సాంకేతికను అందిపుచ్చుకోవాలి
రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు.
సిద్దిపేట రూరల్:మారుతున్న కాలానుగుణంగా ప్రతి ఒక్కరు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. శుక్రవారం మండలంలోని పొన్నాల శివారులోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలోని బీటెక్, డిప్లామా మొదటి సంవత్సరం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు గ్రూపులపై దిశానిర్ధేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరేంద్రనాథ్ మాట్లాడుతూ రోజురోజుకు సాంకేతిక విద్యకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు
. విద్యార్థి దశ నుంచే కంప్యూటర్, ల్యాబ్ తదితర అంశాలపై నైపుణ్యత సాధిస్తున్నారన్నారు. ఈ క్రమంలో ప్రతి విద్యార్థి ప్రణాళికబద్ధంగా చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రభూజీ బెన్‌కాఫ్ మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ల్యాబ్ సౌకర్యం, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నదన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు రవీందర్‌రావు, భూపతిరావు, హెచ్‌ఓడీలు ఆశ్వనికుమార్ మిశ్రా, ఉదయ్‌కుమార్, కుమార్‌స్వామి, అశోక్‌కుమార్, సరస్వతి, పీఆర్వో బి. రఘు, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.