Right
-
స్వశక్తితో ఎదిగిన వ్యక్తి కౌశల్: మంచు మనోజ్
సినిమా పరిశ్రమలో కష్ట సుఖాలు, ఒడిదుడుకులను దాటుకుని వచ్చిన వారే విజేతలుగా నిలబడతారు. దీనికి బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ నిదర్శనమని టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తెలిపారు. మణి దీప్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై కౌశల్ మంద, లీషా ఎక్లైర్స్ హీరో హీరోయిన్ లుగా శంకర్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం "రైట్" రూపొందించారు. మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతమైన 'మెమోరీస్' చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు లుకలాపు మధు, మహంకాళి దివాకర్ లు సంయుక్తంగా రీమేక్ సినిమాగా నిర్మించారు. డిసెంబర్ 30న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంచు మనోజ్ మాట్లాడుతూ... స్వశక్తితో ఎదిగిన వ్యక్తి కౌశల్, తనకంటూ ఒక ఆర్మీనే రూపొందడం సామాన్యమైన విషయం కాదు. ఏ చెట్టుకు అంతే గాలి అన్నట్టు ఎన్నో స్ట్రగుల్స్ చూసి వచ్చిన, కష్టపడే తత్వమున్న కౌశల్ ఇయర్ ఎండింగ్ లో హిట్ కొట్టి తన ప్రస్థానాన్ని కొనసాగించాలని అన్నారు. రైట్ మూవీ ట్రైలర్ చాలా బాగుంది, ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని ఆశించారు. హీరో కౌశల్ మాట్లాడుతూ.., నటుడిగా మంచి పేరు సంపాదించాలని 18 ఏళ్ల వయసులో రాజ కుమారుడు సినిమాతో పరిశ్రమకు వచ్చానని గుర్తు చేసుకున్నారు. 24 ఏళ్ల తరువాత బిగ్ బాస్ రూపంలో తనకు కలసి వచ్చిందని, తన కోసం ఒక ఆర్మీ తయారు కావడం అదృష్టమని అన్నారు. తన ఆర్మీ అందరినీ కలుసుకోవడానికి దాదాపు 8 నెలలు అన్ని ప్రాంతాలు తిరిగానని, ఆ సమయంలో తన ఫ్యాన్స్ తనని హీరోగా చూడాలనే కోరికను తెలుపడంతో హీరోగా వస్తున్నాను. కరోనా సమయంలో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని షూటింగ్ పూర్తి చేశాం, ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందని కౌశల్ తెలిపారు. -
Right Movie Pre Release Photos: కౌశల్ మండ ‘రైట్’ మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
ప్రేమ పెళ్లిళ్లను పెద్దలు కాదనలేరు: ఢిల్లీ హైకోర్టు
ఇకపై మేజర్లయిన పిల్లల పెళ్లిళ్లను పెద్దలు అడ్డుకోలేరు. వివాహానికి తగిన వయసు కలిగిన యువతీయువకులు తమకు ఇష్టమైన భాగస్వామిని వివాహం చేసుకోవచ్చని, ఇటువంటి సందర్భంలో ఆ జంటల వివాహానికి తల్లిదండ్రులు లేదా వారి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేరని, రాజ్యాంగం ఆ జంటకు రక్షణ కల్పిస్తుందని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న జంటలకు పోలీసులు రక్షణ కల్పిస్తారని, అవసరమైన పక్షంలో వారి కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు రక్షణ అందిస్తారని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. భార్యాభర్తల వివాహ హక్కును ఏ విధంగానూ తక్కువ చేయకూడదని, ఇలాంటి జంటలకు రక్షణ కల్పించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత ఆ రాష్ట్రంపై ఉందని జస్టిస్ తుషార్ రావు గేదెల అభిప్రాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో.. తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్న ఒక జంటకు పోలీసు రక్షణ కల్పిస్తూ, మేజర్లయిన యువతీయువకులు తమకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందని కోర్టు పేర్కొంది. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక జంట న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వీరిలో భర్తపై నమోదైన తప్పుడు ఎఫ్ఐఆర్ను గత ఆగస్టులో కోఆర్డినేట్ బెంచ్ రద్దు చేసిందని జస్టిస్ గేదెలకు చెప్పారు. కాగా ఎఫ్ఐఆర్ పెండింగ్‌లో ఉన్న సమయంలోనే వారు వివాహం చేసుకుని, ఆనందంగా జీవిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ దంపతులకు హాని జరగకుండా చూసుకోవాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇది కూడా చదవండి: ‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ అంటే ఏమిటి? ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తున్నారు? Right To Marry Person Of Choice Protected Under Constitution, Not Even Family Members Can Object: Delhi High Court @nupur_0111 https://t.co/JEDBQuyQI8 — Live Law (@LiveLawIndia) October 26, 2023 -
జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులపై మొదటి హక్కు రాష్ట్రానికే
సాక్షి, అమరావతి : జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వానికే మొదటి హక్కు అని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. డిపాజిటర్ల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒకే ఆస్తులపై రెండు దర్యాప్తు సంస్థల జప్తు ఉత్తర్వుల వల్ల డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్నారు. ఆస్తులను విక్రయించి డిపాజిటర్లకు ప్రయోజనం చేకూర్చాలన్న ప్రభుత్వ ప్రయత్నాల్లో తీవ్ర జాప్యం జరిగి బాధితులు నష్టపోతారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులను తిరిగి మనీలాండరింగ్ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేయడం ఎంత వరకు సమంజసమో తేల్చాలని కోర్టును అభ్యర్థించారు.మనీలాండరింగ్, దివాలా చట్టాల కింద చేసిన జప్తులకు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన జప్తునకు మధ్య వైరుద్ధ్యం లేదని తెలిపారు.డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అగ్రిగోల్డ్ ఎగవేసిన మొత్తాలను తిరిగి చెల్లిస్తోందని నివేదించారు. రూ.20 వేలు, అంతకన్నా తక్కువ డిపాజిట్లు చేసిన వారికి ఇప్పటికే రూ.900 కోట్ల మేర తిరిగి చెల్లించినట్లు చెప్పారు. మనీలాండరింగ్, దివాలా చట్టాలు డిపాజిటర్ల పరిరక్షణకు ఉద్దేశించినవి కావని చెప్పారు. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఈడీ గానీ, బ్యాంకులు గానీ నీరుగార్చలేవని అన్నారు. అగ్రిగోల్డ్ డిపాజిట్ల కుంభకోణంలో నిందితులు వారిని వారు రక్షించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.ఇలాంటి పరిస్థితుల్లో జప్తు చేసిన ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు తిరిగి చెల్లించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని ఇతర ఏ దర్యాప్తు సంస్థా నిరోధించలేదని తేల్చి చెప్పారు. ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర ఉందని చెప్పారు.అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి కొన్న తమ ఆస్తులను ఈడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే బ్యాంకులు నిర్వహించిన వేలంలో కొన్న అగ్రిగోల్డ్ ఆస్తులను కూడా ఈడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ మరికొన్ని కంపెనీలు, వ్యక్తులు, కుంభకోణానికి ముందే అగ్రిగోల్డ్ నుంచి కొన్న భూముల్లో నిర్మించుకున్న అపార్ట్మెంట్లను సైతం సీఐడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ప్లాట్ల యజమానులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కొద్ది రోజులుగా విచారణ జరుపుతున్నారు. గురువారం జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అనంతరం న్యాయమూర్తి విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు. -
‘హ్యూమన్ రైట్స్ హీరో-2023’గా హెరాల్డ్ డిసౌజా
ఇండియన్-అమెరికన్ లేబర్ ట్రాఫికింగ్ సర్వైవర్, యాక్టివిస్ట్ హెరాల్డ్ డిసౌజాను హ్యూమన్ రైట్స్ హీరో అవార్డు- 2023తో సత్కరించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో 17వ వార్షిక అంతర్జాతీయ మానవ హక్కుల యూత్ సమ్మిట్ సందర్భంగా హెరాల్డ్ డిసౌజా ఈ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది సమ్మిట్ మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనకు సంబంధించి 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. డిసౌజాతో సహా అంతర్జాతీయ వక్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు దీనిలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. వర్క్‌షాప్‌లు, ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఈ సంవత్సరం సమానత్వం, గౌరవం, ఐక్యత థీమ్‌తో కార్యక్రమం జరిగింది. ‘ప్రతి బిడ్డకు మానవ హక్కులు తెలియజేయాలి’ డిసౌజా తన ప్రసంగంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డకు మానవ హక్కులకు సంబంధించిన 30 ఆర్టికల్స్ నేర్పించాలని అన్నారు. అవి 1948లో ఐక్యరాజ్యసమితి రూపొందించిన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనే పత్రంలో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో తన ముందు ప్రేక్షకుల్లో కూర్చున్న ప్రతీ ప్రతినిధి నిజమైన హీరోనే అని డిసౌజా అభివర్ణించారు. మనుషుల అక్రమ రవాణా, తరలింపు నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని గుర్తించి, గౌరవించి, అవార్డు ఇచ్చినందుకు యూత్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ మేరీ షటిల్వర్త్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మానవ అక్రమ రవాణాదారుని చేతిలో.. డిసౌజా హ్యూమన్ ట్రాఫికర్‌గా యుఎస్‌కి వచ్చారు. 18 నెలలకు పైగా ఆయన మానవ అక్రమ రవాణాదారుని చేతిలో దోపిడీకి గురయ్యారు. తన స్వేచ్ఛను కోల్పోయారు. నేడు ఆయన ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. హెరాల్డ్ డిసౌజా న్యాయవాది, పబ్లిక్ స్పీకర్. అతని చేదు అనుభవం అతనికి జీవితంలో కొత్త లక్ష్యాన్ని, అర్థాన్ని అందించింది. డిసౌజా ఐస్ ఓపెన్ ఇంటర్నేషనల్‌కు సహ-వ్యవస్థాపకుడు. ఈ సంస్థ హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి ప్రాణాలతో బయటపడిన వారి సమాచార పరిశోధనకు సహకరిస్తుంది. బాధితులకు విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తుంటుంది. కార్మికుల అక్రమ రవాణాను అంతం చేయడానికి.. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా 2015లో యునైటెడ్ స్టేట్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఆన్ హ్యూమన్ ట్రాఫికింగ్‌లో సభ్యునిగా డిసౌజాను నియమించారు. ట్రాఫికింగ్‌ను పర్యవేక్షించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఆఫీస్‌కు నిపుణుల సలహాదారుగా కూడా డిసౌజా వ్యవహరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అట్లాంటాకు చెందిన స్వచ్ఛంద సంస్థ శారీస్ టు సూట్స్ వ్యవస్థాపకుడు పట్టి త్రిపాఠి మాట్లాడుతూ డిసౌజా తన కుటుంబంతో కలిసి కార్మికుల అక్రమ రవాణాను అంతం చేయడానికి, దీనిపై మరింత అవగాహన పెంచడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భయం నుంచి స్వేచ్ఛకు.. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి 46 దేశాలకు చెందిన అగ్రశ్రేణి ప్రతినిధులు హాజరయ్యారు. భారతదేశంలోని మంగళూరుకు చెందిన డిసౌజా ప్రస్తుతం ఒహియోలోని సిన్సినాటిలో ఉంటున్నారు. అతని జీవిత అనుభవాలు అతనిని.. బానిసత్వం నుండి క్రియాశీలతకు, బాధ నుంచి ఆనందానికి, భయం నుంచి స్వేచ్ఛకు.. ఇప్పుడు ‘హ్యూమన్ రైట్స్ హీరో అవార్డ్ 2023’అందుకునేందుకు సహకరించాయి. ఇది కూడా చదవండి: కొడుకు బర్త్‌డేకి తల్లి సర్ప్రైజ్.. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోందంటూ.. -
ప్రైవేట్ వైద్యులు వర్సెస్ ప్రభుత్వ చట్టం
ప్రజలకు ఆరోగ్య హక్కును పరిపూర్ణంగా అందించేందుకంటూ రాజస్తాన్‌లో అశోక్ గహ్లోత్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఆరోగ్య హక్కు చట్టం (రైట్ టు హెల్త్) దుమారం రేపుతోంది. ఎమర్జెన్సీ సమయాల్లో రోగులు ముందుగా డబ్బులు చెల్లించకపోయినా ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులు విధిగా చికిత్స చేసి తీరాలని చెబుతోంది. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ప్రైవేటు వైద్యులు మెరుపు సమ్మెలకు దిగారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన సమ్మెలో లక్ష మంది ప్రైవేటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 2,500 ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన వైద్యులు రెండు వారాలుగా ఉధృతంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దాంతో అత్యవసర పరిస్థితుల్లోనూ చికిత్స అందించే వైద్యుల్లేక రాష్ట్రంలో రోగులు అల్లాడుతున్నారు. వైద్యం కోసం పొరుగు రాష్ట్రాల బాట పడుతున్నారు. అయినా వెనక్కి తగ్గేది లేదని సీఎం గహ్లోత్ అంటున్నారు. 2018 ఎన్నికల హామీని నెరవేర్చామని చెబుతున్నారు. దేశంలో తొలిసారి రాజస్తానే ఇలాంటి చట్టం తెచ్చిందని ఆరోగ్య మంత్రి ప్రసాద్ లాల్ మీనా గర్వంగా ప్రకటించారు. మరోవైపు ప్రైవేటు డాక్టర్ల వాదన కూడా విని, వారి ఆందోళనలను సీఎం తీర్చాలని కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ హితవు పలికారు. అలా ఈ చట్టం అధికార కాంగ్రెస్‌లోనూ అంతర్గత పోరుకు దారి తీయొచ్చంటున్నారు. ఏమిటీ చట్టం? ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి అనారోగ్యంతో అత్యవసర పరిస్థితిలో వచ్చినప్పుడు ప్రైవేటు ఆస్పత్రులు, ప్రైవేటు డాక్టర్లు వైద్యం నిరాకరించకూడదు. ముందుగా డబ్బులు చెల్లించకపోయినా చికిత్స అందించి తీరాలి. చికిత్స పూర్తయ్యాక రోగి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఆ బిల్లుల్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రమాదాలు, పాము కాట్లు, గర్భిణుల ప్రసవంతో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్దేశించిన ఏ పరిస్థితులైనా ఎమర్జెన్సీ కిందకు వస్తాయి. వాటికి వైద్యం నిరాకరించే ఆస్పత్రి/వైద్యుడు తొలిసారి 10 వేలు జరిమానా చెల్లించాలి. ఆ తర్వాత 25 వేలు, అలా పెరుగుతూ పోతుంది. చట్టంలో స్పష్టత లేని విషయాలివే! ► ఎమర్జెన్సీ అంటే చట్టంలో సరిగ్గా వివరించలేదు. ఒక్కోసారి తలనొప్పి కూడా అత్యవసర పరిస్థితి కిందకు వచ్చి బ్రెయిన్ హెమరేజ్‌కి దారి తీయవచ్చు. ► ఎంత బిల్లయినా ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందా? ► వైద్య పరీక్షలకయ్యే ఖర్చుల సంగతేమిటి? కడుపు నొప్పి, తలనొప్పితో వచ్చి పరీక్షలన్నీ చేశాక తీరా అది ఎమర్జెన్సీ కాదని తేలితే ఆ వైద్య పరీక్షల ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందా? ► బిల్లు పంపిన ఎన్నాళ్లకు ప్రభుత్వం ఆ సొమ్ముల్ని తిరిగి చెల్లిస్తుంది? ప్రైవేటు ఆస్పత్రులు ఎన్నాళ్లు వేచి చూడాలి? ప్రైవేటు వైద్యుల నిరసనలెందుకు? ► ప్రైవేటు ఆస్పత్రులను పూర్తిగా రూపుమాపాలన్న ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని చేశారని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. వైద్యుల జీవించే హక్కును కాలదన్నేలా ఈ చట్టం ఉందని, ఎమర్జెన్సీ అంటూ రోగులు వస్తే వారి సమస్య ఎలాంటిదైనా చికిత్స తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధన వల్ల ఇక కనీస విశ్రాంతి కూడా దొరకదని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఆస్పత్రులు తమ బాధ్యతను చాకచక్యంగా ప్రైవేటు ఆస్పత్రులపై నెట్టేస్తున్నాయన్న వాదనలున్నాయి. రోగులు బిల్లులు చెల్లించలేని పక్షంలో వాటిని ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందో చట్టంలో స్పష్టత లేదని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ చట్టం అమలు సరిగ్గా జరగకపోతే రోగులకు, డాక్టర్లకు మధ్య పరస్పరం అపనమ్మకం ఎక్కువైపోతుందని వైద్యుల్లో ఒక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘‘దీన్ని ఆరోగ్య హక్కు చట్టం అని పిలుస్తున్నారు. కానీ ఇందులో రోగుల హక్కుల కంటే వైద్యుని బాధ్యతలే ఎక్కువ! దీన్ని బలవంతంగా రుద్దితే వైద్యులు ఆర్థికంగా, వృత్తిపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు’’అని జైపూర్‌కు చెందిన డాక్టర్ బ్రూనో అన్నారు. వైద్యులకు వేధింపులు తప్పవా? ► ప్రైవేటు క్లినిక్‌లో డాక్టర్ చికిత్స ఇవ్వడానికి నిరాకరిస్తే అతనిపై రోగి న్యాయపరమైన చర్యలకు దిగొచ్చు. చట్టంలోని ఈ నిబంధన వల్ల తాము వేధింపులకి గురి కాక తప్పదని, అధికార యంత్రాంగం జోక్యం పెరిగిపోయి తప్పుడు కేసులు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రైవేటు డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ‘‘ఎవరికైనా చిన్న ప్రైవేటు క్లినిక్ ఉంటే ఎమర్జెన్సీ కింద 24 గంటలు తెరిచి ఉంచడం కష్టం. వైద్యులకు వ్యక్తిగత జీవితం ఉండదా? రోగులు కేసు పెడితే దాన్ని సవాల్ చేసే అవకాశం వైద్యులకు లేకుండా చేశారు. ఇది కచ్చితంగా వైద్యుల్ని వేధించేందుకే’’అని జైపూర్ అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ అమిత్ యాదవ్ విమర్శించారు. ఉద్దేశం మంచిదే కానీ... ► రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొంటున్న వైద్యులు, ఆరోగ్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు అందరికీ ఆరోగ్యం అందించాలనే ఆ చట్టం స్ఫూర్తికి తాము మద్దతుగానే నిలుస్తున్నామని అంటున్నారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా చట్టంలో ఎన్నో లొసుగులున్నాయని డాక్టర్ పార్థ శర్మ అన్నారు. వాటినన్నింటిని తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత చట్టాన్ని యథాతథంగా అమలు చేస్తే మంచి కంటే చెడే జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Germany: ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చే భారీ కుట్ర భగ్నం
బెర్లిన్: జర్మనీలో భారీ కుట్ర భగ్నం అయ్యింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలపై వాళ్లను ఆధీనంలోకి తీసుకున్నారు. తనిఖీల్లో సుమారు 25 మందిని అరెస్టు చేశారు. అతివాదులు, మాజీ సైనిక దిగ్గజాలు ఈ కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. పార్లమెంట్ భవనాన్ని చుట్టు ముట్టి, అధికారాన్ని చేజిక్కించుకోవాలని అతివాదులు ప్రయత్నిస్తున్నట్లు అనుమానించారు. రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హెన్రిచ్-13 ఈ ప్రణాళికలు వేసినట్లు అంచనా వేస్తున్నారు. సుమారు మూడు వేల మంది పోలీసులు.. 150 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర చేసిన బృందంలో సుమారు 50 మంది ఉన్నట్లు భావిస్తున్నారు. రీచ్‌బర్జర్ తీవ్రవాదులు ఈ పన్నాగంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. -
స్వతంత్ర భారతి: బాలలకు ఉచిత, నిర్బంధ విద్య
2010 ఏప్రిల్ 1న ‘ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టం –2009’ అమల్లోకి వచ్చింది. దేశంలో 6 నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం ఈ చట్టం లక్ష్యం. భారత రాజ్యాంగంలోని 86 వ సవరణను అనుసరించి, ఆర్టికల్ 21–ఎ విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించాలని చెబుతోంది. స్వాతంత్య్రానికి ముందు మొదటిసారిగా 1882లో హంటర్ కమిషన్ ఉచిత విద్య ప్రాధాన్యం గురించి ప్రస్తావించింది. తర్వాత గోపాలకృష్ణ గోఖలే 1911లో దీని ప్రాముఖ్యాన్ని గుర్తించి, నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఫలితం లభించలేదు. స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగంలోని 45వ ఆర్టికల్ 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత విద్యను అందించాలని పేర్కొంది. 2009 చట్టం కింద.. జనన ధ్రువీకరణ పత్రం లేదనే కారణంతో పాఠశాల ప్రవేశాన్ని నిరాకరించకూడదు. ఏ విద్యార్థిని కూడా ఒక విద్యా సంవత్సరంలో ఏ తరగతిలోనూ ఒక సంవత్సరం కంటే ఎక్కువగా నిలిపి ఉంచకూడదు. ప్రాథమిక తరగతులకు ఎంపిక పరీక్ష నిర్వహించకూడదు. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు జ్యోతి బసు, జానకీ వెంకట్రామన్, కె.కరుణాకరన్.. కన్నుమూత. 2008 ముంబై పేలుళ్ల కేసులో అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష విధింపు. జాతీయ గుర్తింపు పథకం ‘ఆధార్’ను ప్రవేశపెట్టిన భారత ప్రభుత్వం. తొలి ఆధార్ కార్డు జారీ. (చదవండి: లక్ష్యం 2047) -
‘అడిగే హక్కే’ అన్నిటికీ ఆధారం
1215లో మెగ్నా కార్టా అనే హక్కుల ప్రకటన ఉద్యమం ప్రారంభం అయినప్పుడు మొట్టమొదట అడిగిన హక్కు ‘అడిగే హక్కు’. దాన్ని ‘రైట్ టు పిటిషన్’ అంటారు. అడిగే హక్కు ప్రాణ హక్కు కన్నా గొప్పదా అంటే సమాధానం... అవును. అడిగే హక్కు ఒక్కటి ఇస్తే అందులో ప్రాణ హక్కు అడుగుతాం, అభివృద్ధి హక్కు అడుగుతాం. ఇంకేం కావాలన్నా అడగవచ్చు. ఆ అడిగే హక్కు ఇప్పుడు భావప్రకటనా స్వాతంత్య్రం.‘‘నాకు తెలుసుకునే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, అంతరాత్మ చెప్పినట్టు వాదించే స్వేచ్ఛ ఇవ్వు. అదే అన్నిటికన్నా గొప్ప స్వేచ్ఛ’’ అంటాడు మిల్టన్. అభిప్రాయాలు, ఆలోచనలు అందరికీ ఉంటాయి. కనుక చెప్పే హక్కు సహజమైన హక్కే. చెప్పిందే చెప్పినా ఫరవాలేదు, చెబుతూ పోవడమే కర్తవ్యం. చెప్పకుండా నోరుమూసుకుని కూర్చుంటే అన్ని అన్యాయాలను ఆమోదించినట్టే! మౌనం అర్ధాంగీకారం అంటారు. కాదు. మౌనం సంపూర్ణాంగీకారం... ఉక్రెయిన్‌పై రష్యా దౌర్జన్య యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ప్రతిపాదించినపుడు ఎన్నడూ లేని సమైక్యత పాటించిన మనమూ, మన ఇరుగు పొరుగూ... పాకిస్తాన్, చైనా; మరో 32 దేశాలు తటస్థంగా ఉన్నాయి. దాని అర్థం రష్యా మానవ హనన సమరాన్ని సంపూర్ణంగా సమర్థించినట్టే. ఇది దురదృష్టకరం. కనీసం ఇకనైనా యుద్ధాన్ని ఆపాలని అడిగి... ధర్మం, న్యాయం పాటిస్తే బాగుండేది. మానవత్వపు విలువల వలువలను దుశ్శాసనులు ఊడదీస్తుంటే భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు మౌనం పాటించడాన్ని తటస్థవైఖరి అంటారా ఎవరైనా? తటస్థ వైఖరి వల్ల ఎవరికి లాభమో వారిని సమర్థించినట్టే. మౌనం కూడా ఒక వ్యాఖ్యానమే, భావవ్యక్తీకరణే. ఐక్యరాజ్యసమితి 1948 మానవ హక్కుల ప్రకటన ఆర్టికల్ 19లో భావవ్యక్తీకరణ సహజ హక్కును గుర్తించింది. ప్రతి వ్యక్తీ అభిప్రాయాలను ఏర్పరచుకునే హక్కూ, వ్యక్తం చేసే హక్కూ కలిగి ఉంటాడు. ఉండాలి. మనిషికి ప్రతివాడి గురించీ తీర్పులు ఇవ్వడం అలవాటు. సోషల్ మీడియాలో బాధ్యతారహితమైన తీర్పులు ఇస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. వీటి వల్ల ఈ స్వేచ్ఛకే ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. అంబేడ్కర్ తన ఆలోచనా స్వేచ్ఛనూ, అనుభవాల నుంచి నేర్చుకున్న అభిప్రాయాలను నిర్భయంగా చెప్పే స్వేచ్ఛనూ విరివిగా వాడుకున్నారు. లాహోర్ తీర్మానం (1940)లో ముస్లింలీగ్ పాకిస్తాన్ వేర్పాటును డిమాండ్ చేసిన తరువాత అంబేడ్కర్ 400 పేజీలలో ‘థాట్స్ ఆన్ పాకిస్తాన్’ అనే పుస్తకం రాశారు. అందులో పాకిస్తాన్ అనే బీజం పుట్టుక, వికాసం గురించి విశ్లేషించారు. హిందువులు పాకిస్తాన్‌ను ముస్లింలకు ఇవ్వాలని వాదించారు. పంజాబ్, బెంగాల్ ప్రదేశాలను హిందూ ముస్లిం నివాసాలను బట్టి పునర్విభజించాలని సూచించారు. ఒక దశాబ్దం పాటు ఈ ఆలోచనలు అనేక చర్చలకు దారితీశాయి. ముస్లిం లీగ్, కాంగ్రెస్‌ల మధ్య చర్చలకు అంబేడ్కర్ ఆలోచనలు ప్రాతిపదిక అయినాయి. చివరకు భారతదేశ విభజన తప్పలేదు. అభిప్రాయ ప్రకటన హక్కులో ఎవ్వరి జోక్యం లేకుండా అభిప్రాయాలను కలిగి ఉండడం, ప్రాదేశిక హద్దులకు అతీతంగా ఏ మాధ్యమం ద్వారానైనా సమాచారాన్నీ, అభిప్రాయాలనూ అడిగి, స్వీకరించి, బోధించే స్వాతంత్య్రం ఈ హక్కులో ఉంటాయని ఆర్టికల్ 19 వివరిస్తుంది. సహజ హక్కు అంటే ప్రజలందరికీ ఉండాలి. కానీ మన రాజ్యాంగం పౌరులకు మాత్రమే ఈ హక్కు పరిమితం చేసింది. 2019లో పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం తను పౌరుడినని రుజువు చేసుకోలేకపోతే ఆ భారతీయుడు కోల్పోయే తొలి ప్రధానమైన హక్కు ఇదే. (చదవండి: అకడమిక్ బ్యాంకు క్రెడిట్.. విద్యార్థికి మేలే గానీ...) ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ప్రకటన... వ్యక్తులందరికీ ఈ స్వేచ్ఛ ఉండాలనీ, అనేక మాధ్యమాలు ఉండవచ్చుననీ, ఈ స్వేచ్ఛకు దేశాల సరిహద్దులు ఉండవనీ, ఇందులో సమాచార హక్కు, ఇతరుల నుంచి సమాచారం పొంది ఇతరులకు పంచే హక్కు కూడా ఉంటాయనీ; ఇతరుల అభిప్రాయాలు కోరి, విని, స్వీకరించి, ఇతరులతో పంచుకునే హక్కు కూడా ఉంటుందనీ వివరించింది. అభిప్రాయ స్వేచ్ఛకు చాలా విస్తృతి ఉన్నది. మన రాజ్యాంగంలో ఈ హక్కుపై చాలా పరిమితులు ఉన్నాయి. మొదటి పరిమితి కేవలం పౌరులకే ఇవ్వడం. ఇందులో సమాచార హక్కు కూడా ఇమిడి ఉందని సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాలలో చెప్పింది. 2005 దాకా దాన్ని పట్టించుకోలేదు. విభిన్న స్థాయుల్లో శాస్త్రీయ పరిశోధన చేసేందుకు, ప్రచురించేందుకు తగిన స్వేచ్ఛ ఉండాలి. దాన్ని శాస్త్రీయ స్వేచ్ఛ అంటారు. 1766లో పత్రికా స్వేచ్ఛ చట్టాన్ని స్వీడన్ అమలు చేసింది. ఇదే సమాచార హక్కును కూడా 1766లోనే ఇచ్చింది. 1947 ఆగస్టు 15న మనదేశం స్వతంత్రం సంపాదించింది. కానీ చాలాకాలం డొమినియన్‌గా ఉండింది. భారతీయ జన గణ మన తంత్రం అప్పటికి ఆవిర్భవించలేదు. స్వతంత్రం గణతంత్రంతోనే సంపూర్ణమవుతుంది. గణతంత్రం లేకపోతే సొంత తంత్రమేదీ ఉండదు. స్వతంత్రం కూడా ఉండదు. చెదురు మదురుగా ఉన్న జనం సాధికారిక పాలకులుగా నాయకత్వం స్వీకరించడానికి కొన్ని వ్యవస్థలు ఉండాలి. విధానాలు ఏర్పడాలి. ప్రక్రియ ఉండాలి. పద్ధతులు ఏర్పడాలి. అప్పుడు జనతంత్రం గణతంత్రంగా పరిణమిస్తుంది. నిర్ణీత గణతంత్ర విధానాల సమగ్ర నిర్మాణం ద్వారా మాత్రమే మనం స్వతంత్రం కాపాడుకోగలం. - మాడభూషి శ్రీధర్ స్కూల్ ఆఫ్ లా డీన్, మహీంద్రా యూనివర్సిటీ -
అక్కడ తండ్రులు వ్యాక్సిన్లు వేసుకోకపోతే పిల్లలతో గడపనివ్వరట!
ప్రస్తుతం కరోన కొత్తవేరియంట్ ఒమిక్రాన్ భయంతో ప్రపంచ దేశాలు ఒక్కో రీతిలో ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కాస్త కఠినమైన ఆంక్షలు తీసుకోవడానికే మొగ్గుచూపుతున్నాయి. అందులో భాగంగానే కెనడాలోని ఓ తండ్రికి చేదు అనుభవం ఎదురైంది. అసలేం జరిగిందంటే...కెనడియన్లో ఓ తండ్రి తన సెలవు రోజుల్లో తన కొడుకుతో ఎక్కువ సమయం గడిపేలా అవకాశం ఇవ్వమంటూ కోర్టు మెట్లు ఎక్కాడు. అయితే తల్లి ఈ విషయాన్ని వ్యతిరేకించింది. సదరు వ్యక్తి వ్యాక్సిన్ తీసుకోలేదంటూ అతను సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లను సాక్ష్యంగా కోర్టులో చూపించింది. పైగా తనకు మరో ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా చెప్పింది. దీంతో కోర్టు వ్యాక్సిన్ వేసుకోనప్పుడూ కొడుకుతో గడిపే హక్కు లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో మిగతా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. అంతేకాదు కరోనా వ్యాక్సిన్లు తీసుకోనివాళ్ల పై ఆరోగ్య పన్ను విధించనున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకోనివాళ్లను వీధుల్లోకి రానీయకుండా నిషేధించింది. (చదవండి: జీరో కోవిడ్ టాలరెన్సే లక్ష్యంగా... ఇంత పైశాచిక నిబంధనలా!!) -
విత్తన హక్కులలో... రైతు విజయం
ప్రపంచం మొత్తంలో ఒక్క మన దేశ రైతులకు మాత్రమే విత్తనాలకు సంబంధించి విశిష్ట హక్కులు ఉన్నాయి. రైతులకు మేధోసంపత్తి హక్కు కల్పించడం కోసం మన పార్లమెంటు ప్రత్యేక చట్టం చేసి 20 ఏళ్లయ్యింది. విత్తనాలను ఇచ్చి పుచ్చుకోవడానికి సంబంధించి భారతీయ రైతులకున్న విశిష్ట హక్కుల చరిత్రలో మైలురాయి వంటి ఓ తీర్పు ఇటీవల వెలు వడింది. ఓ బహుళ జాతి కంపెనీకి చెంప పెట్టులాంటి తీర్పు ఇది. వేప, పసుపు, బాస్మతి బియ్యంపై అనాదిగా మన దేశానికి ఉన్న మేధో సంపత్తి హక్కుల తస్కరణకు గతంలో వివిధ కంపెనీల ఆధ్వ ర్యంలో ప్రయత్నాలు జరిగాయి. వాటిని ప్రపంచ మేధో సంపత్తి హక్కుల సంస్థలో డా. వందనా శివ వంటి ఉద్యమకారిణులు సమర్థ వంతంగా తిప్పికొట్టిన ఘన చరిత్ర మనకుంది. ఈ నేపథ్యంలో చట్టబద్ధ రైతాంగ విత్తన హక్కుల పరిరక్షణ కృషిలో తాజా తీర్పు గుజరాత్ రైతులకు సంబంధించిందే కానీ.. దేశంలో రైతులందరికీ గొప్ప విజయం అనటంలో సందేహం లేదు. గుజరాత్ రైతులపై పెప్సీ కేసులు గుజరాత్ బంగాళదుంప రైతులకు వ్యతిరేకంగా మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన కేసులు పెట్టిన బహుళ జాతి కంపెనీ పెప్సికో ఇండియా హోల్డింగ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బంగాళదుంప వంగడంపై పెప్సికో కంపెనీకి గతంలో ఇచ్చిన మేధో సంపత్తి హక్కులను కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న ‘పంట వంగడాల పరిరక్షణ మరియు రైతుల హక్కుల ప్రాధికార సంస్థ (పి.పి.వి. అండ్ ఎఫ్.ఆర్.ఎ.)’ ఇటీవల రద్దు చేయటంతో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇరవయ్యేళ్ల క్రితం పంట వంగడాల పరిరక్షణ మరియు రైతుల హక్కుల చట్టం–2001 ప్రకారం పి.పి.వి. అండ్ ఎఫ్.ఆర్.ఎ. ఏర్పాటైంది. (చదవండి: రైతాంగ సమస్యలే రాజకీయ ఎజెండా) విత్తన శాస్త్రవేత్తలు/ కంపెనీలు రూపొందించే కొత్త వంగడాలతో పాటు.. రైతులు సంప్రదాయ విజ్ఞానంతో రూపొందించే కొత్త వంగడాలకు కూడా ఈ చట్టం మేధో సంపత్తి హక్కులను కల్పిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుంది. ఇలా ధ్రువీకరణ పొందిన కంపెనీల వంగడాలను సాగు చేసే రైతులు తమ పంట దిగుబడులను విత్తనాల కోసం వాడుకోవటంతోపాటు.. ఇతరులకు విక్రయించుకోవ టానికి కూడా ఈ చట్టం రైతులకు విశిష్ట హక్కును కల్పిస్తోంది. ప్రత్యే కంగా బ్రాండ్ పేరు ముద్రించిన సంచుల్లో పోసి విక్రయించకూడదు. అయితే, భారతీయ రైతులకున్న ఈ విశిష్ట హక్కును కాలరాసిన పెప్సికో కంపెనీకి చెంపపెట్టు లాంటి తీర్పును పి.పి.వి. అండ్ ఎఫ్.ఆర్.ఎ. వెలు వరించింది. లేస్ చిప్స్ తయారీకి వాడే ప్రత్యేక బంగాళదుంప వంగ డానికి గతంలో ఈ కంపెనీకి ఇచ్చిన మేధాహక్కుల ధ్రువీకరణను రద్దు చేస్తూ ఈ తీర్పు వెలువడింది. పి.పి.వి. అండ్ ఎఫ్.ఆర్.ఎ. ఏర్పాటైన తర్వాత ఇలా ఒక వంగడంపై ధ్రువీకరణను రద్దు చేయటం ఇదే మొదటి సారి కావటంతో జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ, వాణిజ్య వర్గాల్లో తీవ్ర సంచలనం రేగింది. (చదవండి: అన్నదాత హక్కు గెలిచినట్లే...!) అసలేం జరిగిందంటే.. లేస్ చిప్స్ తయారీ కోసం ఉపయోగించేందుకు ఉద్దేశించిన ఎఫ్.ఎల్. 2027 అనే రకం బంగాళదుంప వంగడంపై పెప్సికో ఇండియా హోల్డింగ్ కంపెనీ ‘పంట వంగడాల పరిరక్షణ, రైతుల హక్కుల ప్రాధికార సంస్థ’లో 2016లో రిజిస్ట్రేషన్ చేయించి మేధో సంపత్తి హక్కులను పొందింది. గుజరాత్లో 12,000 మంది రైతులతో కొనుగోలు ఒప్పందం చేసుకొని ఎఫ్.ఎల్.2027 రకం బంగాళదుంపలను పెప్సికో కంపెనీ సాగు చేయించింది. అయితే, ఈ రైతుల వద్ద నుంచి ఈ రకం బంగాళదుంప విత్తనాలు పొంది అక్రమంగా సాగు చేయడం ద్వారా 9 మంది గుజరాత్ రైతులు మేధో సంపత్తి ఉల్లంఘనకు పాల్పడ్డారని పేర్కొంటూ 9 మంది గుజరాత్ రైతులపై కేసులు పెట్టింది. ఒక్కో రైతు నుంచి తమకు రూ. కోటి పరిహారం ఇప్పించాల్సిందిగా కూడా పెప్సికో కంపెనీ వ్యాజ్యంలో కోరింది. రైతులపై కేసులను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనోద్యమం పెల్లుబకటంతో కంపెనీ వెనక్కి తగ్గి, కేసులు ఉపసంహరించుకుంది. (చదవండి: ఈ సాగు చట్టాలు నిజంగానే మేలు చేయవా?) కవిత దరఖాస్తు ‘పంట వంగడాల పరిరక్షణ, రైతుల హక్కుల చట్టం–2001’ మన దేశంలో రైతులకు రిజిస్టరైన విత్తనాలను విత్తుకోవటం, దాచుకోవటం, ఇతరులతో పంచుకోవటం, బ్రాండ్ ముద్ర వేయకుండా ఇతరులకు విక్రయించుకునే హక్కులను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆ వంగ డంపై పెప్సికో కంపెనీకి మేధో సంపత్తి హక్కుల ధ్రువీకరణ ఇవ్వటం సమంజసం కాదని, ఆ ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రముఖ రైతు హక్కుల ఉద్యమకారిణి, కురుగంటి కవిత 2019 జూన్ 11న పి.పి.వి–ఎఫ్.ఆర్.ఎ.కు దరఖాస్తు చేశారు. 30 నెలల సుదీర్ఘ విచా రణ తర్వాత పెప్సికో కంపెనీకి ఎఫ్.ఎల్. 2027 బంగాళదుంప వంగ డంపై ఇచ్చిన మేధాహక్కుల ధ్రువీకరణను రద్దు చేస్తూ డిసెంబర్ 3న పి.పి.వి–ఎఫ్.ఆర్.ఎ. చైర్పర్సన్ కె.వి. ప్రభు తీర్పు ఇచ్చారు. ప్రజాప్రయోజనాలకు విఘాతం ధ్రువీకరణ కోసం కంపెనీ తప్పుడు సమాచారం ఇచ్చినందున, రిజి స్ట్రార్‌కు తగిన సమాచారాన్ని, పత్రాలను అందించనందున, పంట వంగ డాల పరిరక్షణ, రైతుల హక్కుల చట్టం –2001 (సెక్షన్ 34 హెచ్) ప్రకారం ‘ప్రజాప్రయోజనాల’కు విఘాతం కలుగుతున్నందున, ధ్రువీ కరణ పొందిన వ్యక్తికి తగిన యోగ్యత లేనందున మేధాహక్కుల ధ్రువీ కరణ పత్రాన్ని రద్దు చేస్తున్నట్లు పి.పి.వి–ఎఫ్.ఆర్.ఎ. చైర్పర్సన్ కె.వి. ప్రభు ప్రకటించారు. రద్దు కాకుండా ఉంటే 2031 జనవరి 31 వరకు పెప్సికోకు మే«ధా సంపత్తి హక్కులు కొనసాగేవి. రైతుల చట్టబద్ధమైన విత్తన హక్కులను, స్వేచ్ఛను తుంగలో తొక్కాలని ప్రయత్నించే విత్తన, ఆహార, పానీయాల వాణిజ్య సంస్థల ఆటలు సాగవని చెప్పడానికి ఈ తీర్పు ఒక హెచ్చరికగా నిలుస్తుంది. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు -
కశ్మీర్‌పై తాలిబన్ల సంచలన వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు కశ్మీర్, భారత్ లేదా మరో ఇతర దేశంలో ముస్లింల హక్కులపై మాట్లాడి తీరుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింల సమస్యలపై స్పందించే హక్కు తమ కుందన్నారు. తాలిబన్ల పాలనలో అఫ్గన్ భూభాగం దేశంలో వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడుతుందనే ఆందోళనల మధ్య తాజా వ్యాఖ్యలు మరింత కలవరం రేపుతున్నాయి. కశ్మీర్‌తోపాటు మరే ఇతర ప్రాంతంలో ఉన్న ముస్లింల స్వరాన్ని వినిపించే హక్కు సాటి ముస్లింలుగా తమకుందని బీబీసీ ఉర్దూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ స్పష్టం చేశారు. ముస్లింలు మీ సొంత ప్రజలు, మీ స్వంత పౌరులని చెబుతాం, మీ చట్టాల ప్రకారం వారికీ సమాన హక్కులుంటాయని చెబుతామని వ్యాఖ్యానించారు. కాబూల్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్న కొన్ని రోజుల తర్వాత, కాశ్మీర్ ఒక ద్వైపాక్షిక, అంతర్గత విషయమని చెప్పిన దానికి భిన్నంగా తాలిబన్ అధికార ప్రతినిధి తాజా ప్రకటన ఉంది. అయితే ఏ దేశానికీ వ్యతిరేకంగా ఆయుధాలను ప్రోత్సహించే విధానం తమకు లేదన్నారు. చదవండి: Taliban China Friendship: చైనా కీలక హామీ, మరింత మద్దతు మరోవైపు జమ్మూకశ్మీర్‌లో పెరుగుతున్న ఆందోళనల మధ్య, ఈ ప్రాంతంలో భారత ప్రభుత్వం ఇప్పటికే నిఘాను పెంచింది. కాగా అమెరికా ఆధీనంలోని అఫ్గాన్‌కు తాలిబన్ల వల్ల విముక్తి లభించిందని, తదుపరి లక్ష్యం కశ్మీరే అంటూ అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ ఇటీవల సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. -
ఆస్తి హక్కు, సుప్రీం సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: మహిళల ఆస్తి హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుటుంబంలోని ఆడబిడ్డలకు కొడుకులతోపాటు సమాన ఆస్తి హక్కులను కల్పిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 2005 అమలుకు ముందే తండ్రి మరణించినప్పటికీ, వారికి తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కీలక తీర్పునిచ్చింది. హిందూ వారసత్వ చట్టంలో 2005 సవరణ ప్రకారం కుమార్తెలకు తండ్రి ఆస్తిలో సంపూర్ణ హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. సవరణ సమయం 2005 సెప్టెంబర్ 9 నాటికి తండ్రి జీవించి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఆమెకు వారసత్వ హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. 2005లో చట్టం అమల్లోకి వచ్చేనాటికి తండ్రి చనిపోతే సోదరులు ఆస్తిలో వాటా నిరాకరించడంపై దాఖలైన పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం 2005 నాటికి తండ్రి మరణించినా, బతికి ఉన్నా ఆడపిల్లలకు సమాన వాటా దక్కాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ అంశంపై ట్రయల్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న విషయాలను ఆరు నెలల్లో నిర్ణయించాలని ధర్మాసనం ఆదేశించింది. -
ప్రశ్నను చంపేవాడే దేశద్రోహి
హత్యకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపడం. రేప్ కన్నా ప్రజలను భజనపరులుగా మార్చడం, లించింగ్ అనే మూకుమ్మడిహత్యలకన్నా ప్రశ్నించే తత్వాన్ని హత్య చేయడం తీవ్రమైన నేరాలు. పరస్పర ద్వేషాలను రగిలించే విధానాలు అనుసరిస్తూ లించింగ్ సరైనదే అని పరోక్షంగా నేర్పే రాజకీయులు, రాజకీయాలే అసలైన నేరగాళ్లు. రాజకీయ పార్టీలను ప్రశ్నించడం ప్రజాస్వామిక బాధ్యత. కాళోజీ అన్నట్టు అప్పుడే అతను పౌరుడవుతాడు లేకపోతే పోరడు. కానీ అదే అడిగితే? అడిగిన వాడిపై దాడి చేయడం, వేటాడడం, దొంగకేసులు పెట్టడం, పాతకేసులు తవ్వడం, లేదా చెత్తకేసుల్లో ఇరికించడం దారుణాలు. కనిపిం చని హంతకులు చేసే అదృశ్య హత్యలు ఇవి. న్యాయంగా కేసులు నిర్ధారించిన జడ్జీలను కూడా వేధించడం, విభేదించిన వాడిని బాధించడం, నేరవిచారణ అధికారులమీదే నేరాలు బనాయించడం, కిందిస్థాయి అవినీతి పరులను కలుపుకుని తిరుగుబాట్లు చేయించి, వ్యవస్థలను ధ్వంసంచేయడం, మూకుమ్మడి అత్యాచారాలే. కాకతీయ యూనివర్సిటీలో ప్రజాకవి పద్మభూషణ్ కాళోజీ నారాయణరావు ఎండోమెంట్ ప్రసంగం చేయాలని పిలిచారు. కాళోజీ వ్యక్తిత్వానికి సరిపోయే చర్చనీయాంశం ఏదంటే ‘ప్రజాస్వామ్యం, ప్రశ్నించే తత్వం’ కాక మరేది. ‘ప్రజలను చంపే అధికారం ఎవరిచ్చార్రా వెంగళ్రావ్’ అంటూ నినదించిన గొంతు ఆయనది. అదీ ఎక్కడ.. వెంగళరావు సీఎం హోదాలో సత్తుపల్లిలో అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న చోట. ముఖ్యమంత్రిగా కొనసాగడం కోసం వెంగళ్రావ్ పోటీ చేస్తే, కాళోజీ కేవలం ప్రశ్నించడం కోసం పోటీచేసినాడు. గెలిచింది సీఎంయే కానీ ప్రజాప్రతినిధి కావలసిన వ్యక్తి కాదు. ఓడింది ప్రజాస్వామ్యమేగాని కాళోజీ కాదు. బూటకపు ఎన్కౌంటర్లు జరిపించిన తొలి ఎమ ర్జెన్సీ సీఎం అని గొంతెత్తి చెప్పడమే విజయం. తిడితే తిట్టనీ, అడిగితే అడగనీ అని జలగం వెంగళరావు అడిగేవాడిని అడగనిచ్చాడు. జవాబు ఇవ్వలేకపోయినా. పోటీచేస్తే చేయనీ, అని పోటీ చేయనిచ్చాడు. రాజును రోజూ తిడుతున్నా రాజద్రోహం కేసు పెట్టించలేదు. జలగం ఎంత గొప్పవాడు? కాళోజీ ఇప్పుడు బతికి ఉంటే, అప్పుడెప్పుడో సత్తుపల్లిలో ప్రశ్న వేసినందుకు 2019లో రాజద్రోహం కేసు కింద అరెస్టయి పుణే ఎరవాడ జైల్లో వరవరరావుతోపాటు ఉండేవాడేమో?. కాళోజీ వంటి సెలబ్రిటీ వ్యక్తులు 49 మంది ఈమధ్య చేసిన నేరం ఏమంటే ప్రశ్నించడం. గుంపు హత్యలు ఈ దేశ పరువును ప్రతిష్ఠను ధ్వంసం చేస్తున్నాయని వారు విమర్శించారు. లించింగ్‌లు జరగకుండా చూడలేరా అని అడిగితే దేశ ద్రోహం ఏ విధంగా అవుతుందో చెప్పగలరా ఎవరైనా? గతవారం ముజఫ్ఫర్ పూర్ చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ గారికి 49 మంది కళాకారులు మేధావులు ప్రధానికి రాసిన ఈ లేఖలో దేశద్రోహపు రంగులు, కాంతులు, పొగలు, పగలు కనిపించడం ఆశ్చర్యకరం. దేశ ద్రోహం కేసు రిజిస్టర్ చేయాలని ఆదేశించిన ఆ న్యాయాధికారిగారి దృక్పథం ఇదా అని దేశం మ్రాన్పడిపోయింది. మరో 185 మంది సమాజశ్రేయోభిలాషులు అక్టోబర్ 8న ఆ ఉత్తరాన్ని సమర్థిస్తూ మరోలేఖ వ్రాసారు. వారిమీద కూడా దేశద్రోహం కేసు పెడతారా? అయితే ఈ అవివేకపు కారు చీకటిలోనూ కొంత వెలుగు కనిపించింది. బిహార్ స్పెషల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ కుమార్ దేశద్రోహపు ఆరోపణ చేసే ఈ ఫిర్యాదును బుట్టదాఖలుచేయాల్సిందే అని నిర్ణయించడంలో వివేకం విజ్ఞత ఇంకా బతికున్నాయనే ఆశాభావం కన్నుతెరిచింది. న్యాయాధికారి చూడలేకుండాపోయిన నిజాలు పోలీసు అధికారికి సులువుగా కనిపించాయి. ఇది దురుద్దేశపూరితంగా చేసిన తప్పుడు ఫిర్యాదు, దేశద్రోహం ఆరోపణ పైన విచారించడానికి అణుమాత్రం ఆధారంకూడా లేదు అని మనోజ్ కుమార్ వివరించారు. ఈ ఫిర్యాదు చేసిన ఓఝా అనే వ్యక్తి పిటిషన్ పైన జడ్జిగారు జారీ చేసిన ఆదేశం మేరకు కేసు రిజిస్టర్ చేయవలసి వచ్చిందని మరో ఉన్నతాధికారి చెప్పాడు. ‘‘ఒరేయ్ ప్రశ్నించేవానికి, ప్రశ్నకు కూడా ద్రోహం చేస్తావ్ రా ఎన్ని గుండెలు నీకు? అయితే నువ్వేరా దేశద్రోహివి, ఇది తెలిసినోడేరా అసలైన దేశభక్తుడు’’ అని కాళోజీ ఇప్పుడు ఉంటే అనేవాడేమో. - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
మీ ఓటుతో ప్రేమను చూపండి
నాగర్‌కర్నూల్: పిల్లల భవిష్యత్‌కు సంకల్పంతో ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ ఈ.శ్రీధర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ‘మీ ఓటుతో మీ ప్రేమను చూపండి’ అనే సంకల్ప కరపత్రాన్ని కలెక్టర్ విడుదల చేసి మాట్లాడారు. సంకల్ప పత్రాలను జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందజేయాలని అన్నారు. కుటుంబ సభ్యులు ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ ఓటును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకునేలా సంకల్ప పత్రాలను తల్లిదండ్రులకు అందించి కుటుంబ సభ్యులకు ఓటు విశిష్టత తెలియపర్చాలని అన్నారు. దీనికోసం సంకల్ప పత్రాలను అన్ని పాఠశాలలకు పంపిణీ చేసి ప్రతి విద్యార్థికి అందేలా చూడాలని డీఈఓ గోవిందరాజులును ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో మధుసూదన్‌నాయక్, డీఈఓ గోవిందరాజులు, ఐసీడీఎస్ పీడీ ప్రజ్వల, జిల్లా అధికారులు అనిల్‌ప్రకాష్, మోహన్‌రెడ్డి, సుధాకర్, సాయిసుమన్, జయంత్‌కుమార్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. బాలల వెట్టి చాకిరిని అరికట్టాలి జిల్లాలో బాలల వెట్టి చాకిరిని అరికట్టాలని కలెక్టర్ ఈ.శ్రీధర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో బాండెడ్ లేబర్ విజిలెన్స్, చైల్డ్ లేబర్ టాస్క్‌ఫోర్స్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బడిఈడు పిల్లలను పనిలో చేర్చుకుని వెట్టి చాకిరి చేయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీలో, 18 ఏళ్లలోపు పిల్లలు బడిలో ఉండేవిధంగా చూడాలన్నారు. పిల్లలను ఎక్కడైనా పనిలో పెట్టుకున్నట్లు కనిపిస్తే 1098కు సమాచారం అందజేయాలని తెలిపారు. హోటళ్లు, కిరాణషాపులు, రాత్రిళ్లు ఇటుక బట్టీల వద్ద పిల్లలను పనిలో ఉంచుకుంటే యజమానికి జరిమానా విధించడమే కాక జైలుశిక్ష వేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలకు లేబర్‌ను తరలించే దళారులు, గుంపు మేస్త్రీలకు భారీ జరిమానా విధించాలని అన్నారు. ఎన్జీఓలు, ఇతర సంఘాలు సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించాలని కోరారు. లేబర్‌ను ఇతర రాష్ట్రాలకు తరలించాలంటే సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో కార్మికుల వివరాలు తెలిపి సర్టిఫికేట్ పొందాలన్నారు. జిల్లాలో ఇంకా బాండెడ్ లేబర్ ఎక్కడైనా ఉంటే వారిని గుర్తించి తగిన ఆర్థిక, సామాజిక సహకారం అందించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో బాండెడ్ లేబర్, చైల్డ్ లేబర్ లేకుండా చేసేందుకు సంబంధిత శాఖలు కృషిచేయాలని తెలిపారు. సమావేశంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో మధుసూదన్‌నాయక్, జిల్లా అధికారులు సాయిసుమన్, రవీందర్‌రెడ్డి, ప్రజ్వల, గోవిందరాజులు, సుధాకర్, జయంత్‌కుమార్, అనిల్ ప్రకాశ్, మధు, పలు ఫౌండేషన్ల సభ్యులు పాల్గొన్నారు. -
షాడో ప్లే
హ్యూమర్ ప్లస్ షాడో ప్లే గురించి ఒకాయన ఉపన్యాసం మొదలుపెట్టాడు.‘‘మన లోపల ఆత్మ ఉన్నా లేకపోయినా, మనకంటూ ఒక నీడ తప్పనిసరిగా వుంటుంది. మనం పుట్టినప్పుడే అది పుడుతుంది. నవ్వితే నవ్వుతుంది. ఏడిస్తే ఏడుస్తుంది. ఒక్కోసారి మనకంటే పొట్టిగా వుంటుంది. సమయం కలిసొస్తే పొడుగ్గా మారుతుంది. మన ముందు నడుస్తూ దారి చూపిస్తున్నట్టు నటిస్తుంది. వెనుక నడుస్తూ ముందుకి తోస్తుంది. దానికి చీకటంటే భయం. వెలుతురులోనే స్నేహం చేస్తుంది. మనం వెలిగిపోతున్నపుడు ఆనందంగా నృత్యం చేస్తుంది. పౌర్ణమినాడు వెన్నెలలా కనిపిస్తుంది. అమావాస్యలో అంతర్ధానమవుతుంది. కారుచీకటిలో కన్ను పొడుచుకున్నా కనిపించదు.నిజానికి షాడో ప్లే అంటే నీడల్ని మనం ఆడించడం కాదు. నీడలే మనల్ని ఆడించడం. నీడలో జంతురూపాల్ని మనం ప్రదర్శించనక్కరలేదు. నీడలు, జంతువులు ఒక్కలాగే వుంటాయి. చాలాసార్లు మనలోని జంతువు నీడలా మన మీదికి దూకుతుంది. కానీ జంతువు మనలో లేదని బుకాయించుకుంటాం. జంతువెప్పుడూ ఎదుటివారిలో వుందనుకుంటేనే మన అహం తృప్తి చెందుతుంది. మనకు నీడ వున్నట్టే, మనం ఇంకెవరికో నీడగా వుండడానికి ఇష్టపడతాం. ఒకరికొకరు నీడల్లా వుంటూ, ఎవరు ఎవరి నీడో తెలియనంతగా గందరగోళానికి గురవుతాం. ఒక్కోసారి మనం నీడతో యుద్ధం చేస్తాం. ఇద్దరూ సమానవేగంతో యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం. అయినా మనమే గెలిచామనుకుని మీసం మెలివేస్తాం. నీడ కూడా గెలిచాననే అనుకుంటుంది. ‘‘ప్రజాస్వామ్యానికి, షాడో ప్లేకి ఏమిటి సంబంధం?’’ ఒక శ్రోత అడిగాడు.‘‘నీడలు హక్కుల గురించి మాట్లాడడమే ప్రజాస్వామ్యం. నిజానికి రాజకీయాల్లో మనుషులు మాయమై చాలా కాలమైంది. ఇప్పుడు నీడలే మిగిలాయి. ఒక నీడ ఇంకో నీడ ఉనికిని ప్రశ్నిస్తూ వుంటుంది. నీడ ప్రమాదకరమని నీడలే వాదిస్తూ వృక్షాలని నరికేస్తున్నాయి. గొడ్డలిని చేతబట్టినవాళ్ళే మొక్కల సంరక్షణపై ఉపన్యాసాలిస్తారు.’’ ఇలా మాట్లాడుతూ వుండగానే కొన్ని నీడలొచ్చి అతన్ని దుడ్డుకర్రతో చావబాదాయి.‘‘నీడల గురించి ఎవరు మాట్లాడినా దుడ్డుతో కానీ, దుడ్డుకర్రతో కానీ చావబాదడం మా పాలసీ. నీడలే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. రూపం కంటే ప్రతిబింబమెప్పుడూ అందంగా వుంటుంది. ఎందుకంటే అది భ్రాంతి కాబట్టి. భ్రాంతిని ప్రేమించాలని అన్ని వేదాంత గ్రంథాలు చెబుతూనే వున్నా, నీలాంటి వాళ్లు అనవసర మీమాంసతో హింసిస్తున్నారు’’ అని చెప్పి అతన్ని నాలుగు తన్నింది.దెబ్బకి దెయ్యమే వదులుతున్నప్పుడు, నీడలకి సంబంధించిన వాస్తవజ్ఞానం మాత్రం మిగులుతుందా?మనవాడి ఉపన్యాస సరళి మారింది.‘‘రామరాజ్యమంటే నీడల రాజ్యమే. రాజ్యం నీడలదే అయినప్పుడు, నీడలు రాజ్యమేలకుండా వుంటాయా? నీడని నమ్మితే నీడ మనల్ని నమ్ముతుంది. నిజాన్ని భ్రాంతి మోసం చేస్తున్నప్పుడు, నిజం తన రూపాన్ని మార్పుకోక తప్పదు. నీడని నిజమని నమ్మితే ప్రజలకి, ప్రజాస్వామ్యానికి క్షేమకరం! – జి.ఆర్. మహర్షి -
ఓటు హక్కు విలువను చాటి చెప్పండి
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి అన్ని వర్గాల ప్రజలకు ఓటుహక్కు విలువను చాటి చెప్పాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటర్ల దినోత్సవాన్ని పురష్కరించికుకొని ఈ నెల 25న భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాలని సూచించారు. ప్రతి ఏడాది జనవరి 25న పోలింగ్ కేంద్రం స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో బాగంగా ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ నుంచి పోలీసు పేరెడ్ గ్రౌండు వరకు నిర్వహించే మెగా ర్యాలీలో అన్ని విధ్యాసంస్థలతో పాటు అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు పాల్గొనాలని వివరించారు. -
ఓటు హక్కు ఔన్నత్యాన్ని చాటుదాం
కలెక్టర్ పీహెచ్ విజయమోహన్ పిలుపు - జాతీయ ఓటరు దినోత్సవ నిర్వహణపై సమీక్ష కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఈ నెల 25న పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా కార్యక్రమాలుండాలన్నారు. శనివారం సాయంత్రం 7వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహణపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఓటు హక్కు విలువపై ప్రజలకు అవగాహన ఏర్పడేలా జూనియర్ కాలేజీ విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు పరీక్షలున్నట్లు ఆర్ఐఓ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఉదయం పూట ఉన్న పరీక్షను సాయంత్రానికి వాయిదా వేయిస్తే ర్యాలీకి వచ్చే అవకాశం ఉందన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ మేరకు నోట్స్ పంపాలని, దాని ఆధారంగా ఆర్జేడీతో మాట్లాడుతానని తెలిపారు. పరీక్షలున్న కారణంగా సమావేశానికి వచ్చిన కళాశాల ప్రిన్సిపాళ్లను బయటికి పంపారు. కేవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ సమావేశానికి గైర్హాజరు కాడంపై ఆగ్రహించిన కలెక్టర్ షోకాజ్ నోటీసు ఇవ్వాలని డీఆర్ఓను ఆదేశించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పోలింగ్ కేంద్రం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిలో కర్నూలు పోలీస్ పరేడ్ గ్రౌండులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ ఆకే రవికృష్ణ, జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, ఆర్ఐఓ పరమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఐఎల్ ఆస్తుల్లో 40వేల కోట్ల తరుగుదల
కేజీ డీ6పైనే రూ.20,114 కోట్లు... న్యూఢిల్లీ: అకౌంటింగ్ విధానంలో మార్పు దృష్ట్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) రూ.39,570 కోట్ల మేరకు తన ఆయిల్ అండ్ గ్యాస్ ఆస్తుల విలువను రద్దు (రైట్‌డౌన్) చేసింది. ఇందులో కేజీ బేసిన్‌లోని డీ6తోపాటు అమెరికా షేల్ గ్యాస్ ప్రాజెక్టులు సైతం ఉన్నాయి. 2016 ఏప్రిల్ 1 నుంచి ఆర్ఐఎల్ భారతీయ అకౌంటింగ్ ప్రమాణాల పరిధిలోని నూతన విధానానికి మళ్లింది. ఈ మార్పు నేపథ్యంలో తన చమురు, సహజవాయువుల నిల్వలను ఆర్ఐఎల్ తిరిగి ప్రకటించింది. 2016 మార్చి 31 నాటికి తన ఆయిల్, గ్యాస్ ఆస్తుల విలువలో రూ.39,750 కోట్ల తరుగుదలను చూపించింది. కేవలం ఒక్క కేజీ బేసిన్‌లోని డీ6 బ్లాక్‌కు సంబంధించే రూ.20,114 కోట్ల తరుగుదలను చూపించింది. ఈ వివరాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాల నివేదికలో ఆర్ఐఎల్ వెల్లడించింది. విలువ తరుగుదలకు ఆయిల్, గ్యాస్ ధరల పతనమే ప్రధాన కారణం. ఇక స్వాధీనం చేసిన బ్లాక్‌లు, ఫలితమివ్వని బావులు, విడిచిపెట్టిన బావులు వంటివి ప్రభావం చూపినట్టు ఆర్ఐఎల్ తెలిపింది. -
ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆగదు
కోటగుమ్మం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకూ తమ పోరాటం ఆగదని సామాజిక హక్కుల వేదిక చైర్మన్ వేణుగోపాల్, జిల్లా కన్వీనర్ తాటిపాక మధు అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రయివేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లా¯న్ నిధులు దుర్వినియోగం చేయవద్దని, బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. వాటి సాధన కు వేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ నుంచి జీపు జాతా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా రాజకీయ జెండాలు పక్కనపెట్టి దళిత, గిరిజన, బలహీనవర్గాలు, మైనార్టీ సమస్యలపై పోరుబాట పట్టామన్నారు. 2011 నుంచి ఇప్పటి వరకూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కృష్ణా ప్రాజెక్టు, ఆర్ అండ్ బీ రహదారులకు, పార్కులకు ఖర్చు పెట్టి నిధులు దుర్వినియోగం చేశారని విమర్శించారు. గత ఎన్నికల ముందు నారా చంద్రబాబు బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకూ ఆ ఊసే లేదన్నారు. రంపచోడవరం గిరిజన యూనివర్సిటీని నెలకొల్పాలని, ఏజెన్సీ ప్రాంతాన్ని అల్లూరి జిల్లాగా ప్రకటించాలని కోరారు. జీపుజాతా ప్రారంభానికి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఎమ్మెల్సీ సుభాష్‌చంద్రబోస్‌తో పాటు ఇతర వర్గాల ప్రముఖులు హాజరవుతారని వివరించారు. నవంబర్ 9న కాకినాడ కలెక్టరేట్ వద్ద పోరుగర్జన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. -
ముద్రగడను విమర్శించే అర్హత ఎవరికీ లేదు
స్థాయి మరిచి మాట్లాడితే జాతి చూస్తూ ఊరుకోదు సత్రం భూములు కాజేసిన చరిత్ర మీది కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయకు కాపు జేఏసీ హెచ్చరిక కిర్లంపూడి : మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను విమర్శించే అర్హత రాష్ట్రంలో ఏ ఒక్కరికీ లేదని కాపు జేఏసీ నాయకులు సృష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ముద్రగడ ఒక్కరేనని వారన్నారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో జేఏసీ నాయకుల సమావేశం బుధవారం సాయంత్రం జరిగింది. కాపు సద్భావనా సంఘం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, తోట రాజీవ్, కల్వకొలను తాతాజీ, గౌతు స్వామి, బోడసకుర్రు దత్తుడు తదితరులు మాట్లాడారు. ముద్రగడపై కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అవాకులు, చెవాకులు పేలడాన్ని తీవ్రంగా ఖండించారు. సత్రం భూములు కాజేసిన చరిత్ర ఆయనదని, స్థాయి మరిచి మాట్లాడితే జాతి చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. జాతి కోసం 1994లో ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి కుటుంబ సమేతంగా ప్రాణ త్యాగానికి సిద్ధపడి కాపుల కోసం జీఓ నంబర్ 30 సాధించిన ఘనత ముద్రగడదని గుర్తు చేశారు. యావత్తు కాపు జాతీ ముద్రగడ వెంటే ఉంటుందన్నారు. దొంగ దీక్షలు చే యాల్సిన అవసరం ముద్రగడకు లేదన్నారు. ప్రభుత్వం నిర్బంధించినా 14 రోజుల పాటు ఏ విధంగా దీక్ష చేశారో కాపు జాతికే కాకుండా యావత్తు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. దొంగ హామీ లిచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ముద్రగడ ఉద్యమం చేట్టకపోతే కాపు కార్పొరేషన్ లేదు, రామానుజయకు ఆ పదవీ రాదన్నారు. -
ప్రణాళికలు రూపొందించండి
ఏలూరు (ఆర్ఆర్ పేట) : పోలవరం ప్రాజెక్ట్ కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 2018 జూన్ నుంచి నీటిని విడుదల చేయడానికి అనువుగా జల వనరుల శాఖ అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్ అతిథి గృహంలో పనుల ప్రగతిపై ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే అక్టోబర్ 16వ తేదీ నుంచి పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వే కాంక్రీట్ పనులు ప్రారంభించాలన్నారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంకా 639 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని చేయాల్సి ఉందని, ఈ పనిని వేగవంతం చేసేందుకు అధునాతన యంత్రాలను ఉపయోగిస్తున్నామని చెప్పారు. లక్ష క్యూబిక్ మీటర్లకే పరిమితమైన మట్టి పనులను 2.40 లక్షల క్యూబిక్ మీటర్లకు పెంచాలని, అవసరమైతే మరిన్ని అధునాతన యంత్రాలు విని యోగించాలని ఆదేశించారు. పోల వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై 4 నెలలకు ఒకసారి ఢిల్లీ స్థాయి అధికారులతో సమీక్షించడంతోపాటు రాష్ట్ర స్థాయిలో ప్రతినెలా క్షేత్ర స్థాయిలో పర్యటించి సమీక్షిస్తానని చెప్పారు. సమావేశంలో జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమ, ప్రిన్సిపల్ కార్యదర్శి సతీష్‌చంద్ర, జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు కె.భాస్కర్, హెచ్.అరుణకుమార్, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ భవానీప్రసాద్, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీర్ హరిబాబు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు వి.రమేష్‌బాబు, పోలేశ్వరరావు, ఎంటీ రాజు, శ్రీనివాస్‌యాదవ్, ట్రాన్స్ట్రాయ్ సీఎండీ చెరుకూరి శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సాంబశివరావు, కుకునూరు సబ్ కలెక్టర్ షాన్మోహన్ పాల్గొన్నారు. జిల్లా ప్రతినిధులకు చోటేది సమీక్ష సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి పీతల సుజాత, స్థానిక ఎమ్మె ల్యే మొడియం శ్రీనివాస్, అక్కడే ఉన్న ఇతర ఎమ్మెల్యేలను ఆహ్వానించక పోవడం చర్చనీయాంశమైంది. కారులో విజయవాడకు.. ఏలూరు అర్బన్ : పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్డు మార్గంలో విజయవాడ ప్రయాణమయ్యారు. తొలుత ఆయన హెలికాప్టర్లో విజయవాడ చేరుకునే విధంగా అధికారులు షెడ్యూల్ రూపొందించారు. అయితే, పోలవరంలో భారీ వర్షం కురవడంతో హెలికాప్టర్ ప్రయాణించేందుకు అనువైన పరిస్థితులు లేవని, రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకోవాలని భద్రతా అధికారులు సూచించారు. దీంతో ముఖ్యమంత్రి పోలవరం, నల్లజర్ల, దూబచర్ల, గుండుగొలను, ఏలూరు, గన్నవరం మీదుగా రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరారు. ముఖ్యమంత్రి రాకతో దూబచర్ల, గుండుగొలను, ఏలూరు, గన్నవరం జాతీయ రహదారి వెంబడి గంటల తరబడి వాహనాలను నిలిపివేశారు. ఆర్టీసీ బస్‌లు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ప్రణాళికలు రూపొందించండి
ఏలూరు (ఆర్ఆర్ పేట) : పోలవరం ప్రాజెక్ట్ కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 2018 జూన్ నుంచి నీటిని విడుదల చేయడానికి అనువుగా జల వనరుల శాఖ అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్ అతిథి గృహంలో పనుల ప్రగతిపై ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే అక్టోబర్ 16వ తేదీ నుంచి పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వే కాంక్రీట్ పనులు ప్రారంభించాలన్నారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంకా 639 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని చేయాల్సి ఉందని, ఈ పనిని వేగవంతం చేసేందుకు అధునాతన యంత్రాలను ఉపయోగిస్తున్నామని చెప్పారు. లక్ష క్యూబిక్ మీటర్లకే పరిమితమైన మట్టి పనులను 2.40 లక్షల క్యూబిక్ మీటర్లకు పెంచాలని, అవసరమైతే మరిన్ని అధునాతన యంత్రాలు విని యోగించాలని ఆదేశించారు. పోల వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై 4 నెలలకు ఒకసారి ఢిల్లీ స్థాయి అధికారులతో సమీక్షించడంతోపాటు రాష్ట్ర స్థాయిలో ప్రతినెలా క్షేత్ర స్థాయిలో పర్యటించి సమీక్షిస్తానని చెప్పారు. సమావేశంలో జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమ, ప్రిన్సిపల్ కార్యదర్శి సతీష్‌చంద్ర, జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు కె.భాస్కర్, హెచ్.అరుణకుమార్, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ భవానీప్రసాద్, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీర్ హరిబాబు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు వి.రమేష్‌బాబు, పోలేశ్వరరావు, ఎంటీ రాజు, శ్రీనివాస్‌యాదవ్, ట్రాన్స్ట్రాయ్ సీఎండీ చెరుకూరి శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సాంబశివరావు, కుకునూరు సబ్ కలెక్టర్ షాన్మోహన్ పాల్గొన్నారు. జిల్లా ప్రతినిధులకు చోటేది సమీక్ష సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి పీతల సుజాత, స్థానిక ఎమ్మె ల్యే మొడియం శ్రీనివాస్, అక్కడే ఉన్న ఇతర ఎమ్మెల్యేలను ఆహ్వానించక పోవడం చర్చనీయాంశమైంది. కారులో విజయవాడకు.. ఏలూరు అర్బన్ : పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్డు మార్గంలో విజయవాడ ప్రయాణమయ్యారు. తొలుత ఆయన హెలికాప్టర్లో విజయవాడ చేరుకునే విధంగా అధికారులు షెడ్యూల్ రూపొందించారు. అయితే, పోలవరంలో భారీ వర్షం కురవడంతో హెలికాప్టర్ ప్రయాణించేందుకు అనువైన పరిస్థితులు లేవని, రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకోవాలని భద్రతా అధికారులు సూచించారు. దీంతో ముఖ్యమంత్రి పోలవరం, నల్లజర్ల, దూబచర్ల, గుండుగొలను, ఏలూరు, గన్నవరం మీదుగా రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరారు. ముఖ్యమంత్రి రాకతో దూబచర్ల, గుండుగొలను, ఏలూరు, గన్నవరం జాతీయ రహదారి వెంబడి గంటల తరబడి వాహనాలను నిలిపివేశారు. ఆర్టీసీ బస్‌లు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
హోదా రాష్ట్ర ప్రజల హక్కు
– జిల్లా న్యాయవాదుల సంఘం మద్దతు కోరిన వైఎస్ఆర్సీపీ లీగల్‌సెల్ కర్నూలు(ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కు అని వైఎస్ఆర్సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నిర్వహించే బంద్‌కు సహకరించాలని శుక్రవారం జిల్లా న్యాయవాదుల సంఘం నాయకులను కలిశారు. లీగల్‌సెల్ నాయకుల ప్రతిపాదనకు జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కె.ఓంకార్, కె.కుమార్‌లు సానుకూలంగా స్పందించారు. పార్టీ లీగల్‌సెల్ నాయకులు వెంకటేశ్వర్లు, కష్ణమూర్తి, తిరుపతయ్య, మదనమోహన్‌రెడ్డి.. ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. -
'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు'
-
బయ్యారం ఉక్కు.. ఖమ్మం హక్కు
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జల్లెపల్లి సైదులు గార్ల: బయ్యారం ఉక్కు ఖమ్మం జిల్లా హక్కు అయినందున గార్ల, బయ్యారం మండలాలను ఖమ్మం జిల్లాలోనే ఉంచాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జల్లెపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రోద్బలంతోనే ఇల్లెందు నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ మూడు ముక్కలు చేశారని విమర్శించారు. ఖమ్మానికి 80 కిలోమీటర్ల దూరంలోగల సత్తుపల్లిని, దగ్గరలో ఉన్న కొత్తగూడెం జిల్లాలో కలపకుండా ఖమ్మం జిల్లాలో కలపడం వెనుక మంత్రి తుమ్మల స్వార్థం ఉందన్నారు. ఖమ్మానికి కేవలం 29 కిలోమీటర్ల దూరంలోగల గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్ జిల్లాలో కలపడం ప్రభుత్వానికి తగదన్నారు. ఇనుపరాయి, బైరైటీస్ ఖనిజాలు గల గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్ జిల్లాలో కలిపితే అక్కడి సంపదను ఖమ్మం జిల్లా కోల్పోయినట్టవుతుందని అన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే సుమారు 60వేల ఉద్యోగవకాశాలు వస్తాయన్నారు. అందుకే, ఆ రెండు మండలాలను ఖమ్మం జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పులి సైదులు, నాయకులు ధరావత్ సక్రు, గుగులోత్ హరి, బి.ఈర్య, టి.రవి తదితరులు పాల్గొన్నారు. -
మందకృష్ణకు మాట్లాడే హక్కులేదు: పిడమర్తి
దోమలగూడ: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కాళ్లకు మొక్కి మాదిగల ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టిన మందకృష్ణకు మాదిగల గురించి మాట్లాడే హక్కులేదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. మాదిగలు, ఉపకులాలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్ష చేపట్టారు. దీక్షలలో ఎంహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జెల నాగేశ్వర్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సముద్రాల సంపత్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి కందుకూరి బాబు మాదిగ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కమకం కోమురయ్య మాదిగ, హైదరాబాద్ అధ్యక్షుడు ఐత రామకృష్ణ మాదిగ, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రెడ్డిగాని రాజు మాదిగ తదితరులు కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీబావం ప్రకటించిన రవి మాట్లాడుతూ.. ఉద్యమించి హక్కులను సాధించుకోవాలని డాక్టరు బిఆర్ అంబేడ్కర్ చెబితే, ధర్నాలు, దీక్షలు, ఆందోళనలు కాకుండా కాళ్లు మొక్కి సాధించుకోవాలనే రీతిలో మందకృష్ణ అగ్రకులాల వారికి మాదిగ జాతిని తాకట్టు పెట్టాడని విమర్శించారు. -
రాంగైనా... రైటే!
నాలుగు లేన్ల జాతీయ రహదారిపై డివైడర్లను ఏర్పాటు చేయడం వల్ల ఇటువైపు నుంచి అటువైపు వెళ్లడం సాధ్యం కాదు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ సౌలభ్యాన్ని జాతీయ రహదారుల శాఖ ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఇలాంటి ప్రదేశాల్లో హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. రాప్తాడు నియోజకవర్గంలోని హంపాపురం వద్ద ఏర్పాటు చేసిన లెవెల్ క్రాస్ వద్ద ర్యాంగ్ రూట్లోకి వాహనదారులు దర్జాగా చొరబడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఏదైనా వాహనం వేగంగా వస్తే... ప్రమాదం ఊహించుకుంటే ఒళ్లు గగుర్పాటుకు గురికాకతప్పదు. -
తీర్పును చెత్త బుట్టలో వేయండి
దక్షిణ చైనా సముద్రం మాదే : చైనా బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలో చైనాకు ఎలాంటి హక్కు లేదంటూ హేగ్‌లోని మధ్యవర్తిత్వ శాశ్వత కోర్టు (పీసీఏ) ఇచ్చిన తీర్పును చెత్త బుట్టలో పడేయాలని ఆ దేశం మండిపడింది. వ్యూహాత్మక దక్షిణ చైనా సముద్రాన్ని ‘ఎయిర్ డిఫెన్స్ జోన్’గా ప్రకటించే హక్కు తమకుందని తెలిపింది. తీర్పు ప్రభావం తమ దేశంపై ఏమాత్రం ఉండదని చైనా రక్షణ మంత్రి వాంఖ్వాన్ చెప్పారు. ‘ఆ సముద్రం చైనాది. మా నేవీ, వాయుసేన అక్కడినుంచే పనిచేస్తాయి. ట్రిబ్యూనల్ తీర్పును అమలుపరచం. అది తెల్ల కాగితం వంటిదే. దాన్ని చెత్త బుట్టలో పడేయండి, లేదా చర్చలకు రండి’ అని ఫిలిప్పీన్స్‌ను ఉద్దేశించి విదేశాంగ సహాయ మంత్రి జెన్మిన్ అన్నారు. -
'మన మార్టిన్ లూథర్ కింగ్ అంబేడ్కర్'
న్యూఢిల్లీ: ప్రజలందరూ విద్యావంతులు కావాలని బీఆర్ అంబేడ్కర్ కోరుకున్నారన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం బీఆర్ అంబేడ్కర్ జాతీయ స్మారక భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బాబాసాహెబ్ కలలను సాకారం చేసే అదృష్టం తనకు కలగడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన మరణించిన 60 ఏళ్ల తరువాత మెమోరియల్ ఏర్పాటు కావడం పట్ల మోదీ విచారం వ్యక్త చేశారు. దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గాల హక్కు అయిన రిజర్వేషన్లను ఎవరూ కొల్లగొట్టలేరని పేర్కొన్నారు. అది వారి హక్కు అని మోదీ స్పష్టం చేశారు. అంబేడ్కర్ ను అమెరికా నల్లజాతి పోరాట యోధుడు, పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ తో పోల్చారు. వారిద్దరూ ప్రతి అమానవీయ ఘటనల పట్ల గొంతెత్తిన మహాపురుషులని కొనియాడారు. అంబేడ్కర్ విశ్వమానవుడని, భారత్‌కు మాత్రమే పరిమితం చేసి మాట్లాడడం భావ్యం కాదన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఉండవనే అపోహలు చెలరేగాయని.. కానీ తమ ప్రభుత్వ హయాంలోని దేశంలో ఎక్కడా అలా జరగలేదన్నారు. అణగారిన వర్గాల బలమైన గొంతుక అంబేడ్కర్ అని పేర్కొన్నారు. అంబేడ్కర్ ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉంటే.. ఈ రోజు తాము చేపట్టిన కార్యక్రమాలను 60 ఏళ్ల క్రితమే ఆయన చేపట్టి ఉండేవారన్నారు. సుమారు 18,000 గ్రామాల్లో విద్యుత్ అందించడం ద్వారా అంబేద్కర్ కలలను సాకారం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పించకపోతే తాను మంత్రివర్గంలో కొనసాగనని అంబేడ్కర్ చెప్పారని మోదీ గుర్తు చేశారు. ప్రస్తుతం పార్లమెంటులో జల మార్గాలకు సంబంధించిన బిల్లు ఉందని, అయితే భారత్‌కు ఉన్న శక్తివంతమైన సముద్ర మార్గాల గురించి తొలిసారిగా ప్రస్తావించింది అంబేద్కరేనని తెలిపారు. అంబేడ్కర్ ఫిలాసఫీలో భాగమైన రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అగ్రిఉత్పత్తుల మార్కెట్ రేట్లు గురించి నవీకరించబడిన సమాచారాన్ని రైతులు పొందడానికి వీలుగా ఏప్రిల్ 14న కొత్త టెక్నాలజీని ప్రారంభించనున్నట్టు మోదీ వెల్లడించారు. -
ఈ ఫ్రెండ్లీ ఫైట్.. ఎవరికో రైట్
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో కూటమి పేరుతో జతకట్టిన తెలుగుదేశం- బీజేపీలు నామినేషన్ల ఉపసంహరణ రోజు ఆడిన నాటకం టీఆర్ఎస్కు కొన్ని సీట్లను పెంచబోతోందని ఆ రెండు పార్టీల నాయకులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 150 సీట్లకు గాను టీడీపీ 87, బీజేపీ 63 సీట్లలో పోటీ చేయాలని తొలుత ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే బీజేపీకి కేటాయించిన సీట్లలో టీడీపీ అభ్యర్థులు, టీడీపీ సీట్లలో బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ రోజు ఏదోలా సర్దుకుంటుందిలే అనుకున్న అధికారిక అభ్యర్థుల గుండెల్లో చివరి నిమిషంలో బాంబులు పడ్డాయి. టీడీపీ తన సీట్లు 87కు అదనంగా 5చోట్ల అధికారికంగా, మరో రెండు చోట్ల అనధికారికంగా బీ-ఫారాలు ఇచ్చింది. అది తెలిసిన వెంటనే బీజేపీ అభ్యర్థులు తమ అగ్రనేతలను కలవడంతో వారు కూడా టీడీపీకి ఇచ్చిన ఐదు స్థానాలో తమ వాళ్లకు బీ-ఫారాలు ఇచ్చి ‘ఫ్రెండ్లీ కాంటెస్ట్’కు తెరలేపారు. చర్లపల్లి, మల్లాపూర్, జూబ్లిహిల్స్ వంటి చోట్ల టీడీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు రావడంతో బీజేపీ నాయకులు ఆందోళన చెందుతుంటే, అడిక్‌మెట్, అమీర్‌పేట, హబ్సిగూడ వంటి బీజేపీ గెలిచే అవకాశాలున్న చోట టీడీపీ అభ్యర్థులు బీ-ఫారాలు ఇచ్చి అభ్యర్థులను నిలబెట్టడంతో రెండు పార్టీల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు పార్టీల జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు టీఆర్ఎస్తో కుమ్మక్కై చివరి నిమిషంలో అభ్యర్థులను నిలబెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ఫ్రెండ్లీ ఫైట్’ పేరుతో పోటీలో ఉన్న సుమారు 12 స్థానాల్లోని మెజారిటీ స్థానాలు ఇప్పుడు టీఆర్ఎస్కు కేక్‌వాక్‌గా తయారయ్యాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ను గెలిపించేందుకు... కేటీఆర్ వంద స్థానాలు గెలుచుకుంటామని చెప్పిన మాటలు నిజం చేసేందుకు టీడీపీ, బీజేపీ నేతలు తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. -
జీవించే హక్కు లేకుండా పోతోంది
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: దేశ ప్రజల భవిష్యత్ రాజ్యాంగ చట్టాలపై ఆధారపడి ఉందని, చట్టాలను అమలు చేసే వారు సక్రమంగా అమలు చేస్తే అందరికీ సముచిత న్యాయం లభిస్తుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బంధు సొసైటీ, సంత్ రవిదాస్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యంగ దినోత్సవం, మహాత్మజ్యోతిరావు పూలే వర్ధంతి సభ సందర్భంగా పూలే, అంబేద్కర్ల భావ జాలం - రాజ్యాంగం - సామాజిక న్యాయం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. పాలనలో ఉన్నవారు చేసిన దుర్మార్గాల వల్ల జీవించే హక్కు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ వై.బి.సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగంలో సవరణలు చేయవచ్చు కానీ ఎలాంటి మార్పులు లేకుండా చూడాలని ఆయన కోరారు. ప్రభంజన్‌యాదవ్, బంధు సొసైటీ అధ్యక్షులు పి. వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. -
గోప్యత హక్కు కాదా?!
కొన్ని అంశాలపై జరిగే చర్చలు ఊహించని మలుపు తిరుగుతాయి. అనుద్దేశిత లక్ష్యంవైపు సాగుతాయి. అంతవరకూ ఎజెండాలో లేని కొత్త విషయాలను వెలుగు లోకి తెస్తాయి. ఆధార్ కార్డు చట్టబద్ధతపై సుప్రీంకోర్టు ముందు దాదాపుగా పూర్తయిన విచారణలో ఇప్పుడు అలాంటి పరిణామమే చోటుచేసుకుంది. చడీ చప్పుడూ లేకుండా, చట్టపరమైన ప్రాతిపదిక లేకుండా జన జీవితాల్లోకి తొమ్మిదేళ్ల క్రితం ప్రవేశించిన ఆధార్ కార్డు సంగతిని తేల్చడానికి సర్వోన్నత న్యాయస్థానం సమాయత్తం కాగా... అసలు గోప్యత అనేది పౌరుల ప్రాథమిక హక్కు కాదని వాదించి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అందరినీ నివ్వెరపరిచారు. ఆధార్ కార్డు జారీ చేయడం కోసం సేకరించే వేలిముద్రలు, ఐరిస్ గుర్తింపు వగైరాలన్నీ పౌరుల గోప్యతను దెబ్బతీస్తాయని, ఇది ప్రాథమిక హక్కులకు భంగకరమని దాఖలైన పిటిషన్లపై ముకుల్ రోహత్గీ ఈ వాదన చేశారు. పౌర స్వేచ్ఛలో గోప్యత భాగం కానప్పుడు అసలు ఆ స్వేచ్ఛకు అర్ధమేమిటని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వం లోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. పౌరుల జీవించే హక్కుకూ, స్వేచ్ఛకూ పూచీపడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణ లోనే గోప్యతగా ఉండే హక్కు అంతర్లీనంగా ఉన్నదని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యక్తం చేసిన అభిప్రాయం ఎన్నదగ్గది. గోప్యత ప్రాథమిక హక్కు కాదనడం ద్వారా ఆధార్ కార్డు కోసం పౌరులనుంచి బయోమెట్రిక్ డేటాను సేకరించడంలో హక్కుల ఉల్లంఘన జరగలేదని, పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడలేదని కేంద్ర ప్రభు త్వం చెప్పదల్చుకున్నదని స్పష్టమవుతోంది. ఈ కేసులో ధర్మాసనం ఏం తీర్పునిస్తుందో ఇంకా వేచి చూడాల్సి ఉన్నా రోహత్గీ చేసిన వాదనలోని మూలాలను ఒకసారి పరిశీలించాలి. 1954లో ఒకసారి, 1964లో ఒకసారి విస్తృత ధర్మాసనాలు గోప్యత ప్రాథమిక హక్కు కాదని తీర్పులి చ్చాయని ఆయన చెప్పారు. గోప్యత పౌరుల ప్రాథమిక హక్కని 1970 తర్వాత వెలువరించిన తీర్పులన్నీ ఇద్దరూ లేదా ముగ్గురు న్యాయమూర్తులుండే ధర్మాసనా లే ఇచ్చాయని రోహత్గీ వాదన. కనుక ఈ గోప్యత అంశాన్ని మరో విస్తృత ధర్మాస నానికి అప్పగించాలన్నది ఆయన సూచన. వాస్తవానికి 1954లో గోప్యతకు సంబం ధించి ఎనిమిదిమంది న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు సందర్భం వేరు. ఇంట్లో సోదాలు నిర్వహించి, విలువైన పత్రాలను, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోవ డాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై తీర్పునిస్తూ గోప్యత ప్రాథమిక హక్కు కాదని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. 1964నాటి కేసు కూడా ఇలాంటిదే. తన ఇంటికి తరచు పోలీసులు రావడం, తన గురించి చుట్టుపక్కల అందరినీ అడిగి తెలుసుకోవడంవల్ల గోప్యతకు భంగం కలుగుతున్నదని, 21వ అధిక రణ ప్రకారం ఇది హక్కుల ఉల్లంఘనవుతుందని యూపీకి చెందిన ఖరక్‌సింగ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. అయితే దీన్ని తోసిపుచ్చిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గోప్యత అనేది ప్రాథమిక హక్కుగా రాజ్యాంగం చెప్పలేదని తీర్పునిచ్చింది. ఈ రెండు సందర్భాలూ నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు సంబంధించిన కేసులు. సాధా రణ పౌరులకుండే హక్కుల గురించి, వాటికుండే రాజ్యాంగబద్ధత గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భంలో రోహత్గీ ఈ కేసులను ప్రస్తావించారు. మన రాజ్యాంగంలో ఉండే ప్రాథమిక హక్కులు తిరుగులేనివేమీ కాదు. వాటికి సహేతుకమైన పరిమితులున్నాయి. అలాగే... విస్తృత ధర్మాసనాలే చెప్పినా ఆ తీర్పులు సమీక్షకు అతీతమైనవి కాదు. మారిన కాలమాన పరిస్థితులు కొత్త ఆలోచనలకు తావిస్తాయి. మన అవగాహననే మారుస్తాయి. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పిన భాష్యం ఆ రాజ్యాం గాన్ని మరింత సమున్నతం చేసింది. నిజానికి ఆధార్ కార్డు వ్యవహారంలో సేకరించే బయోమెట్రిక్ డేటా అన్యుల చేతుల్లో పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని, ఆ డేటాను భద్రపరిచే సర్వర్లు దుర్భేద్యమైనవని కేంద్రం చెప్పగలిగి ఉంటే వేరుగా ఉండేది. ఆ విషయం లో ప్రభుత్వానికే అంత నమ్మకం లేకపోవడం వల్ల కావొచ్చు.... అలాంటి డేటా తీసుకోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఎలా అవుతుందన్న వాదన మొద లెట్టింది. మరో విధంగా చెప్పాలంటే ఆధార్ ఉంటే తప్ప దిక్కూ మొక్కూ లేని స్థితిలో పడే పౌరులకు రాజ్యాంగపరంగా ఎలాంటి హ క్కూ ఉండబోదని చెప్పినట్ట యింది. ఒక సమస్యనుంచి బయటపడటం కోసం కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద సమస్యను ముందుకు తెచ్చింది. ఆధార్‌ను పోలిన కార్యక్రమాలను లోగడ అమెరి కా, బ్రిటన్లు కూడా చేపట్టాయి. ‘నో టు ఐడీ’ పేరిట బ్రిటన్‌లో ఆరేళ్లపాటు సాగిన ఉద్యమం ఫలించి అంతవరకూ సేకరించిన పౌరుల డేటాను ధ్వంసం చేస్తున్నట్టు 2010లో కామెరాన్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా సైతం ఈ విషయంలో కొన్ని పరిమితులు విధించుకుంది. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయి, ఎంతో భద్రమైనవనుకున్న అమెరికా రక్షణ శాఖ సర్వర్లలోకి సైతం చొరబడి డేటాను తస్క రించే పరిస్థితులు ఏర్పడిన ప్రస్తుత తరుణంలో ఆధార్ పేరిట సేకరిస్తున్న డేటాకు సమకూర్చిన రక్షణలేమిటో కేంద్రం చెప్పగలిగితే బాగుండేది. విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయడం మొదలుకొని రైతుల రుణమాఫీ వరకూ అన్నిం టికీ ఆధార్ కార్డే మూలమని మన ప్రభుత్వాలు ఊదరగొడుతున్న తీరు ఎంతో ప్రమాదకరమైనది. ఆధార్ లేకపోతే ఇకపై ఊపిరి తీసుకోవడం కూడా కష్టమని అనుకునేంతగా ఈ ప్రచారం సాగుతున్నది. దాన్ని మొదలు పెట్టినప్పుడు ఆనాటి ప్రధాని మన్మోహన్సింగ్ దాన్నొక గుర్తింపు కార్డుగా మాత్రమే చెప్పారని గుర్తుంచు కుంటే ఇప్పుడు ప్రభుత్వాలు పెడుతున్న ఆంక్షలు ఆశ్చర్యం కలిగిస్తాయి. రోహత్గీ అంటున్నట్టు గోప్యత అనే హక్కు రాజ్యాంగ అధికరణల్లో అంతర్లీనం గా అయినా లేకపోతే దాన్ని కల్పించాల్సిన నైతిక బాధ్యత పాలకులకు ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆధార్ కార్డు కోసం సేకరించే డేటా దుర్వినియోగమయ్యే పక్షంలో కారకులపై తీసుకునే చర్యలేమిటో...పౌరుల గోప్యతకు అధికారంలో ఉన్న వారినుంచిగానీ, ప్రైవేటు వ్యక్తులనుంచి గానీ ముప్పువాటిల్లిన సందర్భాల్లో స్వీయ రక్షణకు రాజ్యాంగపరంగా పౌరులకుండే వెసులుబాటేమిటో స్పష్టత చేకూరు తుంది. ఆ తర్వాతే ఆధార్ అయినా, మరొకటైనా అమలు కావాలి. -
‘లెఫ్ట్’ ఎమ్మెల్యేలు రైటే చేశారా...!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరికీ ఓటు వేయకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్యేలు సైతం ప్రథమ ప్రాధాన్యత ఓటును టీడీపీ అభ్యర్థికి వేసి రెండో ప్రాధాన్యతా ఓటును ‘‘నన్ ఆఫ్ ది అబొవ్ ’’(నోటా)కు వేసి మొత్తం తమ ఓట్లే చెల్లకుండా చేసిన వైనాన్ని రాజకీయనాయకులు గుర్తుచేస్తున్నారు. తాము ఎవరికీ ఓటు వేయకపోతే నోటాను ఉపయోగించుకునేందుకు ఎన్నికల సంఘమే ఈ ఏర్పాటు చేసినపుడు, ఈ అవకాశాన్ని సీపీఐ, సీపీఎం ఎమ్మెల్యేలు ఎందుకు ఉపయోగిం చుకోలేదని ఇతర వామపక్షాల నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్కు ఓటువేయడం లేదని, కాంగ్రెస్, టీడీపీలకు ఓటు వేయలేమని, అందువల్ల ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని ఈ పార్టీల నేతలు ప్రకటించారే తప్ప నోటాను ఉపయోగించుకుంటున్నామని ప్రకటించకపోవడం గమనార్హమంటున్నారు. ఓటింగ్‌లో పాల్గొనకపోవడం ద్వారా పరోక్షంగా టీఆర్ఎస్కే వారు ప్రయోజనం చేకూర్చారని వారు చెవులు కొరుక్కుంటున్నారు. సీపీఐ, సీపీఎం ఎమ్మెల్యేలు ఇద్దరు నోటాకు ఓటువేసి ఉంటే మొత్తం అభ్యర్థుల ఓట్లశాతం మారిపోయి టీఆర్ఎస్కు మరిన్ని ఓట్ల అవసరం ఏర్పడి సందిగ్ధత ఏర్పడి ఉండేదంటున్నారు. టీఆర్ఎస్కు మేలుచేయాలనే ఈ విధంగా చేశారా లేక నోటా గురించి తెలియక ఈ విధంగా చేశారా అని ఈ పార్టీల నాయకులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. -
మా హక్కునే వాడుకుంటున్నాం
శ్రీశైలం విద్యుదుత్పత్తిపై గవర్నర్‌కు వివరించిన సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: సాగునీటి కోసం వాడుకోవడానికి తెలంగాణకు ఉన్న చట్టబద్ధమైన హక్కుతోనే శ్రీశైలంలో కరెంటును ఉత్పత్తి చేస్తున్నామని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వివరించారు. ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం.. 7 గంటల వరకు గవర్నర్‌తో చర్చించారు. శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటిపై తెలంగాణకు ఉన్న హక్కులను, దానికి సంబంధించిన గత జీవోలను, ట్రిబ్యునల్ కేటాయింపులను గవర్నర్‌కు నివేదించారు. శ్రీశైలం ద్వారా కరెంటు ఉత్పత్తి చేయకుంటే తెలంగాణ రైతాంగానికి జరిగే నష్టంపైనా వివరించినట్టుగా తెలిసింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు న్యాయంగా రావాల్సిన 54 శాతం వాటాను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూనే, మరోవైపు శ్రీశైలం కరెంటు ఉత్పత్తిని వివాదం చేసే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారని గవర్నర్‌కు చెప్పినట్టుగా సమాచారం. నవంబర్ 5 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ వంటివాటిపైనా కేసీఆర్ చర్చించారు. పలు అంశాలపై గవర్నర్ కూడా తన అభిప్రాయాలను పంచుకున్నట్టుగా తెలిసింది. -
వంశ‘ధార’పారింది
ప్రధాన కాలువల ద్వారా సాగునీరు విడుదల హిరమండలం: వంశధార కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా సాగునీటిని అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎస్ఈ బి.రాంబాబు ముందుగా వంశధార నదికి పూజలు నిర్వహించి నీరు విడిచిపెట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వరినారుమడులు ఎండిపోతున్నాయన్న రైతుల కోరికతోపాటు, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు నీరు విడిచి పెట్టామన్నారు. నదిలో ఇన్‌ఫ్లో తక్కువగా వస్తున్నందు నీటిని రైతులు పొదుపుగా ఉపయోగించుకోవాలని సూచించారు. కుడికాలువ ద్వారా 55 కిలోమీటర్ల పరిధిలోని హిరమండలం, ఎల్.ఎన్,పేట, సరుబుజ్జిలి, బూర్జ, ఆమదాలవలస, గార, శ్రీకాకుళం మండలాల్లోని 62,280 ఎకరాలకు, ఎడమ ప్రధాన కాలువ ద్వారా 104 కిలోమీటర్ల మేర హిరమండలం, జలుమూరు. టెక్కలి, పోలాకి, సంతబొమ్మాళి, పలాస, నరసన్నపేట, మెళియాపుట్టి, సారవకోట, కోటబొమ్మాళి, నందిగాం, వజ్రపుకొత్తూరు మండలాల్లోని 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందజేయనున్నట్టు ఎస్ఈ పేర్కొన్నారు. కుడికాలువ ద్వారా 50 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు నీటిని విడిచిపెడతామన్నారు. ఈ కార్యక్రమంలో వంశధార ఈఈ లు రామచంద్రరావు, మన్మథరావు, డీఈఈ ఎస్.జగదీశ్వరరావు, ఏఈఈలు పాల్గొన్నారు. -
ఓటు హక్కు పొందాలి
ఆదిలాబాద్ రూరల్, న్యూస్‌లైన్ :18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని కలెక్టర్ అహ్మద్ బాబు సూచించారు. బుధవారం తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు నమోదు, సవరణపై సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కళాశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. మీసేవా కేంద్రా ల్లో అవసరమైన ఫారాలు అందుబాటులో ఉం టాయని తెలిపారు. ఓటర్ల సవరణ జాబితాను 6 జనవరి 2014న ప్రచురిస్తామని, ముసాయిదా జాబితాను 3 అక్టోబర్ 2013న ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఫిర్యాదులు అక్టోబర్ 3 నుంచి 31 వరకు స్వీకరిస్తామని, ఇదే నెలలో 6, 13, 20, 27 తేదీల్లో బూత్ స్థాయి ఏజెంట్ల నుంచి క్లైమ్లు, అభ్యంతరాలను స్వీకరించి నవంబర్ 30న పరిష్కరిస్తామని చెప్పారు. డిసెంబర్ 26 నాటికి పూర్తి సమాచారాన్ని పొందుపరిచి ఫొటోలతో జాబితా సిద్ధం చేస్తామన్నారు. జిల్లాలోని పది శాసనసభ నియోజకవర్గసభ్యుల పరిధిలో 2,137 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఓటర్ల పెంపుతో 225 పెరిగి సంఖ్య 2,362 చేరిందని చెప్పారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సూచనలు, అభ్యంతరాలు సమర్పిస్తే చర్యలు చేపడుతామన్నారు. సమావేశంలో డీఆర్వో ఎస్ఎస్ రాజు, నాయకులు నర్సింగ్‌రావు, గొడాం నగేష్, బి.గోవర్ధన్, దత్రాత్తి, ఎం.ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మణ్, ఓంకార్ శర్మ, ఎన్నికల పర్యవేక్షకుడు ప్రభాకర్‌స్వామి పాల్గొన్నారు.