హోదాపై మోదీతో ప్రకటన చేయించాలి | PM Modi should announce status | Sakshi
Sakshi News home page

హోదాపై మోదీతో ప్రకటన చేయించాలి

Published Wed, Oct 21 2015 8:38 PM | Last Updated on Tue, Jun 4 2019 6:19 PM

PM Modi should announce status

కైకలూరు: రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీతో ప్రత్యేక హోదా ప్రకటనను సీఎం చంద్రబాబు చేయించాలని కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదా సాధన కోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన రిలే దీక్షల్లో చివరి రోజు బుధవారం వందలాది వాహనాలతో భారీ బైక్ ర్యాలీని డీఎన్నార్ ఆధ్వర్యాన కైకలూరులో చేపట్టారు. ప్రత్యేక హోదా వల్ల భవిష్యత్తు తరాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిసి కూడా అధికార పార్టీ నాయకులు మౌనం వహిస్తుండడం బాధాకరమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement