బిహార్ మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సోమవారం (మే 13) మరణించిన విషయం తెలిసిందే. ఆయనకు ఆరు నెలల క్రితమేకేన్సర్ నిర్ధారణ అయినట్టు ట్వీట్ ద్వారా వెల్లడించారు. గొంతు కేన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న మాజీ సీఎం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. అతనుఈ కేన్సర్ లక్షణాలు ఏమిటో? నివారణ మార్గాలేమిటో? ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ అభిషేక్ శంకర్ తెలియజేశారు.
బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ గొంతు కేన్సర్‌కి గురవడంతో.. ఈ వ్యాధి క్రమంగా అతని ఊపిరితిత్తులకు చేరుకుంది. దీంతో ఆయన కన్నుమూశారు. ఈనేపథ్యంలో గొంతు కేన్సర్ లక్షణాలు, కారణాలు తెలుసుకుందాం.
ఇవి.. గొంతు కేన్సర్ లక్షణాలు..
– ఒక వ్యక్తికి తరచుగా దగ్గు సమస్య ఉన్నా, ఆహారం మింగడంలో ఎలాంటి ఇబ‍్బంది కొనసాగినా ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి
– ఇలాంటి లక్షణాలను అస్సలు విస్మరించకూడదు. ఎందుకంటే గొంతు కేన్సర్‌లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
– దీనినే 'అన్నవాహిక' కేన్సర్ అని కూడా పిలుస్తారు.
లక్షణాలు
– కేన్సర్ కారణంగా.. గొంతునొప్పితో బాధపడుతున్న వ్యక్తి వాయిస్ ముద్దగా మారుతుంది.
– ఆహారం తినేటప్పుడు గొంతులో తీవ్రమైన నొప్పి ఉంటుంది. దీంతోపాటుగా వాపు కూడా సంభవిస్తుంది.
– బాధితుడు గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు.. చెవి నొప్పి కూడా రావచ్చు.
– దగ్గుతున్నప్పుడు శ్లేష్మంతో పాటు రక్తం కూడా వచ్చే అవకాశం ఉంది.
– అలాగే బరువులో మార్పులు కూడా కనిపిస్తాయి.
గొంతు కేన్సర్‌కు కారణమేమిటి?
– ఒక వ్యక్తి నిరంతరం ధూమపానం చేయడంతో గొంతు కేన్సర్‌కు గురయ్యే అవకాశం ఉంది.
– పొగాకు సేవించే వారిలోనూ ఈ వ్యాధి సోకే ప్రభావం ఉంది.
– అలాగే ధూమపానంతోపాటు , మద్యం సేవించే వారికి కూడా గొంతు కేన్సర్ వస్తుంది.
– ఈ వ్యాధి విటమిన్ ఎ లోపం వల్ల కూడా రావచ్చు.
మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చు?
– కేన్సర్ ప్రమాదకరమైన ఒక ప్రాణాంతక వ్యాధి.
– శరీరంలోని ఏదైనా భాగంలో కేన్సర్ సోకితే వెంటనే చికిత్స పొందడం చాలా ముఖ్యం. అశ్రద్ధ వహిస్తే క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది.
– గొంతు కేన్సర్ ఆహార నాళ ద్వారాన్ని అడ్డుకుంటుంది. దీంతో ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.
– గొంతులో అకస్మాత్తుగా భారం, వాయిస్‌లో మార్పు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని డా. అభిషేక్ శంకర్ తెలిపారు.
ఇవి చదవండి: ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment