్రసు మార్చేశాడు. అలా ప్రేమలో లాభనష్టాలు బేరీజు వేసుకునే వాడు దూరమైనందుకు సంతోషించాలి గానీ, బాధ ఎందుకు? మంచి స్నేహితుడు మిమ్మల్ని ఎప్పుడూ వదిలెయ్యడు. మిమ్మల్ని వదిలేసినవాడు మంచి స్నేహి తుడు కాదు. అటువంటి ఫ్రెండ్ మిమ్మల్ని వదిలేసినందుకు మీరు అదృష్టవంతులని అనుకోండి. ఈ విధంగా సానుకూల ఆలోచనాధోరణితో ఆలోచించడం మొదలుపెడితే మనసు తేలిక పడుతుంది. నమస్తే సర్... నేనో విద్యార్థిని. ఇంతకు ముందు బాగానే చదివేవాడిని. కానీ ఈ మధ్య కాన్సన్ట్రేషన్ కుదరడం లేదు. మరో మూడు నెలల్లో పరీక్షలు. కానీ చదువుదామని ఎంత ప్రయత్నించినా పుస్తకంపై మనసు నిలవడం లేదు. సినిమాలు, రాజకీయ వార్తలు అంటూ వేర్వేరు విషయాల మీదకు ధ్యాస మళ్లిపోతోంది. ఇలా అయితే కచ్చితంగా ఫెయిలవుతాను. పరిష్కారం సూచించండి. - సంజీవ్‌కుమార్, ఊరు రాయలేదు ఏకాగ్రత రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. నో ఇంటరెస్ట్, అదర్ ఇంటరెస్ట్. మొదటిది: చిన్నతనం నుంచీ అసలు చదువుమీదే ఇంటరెస్ట్ లేక పోవటం. ఇలాంటి వారిని మార్చటం కష్టం. కానీ ఒక ప్పుడు బాగా చదివేవాణ్ని అంటు న్నారు కాబట్టి, మీ సమస్యకి కారణం బహుశా రెండోదయి ఉంటుంది. అంటే... చదువు మీద ఉత్సాహం ఉన్నా సెల్ఫోన్లు, ఇంటర్నెట్లు మొదలైనవాటిపై ఇటీవలి కాలంలో అంతకన్నా ఎక్కువ ఉత్సాహం పెరగటం. ఇంకో మూడు నెలల్లో పరీక్షలు అంటున్నారు కాబట్టి, ఈ మూడు నెలలూ కఠినమైన నిర్ణయాలు తీసుకోండి. స్నేహితులతో మాట్లాడే కాలాన్ని రోజుకి అరగంటకి కుదించండి. టీవీ, సినిమా మిగతా ఆసక్తికరమైన, ఉపయోగం లేని విషయాల్ని పూర్తిగా దూరం పెట్టండి. తెల్లవారుజామున లేచి చదవటం ఒక మంచి పద్ధతి. మూడు నెలలపాటు ఇలా చేస్తే మీకు చదువు కోవటంలో ఉండే నిజమైన ఆనందం అర్థమవుతుంది. నేను ఎంబీయే పూర్తిచేసి మూడేళ్లపాటు ఉద్యోగం చేశాను. పెళ్లయ్యాక మానేశాను. ప్రతిక్షణం మావారితోనే గడపాలనుకున్నాను. కానీ ఎందుకో తను నన్ను దగ్గరకు రానివ్వడు. పైగా ప్రతి విషయం వాళ్ల అమ్మతో షేర్ చేసు కుంటాడు. నేనేదైనా మాట్లాడినా, ‘అలా కాదు ఇలా’ అని చెప్పినా వెంటనే వెళ్లి వాళ్ల అమ్మకు చెప్పేస్తాడు. అయినా ఏదో ఒక రకంగా చేరువ కావాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాతో తనకి ఏదైనా సమస్య ఉందేమో చెప్పమన్నా చెప్పడు. ఈ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. పెళ్లికి ముందు ఎంతో హుషారుగా, ధైర్యంగా ఉండేదాన్ని. చాలా దిగులుగా ఉంటోంది. బతకాలనే అనిపించడం లేదు. నేనీ సమస్య నుంచి ఎలా బయటపడాలి? - పావని, ఊరు రాయలేదు ఇటువంటి సమస్యలతో కౌన్సిలర్ దగ్గరికి వచ్చేవారు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువవుతున్నారు. ఇది దురదృష్ట కరమైన విషయం. అమ్మకూచితనం కానీ, వివాహత్పూర్వ ప్రేమ వ్యవహారం కానీ, జీవితంలో ప్రేమ కన్నా వృత్తి ముఖ్యమనే ఆలోచనా విధానం కానీ కొంతమంది పురుషులని ఈ రకంగా మారుస్తోంది. మీరు చెప్పినదాన్ని బట్టి ఆయన కౌన్సిలర్ దగ్గరకు రావటానికీ ఒప్పుకోరు. ఆయన మనసులో ఏముందో తెలుసు కుంటే తప్ప ఈ సమస్యకి పరి ష్కారం చెప్పడం కష్టం. ఆయనకి తన అమ్మగారంటే ప్రేమాభిమానాలు ఎక్కు వని రాశారు కాబట్టి అట్నుంచి ప్రయత్నించి చూడండి. ఆమె ద్వారా విషయాన్ని రాబ ట్టండి. మీకూ ఆమెకూ సంబంధాలు సరిగా లేని పక్షంలో ఆయన మీకు దూరంగా ఉండటానికి అది కూడా కారణమై ఉండొచ్చు. మీకు దగ్గర్లో ఉన్న కౌన్సిలర్ని సంప్రదించి, ఇంకా వివరంగా చెప్తే తప్ప ఇలాంటి సమస్యలకి పరిష్కారం కష్టం. - యండమూరి వీరేంద్రనాథ్ మీకూ ఒక ప్రశ్న ఉందా? అయితే మాకు రాయండి. యండమూరి మీకు సమాధానం ఇస్తారు. మా చిరునామా: జీవన గమనం, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
నా భార్యను నేను మార్చలేనా?!
జీవన గమనం రచయితగారూ, నా భార్య మీద నాకున్న ఫిర్యాదులన్నీ రాస్తున్నాను. వీటిని ఎలా డీల్ చేయాలో దయచేసి తెలుపగలరు. - పసుపులేటి, ఖమ్మం అయ్యా, మీరు రాసిన 16 ఫిర్యా దులూ చదివాను. మీ శ్రీమతిగార్ని వ్రాయమంటే ఆమె కూడా మీ గురించి ఈ విధంగానే రాస్తారని నా ఉద్దేశం. కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను. చదవండి: ‘‘... నా గురించి ఆలోచించడు. అన్నీ తను చెప్పినట్టే జరగాలనుకుంటాడు. సిగరెట్లూ, డ్రింక్సూ తగ్గించుకుంటే బాగుంటుంది. ఆయనకి కోపం వస్తే తట్టుకోలేం. ఆయన స్నేహితులందరూ బేవార్స్‌గాళ్లు. అనవసరంగా వాళ్లతో సమయం వృథా చేసుకుంటారు. ఎక్కువసేపు నాతో గడపరు. నాతో ఆర్థిక విషయాలేవీ చర్చించరు. నిజానికి ఆయన రాబడి ఎంతో కూడా నాకు తెలీదు. తన తరఫు వారితో చాలా దగ్గరితనం ప్రదర్శిస్తారు. అన్నిటికీ తల్లినే సంప్రదిస్తాడు. పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తే తన బాధ్యత తీరిపోయిందనుకుంటాడు. మా బంధువుల గురించీ, తల్లిదండ్రుల గురించీ మనసు బాధ కలిగేలా హేళనగా ప్రవర్తిస్తాడు.’’ చాలా? ఇంకా ఫిర్యాదులు చెప్ప మంటారా? ప్రతీ సమస్యకీ పరిష్కారం విడాకులు కాదు. మనం అవతలి వారిని మార్చాలనుకోవడం భ్రమ. ఇంపాసిబుల్. మనం మారటమే ఉత్తమమైన మార్గం. మీరు పంపిన ఫిర్యాదులూ, నేను రాసినవీ కలిపి ఇద్దరూ చర్చించండి. కొన్ని కామన్ పరిష్కారాలు దొరకవచ్చు. ఫేస్బుక్ స్నేహాల మీద మీ అభిప్రాయమేమిటి? - రామకృష్ణ, మెదక్ అవతలివారెవరో తెలియదు. అయినా తరచూ మాట్లాడాలని అనిపించటం, గాఢంగా స్నేహం చెయ్యాలన్న తపన, ఫోన్లో ఆత్మీయమైన కబుర్లు, ఒకరోజు చాటింగ్ చేయకపోతే మనసు కొట్టు కోవటం, స్కైపులో చూసుకోకపోతే స్కై కూలిపోయిన భావన మొదలైనవి ఈ విభాగంలోకి వస్తాయి. ఎదుటి వ్యక్తి తెలి యని కారణంగా, కావలసినట్టు ఊహించు కునే వీలుండటం వల్ల, ఈ స్నేహాలు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయి. అంతే ప్రమాదకరంగా పరిణమిస్తాయి కూడా. అమ్మాయిల పేరుతో ఫేస్బుక్ నడిపే అబ్బాయిల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫేస్ బుక్‌లో అమ్మాయి చెప్పే సినిమా కష్టాలు విని, ఆమె అకౌంటులో పదివేలకు పైగా వేసిన తరువాత గానీ ‘తాను వేస్తోంది అబ్బాయి అకౌంటులో’ అన్న విషయం నా స్నేహితుడి మనవడికి తెలియరాలేదు. ఆర్నెల్ల క్రితం జరిగిన మరో యథార్థ సంఘటన పేపర్లో చదివే ఉంటారు. అమెరికాలో సెటిలైన ఒక గుంటూరు ముద్దుగుమ్మకి ఫేస్బుక్లో ఒక టంగుటూరు కుర్రాడు పరిచయం అయ్యాడు. మూడ్రోజుల పరిచయం మూడు రాత్రుల్లో ప్రేమగా మారి, హద్దులు దాటి, సరిహద్దులు దాటి, గాలి ముద్దులతో ముదిరి, ఏకాంతపు సద్దుల్లో మాటల రొమాన్స్ వరకూ వెళ్లింది. మను వాడబోయేవాడు, మనవాడే కదా అని తనువంతా స్కైప్‌లో ఆచ్ఛాదన లేకుండా చూపించింది. ఇతగాడు దాన్ని రికార్డ్ చేసి, రికార్డ్ స్థాయిలో బ్లాక్మెయిల్ చేయసాగాడు. కొన్ని లక్షలు కోల్పోయాక అతడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఇంటరాగేషన్‌లో తేలిందేమిటంటే, అమ్మాయిల్ని ఈ విధంగా మోసం చేసి పబ్బం గడుపుకోవటమే అతగాడి వృత్తట. ఆర్నెల్ల క్రితం పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఫోను స్నేహాలూ, ఫేస్బుక్ పరిచయాలూ సాధారణంగా ఈ విధంగానే ముగుస్తాయి. మగవాళ్లే కాదు. అమ్మాయిలూ తెలివి మీరిపోయారు. సెల్-కార్డ్‌కి డబ్బుల్లేకపోయినా ‘ఖరీదు’గా నటిస్తూ, అవతలివారిచే ధారాళంగా ఖర్చు పెట్టించేవాళ్లూ, నలుగురైదుగురు స్నేహితుల్ని ఒకేసారి మెయిన్టైన్ చేసేవారూ, కొత్త స్నేహితుడు దొరగ్గానే పాత ఫ్రెండ్ నంబరు ఆటో-రిజెక్ట్ లిస్ట్‌లో పెట్టేవారూ, ఒకరు పంపిన ప్రేమ సందేశాన్ని మరొకరికి పంపి, ఆ జవాబుని తిరిగి మొదటి ప్రేమికుడికి పంపి చేతులు దులుపుకునేవారూ ఉన్నారు. సినీరంగంలో అమ్మాయిలు కాలు జారక తప్పదని ఒక అభిప్రాయం ఉన్నది. మోసపోయేది అమ్మాయిలే కాదు. ఇటీవల కాలంలో దాదాపు అయిదారుగురు పెద్ద పెద్ద దర్శకులు, సినీ రచయితలు కూడా ఇలాంటి బంధాల్లో ఇరుక్కుని, బ్లాక్ మెయిల్‌కి గురై, చాలా మానసిక వ్యథ అనుభవించి, కోట్లు కుమ్మరించి ఆ కష్టాల్నుంచి బయటపడ్డారు. ఒక దర్శకుడికి ఫోన్లో ఒకావిడ పరిచయమై, ఇంటర్నెట్లో అందమైన అమ్మాయి ఫొటో పంపి, మానసికంగా దగ్గరై (!), ‘ఏకాంతంలో నీ భార్యతో నీవెలా ఆత్మీయంగా గడుపుతావో నాకు చూపించవా’ అని గోముగా రెచ్చగొట్టి, ఆపై అతను జరిపిన సంభాషణా, పంపిన వీడియోలూ, భార్యపై కామెంట్సూ టీవీ చానల్స్‌లో బహిర్గతం చేస్తానని బెదిరించి, లక్షలు వసూలు చేసింది. హీరో విలన్ల మధ్య ఎత్తుకి పై ఎత్తు కథాంశాలున్న సినిమాలు తీస్తాడని పేరున్న సదరు నంబర్ వన్ దర్శకుడి నిర్హేతుక భయం చూసి సినీపరిశ్రమ విస్తుబోయింది. - యండమూరి వీరేంద్రనాథ్ ప్రకటన: దైనందిన జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు, సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటాం. వాటిని ఎలా అధిగమించాలో తెలియక, మన వ్యక్తిత్వాన్ని ఎలా మలచుకోవాలో, ఉన్నతమైన వ్యక్తిగా ఎలా ఎదగాలో తెలియక తల్లడిల్లుతుంటాం. మీరు అలాంటి పరిస్థితుల్లో కనుక ఉంటే మాకు రాయండి. జీవన గమనంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు యండమూరి పరిష్కారాలు సూచిస్తారు. మా చిరునామా: జీవన గమనం, సాక్షి ఫన్డే, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
అందరికీ దూరమౌతున్నాను.. ఎలా?
జీవన గమనం నాకిద్దరు పిల్లలు. ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. ఒక్క క్షణం పడదు. ఏం చేయాలో తోచటం లేదు. - సరళ, నిజామాబాద్ మీరు వారి వయసు రాయలేదు. పది పన్నెండేళ్ల వరకూ పిల్లలు ప్రేమతో కొట్టు కోవటం, తిట్టుకోవడంలో ఆశ్చర్యం లేదు. సాధారణంగా టీవీ రిమోట్స్ కోసం దెబ్బ లాడుకుంటూ ఉంటారు. కొంచెం వయ సొచ్చాక కూడా వారిలో ఆ విభేదాలుంటే అప్పుడు జాగ్రత్త పడాలి. పూర్వం ఇంట్లో పెద్దవారుండేవారు. వారు పిల్లల్ని కూర్చో బెట్టుకుని రామలక్ష్మణుల బంధం గురించీ, కౌరవ పాండవ శత్రుత్వం వల్ల వచ్చిన నష్టాల గురించీ చెప్పేవారు. అలా చిన్నప్పటి నుంచీ వారిలో ఒక స్నేహ భావాన్ని పెంపొందించేవారు. చిన్నవాడికి పెద్దవాడిని పరీక్షపెట్టి మార్కులు వేయమనండి. ఇద్దరికీ బహుమతులివ్వండి. వాళ్లిద్దరినీ ఒక టీమ్‌గా, మీరూ మీ వారూ ఒక టీమ్‌గా కేరమ్స్లాంటి గేమ్స్ ఆడండి. చిన్నవాడి బాధ్యతని పెద్దవాడికి అప్పగించండి. ఇద్దరినీ కలిపి ఏదైనా టూర్‌కి పంపండి. తల్లిదండ్రుల పరోక్షంలో ఒకరి బాధ్యత మరొకరికి అప్పగిస్తే, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కూడా పెరుగుతుంది. నేను నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తానని అందరూ తిడుతూంటారు. ఆవేశం వస్తే మాట తడబడుతుంది. నత్తి వస్తోంది. మనసులో ఏదీ దాచుకోలేను. దీనివల్ల అందరికీ దూరం అవు తున్నాను. నేను చెప్పేది అవతలివారికి అర్థం కాదు అంటారు. రెండు నిమిషాల్లో చెప్పాల్సింది పది నిమిషాలు చెప్తావు అంటారు. మంచి సలహా ఇవ్వగలరు. - అవంతిక, కంచికచర్ల ‘‘అవిస్తరం అసందిగ్ధం... వర్ధతే మధ్య మన్వరం’’ అంటూ సంభాషణ ఎలా ఉండాలో రామాయణంలో వాల్మీకి చక్కగా వివరిస్తాడు. క్లుప్తంగా, స్పష్టంగా, సాగతీతలు లేకుండా, మృదువైన స్వరంతో వర్ణోత్పత్తి స్థానాలైన హృదయ, కంఠాలను ఆశ్రయించి, ప్రతి అక్షరం మధ్యమ స్వరంలో పలకాలట. టీవీ యాంకర్లు వెంటనే నేర్చుకోవలసిన విషయమిది. ‘‘... శత్రు మిత్ర జ్ఞానము లేనివాడు, ఎటువంటి అహంకార పరిస్థితుల్లోనూ మృదు సంభాషణ వీడనివాడు భగవత్-భక్తుడు’’ అని భగవద్గీతలో చెప్పటం జరిగింది. గొప్ప సంభాషణా చాతుర్యానికి ఉదాహరణ హనుమంతుడు. అశోకవృక్షం కింద కూర్చొని, ‘ఏమి జరిగినా అది రాక్షస మాయేమో’ అని సందేహిస్తున్న సీతకు తాను రామబంటునన్న విశ్వాసం కల్గించ డానికి ఎంచుకున్న సంభాషణా క్రమం, వృద్ధి, ముగింపు గమనిస్తే హనుమంతుడి వాక్చతురత, చాతుర్యం తెలిసిపోతాయి. వాల్మీకి ఇంత వివరంగా చెప్పింది, వేమన రెండు వాక్యాల్లో సింపుల్‌గా ‘‘అల్పు డెపుడు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను’’ అని చెప్తాడు. జాతిని ప్రభావితం చేసిన సోక్రటిస్, బుద్ధుడు, క్రీస్తు, మహ్మద్ ప్రవక్త, నెల్సన్ మండేలా.. ఇలా ఏ మహనీయుడ్ని తీసుకున్నా, వారి కార్యాచరణ నిబద్ధతతో పాటు మాటల్లోని సౌమ్యత కూడా అంతే గొప్పగా కనపడు తుంది. ఎదుటి వ్యక్తుల్ని ఇబ్బందిపెట్టే ‘అ’మధుర సంభాషణ నాలుగు విధాలుగా ఉంటుంది. పారుష్యం. అంటే... కఠినత్వం. వాగ్బాణం ఎదుటి మనసుని చీల్చకూడదు అనృతం. అంటే... అబద్ధం చెప్పటం. వారిజాక్షులందు, వైవాహికములందు తప్ప, తరచు అబద్ధాలు చెప్పటం వల్ల ప్రేమించినవారు దూరమౌతారు. పైశున్యం. చాడీలు చెప్పడం. దీనివల్ల కలహాలు, విరోధాలు ఏర్పడతాయి. ప్రేలాపం. వాక్కును ఆచితూచి వినియోగించకపోవటం. దీన్నే అసందర్భ ప్రేలాపం అంటారు. ఆత్మన్యూనత పెరిగేకొద్దీ ‘వాగ్ధాటి’ ఎక్కువ అవుతుంది. జీవితంలో సుఖం లేని వ్యక్తులు ‘మందు’లో ఎక్కువ ఆవేశ పడేదీ, బిగ్గరగా మాట్లాడేదీ, రాత్రి పది తర్వాత బార్లు ఫస్టు గేర్లయ్యేది అందుకే. ఇటు ఇంట్లో, అటు ఆఫీసులో ఒత్తిడితో నలిగిపోయే కొందరు మహిళల సంభా షణలో ‘చెప్పుకోవాలనే’ తపన కన బడుతూ ఉంటుంది. వ్యక్తిగత, గృహ సంబంధిత విషయాలు బయటివారితో చర్చించకూడదు. చులకన అయిపోతాం. సానుభూతి చూపిస్తూ ‘సలహాదారుగా’ మార టానికి తయారవుతారు. మనసులో బాధ బయటకి చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు. తగ్గదు. తాత్కా లికంగా ఉపశమనం కలుగుతుం దంతే. విరిగిన ఎముకకి పిండికట్టు కట్టటం లాంటిది ఇది. ఈ క్రింది అంశాలు దృష్టిలో పెట్టుకోండి. * మాట్లాడటానికి తగిన విధంగా మీ మూడ్ ఉందా? పరిశీలించుకోండి * వినటానికి సరైన స్థితిలో అవతలవారి మూడ్ ఉందా? గమనించండి. * వారి మూడ్‌ని, మీ మాటల్తో మార్చగలిగే పరిస్థితి ఉందా? * అవతలివారి పరి స్థితిని బట్టి మూడ్ మార్చుకొనే ‘అవసరం’ మీకుందా? * మృదువుగా మాట్లాడటం నేర్చుకోండి * వాదన వేడెక్కగానే కట్ చెయ్యండి * గ్రూప్‌లో ఉన్నప్పుడు మీ సంభాషణ పట్ల జాగ్రత్తగా ఉండండి. మాట్లాడటం వెండి. మౌనం బంగారం! సరైన సందర్భంలో సరిగ్గా మాట్లాడటం ప్లాటినం!! తప్పు సంకేతం వచ్చేలా మాట్లాడటం తుప్పుపట్టిన ఇనుము..!!! - యండమూరి వీరేంద్రనాథ్ ప్రకటన: దైనందిన జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు, సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటాం. వాటిని ఎలా అధిగమించాలో తెలియక, మన వ్యక్తిత్వాన్ని ఎలా మలచుకోవాలో, ఉన్నతమైన వ్యక్తిగా ఎలా ఎదగాలో తెలియక తల్లడిల్లుతుంటాం. మీరు అలాంటి పరిస్థితుల్లో కనుక ఉంటే మాకు రాయండి. జీవన గమనంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు యండమూరి పరిష్కారాలు సూచిస్తారు. మా చిరునామా: సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
వరంగల్‌లో 'ఇన్స్పైర్' కార్యక్రమం
వరంగల్: వరంగల్ నగరం తూర్పు నియోజకవర్గంలో జిల్లా ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పదో తరగతి విద్యార్థుల కోసం ఇన్స్పైర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇన్స్పైర్ కార్యక్రమంలో డీఈవో చంద్రమోహన్, అసోసియేషన్ నేత వెంకటేశ్వర్లు, రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆడడం ఆనందం...గెలవడం బోనస్!
ఒక తరానికి ఆయన ప్రయోగాత్మక నాటక రచయిత... మరో తరానికి పాపులర్ నవలా రచయిత... అటుపైన పేరుతెచ్చుకున్న సినీస్క్రిప్ట్ రైటర్... ఇవాళ్టి తరానికి ఒక వ్యక్తిత్వ వికాస బోధకుడు, జీవన విధానపు కౌన్సెలర్... కాలానికి తగ్గట్లుగా ఆలోచననూ, అక్షరాన్నీ మలుచుకొని, ప్రతి విషయంలో పదేళ్ళు ముందుండడం యండమూరి వీరేంద్రనాథ్ ప్రత్యేకత. 1980ల నుంచి తెలుగు సాహిత్యంలో లక్షల కొద్దీ కాపీలు... కోట్ల రూపాయల అమ్మకాలు జరిగిన ‘మోస్ట్ పాపులర్ రైటర్’గా అభిమానుల ప్రశంసలూ ఆయనకే! మూడు దశాబ్దాల క్రితం సీరియల్ పాఠకులను ఊపేసిన ‘తులసిదళం’, ‘తులసి’నే దృష్టిలో పెట్టుకొని ‘క్షుద్ర సాహిత్య రచయిత’గా గిట్టనివర్గాల ఈసడింపులూ ఆయనకే! విజేతగా కీర్తించినా, విమర్శించినా - విస్మరించలేని విశిష్ట పాళీ, అక్షరాల మోళీ యండమూరిది. స్వయంకృషితో నిజజీవితంలో ‘విజయానికి అయిదు మెట్లు’ వేసుకున్న ఎవర్గ్రీన్ యండమూరి 66వ పుట్టినరోజు సందర్భంగా విజయం వైపు పయనించిన ఆయన అంతరంగంలోకి ‘సాక్షి ఫ్యామిలీ’ ప్రయాణం... మీ కోసం... ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. అరవై ఆరేళ్ళు నిండిన ఈ సమయంలో ఒక్కసారిగా వెనక్కి తిరిగిచూసుకుంటే కలుగుతున్న భావాలు? (నవ్వేస్తూ...) మనిషి గెలుపు నిరంతరం. అంతే తప్ప, ఒక మజిలీలో ఆగి, వెనక్కి తిరిగి చూసుకోవడమనేది నేను నమ్మను. చాలామంది 30 - 40 ఏళ్ళకే తృప్తిపడిపోతారు. జీవించడం మానేసి, బతకడం మొదలుపెడతారు. అది తప్పు. పని చేస్తున్నకొద్దీ రాటుదేలేది ఒక్క మెదడే. ‘ఎంత కాలం జీవించామన్నది కాదు, ఎంత తొందరగా ప్రారంభించామన్నది ముఖ్యం’ అంటా. తొందరగా ప్రారంభించడమంటే...? దాని అంతరార్థం కొద్దిగా వివరిస్తారా? జీవితంలో డబ్బు, కీర్తి, జ్ఞానం - వీటి సముపార్జన తొందరగా ప్రారంభించాలి. నా దృష్టిలో మనిషికి కావాల్సినవి షడ్గుణ ఐశ్వర్యాలు. ఆ 6 ఏమిటంటే - ఆరోగ్యం, కీర్తి, డబ్బు, జ్ఞానం, ప్రేమ, ఉత్సాహం. ఈ ఆరూ ఉంటే, జీవితం సఫలమైనట్లే. వీటి కోసం ఎంత చిన్న వయసులో ప్రయత్నం ప్రారంభిస్తే, అంత తొందరగా జీవితంలో విజయం వైపు పయనిస్తాం. మీ జీవితం గమనిస్తే, చిన్నప్పుడే మీరు ఆ ప్రయత్నం ప్రారంభించినట్లున్నారు. అవును. జీవితంలో కృషి చేయడమంటే ఏమిటో మా నాన్న గారిని చూసి నేర్చుకున్నా. ఆయనకు ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడే మా తాత గారు చనిపోయారు. మా నాన్న గారు వారాలు చేసుకొని చదువుకున్నారు. అమ్మానాన్న, నలుగురు పిల్లలం చిన్న ఇంట్లో సర్దుకొన్న రోజులు నాకింకా గుర్తే. అందుకే, చిన్నప్పటి నుంచి స్వయంకృషితో పైకి వచ్చేందుకు కృషి చేశా. మీరు చాలా కష్టపడి చదువుకున్నారట! (మధ్యలోనే అందుకుంటూ...) కష్టం అనకండి... కృషి అనండి! జీవితంలో ఏ పని చేసినా, ఆ పని ఆనందంగా చేయాలి. దాన్ని ఆస్వాదించాలి. అప్పుడు కష్టం, బాధ ఉండవు. అందుకే, ‘ఆడడం ఆనందం. గెలవడం బోనస్’ అని చెబుతుంటా! చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగా. బంధువుల దగ్గర వాళ్ళ ఇళ్ళలో ఉంటూ, వేర్వేరు ఊళ్ళలో చదువుకున్నా. ఇంటి పరిస్థితి తెలుసు కాబట్టి, స్కూల్లో చదువుకుంటున్నప్పుడే చిన్న తరగతులకు ట్యూషన్లు చెప్పి, సంపాదించా. నా తొలి సంపాదనతో మా అమ్మకు చిన్న ట్రాన్సిస్టర్ కొనివ్వడం, ఆమె ఆనందం - ఇప్పటికీ మర్చిపోలేను. అప్పట్లో మీ జీవితం ఎలా గడవాలనుకొనేవారు? కాకినాడ పి.ఆర్. కాలేజ్‌లో బి.కామ్ చదువుతున్న రోజుల్లో నెలకు వెయ్యి సంపాదిస్తే చాలనుకున్నా. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. రచయితనయ్యాక కూడా లక్షరూపాయలు సంపాదించి, బ్యాంకులో వేస్తే వచ్చే వెయ్యి రూపాయల వడ్డీతో దర్జాగా బతికేయాలని భావించా. మా పబ్లిషర్‌కు చెబితే, ఆయన నవ్వేసి, ‘మీరు ఒకటి కాదు మూడు బిల్డింగ్లు కడతారు... చూడండి’ అన్నారు. నిర్ణీత మొత్తం సంపాదించాలని ఎప్పుడూ లక్ష్యంగా పెట్టుకోలేదు. కాకపోతే, సౌకర్యంగా బతకాలని అనుకున్నా. అంతే! అసలు, తొలి రోజుల్లో మీకు రచన వైపు ఆసక్తి ఎలా కలిగింది? మా నాన్న గారు యండమూరి చక్రపాణి మంచి కవి. మూడు, నాలుగు పుస్తకాలు కూడా రాశారు. మా తాతయ్య (అమ్మ గారి నాన్న గారు) రావిపాటి సత్యనారాయణ రచయిత. మా మేనమామ వేణుగోపాలరావు కూడా రాసేవారు. ఆ జీన్స్ నాకు వచ్చినట్లున్నాయి. మేనమామ ప్రోత్సాహంతో ‘చందమామ’లో కథలు రాయడంతో నా రచనా జీవితం మొదలైంది. నవలల కన్నా ముందు నాటకాల్లో కృషి చేసిన రోజులు గుర్తుచేసుకుంటారా? సి.ఏ. చదువుతున్నప్పుడు 1969లో రాసిన ‘గులకరాళ్ళు - గులాబీముళ్ళు’ నా తొలి నాటిక. నన్ను రచయితగా తీర్చిదిద్దిన దేశిరాజు హనుమంతరావు, నేను, నటుడు సుబ్బరాయశర్మ కలసి ఒక బృందంగా నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళం. నాటకం రాయడం, వేయడం ఒక ఉద్యమంలా సాగేది. ‘మరో మొహంజొదారో’ లాంటివి మినహా, తెలుగు రంగస్థలంపై ప్రయోగాలు తక్కువైన రోజుల్లోనే మీరు రాసిన ‘కుక్క’ గురించి ఇవాళ్టికీ చెప్పుకుంటారు. (నవ్వుతూ...) ‘కుక్క’ నాటకం ఓ సంచలనం. అలాగే, ‘రుద్రవీణ’ ఆధునిక యక్షగానం. ‘మనుషులొస్తున్నారు జాగ్రత్త’, ‘నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య’ లాంటివన్నీ పేరు తెచ్చినవే. ఎగ్జిబిషనిజమ్ మీద, బ్రెహ్ట్ చెప్పిన ఏలియన్ థీరీ మీద, అలాగే అబ్సర్డ్ నాటికలు - ఇలా రకరకాల ప్రయోగాలు చేశా. అప్పట్లో రంగస్థలంపై మెలోడ్రామాగా నాటకాలు నడిచేవి. వాటికే బహుమతులూ వచ్చేవి. ఇవన్నీ చూసి ‘చీమ కుట్టిన నాటకం’ పేరుతో మెలోడ్రామా మీద పూర్తి వ్యంగ్యంగా నాటకం రాశా. అదీ చర్చ రేపింది. ‘రఘుపతి రాఘవ రాజారామ్’ నాటకానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డొచ్చింది. మరి, నాటకాల్లో అంత కృషి చేసి, నవలల వైపు ఎందుకు మళ్ళారు? ‘చీమ కుట్టిన నాటకం’ రాశాక, ఇక నాకు ఎప్పటిలా మామూలు నాటకాలు రాయాలనిపించ లేదు. పైగా నేను, రచయితలు జంధ్యాల, పరుచూరి బ్రదర్స్ పరిషత్తు నాటకాల్లో పోటీలు పడుతుండేవాళ్ళం. రాజమండ్రి ‘లలిత కళానికేతన్’లో మా మధ్య గట్టిపోటీ ఉండేది. వాళ్ళిద్దరూ సినిమా రంగానికి వెళ్ళిపోయాక నవలా రచన వైపు మొగ్గా. 500 మంది చూసే నాటకం కోసం ఇంత శ్రమ పడే కన్నా, అదే శ్రమతో అంతకన్నా ఎక్కువ మందికి నవల ద్వారా చేరవచ్చనిపించింది. ‘నాటకం కన్నా నవల రాయడం కష్టమ’ని ఎవరో చేసిన విమర్శతో 1977లో ‘ఋషి’తో నవలా రచన మొదలుపెట్టా. ప్రొఫెషనల్ రైటరై, ‘తులసిదళం’తో కీర్తీ, అపకీర్తీ కూడా మూటగట్టుకున్నారు! (కొద్దిగా హెచ్చు స్వరంలో...) నా పుస్తకాన్ని పది మంది కొంటే ప్రొఫెషనల్ రైటర్ అంటారు. ఎవరూ కొనకపోతే సీరియస్ రైటర్ అంటారు. నలుగురూ కొని, చదివే పుస్తకాలు రాస్తే, వెంటనే ‘కమర్షియల్ రైటర్’ అనే ముద్ర వేసేస్తారు. చాలామంది ఆర్ట్ సినిమాల్లో చేసే వారి కన్నా అమితాబ్ మంచి నటుడు. కానీ, ఏం లాభం? అతనికి కమర్షియల్ చిత్రాల నటుడనే ముద్ర వేసేస్తాం. నా మీదే అంతే! ‘అంతర్ముఖం’ నవల యండమూరి కాకుండా, మరొకరు రాసి ఉంటే నెత్తి మీద పెట్టుకొని ఊరేగేవాళ్ళు. నేను రాశా కాబట్టి, మాట్లాడరు. నా 50 నవలల్లో ఒక్కటైన ‘తులసిదళం’ గురించే ప్రస్తావిస్తారు. ‘ఎస్! యండమూరి ఎరైవ్డ్’ అని మీకెప్పుడనిపించింది? ‘తులసిదళం’తోనా? ఆ మాట అప్పుడు, ఇప్పుడు - ఎప్పుడూ అనుకోను. వారం వారం పాఠకులు ‘తులసిదళం’ సీరియల్ కోసం ఊగిపోతున్నారనీ, అది అంత సంచలనమనీ అప్పట్లో నాకు తెలీను కూడా తెలీదు. ‘తులసిదళం’కి నాకిచ్చిన పారితోషికం రూ. 3 వేలు. ‘తులసి’కి 5 వేలు. అంతే! సీరియల్ వల్ల పత్రిక సర్క్యులేషన్ పెరుగుతోందని తెలుసు కానీ, ఇంత సంచలనం సృష్టిస్తోందని తెలియదు. తెలిస్తే పారితోషికం భారీగా అడిగి ఉండేవాణ్ణి కదా! చేతబడుల గ్రామాలు నిజంగా చూసి, రిసెర్చ్ చేసి మరీ అవి రాసినట్లున్నారు? ‘తులసిదళం’ కన్నా ముందే ‘పర్ణశాల’లో రొయ్యల వ్యాపారం గురించి, ‘నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య’లో సంగీతం గురించి తెలుసుకొని రాశా. క్యాన్సర్‌పై రాసిన ‘ప్రార్థన’కూ అంతే! ఆ మాటకొస్తే, ప్రతి రచనకూ రిసెర్చ్ చేస్తా. (వ్యంగ్యంగా...) అప్పుడు అడగలేదేం ఈ ప్రశ్న. ఒక్క ‘తులసిదళం’కే అడుగుతారేం? నా కన్నా ముందు విశ్వనాథ సత్యనారాయణ ‘బాణామతి’ రాశారు. అదింత ప్రాచుర్యం పొందలేదు. నాది పాపులరయ్యేసరికి గొడవ! అసలు ‘తులసిదళం’ నవలలకు ప్రేరణేంటి? బ్యాంక్ పని మీద ఒరిస్సా వెళ్ళినప్పుడు అక్కడ ఒక గ్రామంలో చూసిన సంఘటనలు, అక్కడ తెలుసుకున్న విషయాలు నాలో ఆలోచన రేపాయి. అప్పటికే వచ్చిన ‘ఎగ్జార్సిస్ట్’, ‘ఓమెన్’ లాంటి హారర్ చిత్రాల ప్రేరణతో అప్పుడీ నవలలు రాశా. అక్కడ బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళనూ చూశా. అదంతా వట్టి బూటకమని గ్రహించా. అదే రాశా. కాకపోతే, ఆ నవలల వల్ల కొందరిలో మూఢనమ్మకాలు పెరగడం, కొంత నష్టం జరగడం నిజమే. ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ అలాంటి నవలలు రాయమంటే రాస్తారా? కోట్లిస్తానన్నా సరే, రాయను. అప్పట్లోనే ‘రెండు లక్షలిస్తా.. అలాంటి నవల రాయ’మని సంపాదకుడు కందనాతి చెన్నారెడ్డి అడిగినా, నిరాకరించా. వాటికి అప్పట్లో క్రేజ్ కానీ, నా బెస్ట్ సెల్లర్స్ ‘వెన్నెల్లో ఆడపిల్ల’ లాంటివే! కానీ, ‘తులసిదళం’ ప్రేరణతో చాలా వచ్చాయి. మీ ‘వేపమండలు’ కూడా! (నవ్వుతూ...) నిజమే. ‘తులసిదళం’కి పేరడీగానే ‘వెన్నెలకంటి వసంతసేన’ లాంటి పేరుతో ‘వేపమండలు’ రాశా. కామెడీ రాయలేనన్న వారికీ, ఆ గొడవకూ నా జవాబు ఆ రచన. ఒక్క ముక్కలో, ‘తులసిదళం’ చందమామ కథ. రాకుమార్తె, రాక్షసుడు బదులు పసిపాప, మాంత్రికుడు పాత్రలు పెట్టా. మీరేమన్నా, అప్పట్లో మీపై ‘క్షుద్ర సాహిత్యకారుడ’నే ముద్ర బలంగానే పడింది. చాలామంది రచయితలకున్న ‘కంఫర్ట్ జోన్’ను బద్దలు కొట్టడంతో, అసూయతో నా మీద వేసిన ముద్ర అది. ‘తులసిదళం’ బాగా సక్సెస్ కావడంతో అందరూ దుమ్మెత్తిపోశారు. దాంతో, రకరకాల నవలలు రాసి, విమర్శకుల నోళ్ళు మూయించా. ‘అంతర్ముఖం’ లాంటివి రాసింది అందుకే! ఆ పాపులర్ నవలా శకంలో ఆఖరు యోధుడు మీరే అనుకోవచ్చా? పాపులర్ నవలా రచనా శకం ఆగిపోయింది. ఇప్పుడు ఎవరి నవలలూ మునుపటిలా అమ్ముడవడం లేదు. అయితే, నవలా శకం యోధుల్లో ఆఖరువాణ్ణి నేను కాదు కానీ, ఆఖరు వాళ్ళలో నేనూ ఒకణ్ణి! ఒకప్పుడు కొవ్వలి లాగా నా రచనలూ తెలుగునాట కొత్త పాఠకుల్ని సృష్టించాయి. పాపులర్ సాహిత్యంతో కాకపోతే, నవలల ద్వారా వచ్చిన పాపులారిటీ కన్నా ‘విలేజ్‌లో వినాయకుడు’, ‘పవిత్ర’ లాంటి చిత్రాల్లో నటించడం ద్వారా వచ్చింది ఎక్కువ. జనం నన్ను చూడగానే గుర్తుపట్టడం పెరిగింది. మీ నవలలు చాలా సినిమాలుగా వచ్చాయి. మీరు స్క్రిప్టులూ రాసేవారు. ఇటీవల అవి రావడం, మీరు రాయడం కూడా తగ్గిందే? రచయితకు అభిప్రాయాలు, సిద్ధాంతాలు నిర్దిష్టమై, స్పష్టమవుతున్న కొద్దీ సామాన్య పాఠకుల్ని కోల్పోతాడు. ఒకప్పటిలా ప్రేయసీ ప్రియుల కబుర్ల లాంటి స్టుపిడ్ చెత్త రాయలేడు. అందుకే, నేను నవలల నుంచి వ్యక్తిత్వ వికాస రచనల వైపు మళ్ళాను. బి.వి. పట్టాభిరావ్ు ప్రోత్సాహంతో వ్యక్తిత్వ వికాస బోధకుణ్ణయ్యా. ఇక, మృణాల్‌సేన్ ‘ఒక ఊరి కథ’కు మాటల రచయితగా మొదలైన నా సినిమా ప్రస్థానం మరో సుదీర్ఘ ఇంటర్వ్యూ అవుతుంది. నిర్మాత కె.ఎస్. రామారావు లేకపోతే, సినిమాల్లో యండమూరి లేడు. మారిన కాలంలో ఇప్పటి దర్శక, నిర్మాతలు పిలవడమూ లేదు. నేను రాయడమూ లేదు. ‘అనామిక’ లాంటి వాటికి అరుదుగా పనిచేస్తున్నా. టీవీ దర్శకుడిగా అవార్డులందుకున్న మీరు సినీ దర్శకుడిగా ఫెయిలయ్యారే? సినీ దర్శకత్వానికి చాలా ఓర్పు ఉండాలి. చాలా అంశాలు లెక్కలోకి తీసుకోవాలి. నాకు పోటీదారులు ఎవరూ లేరు! - యండమూరి కానీ, టీవీలో మనకు నచ్చినట్లు తీసుకోవచ్చు. ‘వెన్నెల్లో ఆడపిల్ల’, ‘తులసిదళం’, ‘ప్రియురాలు పిలిచె’, ‘భార్యా గుణవతీ శత్రుః’ నవలలకు టీవీ సీరియల్స్‌కు దర్శకత్వం ఆనందాన్నిచ్చింది. మీ నవలలకూ, మీకూ కన్నడంలో బ్రహ్మరథం పడతారని విన్నాం? నిజమే. దక్షిణాది భాషలన్నిటిలోకీ నా రచనలు వెళ్ళినా, కన్నడంలో నాకు మరీ క్రేజ్. ఇంకా చెప్పాలంటే, తెలుగులో కన్నా ఎక్కువ. ‘లోయ నుంచి శిఖరానికి’ రచన పది రోజుల క్రితమే కన్నడంలో వచ్చింది. ఈ వారం టాప్10 కన్నడ బుక్స్‌లో మొదటి స్థానంలో ఉంది. మీ నవలల్లో సిడ్నీ షెల్డన్ లాంటి వారు అంతర్లీనంగా ఎంత ఉన్నారు? జేమ్స్ హ్యాడ్లీ ఛేజ్ నాకూ, నా శైలికీ ప్రేరణ. ఆంగ్ల నవలల ప్రేరణతో రచన చేసినప్పుడు ఆ సంగతి నా నవలల ముందు పేజీలోనే చెప్పేశా. మరి, మీ వ్యక్తిత్వ బుక్స్‌లో మీ పాలెంత? కార్నెగీ వగైరాల భాగమెంత? స్టీఫెన్ కోవే ప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస రచన ‘7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్’ ప్రేరణతో ‘విజయానికి 5 మెట్లు’ అని పేరుపెట్టా. అంతే! విజయవాడలో మీ అభిమాని జ్యోతి అనుమానాస్పద మరణం... (మధ్యలోనే అందుకుంటూ) అది ముగిసిన కథ. ఆ సంగతి తెలిసిన వాళ్ళు ముసలివాళ్ళయిపోయారు. నా ప్రమేయం లేని మరణం గురించి కొందరు చేసిన రచ్చను ఇవాళ్టికీ ప్రస్తావించడం సెన్సేషన్ కోసమే! ఇంతకీ, మీ జీవన సిద్ధాంతం ఏమిటి? ఇంకొకరికి నష్టం లేకుండా నాకు నచ్చిన విధంగా నేను బతకడం! అదే నా ఫిలాసఫీ. మనం ఏం చేసినా అందరికీ నచ్చం. కాబట్టి, ఇతరులకు నచ్చేలా బతకాలనుకోవడం వృథా. మరి, మీ రచనా సిద్ధాంతం మాటేమిటి? మొదట కమ్యూనిస్టు భావాలతో ఉండేవాణ్ణి. పోనూపోనూ అది ఒక ఊహాస్వర్గం అనిపించింది. ఆ తరువాత క్రమంలో అతి బీదరికం స్థితి నుంచి అత్యున్నత స్థాయికి చేరడమనే (ర్యాగ్స్ టు రిచెస్) భావన, ఆ ఉదాహరణలు ప్రేరణనిచ్చాయి. అప్పటి నుంచి నా రచనలు దాని మీదే నడుస్తున్నాయి. ‘బీదవాడిగా పుట్టడం తప్పు కాదు. కానీ, బీదవాడిగానే మరణించడం తప్పు’ అని నేను అనేది అందుకే! డబ్బు లేకపోవడం ఒక రకంగా వరం. జీవితంలో పైకి రావడానికి కసితో పనిచేస్తాం. ‘భగవద్గీత’ను ప్రస్తావిస్తున్నారు. కానీ, ఇది మెటీరియలిస్టిక్‌గా లేదూ! నన్నడిగితే, అసలు భగవద్గీత చెప్పిందే పెద్ద మెటీరియలిజమ్. ‘భవబంధాలు తెంచుకో! చంపాల్సి వస్తే చంపెయ్! కర్తవ్యం నిర్వర్తించడం ముఖ్యం’ అనేగా భగవద్గీత చెప్పింది. అందుకే, పిల్లలకు నేనెప్పుడూ చెప్పేది - ‘చదవడమనేది ఆనందం. దాన్ని ఆస్వాదించండి. పాసవడం, ర్యాంక్ రావడం బోనస్. దానంతట అది జరుగుతుంది.’ మీ ఇల్లు, సౌండ్ ప్రూఫ్ స్టడీరూమ్, బెడ్ రూమ్ కళాత్మకంగా ఉన్నాయే! 1982లో ఈ ఇల్లు కట్టుకున్నా. ఈ డిజైనింగ్, కలర్స అంతా నా ఆలోచనే! జీవితంలో చాలా చిన్న విషయాలకు కూడా ఆనందిస్తుంటా. (పక్కనే ఉన్న పార్కులో చెట్లు చూపిస్తూ...) చెట్లంటే నాకిష్టం. ఈ పార్కులోని చెట్లు, ఈ సందులోకి వస్తుంటే రోడ్డుపై కనిపించే చెట్లు నేను నాటినవే. ఇంట్లో పక్షులు, అక్వేరియమ్‌లో చేపలు పెంచుతా. స్మార్ట్ ఫోన్ల యుగంలోనూ బేసిక్ ఫోన్ దగ్గరే ఉన్నారేం? అవసరం తీరాలి. అదే సమయంలో సౌకర్యం ఉండాలి. అంతకు మించి ఎందుకు? పెద్ద కారు, సొంత ఇల్లు, ఏసీ, అవసరాలు తీర్చేంత ఆదాయం ఉన్నాయి. ఎప్పుడూ ఇంట్లోనే ఉండే నాకు... ఫోన్ మాట్లాడుకోవడానికే! దానికి ఇది చాలు కదా! అవసరాలు తీరగా మిగిలిన డబ్బుతో 2006లో కాకినాడ దగ్గర ‘సరస్వతీ విద్యాపీఠం’ పెట్టింది అందుకే! పేద స్కూళ్ళలో చదివే విద్యార్థుల్ని రప్పించి, ఆత్మవిశ్వాసం పెంచి, మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆనందం ఉంది. మీ జీవితంలో మీరు మర్చిపోలేని వ్యక్తులు... నా మీద ప్రభావం చూపిన మా నాన్న గారు. నాలో ఒక రచయిత ఉన్నాడని గుర్తించి, తొలి రోజుల్లోనే నా నాటికలు, రచనలు వేసిన అప్పటి పత్రికా సంపాదకుడు, ప్రతిభ ఎక్కడున్నా పసిగట్టి ప్రోత్సహించే వ్యక్తి - పురాణం సుబ్రహ్మణ్యశర్మ. నాటకాలు ప్రదర్శించే రోజుల్లో వెన్నంటి ఉండి, నన్ను తీర్చిదిద్దిన దేశిరాజు హనుమంతరావు. కానీ, స్టార్ రచయితగా మీకు, అలాగే మరికొందరు కాలమిస్ట్‌లకు పేరు రావడానికి ‘ఆంధ్రభూమి’ వీక్లీ సంపాదకుడు సి.క.రాజు కారణమేమో? నిజమే. సి. కనకాంబరరాజు ఆ పని చేశారు. అయితే, అది నా వల్ల పత్రికకూ, పత్రిక వల్ల నాకూ పరస్పర ప్రయోజనం ఉందని చేపట్టిన పని. ఇద్దరం లాభపడ్డాం. కానీ, పురాణం గారికి అది లేదు. మంచి రచయిత ఎక్కడున్నా, ప్రతిభను ప్రోత్సహించేవారు. నా తొలి నాటిక ‘గులకరాళ్ళు- గులాబీముళ్ళు’ను ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీలో ఆయనే వేశారు. మీ తోబుట్టువుల సంగతి ... మేము నలుగురు అన్నదమ్ములం. నేను అందరి కన్నా పెద్ద. సాహిత్యాభిమానం, బెంగాలీ సాహిత్య ప్రభావంతో మా నాన్న గారు మా అందరికీ ఆ తరహా పేర్లు పెట్టారు. పెద్ద తమ్ముడు - రాజేంద్రనాథ్. ఇన్‌కమ్‌ట్యాక్స్ విభాగంలో పనిచేసి, రిటైరయ్యాడు. రెండో తమ్ముడు మణేంద్రనాథ్. బల్బుల తయారీ చేస్తుంటాడు. ఆఖరు తమ్ముడు డాక్టర్ కమలేంద్రనాథ్. కాకినాడలో ఫిజీషియన్. వాడూ కథలు రాస్తుంటాడు. ఎమోషన్స్‌ను అక్షరాల్లో పండించే మీకు బయట ఎమోషన్స్ ఉండవట! నాన్న గారంటే అమిత గౌరవం. కానీ, బయటకు ప్రదర్శించలేకపోయా. ఆయన పోయాక, ఆ బాధతో ‘అంతర్ముఖం’ రాశా. ఆయన పోయిన మంచం మీదే ఇవాళ్టికీ పడుకుంటా. స్నేహితులన్నా, బంధువులన్నా మనసులో ప్రేమ లేదని కాదు. అవసరానికి ఆదుకుంటా కానీ, ప్రేమను బాహాటంగా ప్రదర్శించడం నాకు తెలియదు. ‘ఎటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్’ అనే భగవద్గీత సిద్ధాంతాన్ని అనుసరిస్తుంటాను. భావోద్వేగాల మీద అదుపున్న మీరు బాధపడే సందర్భాలుంటాయా? ఎందుకుండవు? ఒక పచ్చని చెట్టును ఎవరైనా కొట్టేసినా, రోడ్డు మీద చిన్నపాపకు దెబ్బ తగిలినా బాధపడతా. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అతివేగంతో వాహనాలు నడిపి, నా మిత్రుల కొడుకులు అయిదారుగురు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. నాకు బాధ అనిపించింది. పెద్దల పెంపకం సరిగ్గా లేదేమని బాధపడ్డా. మీ మనసు బాగా లేనప్పుడు ఏం చేస్తుంటారు? నిజం చెప్పాలంటే... అంతకు ముందు మాటెలా ఉన్నా, గడచిన 20 ఏళ్ళుగా నాకు వ్యక్తిగతంగా మనసు బాగా లేకపోవడమనేది లేదు. మరి, మీ ఏకైక కుమారుడి పెంపకంలో మీ పాత్ర ఏమిటి? మా అబ్బాయి ప్రణీత్ పెంపకంలో, సక్సెస్‌లో మా ఆవిడ అనుగీత పాత్ర 95 శాతం. నా పాత్ర 5 శాతం. అయితే, చిన్నప్పటి నుంచి తెలివైన ప్రశ్నలు వేయించి, వాడి ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్దడంలో నా పాత్ర ఉంది. ఇంటర్ పాసవగానే, వాడు ఉద్యోగంలో చేరాడు. సంపాదించుకుంటూనే, సి.ఏ చదివి, పెద్ద చార్టెర్డ్ అకౌంటెంట్‌గా ఇవాళ సింగపూర్‌లో స్థిరపడ్డాడు. ఇప్పుడు వాడి జీతం ఏటా 2 కోట్ల 70 లక్షలు. మీ అబ్బాయి పెళ్ళి విషయంలో కూడా మీ పాత్ర చాలా ఉందట! అవును. పిల్లలు లవ్ మ్యారేజ్, కులాంతర వివాహం అనగానే చాలామంది పెద్దలు బిగుసుకుపోతారు. అది తప్పు. మా అబ్బాయి, కోడలిది కులాంతర, రాష్ట్రాంతర వివాహం. సంప్రదాయబద్ధమైన, సామాన్య తమిళ అయ్యంగార్ కుటుంబానికి చెందిన ఆ అమ్మాయి సి.ఎలో ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్. వాళ్ళు ప్రేమించుకున్నారు. అబ్బాయి కన్నా ఆమె కొన్ని నెలలు పెద్దది. అయినా సరే, కులాలు, ఆర్థిక అంతరాలన్నీ పక్కనపెట్టి, నేనే మద్రాసు వెళ్ళి, వాళ్ళ పెద్దలతో మాట్లాడి వచ్చా. వాళ్ళదీ, మాదీ ఒకటే గోత్రం. పెళ్ళి కోసం మా కులం, గోత్రం అబద్ధమాడి, వాళ్ళ పెళ్ళి జరిపించా. నాకు ఇద్దరు మనుమళ్ళు. చిన్నప్పటి నుంచి దేనికీ భయపడకుండా తీర్చిదిద్దుతున్నారు. జీన్స్ మాత్రమే కాక పెంపకం కూడా పిల్లల్ని ఎంతో మారుస్తుంది. తొలినాళ్ళ ‘కుక్క’ నాటి వీరేన్కూ, ఇవాళ పాపులర్ ‘లోయ నుంచి శిఖరానికి’ నాటి యండమూరికీ మీరు గమనించిన తేడా? అప్పట్లో ఉండే పొగరు ఇప్పుడు తగ్గిపోయింది. గడచిన 15 ఏళ్ళుగా కోపం బాగా తగ్గింది. కాకపోతే, ఎవరో ఫోన్ చేసి, ఏదో అర్థం పర్థం లేనివి అడిగినప్పుడు మాత్రం చిరాకు వస్తుంటుంది. ఏ రంగంలోనైనా సమకాలికులతో పోటీ, ఈర్ష్య ఉంటాయి కదా... అతి చిన్న వయసులోనే అత్యధిక జీతం తీసుకొనేవాణ్ణి. నా రచనల వల్ల పాఠకుల్లో పెద్ద క్రేజ్. ఉత్తరాలు, ఆటోగ్రాఫ్‌లు సరేసరి! అవన్నీ చూసి, ఆఫీసులో అసూయపడ్డవాళ్ళున్నారు. పట్టించుకోలేదు. ఇక, రచయితగా వస్తే, నేనేప్పుడూ ఎవరినీ నాకు పోటీ అనుకోను. నాకన్నా పై స్థాయి రచయితలు - విశ్వనాథ, జాషువా లాంటి వాళ్ళున్నారు. నా కన్నా కింది స్థాయి వాళ్ళున్నారు. నాతో సమాన స్థాయి వాళ్ళు, పోటీదారులు ఎవరూ లేరు. ఒక్కమాట... ‘నీ గురించి నీ శత్రువు ఎక్కువ ఆలోచిస్తున్నాడంటే... వాణ్ణి నువ్వెప్పుడో గెలిచావు’! నవలా సాహిత్యానికి మళ్ళీ మునుపటి వైభవం వస్తుందంటారా? పాఠకులలో వచ్చిన మార్పు వల్ల ఆ రకం పుస్తకాల అమ్మకాలు తగ్గాయి. అయితే, కథ ఉంటూనే వ్యక్తిత్వ వికాసాన్ని కూడా జొప్పించేలా చేసే రచనలకు ఆదరణ ఉంటుందని నా భావన. అందుకే, అలాంటి రచనలు చేస్తున్నా. ఏదైనా మనకు మనం మార్కెట్ సృష్టించుకోవాలి. దానికి కష్టపడాలి. అంత కృషి చేసేవారు ప్రస్తుతం తక్కువ. మీకు తగినంత గుర్తింపు, అవార్డులు రాలేదని భావిస్తున్నారా? యాదృచ్ఛికంగా రచయితనైన నాకు ఎక్కువ గుర్తింపే వచ్చింది. అవార్డులు రాలేదన్న బాధ నాకు లేదు. కొన్నేళ్ళుగా మీ మనసులో సుడులు తిరుగుతున్న మీ కలల ప్రాజెక్ట్? అలాంటిదేమీ లేదు. ఏకకాలంలో మూడు, నాలుగు ప్రాజెక్ట్‌లు మనసులో ఉంటాయి. ప్రస్తుతం కథనూ, వ్యక్తిత్వ వికాసాన్నీ జొప్పించే రీతిలోనే ‘దున్నపోతులు’ అనే రచన చేయాలనుకుంటున్నా. ‘పిల్లలకు పదివేల పేర్లు’ ప్రాజెక్ట్ చేస్తున్నా. త్వరలోనే అది బయటకు రానుంది. ఇంతకీ భవిష్యత్తు మిమ్మల్నెలా గుర్తుంచుకోవాలని అనుకుంటున్నారు? తరువాతి తరాలు గుర్తుపెట్టుకోవడానికీ, గుర్తుపెట్టుకోకపోవడానికీ చాలా కారణాలే ఉంటాయి. శ్రీశ్రీ గురించి ఇవాళ్టికీ గుర్తుపెట్టుకుంటున్నారు. అంతకన్నా గొప్ప రచయితలున్నా, ఆయన నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల నమ్మకం ఉన్నవాళ్ళు పెద్ద సంఖ్యలో ఉండబట్టే, ఆయన జనంలో గుర్తున్నారు. రేపు నన్నెలా, ఎంతమంది గుర్తు చేసుకుంటారన్నది ఇప్పుడు చెప్పలేం. అయితే, జనం నన్ను పాపులర్ నవలా రచయితగానే గుర్తు పెట్టుకుంటారనుకుంటా! ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ -
నాన్నా! నన్ను క్షమించు!!
అంతర వీక్షణం! యండమూరి వీరేంద్రనాథ్ పరిచయం అక్కర్లేని ప్రముఖులు. నవలా రచయితగా తెలుగు పాఠకులను అక్షర నీహారికతో గిలిగింతలు పెట్టిన రచయిత. ఆయన వ్యక్తిత్వాన్ని, జీవితానుభవాన్ని క్లుప్తంగా తెలియచేసే ప్రయత్నమే ఈ అంతరవీక్షణం. మీ గురించి మీరు ఒక్కమాటలో... నా కృషే నా బలం. పెద్దగా తెలివితేటలు లేకపోయినా కృషితో ఎదిగాను. మీలో మీకు నచ్చే లక్షణం, అలాగే నచ్చని లక్షణం... నచ్చే లక్షణం... అనుకున్న పని పూర్తి చేయడానికి అవసరమైనంత కష్టపడడం, రాజీ పడకపోవడం. నచ్చని లక్షణం... ప్రపంచం పట్ల చిరాకు. ఎదుటి వారిని చూసే దృష్టి కోణం ఎలా ఉంటుంది ? వీరికి జీవితం పట్ల ప్రేమ (జీవితేచ్ఛ) ఉందా లేదా అని చూస్తాను. ఎలాంటి వ్యక్తులను ఇష్టపడతారు ? చేస్తున్న పని, ఉద్యోగాన్ని... సిన్సియర్‌గా చేసేవారిని. మీరు సృష్టించి మలిచిన పాత్రల్లో ఏ పాత్ర అంటే ఎక్కువ ఇష్టం? ఆనందోబ్రహ్మ నవలలో మందాకిని పాత్ర. ఎక్కడ స్థిరపడాలనుకున్నారు? ఎక్కడ స్థిరపడ్డారు? (రంగం, ప్రదేశం) ఉద్యోగం వస్తే చాలనుకున్నాను, రచయితనయ్యాను. ఇక ప్రదేశం విషయానికి వస్తే ఇప్పుడు కాకినాడలో స్థిరపడితే బావుణ్ణనిపిస్తోంది. మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి ఎవరు ? తండ్రి, అలాగే నన్ను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి కూడా ఆయనే. మిమ్మల్ని కెరీర్ దిశగా ప్రభావితం చేసిన సందర్భం, సంఘటన... ఎం.కామ్ చదవడానికి డబ్బుల్లేక సి.ఎలో చేరడం. తొలి సంపాదన ? ఏడవ తరగతిలో... ట్యూషన్ చెప్పడం ద్వారా. పెద్ద మొత్తం అందుకున్న సందర్భం? బెంగళూరులో ఒక గంట ప్రసంగానికి జిఎమ్ఆర్ (గ్రంథి మల్లికార్జునరావు) లక్ష రూపాయల చెక్కు ఇచ్చారు. అది నేను ఊహించని మొత్తం. మిమ్మల్ని అత్యంత బాధ పెట్టే విషయాలు? అర్థంపర్థం లేని విమర్శలు. విమర్శ ఎప్పుడూ కన్‌స్ట్రక్టివ్‌గా ఉండాలి. అలా చేసి ఉండాల్సింది కాదని పదే పదే అనుకున్న సందర్భం... నాన్న చివరి రోజుల్లో ఆయన దగ్గర గడిపి ఉంటే బావుండేదని చాలాసార్లు అనిపిస్తుంటుంది. మీరు ఎవరికైనా క్షమాపణ చెప్పుకోవాల్సి ఉందా? మా నాన్నకే. ‘నా నుంచి సహాయం పొంది నాకే ద్రోహం చేశార’నే ఆరోపణ ఉందా? ఒక మంచి స్నేహితుడు డబ్బు అప్పుగా తీసుకుని ముఖం చాటేశాడు. అతడు డబ్బు ఇవ్వలేనని చెప్పినా ఇంత బాధపడేవాడిని కాదేమో. భాగస్వామికి తగినంత సమయం కేటాయిస్తున్నానని అనుకుంటున్నారా? లేదు. చాలా అన్యాయమే చేశాననిపిస్తుంటుంది. జీవితంలో అట్టడుగు నుంచి పెకైదిగిన వారందరి పరిస్థితి ఇలాగే ఉంటుందనుకుంటాను. జీవితంలో ఆనందపడిన క్షణాలు... చిన్న విషయానికే ఆనందపడిపోతాను. ఒక మంచి వాక్యం రాస్తే ఆ రోజంతా సంతోషంగా ఉంటాను. వంట బాగా కుదిరినప్పుడు కూడా. మిమ్మల్ని భయపెట్టే విషయాలేంటి? నన్ను ఏ విషయమూ భయపెట్టదు. భవబంధాలకు అతీతుణ్ని. ఒక్క రోజు మిగిలి ఉంటే ఏం చేస్తారు? ఆ రోజును ఎలా గడుపుతారు? ఆర్థిక విషయాలను, అసంపూర్తిగా ఉన్న స్క్రిప్టును పరిష్కరిస్తాను. ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? చాలాసార్లు. ఎక్కువ అబద్ధాలు మా ఆవిడ అనుగీతతోనే. ఆమె సంతోషించే చిన్న అబద్ధాలనే చెప్తాను. నా ప్రయోజనం కోసం కాదు. దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు? నేనసలు దేవుడినే నమ్మను. అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటారు? గుడ్... వృద్ధాప్యం రాలేదు. ఇంకా ఎన్ని ప్రోగ్రామ్లైనా చేయవచ్చు. సమాజానికి ఏం చెప్తారు? రేపటి మరింత ఆనందం కోసం ఈ రోజు బాగా పని చేయాలి. - వాకా మంజులారెడ్డి -
తల్లిదండ్రుల చేతుల్లోనే భవిష్యత్
యండమూరి వీరేంద్రనాథ్ చిక్కబళ్లాపురం, న్యూస్‌లైన్ : విద్యార్థులు చాలా చదువులో వెనకబడి ఉన్నారంటే దానికి మూల కారణం పాఠం ఉపాధ్యాయులు కాదని, ముఖ్య కారణం తల్లిదండ్రులేనని సినీ రచయిత, కవి యండమూరి వీరేంధ్రనాథ్ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని విష్ణుప్రియ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన ’విద్యార్థులు, పోషకులు’ అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ... విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో ఆట, పాట కూడా అంతే అవసరమన్నారు. శని, ఆదివారాల్లో తమ పిల్లలకు ఆటపాటలతో చారిత్రక సంఘటనలు వివరించాలన్నారు. అలా చేస్తే ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాం, మదర్ థెరిస్సా అవుతారని అన్నారు. తాను విద్యార్థి దశలో అనేక కష్టాలను అనుభవించానని యుండమూరి గుర్తు చేసుకున్నారు. 6, 7 తరగతుల్లో ఫెయిల్ అయ్యానని, ఆ సమయంలో తన తండ్రి తనను సరైన మార్గంలో పెట్టడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. అప్పటి నుంచి పట్టదలతో సీఏ పూర్తి చేశానన్నారు. అటు తరువాత చిన్న చిన్న కథలు రాయడం ఆ కథలను ప్రజలు ఆదరించడం జరిగిందన్నారు. అప్పట్లో చిరంజీవి నటించిన అభిలాష సినిమా కథ తనదేనన్నారు. అటు తరువాత అనేక పుస్తకాలు, నవలలు రాస్తూనే ఉన్నట్లు యుండమూరి అన్నారు. అంతకు ముందు ఆయన కొంతమంది విద్యార్థులను పిలిచి వారి ఇష్టాఇష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉన్న అనుబంధాలను గురించి వివరించారు. కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు రామచంద్రారెడ్డి, సీఐ బాలాజీసింగ్, విద్యా నిపుణులు కోడి రంగప్ప, కసపా మాజీ తాలూకా అధ్యక్షుడు గోపాలగౌడ తదితరులు పాల్గొన్నారు. -
ఫేస్బుక్ అమ్మాయి ఫ్రెండ్షిప్ రిక్వస్ట్!
‘ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్లకుంటాయి...’ ఫేస్బుక్ స్నేహాంలో కూడా ఈ వాక్యాన్ని అన్వయించుకోవచ్చు. తాము ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలనుకొంటున్నామో, చాటింగ్ చేద్దామనుకొంటున్నామో అమ్మాయిలకూ, అబ్బాయిలకూ చాలా క్లారిటీ ఉంటుందని చెప్పవచ్చు. ‘‘డియర్ గర్ల్... నీకు నేను ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెట్టినంత మాత్రాన నిన్ను లవ్ చేస్తున్నట్టు కాదు, నిన్ను లవ్‌లో పడేయాలని కాదు, ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌ను డిలీట్ చేయడం నీ గొప్పతనమూ కాదు..!’’ తన ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయని అమ్మాయికి ఒక అబ్బాయి పెట్టిన మెసేజ్ ఇది... విరిసే ప్రతి పువ్వూ పరిమళాన్ని వెదజల్లలేదు. ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టిన వాళ్లంతా ‘ఫ్రెండ్స్’ కాలేరు! తను తిరస్కరించిన రిక్వెస్ట్‌కు కొంచెం ఘాటుగా, స్వీటుగా అమ్మాయి చెప్పిన సమాధానం ఇది! అమ్మాయిలతో స్నేహం చేయడానికి అబ్బాయిలు కెరటాల్లా ఎగసి పడుతున్నారు! ఇగోలు చంపుకొని ఫ్రెండ్షిప్ కోసం రిక్వెస్ట్ పెడుతూ స్నేహం కోసం అర్థిస్తున్నారు. కానీ ఇలాంటి అబ్బాయిలు ఎక్కువమంది ఉండటం అమ్మాయిలకు ఇబ్బందిగా మారుతోంది. సోషల్నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో అమ్మాయి, అబ్బాయిల మధ్య కొత్త పోరాటానికి దారి తీస్తోంది. అబ్బాయిలు ఇంతగానా..! ఒక లేడీ ప్రొఫైల్ మీద ఒక అకౌంట్ ఉంటే దానికి రోజుకు సగటున పదిమంది అబ్బాయిల నుంచి ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్స్ వస్తున్నాయి. లాగిన్ అయిన మరుక్షణం డజన్ల సంఖ్యలో ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌లు కనిపిస్తుండే సరికి చాలా మంది అమ్మాయిలు నివ్వెర పోతున్నారు! మరోవైపు - డెరైక్ట్‌గా మన మొహం చూపించాల్సిన పని లేదు, ఒకే క్లిక్‌తో స్నేహాన్ని సంపాదించే అవకాశం ఉంది. అమ్మాయి ఫ్రెండ్షిప్కు ఓకే చెబితే పర్వాలేదు, లేదంటే.. లివిట్! - ఇదీ అబ్బాయిల తీరు. నిజమైన ఫ్రెండ్షిప్కు స్థానముందా?! ఇద్దరు అపరిచితులైన అమ్మాయి, అబ్బాయిల మధ్య ఫేస్బుక్లో స్నేహం చిగురించే అవకాశం ఉందా? అంటే సమాధానానికి చాలా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడంతో మొదలు కొని, వారి స్నేహం కొనసాగాలంటే చాలా ఫ్యాక్టర్స్ పనిచే యాల్సి ఉంటుంది. అవన్నీ సహకరిస్తే ఫేస్బుక్స్నేహం ఫలప్రదం అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఫ్యాక్టర్స్‌లో చదువు, ఉద్యోగం, కులం... అన్నీ ప్రభావం చూపుతున్నాయి. అందమైన ప్రొఫైల్.. ‘ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్లకుంటాయి...’ ఫేస్బుక్ స్నేహాంలో కూడా ఈ వాక్యాన్ని అన్వయించుకోవచ్చు. తాము ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలనుకొంటున్నామో, చాటింగ్ చేద్దామనుకొంటున్నామో అమ్మాయిలకూ, అబ్బాయిలకూ చాలా క్లారిటీ ఉంటుందని చెప్పవచ్చు. తమ స్టడీస్‌కూ, కెరీర్‌కు, లైఫ్‌కు, లైఫ్‌స్టైల్‌కు... రీచ్ అవుతారనుకొనే వారికే అమ్మాయిలు తమ ఎఫ్బీ అకౌంట్‌కు స్వాగతం చెప్పే ట్రెండ్ కనిపిస్తోందిప్పుడు. దీన్ని బట్టి అబ్బాయిల ఎఫ్బీ ప్రొఫైల్‌ను బట్టి అమ్మాయిలు స్పందిస్తున్నారని అనుకోవచ్చు. సామాజిక ‘వర్గం’ కూడా..! ఫేస్బుక్ స్నేహాల్లో వ్యక్తిగత అభిరుచులు చాలా వరకూ ప్రభావాన్ని చూపిస్తున్నాయనేది చెప్పుకొన్న విషయమే. ఇందులో సామాజికవర్గాన్ని బట్టి యాక్సెప్టెన్స్ ఉంటుందనేది బహిరంగ రహస్యం. అయితే ప్రతి సారీ ఇది చెల్లుబాటు కావడం లేదు. అమ్మాయిలే అల్టిమేట్! అమ్మాయిల నుంచి అబ్బాయిలకు రిక్వెస్ట్ వచ్చే పరిస్థితులు అత్యంత అరుదు. అమ్మాయిలు తమ రిక్వైర్‌మెంట్స్‌కు రీచ్ అయిన వారినే స్నేహితులుగా సమ్మతినిచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ విషయంలో అమ్మాయిలే అల్టిమేట్ అని చెప్పవచ్చు! - జీవన్‌రెడ్డి.బి మారు పేరే మంచిది! ఒక అమ్మాయి బస్టాప్‌లో కనిపిస్తే పది మంది అబ్బాయిలు బైకులు ఆపుకొని చూస్తారు. ఫేస్బుక్లో కూడా అంతే. ఒక రాయి వేద్దామని అబ్బాయిలు రిక్వెస్ట్ పెట్టవచ్చు. తనకూ ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉందని చెప్పుకోవడానికి వీలుంటుందని అబ్బాయిలు ఇలాంటి ప్రయత్నం చేయవచ్చు. ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ రావడం అంటే అమ్మాయిలకు ఒక రకంగా ఇగో శాటిష్ఫ్యాక్షనే. తన పోస్టింగ్స్‌కు ఎక్కువ లైక్స్ కోరుకొనే అమ్మాయిలు ఫ్రెండ్స్ సంఖ్యను పెంచుకొంటారు. భావాలను పంచుకోవడానికే ఫేస్బుక్ కావాలనుకొనే అమ్మాయిలు మారు పేర్లమీద, ఫోటోలు పెట్టకుండా, అకౌంట్‌ను అపరేట్ చే సే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. - యండమూరి వీరేంద్రనాథ్, ప్రముఖ రచయిత. -
ఒత్తిళ్లను అధిగమిస్తేనే విజయం
ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ బళ్లారి అర్బన్, న్యూస్‌లైన్ : మానసిక ఒత్తిళ్లను అధిగమించినప్పుడే పరీక్షలలో, ఇంటర్వ్యూలలో విజయం సాధ్యమవుతుందని ప్రముఖ నవలా రచయిత, మానసిక వైద్య నిపుణులు, ఫిల్మ్ డెరైక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ విద్యార్థులకు సూచించారు. స్థానిక రాఘవ కళామందిరంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దశల వారీగా శ్రీచైతన్య విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. ఒత్తిళ్లను తట్టుకునే విధానాలపై మెళకువలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చురుకుదనం, బుద్ధి వికాసంతో పాటు శారీరక ఎదుగుదలకు వ్యక్తిత్వ వికాసం తోడ్పడుతుందన్నారు. విద్యార్థులకు విలువతో కూడిన విద్యను అందించి ఉజ్వల భవిష్యత్తు అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యాభివృద్ధితోనే దేశం మరింత పురోభివృద్ధి చెందుతుందన్నారు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి లభించాలంటే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశ్నాపత్రం అందించి జవాబులు సరిచేసే విధానాన్ని క్షుణంగా వివరించారు. అత్యంత వినోదంగా, ఉత్సాహంగా సాగిన యండమూరి ప్రసంగం విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపింది. కార్యక్రమంలో శ్రీచైతన్య పీయూ కళాశాల ప్రిన్సిపాల్ బీ.గోపాల్, శ్రీరాములు, అనిత, ఎన్ చంద్రశేఖర్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
వికాసం: సమస్యని చంపటానికి మూడు బాణాలు
మన ఆయుధం ఎంత గొప్పదైనా, సమస్యని పరిష్కరించేదిగా ఉండాలే తప్ప కేవలం గొప్పదిగా ఉన్నంత మాత్రాన దానితో సమస్యని పరిష్కరించలేం. వింధ్యారణ్య ప్రాంత లోయలో ఒక చిన్న పల్లె ఉంది. పచ్చటి చెట్ల మధ్య సంతోషంగా కాలం గడిపే ఆ గిరిజనులకి అకస్మాత్తుగా ఒక విపత్తు వచ్చి పడింది. గుంపులుగుంపులుగా పులులు వచ్చి వాళ్ల ఆవుల్నీ, గేదెల్నీ పొట్టన పెట్టుకోవటమే కాక, ఇళ్లమీద కూడా దాడి చేయసాగాయి. ఆ గ్రామస్థులు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి శరణు వేడారు. వాళ్లని రక్షించడం కోసం ద్రోణుడు ధర్మరాజుని పంపాడు. ధర్మరాజు వెళ్లి పులుల తాలూకు తరువాతి దాడి కోసం ఆ గ్రామంలో ఎదురుచూశాడు. అవి వచ్చినప్పుడు వాటి నాయకుణ్ని చంపి, మిగతా వాటిని అడవిలోకి పారదోలాడు. విజయోత్సాహంతో గిరిజనులు నాట్యాలు చేశారు. ధర్మరాజుకి ఘనంగా సత్కారం చేసి పంపారు. కానీ వాళ్ల సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. నెల తిరిగే సరికి ఆ క్రూర మృగాలు ఈసారి మరింత పెద్ద గుంపుగా గ్రామం మీద పడ్డాయి. ద్రోణుడు భీముణ్ని పంపాడు. భీముడి ఆయుధం ‘గద’. ప్రపంచంలోకెల్లా గొప్ప ఆయుధాల్లో ఒకటి. అయితే అది ఏనుగుని సంహరించగలదు, రథాల్ని బద్దలగొట్టగలదే తప్ప ‘చురుకైన’ పులుల మీద ఏ ప్రభావమూ చూపించలేకపోయింది. భీముడు క్షతగాత్రుడై పడిపోయాడు. అప్పుడు ద్రోణుడు అర్జునుణ్ని పంపగా, అతను వెళ్లి తనకున్న విలువిద్యా నైపుణ్యంతో అన్ని పెద్దపులుల్ని చంపి తన సోదరుడిని రక్షించి వెనక్కి తెచ్చాడు. ద్రోణుడు అర్జునుణ్ని అభినందించాడు. అయితే సమస్య తీరలేదు. ఏడాది తిరిగే సరికి యవ్వనంతో బలిసిన తరువాతి తరం పులులు గ్రామం మీద భయంకరంగా దాడి చేశాయి. గ్రామస్తులు మళ్లీ వెళ్లి ద్రోణున్ని శరణు వేడారు. అతడు ఈసారి ఆఖరి ఇద్దరిని పంపించాడు. నకుల సహదేవులు వెంటనే రంగంలోకి దిగలేదు. ముందు పరిసర ప్రాంతాలని పరిశీలించారు. గ్రామం చుట్టూ కందకాలు తవ్వించే పని నకులుడు చేపడితే, తగినంత ధైర్యాన్నిచ్చి పులులతో ఎలా యుద్ధం చేయాలో వాళ్లకి సహదేవుడు నేర్పి యుద్ధానికి సంసిద్ధం చేశాడు. ఈసారి పులులు దండెత్తినప్పుడు ఏమాత్రం ప్రాణనష్టం లేకుండా గ్రామస్థులే వాటిని ధైర్యంగా ఎదుర్కొని తరిమికొట్టారు. తిరిగివచ్చిన నకుల సహదేవుల్ని ‘ఇది నిశ్చయంగా మీ విజయం’ అంటూ ద్రోణుడు పొగిడాడు. ఈ కథ మూడు సూత్రాల్ని చెబుతుంది. 1. ఒక సమస్య తాలూకు కొమ్మల్ని కత్తిరిస్తే, తాత్కాలిక విజయం దొరుకుతుందేమో తప్ప పరిష్కారం దొరకదు. 2. సమస్యని ఎదుర్కోవడానికి ముందు దాన్ని నిశితంగా పరిశీలించి, ఏ ఆయుధం వాడాలో తెలుసుకుంటే సగం సమస్య తీరినట్టే. 3. మన ఆయుధం ఎంత గొప్పదైనా, సమస్యని పరిష్కరించేదిగా ఉండాలే తప్ప కేవలం గొప్పదిగా ఉన్నంత మాత్రాన దానితో సమస్యని పరిష్కరించలేం. ‘సమస్య’ అంటే ఏమిటి? ఆర్థిక, గృహ, వృత్తిపరమైన రంగాల్లో బాధనీ, ఇబ్బందినీ కలుగజేసేది. ఇది శారీరకం కావొచ్చు. మానసికం కావొచ్చు. ఇంట్లో జీవిత భాగస్వామితో బాధలు, బయట అవమానాలు, రేపటి పట్ల భయం, దగ్గరివారి మరణం మొదలైనవి ‘మానసిక’ కష్టాలు. అనారోగ్యం, మిట్ట మధ్యాహ్నం మండుటెండలో వెహికల్ ఆగిపోవటం, అర్ధరాత్రి ఏసీ పనిచెయ్యకపోవటం, ‘శారీరక’ బాధలకి ఉదాహరణలు. ‘సమస్యలు క్లిష్టమైనవి కాబట్టి వాటిని మనం ధైర్యంతో ఎదుర్కొనలేము’ అన్న సిద్ధాంతం తప్పు. మనం ధైర్యంతో ఎదుర్కోలేకపోబట్టే సమస్యలు క్లిష్టమౌతాయి. నరకం (సమస్య)లో ఉన్నప్పుడు అక్కడే ఆగిపోతే, శాశ్వతంగా అక్కడే ఉండిపోతాం. అడుగు ముందుకు వేస్తే, బయటపడటానికి కనీసం ‘సగం అవకాశం’ ఉంటుంది. - యండమూరి వీరేంద్రనాథ్ -
వికాసం: తండ్రి - కొడుకు - సైకిల్
‘‘పది నిమిషాల్లో ఈ లెక్ఖ చేస్తే ఎప్పటినుంచో నువ్వు అడుగుతున్న సైకిల్ కొనిపెడతాను. ఒకవేళ చెయ్యలేకపోతే రేపు శని, ఆదివారాల్లో వంట పనంతా నువ్వు చేసి, అమ్మకి విశ్రాంతి ఇవ్వాలి’’ అని ఒక తండ్రి తన కొడుకుని ఉత్సాహపరిచాడు. కొడుకు ఆ ఛాలెంజ్‌కి ఒప్పుకున్నాడు. ఫిజిక్స్ టీచరైన ఆ తండ్రి, కొడుకుని ఈ విధంగా ప్రశ్నించాడు. ‘‘ఆఫ్గనిస్తాన్ ముఖ్య పట్టణమైన కాబుల్ నుంచి పొద్దున ఎనిమిది గంటలకి ‘డిజర్ట్ ఎక్స్‌ప్రెస్’ గంటకి 80 మైళ్ల వేగంతో ఇస్లామాబాద్ వైపు బయలుదేరింది. పాకిస్తాన్ ముఖ్య పట్టణమైన ఇస్లామాబాద్ నుంచి పొద్దున తొమ్మిదింటికి ‘తుఫాన్ మెయిల్’ గంటకి 60 మైళ్ల వేగంతో కాబుల్ వైపు బయలుదేరింది. కాబుల్‌కి, ఇస్లామాబాద్‌కి మధ్య దూరం 480 మైళ్లు అయితే, రెండు రైళ్లూ మధ్యలో పెషావర్ దగ్గర కలుసుకున్నప్పుడు, ఏ ఇంజన్ కాబుల్‌కి దగ్గరగా ఉంటుంది?’’ ఆ కుర్రవాడు ‘కాలము-దూరము’పై రకరకాల లెక్కలు వేసి బుర్ర బద్దలు కొట్టుకుని చివరికి ఆ ప్రశ్న లెక్కలకి సంబంధించినది కాదనీ, ఇంగిత జ్ఞానానికి (కామన్సెన్స్) సంబంధించినదనీ తెలుసుకొని, ‘ఒకే స్టేషన్లో ఆగి ఉన్నప్పుడు రెండూ కాబుల్‌కి ఒకే దూరంలో ఉంటాయి’’ అని చెప్పాడు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం కొడుక్కి సైకిల్ ఇవ్వటానికి ఒప్పుకుంటూ, ‘‘సైన్సు, లెక్కలు తర్కం మీద ఆధారపడి ఉంటాయి. ఆ విధంగా నువ్వు కరెక్టే. కాని ప్రశ్నని అర్థం చేసుకోవడం ఇంకా ముఖ్యం. నా ప్రశ్న నువ్వు సరిగ్గా వినలేదు. నేను ఇంజన్ గురించి అడిగానే తప్ప రైలు గురించి కాదు. కాబుల్ వైపు వెళ్తూన్న రైలు తాలూకు ఇంజన్ కాబుల్‌కి దగ్గరగా ఉంటుంది. నువ్వు ఇంకా బాగా ఆలోచించి ఉంటే మరొక విషయం కూడా అర్థమయ్యేది. దాన్ని భౌగోళిక పరిజ్ఞానంతో కూడిన కామన్సెన్స్ అంటారు. ఆఫ్గనిస్తాన్‌లో అసలు రైళ్లే లేవు.’’ తన తప్పు అర్థం చేసుకున్న ఆ కుర్రవాడు రెండు రోజులపాటు వంటింటి పని చేపట్టాడు. ఆ కుర్రవాడి పేరు జాన్ ఎల్. హాల్! అతడే పెద్దయ్యాక, ఫిజిక్స్‌లో నోబుల్ ప్రైజ్ సంపాదించాడు. పై ఉదాహరణలో నాలుగు ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. 1. చదువు వేరు, జ్ఞానం వేరు. పాఠశాలల్లో కేవలం చదువే చెబుతారు. పిల్లవాడికి జ్ఞానాన్ని పెంపొందించే విషయాలు బోధించవలసిన బాధ్యత తల్లిదండ్రులది. 2. చదువుకుంటున్న వయసులో కూడా పిల్లలు ఇంటి పనుల్లో బాధ్యత వహించేలా చెయ్యాలి. 3. పిల్లల తెలివితేటల్ని జ్ఞానాన్ని గుర్తించి, ఆ గుర్తింపుకి తగిన బహుమతులు ఇస్తూండాలి. 4. ఉత్సాహకరమైన ప్రశ్నలు వేసి ప్రోత్సాహపరిచేకొద్దీ పిల్లల్లో చదువంటే అలసత్వం, భయం పోయి చురుకుతనం పెరుగుతుంది. తన ఆత్మకథలో జాన్ హాల్ ఒకచోట ‘పిల్లవాడు టీవీలో గంటల తరబడి ఫుట్‌బాల్ మ్యాచ్ చూడకుండా ఉండాలి అంటే గెలుపు కన్నా మంచి ఆనందం లేదు’ అన్న విషయం అతడికి తెలిసేలా చెయ్యాలి. ఒక లెక్క సాల్వ్ చేసినా, ఒక జోకు సొంతగా తయారుచేసినా దానికి బహుమతి ఇస్తే, పిల్లలు మత్తు కలిగించే అభిరుచుల నుంచి, అభివృద్ధినిచ్చే అలవాటువైపు మారుతారు’’ అంటాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చిన్నపిల్లల కంటే టీనేజ్లోనే పిల్లలకి పెద్దల అవసరం ఎక్కువ ఉంటుందట. ఆ టీనేజ్ వయసులో ఏడుగురు పిల్లల్లో ఇద్దరు... ఒంటరితనం, ఓవర్ కాన్ఫిడెన్స్, పిరికితనం, డిప్రెషన్ లేదా అతివాగుడు అనే రుగ్మతలతో, కనీసం అందులో కొన్నిటితో బాధపడుతూ ఉంటారని సైకాలజిస్టులు చెబుతారు. పదిలో కనీసం ముగ్గురు తల్లితో గానీ, తండ్రితో గానీ సరిగ్గా మాట్లాడరట. కూతురు ప్రేమలో పడిందని తెలియగానే సమాజాన్నీ సినిమాల్నీ తిడతారు ఇంట్లోవారు. దానికి తామే కారణమని ఒప్పుకోరు. ఇంట్లో సంబంధాలు (ముఖ్యంగా తండ్రితో) బావుంటే ఆడపిల్లలు బయట ప్రేమని వెతుక్కోరు. ‘ఈ ఇంట్లోంచి ఎంత తొందరగా బయటపడదామా’ అన్న ఆలోచనే ఆడపిల్లల్ని అతి చిన్న వయసులో ప్రేమలో పడేలా చేస్తుంది. - యండమూరి వీరేంద్రనాథ్ -
రిలేషణం: అన్నయ్య అందరికన్నా పదేళ్లు ముందుంటాడు..
ఆయన రచనలు కమర్షియల్‌గా వుంటాయి. ఆయన పాత్రలు మెటీరియలిస్టిక్‌గా ప్రవర్తిస్తాయి. ఆయన సంబంధాలు క్యాలిక్యులేటెడ్‌గా వుంటాయి. ఆయన ఆలోచనలు సమాజాన్ని మిస్‌గైడ్ చేస్తుంటాయి... ఇలా ఆయనమీద రకరకాల కామెంట్స్ వినిపిస్తాయి. ఈ రైటర్ అన్నయ్య గురించి తమ్ముడు డాక్టర్ కమలేంద్రనాథ్ చేసిన స్కాన్ రిపోర్ట్... మా కుటుంబంలో అందరికీ ఎంతో కొంత సాహిత్యాభిరుచి వుంది. నాన్నగారు కవి. ఆ రోజుల్లోనే బి.ఎ. చేశారు. లా పట్టా పుచ్చుకున్నారు. నడుస్తూ కూడా పద్యాలు పాడుతుండేవారు. మా మేనమామ వేణుగోపాలరావు కూడా సాహిత్యాభిరుచి వున్నవాడు. అన్నయ్యను గైడ్ చేసేవాడు. తన ప్రభావం నా మీదా వుంది. అందుకే నా హాస్పిటల్‌కు వేణుగోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అని పేరు పెట్టుకున్నాను. అన్నయ్య చిన్నప్పటినుంచే చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తుండేవాడు. ఖమ్మంలో నేను ఐదోతరగతి చదివేటపుడు స్కూల్లో బహుమతి అనే టాపిక్ మీద మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడేం మాట్లాడాలని అడి.గితే, బఠానీ గింజైనా బహుమతి బహుమతే అని ప్రారంభించమన్నారు. నాకు మొదటి బహుమతి వచ్చింది. నేను హైదరాబాద్‌లో చదువుతున్నపుడు తను కాకినాడలో సీఏ చదువుతూ అక్కడే చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసేవాడు. అప్పుడు తను రాసిన ‘ముసురు పట్టిన రాత్రి’ కథ ఇన్‌కమ్‌టాక్స్ మేగజీన్‌లో వచ్చింది. ఆ తరువాత సీఏ పరీక్షలకు హైదరాబాద్ వచ్చాడు. చందమామలో, చిన్న చిన్న పత్రికల్లో రాసేవాడు. తను వచ్చిన ఐదేళ్లకు నేను ఎంబీబీఎస్ కోసం కాకినాడ వెళ్లిపోయాను. ఇలా అటూ ఇటూ మారడంతో మేం కలిసి ఉన్న సమయం చాలా తక్కువ. అన్నయ్య తుళసీదళం రాసినపుడు క్షుద్ర సాహిత్యం అమ్ముకుంటున్నాడని, పర్సనాలిటీ డెవెలప్మెంట్ రాస్తే వ్యక్తిత్వ వికాసాన్ని వ్యాపారం చేస్తున్నాడని విమర్శించారు. అది నిజం కాదు. అన్నయ్య ఆలోచనలో అందరికంటే పదేళ్ల ముందుంటాడు. అన్ని రంగాల్లో సమకాలీనంగా జరుగుతున్న మార్పులను గమనిస్తుంటాడు. దేనికి భవిష్యత్ వుందో గమనించి, దాని గురించి పూర్తిగా తెలుసుకుని మరీ దాని గురించి రాస్తాడు. రచనలకు సంబంధించి అన్నయ్య ప్రభావం నామీద వుంది. నేను తన రచనల్ని జాగ్రత్తగా ఫాలో అవుతాను. సందేహాలొస్తే అడుగుతాను. అన్నయ్య తన భవిష్యత్‌ని కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. తనకు మొదటినుంచీ కాకినాడ పరిసర ప్రాంతాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా గోదావరి అంటే ఇష్టం. అవసానదశలో కాలువ పక్కన కొంచెం స్ధలం వుండాలని, ఒడ్డున కూర్చుని నీళ్లలో గాలం వేసి చేపలు పట్టాలని.. ఇలా ఏవో చాలా ఇమాజినేషన్స్ వున్నాయి తనకు. ఆ మాట నాతో చెపితే కాలువ పక్కన ఒక ఎకరం స్ధలం చూసి పెట్టాను. తనకు అక్షరవరం ప్రసాదించిన సరస్వతికి ఒక గుడి కట్టాలనుకున్నాడు. దాని నిర్మాణం పనులు నేను చూసుకున్నాను. అక్కడే పిల్లలకు విద్యావికాసం పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. పేద పిల్లలను గుర్తించి వారికి అవసరమైన పుస్తకాలు, బట్టలు గిఫ్ట్‌గా ఇస్తుంటాడు. ఈమధ్య కాలంలో వీలైనంత సమయాన్ని తను ఇక్కడే గడుపుతున్నాడు. ప్రిన్సిపుల్స్ ఆఫ్ లైఫ్, ప్రాక్టికాలిటీ, నిర్మొహమాటం... అన్నయ్యలో నాకు నచ్చేవి. ముసుగు వేసుకుని మాట్లాడకూడదనేది అన్నయ్య తత్వం. ముందొకలా, వెనుక మరోలా వుండటం ఆయనకిష్టం వుండదు. నాదీ అదే మనస్తత్వం. రిలేషన్షిప్ నీడ్ నాట్ టు బి ఎక్స్‌ప్రెస్ అనేది మా అభిప్రాయం. అన్నయ్య తనకు నచ్చిన వాళ్లతో చాలా సన్నిహితంగా వుంటాడు. అవసరార్థం కొన్ని రిలేషన్స్ మెయింటెన్ చేస్తాడు. ఐతే కొన్నిసార్లు తను మాతో కూడా ఏదీ ఎక్స్‌ప్రెస్ చేయడు. అదే తనలో నాకు నచ్చనిది. తనలోనూ రైటర్ ఉన్నాడు: వీరేంద్రనాథ్ మేం అన్నదమ్ముల్లా కాదు, స్నేహితులుగా వుంటాం. సంవత్సరానికి ఒకటి రెండుసార్లు కలుస్తుంటాం. కలిసినపుడు మా చర్చ చాలా క్వాలిటేటివ్‌గా వుంటుంది. తనకు సాహిత్యాభిరుచి ఎక్కువే. తనలో ఓ రచయిత వున్నాడని నాకీ మధ్యే తెలిసింది. తను రాసినవి చదివి ఎక్కడైనా క్యారెక్టర్స్, కంటెంట్ రిపీట్ అయితే చెప్తుంటాను. సరస్వతీ విద్యాపీఠానికి సంబంధించి నిర్మాణపను లన్నీ తనే చూసుకున్నాడు. - కె.క్రాంతికుమార్‌రెడ్డి రిలేషణం: అన్నయ్య అందరికన్నా పదేళ్లు ముందుంటాడు.. ఆయన రచనలు కమర్షియల్‌గా వుంటాయి. ఆయన పాత్రలు మెటీరియలిస్టిక్‌గా ప్రవర్తిస్తాయి. ఆయన సంబంధాలు క్యాలిక్యులేటెడ్‌గా వుంటాయి. ఆయన ఆలోచనలు సమాజాన్ని మిస్‌గైడ్ చేస్తుంటాయి... ఇలా ఆయనమీద రకరకాల కామెంట్స్ వినిపిస్తాయి. ఈ రైటర్ అన్నయ్య గురించి తమ్ముడు డాక్టర్ కమలేంద్రనాథ్ చేసిన స్కాన్ రిపోర్ట్... మా కుటుంబంలో అందరికీ ఎంతో కొంత సాహిత్యాభిరుచి వుంది. నాన్నగారు కవి. ఆ రోజుల్లోనే బి.ఎ. చేశారు. లా పట్టా పుచ్చుకున్నారు. నడుస్తూ కూడా పద్యాలు పాడుతుండేవారు. మా మేనమామ వేణుగోపాలరావు కూడా సాహిత్యాభిరుచి వున్నవాడు. అన్నయ్యను గైడ్ చేసేవాడు. తన ప్రభావం నా మీదా వుంది. అందుకే నా హాస్పిటల్‌కు వేణుగోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అని పేరు పెట్టుకున్నాను. అన్నయ్య చిన్నప్పటినుంచే చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తుండేవాడు. ఖమ్మంలో నేను ఐదోతరగతి చదివేటపుడు స్కూల్లో బహుమతి అనే టాపిక్ మీద మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడేం మాట్లాడాలని అడి.గితే, బఠానీ గింజైనా బహుమతి బహుమతే అని ప్రారంభించమన్నారు. నాకు మొదటి బహుమతి వచ్చింది. నేను హైదరాబాద్‌లో చదువుతున్నపుడు తను కాకినాడలో సీఏ చదువుతూ అక్కడే చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసేవాడు. అప్పుడు తను రాసిన ‘ముసురు పట్టిన రాత్రి’ కథ ఇన్‌కమ్‌టాక్స్ మేగజీన్‌లో వచ్చింది. ఆ తరువాత సీఏ పరీక్షలకు హైదరాబాద్ వచ్చాడు. చందమామలో, చిన్న చిన్న పత్రికల్లో రాసేవాడు. తను వచ్చిన ఐదేళ్లకు నేను ఎంబీబీఎస్ కోసం కాకినాడ వెళ్లిపోయాను. ఇలా అటూ ఇటూ మారడంతో మేం కలిసి ఉన్న సమయం చాలా తక్కువ. అన్నయ్య తుళసీదళం రాసినపుడు క్షుద్ర సాహిత్యం అమ్ముకుంటున్నాడని, పర్సనాలిటీ డెవెలప్మెంట్ రాస్తే వ్యక్తిత్వ వికాసాన్ని వ్యాపారం చేస్తున్నాడని విమర్శించారు. అది నిజం కాదు. అన్నయ్య ఆలోచనలో అందరికంటే పదేళ్ల ముందుంటాడు. అన్ని రంగాల్లో సమకాలీనంగా జరుగుతున్న మార్పులను గమనిస్తుంటాడు. దేనికి భవిష్యత్ వుందో గమనించి, దాని గురించి పూర్తిగా తెలుసుకుని మరీ దాని గురించి రాస్తాడు. రచనలకు సంబంధించి అన్నయ్య ప్రభావం నామీద వుంది. నేను తన రచనల్ని జాగ్రత్తగా ఫాలో అవుతాను. సందేహాలొస్తే అడుగుతాను. అన్నయ్య తన భవిష్యత్‌ని కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. తనకు మొదటినుంచీ కాకినాడ పరిసర ప్రాంతాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా గోదావరి అంటే ఇష్టం. అవసానదశలో కాలువ పక్కన కొంచెం స్ధలం వుండాలని, ఒడ్డున కూర్చుని నీళ్లలో గాలం వేసి చేపలు పట్టాలని.. ఇలా ఏవో చాలా ఇమాజినేషన్స్ వున్నాయి తనకు. ఆ మాట నాతో చెపితే కాలువ పక్కన ఒక ఎకరం స్ధలం చూసి పెట్టాను. తనకు అక్షరవరం ప్రసాదించిన సరస్వతికి ఒక గుడి కట్టాలనుకున్నాడు. దాని నిర్మాణం పనులు నేను చూసుకున్నాను. అక్కడే పిల్లలకు విద్యావికాసం పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. పేద పిల్లలను గుర్తించి వారికి అవసరమైన పుస్తకాలు, బట్టలు గిఫ్ట్‌గా ఇస్తుంటాడు. ఈమధ్య కాలంలో వీలైనంత సమయాన్ని తను ఇక్కడే గడుపుతున్నాడు. ప్రిన్సిపుల్స్ ఆఫ్ లైఫ్, ప్రాక్టికాలిటీ, నిర్మొహమాటం... అన్నయ్యలో నాకు నచ్చేవి. ముసుగు వేసుకుని మాట్లాడకూడదనేది అన్నయ్య తత్వం. ముందొకలా, వెనుక మరోలా వుండటం ఆయనకిష్టం వుండదు. నాదీ అదే మనస్తత్వం. రిలేషన్షిప్ నీడ్ నాట్ టు బి ఎక్స్‌ప్రెస్ అనేది మా అభిప్రాయం. అన్నయ్య తనకు నచ్చిన వాళ్లతో చాలా సన్నిహితంగా వుంటాడు. అవసరార్థం కొన్ని రిలేషన్స్ మెయింటెన్ చేస్తాడు. ఐతే కొన్నిసార్లు తను మాతో కూడా ఏదీ ఎక్స్‌ప్రెస్ చేయడు. అదే తనలో నాకు నచ్చనిది. తనలోనూ రైటర్ ఉన్నాడు: వీరేంద్రనాథ్ మేం అన్నదమ్ముల్లా కాదు, స్నేహితులుగా వుంటాం. సంవత్సరానికి ఒకటి రెండుసార్లు కలుస్తుంటాం. కలిసినపుడు మా చర్చ చాలా క్వాలిటేటివ్‌గా వుంటుంది. తనకు సాహిత్యాభిరుచి ఎక్కువే. తనలో ఓ రచయిత వున్నాడని నాకీ మధ్యే తెలిసింది. తను రాసినవి చదివి ఎక్కడైనా క్యారెక్టర్స్, కంటెంట్ రిపీట్ అయితే చెప్తుంటాను. సరస్వతీ విద్యాపీఠానికి సంబంధించి నిర్మాణపను లన్నీ తనే చూసుకున్నాడు. - కె.క్రాంతికుమార్‌రెడ్డి