సినిమా పరిశ్రమలో కష్ట సుఖాలు, ఒడిదుడుకులను దాటుకుని వచ్చిన వారే విజేతలుగా నిలబడతారు. దీనికి బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ నిదర్శనమని టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తెలిపారు. మణి దీప్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై కౌశల్ మంద, లీషా ఎక్లైర్స్ హీరో హీరోయిన్ లుగా శంకర్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం "రైట్" రూపొందించారు. మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతమైన 'మెమోరీస్' చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు లుకలాపు మధు, మహంకాళి దివాకర్ లు సంయుక్తంగా రీమేక్ సినిమాగా నిర్మించారు. డిసెంబర్ 30న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేశారు.
ఈ సంధర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంచు మనోజ్ మాట్లాడుతూ... స్వశక్తితో ఎదిగిన వ్యక్తి కౌశల్, తనకంటూ ఒక ఆర్మీనే రూపొందడం సామాన్యమైన విషయం కాదు. ఏ చెట్టుకు అంతే గాలి అన్నట్టు ఎన్నో స్ట్రగుల్స్ చూసి వచ్చిన, కష్టపడే తత్వమున్న కౌశల్ ఇయర్ ఎండింగ్ లో హిట్ కొట్టి తన ప్రస్థానాన్ని కొనసాగించాలని అన్నారు. రైట్ మూవీ ట్రైలర్ చాలా బాగుంది, ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని ఆశించారు.
హీరో కౌశల్ మాట్లాడుతూ.., నటుడిగా మంచి పేరు సంపాదించాలని 18 ఏళ్ల వయసులో రాజ కుమారుడు సినిమాతో పరిశ్రమకు వచ్చానని గుర్తు చేసుకున్నారు. 24 ఏళ్ల తరువాత బిగ్ బాస్ రూపంలో తనకు కలసి వచ్చిందని, తన కోసం ఒక ఆర్మీ తయారు కావడం అదృష్టమని అన్నారు. తన ఆర్మీ అందరినీ కలుసుకోవడానికి దాదాపు 8 నెలలు అన్ని ప్రాంతాలు తిరిగానని, ఆ సమయంలో తన ఫ్యాన్స్ తనని హీరోగా చూడాలనే కోరికను తెలుపడంతో హీరోగా వస్తున్నాను. కరోనా సమయంలో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని షూటింగ్ పూర్తి చేశాం, ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందని కౌశల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment