హోదా రాష్ట్ర ప్రజల హక్కు
– జిల్లా న్యాయవాదుల సంఘం మద్దతు కోరిన వైఎస్‌ఆర్‌సీపీ లీగల్‌సెల్
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కు అని వైఎస్‌ఆర్‌సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నిర్వహించే బంద్‌కు సహకరించాలని శుక్రవారం జిల్లా న్యాయవాదుల సంఘం నాయకులను కలిశారు. లీగల్‌సెల్ నాయకుల ప్రతిపాదనకు జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కె.ఓంకార్, కె.కుమార్‌లు సానుకూలంగా స్పందించారు. పార్టీ లీగల్‌సెల్ నాయకులు వెంకటేశ్వర్లు, కష్ణమూర్తి, తిరుపతయ్య, మదనమోహన్‌రెడ్డి.. ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.