రిలేషణం: అన్నయ్య అందరికన్నా పదేళ్లు ముందుంటాడు.. | Yandamuri veerendranath brother interview | Sakshi
Sakshi News home page

రిలేషణం: అన్నయ్య అందరికన్నా పదేళ్లు ముందుంటాడు..

Published Sun, Aug 25 2013 3:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM

రిలేషణం: అన్నయ్య అందరికన్నా పదేళ్లు ముందుంటాడు..

రిలేషణం: అన్నయ్య అందరికన్నా పదేళ్లు ముందుంటాడు..

ఆయన రచనలు కమర్షియల్‌గా వుంటాయి. ఆయన పాత్రలు మెటీరియలిస్టిక్‌గా ప్రవర్తిస్తాయి. ఆయన  సంబంధాలు క్యాలిక్యులేటెడ్‌గా వుంటాయి. ఆయన ఆలోచనలు సమాజాన్ని మిస్‌గైడ్ చేస్తుంటాయి... ఇలా ఆయనమీద రకరకాల కామెంట్స్ వినిపిస్తాయి. ఈ రైటర్ అన్నయ్య  గురించి తమ్ముడు డాక్టర్ కమలేంద్రనాథ్ చేసిన స్కాన్ రిపోర్ట్...
 
 మా కుటుంబంలో అందరికీ ఎంతో కొంత సాహిత్యాభిరుచి వుంది. నాన్నగారు కవి. ఆ రోజుల్లోనే బి.ఎ. చేశారు. లా పట్టా పుచ్చుకున్నారు. నడుస్తూ కూడా పద్యాలు పాడుతుండేవారు. మా మేనమామ వేణుగోపాలరావు కూడా సాహిత్యాభిరుచి వున్నవాడు. అన్నయ్యను గైడ్ చేసేవాడు. తన ప్రభావం నా మీదా వుంది. అందుకే నా హాస్పిటల్‌కు వేణుగోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అని పేరు పెట్టుకున్నాను.
 
 అన్నయ్య చిన్నప్పటినుంచే చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తుండేవాడు. ఖమ్మంలో నేను ఐదోతరగతి చదివేటపుడు స్కూల్లో బహుమతి అనే టాపిక్ మీద మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడేం మాట్లాడాలని అడి.గితే, బఠానీ గింజైనా బహుమతి బహుమతే అని ప్రారంభించమన్నారు. నాకు మొదటి బహుమతి వచ్చింది. నేను హైదరాబాద్‌లో చదువుతున్నపుడు తను కాకినాడలో సీఏ చదువుతూ అక్కడే చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసేవాడు. అప్పుడు తను రాసిన ‘ముసురు పట్టిన రాత్రి’ కథ ఇన్‌కమ్‌టాక్స్ మేగజీన్‌లో వచ్చింది. ఆ తరువాత  సీఏ పరీక్షలకు హైదరాబాద్ వచ్చాడు. చందమామలో, చిన్న చిన్న పత్రికల్లో రాసేవాడు. తను వచ్చిన ఐదేళ్లకు నేను ఎంబీబీఎస్ కోసం కాకినాడ వెళ్లిపోయాను. ఇలా అటూ ఇటూ మారడంతో మేం కలిసి  ఉన్న సమయం చాలా తక్కువ.
 
  అన్నయ్య తుళసీదళం రాసినపుడు క్షుద్ర సాహిత్యం అమ్ముకుంటున్నాడని, పర్సనాలిటీ డెవెలప్‌మెంట్ రాస్తే వ్యక్తిత్వ వికాసాన్ని వ్యాపారం చేస్తున్నాడని విమర్శించారు. అది నిజం కాదు. అన్నయ్య ఆలోచనలో అందరికంటే పదేళ్ల ముందుంటాడు. అన్ని రంగాల్లో సమకాలీనంగా జరుగుతున్న మార్పులను గమనిస్తుంటాడు. దేనికి భవిష్యత్ వుందో గమనించి, దాని గురించి పూర్తిగా తెలుసుకుని మరీ దాని గురించి రాస్తాడు. రచనలకు సంబంధించి అన్నయ్య ప్రభావం నామీద వుంది. నేను తన రచనల్ని జాగ్రత్తగా ఫాలో  అవుతాను.  సందేహాలొస్తే అడుగుతాను.
 
 అన్నయ్య తన భవిష్యత్‌ని కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. తనకు మొదటినుంచీ కాకినాడ పరిసర ప్రాంతాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా గోదావరి అంటే  ఇష్టం. అవసానదశలో  కాలువ పక్కన కొంచెం స్ధలం వుండాలని, ఒడ్డున కూర్చుని నీళ్లలో గాలం వేసి చేపలు పట్టాలని.. ఇలా ఏవో చాలా ఇమాజినేషన్స్ వున్నాయి తనకు. ఆ మాట నాతో చెపితే కాలువ పక్కన ఒక ఎకరం స్ధలం చూసి పెట్టాను. తనకు అక్షరవరం ప్రసాదించిన సరస్వతికి  ఒక గుడి కట్టాలనుకున్నాడు. దాని నిర్మాణం పనులు నేను చూసుకున్నాను. అక్కడే పిల్లలకు విద్యావికాసం పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. పేద  పిల్లలను గుర్తించి వారికి అవసరమైన పుస్తకాలు, బట్టలు గిఫ్ట్‌గా ఇస్తుంటాడు. ఈమధ్య కాలంలో వీలైనంత సమయాన్ని తను ఇక్కడే గడుపుతున్నాడు.
 
 ప్రిన్సిపుల్స్ ఆఫ్ లైఫ్, ప్రాక్టికాలిటీ, నిర్మొహమాటం... అన్నయ్యలో నాకు నచ్చేవి. ముసుగు వేసుకుని మాట్లాడకూడదనేది అన్నయ్య తత్వం. ముందొకలా, వెనుక మరోలా వుండటం ఆయనకిష్టం వుండదు. నాదీ అదే మనస్తత్వం. రిలేషన్‌షిప్ నీడ్ నాట్ టు బి ఎక్స్‌ప్రెస్ అనేది మా అభిప్రాయం. అన్నయ్య తనకు నచ్చిన వాళ్లతో చాలా సన్నిహితంగా వుంటాడు.  అవసరార్థం కొన్ని రిలేషన్స్ మెయింటెన్ చేస్తాడు. ఐతే కొన్నిసార్లు తను మాతో  కూడా ఏదీ ఎక్స్‌ప్రెస్ చేయడు. అదే తనలో నాకు నచ్చనిది.
 
 తనలోనూ రైటర్ ఉన్నాడు: వీరేంద్రనాథ్
 మేం అన్నదమ్ముల్లా కాదు, స్నేహితులుగా వుంటాం.  సంవత్సరానికి ఒకటి రెండుసార్లు కలుస్తుంటాం. కలిసినపుడు మా చర్చ చాలా క్వాలిటేటివ్‌గా వుంటుంది. తనకు సాహిత్యాభిరుచి ఎక్కువే. తనలో ఓ రచయిత వున్నాడని  నాకీ మధ్యే  తెలిసింది. తను రాసినవి చదివి ఎక్కడైనా క్యారెక్టర్స్, కంటెంట్ రిపీట్ అయితే చెప్తుంటాను. సరస్వతీ విద్యాపీఠానికి సంబంధించి నిర్మాణపను లన్నీ తనే చూసుకున్నాడు.
 - కె.క్రాంతికుమార్‌రెడ్డి రిలేషణం: అన్నయ్య అందరికన్నా పదేళ్లు ముందుంటాడు..

 - కె.క్రాంతికుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement