status
-
నేను.. నా స్టేటస్!
మాట.. పాట.. ఆట.. ఆనందం.. ఆశ్చర్యం.. విషాదం వార్తలు.. విశేషాలు.. వింతలు శుభాకాంక్షలు.. విమర్శలు.. సూచనలు విద్య, ఉద్యోగం.. వ్యాపారం.. పుట్టుక.. పెళ్లి.. చావు.. ఆధ్యాతి్మకం..విహారం.. ఆరోగ్యం.. ఇలా.. అన్నీ ఒకే వేదికపై అందరితో స్మార్ట్‌గా పంచుకుంటున్నారు. ‘నా స్టేటస్.. నా ఇష్టం’.. అంటూరోజూ అందరినీ పలకరిస్తూ సాగిపోతున్నారు. కర్నూలు(హాస్పిటల్): సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి సోషల్ మీడియా ఇప్పుడొక వేదికగా మారింది. అందులో ఇటీవల కాలంలో వాట్సాప్ యాప్‌లోని ఫీచర్ అయిన ‘స్టేటస్’ను ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఆధునిక టెక్నాలజీకి అలవాటుపడ్డ ఈ తరుణంలో ‘స్టేటస్’లో పోస్టు పెట్టడమనేది ఒక స్టేటస్‌లా భావిస్తున్న వారూ ఉన్నారు. ఫేస్బుక్, (Facebook) యూ ట్యూబ్, ఎక్స్ తదితర మాధ్యమాలు ఉన్నప్పటికీ ఎక్కువగా వాట్సాప్ స్టేటస్ (WhatsApp status) వేదికగా వాడుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనాభా దాదాపు 50 లక్షల వరకు ఉంటుంది. అందులో పిల్లలు మినహాయిస్తే 40 లక్షల వరకు యుక్త వయస్సు నుంచి వృద్ధుల వరకు ఉంటారు. వీరిలో కనీసం 50 శాతం మందికి అంటే 20 లక్షల మందికి స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. దాదాపుగా స్మార్ట్‌ఫోన్ (Smart Phone) ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌ను ఉపయోగించే వారందరూ స్టేటస్‌లో వారికి నచ్చిన అంశాలను పోస్టు చేస్తూ ఉండటం లేదా చూస్తూ ఉండటం చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం వరకు వాట్సాప్ యాప్‌ను ఉపయోగించే వారిలో 10 నుంచి 20 శాతం మాత్రమే స్టేటస్ ఫీచర్‌ను ఉపయోగించేవారు. ఇప్పుడు 80 శాతం మంది ఈ ఫీచర్‌ను చూస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు రోజులో నాలుగైదు సార్లైనా స్టేటస్ చూడంది నిద్రపోవడం లేదని సమాచారం. వారు పెట్టిన పోస్టును ఎవరు? ఎంత మంది చూశారు? ఎవ్వరైనా ప్రతి స్పందించారా? అని ఆతృతగా వెతికేవారూ ఉన్నారు. ఇలా వారు పెట్టిన పోస్టుకు ఎవరూ స్పందించకపోతే తీవ్ర అసంతృప్తికి గురయ్యే వారూ ఉన్నారు. ఈ క్రమంలో అందుకు అనుగుణమైన సందేశాన్ని కోట్ చేస్తూ పోస్టు చేస్తున్నారు. మొత్తంగా వాట్సాప్ స్టేటస్‌లో వారు పోస్టు చేసే దాన్ని బట్టి వారు ఎలాంటి వారు, వారి మనస్తత్వమేమిటో ఇట్టే చెప్పేయవచ్చని మేధావులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత ప్రతిభ చాటడానికి...! చాలా మంది తమ వ్యక్తిగత ప్రతిభ చాటడానికి స్టేటస్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఎందులోనైనా వారు ప్రతిభ సాధించి ఉంటే అప్పటికప్పుడు స్టేటస్‌లో పోస్టు చేస్తున్నారు. లేదా వారి కుటుంబసభ్యుల్లో ఎవరు ప్రతిభ సాధించినా పోస్టు చేస్తున్నారు. ఈ పోస్టును చూసిన వారు తప్పక అభినందనలతో ముంచెత్తుతున్నారు. దీనివల్ల మానసికానందం పొందుతున్నారు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు, వ్యాపారాభివృద్ధి, విద్య, ఉద్యోగాల్లో ప్రతిభ చాటడం, క్రీడల్లో సత్తా చాటడం వంటి అంశాలను స్టేటస్‌లో పోస్టు చేసి వాటిని చూసిన వారి నుంచి ప్రశంసలు పొందుతున్నారు. బిజినెస్‌కు వేదికగా.. వ్యాపారాభివృద్ధికి సోషల్ మీడియా కూడా ప్రచార వేదికగా మారింది. అందులో అందరూ ఎక్కువగా చూసే వాట్సాప్ స్టేటస్‌ను చాలా మంది వ్యాపారులు తమ వ్యాపారాభివృద్ధి కోసం ఉపయోగించుకుంటున్నారు. వ్యాపారం గురించి బ్రోచర్లు ముద్రించి స్టేటస్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఆయా వస్తువుల వివరాలు, వాటిలోని ఫీచర్లు, ధర గురించి అందులోనే పోస్టు చేస్తుండటంతో చూసిన చాలా మంది వెంటనే సంబంధిత వ్యక్తికి ఫోన్ చేసి వస్తువును కొనుగోలు చేస్తున్నారు. చాలా మంది అన్ని రకాల వ్యాపారులు వారి వ్యాపార వస్తువులను వాట్సాప్ స్టేటస్‌లో పోస్టు చేస్తూ వ్యాపారాభివృద్ధి చేసుకుంటున్నారు. దేవుళ్లు.. దేవతలు.. వాట్సాప్ స్టేటస్‌తో చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ 50 శాతం మంది ఏ రోజుకు ఆ రోజు సంబంధిత దేవుళ్ల ఫొటోలు, పాటల వీడియోలు పోస్టు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీటిని చూసిన అదే రకమైన వారు ప్రతిస్పందిస్తూ లైక్‌లు, కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ప్రతిస్పందిస్తూ సంజ్ఞలు తెలిపే చిత్రాలను పోస్టు చేస్తున్నారు. హిందువులు ఆయా రోజు ప్రత్యేకతను బట్టి దేవుళ్ల గురించి పోస్టు పెడుతున్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు అయితే రోజుతో సంబంధం లేకుండా ప్రతిరోజూ వారి మత సంబంధ కోట్స్ పోస్టు చేస్తున్నారు. మనోభావాలు వ్యక్తం చేస్తూ..కొందరు వారి మనోభావాలను తెలియజేసే విషయాలు ఎంపిక చేసుకుని స్టేటస్‌లో పోస్టు చేస్తూ ఆనందిస్తున్నారు. ఇవి వారికి నచ్చిన వారికి మంచిగా, నచ్చని వారికి చెడుగా స్పృశించవచ్చు. ఆ కోట్స్‌ను పోస్టు చేసిన వ్యక్తిని బట్టి ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటే అలా కనిపిస్తాయి. ఒక విధంగా పోస్టు చేసిన వ్యక్తి మనోభావాలు ఇలా స్టేటస్ రూపంలో ప్రతి స్పందిస్తాయనడంలో సందేహం లేదు. చాలా మంది వారికి జరిగిన మంచి, చెడును ఇతరులకు చెప్పేందుకు స్టేటస్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను పోస్టు చేస్తున్నారు. ఇట్లు.. మేము బాగున్నాం.. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో బంధువులు, స్నేహితులకు కనీసం ఫోన్లు చేసి యోగక్షేమాలు తెలుసుకునే సమయం ఉండటం లేదు. ఏదైనా కార్యక్రమంలో కలిసినప్పుడు హాయ్.. బాయ్ అన్నట్లుగా ఉంటుంది. కనీసం పిల్లలు, కుటుంబ పరిస్థితుల గుర్తించి అడిగేవారు.. చెప్పేవారు లేరు. ఈ క్రమంలో వాట్సాప్ స్టేటస్‌ను ప్రతి ఒక్కరూ చక్కగా ఉపయోగించుకుంటున్నారు. స్టేటస్ ఒక లేఖలా మారిపోయింది. ఉదాహరణకు ఏదైనా విహార, శుభకార్యాలు, తీర్థయాత్రకు వెళ్లారంటే అందుకు సంబంధించిన ఏ రోజుకు ఆ రోజు ఫొటోలు సమయంతో సహా కుటుంబసభ్యులంతా ఉండే ఫొటోలు పోస్టు చేసి ఆనందిస్తున్నారు. ఆ పోస్టులను చూసిన వారు ఫలానా వారు ఫలానా ఊరికి యాత్రకు వెళ్లినట్లు ఉన్నారని వెంటనే గ్రహిస్తారు. మరికొందరు వారికి ఏదైనా చెడు జరిగిందంటే ఉదాహరణకు రోడ్డు ప్రమాదమో లేదా ఇతర ప్రమాదాలు, ఆరోగ్యం బాగాలేకపోయినా వారి స్థితిని తెలియజేస్తే ఇతరుల సానుభూతిని పొందేందుకు పోస్టు చేస్తూ ఉంటారు. ఆ పోస్టు చూసిన వారు అయ్యో వారికి ఆరోగ్యం బాగాలేదా అని తెలుసుకుని స్వయంగా వెళ్లడమో లేదా ఫోన్ చేసి పరామర్శించడమో చేస్తున్నారు. ఏది పడితే అది పోస్టు చేయకూడదు నేను పెట్టే పోస్టులను నా గ్రూపులో ఉన్న 60 నుంచి 70 శాతం మంది చూస్తున్నారు. ఇటీవల వరల్డ్ డయాబెటిస్ గురించి పోస్టు పెట్టాను. నాకు ఫోన్ చేసి షుగర్ గురించి వారికున్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. అలాగే గంటలకు పైగా సైక్లింగ్ చేసిన తర్వాత కలిగిన అనుభవం గురించి పోస్టు చేశాను.సైక్లింగ్ వల్ల లాభాల గురించి ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. చూస్తున్నారు కదా అని ఏది పడితే అది పోస్టు చేయకూడదు. అవగాహనతో చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుని పోస్టు చేయాలి. – డాక్టర్ ఎం. శ్రీకాంత్‌రెడ్డి, డయాబెటాలజిస్టు, కర్నూలుప్రజల్లో అవగాహన పెంచడానికే.. ఇటీవల కాలంలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ లాంటి సోషల్ మీడియాల్లో కొందరు వ్యక్తులు వారికి అర్హత లేకపోయినా ఆరోగ్యం గురించి పలు రకాల పోస్టులు పెట్టి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇలాంటి వారికి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు గాను ఒక డాక్టర్‌గా బాధ్యత తీసుకుని నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు ‘స్టేటస్’లో పోస్టులు పెడుతున్నాను. నేను నూతన విధానాల్లో చేసిన సర్జరీలు, విదేశాల్లో ఉన్న ఆధునిక వైద్య విధానాలు, మన దేశాల్లో రావాల్సిన ఆవశ్యకత, వివిధ రకాల జబ్బుల గురించి వివరిస్తూ పోస్టులు పెడుతున్నాను. – డాక్టర్ వసీం హసన్ రాజా, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, కర్నూలు వ్యాపార ప్రచారానికి ఉపయోగపడుతోంది నేను వ్యాపారవేత్తను. వాట్సాప్ స్టేటస్‌లోనూ పోస్టులు పెడుతున్నాను. దీనికి మంచి స్పందన వస్తోంది. నేను చేస్తున్న స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల గురించి పోస్టులు పెట్టాను. ఇటీవల రియల్ ఎస్టేట్ పోస్టులు స్టేటస్‌లో చూసి కొందరు క్లయింట్లు మావద్దకు వచ్చి కొనుగోలు చేశారు. – పి. గోవర్దన్‌రెడ్డి, వ్యాపారి, కర్నూలు -
‘నా చావుకు భార్య, బావమరిది, అత్తలే కారణం’
శాలిగౌరారం: పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రాకపోవడంతో పాటు వరకట్నం వేధింపుల కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేయడంతో మనస్తాపానికి గురై వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. వల్లాల గ్రామానికి చెందిన మాదగోని ప్రశాంత్(30)కు సూర్యాపేట పట్టణానికి చెందిన శివజ్యోతితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. ప్రశాంత్ నకిరేకల్‌లో మొబైల్‌షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం సాఫీగా సాగిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శివజ్యోతి భర్త ప్రశాంత్‌తో తరచూ గొడవ పడి తల్లిగారింటికి వెళ్లేది. వారం రోజుల క్రితం ఇంట్లో భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరగడంతో ప్రశాంత్ శివజ్యోతిపై చేయిచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో శివజ్యోతి కుమార్తెను తీసుకుని తల్లిగారింటికి వెళ్లింది. వారం రోజులు గడిచినా ఆమె కాపురానికి తిరిగి రాకపోగా వరకట్నం కోసం వేధింపులకు గరిచేస్తున్నారంటూ ప్రశాంత్, అతడి అక్కలపై సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ప్రశాంత్‌తో పాటు అతని బంధువులు, మంగళవారం సూర్యాపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ప్రశాంత్‌ను శివజ్యోతి కుటుంబ సభ్యులు తీవ్రమైన పదజాలంతోపాటూ దూషించడంతో పాటూ దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో మనస్తాపానికి గురైన గురైన ప్రశాంత్ ఇంటికి వచ్చి తన ఆత్మహత్యకు భార్య, అత్త, బావమరిది కారకులని వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి అర్ధరాత్రి సమయంలో వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకని ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేటస్ చూసి కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే అతడు మృతిచెందాడు. మృతుడి తండ్రి మాదగోని యాదగిరి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ప్రశాంత్ అంత్యక్రియల్లో అతడి భార్య శివజ్యోతి పాల్గొనకపోవడం గమనార్హం. -
మరో నాలుగు సంస్థలకు నవరత్న హోదా
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం మరో నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా ప్రకటించింది. ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థలైన నేషనల్ హైడ్రాలిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ), ఎస్‌జేవీఎన్ (సట్లజ్ జల విద్యుత్ నిగమ్)లకు నవరత్న హోదా దక్కింది. అలాగే, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈసీఐ), రైల్‌టెల్‌కు సైతం నవరత్న హోదా లభించింది.‘‘ప్రభుత్వరంగ సంస్థల విభాగం ఆగస్ట్ 30న ఎన్‌హెచ్‌పీసీని నవరత్న కంపెనీగా ప్రకటించింది. ఇది నిర్వహణ, ఆర్థిక పరంగా స్వయంప్రతిపత్తిని తీసుకొస్తుంది’’అని ఎన్‌హెచ్‌పీసీ తెలిపింది. కంపెనీకి ఇది చరిత్రాత్మకమని ఎన్‌హెచ్‌పీసీ సీఎండీ ఆర్కే చౌదరి అభివర్ణించారు.కంపెనీ ఆర్థిక, నిర్వహణ సామర్థ్యాలకు గుర్తింపు అని పేర్కొన్నారు. ఈ హోదాతో వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఇప్పటి వరకు ఎన్‌హెచ్‌పీసీ మినీరత్న కేటగిరీ–1 కంపెనీగా ఉంది. ఎస్‌జేవీఎన్ సైతం మినీతర్న కేటగిరీ –1గా ఉండడం గమనార్హం. -
Lok Sabha Election 2024: కాంగ్రెస్‌కు కనీసం 50 సీట్లు కూడా రావు
ఫూల్బాణీ/బోలాంగిర్/బార్గఢ్/ఛాత్రా: కాంగ్రెస్ పార్టీ కనీసం 50 చోట్ల కూడా గెలవబోదని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. విజయం కాదుకదా కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కదని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఒడిశా, జార్ఖండ్‌లోని ఫూల్బాణీ, బోలాంగిర్, బార్గఢ్, ఛాత్రాలలో ఎన్నికల ప్రచారసభల్లో మోదీ ప్రసంగించారు. ‘‘ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు కావాల్సిన కనీసం 10 శాతం సీట్లు కూడా కాంగ్రెస్ సాధించబోదు. వాళ్లు కనీసం 50 సీట్లు కూడా గెలవలేరు’ అని అన్నారు. రాహుల్ గాం«దీని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ గాంధీ యువరాజు 2014 నుంచి అదే స్క్రిప్ట్ చదువుతున్నారు. నా మాటలు రాసిపెట్టుకోండి. ఎన్డీఏ అన్ని రికార్డులను బద్దలుకొట్టి 400 సీట్లు సాధిస్తుంది’’ అని అన్నారు. సొంత ప్రజల్నే కాంగ్రెస్ భయపెడుతోంది మణిశంకర్ అయ్యర్ ‘అణుబాంబు’ వ్యాఖ్యలను మోదీ ప్రస్తావించారు. ‘ పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందని సొంత ప్రజల్నే కాంగ్రెస్ భయపెడుతోంది. వర్చువల్‌గా ఇప్పటికే చనిపోయిన కాంగ్రెస్ నేతలు ప్రజల గుండెల్లో నిండిన దేశ స్ఫూర్తిని చంపేస్తున్నారు. సొంత అణుబాంబుల నిర్వహణ బాధ్యతలు కూడా పాక్‌కు చేతకావట్లేదు. అందుకే అణుబాంబులను అమ్మేద్దామని భావిస్తోంది. బాంబులను అమ్ముదామన్నా కొనేవారు లేరు. అవి ఎంత నాసిరకానివో ఇతర దేశాలకు తెలుసు. జమ్మూకశీ్మర్ విషయంలో కాంగ్రెస్ తీసుకున్న బలహీనమై న నిర్ణయాల వల్ల ఆ ప్రాంతం ఆరు దశాబ్దా లు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంది. కాంగ్రెస్ హ యాంలో భారత్ ఎన్నోసార్లు ఉగ్రదాడుల బా రినపడింది. కఠిన నిర్ణయాలకు బదులు చర్చలకు మొగ్గుచూపింది’’ అని ధ్వజమెత్తారు.పాండియన్‌పై విసుర్లు తమిళనాడుకు చెందిన మాజీ ఉన్నతాధికారి పాండియన్‌పై మోదీ విమర్శలు గుప్పి ంచారు. ‘‘ పటా్నయక్ తన ప్రభుత్వ బాధ్యతలను ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చేశారు. బయటివ్యక్తి(ఔట్‌సైడర్) పాండియన్ ఒడిశాను పాలిస్తున్నారు. ముఖ్యమంత్రిని మించి సూపర్ సీఎం పాలిస్తున్నారు. ఒడిశా బిడ్డలు, కూతుళ్లకు సొంత ప్రభుత్వాన్ని నడుపుకునే సత్తా లేదా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దమ్ము ఇక్కడి వారికి లేదా?’’ అని ప్రశ్నించారు.నవీన్ పటా్నయక్ జిల్లాల పేర్లు చెప్పగలరా? ‘‘ఒడిశాకు ఇన్నేళ్లు సీఎంగా ఉన్న నవీన్ పటా్నయక్‌కు ఇదే నా సవాల్. ఆయన ఒడిశాలోని అన్ని జిల్లాలు, జిల్లా కేంద్రాల పేర్లను ఏ పేపర్లో చూడకుండా, ఎవరి సాయం లేకుండా ఒడియా భాషలో చెప్పగలరా?. పేర్లే చెప్పలేని వ్యక్తి పేదల బాధలెలా తీర్చగలరు? ప్రజా సమస్యలను ఎలా అర్థంచేసుకోగలరు?’’ అని మండిపడ్డారు. -
వాట్సప్ స్టేటస్ పెడుతున్నారా..? అదిరిపోయే అప్డేట్ మీ కోసమే!
మెటా ఆధ్వర్యంలోని వాట్సప్ తన వినియోగదారులకు అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఆ కథనాల ప్రకారం..ఇకపై 60 సెకన్ల నిడివితో ఉన్న వీడియోలను సైతం వాట్సప్ స్టేటస్‌లో అప్లోడ్ చేసే అవకాశాన్ని కల్పించనున్నట్లు సమాచారం. వాట్సప్ స్టేటస్‌లో ప్రస్తుతం గరిష్ఠంగా 30 సెకన్ల నిడివి ఉన్న వీడియోలను మాత్రమే పోస్ట్ చేసేందుకు అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ నిడివిఉన్న వీడియోలను నేరుగా పంపించాల్సిందే. స్టేటస్‌లో పెట్టుకునేందుకు అవకాశంలేదు. ఒకవేళ అలా స్టేటస్‌లో పెట్టాలంటే మరో వీడియో కింద మార్చిపెట్టాలి. వీడియో నిడివి పెరుగుతున్న కొద్దీ స్టేటస్ అప్డేట్ల సంఖ్య పెరుగుతుంది. దీన్ని పరిష్కరించేందుకు వాట్సప్ తాజా అప్డేట్ను తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఒక నిమిషం నిడివితో ఉన్న వీడియోలను స్టేటస్‌లో అప్లోడ్ చేసే అవకాశం ఉండబోతుందంటూ సమాచారం. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. త్వరలో మిగిలిన యూజర్లందరికీ ఇది అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: 23 ఏళ్ల గరిష్ఠానికి చేరిన కీలక వడ్డీరేట్లు.. తగ్గింపు ఎప్పుడంటే.. ఇదిలాఉండగా, పేమెంట్స్‌కు సంబంధించి వాట్సప్ మార్పు చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వాట్సప్‌లో చెల్లింపులు చేయాలంటే త్రీ డాట్స్ మెనూలో పేమెంట్స్‌లోకి వెళ్లాల్సి వస్తోంది. ఇకపై ఆ అవసరం లేకుండా మనం ఎంచుకున్న కాంటాక్ట్ చాట్‌లోనే పై భాగంలో క్యూఆర్ కోడ్ సింబల్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఈ ఫీచర్ కూడా త్వరలో అందుబాటులోకి రానుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. -
ఆ రాష్ట్రాలకు పౌరసత్వ సవరణ చట్టం నుంచి మినహాయింపు?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులతో సహా ముస్లిమేతర వలసదారులకు ఈ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం భారత పౌరసత్వాన్ని ఇవ్వనుంది. అయితే కొన్ని రాష్ట్రాలను ఈ చట్టం పరిధి నుంచి తప్పించారు. ఆ రాష్ట్రాలు ఏవి? ఎందుకు మినహాయింపునిచ్చారు? మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఈశాన్య రాష్ట్రాల్లోని పలు గిరిజన ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయరు. వీటిలో రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక హోదా మంజూరైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. దేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రయాణానికి ‘ఇన్నర్ లైన్ పర్మిట్’ (ఐఎల్పీ) అవసరమయ్యే అన్ని ఈశాన్య రాష్ట్రాలలో సీఏఏ చట్టం అమలు చేయరు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, మణిపూర్లకు ఐఎల్పీ వర్తిస్తుంది. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో స్వయంప్రతిపత్తి గల కౌన్సిళ్లుగా ఏర్పడిన గిరిజన ప్రాంతాలను కూడా సీఏఏ పరిధి నుంచి తప్పించారు. అసోం, మేఘాలయ, త్రిపురలలో ఇటువంటి స్వయం ప్రతిపత్తి కౌన్సిళ్లు ఉన్నాయి. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన హిందూయేతరులు తొలుత తాము ఈ మూడు దేశాలలో ఎక్కడైనా నివాసితులుగా నిరూపించుకోవాలి. అప్పుడే వారికి భారత పౌరసత్వం వర్తిస్తుంది. ఇందుకోసం వారు వారి పాస్‌పోర్ట్, జనన ధృవీకరణ పత్రం, విద్యా ధృవీకరణ పత్రం, అక్కడ ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా సర్టిఫికేట్ లేదా లైసెన్స్, భూమి పత్రాలను సంబంధిత అధికారులకు చూపించవలసి ఉంటుంది. -
యూనికార్న్‌గా ఇన్‌క్రెడ్
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ సంస్థ ఇన్‌క్రెడ్ తాజాగా యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) హోదా దక్కించుకుంది. ప్రస్తుత, కొత్త ఇన్వెస్టర్ల నుంచి 60 మిలియన్ డాలర్లు సమీకరించడంతో ఇది సాధ్యపడింది. తాజా పెట్టుబడుల రాకతో సంస్థ విలువ 1.04 బిలియన్ డాలర్లకు చేరిందని ఇన్‌క్రెడ్ పేర్కొంది. తద్వారా ఈ ఏడాది యూనికార్న్ హోదా దక్కించుకున్న రెండో సంస్థగా నిల్చిందని పేర్కొంది. రాబోయే రోజుల్లో వ్యాపారాన్ని మరింతగా విస్తరించడానికి ఈ నిధులను వినియోగించనున్నట్లు ఇన్‌క్రెడ్ సీఈవో భూపీందర్ సింగ్ తెలిపారు. ఎంఈఎంజీకి చెందిన రంజన్ పాయ్, ఆర్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రవి పిళ్లై, డాయిష్ బ్యాంక్ గ్లోబల్ కో–హెడ్ రామ్ నాయక్ తదితరులు ఇన్వెస్ట్ చేసిన వారిలో ఉన్నారు. ఇన్‌క్రెడ్ సంస్థ కన్జూ్యమర్ రుణాలు, విద్యా రుణాలు మొదలైన వ్యాపార విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
వాట్సాప్ స్టేటస్‌గా గర్ల్ ఫ్రెండ్ డెడ్‌బాడీ ఫొటో!
చెన్నై: గర్ల్ ఫ్రెండ్‌ను గొంతు పిసికి చంపేసిన ఓ యువకుడు, ఆమె మృతదేహం ఫొటోను తీసి వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. మృతురాలి స్నేహితులు గుర్తు పట్టి, పోలీసులను అప్రమత్తం చేయడంతో అతగాడు దొరికిపోయాడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. కేరళలోని కొల్లంకు చెందిన ఫౌసియా(20) చైన్నైలోని ఓ హాస్టల్లో ఉంటూ క్రోంపేట్‌లోని కాలేజీలో నర్సింగ్ చదువుతోంది. ఆషిక్(20)అనే యువకుడితో అయిదేళ్లుగా సన్నిహితంగా ఉంటోంది. మైనర్‌గా ఉన్నప్పుడే ఫౌసియా గర్భవతి అయింది. ఆషిక్‌పై పోక్సో కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లాడు. ఫౌసియా పుట్టిన బిడ్డను దత్తతకిచ్చింది. జైలు నుంచి విడుదలయ్యాక ఆషిక్, ఫౌసియా సంబంధం తిరిగి కొనసాగుతోంది. శుక్రవారం చెన్నై వచ్చిన ఆషిక్ హోటల్లో రూం బుక్ చేసి, ఫౌసియాను వెంట తీసుకెళ్లాడు. అదే రోజు సాయంత్రం, మృతదేహం ఫొటోను తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. ఫౌసియా స్నేహితులు ఆ ఫొటోను గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే వెళ్లి హోటల్ రూంలో చూడగా ఫౌసియా మృతదేహం కనిపించింది. పరారీలో ఉన్న ఆషిక్‌ను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నారు. తనకు మరో యువతితో సంబంధముందని అనుమానిస్తూ మాట్లాడటంతో కోపం పట్టలేక ఫౌసియాను టీ షర్టుతో గొంతుకు బిగించి, చంపేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. -
‘లాయర్ల సీనియర్ హోదా’ అంటే ఏమిటి? నిబంధనలు, అర్హతలు ఏవి?
న్యాయవాదుల హోదా విషయమై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. లాయర్ల సుదీర్ఘకాల డిమాండ్‌కు ముగింపు లభించింది. ఈ విషయంపై గతంలో పిటిషన్ దాఖలైంది. లాయర్‌కు సీనియర్ పోస్టు ఇవ్వడాన్ని అన్యాయమని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కోర్టు అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2023, అక్టోబర్ 19న మొత్తం 535 మంది న్యాయవాదులకు సీనియర్ న్యాయవాది హోదా కల్పించారు. ఇంతకీ సీనియర్ న్యాయవాది అని ఎవరిని పిలుస్తారు? ఇందుకుగల అర్హతలు, నిబంధనలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అడ్వకేట్ చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం న్యాయవాదులు రెండు తరగతులకు చెందినవారై ఉంటారు. మొదటిది సీనియర్ న్యాయవాది. రెండవ ఇతర న్యాయవాది. ఒక న్యాయవాది సీనియర్ కావాలనుకుంటే సుప్రీంకోర్టు, హైకోర్టు ఆ హోదాను అందించవచ్చు. సెక్షన్ 23 (5) ప్రకారం కేసును దాఖలు చేసే హక్కు సీనియర్ న్యాయవాదులకు ఉండదు. వారు ఆయా కేసులను పరిష్కరించడమో లేదా కేసును క్రాస్ ఎగ్జామిన్ చేయడమో చేస్తారు. సాధారణ న్యాయవాదులతో పోలిస్తే సీనియర్ న్యాయవాది కేసు దాఖలు చేసే అధికారాన్ని కోల్పోతాడని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సందీప్ మిశ్రా మీడియాకు తెలిపారు. అయితే పలు కేసుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కోర్టు ఈ లాయర్ల నుంచి సలహాలు తీసుకుంటుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సందీప్ మిశ్రాను సీనియర్ లాయర్ హోదా పొందేందుకు వయసుకు సంబంధించిన ప్రమాణాలు ఉంటాయా అని అడగా, దీనికి వయోపరిమితి లేదని బదులిచ్చారు. అయితే ఆ న్యాయవాది ఎన్ని కేసులలో వాదించాడు? అవి ఎలాంటి కేసులు, కేసులలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనే విషయాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. సీనియర్ హోదా పొందడానికి ముందుగా ఎవరైనా న్యాయవాది హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత వారి దరఖాస్తులను పరిశీలించి, జాబితాను విడుదల చేస్తారు. తాజాగా 535 మంది న్యాయవాదులకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల హోదా కల్పించింది. కోర్టు వారికి ప్రాధాన్యత ఇస్తుంది. ఏదైనా సందర్భంలో వారి సలహా తీసుకుంటుంది. ఇది కూడా చదవండి: ‘ఫాస్ట్ రేడియో బరస్ట్’ అంటే ఏమిటి? సూర్యుని కన్నా ఎంత శక్తివంతమైనది? -
47 మంది హైకోర్టు మాజీ న్యాయమూర్తులకు సీనియర్ హోదా
సాక్షి, న్యూఢిల్లీ: 47 మంది హైకోర్టు మాజీ న్యాయమూర్తులకు సీనియర్ హోదా ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. వీరిలో తొమ్మిది మంది హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులున్నారు. ఈ నెల 16న జరిగిన ఫుల్ కోర్ట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ 47 మంది మాజీ న్యాయమూర్తుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల నుంచి ఏడుగురు ఉన్నారు. సీనియర్ హోదా పొందిన వారిలో తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ రెడ్డి కాంతారావు, జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్, జస్టిస్ అనుగు సంతోష్ రెడ్డి, జస్టిస్ డాక్టర్ అడ్డుల వెంకటేశ్వర రెడ్డి సీనియర్ హో దా పొందారు. అలాగే, ఏపీ హైకోర్టు మాజీ తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ వి.ఈశ్వ రయ్య, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, మాజీ న్యాయ మూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఉన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి
చెన్నై: భారతదేశం అభివృద్ధి చెందిన దేశ హోదా సాధించడానికి రాబోయే 25 ఏళ్లు ‘క్లిష్టమైనవి’ అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారత్ వృద్ధిలో ఆడిటర్లు కీలక పాత్ర పోషించాల్సన అవసరం ఉందని పేర్కొన్న ఆమె, ఈ బాటలో వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని, చిన్న కంపెనీలు అభివృద్ధి చెందేలా అవగాహన కలి్పంచాలనివిజ్ఞప్తి చేశారు. గత 20–25 ఏళ్లలో దేశం అనేక స్థాయిల్లో పురోగమించిందని, 60 ఏళ్లలో సాధించలేనిది గత దశాబ్దంలో భారత్ సాధించిందని పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్సహా పలు నివేదికలు ఇవే విషయాలను చెబుతున్నాయని అన్నారు. ది సోసైటీ ఆఫ్ ఆడిటర్స్ 90వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి తమిళం– ఇంగ్లీషుల్లో దాదాపు 40 నిమిషాలు మాట్లాడిన ఆమె ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ► నేను ఈ వృత్తిలో (ఆడిటింగ్) ఉన్న అనుభవజు్ఞలతో మాట్లాడుతున్నాను. దశాబ్దాల క్రితం రిజిస్టర్ అయిన సంస్థలలో మీది ఒకటి. మీ అందరితో నా సమావేశం కేవలం 90 సంవత్సరాల వేడుకలను జరుపుకోవడానికి మాత్రమే కాదు. ఈ వృత్తిలో మీరు మరిన్ని బాధ్యతలను స్వీకరించుకోవాల్సిన సమయంలో నేను మీతో మాట్లాడుతున్నాను. ► ప్రపంచవ్యాప్తంగా చార్టర్డ్ అకౌంటెంట్ల విధానాలు చాలా మార్పులకు లోనవుతున్నాయి. ఇక్కడకు వచి్చన ఆడిటర్లలో కొందరు ఇప్పటికే తమ వృత్తిలో నెలకొంటున్న మార్పును గమనించారని నేను భావిస్తున్నాను. ► ఆడిటింగ్ విధానంలో టెక్నాలజీ ఇకపై కీలక భూమికను పోషించనుంది. మీలో చాలా మంది ఈ మార్పును సానుకూలతలో స్వీకరిస్తున్నారు. వచ్చే జూలై నుండి చార్టర్డ్ అకౌంటెంట్ల పరీక్షలు కూడా వేరే ఫార్మాట్లో ఉండబోతున్నాయి. ► రాబోయే 25 ఏళ్లలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి కీలకం. మనలో ప్రతి ఒక్కరూ మీ వృత్తిపై దృష్టి పెట్టడమే కాకుండా దేశానికి మెరుగైన సేవలందించే మార్గాలను అందించండలో ముఖ్యమైన పాత్ర పోషించాలి. ► స్వాతంత్య్ర ఉద్యమంలో చేరడానికి చాలా మంది న్యాయవాదులు తమ వృత్తిని విడిచిపెట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రోజు మీరు మీ వృత్తిని విడిచిపెట్టాలని ఎవరూ కోరుకోరు. కానీ దేశానికి సేవ చేయడం, దేశ లక్ష్యాల గుర్తింపులో మీరు భాగస్వాములుగా ఉండాలి. మీ వృత్తి కార్యకలాపాల్లో ఇది కూడా ఒక భాగం కావాలి. ప్రతి ఒక్కరూ ‘కర్తవ్యం’ అనే గొప్ప భావాన్ని కలిగి ఉండాలి. భారత్ అభివృద్ధి చెందిన దేశ స్థితికి చేరుకోవడంలో అలాగే దేశం తన గత వైభవాన్ని తిరిగి సాధించడంలో ఉన్న సవాళ్లను ఎదుర్కోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా ఉండాలి. ► 1947కు ముందు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని ఇళ్లు, ఉద్యోగాలు కోల్పోయిన స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు. అలాంటి అవసరం ఈ రోజు తలెత్తబోదు. ప్రతి వృత్తిలోనూ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ.. తద్వారా దీనిని దేశాభివృద్ధికి మిళితం చేయడానికి తగిన కృషి సల్పాలి. ► ఉదాహరణకు, మీరు ఈ రంగంలో మీ పెట్టుబడులను కేటాయించినట్లయితే, మీరు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారని, అది దేశానికి మంచి ఆదాయాన్ని కూడా ఇస్తుందని మీరు మీ ఖాతాదారులకు సలహా ఇవ్వవచ్చు. ఇలాంటి సూచనలు ఇవ్వడం ద్వారా మీరు దేశాభివృద్ధికి తోడ్పడగలరు. ► ప్రభుత్వం ఎక్కడ డబ్బు కోల్పోతున్నారో సంబంధిత అధికారులకు తెలియజేయడం ద్వారా ఆడిటర్లు దేశ పురోగతిలో భాగం పంచుకోవాలి. ► మీరు కంపెనీ పేరు లేదా దానిలో ప్రమేయం ఉన్న వ్యక్తి పేరు చెప్పనవసరం లేదు. ఇది మీ ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది. కానీ పన్ను ఏ రూపంలో ఎగవేత జరుగుతోందో మాత్రం మీరు ప్రభుత్వ అధికారులకు తెలియజేయవచ్చు. -
ఈ–సేవ కేంద్రాన్ని ప్రజలు, న్యాయవాదులు వినియోగించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కోర్టుకు వచ్చే ప్రజలు, న్యాయవాదులు ఈ–సేవ కేంద్రం సేవలను వినియోగించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సూచించారు. అందరికీ న్యాయాన్ని చేరువ చేయడం, న్యాయ సేవలను విస్తరించాలన్న దృఢ సంకల్పంతో కేంద్రం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కక్షిదారులు ఇక్కడ కేసు స్థితిని కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. రాష్ట్ర హైకోర్టు ఆవరణలో ఈ–సేవ కేంద్రాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే శనివారం ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఈ–కమిటీ ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తుంది. ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కోర్టు నుంచి ఏదైనా సాఫ్ట్‌కాపీ కావాలన్నా ఈ కేంద్రం నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, న్యాయవాదులు పాల్గొన్నారు. కాగా, కేసు స్థితి (ప్రస్తుత స్థితి, తదుపరి విచారణ తేదీ), ఈ–కోర్టు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి జడ్జీల సెలవుల సమాచారం తెలుసుకోవడానికి, సర్టీఫైడ్ కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు, ఉచిత లీగల్ సర్విస్లు పొందడం వంటి వివరాలు, జైలులో ఉన్న వారిని కలిసేందుకు ఈ–ములాఖత్ అపాయింట్మెంట్ కోసం, కోర్టుకు సంబంధించిన అంశాల్లో ఈ–పేమెంట్స్ కోసం, ట్రాఫిక్ చలాన్లు, ఇతర నేరాల్లో చెల్లించాల్సిన నగదు చెల్లించడానికి.. ఇలా పలు రకాల సేవలను ఈ–సేవ కేంద్రం అందించనుంది. సిబ్బందితో మాట్లాడుతున్న సీజే జస్టిస్ అలోక్ అరాధే. చిత్రంలో న్యాయమూర్తులు జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ సుధీర్‌కుమార్, జస్టిస్ సాంబశివరావు నాయుడు, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ శరత్, జస్టిస్ రాజేశ్వర్‌రావు, జస్టిస్ శ్రీనివాస్‌రావు, జస్టిస్ లక్ష్మీనారాయణ తదితరులు -
ఇంఫాల్ లోయ ప్రశాంతం
ఇంఫాల్: మణిపూర్‌లో ప్రశాంతత నెలకొంటోంది. బుధవారం నుంచి మొదలైన హింసాత్మక ఘటనలు శుక్రవారం రాత్రి కూడా కొనసాగాయి. అయితే, శనివారం ఉదయం ఇంఫాల్ లోయలో దుకాణాలు, మార్కెట్లు తిరిగి తెరుచుకున్నాయి. రోడ్లపై వాహనాల రాకపోకలు మొదలయ్యాయని అధికారులు తెలిపారు. మైతి వర్గం ప్రజలకు ఎస్టీ హోదా ఇవ్వరాదంటూ బుధవారం చేపట్టిన ర్యాలీ సందర్భంగా మొదలైన హింసాత్మక ఘటనలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకూ వేగంగా వ్యాపించాయి. హింసాత్మక ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య శనివారానికి 54కు చేరుకోగా, క్షతగాత్రులు 200కు పైనేనని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి మరణాలు వందకు పైగానే ఉంటాయని అనధికార వర్గాల సమాచారం. ప్రభుత్వం, ఆర్మీ ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్లలో సుమారు 13 వేల మంది తలదాచుకోగా కొందరు పొరుగునే ఉన్న మిజోరం, మేఘాలయ, నాగాలాండ్‌లకు తరలివెళ్లారు. రాష్ట్రంలోని ప్రధాన రహదారులు, కీలక ప్రాంతాల వద్ద పెద్ద సంఖ్యలో ఆర్మీ జవాన్లు, కేంద్ర బలగాల గస్తీ కొనసాగుతోంది. -
కల్లోల మణిపూర్‌లో ఆర్మీ మోహరింపు.. జరుగుతోంది ఇదే!
ఇంఫాల్: గిరిజనులు వర్సెస్ గిరిజనేతరుల వ్యవహారంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడికి పోతోంది. గిరిజనులు ప్రధానంగా కుకీ వర్గం, గిరిజన హోదా డిమాండ్ చేస్తున్న మెయితీల నడుమ భేధాభిప్రాయలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో అక్కడ అల్లకల్లోలం చెలరేగింది. అయితే అల్లర్లకు మీరు కారణమంటే మీరే కారణమంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి ఆ రెండు వర్గాలు. అల్లర్లతో హింస చెలరేగడంతో.. భారత సైన్యం అక్కడ అడుగుపెట్టింది. మెయితీల గిరిజన హోదాకి సంబంధించి తాజాగా ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిరసిస్తూ చూరాచంద్‌పూర్‌లో గిరిజన గ్రూపులు చేపట్టిన యాత్ర.. హింసకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజధాని ఇంఫాల్‌తో పాటు చూరాచంద్‌పూర్, కంగ్పోక్పి జిల్లాల్లో చెలరేగిన హింసతో కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్ను బంద్ చేశారు. ► మణిపూర్‌లోని ఎనిమిది జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి కర్ఫ్యూ విధించారు. మరోవైపు కల్లోల స్థితిని అదుపు చేసేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. ఈ ఉదయం(గురువారం) హింస చెలరేగిన ప్రాంతంలో కవాతు నిర్వహించింది. ఆర్మీతో పాటు అస్సాం రైఫిల్స్ శాంతి భద్రతల్ని పర్యవేక్షిస్తున్నాయి. ఇంటర్నెట్ను బంద్ చేయడంతో పాటు 144 సెక్షన్‌కు పక్డబందీగా అమలు చేస్తున్నారు అక్కడ. చురాచాంద్‌పూర్ జిల్లా రెవెన్యూ పరిధిలోని ఆస్తులు, ప్రాణాలకు ముప్పు ఉందని, శాంతికి విఘాతం కలిగే అవకాశం ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. బయట వ్యక్తులను ఎవరినీ రానీయకుండా సంపూర్ణ కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపింది. ► అలా మొదలై.. మెయితీలు తమను షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) కేటగిరీలో చేర్చాలనే డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తెచ్చారు. ఈ వ్యవహారం ఊపందుకోవడంతో.. గిరిజన సంఘాలు రంగంలోకి దిగాయి. మెయితీల డిమాండ్‌ను ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఈ క్రమంలో.. చురాచంద్ పూర్ జిల్లాలోని తొర్బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ఏటీఎస్ యూఎం) ‘గిరిజన సంఘీభావ యాత్ర’ను బుధవారం చేపట్టింది. యాభై వేల మందికి పైగా గిరిజనలు ఒకేచోట చేరి.. గిరిజన హక్కుల పరిరక్షణ నినాదాలు చేశారు. అయితే.. ఈ యాత్ర హింసకు దారి తీసింది. యాత్రలో పాల్గొన్న కొందరు గ్రామంలోని రోడ్లపై టైర్లు, ఇతర వస్తువులను తగలబెట్టారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయగా.. ఉద్రిక్త పరిస్థితులను దారి తీసింది. దీంతో పోలీసులు లాఠీలకు, టియర్ గ్యాస్‌లకు పని చెప్పారు. అయితే ఇది మెయితీల పనేనని గిరిజన సంఘాలు, కాదు కుకీ గిరిజనుల పనేనని మెయితీలు ఆరోపించుకుంటున్నారు. ► మెయితీలు మణిపూర్ కొండ, లోయ ప్రాంతాలతో రెండుగా విభజించబడింది. లోయ ప్రాంతంలో మెయితీలు, కొండ ప్రాంతాల్లో నాగా, కుకీ చిన్ మిజో, జో గిరిజన తెగలు జీవిస్తున్నాయి. మణిపూర్ జనాభాలో.. దాదాపు సగం జనాభా మెయితీ కమ్యూనిటీదే!. అయితే.. మయన్మార్, బంగ్లాదేశీయులు పెద్ద ఎత్తున అక్రమ వలసల కారణంగా.. తమ జీవనానికి ఇబ్బంది కలుగుతోందని మెయితీలు చెబుతున్నారు. ఈ క్రమంలో చొరబాటు దారులను కట్టడి చేసేందుకు చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేసినా లాభం లేకుండా పోయింది. అయితే.. మణిపూర్ చట్టాల ప్రకారం లోయ ప్రాంతాల్లో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో వాళ్లు జీవించడానికి. దీంతో వాళ్లను బలవంతంగా ఖాళీ చేయిస్తుండగా.. తమనూ గిరిజనుల్లో చేర్చాలని, ఆ డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని, అలాగే.. కొండ ప్రాంతాల్లో ఆవాసం ఏర్పాటు చేయించాలని డిమాండ్‌కు దిగారు వాళ్లు. ► ఈనాటిది కాదు.. మెయితీ కమ్యూనిటీ డిమాండ్ దశాబ్దాల కాలం నాటిది. అయితే పదేళ్ల కిందట ఈ డిమాండ్ విషయంలో కీలక అడుగు పడింది. మెయితీలను గిరిజనుల్లో చేర్చే అంశం పరిశీలనకు అప్పటి ప్రభుత్వం మణిపూర్ అసెంబ్లీ హిల్స్ ఏరియాస్ కమిటీని ఏర్పాటు చేయగా.. అది సుదీర్ఘ పరిశీలనల తర్వాత మెయితీస్కు వ్యతిరేకంగా ఓ తీర్మానం పాస్ చేసింది. దీంతో ఆ కమ్యూనిటీ భగ్గుమంది. ఈ అంశంపై మణిపూర్ హైకోర్టును ఆశ్రయించగా.. మెయితీలను గిరిజనుల్లో చేర్చే అంశాన్ని నాలుగు వారాల్లోగా పరిశీలించాలని, అలాగే కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలంటూ ఆదేశించింది. దీంతో పరిస్థితులు అల్లర్లు హింసకు దారి తీశాయి. ► డీజీపీ స్పందన కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే చిత్రాలు, విద్వేష ప్రసంగాలు, విద్వేష వీడియో సందేశాల ప్రసారం కోసం సోషల్ మీడియాను విరివిగా ఉపయోగిస్తున్నాయని మణిపూర్ హోం శాఖ ఒక లేఖలో పేర్కొంది. వదంతులు వ్యాపింపజేసేవారికి సోషల్ మీడియా ఒక సులభమైన సాధనంగా మారిందని, సాధారణ ప్రజలను రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్నారని, ఇది మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుందని తెలిపింది. మరోవైపు బిష్ణుపూర్, చురాచంద్పూర్ జిల్లాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా, అస్థిరంగా ఉందని డీజీపీ సీ డౌంగెల్ తెలిపారు. మరోవైపు ఇరు వర్గాలు సంయమనం పాటించాలని సీఎం బీరెన్ పిలుపు ఇవ్వగా.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ పరిస్థితులపై బీరెన్తో ఫోన్లో చర్చించారు. ► మెయితీలు వర్సెస్ కుకీలు మణిపూర్ కొండల్లోని భూములు.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371సీ, మణిపూర్ భూ రెవెన్యూ & భూ సంస్కరణల (MLR & LR) చట్టం 1960లోని సెక్షన్ 158 ప్రకారం.. గిరిజనులకే చెందుతాయి. మెయితీలతో పాటు గిరిజనేతర వ్యక్తులకు బదిలీ చేయకూడదనే పాయింట్ మీద మెయితీల గిరిజన హోదా డిమాండ్‌ను కుకీ తెగ వ్యతిరేఇస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే గిరిజన హక్కుల పరిరక్షణ పేరిట చేపట్టిన యాత్రలో ముఖ్యభూమిక పోషించింది కూడా. మరోవైపు మెయితీల జనాభా 1951 జనాభా లెక్కల ప్రకారం.. మణిపూర్ జనాభాలో 59 శాతం మెయితీలే ఉండేవాళ్లు. అయితే.. 2011 నాటికి ఆ జనాబా 44 శాతానికి పడిపోయింది. అయితే తాము గతంలోనే గిరిజనులుగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నామని చెబుతున్నారు. 1891లో.. మెయితీలను అటవీ గిరిజనులుగా గుర్తించింది అప్పటి బ్రిటిష్రాజ్యం. ఆపై 1901లో ప్రధాన గిరిజనులుగా వాళ్లను రికార్డుల్లోకి ఎక్కించారు. తిరిగి 1931లో.. హిందూ గిరిజనులుగా గుర్తించారు. కానీ, 1950 నుంచి వాళ్లను గిరిజనులుగా పరిగనించడం లేదు. ఆ కారణం ప్రభుత్వాలకే తెలియాలని అంటున్నారు మెయితీలు. ఇదీ చదవండి: అన్ని కోట్లు సంపాదించాలంటే.. ఎంత టైం పడుతుందో? -
నవరత్న హోదా పొందిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ - పూర్తి వివరాలు
ప్రభుత్వ రంగ సంస్థ 'రైల్ వికాస్ నిగమ్'కు నవరత్న హోదా కల్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ కారణంగా రైల్ వికాస్ నిగమ్ ఇప్పుడు 13వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా నవరత్న హోదా పొందింది. ఇప్పటివరకు మినీ రత్న హోదాలో ఉన్న రైల్ వికాస్ నిగమ్ నవరత్న హోదా కైవసం చేసుకుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అనేది రైల్వే శాఖ నిర్వహణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ. దీని టర్నోవర్ సంవత్సరానికి రూ. 19,381 కోట్లు. అంతే కాకుండా గత 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఆదాయం రూ. 1,087 కోట్లు. కావున ఈ సంస్థకు నవరత్న హోదా కల్పించాలనే యోచన గతం నుంచి ఉన్నప్పటికీ ఇది ఇప్పటికి సాధ్యమైంది. నవరత్న హోదా పొందటం వల్ల సంస్థ చాలా విషయాల్లో సొంత నిర్ణయాలను తీసుకోవచ్చు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడం, ఇతర సంస్థలతో జాయింట్ వెంచర్స్ ఏర్పాటు చేయడం వంటి విషయాల్లో స్వతంత్య్రం ఉంటుంది. ఇది సంస్థ వేగవంతమైన అభివృద్ధికి ఉపయోగపడుతుంది. (ఇదీ చదవండి: పోర్షేకు షాక్.. కస్టమర్ దెబ్బకు రూ. 18 లక్షలు ఫైన్ - కారణం ఇదే..!) రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌కి నవరత్న హోదా కల్పించే ప్రాతి పదికను కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ ఆమోదం తెలిపారని, ఈ ఆమోదం ప్రకారం ఇకపైన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నవరత్న హోదా పొందిన సంస్థగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కొనసాగుతుందని డిపిఈ (Department of Public Enterprises) ట్విటర్ ద్వారా తెలిపింది. (ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కార్లు వీరి దగ్గరే ఉన్నాయి - ధరలు తెలిస్తే దిమ్మతిరిగాల్సిందే!) Hon'ble Finance Minister has approved the upgradation of RVNL to Navratna CPSE. RVNL will be the 13th Navratna amongst the CPSEs. RVNL is a Ministry of Railways CPSE with an annual turnover of Rs 19381 crores and net profit of Rs 1087 crores for the years 2021-22. @RailVikas — Department of Public Enterprises (@DPE_GoI) April 26, 2023 ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.. -
వాట్సాప్ కొత్త ఫీచర్.. ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
ప్రస్తుతం మొబైల్ లేకుండా మనకు రోజే గడవదు, అందులోనూ వాట్సాప్, ఫేస్బుక్ వంటివి లేకుండా కాలం ముందుకు సాగదు. అయితే మనకు నచ్చిన వీడియోలు లేదా ఫోటోలు సోషల్ మీడియాలో స్టేటస్లగా పెట్టుకోవడం సర్వసాధారణమయిపోయింది. అయితే ఇప్పటివరకు వాట్సాప్‌లో వేరుగా ఫేస్బుక్లో వేరుగా స్టేటస్లు పెట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఇలాంటి పద్దతికి చరమగీతం పాడే సమయం వచ్చేసింది. వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్బుక్లో స్టోరీగా పెట్టుకోవాలంటే మన స్టేటస్‌లో షేర్ ఆప్షన్ వాడాలి. లేదంటే మళ్లీ ఫేస్బుక్లో ప్రత్యేకంగా అప్లోడ్ చేయాలి. అలా కాకుండా వాట్సాప్ తీసుకు వస్తున్న కొత్త ఫీచర్ ద్వారా ఇకపై ఒకే సమయంలో వాట్సాప్ స్టోరీతో పాటు ఫేస్బుక్ స్టోరీని పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి మన వాట్సాప్ స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్స్‌లో మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్స్‌ప్ట్, ఓన్లీ షేర్ విత్ మీ అనే మూడు ఆప్షన్లు మాత్రమే కనిపిస్తాయి. అయితే త్వరలో వాటి కింద ఫేస్బుక్ అనే కొత్త ఆప్షన్ కూడా రానుంది. వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో స్టేటస్ పెట్టాలనుకొనే వారు ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకొని ఫేస్బుక్ అకౌంట్‌కి యాడ్ చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: గుడ్ న్యూస్: భారీగా తగ్గిన సీఎన్జీ, పీఎన్జీ ప్రైస్ - కొత్త ధరలు ఇలా ఉన్నాయి) వాట్సాప్‌లో రానున్న ఈ కొత్త ఫీచర్ వల్ల మనం ప్రత్యేకంగా ఫేస్బుక్లో స్టేటస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకేసారి రెండింటిలోనూ స్టేటస్ పెట్టవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. -
భలే భలే..వాట్సాప్‌లో అదిరిపోయే సూపర్ ఫీచర్లు
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం కొత్త కొత్త అప్డేట్లను అందుబాటులోకి తెస్తుంది. తాజాగా మరో అద్భుతమైన ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. వినియోగదారులు ఇప్పటి వరకు వారి వాట్సాప్ స్టేటస్‌లో ఫోటోలు, వీడియోలు మాత్రమే పోస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే రానున్న రోజుల్లో వాయిస్ నోట్‌ను సైతం వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవచ్చని వాట్సాప్ అప్డేట్స్ ఇచ్చే వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. యూజర్లు స్టేటస్‌లో టెక్ట్స్‌తో పాటు 30 సెకన్ల వరకు వాయిస్ నోట్‌ను పోస్ట్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఫోన్ వాట్సాప్ కీబోర్డులో టెక్ట్స్ టైప్ చేసే ఐకాన్ కింద భాగంలో మైక్రోఫోన్ సింబల్‌పై క్లిక్ చేస్తే వాయిస్ చెప్పొచ్చని, అదే వాయిస్‌ను స్టేటస్‌గా పెట్టుకోవచ్చని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. దీంతో పాటు వాట్సాప్ కాల్స్ ట్యాబ్‌ను డెస్క్‌టాప్ వెర్షన్ తీసుకొని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇది వినియోగంలోకి వస్తే యూజర్లు ఇప్పుడు డెస్క్‌టాప్ యాప్ నుండి నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్ యాప్‌లో కాల్ హిస్టరీ, కాల్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటుంది. కాగా, ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా వెర్షన్ ఉండగా.. త్వరలో యూజర్లందరికి వినియోగంలోకి రానుంది. -
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఎందుకివ్వరు?
ఐక్యరాజ్యసమితి: భారత్, జపాన్, బ్రెజిల్, ఉక్రెయిన్ లాంటి దేశాలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఎందుకు కల్పించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నిలదీశారు. శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడానికి కారణాలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. బుధవారం జరిగిన ఐరాస సాధారణ సభ చర్చా కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రసంగించారు. భదత్రా మండలిలో అన్ని గొంతుకలకు అవకాశం కల్పించాలన్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, సెంట్రల్, ఈస్ట్రన్ యూరప్‌లకు వీటో అధికారం ఉండాలని సూచించారు. సమతూకంతో కూడిన భదత్రా మండలిని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. ఇప్పటికే శాశ్వత సభ్యదేశ హోదా పొందిన రష్యా ఇతర దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై ఏనాడూ మాట్లాడలేదని జెలెన్స్కీ విమర్శించారు. అందుకు కారణమేంటో చెప్పాలన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇప్పుడు ఐదు శాశ్వత సభ్యదేశాలున్నాయి. అవి రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, అమెరికా. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మరికొన్ని దేశాలకు ఈ హోదా కల్పించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత్ కోరుతున్న సంగతి తెలిసిందే. -
పెట్స్.. అదో స్టేటస్!
సాక్షి, హైదరాబాద్: నగరవాసుల స్టేటస్ సింబల్ మారింది. లగ్జరీ వాహనాలు, హై ఎండ్ గృహాలు, విదేశీ ఫర్నీచర్, లైఫ్ స్టయిల్ జాబితాలో విదేశీ పెంపుడు జంతువులు కూడా చేరిపోయాయి. సినీ ప్రముఖులు, బడా వ్యాపారులు తమ వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్ హౌస్‌లు, లగ్జరీ విల్లాలలో విదేశీ పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. తాజాగా క్యాసినోవాలా చికోటి ప్రవీణ్ వ్యవసాయ క్షేత్రంలో ఎగ్జోటిక్ పెట్స్‌ను అటవీ శాఖ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. విదేశాల్లోని అడవి జాతి పెంపుడు జంతువులను ఎగ్జోటిక్ పెట్స్ అంటారు. మన దేశంలో వీటి రవాణా వైల్డ్‌లైఫ్ యాక్ట్–1972 ప్రకారం చట్ట వ్యతిరేకం. అమెరికా, ఆ్రస్టేలియా, మెక్సికో వంటి విదేశాల నుంచి అక్రమ మార్గంలో దిగుమతి చేసుకొని, విక్రయిస్తుంటారు. ఇటీవల కోల్కత్తా నుంచి హైదరాబాద్‌కు కంగారులను అక్రమ రవాణా చేస్తున్న ఓ ముఠాను వెస్ట్ బెంగాల్‌లోని కుమార్గ్రామ్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లో అధిక డిమాండే అక్రమ రవాణాకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఇండియన్ బ్రీడ్ ఎగ్జోటిక్ పెట్స్ పెంపకానికి మన దేశంలో అనుమతి ఉంది. కానీ, ఆయా జంతువులను అటవీ శాఖ వద్ద నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరంలో ఈ తరహా వన్యప్రాణులు 150–200 రకాలుంటాయని అంచనా. నగరంలో 50కి పైగా ప్రైవేట్ జూలు.. ప్రస్తుతం నగరంలో 50కి పైగా ప్రైవేట్ జూలు ఉంటాయని బహుదూర్‌పల్లిలోని జూ అధికారి ఒకరు తెలిపారు. చేవెళ్ల, శంకర్పల్లి, కందుకూరు, శామీర్‌పేట, భువనగిరి వంటి పలు ప్రాంతాలలోని విశాలమైన ఫామ్ హౌస్‌లు, వ్యవసాయ క్షేత్రాలలో చిన్న పాటి జూలను ఏర్పాటు చేసి, వీటిని పెంచుతున్నారు. అలాగే పలువురు బడా డెవలపర్లు లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలలో పెట్ పార్క్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. క్యాసినో వాలాగా పేరొందిన చికోటి ప్రవీణ్‌కు కందుకూరు మండలం సాయిరెడ్డిగూడలో 12 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇందులో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొండచిలువలు, ఊసరవెల్లి, మకావ్ చిలుకల వంటి వన్యప్రాణులున్నట్లు అధికారులు గుర్తించారు. అధ్యయనం చేశాకే పెంపకం.. ఎగ్జోటిక్ పెట్స్ జీవన విధానంపై అవగాహన ఉంటేనే పెంచుకోవాలి. లేకపోతే స్వల్పకాలంలోనే అనారోగ్యం పాలై చనిపోతాయని కూకట్‌పల్లిలోని ఎగ్జోటిక్ పెట్ విక్రయదారుడు, వెటర్నరీ స్టూడెంట్ యుగేష్ తెలిపారు. అవి ఏ జాతికి చెందినవి, ఎలాంటి వాతావరణంలో పెరుగుతాయి, వాటి ఆహారం, వాటికి వచ్చే రోగాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. సల్కాటా, ఆల్డాబ్రా టార్టాయిస్: ప్రారంభ ధర రూ.2.5 లక్షలు. ఇగ్వానా: ఆకుపచ్చ, నీలం, పసుపు రంగుల ఇగ్వానాల ప్రారంభ ధర రూ.15 వేలు. స్నో, థానోస్ రంగులవైతే రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య ఉంటాయి. బాల్ పైథాన్: వీటిని రాయల్ పైథాన్స్ అని కూడా పిలుస్తారు. ధర రూ.35–40 వేలు. డెడ్ బియర్డ్ డ్రాగన్: తెల్ల గడ్డంలాగా ఉంటాయి. వీటిని వెనక్కి తిప్పినా ఎలాంటి చలనం ఉండదు. వీటి స్పర్శ చల్లగా, గట్టిగా ఉంటుంది. తెలుపు, గోధుమ, ఎరుపు రంగుల్లోని డ్రాగన్స్ ప్రారంభ ధర రూ.80 వేలు. కార్న్ స్నేక్: నార్త్ అమెరికాకు చెందిన ఈ కార్న్ స్నేక్స్ విషపూరితం కావు. జన్యురకం, రంగులను బట్టి వీటి ధరలు రూ.25–35 వేల మధ్య ఉంటాయి. మార్మోసెట్ కోతులు: సౌత్ అమెరికా, బ్రెజిల్, కొలంబియా దేశాలకు చెందిన ఈ కోతులు ఆలివ్ గ్రీన్, గోధుమ రంగుల్లో ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.5 లక్షలు.. మీర్కట్: దక్షిణాఫ్రికాకు చెందిన మీర్కట్స్ గోధుమ, తెలుపు రంగులో ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.1.5 లక్షలు. రామచిలుకలు: బ్లాక్పామ్ కాకాటూ, విక్టోరియా క్రౌన్, గోల్డెన్ కోనూర్, అమెరికన్ క్రౌ వంటి రంగురంగుల రామచిలుకలు ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ. 30 వేలు. యార్కి టెర్రియర్ డాగ్: అచ్చం బొమ్మలాగా నలుపు, గోధుమ రంగులలో ఈ కుక్క వీటి ప్రారంభ ధర రూ.85 వేలు. జోలో అనే రకం కుక్కలకు శరీరంపై వెంట్రుకలు ఉండకపోవటం వీటి స్పెషాలిటీ. గ్రే కలర్లో వీటి ధర రూ.లక్ష. (చదవండి: ‘ఫీజు’ లేట్.. మారని ఫేట్!) -
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, ఇకపై ఆ ఫీచర్
సాక్షి,ముంబై: మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఆన్లైన్ స్టేటస్‌ను దాచిపెట్టేలా చేసే ఫీచర్‌ను వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. తాము ఆన్లైన్లో ఉన్న విషయం గోప్యంగా ఉంచాలనుకునే వినియోగదారులకు 'హైడ్ ఆన్లైన్ స్టేటస్' ఫీచర్ బాగా ఉపయోగపడనుంది. ఎప్పటికపుడు తన ప్లాట్ ఫామ్‌ను అప్డేట్ చేస్తూ, కస్టమర్ల ఫ్రెండ్లీగా ఉండేందుకు పలు ఫీచర్లను అందిస్తోందివాట్సాప్. తాజా రిపోర్టుల ప్రకారం ఈ గోప్యతా సెట్టింగ్ Android వెర్షన్ 2.22.16.12 కోసం అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను ఎంచుకోవడం ఎలా? Settings-> Account-> Privacy-> Last seen లో ఉండే లాస్ట్ సీన్ అనే దాంట్లోనే ఈ ఫీచర్ కూడా ఉండనుంది. లాస్ట్ స్టీన్ ఆప్షన్ ఎనేబుల్, డిసేబుల్ చేసుకునే విధంగానే ఈ 'హైడ్ ఆన్లైన్ స్టేటస్' ఆప్షన్‌ను పొందుపర్చనుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ మొత్తం ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో స్పష్టంగా తెలియలేదు. అలాగే Apple iOS వినియోగదారుకు సంబంధించి ఈ ఫీచర్‌పై గత నెలలో పరీక్ష దశలో ఉంది. కాగా ఈ వారం ప్రారంభంలో వాట్సాప్ యూజర్లు వారి మొత్తం చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ నుంచి ఐవోఎస్, ఐవోఎస్కినుంచి ఆండ్రాయిడ్‌కి ఈజీగా బదిలీ చేసేలా కొత్త ఫీచర్ గురించి అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. -
వాట్సాప్‌లో నూపుర్ శర్మ వీడియో.. కత్తులతో పొడిచారు!
పాట్నా: నూపుర్ శర్మకు సంబంధించిన వివాదాస్పద వీడియోను చూశాడని, ఆమెకు మద్దతుగా ఆ వీడియోను తన వాట్సాప్‌లో స్టేటస్‌లో పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఓ యువకుడిపై కత్తులతో నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు కొందరు!. బీహార్ సీతామర్హిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత పోలీసులు ఈ ఘటనను గ్రూప్ తగాదాగా భావించారు. లోకల్ పొగాకు మత్తులో దాడి జరిగిందని ప్రకటించారు. అయితే.. బాధితుడు మాత్రం ఉద్దేశపూర్వకంగా తనపై దాడి జరిగిందని పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం బాధితుడు అంకిత్ ఝా.. దర్భంగా నర్సింగ్‌హోమ్‌లో చికిత్స పొందుతున్నాడు. నూపుర్ శర్మ వీడియోను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్న తర్వాతే దాడి జరిగిందని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. నన్పూర్ పీఎస్ పరిధిలో జులై 15వ తేదీ సాయంత్రం ఘటన జరిగింది. ఫిర్యాదు ఇచ్చిన మరుసటి రోజే నలుగురు దుండగుల్లో ఇద్దరిని గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. తొలుత పాన్ షాప్ దగ్గర సిగరెట్ తాగే విషయంలో గొడవ జరిగిందని భావించాం. అయితే.. నూపుర్ శర్మవీడియో వల్లే దాడి జరిగిందని బాధితుడు చెప్తున్నాడు. అందుకే దర్యాప్తు చేపట్టాం అని సీతామర్హి ఎస్పీ హర్ కిషోర్రాయ్ తెలిపారు. దాడికి సంబంధించినదిగా చెబుతూ.. ఓ వీడియో ఇప్పుడు ట్విటర్లో వైరల్ అవుతోంది. A youth was stabbed by a Special Community in #Sitamarhi, Bihar and slogans of 'Allah Hu Akbar' were raised as the youth was watching a video of BJP's former leader #NupurSharma. pic.twitter.com/Do3oBsjsfY — Nikhil Choudhary (@NikhilCh_) July 19, 2022 -
త్వరలో వాట్సప్‌లోకి కొత్త అప్డేట్.. చూస్తే వావ్ అంటారండోయ్!
ప్రస్తుత రోజుల్లో చాటింగ్ అంటే మొదటగా గుర్తొచ్చే పేరు వాట్సప్. యువతను అంతలా ఆకట్టుకుంది. అందుకే వాట్సప్ యాజమాన్యం కూడా మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టు ఇందులో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకర్షించేలా అప్డేట్స్ని ప్రవేశపెడుతుంది. ఈ క్రమంలోనే వాయిస్ మెసేజ్ ఎడిట్, మీడియా ఫైల్ ఎడిటింగ్, గూగుల్ డ్రైవ్ బ్యాకప్ వంటివాటిని తీసుకొచ్చింది. తాజాగా వాట్సప్ స్టేటస్ అప్డేట్లో మరో ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. వావ్ అనేలా కొత్త అప్డేట్ వాట్సప్ స్టేటస్‌లో ఇప్పటివరకు వీడియోలు, ఫోటోలు లేదా మనకి నచ్చని టెక్ట్స్.. వీటి వరకు స్టేటస్‌గా పెట్టుకుంటున్నాం. అయితే వాట్సప్ డెవలప్మెంటీ టీం ఈ ఆప్షన్‌కి అదనపు ఫీచర్‌ను జత చేయనున్నారు. త్వరలో ప్రవేశపెట్టనున్న ఈ ఫీచరుతో తాము స్వయంగా రికార్డు చేసిన ఆడియో క్లిప్స్, ఏదైనా వాయిస్ నోట్స్‌ను కూడా స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం వాట్సప్‌లో స్టేటస్ బార్ని క్లిక్ చేస్తే కెమెరా, టెక్స్ట్ ఫీచర్లు కనిపిస్తాయి. అయితే త్వరలో ఈ ఆప్షన్లకి అదనంగా ఆడియో స్టేటస్ పెట్టుకునేందుకు వీలుగా మైక్ సింబల్ రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉంది. ఈ మేరకు వాట్సప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. చదవండి: డోలో-650 తయారీ సంస్థ అక్రమాలు.. బయటపడ్డ సంచలన విషయాలు! -
చిన్న పొదుపులపై వడ్డీరేట్లు యథాతథం
న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) సహా చిన్న పొదుపు పథకాలపై 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ఉన్న వడ్డీరేట్లు వచ్చే 3 నెలల్లో కొనసాగనున్నాయి. చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లు త్రైమాసికం ప్రాతిపదికన నోటిఫై చేసే సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాను ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4 శాతం) వరుసగా పది ద్వైమాసిక సమావేశాల్లో ఒకేరీతిన కొనసాగిస్తూ, నిర్ణయం తీసుకుంది. దీనితో బ్యాంకులపై అదనపు వడ్డీ చెల్లింపు భారం అవకాశం లేదు. దీనివల్ల బ్యాంకుల్లో డిపాజిట్లు, రుణాలపై రేట్లు దాదాపు యథాతథంగానే కొనసాగే వీలుంది. ఈ పరిణామం చిన్న పొదుపులపై కూడా రేట్లను ఎక్కడివక్కడే ఉంచడానికి కారణమవుతోంది. కొన్ని పథకాల రేట్లు ఇలా... ► పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై రేటు 7.1 శాతంగా ఉంది. ► నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై వడ్డీ 6.8%. ► ఏడాది డిపాజిట్ స్కీమ్ 5.5% వడ్డీ ఆఫర్ చేస్తోంది ► బాలికా పథకం– సుకన్య సమృద్ధి యోజనపై అత్యధికంగా 7.6% వడ్డీ ఉంది. ► ఐదేళ్ల సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై వడ్డీరేటు 7.4%. వీటిపై త్రైమాసిక పరంగా వడ్డీ అందుతుంది. ► సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీరేటు వార్షికంగా 4%గా కొనసాగుతుంది. ► ఏడాది నుంచి ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ 5.5 శాతం 6.7% శ్రేణిలో ఉంది. వీటిపైనే వడ్డీ త్రైమాసికంగా అందుతుంది. ► ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై వడ్డీ 5.8%. -
ఇరు కుటుంబాల్లో చిచ్చు రేపిన కూతురి నిర్వాకం.. తల్లి ఉసురు తీసిన వాట్సాప్ స్టేటస్!
ఇంతవరకు మనం సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలను, ఫోటోలను పెట్టి సమస్యల్లో చిక్కుకుని మృతి చెందిన ఉందంతాల గురించి విన్నాం. కానీ వాట్సాప్ స్టేటస్‌ల కారణంగా నేరాలకు పాల్పడిన సందర్భాలు గురించి విని ఉండం. అచ్చం అలాంటి సంఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో 48 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడి మరణించింది. మృతురాలి కుమార్తె ప్రీతి ప్రసాద్(20) పెట్టిన వాట్సాప్ స్టేటస్ అదే పరిసరాల్లో నివసిస్తున్న ఆమె స్నేహితుడు..17 ఏళ్ల మైనర్ యువకుడి కుటుంబానికి ఆగ్రహం తెప్పించింది. నిజానికి ఆ వాట్సాప్ స్టేటస్‌తో ఆ మైనర్కి సంబంధం లేదు. కానీ ఆ యువకుడు ప్రీతి పెట్టిన వాట్సాప్ తనకు సంబంధించిందేనని భావించి ఆగ్రహంతో అతను, అతని తల్లి, సోదరుడు ప్రీతి ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో ప్రీతి తల్లి లీలావతి దేవి ప్రసాద్ పక్కటెముకాలకు తీవ్రంగా గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకుడు తల్లి, మరో ఇద్దరు కుట్టుంబ సభ్యులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ.. "వాట్సాప్ స్టేటస్ గురించి వెల్లడించలేం. కానీ మైనర్ యువకుడు ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశం మాత్రం కాదు. అంతేకాదు మృతురాలికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అయితే ఈ దాడిలో జరిగిన తీవ్ర గాయం కారణంగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది" అని తెలిపారు. -
Happy New Year Whatsapp Status : అందరూ మెచ్చే వాట్సాప్ స్టేటస్ కోరుకుంటున్నారా? ఇది మీకోసమే..
కాలగమనంలో ఒక ఏడాది దొర్లిపోయింది. కొందరికి చేదు జ్ఞాపకాలు, మరికొందరికి మధురానుభూతుల్ని పంచింది 2021. ఇక ఎప్పటిలాగే కొత్త ఏడాదిలోకి గంపెడు ఆశలతో అడుగుపెడతాం. ఆ ఆశించడాన్ని నలుగురితో కలిసి పంచుకోవాలనుకుంటాం. అయినవాళ్లకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటాం. అది మాటల్లోనే ఉండాలన్న గ్యారెంటీ లేదు కదా!. స్మార్ట్ లైఫ్‌లో విష్ చేసుకోవడానికి కూడా ఓ తరిఖా ఉంటోంది. సింపుల్‌గా ఒక్క ఫొటో చాలు. ఒకేసారి ఎంతో మందికి శుభాకాంక్షలు చెప్పినట్లే లెక్క! అందుకు వాట్సాప్ స్టేటస్ ఒక ప్లాట్‌ఫామ్‌గా ఉంటోంది. మరి మీరూ మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవాళ్లకి న్యూఇయర్ విషెస్ చెప్పాలనుకుంటున్నారా? అందుకోసం సాక్షి డాట్ కామ్ ప్రత్యేకంగా కొన్నింటిని మీకు అందిస్తోంది. Best WhatsApp Status For Happy New Year Wishes అందరూ మెచ్చే ఈ గ్రీటింగ్ ఫొటోలతో.. మీ వాట్సాప్ కాంటాక్ట్‌లోని వాళ్లందరికీ విషెస్ చెప్పేయండి. ఈ ఏడాది మొదటిరోజును సమ్‌థింగ్ స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకోండి. ఈ కొత్త సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు సూర్యకాంతుల వంటి విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. కొత్త సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో సరికొత్త నిర్ణయాలు తీస్కోని విజయం సాధించాలని కోరుకుంటూ... విష్ యూ ఎ హ్యపీ న్యూ ఇయర్ 2022 మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలనెన్నో అందించాలని ఆశిస్తున్నా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రకృతిలో అందాన్ని..సున్నితమైన భావాన్ని..అందమైన మనస్సుని రాబోయె కొత్త సంవత్సరం లోనే కాకుండా, జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు -
పొరపాటున వాట్సాప్ స్టేటస్ పెడితే..
ఒకరికి పంపాల్సిన మెసేజ్ మరొకరికి, ఒక గ్రూపులో పెట్టాల్సిన పోస్ట్ మరో గ్రూపులో.. వేయడం చాలామందికి జరిగేదే!. పరధ్యానంలో, కంగారులో చేసే ఈ పొరపాటు.. ఒక్కోసారి విపరీతాలకు సైతం దారితీస్తుంటాయి. ఇదే విధంగా చాలా మంది వాట్సాప్‌లో ఏమరుపాటులో స్టేటస్లు కూడా అప్డేట్ చేస్తుంటారు. అయితే ఇటువంటి సమయాల్లో పనికొచ్చే ఫీచర్‌ను వాట్సాప్ తీసుకురాబోతోంది. వాట్సాప్ ఈమధ్య మల్టీ డివైస్ సపోర్ట్, గ్రూప్స్ కాల్స్ నడుస్తుండగా.. జాయిన్ కాగలిగే ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్ తీసుకొస్తోంది వాట్సాప్. స్టేటస్ విషయంలో ‘అండూ బటన్’ను తేనుంది వాట్సాప్. ఈ ఫీచర్ ద్వారా యాక్సిడెంటల్‌గా ఏదైనా స్టేటస్లు అప్డేట్ చేస్తే.. వెంటనే దానిని తొలగించొచ్చు. సాధారణంగా ఏదైనా వాట్సాప్ స్టేటస్ పొరపాటున పెడితే.. డిలీట్ చేయాలంటే కొంత టైం పడుతుంది. స్టేటస్ మీద క్లిక్ చేసి ఆ పక్కనే వచ్చే మూడు చుక్కల మెనూ మీద క్లిక్ చేశాకే డిలీట్ ఆప్షన్‌ను క్లిక్ చేసి చేయొచ్చు. కానీ, అండూ బటన్ ఫీచర్ వల్ల ఆ టైం మరింత తగ్గిపోనుంది. పొరపాటున మాత్రమే కాదు.. ఎక్కువ గ్యాలరీ కంటెంట్(వాట్సాప్ స్టోరీస్)తో వాట్సాప్ స్టేటస్లు పెట్టే వాళ్లకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుందని వాట్సాప్ భావిస్తోంది. ఇప్పటికే వాట్సాప్ ఈ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోందని, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే క్షణంలో ఆ స్టేటస్‌ను తొలగించే వీలు ఉంటుందని ‘వాబేటాఇన్ఫో’ కథనం ప్రచురించింది. తద్వారా యాక్సిడెంటల్‌గా పోస్ట్ చేసినా.. అవతలివాళ్లు స్క్రీన్ షాట్ తీసేలోపే ఆ స్టేటస్‌ను తొలగించొచ్చు. ముందు ఐవోఎస్ వెర్షన్లో ఆతర్వాతే ఆండడ్రాయిడ్ వెర్షన్‌కు ఈ ఫీచర్‌ను తీసుకురాబోతున్నారు. చదవండి: నెలలో 20 లక్షల మంది వాట్సాప్ అకౌంట్ల బ్యాన్! కారణం ఏంటంటే.. -
నాలుగు రోజుల్లో 61,752 మంది రైతుల రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: నాలుగో రోజు రుణమాఫీ కింద 10,958 మంది రైతుల ఖాతాల్లో రూ.39.40 కోట్లు బదిలీ అయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో 61,752 మంది రైతులకు రూ.175.96 కోట్ల రుణమాఫీ అయిందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏడేళ్లలో వ్యవసాయరంగ స్వరూపం మారిందని, 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎవరూ ఊహించని పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. సమయం : ‘శ్రీశైలం’ ఘటనకు ఏడాది -
కరోనా: వాట్సాప్ ‘స్టేటస్’ మారిపోతోంది!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సెకండ్ వేవ్ ప్రతి మనిషి జీవితంపైనా ప్రభావం చూపుతోంది. చివరకు వాట్సాప్ స్టేటస్లు, గ్రూపుల్లోని వివరాలు సైతం కొత్త పంథాలోకి మారిపోయాయి. వీటిలో ఎక్కడ చూసినా కరోనా సమాచారం, దానికి సంబంధించిన అవసరాలు..అంశాలే కనిపిస్తున్నాయి. వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, సెల్ఫీ కల్చర్ పెరిగాకా...దాదాపు 60 శాతం మంది స్టేటస్లు వీటితోనే నిండిపోతున్నాయి. ఒకసారి పెట్టిన స్టేటస్ 24 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో అనేక మంది ప్రతి రోజూ ఓ సెల్ఫీ తీసుకునో, ఫోన్లో ఉన్న ఫొటోల్లో ఉత్తమమైనది ఎంచుకునో సెల్ఫీలుగా పెట్టేవాళ్లు. మిగిలిన వారిలో కొందరు సందేశాలు, హితోక్తులు, సామెతలతో నింపేసేవాళ్లు. మరికొందరైతే వీడియోలు, జోకులు పండించేవాళ్లు. ఇప్పుడు దాదాపు 90 శాతం మంది స్టేటస్లు కోవిడ్ సమాచారంతో నిండిపోతున్నాయి. ‘పాజిటివ్ వచ్చింది..నన్ను కలిసిన వాళ్లు పరీక్షలు చేయించుకోండి’, ‘ఫలానా రోగికి చికిత్స కోసం అత్యవసరంగా ఫలానా గ్రూపు ప్లాస్మా కావాలి’, ‘ఆ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రిలో ఓ బెడ్ కావాలి’, ‘ రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అర్జంట్‌గా అవసరం’ ఇవే కనిపిస్తున్నాయి. అతి తక్కువ మంది మాత్రం వ్యాక్సిన్, కర్ఫ్యూ వివరాలు స్టేటస్‌లుగా పొందుపరుస్తున్నారు. అప్లోడ్ అవుతున్న వీడియోల్లోనూ విషాదాలవే ఎక్కువగా ఉంటున్నాయి. ఆక్సిజన్ అందక జరిగిన దారుణాలు, కాలుతున్న చితిమంటలు...ఇలాంటివే కనిపిస్తున్నాయి. కేవలం స్టేటస్‌లే కాదు..అనేక గ్రూపుల్లోనూ ఇదే సమాచారం ఉంటోంది. సందట్లో సడేమియా అన్నట్లు పుకార్లు పుట్టించి వాటిని వైరల్ చేసే వాళ్లూ రెచ్చిపోతున్నారు. ప్రత్యేకంగా కొవిడ్ సహాయం, ప్లాస్మా వివరాల కోసం కొత్తగా గ్రూపులు సైతం పుట్టుకు వచ్చాయి. చదవండి: తెలంగాణకు టీకా అరకొరే.. ఆ ఆస్పత్రులకు టీకా బంద్ -
వాట్సప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోండి!
వాట్సాప్ యాప్ లేని ఆండ్రాయిడ్ ఫోన్ ఈ రోజుల్లో ఉందంటే మనం అంత ఆశ్చర్యపోవాల్సిందే. అంతలా విస్తరించింది వాట్సాప్. దీని వినియోగం రోజు రోజుకు భారీగా పెరిగిపోతుంది. అయితే, ఈ యాప్ వాడే చాలా మంది తమకు నచ్చని వారిని బ్లాక్ చేస్తారు. అయితే ఇలా ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారో తెలుసుకోవడానికి ఈ క్రింద ఇస్తున్న ట్రిక్స్ ఫాలో అవ్వండి. ట్రిక్ 1: సాదారణంగా మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే మీకు వారి స్టేటస్ కనిపించదు. ట్రిక్ 2: అలాగే మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి ప్రొపైల్ మీకు కనిపించదు. ఒకవేళ కనిపించినా ఆ ప్రొఫైల్ పిక్చర్ బ్లాంకులో కనిపిస్తుంది. ట్రిక్ 3: మిమ్మల్ని బ్లాక్ చేశారని తెలియక మీరు అతనికి మెసేజ్ పంపితే కేవలం సింగిల్ ట్రిక్ మాత్రమే కనిపిస్తుంది. బ్లూ ట్రిక్ కాని అలాగే డబుల్ ట్రిక్ కాని కనిపించదు. ట్రిక్ 4: బ్లాక్ చేసిన వ్యక్తికి మీరు ఎటువంటి కాల్ కాని, వాయిస్ మెసేజ్ కాని పంపలేరు. ట్రిక్ 5: మీరు ఓ గ్రూపు క్రియేట్ చేసి అందులో మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తిని ఇన్వైట్ చేసినప్పుడు మీకు You are not authorized to add this contact అనే మెసేజ్ కనిపిస్తుంది. చదవండి: మీ పేరుతో ఎవరైనా సిమ్ తీసుకున్నారో తెలుసుకోండిలా? -
పాలసీ రేట్లు యథాతథం?
న్యూఢిల్లీ: కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో మళ్లీ అనిశ్చితి నెలకొంటున్న పరిస్థితుల మధ్య రిజర్వ్ బ్యాంక్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్‌లో తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. మూడు రోజుల పాటు జరిగే సమాలోచనల తర్వాత ఏప్రిల్ 7న పాలసీ రేట్లను ప్రకటించనుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 5న ఆర్బీఐ కమిటీ చివరిసారిగా సమావేశమైంది. ద్రవ్యోల్బణంపరమైన ఆందోళనల కారణంగా అప్పుడు కూడా రెపో రేటును (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) యథాతథంగానే ఉంచింది. ఇప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ ఉదార పరపతి విధానాన్నే కొనసాగించవచ్చని, ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యంలో విఫలం కాకుండా వృద్ధికి ఊతమిచ్చే చర్యలు తీసుకునేందుకు తగు సమయం వచ్చే దాకా వేచి చూసే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. కోవిడ్ కేసుల పెరుగుదల, పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలు విధిస్తుండటం తదితర అంశాలు అనిశ్చితికి దారి తీయొచ్చని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఒక నివేదికలో పేర్కొంది. రెపో రేటు ప్రస్తుతం 4%గా ఉండగా, రివర్స్ రెపో రేటు 3.35%గా ఉంది. గతేడాది మే నుంచి ఆర్బీఐ పాలసీ రేట్ల విషయంలో యథాతథ స్థితి కొనసాగిస్తోంది. -
దారుణం: ఫొటోలు స్టేటస్‌లో పెట్టాడని..
యశవంతపుర: ఫొటోల వ్యవహారం దళిత యువకుడి హత్యకు దారితీసింది. వాట్సాప్ స్టేటస్‌లో ఫొటోలు పెట్టాడన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. ఈ సంఘటన కర్ణాటకలోని యశవంతపురలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఆంధ్రహళ్లికి చెందిన అభి ప్రవీణ, మనోజ్ అనే యువకుల ఫొటోలను అదే ప్రాంతానికి చెందిన శీను అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. దీంతో ఆ ఇద్దరు యువకులు శీనా ఇంటికి వెళ్లి చాకుతో పొడిచి ఉడాయించారు. తీవ్ర గాయాలతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా హతుడు దళిత సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. రాజగోపాల్‌నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
వాట్సప్ స్టేటస్ ని సీక్రెట్ గా చూడండి
వాట్సప్ వినియోగదారుల సౌకర్యార్ధం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తుంది. ఈ కొత్తగా తెచ్చిన ఫీచర్లు అనేవి చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం అలాంటి వాటిలో ఒక దాని గురుంచి తెలుసుకుందాం. మనం రోజు నిత్యం మనకు నచ్చిన ఫోటోలు, వీడియోలు, ఇతర వాటిని మన వాట్సాప్ స్టేటస్ లో అప్డేట్ చేస్తూ ఉంటాం. తర్వాత మన స్టేటస్ ని ఎంత మంది చూసారో కూడా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడే ఒక చిన్న ట్రిక్ ఉంది. మనకు కళ్లకు కనిపించేదంతా నిజం కాదు.. మీరు స్టేటస్ చుసిన వాళ్లు కాకుండా ఇతరులు కూడా మీ స్టేటస్ ని చూస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా ఈ చిన్న ట్రిక్ ద్వారా ఇతరుల వాట్సప్ స్టేటస్ ని సీక్రెట్ గా చూడవచ్చు. అయితే మీరు ముందుగా మీ వాట్సప్ ని ఓపెన్ చేసాక మీ వాట్సాప్ సెట్టింగులకు వెళ్ళండి. అక్కడ మీకు అకౌంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది.. ఇప్పుడు దాన్ని క్లిక్ చేయండి. అందులో మీకు ప్రైవసీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది.. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న రీడ్ రిసిప్ట్ ఆన్ చేసి ఉంటె ఆఫ్ చేయండి. ఆ ఆప్షన్‌ను ఆఫ్ చేస్తే మీరు స్టేటస్ చూసినట్లు అవతలి వ్యక్తికి తెలియదు. అయితే ఇక్కడ మీకు చిన్న సమస్య కూడా ఉంది. రీడ్ రిసిప్ట్ ఆఫ్ చేయడం ద్వారా మీ స్టేటస్లు ఎవరెవరు చూశారనేది కూడా మీకు తెలియదు. ఇలా చేయడం ద్వారా.. అవతలి వ్యక్తి స్టేటస్ చూసినవారి లిస్ట్‌లో మీ పేరు రాకుండా చేయొచ్చు. దీని ద్వారా మీరు మీ మిత్రులు పంపిన పోస్టులు చదివిన కూడా వారికీ కనిపించదు. (చదవండి: 'ఫౌజీ' ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రారంభం) -
ఈ సెట్టింగ్స్ తో వాట్సప్ ఖాతా మరింత సురక్షితం
ప్రస్తుత ప్రపంచంలో ఏ చిన్న అవసరానికైనా మనం నిత్యం ఉపయోగించేది మెసేజింగ్ యాప్ వాట్సప్. మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లు, ఆడియోలు... ఇలా ఏది పంపాలన్నా వాట్సాప్ పై బాగా ఆధారపడుతున్నాం. ఇది అంతలా మన జీవితంలో మమేకమైపోయింది. ఇంతలా వాడుతున్న వాట్సప్ లో తెలియకుండా చేసే చిన్నతప్పులు కూడా సమస్యలను తెచ్చిపెడతాయి. పరిచయం లేని, తాత్కాలిక అవసరంతో పరిచయమైన వ్యక్తుల ఫోన్ నెంబర్లను మన మొబైల్ ఫోన్ లో సేవ్ చేసుకోవడం వల్ల తర్వాత ఎప్పుడో ఒక్కసారి చెక్ చేసుకుంటే వీళ్లు ఎవరబ్బా అని అనుకుంటాం. మనం వాట్సాప్ లో మార్చే డీపీ (ప్రొఫైల్ ఫొటో), స్టేటస్‌లకు సంబంధించిన సమాచారం వారికి కూడా కనిపిస్తుంటుంది. దీని ద్వారా వాళ్ళు మన సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. అందుకనే మనం అవసరం లేని కాంటాక్ట్‌లను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం లేదా డిలీట్ చేయడం మంచిది. అలాగే మీ స్టేటస్ యొక్క ఫోటోలు పరిచయం లేని వ్యక్తులకు కనిపించకుండా ఉంచితే మంచిది. మీకు తెలియని వాళ్లను మీ స్టేటస్ చూడకుండా ఉండేందుకు సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది. మీ స్టేటస్ యొక్క ప్రైవసీలో మూడు ఆప్షన్స్ ఉంటాయి. ‘మై కాంటాక్ట్స్’, ‘మై కాంటాక్ట్స్ కాకుండా..’, ‘ఓన్లీ షేర్ విత్..’ మొదటిది ఎంచుకుంటే... మీ స్టేటస్‌ను కాంటాక్ట్స్‌లో ఉన్న అందరూ చూస్తారు. రెండోది.. సెలెక్ట్ చేసుకున్న కాంటాక్ట్స్‌లో మీరు ఎంచుకున్న వాళ్లకు తప్పించి అందరికీ కనిపిస్తుంది. మూడోది.. మీరు సెలెక్ట్ చేసుకున్న కొంతమంది కాంటాక్ట్స్‌కు మాత్రమే కనిపిస్తుంది. అలాగే మీ సిమ్ ఎప్పుడైనా మార్చినప్పుడు, లేదా మీ ఫోన్‌ను దొంగలించిన సమయంలో.. మీ వాట్సాప్ ఖాతాను ఇతరులు వాడకుండా టూ-స్టెప్ వెరిఫికేషన్ అడ్డుకుంటుంది. కాబట్టి దీని కోసం సెట్టింగ్స్ -> అకౌంట్ -> టూ-స్టెప్ వెరిఫికేషన్‌కు వెళ్లి ఎనేబుల్ చేసుకుంటే.. మీ వాట్సాప్ ఖాతా అనేది చాల సురక్షితంగా ఉంటుంది. (చదవండి: అందరికి అందుబాటులోకి వాట్సాప్ కొత్త ఫీచర్) -
‘స్టార్’ హోదా రద్దుపై సుప్రీంకోర్టుకు కమల్‌నాథ్
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ప్రచారంలో తన స్టార్ క్యాంపెయినర్ హోదాను ఎన్నికల సంఘం (ఈసీ) రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 13వ తేదీ నాటి తన ప్రసంగంపై బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్య తీసుకుంటున్నట్లు తెలిపిన ఈసీ.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తన వాదన వినకుండా ఇలాంటి చర్య తీసుకున్నట్లు ప్రకటించడం ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. ఈసీ ఉత్తర్వులపై స్టే విధించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌నుద్దేశించి మాఫియా, కల్తీకోరు అంటూ కమల్‌నాథ్ తూలనాడటాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఇటీవల కమల్‌నాథ్ రాష్ట్ర మహిళా మంత్రి, బీజేపీ అభ్యర్థిని ఇమార్తీదేవిని ‘ఐటెం’ అంటూ పేర్కొనడం వివాదాస్పదం అయింది. నిబంధనావళిని ఆయన పలుమార్లు అతిక్రమించారంటూ ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు చర్య తీసుకుంటున్నట్లు ఈసీ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్ క్యాంపెయినర్ హోదా ఉన్న నేత ప్రచార ఖర్చును సంబంధిత రాజకీయ పార్టీ భరిస్తుంది. ఆ హోదా లేకుంటే ఆ నేత ప్రచార ఖర్చంతా ఆ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి ఖర్చు కిందికే వస్తుంది. మధ్యప్రదేశ్‌లోని 28 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3వ తేదీన జరిగే ఉప ఎన్నికలకు ప్రచార గడువు నవంబర్ ఒకటో తేదీతో ముగియనుంది. -
వాట్సాప్ తగ్గించేసింది
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల వినియోగదారులను సొంతం చేసుకున్న ఇన్స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పుంజుకుంది. దీంతో వాట్సాప్ స్టేటస్ లో అప్లోడ్ చేసే వీడియోల నిడివిని సగానికి కుదించింది. వాట్సాప్ వినియోగంలో వస్తున్న అంతరాయాన్ని నివారించే చర్యల్లో భాగంగా దీన్ని15 సెకన్లకు పరిమితం చేసింది. అంతకుముందు ఇది 30 సెకన్లు. వినియోగదారులు పెద్ద సంఖ్యలో వీడియోలను వీక్షిస్తున్న కారణంగా ఇంటర్నెట్ వేగం ప్రభావితమవుతోందని వాట్సాప్ వెల్లడించింది. ఫేస్బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ 'స్టేటస్' సెక్షన్ కింద షేర్ చేసే వీడియోల వ్యవధిని తగ్గించిందని వాబేటా ఇన్ఫో ట్విటర్ ద్వారా వెల్లడించింది. తాజా నిర్ణయం ప్రకారం భారతీయ వినియోగదారులు ఇకపై 16 సెకన్ల కన్నా ఎక్కువ ఉంటే వీడియోలను వాట్సాప్ స్టేటస్ ద్వారా షేర్ చేయలేరు. 15 సెకన్ల వ్యవధి ఉన్న వీడియోలు మాత్రమే అనుమతించబడతాయి. సర్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లపై ట్రాఫిక్ ను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయ తీసుకున్నామని వాట్సాప్ వెల్లడించింది. వాట్సాప్ స్టేటస్ లో పలు వీడియోలను, ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. వినియోగదారుల నెట్‌వర్క్‌లో ఉన్న వ్యక్తులకు వీటిని వీక్షించే అవకాశం వుంది. అలాగే ఈ స్టేటస్ లో షేర్ చేసిన ఇమేజ్ లు, జిఫ్స్, లేదా వీడియోలు 24 గంటల తర్వాత ఆటోమేటిగ్గా అదృశ్యమవుతాయి. వాట్సాప్ స్టేటస్ ను ప్రారంభించినపుడు 90 సెకన్ల నుండి మూడు నిమిషాల వీడియోలను అనుమతించింది. ఆ తరువాత, దీన్ని 30 సెకన్లకు తగ్గించింది. భారతదేశంలో 400 మిలియన్లకు పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు. కాగా కరోనా వైరస్ ( కోవిడ్ -19) మహమ్మారి ప్రకంపనల కారణంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇంటికే పరిమితమైన ప్రజలు సమాచారం, వినోదం కోసం సోషల్ మీడియాపైన ఎక్కువ ఆధారపడుతున్నారు. దీంతో ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వీడియో, యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి ఇతర సంస్థలు ఇంటర్నెట్ లైన్లను కాపాడటానికి వీడియో స్ట్రీమ్‌ల నాణ్యతను తగ్గించిన సంగతి తెలిసిందే. మరోవైపు లాక్ డౌన్ కొనసాగిస్తారన్న అంచనాలపై కేంద్రం స్పందించింది. ఏప్రిల్ 14 తరువాత కొనసాగించే ఆలోచన ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. -
వాట్సాప్ కొత్త అప్డేట్
వాట్సాప్ కొత్త ఫీచర్లతో కస్టమర్లకు ఎప్పటికపుడు రిఫ్రెష్ చేస్తుంది. తాజాగా వాట్సాప్ స్టేటస్‌ను నేరుగా ఫేస్బుక్లో షేర్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకునే వాటిని ఇకపై ‘షేర్ టు ఫేస్బుక్ స్టోరీ’ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా వాటిని ఫేస్బుక్ స్టోరీలుగా మార్చవచ్చు. స్టేటస్ అప్డేట్ తర్వాత.. కుడివైపు వుంటే.. మూడు చుక్కలను క్లిక్ చేస్తే.. ‘షేర్ టు ఫేస్బుక్ స్టోరీ’ అనే ఆప్షన్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయగానే ఆ స్టేటస్ ఆటోమెటిక్‌గా ఫేస్బుక్ స్టోరీలో షేర్ అవుతుంది. ఈ ఫీచర్ ఇప్పుడు అన్ని వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్బుక్లో నేరుగా ఎలా షేర్ చేయాలంటే.. ♦ వాట్సాప్‌లోని స్టేటస్ లోకి వెళ్లండి ♦ వాట్సాప్ స్టేటస్ చిత్రం లేదా వీడియోను అప్లోడ్ చేయండి. ♦ ఇది పూర్తయ్యాక కుడివైపున ఉన్న మూడు చుక్కల్ని క్లిక్ చేసి షేర్ టు ఫేస్బుక్ స్టోరి అనే ఆప్షన్‌ను ఎంచుకుని పబ్లిష్ చేయాలి. బోనస్: మ్యూట్' స్టేటస్‌కు సంబంధించి కూడా అప్డేట్ తీసుకు రానుంది. మ్యూట్ చేసిన వ్యక్తుల షేరింగ్ పూర్తిగా కనిపించకుండా చేసే కొత్త ఫీచర్‌పై కూడా వాట్సాప్ పనిచేస్తోంది. ఆండ్రాయిడ్, తాజా బీటా వెర్షన్ వినియోగదారులు తమ కాంటాక్ట్స్ లోని వారి స్టేటస్‌ను మ్యూట్ చేసుకునే అవకాశం ఉన్నసంగతి తెలిసిందే. అయితే మ్యూట్ చేసిన తరువాత కూడా ఆయా వ్యక్తుల స్టేటస్లు హైలెట్ కాకుండా బూడిద రంగులో మనకి కనిపిస్తూనే వుంటాయి. ఇకపై ఇలా కనిపించకుండా చేయాలని వాట్సాప్ ప్లాన్ చేస్తోంది. -
వాట్సాప్ ‘స్టేటస్’ ప్రకటనలొచ్చేస్తున్నాయ్
శాన్ఫ్రాన్సిస్కో : ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ స్టేటస్‌లో ప్రకటనలకు అనుమతించేందుకు సర్వం సిద్ధం చేసింది 2020 నాటికి స్టేటస్ స్టోరీస్ యాడ్స్‌ను తీసుకు రానున్నామని ప్రకటించింది. ఈవారంలో నెదర్లాండ్స్‌లో జరిగిన మార్కెటింగ్ సదస్సుకు హాజరైన ఆలివర్ పొంటోవిల్లే ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఆండ్రాయిడ్ 2.18.305 బీటా వెర్షన్లో ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగదశలో ఉంది. ఈ యాడ్స్‌ని ఫేస్‌బుక్‌కు చెందిన అడ్వర్టైజింగ్ వ్యవస్థే నడిపించనుంది. గత ఏడాది అక్టోబర్‌లోనే వాట్సాప్ ప్రకటనలపై వార్తలు మార్కెట్ వర్గాల్లో హల్ చల్ చేశాయి..అయితే వాట్సాప్ ఈ వార్తలను తాజాగా ధృవీకరించింది. స్టేటస్‌లో యాడ్స్ చూపించ బోతున్నాం. వాట్సప్ ద్వారా స్థానిక వ్యాపారాలు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రైమరీ మానెటైజేషన్ మోడ్‌లో యాడ్స్ ఉండబోతున్నాయని వాట్సాప్ ప్రతినిధి వెల్లడించారు. వాట్సాప్‌లోని "స్టేటస్" విభాగంలో ప్రకటనలు రాబోతున్నాయని తెలిపింది. ఇకపై వాట్సాప్ స్టేటస్‌లలో అడ్వర్టైజ్మెంట్ల ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించాలని మోచిస్తోంది. ఈ ప్రకటనలకు ఆదరణ బాగా లభిస్తుందనీ, తద్వారా వ్యాపార సంస్థలకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని వాట్సాప్ భావిస్తోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్ల సంఖ్య 1.5 బిలియన్లకు చేరుకుంది. భారత్‌లో వీరి సంఖ్య 250 మిలియన్లు. -
హోదాకు అహంభావమే అడ్డు
న్యూఢిల్లీ: ప్రాణాలర్పించిన జవాన్లకు అమరవీరుల హోదా ఇవ్వాలన్న తన విజ్ఞప్తిని అమలు చేసేందుకు ప్రధాని మోదీకి అహంభావం అడ్డు వస్తోందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా కనీసం సుప్రీంకోర్టు ఆదేశాలతోనైనా పారామిలటరీ బలగాలకు మెరుగైన జీతాలు అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సీఆర్పీఎఫ్కు జీతాల పెంపును వ్యతిరేకిస్తూ పుల్వామా ఉగ్రఘాతుకానికి కొన్ని రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు వచ్చిన వార్తను కూడా ఆయన షేర్ చేశారు. గత ఐదేళ్లలో సైనికుల ప్రాణాలను కాపాడటానికి మోదీ తీసుకున్న చర్యలేంటో చెప్పాలని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ప్రశ్నించారు. ఆక్రమిత అటవీ భూముల నుంచి ఆదివాసీలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసితులను ఖాళీ చేయించాలంటూ ఆయా రాష్ట్రాలకు సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు రాహుల్ లేఖలు రాశారు. -
డిండి, పాలమూరుకు జాతీయ హోదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర కరువును ఎదుర్కొంటున్న మహబూబ్‌నగర్ జిల్లా తాగు, సాగు అవసరాల కోసం చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి.. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన నల్లగొండ జిల్లా అవసరాల కోసం చేపట్టిన డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్ అంశాలపై శుక్రవారం జరిగే కేంద్ర హోం శాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నదీ జలాలకు సంబంధించిన అంశాల్లో ఈ రెండు ప్రాజెక్టుల జాతీయ హోదా అంశాన్ని ప్రధానంగా చేర్చింది. ఇక కేంద్ర జల సంఘం టీఏసీ అనుమతులన్నీ ఇచ్చిన దృష్ట్యా కాళేశ్వరంనూ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని తెలంగాణ కోరనుంది. రాష్ట్రం ప్రస్తావించనున్న ఇతర అంశాలు ఇవే.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం అనుమతులు వచ్చిన వెంటనే గోదావరి నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ మేరకు ఎగువ రాష్ట్రాలకు 80 టీఎంసీల వాటా దక్కుతుంది. ఆ ప్రకారం 2011 జనవరిలో పోలవరానికి జల సంఘం అనుమతివ్వగానే మహారాష్ట్ర 14, కర్ణాటక 21 టీఎంసీల వాటా వినియోగిస్తున్నాయి. నాగార్జునసాగర్ ఎగువన మిగతా 45 టీఎంసీల నీటిని రాష్ట్రం వాడుకునే అవకాశం ఉంది. తెలంగాణ కృష్ణా బేసిన్లో 36.45 లక్షల హెక్టార్ల సాగుకు యోగ్యమైన భూమి ఉన్నా 5.75 లక్షల హెక్టార్లే (15 శాతం) సాగవుతోంది. ఈ దృష్ట్యా 45 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలి. అలాగే పట్టిసీమ ద్వారా 2017–18 వాటర్ ఇయర్లో 100 టీఎంసీల నీటిని ఏపీ తరలించింది. ఈ జలాల్లోనూ రాష్ట్రానికి వాటా దక్కాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేను 36 లక్షల క్యూసెక్కుల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయగా అందుకు విరుద్ధంగా 50 లక్షల క్యూసెక్కులకు పెంచారు. జల సంఘం దీనిపై బ్యాక్‌వాటర్ అధ్యయనం చేయలేదు. 50 లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తే భద్రాచలం రామాలయంతో పాటు బొగ్గు నిక్షేపాలు, మణుగూరులోని మినరల్ ప్లాంటు, అనేక గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ విషయంలో కేంద్రం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన చట్ట సవరణతో రాష్ట్రంలోని 6 మండలాలతో పాటు సీలేరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఏపీ పరిధిలోకి వెళ్లాయి. వీటిని తెలంగాణకు ఇచ్చేయాలి. ఆర్డీఎస్ పథకం కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నా కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీరు తరలించే కాల్వలు పూడికతో నిండిపోవడంతో 4.56 టీఎంసీలకు మించి అందడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ ఆనకట్ట పొడవును మరో అడుగు మేర పెంచాలని నిర్ణయించగా ఇందుకు కర్ణాటక కూడా అంగీకరించింది. ఈ పనులకు ఏపీ అడ్డంకులు సృష్టిస్తున్నందున కేంద్ర జోక్యం చేసుకొని పనులు పూర్తయ్యేలా సహకరించాలి. కృష్ణా నదీ జలాల వినియోగ, విడుదల లెక్కలు పక్కాగా ఉండేందుకు తొలి విడతలో 19 టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని గతేడాది ఫిబ్రవరిలో కృష్ణా బోర్డు చెప్పినా ఇంతవరకు అమల్లోకి రాలేదు. రెండో విడత ఎక్కడో ఇంకా నిర్ణయించలేదు. దీంతో పోతిరెడ్డిపాడు వద్ద ఎక్కువ నీటిని బేసిన్ అవతలకు ఏపీ తరలిస్తోంది. దీన్ని అడ్డుకునేలా టెలిమెట్రీని తక్షణం అమల్లోకి తేవాలి. -
భారత్‌కు ఎస్టీఏ –1 హోదా
వాషింగ్టన్: భారతదేశానికి వ్యూహాత్మక రక్షణ, హై టెక్ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చే దిశగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. మన దేశానికి వ్యూహాత్మక భాగస్వామ్య హోదా కల్పించే ‘స్ట్రేటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్–1 (ఎస్టీఏ –1)’ ప్రతిపత్తిని మంజూరు చేసింది. ప్రధానంగా ‘నాటో’లోని తన మిత్రదేశాలకు మాత్రమే కల్పించే ఈ ప్రతిపత్తిని తాజాగా భారత్‌కు కూడా వర్తింపచేస్తున్నట్లు అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఇండో పసిఫిక్ బిజినెస్ ఫోరంలో ప్రకటించారు. భారత్‌కు సరఫరా చేసే హైటెక్ ఉత్పత్తులపై ఎగుమతి సంబంధిత నియంత్రణలను సడలిస్తున్నామన్నారు. ఎగుమతుల నియంత్రణ విధానంలో.. భారత్‌కు సంబంధించి దీన్నో ముఖ్య మార్పుగా ఆయన అభివర్ణించారు. ఇకపై లైసెన్సుల తాలూకూ బాదరబందీ ఉండబోదని ఆయన చెబుతున్నారు. 2016లో భారత్‌ను తన కీలక రక్షణ భాగస్వామిగా గుర్తించిన అమెరికా.. తదనంతర చర్యగా ఎస్టీఏ –1 హోదా మంజూరు చేసింది. ఎస్టీఏ –1 కేటగిరీలో చేరిన ఏకైక దక్షిణాసియా దేశం భారత్. అమెరికా సన్నిహిత/భాగస్వామ్య దేశాల మాదిరిగా మనం కూడా మరింత అధునాతన టెక్నాలజీని ఆ దేశం నుంచి కొనుగోలు చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఆస్ట్రేలియా, జపాన్‌లకు కూడా.. ఎస్టీఏ–1 హోదా వల్ల ఎగుమతుల లైసెన్సుల కోసం మన దేశం చేస్తున్న ఖర్చును సగానికి సగం తగ్గించుకోవచ్చునని అమెరికా భారత వాణిజ్య మండలి ప్రతినిధి బెన్ షవార్త్ వ్యాఖ్యానించారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను సులభతరం చేస్తుందని, ఇరు దేశాల కంపెనీలు ఉమ్మడిగా ఉత్పత్తి/అభివృద్ధి చేసేందుకు వీలు కల్పిస్తుందని చెప్పారు. ఎస్టీఏ –1 జాబితాలో ప్రస్తుతం 36 దేశాలున్నాయి. తాజాగా భారత్‌తో పాటు, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియాలకు కూడా అమెరికా ఎస్టీఏ –1 హోదా ఇచ్చింది. -
ఉద్యమం ఉధృతం
సాక్షి, తిరుపతి: ప్రత్యేక హోదా ఉద్య మం ఉధృతమైంది. ఎన్నికల ముందు బీజేపీ, టీడీపీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చకపోవటంతో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి పోరుకు సిద్ధమయ్యారు. మూడున్నరేళ్లుగా ప్రత్యేక హోదా కోసం అలుపెరగకుండా ఉద్యమబాట పట్టారు. అధినేత పిలుపుతో జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన ధర్నాకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో పార్లమెంటరీ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సుధీర్ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. ఎస్వీయులోని అన్ని కార్యాలయాలు, కళాశాలలను బహిష్కరించి ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తించారు. టంగుటూరి ప్రకాశం పంతులు భవనం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆదేశాల మేరకు రాత్రి పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో క్యాండిల్ చేతబట్టి ప్రత్యేక హోదానే ముద్దు అంటూ ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన తెలియజేశారు. శ్రీకాళహస్తిలో నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో గాలిగోపురం వద్ద వైఎస్సార్ సీపీ నేతలు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలియజేశారు. కార్వేటినగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. పలమనేరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రత్యేక హోదాకోసం దీక్షలు నిర్వహించారు. కుప్పంలో నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బస్టాండు ప్రాంగణంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టి, ప్రత్యేక హోదా తమ హక్కు అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రైతులు, వ్యాపారులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘సీనియర్ లాయర్’కి మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లోని న్యాయవాదులకు సీనియర్ హోదా కల్పించే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలను ప్రకటించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ‘‘కమిటీ ఫర్ డెజిగ్నేషన్ ఆఫ్ సీనియర్ అడ్వొకేట్స్’’పేరిట శాశ్వత కమిటీని ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ సీనియర్ న్యాయవాది హోదా కల్పించే అంశానికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు సీనియర్ జడ్జిలతోపాటు బార్ కౌన్సిల్‌కు ప్రాతినిధ్యం కల్పించాలని పేర్కొంది. న్యాయవాదుల చట్టం 1961లోని సెక్షన్ 16 ప్రకారం సీనియర్ న్యాయవాదిగా హోదా కల్పించే అధికారం సుప్రీంకోర్టుకు, హైకోర్టులకు లేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తోసిపుచ్చింది. సరైన పద్ధతులను అనుసరించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయని, దీనిని కారణంగా చూపి సెక్షన్ 16ను తొలగించలేమని పేర్కొంది. సీనియర్ అడ్వొకేట్ ఇందిరా జైసింగ్‌తో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన నాలుగు పిటిషన్లను కొట్టేసింది. తీర్పులో సీనియర్ న్యాయవాదుల నియామకం సజావుగా సాగేందుకు 11 మార్గదర్శకాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేసే కమిటీలో సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల్లోని ఇద్దరు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులకు, అటార్నీ జనరల్ లేదా ఓ రాష్ట్రానికి చెందిన అడ్వొకేట్ జనరల్‌కు స్థానం కల్పించాలని పేర్కొంది. -
ఆధార్ కార్డులు తొలగింపు.. చెక్ చేసుకోండిలా..
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ 81 లక్షల ఆధార్‌కార్డులను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) డీ-యాక్టివేట్ చేసింది. ఆధార్ ఎన్రోల్మెంట్ రెగ్యులేషన్, 2016లోని సెక్షన్ 27, 28ల ప్రకారం ఆధార్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్(ఏఎల్సీఎమ్)లో నిబంధనల ఆధారంగా ఆధార్ నంబర్లను తొలగించారు. మీ ఆధార్ యాక్టివేట్‌గా ఉందా? మీ ఆధార్ నంబర్ యాక్టివేట్‌గా ఉందా? లేదా? అనే విషయాన్ని ఇలా తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సివుంటుంది. 1. కింద కనిపిస్తున్న లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా ఆధార్ వెబ్సైట్లోకి వెళ్లొచ్చు. ఆధార్ వెబ్‌సైట్‌కు ఇక్కడ క్లిక్ చేయండి 2. పేజ్ ఓపెన్ అయిన తర్వాత 12 అంకెల మీ ఆధార్ నంబర్‌ను అందులో ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ కోడ్‌ను కూడా దాని బాక్సులో నింపి వెరిఫై అనే బటన్‌ను నొక్కాలి. మీ ఆధార్ నంబర్ కనుక యాక్టివేషన్లో ఉంటే స్క్రీన్‌పై ఓ కన్ఫిర్మేషన్ మెసేజ్ కనిపిస్తుంది. మీ వయసు, మీ రాష్ట్రం, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు చెందిన చివరి మూడు అంకెలు అందులో ఉంటాయి. 3. ఒక వేళ మీ ఆధార్ నంబర్ డీ-యాక్టివేట్ అయితే స్క్రీన్ మీద ఎలాంటి వివరాలు కనిపించవు. -
వందేమాతరం ‘స్టేటస్’ ఏంటి?
‘వందేమాతరం’ గేయం... భారత స్వాతంత్య్రపోరాటంలో ముఖ్యభూమికను పోషించింది. స్వేచ్ఛా వాయువులు పీల్చాలనే భారతీయుల కాంక్షకు భావోద్వేగ భూమికగా నిలిచింది. బంకిమ్ చంద్ర చటర్జీ 1876లోనే దీన్ని రాసినా... విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరాలు కూర్చి ఆలపించడంతోనే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 1896లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సభలో రవీంద్రుడు వందేమాతరాన్ని ఆలపించారు. అనంతర కాలంలో దేశవ్యాప్తమైంది. దేశభక్తికి, బ్రిటిష్ పాలనపై దిక్కారానికి ప్రతీకగా నిలిచింది. వందేమాతరం అని నినదించి ఎందరో జైలు జీవితాలు అనుభవించారు. 1911 డిసెంబరులో ఠాగూర్ ‘జనగణమన’ను రచించారు. దీన్ని డిసెంబరు చివర్లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశాల్లో ఆలపించారు. 1947 ఆగష్టు 14న రాత్రి 11 గంటలకు సమావేశమైన రాజ్యాంగ సభ కూడా అజెండాలో మొదటి అంశంగా వందేమాతరంలోని మొదటి చరణాన్ని ఆలపించింది. ముస్లిం లీగ్ అభ్యంతరం మేరకు మొత్తం గీతాన్ని పాడలేదు. సమావేశం చివర్లో జనగణమనను పాడారు. స్వాతంత్య్రం వచ్చాక... వందేమాతరం, జనగణమనల్లో ఏది జాతీయగీతంగా ఉండాలనే చర్చ ప్రారంభమైంది. రాజ్యాంగ సభ దీనిపై నిర్ణయాన్ని వెలువరించాలి. కాంగ్రెస్ ‘జనగణమన’ వైపు మొగ్గింది. కారణం... బహిరంగ రహస్యమే. ముస్లింలను నొప్పింపకూడదని. రాజ్యాంగ సభ చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది. తీర్మానం ప్రవశేపెట్టి...చర్చ అనంతరం అవసరమైతే ఓటింగ్ చేపట్టాలని భావించారు. కానీ ఆ అవసరం రాలేదు. నాటి పెద్దలంతా కలిసి ఒక అవగాహనకు వచ్చారు. దాంతో రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఈ ప్రకటన చేశారు... ‘జనగణమన... భారతదేశానికి జాతీయ గీతంగా ఉంటుంది. దేశ స్వాతంత్య్రపోరాటంలో చారిత్రక పాత్రను పోషించిన వందేమాతరం గేయాన్నీ... జనగణమనతో సమానంగా గౌరవించాలి. తప్పకుండా సమాన హోదా ఉండాలి' ► రాజ్యాంగ, చట్టపరమైన రక్షణలేమీ వందేమాతరం గేయానికి లేవు. ► డిసెంబరు 23, 1971న జాతీయ చిహ్నలకు అవమానాలను నిరోధించే చట్టాన్ని అప్పటి భారత ప్రభుత్వం తెచ్చింది. రాజ్యాంగం, జాతీయ జెండా, జాతీయ గీతాలను అవమానించడకుండా నిరోధించే నిబంధనలను ఇందులో పొందుపర్చారు. జాతీయగీతంతో సమానహోదా ఉండాల్సిన జాతీయ గేయం ‘వందేమాతరం’ ప్రస్తావన ఈ చట్టంలో ఎక్కడా లేదు. ► 1976లో ర్యాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను చేర్చారు. వీటిని అర్టికల్ 51ఎ... లో పొందుపర్చారు. ‘ప్రతి భారత పౌరుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. రాజ్యాంగ విలువలను, సంస్థలను, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవించాలి’ అని పేర్కొన్నారు. ఇందులోనూ వందేమాతరం ప్రస్తావన లేదు. ► జాతీయ గేయమైన వందేమాతరానికి జనగణమనతో సమానహోదా కల్పించాలని, ఆ మేరకు చట్ట సవరణ చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ గత ఏడాది నవంబరులో ఢిల్లీ హైకోర్టులో గౌతమ్ ఆర్ మొరార్కా అనే ఆయన పిల్ దాఖలు చేశారు. ► పిల్ దాఖలైన తర్వాత... ‘ఏయే సందర్భాల్లో వందేమాతరం అలపించాలనే విషయానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు. వందేమాతరం గేయానికి న్యాయం జరగాలంటే ఈ నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉంది’ అని ప్రభుత్వం నవంబరు 22, 2016న రాజ్యసభకు తెలిపింది. ► మొరార్కా పిల్‌పై హైకోర్టు ఇచ్చిన నోటీసుకు ఫిబ్రవరి 8, 2017న కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. కేంద్రం దాఖలు చేసిన ఆఫిడవిట్లో... ‘‘భారతీయుల మదిలో వందేమాతరం గేయానికి విశిష్టమైన స్థానముంది. అయితే జనగణమనతో సమానంగా దీనిని చూడలేం. సృజనాత్మకతను గౌరవించడానికి చట్టపరమైన రక్షణ కల్పించడం ఒక్కటే మార్గం కాదు. దేశానికి ఒకే జెండా, ఒకే జాతీయగీతం ఉంటాయి. అలాగని ఇతర గేయాలు, ప్రార్థనలకు తక్కువ గౌరవం ఇచ్చినట్లు కాదు. తమ మనసుకు నచ్చిన గీతాలు, పుస్తకాలు, చిహ్నాలను గౌరవించుకోకుండా పౌరులెవరినీ నిరోధించినట్లు కాదు’’ అని పేర్కొంది. వందేమాతరం... పాడనందుకు కౌన్సిలర్ల సభ్యత్వం రద్దు బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ మున్సిపల్ కార్పొరేషన్లో ‘వందేమాతరం’పై వివాదం ముదురుతోంది. ఈ నెల 28న (మంగళవారం) కార్పొరేషన్ సమావేశంలో సభ్యులందరూ లేచి నిలబడి వందేమాతరం ఆలపించడం మొదలుపెట్టారు. ఏడుగురు ముస్లిం కౌన్సిలర్లు వందేమాతరం ఆలపించడానికి నిరాకరించి.. బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయారు. బుధవారం సమావేశమైన కార్పొరేషన్ సభ్యులు... ఈ ఏడుగురు కౌన్సిలర్ల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.. బీజేపీకి చెందిన మేయర్ హరికాంత్ అహ్లువాలియా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ‘మా మతం... షరియా చట్టాలు వందేమాతరాన్ని అంగీకరించవు. రాజీనామా చేయడానికైనా సిద్ధమే... కానీ వందేమాతరం ఆలపించం’ అని కౌన్సిలర్లు దివాన్జీ షరీఫ్, షాహిద్ అబ్బాసీలు అన్నారు. సభ్యత్వాలను రద్దు చేయడాన్ని తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాల్సిందే
-చంద్రబాబు హామీని నిలబెట్టుకోవాలి -రజక చైతన్య సేవాసంస్థ డిమాండ్ కాకినాడ రూరల్ : తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ ఏపీ రజక చైతన్య సేవా సంస్థ జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. ఆదివారం ఇంద్రపాలెంలోని రజక సంక్షేమ సంఘ భవనంలో జరిగిన జిల్లా రజక చైతన్య సేవా సంస్థ సమావేశంలో పలువురు నాయకులు ప్రసంగించారు. ఇప్పటికే 17 రాష్ట్రాల్లోనూ, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ రజకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారన్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రజకులను ఎస్సీల్లో చేరుస్తామని వాగ్దానం చేశారని, అదే విధంగా గవర్నర్ నరసింహన్ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీల్లో చేర్చేందుకు ప్రకటన చేశారని నాయకులు గుర్తు చేశారు. గ్రామాల్లో రజకులు దుస్తులు ఉతికేందుకు ఉన్న చెరువులను ఆయా గ్రామపంచాయతీలు వేర్వేరు కులాలకు లీజుకు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా కాక పూర్తిగా రజక సంఘాలకే ఆ చెరువులను కేటాయించాలని సమావేశం డిమాండ్ చేసింది. రాష్ట్ర రజక చైతన్య సేవా సంస్థ అధ్యక్షుడు కాకినాడ రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం రజకులను చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాట వేస్తోందని నిరసించారు. రజకులను ఎస్సీలలో చేర్చే విషయమై గ్రామాల వారీ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేసేందుకు రజకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో భాగంగా మొదట జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద శాంతియుత ఆందోళన చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. జిల్లా అధ్యక్షుడు వాడపర్తి కామేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మురమళ్ల రాజబాబు, గౌరవాధ్యక్షుడు ముంగళ్ల నాగసత్యనారాయణ తదితరులు సంఘ సభ్యులనుద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాలకు చెందిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం
జగ్గంపేట : రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే 90 శాతం నిధులు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు అన్నారు. ప్రత్యేక హోదా, టీడీపీ ఎన్నికల హామీలపై శనివారం జగ్గంపేటలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి మరోతి శివగణేష్ ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. గ్రామంలో మెయిన్ రోడ్డులో పెద్దాపురం రోడ్డు శివారు నుంచి సెంటర్ వరకు పళ్లంరాజు, డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ తదితరులు ప్రజా బ్యాలెట్ ఉద్యమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అమలు కావాలా ? వద్దా ? అని, తెలుగుదేశం పార్టీ 2014ఎని్నకల మేనిఫెస్టోలో ఇచ్చిన 600లపై చిలుకు హామీలను నెరవేర్చిందా ? లేదా? అని రెండు ప్రధాన ప్రశ్నలకు తీర్పును ప్రజలను నుంచి కోరారు. అనంతరం స్థానిక సాయిబాలాజీ ఫంక్షన్ హాలులో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పార్టీ «అధికార ప్రతినిధి గుల్లా ఏడుకొండలు అధ్యక్షతన జరిగిన జన ఆవేదన సమ్మేళనం సమావేశంలో మాజీ మంత్రి పళ్లంరాజు మాట్లాడుతూ హోదా న్యాయసమ్మతం కావడంతో పవన్‌కల్యాణ్, జగన్మోహన్రెడ్డి హోదా కావాలని కోరుతున్నారన్నారు. గతంలో దురదుష్టకరమైన సంఘటన కారణంగా బలమైన నాయకుడు రాజశేఖరరెడ్డిని కోల్పోయామన్నారు. ఆయన హయాంలో రైతుల బాగుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయని, ఉపాధి పథకం ద్వారా ఎందరికో పనులు లభించాయన్నారు. ప్రస్తుతం కేంద్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందన్నారు. ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా నోట్ల రద్దు చేయడం దురహంకారమని, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మాయవతికి పదవి దక్కకుండా ఉండేందుకేనని నోట్ల రద్దుచేశారని ఆరోపించారు. హోదా కోసం కోటి సంతకాల ఉద్యమం విజయవంతం చేయాలన్నారు. డీసీసీ అ«ధ్యక్షుడు పంతం నానాజీ, నియోజకవర్గ ఇన్చార్జి మరోతి శివగణేష్, నాయకులు వత్సవాయి బాబు, అడబాల కుందరాజు, గుల్లా ఏడుకొండలు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, మార్టన్లూథర్, బాలేపల్లి మురళి, కాకి లక్ష్మణరావు, నక్కా సత్తిబాబు, ఏబీ సుధాకర్, ముత్యాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
హక్కుపై ఉక్కుపాదం
అడుగడుగునా అరెస్టులు కొవ్వొత్తి కనిపిస్తే చాలు రెచ్చిపోయిన పోలీసులు గృహ నిర్బంధాలతో కట్టడి అయినా ఆగని హోదా కేక ఆగదు ఈ ఉద్యమ హోరు నినదించిన వైఎస్సార్సీపీ ... గొంతుకలిపిన ఉద్యమకారులు జేఎన్టీయూ విద్యార్థులనూ వదలలేదు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రత్యేక హోదా కోసం నినదించిన ప్రజల గొంతుకను రాష్ట్ర ప్రభుత్వం నొక్కేసింది. కొవ్వొత్తులు వెలిగించడమే మహాపాపం అన్నట్టుగా పోలీసులు వాటిని ఆర్పేసి ర్యాలీలను అడ్డుకున్నారు. పోలీసుల నిర్బంధం ఉన్నా లెక్కచేయకుండా చాలా ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు విద్యార్థులు, యువత కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.కాకినాడ జేఎన్టీయూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు ప్రధాన ద్వారం వద్ద మోహరించి వారిని చెదరగొట్టేశారు. యువకులు వాకలపూడి బీచ్‌లో అర్ధనగ్న ప్రదర్శనకు బయలుదేరుతుండగా గొడారిగుంట వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి పిలుపుతో జిల్లాలో పార్టీ శ్రేణులు గురువారం కాకినాడలో నిర్వహించే కొవ్వొత్తుల ప్రదర్శనకు బయలుదేరతారని తెలిసి ముందస్తుగానే ఎక్కడికక్కడ అవుట్ పోస్టులు ఏర్పాటుచేసి పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం నుంచే పార్టీ నాయకులకు ఫోన్లు చేసి ఇళ్లకు వెళ్లి మరీ గృహ నిర్బంధాలు చేశారు. జిల్లా అంతటా ఎక్కడికక్కడ నేతలను గృహ నిర్బంధాలు చేసి హోదా కోసం ఉద్యమించిన నేతలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. విశాఖకు వెళ్తుండగా... విశాఖపట్నంలో జగన్మోహన్రెడ్డి పాల్గొనాల్సిన కొవ్వొత్తుల ప్రదర్శనకని బయలుదేరిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను అరెస్టు చేసి విశాఖ జిల్లా పాయకరావుపేట, నక్కపల్లి, కోటఉరట్ల పోలీసు స్టేషన్లకు తిప్పించి చివరగా నర్సీపట్నం ఏజెన్సీలోని గొలుగొండ పోలీసు స్టేష¯ŒSలో రాత్రి వరకు నిర్బంధించారు. జిల్లా కేంద్రం కాకినాడలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరాగా కలిసి కొవ్వొత్తుల ర్యాలీ కోసం భారీ ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకుని వ్యాన్లలో పోలీసు స్టేషన్‌కు తరలించారు. నాగమల్లి తోట జంక్షన్లో స్వయంగా కాకినాడ డీఎస్పీ వెంకటేశ్వరరావు నేతల వద్ద వెలుగుతున్న కొవ్వొత్తులు ఆర్పేయగా, కన్నబాబు కాగడా ప్రదర్శించడంతో మరోసారి పోలీసులు ఆయన చేతిలో కాగడాను లాగేసే ప్రయత్నం చేస్తూ వ్యాన్లలో ఎక్కించేశారు. కన్నబాబు, పార్టీ కాకినాడ పార్లమెంటు కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, కో ఆర్డినేటర్లు పెండెం దొరబాబు, తోట నాయుడు, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ తదితరులను ఈడ్చుకుంటూ పోలీసు వాహనంలో ఎక్కించి త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించి పోలీసు స్టేషన్ వద్ద నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులు ప్రదర్శించారు. అరెస్టు చేసిన నేతలను విడుదల చేయాలని పోలీసు స్టేషన్ ఎదుట నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎం.మోహన్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. అమలాపురం, రాజమహేంద్రవరం నుంచి వస్తున్న పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులను కాకినాడ వైఎస్సార్ వార«ధి వద్ద పోలీసులు బలంవతంగా అదుపులోకి తీసుకుని మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రాజమహేంద్రవరంలో... రాజమహేంద్రవరం సిటీలో పార్టీ రాష్ట్ర యువజ న విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా విశాఖ పట్నం బయలు దేరుతుండగా పోలీసులు గృహనిర్బంధ చేశారు. ప్రకాష్‌నగర్‌లో మాజీ ఎమ్మె ల్సీ కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూర ల్ కోఆర్డినేటర్ గిరజాల బాబు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కడియం దేవీ చౌక్ సెంటర్లో సీఎం దిష్టిబొమ్మను దహనం చేయగా పోలీస్‌లు ఆయనతోపాటు పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి కడియం స్టేషన్‌కు తరలించారు. రాజవోలులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబును అరెస్టు చేశారు. కాకినాడలో కొవ్వొత్తుల ప్రదర్శనకు వెళ్తున్న రాజమహేంద్రవరం సిటీ కో–ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, యువజన విభాగం కార్యదర్శి పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, కార్యదర్శి గుర్రం గౌతమ్, మాజీ ఫ్లోర్‌లీడర్ పోలు విజయలక్షి్మని రాజానగరంలో అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ∙మండపేట బస్టాండ్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న కో–ఆర్డినేటర్ లీలాకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలను బస్టాండ్ వద్ద పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కో–ఆర్డినేటర్ వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొవ్వొత్తుల ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. పట్టాభి, రైతు రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాధరెడ్డిని అరెస్టు చేశారు. గోకవరంలో ఇంటివద్ద జగ్గంపేట కో–ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్, శంఖవరంలో కోఆర్డినేటర్ పర్వత ప్రసాద్‌లను గృహనిర్బంధించారు. అనపర్తిలో కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డిలను అరెస్టు చేశారు. నగరంలో పి.గన్నవరం కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబును గృహ నిర్బంధంచేయగా, మామిడికుదురు బస్టాండ్ కూడలిలో 216వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తోన్న కో–ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావును అడ్డుకుని అరెస్టు చేసి నగరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిద్దరూ కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాజానగరం నియోజకవర్గం సీతానగరం నుంచి కాకికాడకు బయలుదేరుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తరలించేశారు. కొత్తపేటలో పార్టీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రామచంద్రపురంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్, బీసీ సెల్ నాయకుడు వాసంశెట్టి శ్యామ్ తదితరులను ముందస్తు అరెస్టులు చేసినా స్టేషన్లో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. -
హోదా సంజీవనేమి కాదు
– టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సంజీవనేమి కాదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశ్నిస్తే ప్రత్యేక హోదా వస్తుందనుకోవడం భ్రమ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. శ్రీశైలం నియోజవర్గంలోని కేసీ కెనాల్, వెలుగోడు రిజర్వాయర్, తెలుగుగంగ ప్రాజెక్టుల కింద రెండో పంటను సాగునీరు ఇస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి వై.నాగేశ్వరరావు యాదవ్ పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆగదు
కోటగుమ్మం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకూ తమ పోరాటం ఆగదని సామాజిక హక్కుల వేదిక చైర్మన్ వేణుగోపాల్, జిల్లా కన్వీనర్ తాటిపాక మధు అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రయివేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లా¯న్ నిధులు దుర్వినియోగం చేయవద్దని, బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. వాటి సాధన కు వేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ నుంచి జీపు జాతా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా రాజకీయ జెండాలు పక్కనపెట్టి దళిత, గిరిజన, బలహీనవర్గాలు, మైనార్టీ సమస్యలపై పోరుబాట పట్టామన్నారు. 2011 నుంచి ఇప్పటి వరకూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కృష్ణా ప్రాజెక్టు, ఆర్ అండ్ బీ రహదారులకు, పార్కులకు ఖర్చు పెట్టి నిధులు దుర్వినియోగం చేశారని విమర్శించారు. గత ఎన్నికల ముందు నారా చంద్రబాబు బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకూ ఆ ఊసే లేదన్నారు. రంపచోడవరం గిరిజన యూనివర్సిటీని నెలకొల్పాలని, ఏజెన్సీ ప్రాంతాన్ని అల్లూరి జిల్లాగా ప్రకటించాలని కోరారు. జీపుజాతా ప్రారంభానికి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఎమ్మెల్సీ సుభాష్‌చంద్రబోస్‌తో పాటు ఇతర వర్గాల ప్రముఖులు హాజరవుతారని వివరించారు. నవంబర్ 9న కాకినాడ కలెక్టరేట్ వద్ద పోరుగర్జన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. -
హోదాను తాకట్టు పెట్టిన బాబు
- ప్యాకేజి పేరిట మోసం - ప్రత్యేక హోదాతోనే భవిష్యత్ - 25 కర్నూలులో యువభేరి - వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కర్నూలు(ఓల్డ్‌సిటీ): స్వప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి తాకట్టు పెట్టారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు. శుక్రవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాకేజి పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. హోదా వస్తే పరిశ్రమలు ఏర్పాటై ఉపాధి అవకాశాలకు మార్గం ఏర్పడుతుందన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. హోదా ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై యువకులు, విద్యార్థులు.. ప్రజలను చైతన్య వంతం చేయాలని సూచించారు. ఇందులో భాగంగానే కర్నూలులో ఈనెల 25న గుత్తి జాతీయ రహదారిలో వీజేఆర్ కన్వెషన్ సెంటర్లో యువభేరి కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విద్యార్థులు, యువకులతో ముఖాముఖి నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, పార్టీలకు అతీతంగా పాల్గొని యువభేరిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువభేరి ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా పరిశీలకుడు అనంతవెంకట్రామిరెడ్డి, అదనపు పరిశీలకుడు రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, ఎమ్మెల్యేలు ఐజయ్య, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, నియోజకవర్గ ఇన్చార్జీలు హఫీజ్ ఖాన్, చెరుకులపాడు నారాయణరెడ్డి, కాటసాని రామిరెడ్డి, బుడ్డా శేషారెడ్డి, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, మైనారిటీసెల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, నగర అధ్యక్షుడు గోపినాథ్ యాదవ్, దొడ్డిపాడు మాబ్బాష తదితరులు పాల్గొన్నారు. అదేం కోరిక నెల్లూరు జిల్లాలో పుట్టిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, చిత్తూరు జిల్లాలో పుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..అమెరికాలో పుట్టింటే బాగుండునని కోరుకుంటూ ఇటీవల చేసిన ప్రకటన విడ్డూరంగా ఉందని పీఏసీ ఛైర్మన్, డోన్ శాసన సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. దీన్నిబట్టి వారికి ఇక్కడి అభివృద్ధి గురించి చిత్తశుద్ధి లేదని తెలుస్తోందన్నారు. హోదాను విస్మరించి.. ప్యాకేజీతో పార్టీని పటిష్టం చేసుకునే దుర్మార్గపు ఆలోచన చంద్రబాబుకు ఉందేమోనని సందేహం వ్యక్తం చేశారు. హోదా అంశాన్ని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టాల్సిన అవసరమేలేదని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని, ప్రత్యేక హోదా ప్రాధాన్యతను గ్రామగ్రామాన చాటాల్సిన అవసరం ఉందని తెలిపారు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ప్రత్యేక హోదా నినాదంతో మొదట్నుంచీ వైఎస్ఆర్సీపీ పోరాడుతోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని నందికొట్కూరు శాసన సభ్యుడు ఐజయ్య పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై ఉద్యమిస్తే జైలుకు పంపిస్తానని, పీడీయాక్టు పెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించడం అప్రజాస్వామికమన్నారు. కర్నూలులో 25న జరిగే యువభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హోదా వస్తేనే విద్యార్థుల భవిష్యత్తు: సలాంబాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రానికి హోదా వస్తేనే విద్యార్థులు, యువకుల భవిష్యత్తు బాగు పడుతుందనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పోరాడుతున్నారని విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా హోదా తేలేకపోగా, ప్యాకేజీకి సీఎం చంద్రబాబు వెంపర్లాడుతుండటం మోసపూరితమన్నారు. హోదా సాధనలో విద్యార్థులదే కీలకపాత్ర అన్నారు. కర్నూలులో యువభేరిని విద్యార్థులు విజయవంతం చేయాలన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా యువభేరి పోస్టర్ విడుదల చేశారు. -
ఇదేమి గోలప్పా !
లక్కింశెట్టి శ్రీనివాసరావు : తెలుగుదేశం పార్టీ మూడు దశాబ్దాల రాజకీయ యవనికలో జిల్లాలో క్రియాశీలక నాయకుడాయన. జిల్లా రాజకీయాల్లో ఫుల్‌టైమ్ నాయకుడనే చెçప్పుకోవచ్చు. టీడీపీ ఆవిర్బావం నుంచి పార్టీ జెండాను భుజాన మోస్తున్నారు. సమకాలికులంతా ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు అయిపోతుంటే సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని మథనపడని రోజంటూ లేదు. ఏదో పుట్టి పెరిగిన ఊర్లో వచ్చిన స్థానిక అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రజాప్రతినిధిగా ఎన్నికై సంతృప్తి పడేవారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలనే కోరిక మూడు దశాబ్దాలు తరువాత తీరింది. ఆ కల సాకారమై ముఖ్యమంత్రితో సమానమైనంత కాకపోయినా ఆ తరువాత స్థానం దక్కినప్పుడు ఆయన సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఎమ్మెల్యే కావడమే గొప్ప అనుకుంటే అంతకంటే పెద్ద హోదాయే దక్కిందని ఆయన కంటే మూడు దశాబ్థాలుగా వెంట తిరిగిన వారంతా తెగ సంబరపడ్డారు. ఆ హోదా చూస్తుండగానే రెండున్నరేళ్లు గడిచిపోయింది. అంతటి హోదా తమ నాయకుడుకు వచ్చిందనే సంతోషం కన్నా, సార్ చెప్పినా పనులు కావడం లేదనే ఆవేదన వారి అనుచరులను కుంగదీస్తోంది. కోపమొస్తే నోరిచ్చుకుని పడిపోతారనేదే తప్ప సహజంగానే భోళా శంకరుడు. లేదంటే ఇన్నేళ్ల రాజకీయాల్లో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేదంటే ఆయన అమాయకత్వం అర్ధం చేసుకోవచ్చునని ఆయన సన్నిహితుల ఉవాచ. అలా అని అంత నిజాయతీ పరుడంటే అదీ కాదండోయ్. ఆసియా అభివృద్ధి బ్యాంక్‌తో చేపట్టిన రోడ్డును ఆనుకుని భారీగానే కూడబెట్టారని సొంత పార్టీలోనే గుసగుసలున్నాయి. పుట్టి పెరిగిన సీమలో ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు తవ్వకాల్లో కొద్దోగొప్పో సాయం అందించడం, అందినదిSపుచ్చుకోవడం మినహా మరే పెద్దపెద్ద దోపిడీలకు పోలేదని ఆయన అనుచరులు గొప్పగా చెప్పుకుంటారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసిన ఒక వీడియో పుటేజీ మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. అధినేత కంటే పార్టీలో పెరిగిన చిన్న నేత పెత్తనం ముందు అనుభవం మోకరిల్లిందని మదనపడుతున్న అభిమానులూ లేకపోలేదు. మంత్రివర్గ విస్తరణలో అతని బెర్తుకు ఢోకా లేవని కొందరంటుంటే ... జరిపడక తప్పదని మరికొందరంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ‘పార్టీ అప్పగించే బాధ్యతలు ఎటువంటివైనా చేపడతానని’ ఇటీవల మీడియా మిత్రులు ముందు ప్రకటించి తన విధేయతను ఆ అప్ప చెప్పకనే చెప్పుకున్నారు. -
ప్రత్యేక హోదాతో ఏం వస్తుంది?
-
హోదా రాష్ట్ర ప్రజల హక్కు
– జిల్లా న్యాయవాదుల సంఘం మద్దతు కోరిన వైఎస్ఆర్సీపీ లీగల్‌సెల్ కర్నూలు(ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కు అని వైఎస్ఆర్సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నిర్వహించే బంద్‌కు సహకరించాలని శుక్రవారం జిల్లా న్యాయవాదుల సంఘం నాయకులను కలిశారు. లీగల్‌సెల్ నాయకుల ప్రతిపాదనకు జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కె.ఓంకార్, కె.కుమార్‌లు సానుకూలంగా స్పందించారు. పార్టీ లీగల్‌సెల్ నాయకులు వెంకటేశ్వర్లు, కష్ణమూర్తి, తిరుపతయ్య, మదనమోహన్‌రెడ్డి.. ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్సీపీ బైక్ ర్యాలీ
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదా కోసం శనివారం నిర్వహించనున్న బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఊపి భారీ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ నంద్యాల చెక్‌పోస్టు, రాజ్‌విహార్, పాతబస్తీ, ఆర్టీసీ బస్టాండుల మీదుగా జాతీయ రహదారి వరకు కొనసాగింది. పార్టీ జిల్లా నాయకులు నాగరాజు యాదవ్, అనిల్‌కుమార్, రఘు, డి.కె.రాజశేఖర్, పర్ల శ్రీధర్‌రెడ్డి, అల్లీపీరా, కల్లూరు అర్బన్ ఇన్చార్జి బి. మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి
– బంద్‌ను విజయవంతం చేయండి – వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య కర్నూలు (ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య పేర్కొన్నారు. విభజన హామీల్లో అత్యంత కీలకమైనది హోదానేనని, దానిని విస్మరించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగదన్నారు. స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఏపీ ప్రజల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని తమపార్టీ అధినేత శనివారం బంద్‌కు పిలపునిచ్చారని, అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలన్నారు. పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. హోదాపై ప్రజలను చైతన్య పరిచే రీతిలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించాలన్నారు. నల్ల దుస్తులు, బ్యాడ్జీలు ధరించి బంద్‌లో పాల్గొనాలన్నారు. బంద్‌ను ప్రశాంతంగా నిర్వహించాలని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి సూచించారు. ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్.మద్దయ్య, మైనారిటీసెల్ రాష్ట్ర కార్యదర్శి రెహ్మాన్..కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, ట్రేడ్ యూనియన్, మైనారిటీసెల్ జిల్లా అధ్యక్షులు టి.వి.రమణ, ఫిరోజ్, మహిళా విభాగం అధ్యక్షురాలు శౌరి విజయకుమారి, కార్యదర్శి సలోమి, నగర ప్రధాన కార్యదర్శి నూరుల్లా ఖాద్రి, కార్యదర్శి మునాఫ్, ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి అన్వర్‌బాషా నగర అధ్యక్షుడు కటారి సురేశ్‌కుమార్ పాల్గొన్నారు. -
దేశప్రతిష్ట పెంచేందుకు కృషి చేయాలి
జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఓల్డ్ హైస్కూల్లో ఆటలపోటీలు ప్రారంభం జగిత్యాల రూరల్ : క్రీడాకారులు దేశప్రతిష్టను నిలబెట్టేలా పతకాలు సాధించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఓల్డ్ హైస్కూల్లో జగిత్యాల జోనల్‌స్థాయి ఆటల పోటీలు ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎక్కువ నిధులు కేటాయించి క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు లేకుండా క్రీడలు నిర్వహిస్తున్న పీఈటీల కృషి అభినందనీయమన్నారు. ఇటీవల ఒలంపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు ఎలాంటి ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా స్వయం కృషితో పతకం తీసుకువచ్చి దేశ ప్రతిష్టను పెంచిందన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన పీఈటీలు కోటేశ్వర్రావు, శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో ఓల్డ్ హైస్కూల్ హెచ్ఎం పద్మాకర్, ఉపాధ్యాయ సంఘం నాయకుడు బోనగిరి దేవయ్య, ఎస్కేఎన్ఆర్ పీడీ రవికుమార్, ఎస్జీఎఫ్ జోనల్ సెక్రటరి గంగారాం, పీఈటీలు నాగేందర్‌కుమార్, అజయ్‌బాబు, రాజిరెడ్డి, కోటేశ్వర్రావు, దత్తాత్రి, సాగర్, భాస్కర్‌రెడ్డి, లక్ష్మణ్, ప్రభాకర్, శ్రీనివాస్, వెంకటలక్ష్మీ, జమున, మల్లీశ్వరి, రేణుక తదితరులు పాల్గొన్నారు. -
సీపీ గౌతం సవాంగ్‌కు డీజీపీ హోదా
విజయవాడ : నగర పోలీసు కమిషనర్ డి.గౌతం సవాంగ్‌కు పదోన్నతి లభించింది. ఆయనకు డీజీపీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషినల్ డీజీ కేడర్‌లో ఉన్న ఆయనను డీజీ కేడర్ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ జీవో జారీ చేశారు. -
హోదాతోనే విద్యార్థులకు భవిష్యత్తు
నాయుడుపేట : రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జీపీ శ్రావణ్‌కుమార్ అన్నారు. నాయుడుపేట పట్టణ పరిధిలోని ఆర్అండ్బీ అతిథిగహంలో గురువారం విద్యార్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో విద్యార్థులను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం ఫీజు రాయితీలను అందకుండా చేస్తోందన్నారు. హోదా రాకపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. టీడీపీ హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈకార్యక్రమంలో నాయుడుపేట పట్టణ యూత్ అధ్యక్షుడు వెంకటేష్, కార్యదర్శి సత్య, దినేష్, రాజేష్ పాల్గొన్నారు. -
పార్టీలకతీతంగా పోరాడాలి
నెల్లూరు(టౌన్) : ప్రత్యేకహోదాపై జెండాలు, అజెండాలు పక్కన బెట్టి పార్టీలకతీతంగా పోరాడాలని ఏపీ ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ అంజయ్య అన్నారు. నగరంలోని సర్వోదయ కళాశాలలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హోదా రాకుంటే రాష్ట్రానికి భవిష్యత్ ఉండదన్నారు. బీజేపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను మిగిలిన రాష్ట్రాలతో పోల్చి, అవి ఒప్పుకోవడం లేదని సాకులు చెప్పడం తగదన్నారు. ప్రధానంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హోదా కోసం ముందుకురావాలని కోరారు. సమావేశంలో లాయర్స్ అసోసియేషన్ నాయకులు చంద్రశేఖరరెడ్డి, పీఆర్టీయూ నాయకులు నాగేంద్రకుమార్, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు కొప్పులు చంద్రశేఖర్, బీటీఏ జిల్లా అధ్యక్షడు శేఖర్, మనోహర్, మనోజ్‌బాబు పాల్గొన్నారు. -
హామీలు అమలు చేయాలి
గూడూరు : రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు సీహెచ్ ప్రభాకర్ డిమాండ్‌చేశారు. గూడూరులోని సబ్‌కలెక్టర్ కార్యాయం సమీపంలో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ప్రజలకు తీరని ద్రోహం చేసిందన్నారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేకహోదా కల్పిస్తామని చెప్పి ఆ హామీని తుంగలో తొక్కి బీజేపీ అదే తరహా ద్రోహం చేసిందన్నారు. పట్టణ కార్యదర్శి కాలేషా మాట్లాడుతూ ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తేనే రాష్ట్రాభివద్ధి సాద్యమవుతుందన్నారు. జిల్లా సమితి సభ్యులు గౌస్‌బాష, ఏఐటీయూసీ డివిజన్, పట్టణ కార్యదర్శులు నారాయణ, రమణయ్య, సీతాభాస్కర్ పాల్గొన్నారు. -
హోదాతోనే సీఎం తిరిగిరావాలి
హోదాతోనే సీఎం తిరిగిరావాలి సీఎం, హోదా, తిరిగిరావాలి cm, status, return cm must return with special status గుంటూరు ఎడ్యుకేషన్ : ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు హోదా, విభజన చట్టంలోని హామీల సాధనతో తిరిగి రావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిరస దీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో సాగనంపుతామని హెచ్చరించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులచే రాజీనామా చేయించి, ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన బాధ్యత టీడీపీపై ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామా చేయకపోతే వారి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. దీక్షలో సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి, సీపీఎం నగర కార్యదర్శి భావన్నారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర నాయకులు తాడికొండ నరసింహారావు, ప్రజా నాట్యమండలి జాతీయ కార్యదర్శి పులి సాంబశివరావు, రాష్ట్ర అధ్యక్షుడు గని, జిల్లా ప్రధాన కార్యదర్శి బీ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
హోదాతోనే సీఎం తిరిగిరావాలి
గుంటూరు ఎడ్యుకేషన్ : ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు హోదా, విభజన చట్టంలోని హామీల సాధనతో తిరిగి రావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిరస దీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో సాగనంపుతామని హెచ్చరించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులచే రాజీనామా చేయించి, ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన బాధ్యత టీడీపీపై ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామా చేయకపోతే వారి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. దీక్షలో సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి, సీపీఎం నగర కార్యదర్శి భావన్నారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర నాయకులు తాడికొండ నరసింహారావు, ప్రజా నాట్యమండలి జాతీయ కార్యదర్శి పులి సాంబశివరావు, రాష్ట్ర అధ్యక్షుడు గని, జిల్లా ప్రధాన కార్యదర్శి బీ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా ప్రైవేట్ బిల్లుపై భేషజాలు వద్దు
ప్రత్యేక, హోదా, ప్రైవేట్, బిల్లుపై, భేషజాలు, వద్దు,support, special, status, bill రాజకీయాలకు అతీతంగా 5న బిల్లు ఆమోదమయ్యేలా సహకరించాలి పీసీసీ ప్రధాన కార్యదర్శి రుద్రరాజు అమలాపురం టౌన్ : నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఎన్డీఏ కూటమి ఎంపీలు ముఖ్యంగా టీడీపీ ఎంపీలు భేషజాలకు పోకుండా దాని ఆమోదానికి సహకరించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు అభ్యర్థించారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును కాంగ్రెస్ వారు ప్రవేశ పెట్టారన్న భేషజాలకు పోకుండా నవ్యాంధ్ర భవిష్యత్ ప్రయోజనాల కోసం పార్టీలు, రాజకీయాలకు అతీతంగా మద్దుతు తెలిపాలని కోరారు. ఒకవేళ కాంగ్రెస్ ఎంపీ బిల్లు పెట్టటం మీకు ఇబ్బందికరంగా ఉంటే...కేవీపీ ఆ బిల్లును ఉపసంహరించుకుంటారని... బిల్లు పార్లమెంటులో ఆమోదమయ్యేలా మీరే కృషి సల్పినా మాకు సంతోషమేనని రుద్రరాజు పేర్కొన్నారు. ఆగస్టు అయిదో తేదీన పార్లమెంటులో బిల్లుపై జరిగే ఓటింగ్‌లో పార్టీలను పక్కన పెట్టి నవ్యాంధ్ర నవ శకానికి ఎంపీలు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో పార్లమెంటులో ఇలా ప్రైవేటు మెంబర్స్ ప్రవేశపెట్టిన 14 బిల్లులు ఆమోదం పొందాయన్నారు. శుక్రవారం బిల్లు పెట్టడంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, టీడీపీ ఎంపీలు వేరే ఉద్దేశాలతో ఆరోపణలు చేయటం తగదన్నారు. ప్రైవేట్ మెంబర్స్ బిల్లు అనేది కేవలం శుక్రవారం రోజునే ప్రవేశపెడతారన్న వాస్తవాన్ని వారు గ్రహించాలని సూచించారు. నాడు వెంకయ్యనాయుడు రాష్ట్రానికి హోదా అయిదు కాదు పది సంవత్సరాలు ఉండాలని వాదించి ఇప్పుడు నవ్యాంధ్రకు హోదాపరంగా తీరని అన్యాయం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ పార్టీ ఎంపీలకు హోదాపై చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ మెంబర్ బిల్లును ఎందుకు ఆయుధంగా ఉపయోగించుకోవటంలేదని రుద్రరాజు ప్రశ్నించారు. అంటే వారు ఈ తరహా బిల్లు ఎలాగూ పెట్టరు, పెట్టిన పార్టీలకు వంకలు పెట్టి విమర్శలు చేస్తున్నారంటే హోదాపై అసలు చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోందన్నారు. ఎంపీ కేవీపీ పెట్టిన బిల్లుకు పార్లమెంటులో ఎనిమిది రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతుండగా వీరు విమర్శిస్తున్నారంటే, రాష్ట్రంలోని టీడీపీ ఎంపీలకు హోదాపై ఆవేదన... ఆలోచన అసలు లేదని అర్థం అవుతోందని రుద్రరాజు అన్నారు. -
క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
కోదాడఅర్బన్: క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 11న ఆలిండియా దళిత క్రైస్తవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్ తెలిపారు. మంగళవారం పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన దీనికి సంబంధించిన పోస్టర్‌ను , సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలో ఢిల్లీ కార్యక్రమంలో అధిక సంఖ్యలో దళిత క్రైస్తవులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్‌బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్ల సుందర్‌బాబు, జిల్లా కార్యదర్శి దేవిరెడ్డి లింగారెడ్డి, కొండా రవి, కొత్తపల్లి ప్రశాంత్, జాన్ వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు గంటా జీవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రేట్ డేన్ శునకాలకు భారీ డిమాండ్
-
‘హోదా’ కోసం 10న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు * తూర్పు గోదావరి జిల్లాలో ధర్నాలో పాల్గొననున్న విపక్ష నేత వైఎస్ జగన్ * కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత ఒత్తిడే లక్ష్యం * ప్రజా ఉద్యమంగా ప్రత్యేక హోదా ఆందోళన: బొత్స సాక్షి, హైదరాబాద్: విభజన తరువాత దారుణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలా సంజీవని అయిన ప్రత్యేక హోదా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 10వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్‌సిన్హా తేల్చిచెప్పిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఆందోళన చేయాలని నిర్ణయించారు. అనంతరం పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథితో కలసి కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచడానికి ఈ ధర్నాను చేపడుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం నిష్క్రియాపరత్వాన్ని విడనాడి హోదా కోసం కేంద్రంతో గట్టిగా పోరాడాలని కూడా ఈ ధర్నా ద్వారా కోరతామన్నారు. పదో తేదీన 13 జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉదయం 11 గంటలకు తమ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలను సమర్పిస్తామని తెలిపారు. వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లాలో జరిగే ధర్నాలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ ఆందోళన ఇంతటితో ఆగదని, భవిష్యత్తులో దీన్నొక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళతామని బొత్స వివరించారు. ఐదు కోట్ల ఏపీ ప్రజల ప్రయోజనాలు ఇమిడి ఉన్న అంశం కనుక ఈ ధర్నాలకు ప్రజలు పూర్తి మద్దతు తె లియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నోరెందుకు మెదపడం లేదు? తొలి నుంచీ ప్రత్యేక హోదా కోసం గట్టిగా అడగాలని, పోరాడాలని వైఎస్సార్సీపీ చెబుతూ ఉంటే చంద్రబాబు తాత్సారం చేస్తూ వస్తున్నారని బొత్స విమర్శించారు. ‘కేంద్రం వైఖరి వెల్లడైన తర్వాత కూడా చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు? అసలు టీడీపీ ప్రభుత్వ వైఖరి ఏమిటి?’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా ? లేక తన వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమా? అని తాము సూటిగా ప్రశ్నిస్తున్నామని, సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ప్రత్యేక హోదా కోసం ఓ వారం రోజులు, లేదా కనీసం ఓ రెండురోజులు రాష్ట్రంలో రైల్వేలతో సహా స్తంభింపజేద్దాం సిద్ధమేనా? మాతో కలసి వస్తారా?’ అని బొత్స అధికారపక్షాన్ని ప్రశ్నించారు. తమ నేత జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలోనూ, రాష్ట్రంలోనూ పోరాటం చేస్తున్నారని, అవకాశం ఉన్న ప్రతి వేదికపైనా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారని తెలిపారు. నిన్నటికి నిన్న తెలంగాణలో ఏపీ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రాజెక్టులు కడుతూ ఉంటే చంద్రబాబు పట్టించుకోలేదని, జగన్ కర్నూలులో దీక్ష చేస్తానన్న తరువాతే మాట్లాడారని గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను చూసి, వారు తమ ప్రాంత సమస్యలు వచ్చినప్పుడు ఎలా పోరాడతారో చూసి.. చంద్రబాబు నేర్చుకోవాలని బొత్స సూచించారు. -
మరోసారి మోసం చేశారు
మంగళగిరి: చంద్రబాబు ప్రధాని చేత హోదాపై ప్రకటన చేసే ప్రయత్నం కూడా చేయకపోవడం బాధాకరమని వైఎస్సాఆర్ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. ప్రధాని మోదీ మరోసారి ఆంధ్రులను అవమానపరిచారని...మోదీ ప్రసంగంలో ప్రత్యేక హోదాపై ప్రస్తావన చేయకపోవడం విచారకరమని ఆర్కే తెలిపారు. ఏపీకి ఢిల్లీ నుంచి తెచ్చిన మట్టి, నీళ్లుతో సరిపెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల భూముల తీసుకుని నిర్మించేది ప్రజా రాజధాని కాదు.. ధనికుల రాజధాని అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
రేపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావించకపోవడంపై ఏపీలోని రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. దీనికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు దిగనుంది. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత రాష్ట్రంలో అడుగుపెట్టిన మోదీ ప్రత్యేక హోదా అంశం గురించి ఊసెత్తకపోవడంపై ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ప్రధానిని హోదా అడిగితే ఢిల్లీ నుంచి మట్టి, నీళ్లు తెచ్చారని దుయ్యబట్టారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా మోడీ దిష్టిబొమ్మలు దహనం చేయాలని రుద్రరాజు పిలుపునిచ్చారు. సెంటిమెంట్ రాజకీయాలతో ప్రజల ఆకాంక్షలు నెరవేరవని అన్నారు. -
హోదాపై మోదీతో ప్రకటన చేయించాలి
కైకలూరు: రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీతో ప్రత్యేక హోదా ప్రకటనను సీఎం చంద్రబాబు చేయించాలని కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన రిలే దీక్షల్లో చివరి రోజు బుధవారం వందలాది వాహనాలతో భారీ బైక్ ర్యాలీని డీఎన్నార్ ఆధ్వర్యాన కైకలూరులో చేపట్టారు. ప్రత్యేక హోదా వల్ల భవిష్యత్తు తరాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిసి కూడా అధికార పార్టీ నాయకులు మౌనం వహిస్తుండడం బాధాకరమన్నారు. -
హోదా సాధించే వరకూ పోరు
విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గుంటూరులో బుధవారం నుంచి పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. ఇందుకు సంఘీభావంగా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 8నుంచి అన్ని పట్టణ, మండల కేంద్రాల్లో రిలే దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగన్ దీక్షల్లో పాల్గొనేందుకు మంగళవారం గుంటూరుకు బయల్దేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా కావాలన్న కోరిక ప్రజల్లో బలంగా ఉందన్నారు. హోదా కోరే వారంతా జగన్ మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతు పలకాలన్నారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్యక్రమాల్లో భాగంగా 8న పట్టణ, మండల కేంద్రాలు, నియెజకవర్గ కేంద్రాల్లో దీక్షా శిబిరాలు, 9న నియెజకవర్గం కేంద్రంలో భారీ నిరసన ర్యాలీలు, 10న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు, 11న రహదారులపై వంటావార్పు, 12న రహదారుల దిగ్బంధం తదితర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. జనాధారణ చూసి ఓర్వలేకే విమర్శలు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను, అభిమానాన్ని చూసి ఓర్వలేకే మంత్రులు, టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని, వాటిని నమ్మే పరిస్థితిలో వారు లేరని కోలగట్ల అన్నారు. భోగాపురం మండలంలో ఎయిర్పోర్ట్ బాధితులకు అండగా నిలిచేందుకు వచ్చిన జగన్ పర్యటనను విజయవంతం చేసిన జిల్లా నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కోలగట్ల వెంట గుంటూరు వెల్లిన వారిలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు పెనుమత్స సాంబశివరాజు, జిల్లా పార్టీ ప్రధా నకార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు, డీసీసీబీ వైస్ చైర్మన్ చనుమళ్ల వెంకటరమణ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, జి.సూరపరాజు, జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శి రేగాన.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
-
స్మార్ట్ హోదా డౌటే..
కమిషనర్ జి.వీరపాండియన్ విజయవాడ సెంట్రల్ : స్మార్ట్‌సిటీ మిషన్ స్కోర్‌బోర్డులో వెనుకబడిన విజయవాడకు ఆ హోదా దక్కడం సందేహమేనని కమిషనర్ జి.వీరపాండియన్ పేర్కొన్నారు. మంగళవారం కౌన్సిల్ హాల్లో మేయర్, కార్పొరేటర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. స్మార్ట్‌సిటీ, అమృత్ నగరాల విధివిధానాలను వివరించారు. మార్కుల ఆధారంగానే స్మార్ట్‌హోదా దక్కుతుందన్నారు. ఈ లెక్కన చూస్తే నగరం అన్ని విషయాల్లో వెనుకబడి ఉందని పేర్కొన్నారు. స్మార్ట్‌సిటీ, అమృత్ నగరాలకు సంబంధించి ప్రజల అవసరాలను గుర్తించి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపాల్సి ఉందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కీలకపాత్ర వహించాలని కోరారు. డివిజన్లవారీగా మౌలిక వసతులు ఏం కావాలనే దాన్ని గుర్తించమని కార్పొరేటర్లకు సూచించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరిస్తేనే నగరాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన సూచించారు. చేపట్టబోయే అభివృద్ధి పనుల్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బీఎన్ పుణ్యశీల మాట్లాడుతూ గతంలో కేంద్రం విడుదలచేసిన స్ట్రాంవాటర్ డ్రెయిన్ల నిధులు ఇంతవరకు నగరానికి ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ స్థలాల్లో గృహాలను తొలగించి అక్కడ కొత్తగా అపార్ట్మెంట్లు కట్టాలనుకునే నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామన్నారు. అయితే, ఆ నిర్మాణాలు పూర్తయ్యే వరకు ఆయా గృహాల వారికి ప్రత్యామ్నాయం చూపాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. సీపీఎం కార్పొరేటర్ జి.ఆదిలక్ష్మి మాట్లాడుతూ వన్‌టౌన్‌లో తాగునీటి పైపులైన్‌ను మార్చాలని, వైద్యసేవల్ని విస్తృతపర్చాలని, కార్పొరేషన్ స్కూళ్లలో సౌకర్యాలను మెరుగుపర్చాల్సిందిగా కోరారు. మేయర్ కోనేరు శ్రీధర్, డెప్యూటీ మేయర్ జీవీ రమణారావు, టీడీపీ, బీజేపీ ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు, ఉత్తమ్‌చంద్ బండారీ తదితరులు పాల్గొన్నారు. కలాం మృతి తీరని లోటు అబ్దుల్ కలాం మృతి తీరని లోటని మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్ పేర్కొన్నారు. కౌన్సిల్ హాల్లో మంగళవారం కలాం సంతాప సభ జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డెప్యూటీ మేయర్ గోగుల రమణరావు, టీడీపీ, వైఎస్సార్ సీపీ, బీజేపీ, సీపీఎం ఫ్లోర్‌లీడర్లు జి.హరిబాబు, బీఎన్ పుణ్యశీల, జి.ఆదిలక్ష్మి, ఉత్తమ్‌చంద్ బండారీ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
హోదా కోసం పార్లమెంటులో అడుగుతాం
తాళ్లూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించి ఆదుకోవాల్సిందిగా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలు విజ్ఞప్తి చేయనున్నట్టు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఆదివారం ఉదయం ప్రకాశం జిల్లా తాళ్లూరు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుగానే కేంద్ర హోం, ఆర్థిక మంత్రులను ప్రత్యేకంగా కలిసి మాట్లాడారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ టీడీపీ చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో మిత్రపక్షంతో కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, హైదరాబాద్‌ను మించిన రాజధాని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్రం నుంచి నిధులు సాధించలేకుంటే వారి కూటమి నుంచి తప్పుకోవాలన్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.పాత లెవీ విధానం రద్దయితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. మిల్లర్లు, వర్తకుల నుంచి కనీస మద్దతు ధర కరువవుతోందన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఉన్నారు. -
హోదా అంశాన్ని పరిశీలిస్తున్నాం: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. -
‘సరస్వతి’ భూములపై యథాతథస్థితి
పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్: సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ భూముల విషయంలో యథాతథస్థితి(స్టేటస్ కో) కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇందుకుగాను రెండు వారాల గడువునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల పరిధిలో 613.47 హెక్టార్లలో తమకున్న మైనింగ్ లీజును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 9న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ డెరైక్టర్ ఆదిరాజు వేణుగోపాలరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ శుక్రవారం విచారించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. కేంద్రం నుంచి అనుమతులు రావడంలో జాప్యం వల్లే నిర్ణీత వ్యవధిలోపు సిమెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయలేకపోయామని, కేంద్రం చేసిన జాప్యానికి తమను బాధ్యులుగా చేస్తూ రాష్ట్రప్రభుత్వం మైనింగ్ లీజును రద్దు చేసిందని తెలిపారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి భారతి ఈ కంపెనీలో డెరైక్టర్‌గా ఉన్నారని, అందువల్లే ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలతో మైనింగ్ లీజు రద్దు చేసిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్లాంట్ పెట్టాలనుకున్న భూములు ప్రభుత్వ భూములు కావని బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసిందని వివరించారు. అడ్వొకేట్ జనరల్(ఏజీ) పి.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ, నిర్ణీతవ్యవధిలోపు ప్లాంట్ ప్రారంభించలేదు కాబట్టే, నిబంధనల ప్రకారం లీజును రద్దు చేశామని చెప్పారు. ఒకవేళ పనులు ప్రారంభించకుంటే, కారణం చెప్పాలనీ, కానీ సరస్వతి యాజమాన్యం ఆ పని చేయలేదని అన్నారు. గడువిస్తే అన్ని వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ కౌంటర్ దాఖలుకు గడువిస్తూ ఆదేశించారు. -
ప్రత్యేక హోదా కష్టాలు