
నాగబాబు, కోదండ రామిరెడ్డి యండమూరి వీరేంద్రనాథ్
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి ‘అతడు.. ఆమె.. ప్రియుడు’ టైటిల్ ఖరారైంది. ప్రముఖ నటుడు సునీల్, ‘బిగ్ బాస్’ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో మహేశ్వరి, ప్రియాంక, సుపూర్ణ హీరోయిన్లు. రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం ప్రారంభమైంది. నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకులు కోదండ రామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మొన్న చాటింగ్.. నిన్న డేటింగ్.. ఈ రోజు మీటింగ్.. రేపు..’ అని హీరోయిన్ చెప్పిన డైలాగ్‌తో మొదలైన తొలి సీన్‌కి దర్శకుడు అజయ్ కుమార్ క్లాప్ ఇచ్చారు. ‘‘యండమూరిగారి దర్శకత్వంలో ‘నల్లంచు తెల్లచీర’ సినిమా తర్వాత వెంటనే ఆయన డైరెక్షన్‌లోనే ‘అతడు.. ఆమె.. ప్రియుడు’ సినిమాను నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కూనం కృష్ణకుమారి, కూనం ఝాన్సీ సహ నిర్మాతలు.
Comments
Please login to add a commentAdd a comment