Germany Busts Alleged Right Wing Coup Plot - Sakshi
Sakshi News home page

జర్మనీ: ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చే భారీ కుట్ర భగ్నం.. కారకులు ఎవరంటే..

Published Thu, Dec 8 2022 8:24 AM | Last Updated on Thu, Dec 8 2022 9:01 AM

Germany busts alleged right wing coup plot - Sakshi

బెర్లిన్‌: జ‌ర్మ‌నీలో భారీ కుట్ర భగ్నం అయ్యింది. ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు కుట్ర ప‌న్నుతున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై వాళ్ల‌ను ఆధీనంలోకి తీసుకున్నారు.  త‌నిఖీల్లో సుమారు 25 మందిని అరెస్టు చేశారు. 

అతివాదులు, మాజీ సైనిక దిగ్గ‌జాలు ఈ కుట్ర ప‌న్నిన‌ట్లు భావిస్తున్నారు. పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని చుట్టు ముట్టి, అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని అతివాదులు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు అనుమానించారు. రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హెన్రిచ్‌-13 ఈ ప్ర‌ణాళిక‌లు వేసిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. 

సుమారు మూడు వేల మంది పోలీసులు.. 150 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌భుత్వ కూల్చివేత‌కు కుట్ర చేసిన‌ బృందంలో సుమారు 50 మంది ఉన్న‌ట్లు భావిస్తున్నారు. రీచ్‌బ‌ర్జ‌ర్ తీవ్ర‌వాదులు ఈ ప‌న్నాగంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement